primary education
-
కారాగారంలో విజ్ఞాన కాంతులు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం శిక్షా కేంద్రంగానే కాకుండా.. విద్యా కేంద్రంగానూ రూపాంతరం చెందుతోంది. నేరాల చీకటిలో మగ్గుతున్న ఖైదీలకు విద్య ద్వారా కొత్త జీవితాన్ని వెలిగించే ప్రయత్నం జరుగుతోంది. కారాగారం (Jail) నాలుగు గోడల మధ్యనే ప్రాథమిక విద్య నుంచి పోస్ట్–గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే సౌకర్యం ఉండటం విశేషం. 2024–25 విద్యా సంవత్సరంలో 120 మంది ఖైదీలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 90 మంది ప్రాథమిక విద్యను పూర్తి చేస్తుండగా.. 19 మంది పదో తరగతి ఓపెన్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను రాశారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న ఖైదీలు ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డిగ్రీలు పొందుతున్నారు. కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English) తరగతులు, వివిధ వృత్తుల్లో ఇక్కడ ఖైదీలు శిక్షణ పొందుతున్నారు. గతంలో ఇక్కడ శిక్ష అనుభవించిన ఒక ఖైదీ పీజీ పూర్తి చేసి బంగారు పతకం సాధించడం విశేషం. పని చేస్తూనే చదువుకునే వెసులుబాటు ఉండటంతో, శిక్ష పూర్తయిన అనంతరం విద్యావంతులుగా బయటకు వస్తున్న ఖైదీల సంఖ్య పెరుగుతోంది. అన్నీ జ్ఞానసాగర్లోనే.. జైలు లోపల ‘జ్ఞానసాగర్’ పేరుతో విద్యాలయం ఉంది. ఇక్కడ గ్రంథాలయం, తరగతి నిర్వహణ, విద్యా బోధన, పరీక్షల నిర్వహణ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రిమాండ్‌లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ చదువుకుని పరీక్షలు రాయవచ్చు. చదువు లేని వారికి వయోజన విద్య ద్వారా అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. వారికి ప్రాథమిక స్థాయి నుంచి చదవడం, రాయడం నేర్పుతున్నారు. ఇందుకోసం జైళ్ల శాఖ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఈ ఉపాధ్యాయుడు ఖైదీల విద్యా సంబంధిత విషయాలన్నింటినీ చూసుకుంటారు. ఖైదీలు పరీక్షలకు దరఖాస్తు చేసినప్పటి నుంచి వారికి తరగతులు నిర్వహించడం, సందేహాలు తీర్చడం, పరీక్షలు నిర్వహించడం వరకు ఆయనే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తరగతులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఖైదీల్లో మార్పు కోసం.. ఖైదీల్లో పరివర్తనం సాధించడానికి చదువు ఉపయోగపడుతుంది. విచక్షణ కల్పించడానికే ఇక్కడ ఖైదీలను విద్యావంతులను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా నియమించిన ఉపాధ్యాయుడు ద్వారా వారికి బోధన జరుగుతోంది. ఖైదీల చదువుకు అయ్యే ఖర్చు, పరీక్ష ఫీజులను జైలు సంక్షేమ నిధి నుంచే చెల్లిస్తున్నాం. చదువు మధ్యలో నిలిపివేసి జైలుకు వచ్చినవారు.. ఇక్కడ చదువు కొనసాగించుకోవచ్చు. – ఎన్.సాయిప్రవీణ్, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ -
‘ప్రైమరీ’లో ప్రగతి జాడేదీ?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రాథమిక వి ద్యలో విద్యార్థుల ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవని కేంద్ర విద్యా శాఖ పేర్కొంది. తెలగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఈ లోపం కనిపిస్తోందని.. దీన్ని అధిగమించేందుకు కసరత్తు అవసరమని తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2026 నాటికి దశల వారీగా ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రాలు.. ఆ దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ రెండేళ్లకోసారి నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్)ను నిర్వహించి.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో విద్యా ర్థుల ప్రమాణాలను పరిశీలిస్తుంది. అలా తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన అంశాలను వెల్లడించింది. కనీస స్థాయి కూడా ఉండక.. ప్రతి విద్యార్థికి ఐదో తరగతికి చేరేసరికి చదవడం, రాయడంతోపాటు సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన అవసరం. ఇది తేల్చేందుకు కేంద్ర విద్యాశాఖ సర్వేలో 28 అంశాలపై స్వల్పస్థాయి ప్రశ్నలు ఇచ్చింది. విద్యార్థుల్లో 56– 68 శాతం మంది 50శాతం ప్రశ్నలకే సమాధానం ఇచ్చారు. గణితంలో అయితే 70 శాతం మంది విద్యార్థులు 30శాతం ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. 8వ తరగతి విద్యార్థులు కూడా గణితంలో 37శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నట్టు సర్వేలో గుర్తించారు. ప్రాంతీయ భాషల్లో రాయడం, చదవడంలోనూ విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఈ కేటగిరీలో కనీసం సగం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగలిగినవారు 53 శాతం మంది మాత్రమే. చాలా రాష్ట్రాల్లో 13.85 శాతం మంది 8వ తరగతి వచ్చే సరికే బడి మానేస్తున్నారని.. దీన్ని కనీసం 6 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం టార్గెట్ పెట్టింది. నెరవేరని లక్ష్యం! రెండేళ్ల క్రితం సర్వే చేసిన సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. కనీసం 50శాతం, ఆపైన ప్రశ్నలకు సరైన సమాధానం రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించింది. ఆ సమయంలో తర్వాతి ఐదేళ్లలో వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా మార్పు మొదలైనట్టు కనిపించలేదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరోమారు కొత్త లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. పిల్లల్లో ప్రమాణాలు పెరగకపోవడానికి పాఠశాలల్లో టీచర్ల కొరతే కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా కరోనా తర్వాత నాణ్యమైన టీచర్లు దొరికే పరిస్థితి లేక సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు. -
మన ఊరు.. తడ‘బడి’!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రాథమిక విద్య అనేది హక్కు మాత్రమే కాదు. పేదల జీవితాల్లో చీకటిని శాశ్వతంగా తొలగించే ఏకైక సాధనం. సమాజ ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన చోదకం కూడా. అందువల్ల ప్రాథమిక దశలో మంచి అభ్యాసన కోసం చక్కటి పాఠశాల వాతావరణం, అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ‘మన ఊరు – మనబడి’కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26,195 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.7,289 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించింది. కానీ ఈ పథకం తొలి ఏడాదిలోనే తడబడుతోంది. నిధుల కొరతతో వెనకబడి పోతోంది. మూడు దశల్లో మొత్తం అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ కింద 9,058 పాఠశాలలను ఎంపిక చేయగా, జూన్ 12తో గడువు ముగిసినా 7 వేలకు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో పనులు సుదీర్ఘంగా సాగుతుండగా, అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద, శిథిల భవనాల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని హంగులతో ఆకర్షణీయంగా.. మంచినీళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్ల ఏర్పాటుతో పాటు కొత్త క్లాస్‌రూంల నిర్మాణం, డిజిటల్ బోర్డు లు, పాఠశాల అంతా ఆకర్షణీయ మైన రంగులు లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించడమే కాకుండా పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కోటి రూపాయలకు పైబడి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక గదికి వారు సూచించే పేరును పెట్టాలని నిర్ణయించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. కానీ దాతల నుండి ఆశించిన స్పందన లేకపోవటం, ప్రభుత్వం నుండి నిధులు ఆగిపోవటంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మనబడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను ఉపాధ్యాయులు ఆవరణలోని చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇదీ లెక్క.. ♦ 2025 నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి, 2030 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలన్నది లక్ష్యం. కానీ ఇప్పు డు రాష్ట్ర సగటు అక్షరాస్యత 73.3 శాతమే. ఇక మహిళల్లో అక్షరాస్యత 64.8 శాతమే. ♦ రాష్ట్రంలో మొత్తం 62.29 లక్షల మంది విద్యార్థులుండగా అందులో అత్యధికం ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. 50.23 శాతం ప్రైవేటులో, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 49.5% వెనకబడిన తరగతులు (బీసీ), 22.4% జనరల్ కేటగిరి, 17.5 శాతం ఎస్సీలు, 10.6 శాతం గిరిజనులు ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. తక్కువ నిధులిస్తోంది మన రాష్ట్రమే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 (ఎ) మేరకు విద్య అనేది ప్రాథమిక హక్కు. 6 నుండి 12 ఏళ్ల వరకు తప్పనిసరి విద్య అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ తెలంగాణలో విద్య అప్రాదాన్య సబ్జెక్ట్ అయింది. దీంతో పేదలు, వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోంది. దేశంలో విద్యకు అతి తక్కువగా నిధులు కేటాయిస్తున్న సర్కార్ మనదే. విద్య విషయంలో ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వం పెరగాలి. – జస్టిస్ చంద్రకుమార్ ఆశించిన స్థాయిలో లేదు.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రత్యేక పద్ధతుల్లో, తగిన మౌలిక సదుపాయాలతో విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ -
అమ్మ ఒడితో 100 శాతం సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలతో ముఖ్యంగా జగనన్న అమ్మఒడి ద్వారా నూటికి నూరు శాతం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి ద్వారా ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిని మించి చేరికలు నమోదైనట్లు వెల్లడైంది. గతేడాది ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 100.13 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 100.80కి చేరింది. అమ్మ ఒడి ద్వారా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ విద్యలో జీఈఆర్ పెరిగినట్లు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల, జిల్లా స్థాయిల్లో నూరు శాతం జీఈఆర్ నమోదుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లుగా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో జీఈఆర్ పెరుగుతూ వస్తోంది. 2020 జనవరి 9వతేదీన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటి వరకు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.19,674.34 కోట్లు జమ చేశారు. 2023–24కి సంబంధించి ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రాథమిక విద్యలో 2018లో జాతీయ స్థాయిలో జీఈఆర్ 96.09 ఉండగా రాష్ట్రంలో 92.91 ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమ్మ ఒడితో పాటు పలు పథకాలను అమలు చేయడంతో 2019–20 నుంచి వరుసగా ప్రాథమిక విద్యలో జీఈఆర్ పెరుగుతూ 2022–23 నాటికి జాతీయ స్థాయిని మించి 100.80కి చేరింది. సెకండరీ విద్యలో 2018–19లో జీఈఆర్ 79.69 ఉండగా 2022–23 నాటికి 89.63కి చేరింది. ఉన్నత విద్యలో రాష్ట్రంలో 2018–19లో జీఈఆర్ 46.88 ఉండగా 2022–23 నాటికి 69.87 శాతానికి జీఈఆర్ పెరగడానికి ప్రధాన కారణం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితరాలు కారణమని స్పష్టం అవుతోంది. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు చదువు మానేస్తున్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను మరింత పెంచడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిని రెగ్యులర్ తరగతుల్లో అవే కోర్సుల్లో తిరిగి చేర్చుకునేందుకు అనుమతించింది. ఈమేరకు మిషన్, విజన్ పేరుతో ఈ ఏడాది ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను వలంటీర్ల ద్వారా అమలు చేస్తోంది. అంతేకాకుండా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలై తిరిగి రెగ్యులర్ తరగతుల్లో చేరిన విద్యార్ధులకు కూడా జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
అక్షరాలా కష్టాలే.. తెలంగాణలో ప్రభుత్వ బడి లేని ఊళ్లు 3,688
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 314 శివారు గ్రామాల్లో స్కూళ్లు లేని పరిస్థితి ఉంది. 284 శివారు గ్రామాల్లో పాఠశాలలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్రం తండా గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాల కోసం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి ఆటోలో వెళ్తున్నారు. కిక్కిరిసిన ఆటో ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. అందరికీ విద్య ప్రాథమిక హక్కు అని మన రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. కానీ ఇప్పటికీ, ఇన్నేళ్లు గడిచినా.. ఎన్నో గ్రామాలకు విద్య దూరంగానే ఉంది. ప్రాథమిక విద్యకు సైతం వ్యయప్రయాసలకోర్చి పక్క ఊరికో, ఆ పక్క ఊరికో వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాల కోసం మరింత దూరం ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. మన రాష్ట్రాన్నే చూసుకుంటే.. 3,688 శివారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలే లేదు. 546 శివారు గ్రామాల్లో అక్షరాలు దిద్దించే ప్రాథమిక పాఠశాల లేదు. 2,018 గ్రామాలు మాధ్యమిక విద్యకు దూరంగా ఉన్నాయి. 2,508 శివారు గ్రామాల్లో ఉన్నత పాఠశాల లేదు. రాష్ట్రవ్యాప్తంగా 30,395 మంది చిన్నారులు చదువు కోసం 3 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తోంది. నడుచుకుంటూనో, కిక్కిరిసిన ఆటోల్లోనో, సైకిళ్ళ మీదో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కొద్దిపాటి వర్షం వచ్చినా బురదగా మారే రోడ్ల మీద అష్టకష్టాలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఉచిత, నిర్బంధ విద్య కింద 10 నెలల రవాణా భత్యం ప్రభుత్వం ఇస్తుంది. కానీ పెరిగిన డీజీల్ చార్జీల కారణంగా చుక్కలనంటే ఆటో చార్జీలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని మారుమూల గ్రామాల పేద ప్రజలు అంటున్నారు. ఈ పరిస్థితులు విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్కూల్ దశలోనే చదువు మానేసేవారి (డాపవుట్స్) సంఖ్య పెరుగుతోంది. విద్యకు దూరమవుతున్న వారిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రాంతాల నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ‘యూ డైస్’ (యూనిఫైడ్ డిస్క్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నివేదిక ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. ఎంతెంత దూరం.. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుంపాడుకు సమీపంలోని గిరిజన గ్రామాల విద్యార్థులు కనీసం 4 కిలోమీటర్ల మేర ప్రయాణించి చదువుకోవాల్సి వస్తోంది. సంవత్సరంలో కనీసం 70 రోజులు బురదతో నరక యాతన పడుతున్నారు.– ► ఆదిలాబాద్ జిల్లాలో 162 శివారు గ్రామాల్లో అక్షరం చెప్పే దిక్కే లేదు. మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, పెద్దపల్లి.. ఇలా పలు జిల్లాల్లో..ఒక్కో జిల్లాలో 150కి పైగా శివారు గ్రామాల్లో స్కూళ్ళు లేవు. ► మెదక్ జిల్లా తూప్రాన్ సమీకృత వసతి గృహంలో ఉండే విద్యార్థులు 2.5 కిలో మీటర్ల దూరంలోని స్కూలుకు వెళ్తున్నారు. మధ్యలోనే మానేస్తున్నారు చదువుపై పెద్దగా అవగాహన లేని శివారు గ్రామస్తులు, ముఖ్యంగా పేద కుటుంబాల వారు పిల్లలను దూర ప్రాంతాలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. దగ్గర్లో ఉన్న స్కూల్ విద్యకే పరిమితం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో గత ఏడాది 13.7 శాతం మంది విద్యార్థులు టెన్త్ క్లాస్‌కు వచ్చేసరికే చదువు మానేశారు. ఇందులో 12.9 శాతం బాలికలే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో చదివే విద్యార్థులకు జూనియర్ కాలేజీ అందుబాటులో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలికలను టెన్త్‌తోనే ఆపేస్తున్నారు. గడచిన రెండేళ్ళలో 18 మంది ఇలా విద్యకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మందికి వివాహాలు కూడా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 8–10 తరగతుల బాలికలను పాఠశాలకు వెళ్లని కారణంగా పెళ్ళిళ్ళు చేసేస్తున్నట్టు గుర్తించారు. ఇలా గడచిన రెండేళ్ళలో 19 మందికి వివాహాలైనట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. స్కూళ్ళు, కాలేజీలు అందుబాటులో లేకపోవడం వల్లే చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. శివారు తండాల వరకూ ప్రభుత్వ స్కూళ్ళను తీసుకెళ్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదని స్పష్టం చేస్తున్నారు. చదవాలంటే నడవాల్సిందే.. ఈ బడి పిల్లల కష్టాల గురించి ‘యూ డైస్’.. తమ నివేదికలో ప్రస్తావించింది. గిరిజన గ్రామమైన కొండతోగు.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఇక్కడ దాదాపు 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా చదువుకోవడం కోసం 3 కిలోమీటర్ల దూరంలోని పండువారిగూడేనికి నడిచి వెళ్తున్నారు. ఇలా రోజూ రానూపోనూ ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే.. మామూలు రోజుల్లోనే ఈ మార్గంలో నడవడం కష్టం.. ఇక, వానొస్తే అంతే.. -
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్రం
ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. -
చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే కుటుంబాలకు – ‘ఇంగ్లిష్ మీడియం’ అందు బాటులోకి తీసుకురావాలని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భిన్న అభిప్రాయాలకు, చర్చలకు దారి తీసింది. ఇప్పుడు ‘ఉచిత– పథకాల’ గురించి కోర్టుకు వెళ్లినట్టుగానే, అప్పట్లో ‘ఇంగ్లిష్– మీడియం’ విషయం కూడా కోర్టు వరకూ వెళ్ళింది. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన 30 ఏళ్ళ కాలంలో విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం తెలిసిందే. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల విద్య నాణ్యత విషయంగా ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరించాలి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ తర్వాత, ఒక ఉద్యోగి ఇండియాలో పనిచేసినా లేదా విదేశాల్లో పనిచేసినా పని నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ రోజున ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు చదువు పూర్తి చేసుకుని ‘జాబ్ మార్కెట్’లోకి వచ్చే యువతకు ప్రాథమిక విద్య స్థాయిలోనే ‘వర్క్ ప్లేస్’ సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలను బోధించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. ‘ప్రొఫెషనల్ కోర్సు’లు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో చేరుతున్న దశలో నైపుణ్యాల బోధన లేని కారణంగానే, మళ్ళీ వారికీ ‘స్కిల్ డెవలప్మెంట్’ కోర్సులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని కనుక పట్టించుకోకపోతే, చదివిన డిగ్రీలతో పనిలేకుండా... జీవిక కోసం ‘మార్కెట్’లో చౌక ‘లేబర్’గా వీరు మారుతారు. దాంతో వీరి చదువుల కోసం ప్రభుత్వం చేసిన ‘వ్యయం’, తిరిగి వీరి సర్వీసుల ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తికి అవుతున్న ‘జమ’ మధ్య వ్యత్యాసం తగ్గదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు స్థిరంగా– ‘జాబ్ మార్కెట్’లో నిలబడగలగడానికి– ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య స్థాయిలో ఇవ్వాల్సిన తర్భీదు ఎలా ఉండాలి? కొన్నేళ్లుగా ‘ఇంటర్నేషనల్ స్కూళ్లు’ ఉనికిలోకి వచ్చాయి. వాటి ‘కేంపస్’లు కూడా విశాలమైన స్థలం, భవనాలు, వసతులతో అలరారుతున్నాయి. అటువంటప్పుడు– అదే కాలంలో అదే ప్రాంతంలోని సమాజాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే బోధనా ప్రమాణాలు ఎలా ఉండాలి? పబ్లిక్ స్కూళ్లలో ‘యజమాని’ ప్రభుత్వ స్కూళ్లలో ‘ఉద్యోగి’ తయారయ్యే ఇటువంటి వైరుధ్యం, వ్యత్యాసం ఇలా విద్యార్థికి ‘కిండర్ గార్డెన్’ దశలోనే మొదలవుతున్నప్పుడు, దీనిపై... సమీక్ష సంస్కరణల చర్యల అవసరం ఉందా లేదా? ఇంకా ఈ వ్యత్యాసం కొనసాగడానికి ప్రభుత్వం ‘చెక్’ పెట్టే చర్యలు కనుక చేపడితే, అందుకు మన పౌర సమాజ స్పందన ఎలా ఉండాలి? ఉపాధి అంశం కంటే సున్నితమైనది మరొకటి ఉంది. అది– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు అందవలసిన ‘ఎమోషనల్ సపోర్ట్’. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు మురికివాడలు అని మనం పిలిచిన పట్టణ శివారు కాలనీల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే ‘ఫ్యామిలీ కేసులు’ ఎటువంటివో చూస్తే, ఆ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బడిలో టీచర్ల నుంచి అందవలసిన సాంత్వన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. విజయవాడ వంటి రైల్వే జంక్షన్ పరిధిలో వీధి బాలల కోసం పని చేస్తున్న– ఎన్జీఓలు చెప్పగలరు– పిల్లల పట్ల మనం చూపే నిర్లక్ష్యం ముగింపు ఎలా ఉంటుందో! (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) పాఠశాల విద్యాశాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో జరుగుతున్న వాద వివాదాలను... బయట నుంచి, దూరం నుంచి చూస్తున్న పౌరసమాజపు క్రియాశీలత అవసరమైన సమయమిది. ఈ పిలుపు ఒకరికి అనుకూలం, మరొకరికి ప్రతికూలం కాదు. ఇది మన కొత్త రాష్ట్రం కోసం. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) - జాన్సన్ చోరగుడి సామాజిక విశ్లేషకులు -
బంగారు భవితకు పటిష్ట ‘పునాది’
సాక్షి, అమరావతి: ఓ భవనమైనా.. మనిషి వ్యక్తిత్వమైనా పునాది బాగుంటేనే ఆటుపోట్లను తట్టుకుని కలకాలం నిలబడుతుంది. ఫౌండేషన్ సరిగా లేకుండా ఆ తరువాత భారం మోపితే ఏమవుతుంది? అంత బరువు తట్టుకోలేక కుప్పకూలుతుంది. అందుకనే ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, చిన్నారులను చేయి పట్టి నడిపిస్తూ, సంప్రదాయ విధానంలోని లోపాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీర్ఘకాలంగా మన ప్రాథమిక విద్యా విధానం సరిగా లేకపోవడమే నాసిరకం ప్రమాణాలకు కారణమని అనేక నివేదికలు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఫౌండేషన్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పునాది స్థాయి నుంచే బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది ఉన్నత ప్రమాణాలతో అందరూ ఉచితంగా విద్య అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. అత్యుత్తమ మానవ వనరులే లక్ష్యంగా విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా, పిల్లలంతా తప్పనిసరిగా స్కూళ్లకు వచ్చేలా జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, పోషక విలువలతో కూడిన గోరుముద్ద లాంటి పథకాలను అమలు చేస్తూ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేస్తోంది. చిన్నారుల్లో మనోవికాసం గరిష్ట దశలో ఉండే సమయంలో సబ్టెక్టు టీచర్లను నియమించి విద్యాభాసం ఆహ్లాదకరంగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూలింగ్ విధానంలో మార్పులు చేసింది. తొలిసారిగా విద్యార్థి కేంద్రంగా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఫౌండేషన్ నుంచే ఉత్తమ బోధన అందించడంతోపాటు పైతరగతులకు వెళ్లే కొద్దీ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. 3 నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన చిన్నారుల్లో 8 ఏళ్లలోపే మేథో వికాసం పూర్తిస్థాయిలో ఉంటుందని పలు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్న నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా పునాది విద్య బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తోంది. విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరంచెల విధానంలో స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. కొత్త విధానంలో ఒక్క స్కూలు కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ పోస్టూ తగ్గకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫౌండేషన్ విద్య బలోపేతంతో పాటు 3వ తరగతి నుంచే విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫౌండేషన్ స్కూళ్లతో 5+3+3+4 విధానంలో తరగతులు ఏర్పాటవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో పీపీ 1, పీపీ 2 తరగతులను ఏర్పాటు చేసి స్కూళ్లకు అనుసంధానిస్తూ పునాది స్థాయి నుంచే అక్షర, సంఖ్యా పరిజ్ఞానానికి బాటలు వేస్తున్నారు. పాత విధానంలో పునాది విద్యపై నిర్లక్ష్యం ఇప్పటివరకు అమలవుతున్న అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీల విద్యా విధానంలో విద్యార్ధులకు సరైన బోధన అందక సామర్థ్యాలు మెరుగుపడడం లేదు. ఇదే అంశాన్ని పలువురు నిపుణులు రూపొందించిన నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా పునాది విద్యకు పాత విధానంలో చోటే లేదు. అంగన్వాడీలను స్కూలింగ్ విధానంలో భాగంగా పరిగణించకపోవడంతో అక్కడ చేరే పిల్లలకు స్కూలు వాతావరణం, అక్షర పరిజ్ఞన నైపుణ్యాలు అలవడే పరిస్థితి లేకుండా పోయింది. నేరుగా ఒకటో తరగతిలో చేరుతున్న చిన్నారులకు ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ప్రమాణాలు కొరవడటంతో విద్యా ప్రమాణాల్లో వెనుకబడుతున్నారు. పైతరగతులకు వెళ్లే కొద్దీ అందుకు తగ్గ సామర్థ్యాలు సంతరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైమరీ స్కూళ్లలో 1నుంచి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను ఒకరిద్దరు టీచర్లే బోధించాల్సి రావడంతో విద్యార్ధుల్లో ప్రమాణాలు మెరుగుపడలేదు. నాడు.. దిగజారిన ప్రమాణాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత దిగజార్చారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు క్షీణించాయి. ఈ అంశాలను 2018లో పలు సర్వేలు వెల్లడించాయి. అసర్ నివేదిక ప్రకారం మూడో తరగతి విద్యార్ధుల్లో 22.4 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాలను చదవగలుగుతున్నారు. 3వ తరగతి విద్యార్ధులలో 38.4 శాతం మాత్రమే తీసివేతలు చేయగలుగుతున్నారు. 5వ తరగతి పిల్లల్లో 39.3 శాతం మందికి మాత్రమే భాగాహారాలు వచ్చు. 8వ తరగతి పిల్లల్లో 47.6 శాతం మంది మాత్రమే భాగాహారాలు చేయగలుగుతున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఇక స్టేట్ లెవల్ అఛీవ్మెంట్ సర్వే (స్లాస్) నివేదిక ప్రకారం రాష్ట్ర విద్యార్ధుల్లో పఠన సామర్థ్యాలు చాలా పేలవంగా ఉండడంతో పాటు ఇతర నైపుణ్యాలు కొరవడ్డాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్ధుల్లో భాషా నైపుణ్యాలు 63.50 శాతం నుంచి 49.40 శాతానికి తగ్గిపోయాయి. మేథమెటిక్స్‌లో అయితే 69.55 శాతం నుంచి 39.30 శాతానికి కుదించుకుపోయాయి. నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రకారం పదో తరగతిలో 60 శాతం విద్యార్ధులకు ప్రధాన సబ్జెక్టులతో పాటు భాషల్లోనూ సరైన సామర్థ్యాలు లేవని తేలింది. టెన్త్ విద్యార్ధులలో ఎక్కువ మంది ఇంగ్లీషు లేదా తెలుగు వాక్యాన్ని తప్పులు లేకుండా చదవడం, రాయడం కూడా రాని పరిస్థితి నెలకొందని వెల్లడించింది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా టెన్త్‌లో 95 నుంచి 99 శాతం వరకు ఉత్తీర్ణత నమోదు కావడం నాటి పరీక్షల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలకు నిదర్శనం. నేడు.. చక్కదిద్దేందుకే కొత్త విధానం రాష్ట్రంలో విద్యారంగం దుస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిద్దుబాటు చర్యలతో నూతన ఫౌండేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు పునాది స్థాయి నుంచే పటిష్ట బోధన అందించడం, పైతరగతులకు వెళ్లే కొద్దీ ఉన్నత ప్రమాణాలతో పరి/ê్ఙనాన్ని పెంపొందించడం కొత్త విధానం ముఖ్య ఉద్దేశం. తద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష. ఈ క్రమంలో అంగన్వాడీలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులపై భారం లేకుండా జగనన్న విద్యాకానుక అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు అన్ని హైస్కూళ్లలో దశలవారీగా సీబీఎస్ఈ విధానాన్ని అమలుకు సిద్ధమయ్యారు. విద్యార్ధులకు మాధ్యమంతో ఇబ్బంది లేకుండా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నారు. ఉచితంగా బైజూస్ కంటెంట్, ట్యాబ్‌లు ఈ ఏడాదినుంచి విద్యార్థులకు ఆధునిక విద్యా పరి/ê్ఙనాన్ని సమకూరుస్తూ బైజూస్ కంటెంట్‌ను ప్రత్యేక యాప్ ద్వారా అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏటా 8వ తరగతిలోకి వచ్చే నాలుగు లక్షల మందికిపైగా విద్యార్ధులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందించి బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేయనున్నారు. తద్వారా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. రూ.20 వేలకు పైగా విలువ చేసే బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ఉచితంగానే అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫౌండేషన్ స్కూళ్లలో పీపీ 1, పీపీ 2లకు అంగన్వాడీ టీచర్లతో బోధన తోపాటు 1, 2 తరగతులకు ఎస్జీటీలతో బోధన నిర్వహిస్తారు. గతంలో 1 నుంచి 5 తరగతులుండగా ఇపుడు 1, 2 తరగతుల పిల్లలకు మాత్రమే బోధన వల్ల టీచర్లకు సులభం కావడంతో పాటు పిల్లలకూ ఉత్తమ పరి/ê్ఙనం అందే అవకాశం ఏర్పడింది. ఆరంచెల విధానంలో స్కూళ్లు ► అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని స్కూళ్లకు అనుసంధానించి పీపీ 1, పీపీ 2లతో పాటు 1, 2వ తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లుగా మార్పు చేస్తున్నారు. ► పీపీ 1, పీపీ 2లతో పాటు 1–5 తరగతుల వరకు ఉండేలా ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లను నెలకొల్పుతున్నారు. ► స్కూళ్లతో అనుసంధానానికి వీలులేని చోట అంగన్వాడీ కేంద్రాలను పీపీ 1, పీపీ 2లతో కలిపి శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5వ తరగతులను 250 మీటర్ల నుంచి ఒక కి.మీ. లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో మ్యాపింగ్ చేయడం ద్వారా 1 నుంచి 7 లేదా 8వ తరగతులతో ప్రీ హైస్కూల్ విధానంలో కొన్ని స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. ► ప్రైమరీ పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు కొలువుదీరుతున్నాయి. ► ప్రతి మండలంలో జూనియర్ కాలేజీని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు లేని మండలాల్లో హైస్కూళ్లలో 11, 12వ తరగతులను ఏర్పాటుచేసి హైస్కూల్ ప్లస్‌గా ఏర్పాటు చేస్తున్నారు. దశలవారీగా మ్యాపింగ్ స్కూళ్ల మ్యాపింగ్‌ను ఒకేసారి కాకుండా దశలవారీగా చేస్తున్నారు. మొదటి దశలో 250 మీటర్ల పరిధిలోని అంగన్వాడీలు, ప్రైమరీ స్కూళ్లు, యూపీ, హైస్కూళ్ల మధ్య మ్యాపింగ్ చేపట్టారు. రెండో విడతలో కిలోమీటర్ లోపు దూరంలోని స్కూళ్లలోని తరగతులకు మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 5,968 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల మధ్య 3, 4, 5 తదితర తరగతుల మ్యాపింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 47 లక్షల మంది విద్యార్ధులుండగా 2.49 లక్షల మంది మాత్రమే మ్యాపింగ్‌తో పక్కనే ఉండే మరో స్కూల్‌కి మారతారు. ఆయాస్కూళ్ల మ్యాపింగ్‌తో ప్రీహైస్కూల్, , హైస్కూళ్లలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్ధులకు మ్యాపింగ్ నేపథ్యంలో తరగతి గదులతోపాటు సదుపాయాలను మెరుగుపర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం నాడు – నేడు ద్వారా యుద్ధప్రాతిపదికన చేపట్టింది. మ్యాపింగ్ అయిన స్కూళ్లతో పాటు ఇతర స్కూళ్లలో 1,69,972 అదనపు తరగతి గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. అదనంగా 8వేలకు పైగా ఎస్ఏ పోస్టులు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేందుకు వీలుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్లను సమకూరుస్తున్నారు. మ్యాపింగ్ జరిగిన 3,609 హైస్కూళ్లలో 73,620 మంది స్కూలు అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా ఇప్పటికే 62,935 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో 8 వేలకుపైగా ఎస్జీటీ పోస్టులను ఎస్ఏలుగా అప్‌గ్రేడ్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా 1,000 హెచ్ఎం పోస్టులను కల్పించేందుకు వీలుగా ఎస్ఏ పోస్టులను అప్‌గ్రేడ్ చేయనున్నారు. అప్‌గ్రేడ్ అయిన ఈ పోస్టుల్లో అర్హత కలిగిన టీచర్లకు పదోన్నతి కల్పించి నియమించనున్నారు. నాడు – నేడు ద్వారా రూ.16,450 కోట్లు టీడీపీ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. కనీస సదుపాయాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వాన్నంగా మార్చారు. పిల్లలు లేరన్న సాకుతో 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 5 వేల స్కూళ్లను తిరిగి తెరిపించడమే కా>కుండా అన్ని సదుపాయాలతో టీచర్లను సమకూర్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఏకంగా రూ.16,450 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం. ఈ నిధులతో మొత్తం 62,661 విద్యాసంస్థల్లో సదుపాయాలను సమకూరుస్తోంది. నిశిత పరిశీలన తరువాతే స్కూళ్ల మ్యాపింగ్ వల్ల ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, టీచర్ పోస్టులు తగ్గకుండా చర్యలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన తరువాతే మ్యాపింగ్ చేపట్టాం. ఆయా స్కూళ్లలో వసతులు, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు ఐదు వేలకుపైగా స్కూళ్ల మ్యాపింగ్ జరగ్గా కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజాప్రతినిధులతో పాటు ఇతర వర్గాలు తెలిపాయి. వాగులు, ప్రధాన రహదారులు దాటాల్సి రావడం, గదులు చాలకపోవడం లాంటి సమస్యలున్నట్లు చెప్పారు. 800 స్కూళ్లలో సమస్యలున్నట్లు సమాచారం అందడంతో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల పరిశీలన అనంతరం 250 వరకు స్కూళ్లను మ్యాపింగ్ నుంచి ప్రస్తుతానికి మినహాయించాం. 36 వేలకు పైగా తరగతి గదుల నిర్మాణం చకచకా సాగుతోంది. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయి. సబ్జెక్టు టీచర్లతో బోధనకు వీలుగా అవసరమైన మేరకు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నాం. – ఎస్.సురేష్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ -
సభలో యోగితో నవ్వులు పూయించిన అఖిలేష్.. అంతలోనే..!
లక్నో: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సభలో నవ్వులు పూయించారు. సీఎం యోగి సైతం విరగబడి నవ్వుకున్నారు. 25 కోట్ల జనాభా కలిగిన పెద్ద రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత వెనుకబాటుకు గురైందో చెప్తూ యోగి ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన సోమవారం నాటి శాసనసభ సమావేశాల్లో గుర్తు చేసుకున్నారు. ‘విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు పాఠశాలలను సందర్శించేవాడిని. ఆ క్రమంలోనే ఓ ప్రాథమిక పాఠశాలకు తనిఖీలకు వెళ్లాను. ఓ పిల్లవాడిని నేను ఎవరిని అని అడిగాను. ఒక్క క్షణం ఆలోచించి అతను చెప్పిన సమాధానం నాకు మతిపోయేలా చేసింది. మీరు రాహుల్ గాంధీ అని ఆ విద్యార్థి చెప్పడంతో మన విద్యా వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందోనని బాధపడ్డా’ అని అఖిలేష్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంగుబాటుకు అందరూ కారకులే’ అని అఖిలేష్ పేర్కొన్నారు. చదవండి👉 మహానాడు వేదికపై చంద్రబాబు మేకపోతు గాంభీర్యం పాఠశాల విద్యాభివృద్ధిలో యూపీ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉండటం కలవర పరచే విషయమని అన్నారు. దేశానికి ఎందరో ప్రధానులను అందించిన రాష్ట్రం యూపీ. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. అయినా తీరు మారలేదని అఖిలేష్ చురకలు అంటించారు. 2012 నుంచి 2017 వరకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. చదవండి👇 ఇప్పుడే షో మొదలైంది.. వారంలో ఇద్దరు మంత్రుల అవినీతి చిట్టా! రాజ్యసభ సీటు కోసం అలకబూనిన ‘సీఎం చంద్రూ’.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై! -
ఏపీ: స్కూల్ ఫీజు వసూలుపై కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిల్లోనూ పలు యాజమాన్యాలు మాత్రం ఫీజులు కట్టాలంటూ పిల్లల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీ ఫీజులపై పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీచేశారు. లాక్డౌన్ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అది కూడా మొదటి త్రైమాసిక కాలం ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. మొదటి త్రైమాసిక ఫీజును కూడా రెండు విడతలుగా వసూలు చేయాలని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రాథమిక విద్యే కీలకం
కొండపాక(గజ్వేల్): చదువులో ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రాథమిక విద్యే కీలకమని సిద్దిపేట జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాబూరావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుకునూరుపల్లిలోని సెంట్ఆన్స్ స్కూల్ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. పిల్లలను హాస్టల్స్‌లో వేయడం వల్ల ప్రేమాభిమానాలను దూరం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన నాటికలతో పాటు జబర్దస్త్ టీం నిర్వహించిన కామెడీ సబికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, కోల సద్గుణ, పొల్కంపల్లి లక్ష్మి, జబర్దస్తు టీం స భ్యులు వినోధిని, బుల్లెట్ భాస్కర్, సునామి సుధాకర్, ఉదయ్, పాఠశాల కరస్పాండెంట్ చంటి, ప్రిన్సిపల్ సరోజిని దేవి, ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అవినీతిపై యుద్ధం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ ప్రజాప్రతినిధిపై పోరాటానికి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దొడ్డబళ్లాపుర జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అవినీతికి పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తూర్పారబడుతున్నారు. తాలూకాలోని నెలమంగలలో ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా పనిచేస్తున్న శివకుమారి కొన్నిరోజుల క్రితం ప్రాథమిక విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి, తాలూకాలో ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఇవీ అంటూ సవివరంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. ఇది ఎమ్మెల్యేకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన అనుచరుల ద్వారా సదరు టీచర్‌ను హెచ్చరించారు. అయినా, వెనకడుగు వెయ్యని శివకుమారి పోస్టుల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. దీంతో ఎమ్మెల్యే నేరుగా ఆమె సోదరుడు రాజుకు ఫోన్‌చేసి బెదిరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై పోరాటం ఆపను ఈ నేపథ్యంలో శివకుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఎమ్మెల్యేపై తన పోరాటాన్ని ఆపబోనని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, తాను పోటీచేయడం కానీ చేస్తానని చెప్పారు. కాగా, శివకుమారి అధికార కాంగ్రెస్‌కు మద్దతుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. -
‘కొత్త’ చిక్కులు
- ప్రాథమిక విద్యలో నూతన సంస్కరణలు - కొరవడిన ముందస్తు కసరత్తు - మార్చి నుంచే పై తరగతులకు - మంజూరు కాని పుస్తకాలు - బోధన ఎలాగంటున్న ఉపాధ్యాయులు - ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు:2929 విద్యార్థుల సంఖ్య: 6 లక్షలు కర్నూలు సిటీ: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు..ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ప్రాథమిక విద్యా విధానంలో నూతన సంస్కరణలు అమలు చేస్తుండడం విమర్శలు తావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది విద్యాశాఖ ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ నిర్వహించాల్సిన పరీక్షలను మార్చిలోనే జరుపుతున్నారు. అలాగే మార్చి నుంచే విద్యార్థులను పైతరగతులకు పంపించనున్నారు. ఈ విధానం కార్పొరేట్, కేంద్రీయ విద్యాలయాల్లో అమలవుతోంది. ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులకు ఆదేశాలు పంపింది. ఇందులో భాగంగానే 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మార్చి 6 నుంచే వార్షిక పరీక్షలు నిర్వహించన్నారు. పరీక్షల అనంతరం విద్యార్థులకు బోధన ఎలా చేయాలన్న దానిపై విద్యాశాఖకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేవు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. మార్చి నెల 20 వరకు పరీక్షలు నిర్వహించి.. 21వ తేదీ నుంచి 22 పనిదినాల రోజుల్లో పై తరగతులకు ఉపాధ్యాయులు బోధించాల్సి ఉంది. విద్యార్థి స్థాయికి తగ్గట్టు సామర్థ్యాల పెంపుకు ఎలాంటి (సవరణాత్మకమైన బోధ)బోధన చేయాలి అనే అంశంపై నేటికీ ప్రభుత్వం స్పష్ట్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయల్లో గందరగోళం నెలకొంది. దీనికి తోడు విద్యా సంవత్సం చివరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. నూతన విధానం అమలు చేయాలంటే పై తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఉండాలి. బోధన మొదలయ్యే నాటికే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి. కానీ నేటికీ కొత్త పుస్తకాల ముద్రణకే ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం వార్షిక పరీక్షలు ముగిశాక విద్యార్థులను పై తరగతులకు పంపి బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలిస్తున్నారు. సామర్థ్యాలేవీ? ముందస్తుగానే పై తరగతులకు వెళ్లేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తగిన సామర్థ్యాలు ఉండడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కార్పొరేట్, కేంద్రీయ విద్యాలయాల్లో ముందస్తు కసరత్తు ఉండడంతో ఇది సాధ్యమవుతుందని, ప్రభుత్వం హడావుడిగా తీసుక్ను నిర్ణయంతో సత్ఫలితాలు రావనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాలు బోధించేందుకు టీచర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు. వచ్చే నెల17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిసిన వెంటనే ముల్యాంకనం ఉంటుంది. అలాంటిప్పుడు పదో తరగతి పాఠ్యాంశాలను ఎవరితో బోధిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు – వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వార్షిక పరీక్షలు ముందుగానే నిర్వహించి, విద్యార్థులను పై తరగతికి పంపించాలనే ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదు. ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అన్ని వసతులు కల్పించాలి – తిమ్మన్న, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముందుగానే వార్షిక పరీక్షలు నిర్వహించి పై తరగతులకు పంపడం మంచిదే. అయితే పై తరగతులకు వెళ్లే విద్యార్థులకు అన్ని వసతలు కల్పించాలి. పుస్తకాలు ముందుగానే ఇవ్వాలి. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాది నుంచి మార్చిలోనే వార్షిక పరీక్షలు – తాహెరా సుల్తానా, డీఈఓ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకవచ్చింది. ఇందులో భాగంగా 1నుంచి9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చిలోనే నిర్వహించాలని ఇటీవలే కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ పరీక్షలు అయ్యాక పై తరగతులకు సంబంధించిన పాఠాలు బోధించాలని చెప్పాం. ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోందిది. త్వరలోనే పూర్తిస్థాయి విధి విధానాలు రానున్నాయి. -
ఇక పాఠశాలలు లేనట్టే?
సీతంపేట : ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయేలా ఉంది. వీరి కోసం ప్రత్యేక పాఠశాలలంటూ చెప్పిన ప్రభుత్వం విఫలమైంది. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాల్లో పాఠశాలలు మంజూరు చేయడంలో సర్వశిక్షాభియాన్ చేతులెత్తేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో చిన్నారులు డ్రాపౌట్లు సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ(నాన్‌రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్) కేంద్రాలను ఏజెన్సీలో ప్రవేశపెట్టి డ్రాపౌట్లను నివారణకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఈ కోవలోనే 46 వరకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు మంజూరయ్యాయని ఐటీడీఏలో విద్యాశాఖాధికారులు ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న చోట 21 పాఠశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టనున్నామని చెబుతున్నారు. పది మందిలోపు విద్యార్థులున్న గ్రామాలే ఏజెన్సీలో 50కి పైగా ఉంటారుు. ఆయా గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడంతో వీటిలో దాదాపు ఐటీడీఏ పరిధిలో 1500ల మంది వరకు డ్రాపౌటు విద్యార్థులు ఉంటారు. వీరికి మరి చదువులు చదువుకునే పరిస్థితి లేదు. ఎదురు చూపులు విద్యా సంవత్సరం ఆరంభమై ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చదువులు లేకపోవడం శోచనీయం. కొండ శిఖరాల గ్రామాల్లో విద్యార్థులు మైదాన ప్రాంతాలకు పాఠశాలలకు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో పాఠశాల ఉండి తప్పనిసరిగా బడిఈడు పిల్లలంతా బడిలో ఉండాలనే నిబంధనలున్నాయి. పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా పశువుల కాపరులు, తల్లిదండ్రులతో పోడు పనులకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్.ద్వారబందం అనే గ్రామంలో 12 మంది, రంగంవలస, నాయికమ్మగూడ, చాపరాయిగూడ, మందస మండలంలోని కొంటిసాయి, చింతవీధి, కొత్తూరు మండలంలో చిన్నరాజపురం, దాపకులగూడ, ఉల్లిమానుగూడ, మెళియాపుట్టి మండలంలో రామచంద్రాపురం, భామిని మండలంలో బాండ్రాసింగి, నడింగూడ, కొత్తగూడ, గేదెలగూడ, మాండ్రంగూడ, బూర్జ మండలంలో గోపిదేవిపేట, బొమ్మిక తదితర గ్రామాల్లో పాఠశాలల్లేవు. దాదాపు 70 గ్రామాల్లో పాఠశాలలు లేవంటే ప్రాథమిక విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్ధమవుతుంది. -
సరస్వతికి లక్ష్మీ కటాక్షం
ఉమెన్ ఫైనాన్స్ / ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పటికీ చాలావరకు చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందజేయగలుగుతున్నా, పై చదువులకు మాత్రం పంపలేక ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. కొంతమంది తమ పిల్లల్లో ఎవరో ఒకరిని మాత్రమే ఉన్నత విద్యాభాస్యానికి పంపగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా... ఆడపిల్ల, మగపిల్ల వాడు ఉంటే మగపిల్లవాడిని మాత్రమే పైచదువులకు పంపిస్తూ, ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తున్నారు. దీని వల్ల మెరుగైన ప్రతిభ ఉన్న చాలామంది విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. పిల్లల పైచదువుల కోసం అని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు లోను తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కానీ చాలామందికి వీటి మీద అవగాహన లేక పోవడం వల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరైతే పైచదువులకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఎడ్యుకేషన్ లోన్‌ను సులభంగా పొందడానికి భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 15న విద్యాలక్ష్మి (www.vidyalakshmi.co.in) అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఆర్థిక వెసులుబాటు లేని కారణంగా ఏ విద్యార్థీ తన చదువును మధ్యలోనే ఆపేయకూడదు అనే ముఖ్యోద్దేశంతో ఈ పోర్టల్ ప్రారంభం అయింది. దీని ద్వారా సులభంగా విద్యా లోను పొందే అవకాశం ఉంది. ≈ పోర్టల్ ద్వారా ఏయే రకాల ఎడ్యుకేషనల్ లోను స్కీములను వివిధ బ్యాంకులు అందజేస్తున్నాయో ఆ సమాచారం పొందవచ్చు. ≈ అన్ని బ్యాంకులకు ఒకే తరహాలో అప్లికేషన్ ద్వారా లోన్‌కి దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ≈ ఒకేసారి వివిధ బ్యాంకులకు లోన్ కోసం అప్లై చేయవచ్చు. ≈ బ్యాంకులు ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటి స్టేటస్‌ను పోర్టల్‌లో పొందుపరుస్తాయి. ≈ విద్యార్థులు లోనుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా, లేదా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇ-మెయిల్ ద్వారా అలాంటి సదుపాయం ఉంటుంది. ≈ ఈ పోర్టల్ నుంచి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌కి కూడా లింకేజ్ ఉంటుంది. దాని వల్ల విద్యార్థులు ప్రభుత్వం వారు అందజేసే వివిధ రకాల స్కాలర్‌షిప్పుల గురించి సమాచారం పొందవచ్చు. అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ≈ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ అనేది లోన్‌కి అప్లై చేసుకోడానికి ఒక సులభతరమైన మార్గం మాత్రమే. ఎవరు లోన్‌కి అర్హులు? లోను మొత్తం ఎంత? వడ్డీరేట్లు తదితరాలు బ్యాంకు వారి నిబంధలన మేరకు ఉంటాయి. ≈ సాధారణంగా బ్యాంకువారు 12 నుంచి 17 శాతం వరకు వడ్డీతో లోన్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ≈ ఈ లోన్‌కి ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ ఫీజు ఏమీ చార్జి చెయ్యరు. ≈ లోన్ మొత్తాన్ని విద్యకయ్యే ఖర్చు మొత్తానికి మాత్రమే ఇస్తారు. ≈ ఈ లోన్‌కి తప్పనిసరిగా గ్యారెంటీ ఇచ్చేవారు కావాలి. ఒకవేళ ఎక్కువ మొత్తమైతే కొల్లేటరల్ (ష్యూరిటీ) కూడా అవసరం అవుతుంది. ≈ ఈ లోన్‌కి కట్టే వడ్డీని ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం సెక్షన్ 80 ఇ కింద తగ్గింపు పొందవచ్చు. (ఈ సెక్షన్ కింద తగ్గింపు పొందాలంటే లోన్ని తప్పనిసరిగా షెడ్యూల్ బ్యాంకు నుండి లేదా ఆమోదిత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుండి మాత్రమే తీసుకోవాలి). ≈ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే విద్యార్థులు ఈ ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా తమ విద్యకు తామే డబ్బును సమకూర్చుకుని, విద్య అనంతరం తామే తీర్చుకోవచ్చు. ఇదొక మంచి సదుపాయం. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
‘ప్రాథమికం'.. అయోమయం!
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన సర్వశిక్షా అభియాన్ ప్రస్తుతం సంకటంలో పడింది. కేంద్రం ఏటా నిధులు కోత పెడుతుండడంతో క్రమంగా ఉనికి కోల్పోతున్న ఎస్ఎస్ఏకు తాజాగా రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం షాకిచ్చింది. జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పనిచే స్తున్న సెక్టోరియల్, సహాయ సెక్టోరియల్, క్లరికల్ సిబ్బందిని ఒక్కసారిగా తొలగిం చింది. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వీరిని వెంటనే సొంత శాఖకు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా ఎస్ఎస్ఏలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారు ఒకట్రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఇక.. ఆ కుర్చీలన్నీ ఖాళీ కావడంతో ప్రాజెక్టు కార్యక్రమాల అమలు అగమ్యగోచరంగా మారనుంది. * మూకుమ్మడిగా సెక్టోరియల్, సహాయకుల తొలగింపు * గడువు ముగిసిందంటూ డిప్యుటేషన్లు రద్దు * ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ * కొత్త నియామకాలపై స్పష్టత కరువు * అటకెక్కనున్న విద్యా కార్యక్రమాలు * సంకటంలో సర్వశిక్షా అభియాన్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో విద్యాశాఖకు సంబంధించిన పలువురు అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. హోదాకు తగినట్లు వారికి బాధ్యతలు అప్పగించారు. కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికావిద్య విభాగాలకు ముగ్గురు గెజిటెడ్ ఉపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా పనిచేస్తున్నారు. అదే విధంగా సహాయ గణాంక అధికారి, సహాయ ప్లానింగ్ అధికారి, సహాయ పర్యవేక్షణ అధికారులుగా స్కూల్ అసిస్టెంట్లు కొనసాగుతున్నారు. ఇదే విభాగంలో నలుగు జూనియర్ అసిస్టెంట్లుగా విద్యాశాఖకు చెందిన వారున్నారు. తాజాగా వారి డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఎస్పీడీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. టీచర్లంతా బడిలోనే పనిచేయాలనే ఆర్టీఈ నిబంధనలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా ఎస్ఎస్ఏ ఎస్పీడీ యోచిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమాలు సాగేదెలా..? ఎస్ఎస్ఏలో కీలక విభాగాల అధికారుల తొలగింపుతో పలు కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. పాఠశాల యాజమాన్యాల ఏర్పాటు, బడిబాట, పిల్లల హక్కులు, స్కూల్ డ్రస్సులకు సంబంధించి కార్యక్రమాల పురోగతి అయోమయంలో పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. బాలికా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయి. వార్షిక ప్రణాళిక తయారీ, అమలు, పాఠశాలల వారీగా గణాంకాల సేకరణ.. తదుపరి కార్యచరణ.. పాఠశాలల పర్యవేక్షణ.... ఇలా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రశ్నార్థకం కానున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లను నియమించే చర్యలు తీసుకున్నా.. అందుకు మరింత సమయం పడుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మన స్కూళ్లు.. నిరుద్యోగుల ఫ్యాక్టరీలు
ఇంతకూ మన దేశంలో విద్యకు సంబంధించిన అసలు సమస్య ఏమిటి? ప్రాథమిక స్థాయి విద్య నాణ్యత అన్నిటిలోకీ అతి పెద్దది. ప్రాథమిక పాఠశాలల్లో సరైన సదుపాయాలు లే వు, ఉపాధ్యాయులు తరచుగా విధులకు హాజరు కారు... అక్కడ పెట్టే ఉచిత భోజనాన్ని ఎంత నిర్లక్ష్యంగా తయారు చేస్తారంటే కొన్ని సంద ర్భాల్లో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటారు. ఈ కీలక కృషిని సక్రమంగా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమై... పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో 20 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉండగా, పదేళ్ల తర్వాత నేడది 30 శాతానికి పెరిగింది. ఈ ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్య నాణ్యత రకరకాలుగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల కంటే అధ్వానంగా ఉంటోంది. పర్యవసానం మన పాఠశాలల్లో తయారైన విద్యార్థులలో అధికులు విద్యా వంతులు కాకపోవడం. ప్రథమ్ అనే సంస్థ భారతదేశంలో విద్యపై అత్యుత్తమ మైన వార్షిక సర్వేను నిర్వహించింది. గుజరాత్‌కు సంబంధించిన ఆ అధ్యయన ఫలితాలను చూస్తే పరిస్థితి బాగా అర్థం అవుతుంది. 2014లో గ్రామీణ గుజరాత్‌లోని 7వ తరగతి విద్యార్థులలో 22 శాతం మాత్రమే ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవగలిగారు. 2007లో ఇది 37 శాతంగా ఉండేది. అంటే, సుపరి పాలనకు పేరు మోసినదిగా భారతీయులలో చాలా మంది విశ్వసిస్తున్న రాష్ట్రం లోనే విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ అధ్యయనం కోసం పరీక్షించిన 5వ తరగతి విద్యార్థులలో ఈ సంఖ్య 6 శాతం. అంటే, పదేళ్ల వ యస్కులైన 94 శాతం గుజరాతీ విద్యార్థులు ఒక ఇంగ్లిషు వాక్యాన్ని చదవలేరు. సర్వే చేసినది 20,000 మంది విద్యార్థులను కాబట్టి ఎంపిక చేసినవారి సంఖ్య చాలా తక్కువనడానికి లేదు. 5వ తరగతి విద్యార్థులలో సగం కంటే తక్కువ మందికి (44%) మాత్రమే గుజరాతీ చదవగలిగే శక్తి ఉంది. ఈ సంఖ్య కూడా గత కొన్నేళ్లుగా పడిపోతూ వస్తోంది. 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం మూడింట ఒక వంతుకు మాత్రమే 1వ తరగతి స్థాయి చదివే సామర్థ్యం ఉంది. 2007 నుంచి ఈ ఏడాదికి ఈ సంఖ్య 10 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ సమాచారం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధిం చినది. అయితే, ప్రైవేటు పాఠశాలల పరిస్థితీ అలాగే ఉంది. ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థుల్లో 13% భాగహారాలు చేయగలిగితే, ప్రైవేటు పాఠశాలల్లో అది 16% మాత్రమే. భారతీయులందరిలోకీ గుజరాతీలు మాత్రమే పుట్టుకతో వ్యాపారస్తులని భావిస్తుంటారు. కానీ 80 శాతం ప్రాథమిక మైన అంక గణితం లెక్కలు చేయలేకపోతే భవిత నిరాశాజనకమైనదే అవుతుంది. ఈ పరిస్థితికి కొంత వరకు వనరుల లేమిదే బాధ్యత అని అనుకోవచ్చు. 6 నుంచి 15 ఏళ్ల పిల్లలు ఒక్కొక్కరి విద్య కోసం అమెరికా ప్రభుత్వం మొత్తం రూ. 1,15,000 డాలర్లను ఖర్చు చేస్తుంది. అంటే పిల్లల్లో ఒక్కొక్కరిపై ఏడాదికి సగటున రూ. 7 లక్షల ఖర్చు. మన దేశంలోైనైతే ఇది అనూహ్యమైన విషయం. ఆ స్థాయికి చేరాలంటే మనకు 100 ఏళ్లు కావాలి. అయితే మనం ఎదుర్కొనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనని పేద దేశాలు కూడా ఉన్నాయని అంగీకరించక తప్పదు. మన దేశం కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న జింబాబ్వే మనకంటే మెరుగ్గా ఉంది. సమస్య కేవలం డబ్బుకు సంబంధించినదే కాదు. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే కారణమని నేను చాలా సార్లే రాశాను. పెద్ద సమస్యలు సమాజంలోనే ఉన్నాయి. వాటిని ఒక మంత్రి... ఆమె లేదా అతడు తాము ఎంతటి అద్భుత ప్రతిభా వంతులమని భావించినాగానీ మార్చలేరు. నిరుద్యోగులు కాగలిగిన బొటాబొటీ విద్యావంతులైన పౌరులను మన దేశం ఉత్పత్తి చేస్తోంది. వారు ఉత్పాదక మైనవారు కారు. వారు తమంతట తాముగా చేసిన తప్పంటూ ఏమీ లేకపోయినా గానీ వారు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పనిచేయడానికి తగిన శక్తిసామర్థ్యాలతో సంసిద్ధులై లేరు. ఇది మన మానవ వనరుల మంత్రి తప్పేమీ కాదు. కాబట్టి ఇది ఆమె వినమ్రంగా అంగీకరించాల్సిన విషయం. ఆమె నేతృత్వంలోనే మొట్టమొద టిసారిగా కొత్త విషయాలేవైనా జరిగాయని ఆమె విశ్వసించినాగానీ... ఆమెకు ముందు ఎంతో మంది గొప్పవారు ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు. అంతా విఫలమయ్యారు. అబ్దుల్ కలామ్ ఆజాద్ మన దేశ ప్రథమ విద్యామంత్రి. ఆయన గొప్ప మేధావి. రాజకీయ రంగానికి చెందిన వారిలో అత్యంత అధికంగా అధ్యయనం చేసిన వారిలో ప్రపంచంలోనే ఆయన ఎన్నదగినవారు. మత విషయాలకు సంబంధిం చిన పాండిత్యం కారణంగా ఆయనను మౌలానా అని పిలిచేవారు. ఆయన సులభతరం చేసిన ఖురానునే భారత, పాకిస్తాన్లలోని మౌల్వీలంతా నేటికీ ప్రామాణిక గ్రంథంగా అనుసరిస్తారు. చరిత్ర, సాహిత్యాలలో ఆయన పాండి త్యానికి కాంగ్రెస్‌లో మరెవరూ సాటిరారు. 1931లో, నెహ్రూ జైల్లో ఉండగా 900 పేజీల ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ అనే చక్కటి గ్రంథాన్ని రాశారు. వాస్తవాలను, తేదీలను సరిపోల్చుకోడానికి అప్పు డాయన వద్ద రిఫరెన్స్ గ్రంథాలేమీ లేవు. కానీ ఆజాద్, విజ్ఞాన సర్వస్వం వంటి ఆయన జ్ఞానమూ అందుబాటులో ఉండేవి. ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్ల చరిత్రల నుంచి చైనా టీ వరకు సకల విషయ పరిజ్ఞానం ఆయనకుండేది. సాహిత్య అకాడమీ ఆయన ఏర్పరచినదే. గతంలో ఈ పదవిని నిర్వహించినవారిలో చాలా మంది గొప్పవారున్నారని చెప్పడానికే ఇదంతా చెబుతున్నాను. నేటి విద్యాశాఖను మరో పేరుతో ఇప్పుడు మానవ వనరుల శాఖ అని పిలు స్తున్నారు. అదిప్పుడు నటి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఉంది. ఆ పదవీ బాధ్య తలను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఆమె విశ్వసిస్తున్నారు. కాకపోతే నరేంద్రమోదీ మద్దతుదార్లలో కొందరు సైతం ఆమె పని తీరు బాగాలేదని భావి స్తున్నారు. ఆ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన విద్య, అనుభవమూ ఆమెకు కొరవడ్డాయని వారు అనుకోవడమే అందుకు కారణం. కొన్ని రోజుల క్రితం, ఇరానీ తాను సాధించిన విజయాలలో కొన్నిటిని ఏక రువు పెట్టారు. అవి: ఒక్క ఏడాదిలో 4 లక్షలకుపైగా పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించడం. గణిత, విజ్ఞానశాస్త్ర స్థాయిలనూ, చదవడం, రాయటాలనూ మెరుగు పరచటంపై దృష్టిని కేంద్రీకరించడం, తదితరాలు. వీటిలో చాలా వరకు మొట్ట మొదటిసారిగా తన నిర్దేశనలో చేపట్టినవేనని ఆమె అన్నారు. విగ్రహాలను నెల కొల్పడం, హాజరును నమోదు చేయడంలో వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టడం వగైరాలు ఇంకా చాలానే ఆమె పేర్కొన్న ఆ జాబితాలో ఉన్నాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
ప్రాథమికంగా ఎవరిష్టం వారిదే
విజయనగరం అర్బన్: ప్రాథమిక విద్యారంగంలో కొన్ని నెలలుగా చర్చనీయాంశమవుతున్న ఉమ్మడి పరీక్షాపత్రం, మూల్యాంకన ప్రక్రియపై సందిగ్ధం వీడింది. ఈ ఏడాదికి 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష విధానం లేదని, పూర్తిస్థాయిలో వచ్చేఏడాది నుంచి అమలు చేస్తామని ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతి విద్యార్థులందరికీ ఒకే తరహా ప్రశ్నపత్రంతో ఈ ఏడాది సమ్మెటివ్-3 (తుది పరీక్షలు) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. ఇప్పటి వరకు వేర్వేరు రకాల పాఠ్యపుస్తకాలు, వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉపయోగించి ఆయా తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. జిల్లాల వారీగా ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉండేవి. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రమాణాల పరంగా తేడా ఉండేది. ఈ కారణంగానే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రాథమిక స్థాయి తరగతులకు ఉమ్మడి పరీక్ష విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరాయి. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో ఏకీకృత ప్రశ్నపత్రాన్ని ఇచ్చే విధానాన్ని ఈ ఏడాదికి విరమించుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి 5వ తరగతిలోపు వారికి ఉమ్మడి పరీక్ష పత్రం విధానం నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ పాఠశాలలు ఊరట చెందుతున్నాయి. పాత పద్ధతుల్లోనే ఈ ఏడాదికి ప్రాథమిక స్థాయి పరీక్షలను నిర్వహించే వెసులుబాటు లభించింది. అయితే 6వ తరగతి నుంచి 9వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఈ ఏడాది నుంచే కామన్ ప్రశ్నపత్రంతో పరీక్షలు జరపనున్నారు. జిల్లాలో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1,45,300 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 1,05,600 మంది, మిగిలిన 39,700 మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు. ఈ సంఖ్యతో మొత్తం ప్రశ్నపత్రాలకు జిల్లానుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికే జిల్లా డీసీఈబీకి అందిన సీడీల ఆధారంగా ప్రశ్నపత్రాల ముద్రణ పూర్తయింది. వాటిని నిర్దేశిత కేంద్రాల ద్వారా మండలాలకు పంపిణీ చేయనున్నారు. వీరికి ఏప్రిల్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా పరీక్షలు జరపనున్నారు. గతంలో జిల్లాలోని వివిధ సబ్జెక్టుల నిపుణులు ప్రశ్నపత్రాలు రూపొందించే వారు. ఇప్పుడు ఎస్సీఈఆర్టీ నిపుణులు రూపొందించిన ప్రశ్నావళికి విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల యాజమాన్యాల్లోని పాఠశాలలకు ఒకే తరహా పరీక్ష ఉంటుంది కాబట్టి. హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉండదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎలిమెంటరీకి మినహాయింపు దీనిపై జిల్లా డీసీఈబీ కార్యదర్శి తవిటినాయుడు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరపనున్నట్లు వెల్లడించారు. 6 నుంచి 9వ తరగతుల వారికి ఉమ్మడి పరీక్ష విధానం ఈ ఏడాది నుంచే అమలుచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
చదువులు సాగేనా..!
ప్రాథమిక విద్యకు ప్రభుత్వం తూట్లు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ఆందోళనలో ఉపాధ్యాయులు జిల్లాలో సింగిల్ టీచర్ల పాఠశాలలు 716 వీటిలో విద్యార్థులు సుమారు 8 వేలు అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 122 వీరఘట్టం : సరిపడినంత ఉపాధ్యాయుల ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువులు అరకొరగా ఉంటాయనేది నానుడి. దీనిని బట్టి ఏకోపాధ్యాయ పాఠశాలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టాడంటే ఆ రోజు పాఠశాలకు సెలవే. టీచర్లకు కూడా వివిధ పనుల నిమిత్తం మండల కార్యాలయాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో బడి బందే. జిల్లాలో 2,593 ప్రాథమిక పాఠశాలలు ఉండగా వీటిలో 716 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠ శాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టాలంటే ముందుగా మండల విద్యాశాఖాధికారికి సమాచారం ఇవ్వాలి. ఆయన ఎవరినైనా డిప్యూటేషన్ మీద పంపాలి. పొరపాటున డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయుడు వెళ్ళకపోతే పాఠశాల మూత పడాల్సిందే. అయితే ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులే ప్రత్యామ్నా య టీచర్‌ను నియమించి సెలవు తీసుకోవాలి. ఇలాంటి పరి స్థితుల్లో పాఠశాలలో విద్యార్థులకు చదువులు అంతంతమాత్రంగానే అందుతాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు.... జిల్లాలో 716 సింగల్ టీచర్ పాఠశాలలుండగా సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. అసలు ఉపాధ్యాయులే లేని పాఠశాలలు 122 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 1000కి పైబడి విద్యార్థులు ఉన్నారు. వీరఘట్టం మండలంలో పాపంపేట, కుంబిడి, కొంచ, జె.గోపాలపురం గ్రామాల్లో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. గదబవలస, శృంగరాయిపురం, గాదెలంక, సింధునగరం తదితర గ్రామాల్లో పలు కారణాలతో పాఠశాలలు మూతపడుతున్నాయి. విద్యార్థుల శాతం తగ్గడంతో గతంలో పాఠశాలలో ఏకోపాధ్యాయులు బదిలీపై వెళ్ళడంతో అక్కడికి ఎవరూ రాకపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ గ్రామాల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ విద్యను ఎలా బలహీనపరచాలో ప్రస్తుత ప్రభుత్వం చేతల్లో చూపిస్తుంది. ప్రైవేటు విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయూలు పరోక్షంగా సహకరిస్తున్నారుు. ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే మన పాలకులు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేసి అమలు చేస్తున్నారుు. దీంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ ఉనికిని కోల్పోతున్నారుు. ఇందులో ప్రభుత్వ పాలకుల్లోనే ఒకరిద్దరు తమ వంతు పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పేదవాడి చెంతకు ప్రాథమిక విద్యను అందించాల్సిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి క్రమేణ తప్పుకోవాలని చూస్తుంది. దీంతో వాటి మనుగడకే ముప్పు వాటి ల్లుతుంది. భర్తీ చేస్తాం... ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి దేవానంద్‌రెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా సింగిల్ టీచర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయ పోస్టులు మంజూరవుతాయన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తరచూ ఉపాధ్యాయులు, గ్రామసర్పంచ్, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
పుట్టగొడుగుల్లా ప్లే స్కూళ్లు
గ్రేటర్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు 3 వేలు ♦ లెక్కతేల్చిన జంట జిల్లాల విద్యాశాఖలు ♦ రిజిస్ట్రేషన్ల కోసం యాజమాన్యాలు క్యూ.. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల లెక్క తేలింది. కేవలం పూర్వ ప్రాథమిక విద్య కోసమే ఏర్పాటైన స్కూళ్లు దాదాపు 1,200 వరకు ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. అంతేగాక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుమతి తీసుకుని.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను కూడా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఇటువంటి స్కూళ్లు దాదాపు 2 వేలు ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండు కేటగిరీల్లో కలుపుకుంటే 3 వేల వరకు ప్రీ ప్రైమరీ విద్యనందించే స్కూళ్లు ఉన్నాయి. అనుమతి లేకుండా సాగుతున్న వీటి కట్టడికి ప్రభుత్వం పగ్గాలు వేసేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద స్టార్ కిడ్స్ ప్రీమియంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో చిన్నారి జైనబ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనతో మేల్కొన్న సర్కారు... ప్రీ ప్రైమరీ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్లే స్కూళ్ల నిర్వహణపై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్.. ఆయా జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా జంట జిల్లాల డీఈఓల సూచనల మేరకు డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్‌లు, ఎంఈఓలు అనుమతి లేని ప్లే స్కూళ్లను గుర్తించారు. వెంటనే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని ఈ స్కూళ్లకు నోటీసులు జారీచేశారు. రూ. 10 వేల చొప్పున జరిమానా.. వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లను కొనసాగించాలంటే.. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ లోపే విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గడువులోగా అనుమతి పొందాలనుకుంటే రూ. 10 వేల ఎన్ఎస్సీ బాండ్ అందజేయాలి. ఈ గడువు దాటిపోయినా.. అనుమతి కోసం ముందుకు రాని స్కూళ్లకు నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన డిసెంబర్ నెల నేటితో మొదలైంది కాబట్టి... ఇప్పటికీ అనుమతి తీసుకోని ప్రతి ప్లే స్కూల్ రూ. 20 వేల జరిమానాను ప్రభుత్వానికి విధిగా చెల్లించాలి. అక్టోబర్ నాటికి బాండ్ రూపంలో చెల్లించే రూ. 10 వేలు కాక ఇవి అదనం. ప్రభుత్వ తీరుతో అనుమతి కోసం స్కూళ్ల యాజమాన్యాలు పెద్ద ఎత్తున ముందుకొస్తుండడం విశేషం. ఆ స్కూళ్లకూ తప్పనిసరి..: ఒకటి నుంచి పదో తరగతి బోధన వరకు అనుమతి పొందిన చాలా పాఠశాలల్లో.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ విద్యను అందజేస్తున్నారు. ఈ స్కూళ్లు ఇకపై ప్రీ ప్రైమరీ విద్య కోసం తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ యాజమాన్యాలకు కూడా నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా వర్తిస్తుంది. -
‘అభియాన్’కు నిధుల కోత?
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి, జవజీ వాలు కల్పించేందుకై ఉద్దేశించిన సర్వశిక్ష అభి యాన్ (ఎస్ఎస్ఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల కోతను అమలు చేయనుంది. ఇంతవరకు ఈ నిధులను 65:35 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు భరిస్తూ వస్తున్నాయి. అయి తే తాజాగా ఈ నిష్పత్తిని 50:50గా మార్చేం దుకు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రణాళి కను రూపొందించడంపై విద్యాభిమానులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం వైఖరి ఫలితం గా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి సౌకర్యాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉం ది. ఉపాధ్యాయ నియామకాల భర్తీ ఎండమా విగా మారవచ్చు. నిరుద్యోగుల పాలిట శాపం గా పరిణమించడం ఖాయమని స్పష్టమవు తోంది. ఇప్పటికే సర్కారీ విద్యా రంగం పరి స్థితి అగమ్యగోచరంగా ఉంది. విభజనలో చిక్కి శల్యమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో బక్కచిక్కిన రాష్ట్రాలు అదనంగా 15 శాతం నిధులను భరించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురవుతుంది. సర్వశిక్ష అభియాన్ పథ కానికి నిధుల కోతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైఖరిని సూటిగా ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే విద్యావ్యవస్థ మరింత పతనం కావడం ఖాయం. నిధుల కోత వల్ల కార్పొరేట్ శక్తులు మరింత బలపడతాయి. బడు గు, బలహీనవర్గాల పిల్లలు అన్ని విధాల నష్ట పోతారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర పెత్తనాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రా నికి న్యాయం జరిగేలా చూడాలి. లేకపోతే పాలకులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. - వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా మొబైల్: 9490528730 -
వింటే కదా.. నేర్చుకునేది!
- తూతూ మంత్రంగా ‘విందాం - నేర్చుకుందాం - కొరవడిన అధికారుల పర్యవేక్షణ - నీరుగారుతోన్న ప్రభుత్వ లక్ష్యం అనంతపురం ఎడ్యుకేషన్ : పిల్లలకు ప్రాథమిక విద్యను గుణాత్మకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతు ల విద్యార్థుల కోసం ‘విందాం - నేర్చుకుందాం’ రేడియో పాఠాలను ఉదయం 11 నుంచి11.30 గంటల దాకా ప్రసారం చే స్తోంది. ఈ ఏడాది జులైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2016 మార్చి ఆఖరు వరకు కొనసాగించాల్సి ఉంది. కార్యక్రమ నిర్వహణ ఇలా... పిల్లలను అర్థవృత్తాకారంలో కూర్చోబెట్టాలి. పిల్లలతోపాటు టీచరు కూడా శ్రద్ధగా రేడియో పాఠం వినాలి. ఇదే సమయంలో సాం కేతిక పదాలు, ముఖ్యాంశాలు, ఆసక్తికర సంభాషణలను నోట్ బుక్కులో నమోదు చేయాలి. పిల్లల ప్రతిస్పందనలు నమోదు చేయాలి. రేడియో పాఠం ముగిసిన తర్వాత పిల్లలతో మాట్లాడాలి. ముందుగా పిల్లలను సాధారణ ప్రశ్నలు అడగాలి. నమోదు చేసుకున్న సాంకేతిక పదాల అర్థాలను వివరించాలి. అమలుతీరు ఇలా... చాలా స్కూళ్లలో నేటికీ ఈ విందాం-నేర్చుకుందాం అనే రేడియో కార్యక్రమం ఉందనే విషయం విద్యార్థులకు తెలియదు. జిల్లా కేం ద్రంలోని స్కూళ్లలోనే సరిగా అమలు కావడం లే దు. రేడియో సిగ్నల్ సరిగా పని చేయలేదంటూ కారణాలు చెబుతున్నారు. మరి కొన్నిచోట్ల రేడియో ఆన్ చేసేసి ఉపాధ్యాయులు వారి గదిలోకి వెళ్లిపోతూ కార్యక్రమం అయిందనిపిస్తున్నారు. పట్టించుకోని ఎస్ఎస్ఏ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన ఎస్ఎస్ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అమలుపై తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించారు. సుమారు రూ. 40 వేలు విలువైన కరదీపికలు పాఠశాలలకు పంపారు. చాలా స్కూళ్లలో ఆ కరదీపికలను తెరిచి కూడా చూడలేదని సమాచారం. లోపాలు వాస్తవమే ‘విందాం-నేర్చుకుందాం’ అమలులో లో పాలు ఉన్న మాట వాస్తవమే. ఎస్ఎస్ఏ అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చే యాలి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. పర్యవేక్షణ పెంచి అన్ని స్కూళ్లలోనూ అమలయ్యేలా చూస్తాం. - చెన్నకృష్ణారెడ్డి, ఏఎంఓ -
మన్యంలో ప్రాథమిక విద్య పటిష్టం చేయాలి
క్లస్టర్ స్కూల్స్ విధానం వద్దు అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ పాడేరు: క్లష్టర్ స్కూల్స్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన లను విరమించుకోవాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ప్రభుత్వానికి సూచించా రు. ఆమె శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ క్లష్టర్ విధానం వల్ల ప్రాథమిక విద్య నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించి పటిష్ట పర్చాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో సక్సెస్ పాఠశాలలు, మోడల్ పాఠశాలల వంటి ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు క్లష్టర్ స్కూల్స్ విధానం కూడా ప్రాథమిక విద్యకు తూట్లు పొడుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉన్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఆధునిక విద్య అందుబాటులో లేదని, చాలా గిరిజన గ్రామాల్లో బడిఈడు పిల్లలు డ్రాపవుట్ అవుతునే ఉన్నారని ఆమె చెప్పారు. ఏజెన్సీలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనంగా టీచర్ పోస్టులను మంజూరు చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని ఆమె కోరారు. ఉపాధ్యాయ సంఘాలూ వ్యతిరకమే: క్లష్టర్ స్కూల్ విధానం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనను ఏజెన్సీలోని ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్లష్టర్ స్కూల్స్ వల్ల గిరిజన బాలలు ప్రాథమిక విద్యకు దూరమవుతారని, టీచర్ పోస్టులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి కొత్త విధానాలను అవలంబించేందుకు ప్రయత్నిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి క్లష్టర్ స్కూళ్ల విధానాన్ని వ్యతిరేకించడాన్ని పట్ల ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. మన్యంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని డిమాండ్ చేశాయి. -
మండలానికి మూడే స్కూళ్లు!
* గ్రామానికి ఒక పాఠశాల విధానానికి మంగళం * క్లస్టర్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక విద్యకు తూట్లు * పైలట్ ప్రాజెక్టుగా వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో అమలు * వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. * తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సాక్షి, విజయవాడ బ్యూరో: క్లస్టర్ స్కూళ్ల పేరుతో రాష్ట్రంలో ప్రాథమిక విద్యారంగాన్ని కుప్పకూల్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే విధానానికి స్వస్తిపలికి ప్రతి మండలంలో 3 స్కూళ్లు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామాల్లో పాఠశాలలను మూసివేసి వాటి స్థానంలో ఒకేచోట క్లస్టర్ స్కూలు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళుతోంది. డ్రాపవుట్లు, ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. డ్రాపవుట్లను తగ్గించి తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాల్సిన ప్రభుత్వం ఏకంగా స్కూళ్లనే ఎత్తేయడానికి సిద్ధమైంది. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పది కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లన్నింటినీ కలిపి ఒకేచోట పెట్టాలని నిర్ణయించింది. మండలంలో మిగిలిన గ్రామాలకు మధ్యలో ఉండి, విద్యా ప్రమాణాలు బాగున్న స్కూలును ఎంపిక చేసి అన్ని స్కూళ్లను దాన్లో విలీనం చేస్తారు. తొలిదశలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను.. ఎంపిక చేసిన స్కూలులో విలీనం చేసి దాన్ని క్లస్టర్ స్కూలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. క్లస్టర్ స్కూలులో ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెబుతూ కనీసం వెయ్యిమంది పిల్లలుండేలా చూడాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీన్ని మొదట వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి, వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ద్వారకా తిరుమల మండలంలో రంగం సిద్ధం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి, పంగిడిగూడెం, ద్వారకాతిరుమలలో మూడు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మండలంలో 66 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. పిల్లల సంఖ్య, దూరాన్ని బట్టి 13 క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని మండల విద్యాశాఖాధికారి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం మూడు క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఇదే తరహాలో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో 45,663 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 42,77,193 మంది చదువుతున్నారు. మండలానికి మూడు లెక్కన 667 మండలాలకు 2,001 స్కూళ్లను మాత్రమే ఉంచి వాటిని కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే మిగిలిన 43,662 స్కూళ్లను మూసివేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అన్ని స్కూళ్లను ఒకేసారి కాకుండా దశల వారీగా ఎత్తేయాలని చూస్తున్నారు. మరీ తీవ్ర వ్యతిరేకత వస్తే ప్రతి మండలంలో ఇంకో రెండు, మూడు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆందోళన క్లస్టర్ స్కూళ్ల విధానాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల అందుబాటులోకి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఇప్పుడు వాటిని మూసేసి మండలానికి మూడు మాత్రమే పెద్ద స్కూళ్లు పెడితే మారుమూల గ్రామాల పిల్లలు అక్కడికి వెళ్లి చదువుకోవడం ఎలా సాధ్యమో అంతుబట్టని ప్రశ్నగా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
అధ్వానంగా ప్రాథమిక విద్య
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల స్థితిగతులు, విద్యా ర్థుల నైపుణ్యంపై జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యాట్రస్టు ఇటీవల విడుదల చేసిన సరికొత్త వార్షిక విద్యాస్థితి నివేదికలోని పలు అంశాలు ఆం దోళనకు గురిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల లోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే 5వ తరగతి విద్యార్థులకు రెండో తరగతి పాఠ్య పుస్తకం కూడా చదవడం రాదని తేలింది. మూడొంతుల మంది సాధారణ తీసివేతలు, భాగహారాలు చేయలేకున్నారని తెలిపింది. మౌలిక వసతుల కల్పన కోసం పాఠశాలలకు కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతోందో ప్రభుత్వ పకడ్బందీగా సమగ్ర పరిశీలన చేయాలి. బి. ప్రేమ్ కుమార్, వినాయక్‌నగర్, నిజామాబాద్ -
ప్రాథమిక విద్యలో సున్నా
పిల్లలకు అక్షరాలు నేర్పడంలో ప్రాథమిక పాఠశాలలు యధావిధిగా విఫలమవుతున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యా ట్రస్టు విడుదల చేసిన సరికొత్త వార్షిక విద్యాస్థితి (ఆసర్) నివేదిక వెల్లడించింది. అయిదో తరగతి చదువుతున్న పిల్లలు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవలేని స్థితిలో ఉన్నారని... మూడొంతులమందికి సాధారణ తీసివేతలు, భాగాహారాలు చేయడం సైతం కష్టమవుతున్నదని ఆ నివేదిక అంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ బడుల్లోనే ప్రధానంగా ఈ దుస్థితి నెలకొన్నదని వెల్లడించింది. దేశంలోని 577 జిల్లాల్లో వివిధ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 5,70,000 మంది పిల్లల స్థితిగతులను మదింపు వేసి ఈ నివేదికను సమర్పించింది. ఈ సంస్థ 2005 మొదలుకొని యేటా ఇలాంటి నివేదికలను రూపొందిస్తుండగా... వీటినుంచి ప్రభుత్వాలు మాత్రం ఏమీ నేర్చుకోవడం లేదని, పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడంలేదని ప్రతిసారీ నిరూపణ అవుతున్నది. ఈమధ్యలో ఎంతో ఆర్భాటంగా విద్యాహక్కు చట్టం వచ్చిచేరింది. 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన ఆ చట్టంవల్ల 6-14 ఏళ్ల వయసుగల విద్యార్థుల చేరిక అయితే పెరిగింది. అయితే దీనికి దీటుగా పిల్లల హాజరు శాతం ఉండటం లేదని నివేదిక అంటున్నది. 2010లో పిల్లల హాజరు 73.4 శాతం ఉంటే అదిప్పుడు 71.1 శాతానికి చేరుకుంది. ఇక టీచర్ల హాజరు శాతానికి వస్తే అప్పుడు 86.4 శాతంగా ఉన్నది కాస్తా ఇప్పుడు 85.8 శాతానికి వచ్చింది. ఇదేదో స్వల్ప తేడాగా మాత్రమే కనిపించవచ్చుగానీ పిల్లలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాల్సిన టీచర్లను పాఠశాలలకు రప్పించడంలో విద్యా హక్కు చట్టం తగినంత ప్రభావం చూపలేకపోయిందని అర్థమవుతుంది. దీనివల్ల పిల్లలు చదువులో తగిన ప్రతిభను కనబర్చలేక పోతున్నారు. ఏడాది తిరిగేసరికి పై తరగతికి వెళ్తున్నారుగానీ అందుకవసరమైన అర్హతలు వారికి సమకూరడంలేదు. ఈ పరిస్థితికి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్లకు పంపి అదనంగా ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. అలాగే వ్యయప్రయాసలకోర్చి ప్రైవేటు బడుల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగోవంతుమంది విద్యార్థులు ట్యూటర్లను ఆశ్రయించవలసి వస్తున్నది. ఇది చివరకు పిల్లలను చదువు మాన్పించే స్థితికి తీసుకెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. పాలకులు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల అభివృద్ధి సాధ్యం కావాలంటే మౌలిక స్థాయి విద్యను పటిష్టం చేయాలని నిపుణులంటారు. వాస్తవానికి విద్యా హక్కు చట్టం తీసుకురావడంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వానిది ఇదే ఉద్దేశం. ఆ చట్టం అమలు మొదలయ్యాక లక్షల కోట్ల రూపాయలతో విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని, ప్రపంచశ్రేణి విద్యకు దీటైన రీతిలో దీన్ని తయారుచేస్తామని అప్పటి కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఆ దిశగా సరైన అడుగులు పడటం లేదని ఆసర్ నివేదికలు అటు తర్వాత ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా ప్రభుత్వాలు మాత్రం దిద్దుబాట పట్టిన దాఖలాలు కనబడలేదు. విద్యా హక్కు చట్టం పేర్కొన్న వసతుల కల్పనలో కొద్దో గొప్పో దృష్టి పెట్టినా ప్రమాణాల విషయాన్ని మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని తాజా నివేదిక గణాంకాల సహితంగా వెల్లడించింది. ఇది నిజానికి ఎంతో ఆందోళన కలిగించే అంశం. సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల ద్వారా పాఠశాలల్లో వసతుల కల్పన దిశగా కొంత కృషి జరిగింది. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థి/ ఉపాధ్యాయుడి నిష్పత్తి ఉన్న పాఠశాలలు తాజాగా 49.3 శాతానికి చేరుకున్నాయి. అలాగే, పాఠశాలలకు అనుబంధంగా గ్రంథాలయాలు, మరుగుదొడ్లు వంటివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. మధ్యాహ్న భోజనం, ఆటస్థలం, తాగునీరు వంటివి కూడా పిల్లలకు అందుబాటులో కొచ్చాయి. అయితే, ప్రమాణాల మెరుగుదలపై మాత్రం ఎవరూ సరిగా దృష్టి పెట్టడంలేదని నివేదిక చెబుతున్నది. రెండో తరగతి పిల్లల్లో 19.5 శాతంమంది 0-9 మధ్య అంకెలను గుర్తించలేకపోతున్నారు. అంతక్రితం ఇలాంటి పిల్లల సంఖ్య 17.6 శాతం ఉంటే అది ఇప్పుడు దాదాపు రెండు శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. గణిత బోధనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు గతంలో ఉన్న స్థానంలోనే ఉండగా చాలా రాష్ట్రాల్లో అధ్వాన్నస్థితి ఏర్పడింది. గణిత బోధనలో టీచర్లకిచ్చే శిక్షణ తగిన విధంగా లేకపోవడంవల్లే ఈ స్థితి ఏర్పడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు నిబంధనల చట్రంనుంచి కాక సృజనాత్మకంగా ఆలోచిస్తే పరిష్కారాలు లభిస్తాయి. తమిళనాడులో అమలు చేస్తున్న ఒక విధానం ఈ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని నివేదిక చెబుతున్నది. పిల్లల్లో చదివే సామర్థ్యం విషయంలోగానీ, గణితం విషయంలోగానీ మిగిలిన రాష్ట్రాలకంటే తమిళనాడు మెరుగ్గా ఉంది. ఇందుకు కారణం అక్కడ తరగతులను బహుళ వయస్సు పిల్లల తరగతులుగా మార్చడమేనని నిపుణులు చెబుతున్నారు. పిల్లల వయసునుబట్టి పై తరగతులకు పంపడంకాక చదవడంలో వారికుండే ప్రతిభ కొలమానంగా తరగతిని నిర్ణయించే విధానం అక్కడ అమలు చేస్తున్నారు. భిన్న వయసులున్న వారైనా దీనివల్ల పోటీపడి చదివే మనస్తత్వం పెరిగినట్టు గుర్తించామని అక్కడి వారు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలను ఇతరచోట్ల కూడా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునంటున్నారు. యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ఎన్డీయే సర్కారు కూడా ఉన్నత విద్యారంగంపై దృష్టిసారించింది. ఐఐటీలు, ఐఐఎంలవంటివి నెలకొల్పడంలో ఉత్సాహం చూపుతున్నది. పునాది స్థాయిలో పటిష్టతకు ప్రాధాన్యమివ్వకుండా తీసుకునే ఇలాంటి చర్యలవల్ల పెద్దగా ఉపయోగం ఉండదని గుర్తించాలి. ప్రాథమిక విద్యారంగంలో నెలకొన్న ఒక పెద్ద సంక్షోభాన్ని ఆసర్ నివేదిక కళ్లకు కడుతున్నది. పట్టించుకోవాల్సింది, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. -
నియోజకవర్గానికో ఉపవిద్యాధికారి
మంచిర్యాల సిటీ : ఉచిత నిర్బంధ విద్యను పటిష్టంగా అమలుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా పర్యవేక్షణపై మొదటగా దృష్టి సారించింది. పర్యవేక్షణ పకడ్బందీగా లేనిదే మెరుగైన విద్యనందించడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో శాసనసభ నియోజకవర్గానికో ఉప విద్యాధికారిని నియమించాలని భావిస్తోంది. విద్యాశాఖలో అడ్డగోలుగా ఖాళీలు ఉండడంతో ప్రాథమిక విద్య అడుగుంటిపోతోందని ఉపాధ్యాయ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఒక్క జిల్లా విద్యాధికారితోపాటు ముగ్గురు మండల విద్యాధికారులే శాశ్వత అధికారులుగా పని చేస్తున్నారు. 49 మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే ఉన్నారు. పెరుగనున్న పోస్టులు జిల్లాలో ప్రస్తుతానికి మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఇద్దరు ఇన్చార్జి డెప్యూటీ ఈవోలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గానికి ఒకరు చొప్పున భర్తీ చేస్తే.. 10 నియోజకవర్గాలకు పది మంది ఉపవిద్యాధికారులు నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియోజక వర్గాలు పెంచాలని సీఎం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. నియోజకవర్గాలు పెరిగితే అందుకు అనుగుణంగా మరిన్ని పోస్టులూ పెరుగుతాయి. తగ్గనున్న భారం నియోజకవర్గానికో ఉప విద్యాధికారి నియామకమైతే వారికి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్నవారు 20కి పైగా మండలాలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం ఒక్కరితో సాధ్యం కాదు. నియోజకవర్గానికి ఒకరిని నియమిస్తే పరిపాలన సులభమవుతుంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందే అవకాశాలు ఉంటాయి. సర్వశిక్ష అభియాన్‌కు విద్యాశాఖ అధికారులే.. సర్వశిక్ష అభియాన్‌కు ఇన్నేళ్లుగా విద్యాశాఖకు సంబంధం లేని అధికారులే ప్రాజెక్టు అధికారులుగా నియమితులయ్యేవారు. కేంద్రం ఆదేశాల ప్రకారం పీవో పోస్టులు డీఈవో అజమాయిషీలోనే ఉండాలి. నాలుగేళ్ల కిందట ఈ విధానానికి స్వస్తి పలికింది. ఇతర విభాగాలకు చెందిన అధికారులను నియమించడంతో విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులనే నియమించి ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగేళ్ల కిందటి మాదిరిగా అసిస్టెంట్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
సివిల్స్‌లో సత్తాచాటిన రైతు బిడ్డ
- వేంపల్లె మహేంద్రకు 694 ర్యాంకు - ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్కు ఎంపికయ్యే అవకాశం మదనపల్లె రూరల్: సివిల్స్ ఫలితాల్లో మదనపల్లె మండలానికి చెందిన రైతు బిడ్డ తంబా మహేంద్ర సత్తాచాటాడు. జాతీయస్థాయిలో 694వ ర్యాంకును సాధించాడు. మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ తాలిపల్లెకు చెందిన రైతు కూలీ తంబా జగదీశ్వర్, కుప్ప మ్మ దంపతుల పెద్ద కుమారుడు మహేంద్ర. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ మదనపల్లె బీటీ కళాశాలలో చదివారు. శ్రీవేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రయివేటు సంస్థలో పనిచేస్తూ గత ఏడాది డిసెంబర్లో సివిల్స్ మెయిన్ పరీక్ష రాశారు. వాటి ఫలితాలు గురువారం వెలువడ్డాయి. 694వ ర్యాంకు సాధించారు. ఈయన ఐపీఎస్ లేదా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. 2010 నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు సాధిం చాడు. తమ గ్రామానికి చెందిన రైతుబిడ్డ సివిల్స్‌లో ర్యాంకు సాధించారని తెలుసుకుని గ్రామస్తులు హర్షాన్ని వెలిబుచ్చారు. చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబర్చే మహేంద్ర కష్టపడి ఉన్నత చదువులు చదివాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
పంచాయుతీలకు అధికారాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం అధికారాలను బదలాయించడంతోపాటు, జవాబుదారీతనం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలపై కేసీఆర్ సమీక్షించారు. పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారాలు బదలాయించాలని, ప్రాథమిక విద్యను పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని పేర్కొన్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేద్దామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర పథ కం ఆసరాగా గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి తారకరామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యారు. -
ప్రాథమిక విద్య - సమస్యలు - పరిష్కారాలు
మనదేశంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. తల్లిదండ్రులందరూ పిల్లలను తమ స్థాయికి తగ్గ పాఠశాలలో చేర్పిస్తున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య అనేక హంగులతో హంగామా చేస్తోంటే... సర్కారు బడుల్లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. అటు పాలక ప్రభుత్వాలు మాత్రం ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ పలు పథకాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయి. కారణం లోపభూయిష్ట విధానాలు, ఆచరణలో ఎడతెగని నిర్లక్ష్యమే. దీన్ని అధిగమించాలంటే సమర్థనీయ సంస్కరణలే శరణ్యమని తెలిపే వ్యాసం ఈ వారం ప్రత్యేకం. పాఠశాల విద్య- అక్షరాస్యత: ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు విద్యా ప్రమాణాల అందుబాటుకు సంబంధించి ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. పనిచేసే జనాభా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (25 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జనాభా ఎన్నేళ్లు విద్యను పూర్తి చేశారో వాటి సగటునే మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటారు) 2000 సంవత్సరంలో 4.19 సంవత్సరాలు. అదే 2010 సంవత్సరంలో 5.12 సంవత్సరాలకు పెరిగింది. ప్రాథమిక విద్యలో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) నిష్పత్తిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. సెకండరీ విద్యలో విద్యార్థుల నమోదు వృద్ధి 1990వ దశకంలో సగటు 4.3 శాతం కాగా 2009-10 నాటికి 6.27 శాతానికి పెరిగింది. యువకులలో అక్షరాస్యత 1983లో 60 శాతం ఉంటే 2009-10లో 91 శాతానికి పెరిగింది. వయోజనుల విషయానికొస్తే 2001లో 64.8 శాతం ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 74 శాతానికి పెరిగింది. ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నా: జాతీయాభివృద్ధిలో విద్యారంగ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017)లో విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాల పెంపు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ రంగంలో సమాన అవకాశాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ఈ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయాన్ని 11వ పంచవర్ష ప్రణాళికలో రూ.12,44,797 కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తంలో 35 శాతం ప్రణాళికా వ్యయం కాగా మిగిలిన 65 శాతం ప్రణాళికేతర వ్యయం. విద్యకు సంబంధించి మొత్తం ప్రభుత్వ వ్యయంలో 43 శాతం ప్రాథమిక విద్యపై 25 శాతం సెకండరీ విద్యపై, మిగతా 32 శాతం ఉన్నతవిద్యపై వెచ్చించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పై చేసిన ఖర్చులో ప్రాథమిక విద్యపై 39 శాతం, సెకండరీ విద్యపై 12శాతం, ఉన్నత విద్యపై 50శాతం కేటాయించా యి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే.. పాఠశాల విద్య 75శాతం వాటా కలిగి ఉంది. ఇందులో ప్రాథమిక విద్య వాటా 44 శాతం కాగా, సెకండరీ విద్య వాటా 30 శాతం. ప్రాథమిక విద్యారంగం-సమస్యలు, అనుభవాలు: 11వ పంచవర్ష ప్రణాళికలో అనేక రంగాలలో ఆశించిన మేర విజయాలు సాధించిన భారత ఆర్థిక వ్యవస్థ విద్యారంగంలో మాత్రం పలు సవాళ్లను ఎదుర్కొంది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (ఎం.వై.ఎస్.) తక్కువ స్థాయిలో ఉంది. పొరుగు దేశమైన చైనా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్‌లో మన కంటే ఎంతో ముందంజలో ఉంది. ఆ దేశంలో 8.17 సంవత్సరాలు కాగా, బ్రెజిల్లో 7.54 సంవత్సరాలు. ఇక మన దేశం విషయానికి వస్తే 5.12 సంవత్సరాలు గానే నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కన్నా (7.09 సంవత్సరాలు) భారత్‌లో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ తక్కువే అని చెప్పవచ్చు. ప్రాథమిక విద్య తర్వాత విద్యార్థులలో డ్రాపౌట్ (మధ్యలో చదువును ఆపినవారు) రేటును భారత్‌లో ఎక్కువ గమనించవచ్చు. ప్రాథమిక విద్య, హయ్యర్ సెకండరీ విద్య మధ్య నమోదు నిష్పత్తిలో అంతరం మనదేశంలో చాలా తక్కువ. జాతీయ సగటు కన్నా ఎస్సీలు, ఎస్టీ తెగల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. {పాథమిక విద్యలో బడిలో నమోదైన పిల్లల నిష్పత్తిలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ,విద్యార్థుల హాజరుకు సం బంధించి వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు పెరిగాయి. విద్యాపరంగా వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో విద్యార్థుల హాజరురేటు 60 శాతం కన్నా తక్కువగా నమోదవుతున్నది. {పాథమిక విద్యలో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ లభ్యతలో పురోగతి కనిపిస్తోంది. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కేటాయింపుల కారణంగా జాతీయస్థాయిలో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 27ః1 కు చేరుకుంది. మరోవైపు విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో వివిధ రాష్ట్రాలలో వ్యత్యాసాలు పెరిగాయి. సరైన శిక్షణలేని ఉపాధ్యాయుల సంఖ్య బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో 8.1 లక్షలుగా ఉన్నారని అంచనా. {పాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉండటం ప్రస్తుతం ఒక సవాల్‌గా మారింది. అదే తరగతి స్థాయికి సంబంధించి ఇతర దేశాల విద్యార్థుల అభ్యసన స్థాయి కన్నా భారత విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉంది. విద్యారంగ పరంగా అన్ని స్థాయిలలో నమోదులో పెరుగుదల, భౌతిక అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ, బలహీనమైన సాంప్రదాయ విద్య ద్వారా ఆశించిన ప్రయోజనాలు సమకూరడం లేదు. 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటును 50 నుంచి 20 శాతానికి తగ్గించాలని లక్ష్యం. ఈ విషయంలో కొంతమేర పురోగతి సాధించినప్పటికీ జాతీయ సగటు డ్రాపౌట్ రేటు 42.39 శాతంగా నిలవడం ఆందోళన కలిగించే పరిణామం. ఎస్సీ, ఎస్టీయేతర విద్యార్థులలో డ్రాపౌట్ రేటు 37.22 శాతం కాగా ఎస్సీ విద్యార్థులలో 51.25 శాతం, ఎస్టీ విద్యార్థులలో 57.58 శాతంగా నమోదు కావడాన్ని బట్టి వివిధ సామాజిక వర్గాల విద్యార్థులలో డ్రాపౌట్ రేటు వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం అమలుతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ విద్యా పథకం (టీచర్ ఎడ్యుకేషన్ స్కీమ్), మహిళా సమాఖ్య, మైనారిటీ విద్యాసంస్థలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, మదర్సాలలో నాణ్యత గల విద్య అందించడం లాంటి పథకాలను అమలుచేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాథమిక స్థాయిలో పిల్లల నమోదు (ఎన్రోల్మెంట్) జరగటం లేదు, విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య, వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు పెరిగాయి. ప్రాథమిక విద్య - ఆంధ్రప్రదేశ్: భారత్‌లోని ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు, స్త్రీ-పురుష అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి. తల్లిదండ్రులలో తక్కువ అక్షరాస్యతా స్థాయి, పేదరికం, అందుబాటు లో లేని పాఠశాలలు, మృగ్యమైన మౌలిక సౌకర్యాల కల్పన పర్యవసానం అక్షరాస్యత విషయంలో ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుకు కారణం. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయింపు తక్కువగా ఉంది. 1995 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యలో ఏ విధమైన మార్పునూ పాలక ప్రభుత్వాలు తీసుకురాలేదు. 1996లో ప్రాథమిక విద్యను ఒక కార్యక్రమంగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (డిపెప్) ప్రవేశపెట్టడం ద్వారా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 1996లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేశారు. పాఠశాల వ్యవస్థలో సామాజిక యాజమాన్య ప్రక్రియ ద్వారా ప్రాథమిక విద్యను సార్వత్రికం చేసే క్రతువులో భాగం గా సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేశారు. బాలికలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్లో విద్యావ్యాప్తికి ఈ పథకం చేయూతనిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మొదటగా ఉభయగోదావరి జిల్లాలలో ప్రవేశపెట్టి 2002-03 నాటికి ఇతర జిల్లాలకు విస్తరించారు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ (ఓబీబీ), చదువుల పండగ,మళ్లీ బడికి, మధ్యాహ్న భోజన పథ కం లాంటి కార్యక్రమాలను అమలు పరిచింది. 2005లో వి ద్యార్థుల్లో భాషాభివృద్ధి కార్యక్రమం(ఛైల్డ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్-క్లిప్),2009లో ఎల్ఈపీ కార్యక్రమాన్ని ప్రాథమిక విద్యా బోధనలో భాగంగా ప్రవేశపెట్టారు. 2010లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు స్నేహబాల కార్డులను ప్రవేశపెట్టారు. ఈ కార్డులను ఉపయోగిస్తూ ఉపాధ్యాయులు ఆయా తరగతుల విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించుకోవడం ద్వారా ప్రాథమిక విద్యలో సంతృప్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2011లో ఒకటో తరగతి విద్యార్థులకు ద్వితీయ భాషగా ఆంగ్లంను ప్రవేశపెట్టారు. ఇలా అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రాథమిక విద్యాభివృద్ధికి సర్కారు సకల చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు నిష్పత్తి తక్కువ గానే ఉంది. మూల్యాంకనా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, పాఠశాలలోని పిల్లలకు భద్రతా సౌకర్యాల కొరత, ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వసూలు, పరీక్షా విధానంలో లోపాలు, లింగ వివక్ష, బాలికల విద్య పట్ల అశ్రద్ధ, విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండటం, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి సరిగా లేకపోవడం, ఇప్పటికీ వీడని డ్రాపౌట్ రేటు.... ఇలా మన రాష్ట్రంలోని ప్రాథమిక విద్యను పలు సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రైవేటు పాఠశాలలు అధికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో విస్తరిస్తున్నాయి. -
జయహో... మల్లమ్మా
బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్య కూడా దాటలేదు కానీ కాబోయే ఐఏఎస్ అధికారులకు అభివృద్ధి పాఠాలు చెప్పారు. మహిళా సంఘాల ఏర్పాటుపై, సభ్యుల ఆర్థికాభివృద్ధిపై శిక్షణ ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. మేలైన దిగుబడులు సాధించి సాగులోనూ భేష్ అన్పించడమే గాక ఆదర్శ రైతు అవార్డు కూడా అందుకున్నారు. మహిళా శక్తికి చిరునామాగా నిలిచిన ఆమె పేరు మల్లమ్మ. ఊరు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం. మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా చేరిన ఆమె అనతికాలంలోనే గ్రామ సంఘం లీడర్‌గా ఎదిగారు. సంఘాల ఏర్పాటుతో పాటు పొదుపు, బ్యాంకు రుణాల ద్వారా సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఎంతో కృషి చేశారు. గతేడాది జాతీయ ఆహార భద్రత పథకం కింద మహిళా సంఘం తరఫున నిత్యావసరాలను టోకుగా కొనుగోలు చేసి వాటిని సభ్యులకు చౌక ధరకే, అది కూడా రుణాలపై అందజేయడంలో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిటీ రిసోర్స పర్సన్ (సీఆర్పీ)గా ఎంపికై మహిళా సంఘాల ఏర్పాటు, ఆవశ్యకతపై పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్లగొండ, వైజాగ్, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో అవగాహన కల్పించారు. 2004లో స్టేట్ రిసోర్స పర్సన్ (ఎస్ఆర్పీ)గా అనేక జిల్లాల్లో సంఘాల అభివృద్ధికి పాటుపడ్డారు. మల్లమ్మ జైత్రయాత్ర అంతటితో ఆగలేదు. ఐకేపీ సహకారంతో హిందీ కూడా నేర్చుకున్నారు. 2012లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలో ఏకంగా 182 మంది ఐఎఎస్‌లకు మహిళా సంఘాలపై శిక్షణ ఇచ్చారు. సంఘాల స్థాపన, వాటి ద్వారా మహిళలు ఎలా ఆర్థికాభివృద్ధి సాధించారనే దానిపై కేస్ స్టడీలతో సహా శిక్షణ ఇచ్చి ఔరా అన్పించారు. వరి, వేరుశనగలో వినూత్న పద్ధతుల ద్వారా మేలైన దిగుబడులు సాధించడంతో పాటు పాడి ఉత్పత్తిలోనూ ప్రగతి సాధించినందుకు కృషి విజ్ఞాన కేంద్రం 2013లో మల్లమ్మను మహిళా ఆదర్శ రైతుగా ఎంపిక చేసింది. -
చదువురాని పెద్దలు 28 కోట్లు
ఐరాస: జనాభాలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. దాదాపు 28.7 కోట్ల మంది భారతీయులకు సరస్వతీ కటాక్షం లేదని పేర్కొంది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని వివరించింది. ఐరాస విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ 2013/14’ నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. యునెస్కో నివేదికలో ముఖ్యాంశాలు.. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 % మంది భారతీయులే. సంపన్న, పేద భారతీయుల విద్యాస్థాయిల్లో తారతమ్యాలు అధికం. భారత్‌లో 1991లో అక్షర్యాసత శాతం 48 కాగా 2006 నాటికి ఇది 63కి పెరిగింది. వృద్ధి చెందుతున్న జనాభా సంఖ్య వల్ల నిరక్షరాస్యులూ పెరుగుతున్నారు. భారత్‌లో సంపన్న యువతులు అంతర్జాతీయ అక్షరాస్యతా స్థాయిని చేరుకున్నారు. పేదలు మాత్రం వెనకబడే ఉన్నారు. - అణగారిన వర్గాలు అక్షరాస్యతను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేదంటే ప్రయోజనాలు కొందరికే పరిమితమవుతాయి. - చదువులపై అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ఏటా సుమారు రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. - ప్రాథమిక విద్యపై ప్రపంచ దేశాలు వెచ్చిస్తున్న వ్యయంలో 10 శాతం నాసిరకం విద్యా ప్రమాణాల వల్ల నిరుపయోగంగా మారుతోంది. ఈ - ప్రభావం పేద దేశాలపై పడుతోంది. అక్కడ ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కనీసం ఒక్క వాక్యం కూడా చదవటంలో విఫలమవుతున్నారు. - కేరళలో ఒక్కో విద్యార్థిపై ఏటా ప్రభుత్వం రూ.43,000 చదువు కోసం ఖర్చు చేస్తోంది. - భారత్‌లోని సంపన్న రాష్ట్రాల్లోనూ గణితశాస్త్రంలో పేద బాలికల ప్రదర్శన అట్టడుగు స్థాయిలో ఉంది. - యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పేదరికం ప్రభావం బాలికలపై అధికంగా ఉంది. ఐదో తరగతి కూడా దాటడం గగనమవుతోంది. ఐదుగురిలో ఒక్క బాలికకు కూడా గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు లేవు. - అరకొరగా చదివే విద్యార్థులు త్వరగా బడికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. - కొన్ని దేశాల్లో ఉపాధ్యాయ సంఘాల కృషి ఫలితంగా మెరుగైన ఫలితాలు దక్కాయి. - ఉపాధ్యాయుల గైర్హాజరు కూడా ప్రభావం చూపుతోంది. టీచర్లు తరగతిలో బోధన కంటే ప్రైవేట్‌గా ట్యూషన్లు చెప్పటం తదితర అంశాల వల్ల పేద విద్యార్థుల సామర్థ్యం కుంటుపడుతోంది. -
పాఠశాలలు ‘ఫెయిల్’!
తరగతులు దాటుతున్నా చదవడం రాని విద్యార్థులు ఐదో తరగతిలో భాగించడం వచ్చిన వారు 36.2 శాతమే రెండో తరగతి పుస్తకాలను కూడా చదవలేనివారు 42 శాతం మంది బాలికలకు టాయిలెట్లు ఉన్న పాఠశాలలు 43 శాతమే సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులు తరగతులు దాటుతున్నారే కాని అక్షరాలు, లెక్కలు మాత్రం నేర్వడంలేదు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఆరో తరగతిలో ప్రవేశించే ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఆరుగురికి భాగించడమే రాదని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వార్షిక విద్యా స్థితి (అసర్-2013) నివేదికలో వెల్లడైంది. ఐదో తరగతిలో భాగించడం వచ్చిన వారు 36.2 శాతం మాత్రమే. ఐదో తరగతికి వచ్చినా రెండో తరగతిలోని పాఠ్యాంశాలు చదవగలిగిన వారు 58 శాతమే. ఇక మూడో తరగతిలో తీసివేత చేయగలిగిన వారు 38.1 శాతమే ఉండగా, రెండో తరగతిలో అక్షరాలను గుర్తించలేని వారు 11.4 శాతం కాగా వాక్యాలను చదవలేని వారు 35.2 శాతం మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను ఇటీవల ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా విడుదల చేశారు. దేశవ్యాప్త నివేదికతోపాటు రాష్ట్రాల వారీగా నివేదికలు రూపొందించినట్లు ప్రథమ్ ప్రాజెక్టు డెరైక్టర్ సునీత బుర్రా వెల్లడించారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 616 పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించామని, 621 గ్రామాల్లోని 15,841 మంది విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించామని చెప్పారు. బాలికల టాయిలెట్లు 43 శాతమే: రాష్ట్రంలో 43 శాతం స్కూళ్లలోనే బాలికలు ఉపయోగించేలా ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53.3 శాతం ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. ఇక స్కూళ్లలోని కామన్ టాయిలెట్లలో 55.1 శాతమే ఉపయోగించడానికి వీలుగా ఉన్నాయి. తాగునీటి సదుపాయం 65.1 శాతం స్కూళ్లలోనే ఉంది. గత ఏడాది ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 56.4 శాతం ఉండగా ఈసారి 45.8 శాతానికి తగ్గింది. టీచర్ల హాజరు తక్కువే: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరులోనూ మన రాష్ట్రం వెనుకబడే ఉంది. 1నుంచి 8వ తరగతి వరకున్న స్కూళ్లలో విద్యార్థుల హాజరు మహారాష్ట్రలో 89.5 శాతం, కర్ణాటకలో 83.9 శాతం, తమిళనాడులో 91.3 శాతం, కేరళలో 89 శాతం ఉండగా మన రాష్ట్రంలో 74.9 శాతం ఉంది. ఉపాధ్యాయుల హాజరు మహారాష్ట్రంలో 92.3 శాతం, కర్ణాటకలో 88 శాతం, తమిళనాడులో 88.4 శాతం, కేరళలో 89.2 శాతం ఉండగా మన రాష్ట్రంలో 80 శాతం మాత్రమే ఉంది. మరికొన్ని ప్రధాన అంశాలు... - 6 నుంచి 14 ఏళ్లలోపు వారిలో 97.1 శాతం విద్యార్థులు 2013లో పాఠశాలల్లో చేరారు. ఇందులో ప్రైవేటు స్కూళ్లలో చేరిన వారు 34 శాతం. - ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య 2006లో 18.5 శాతం ఉండగా 2012 నాటికి 36.5 శాతానికి పెరిగింది. బాలికలకంటే బాలురే ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్నారు. - ఒకటో తరగతిలో అక్షరాలు చదవలేని వారు 2011లో 19.6 శాతం ఉండగా, 2013లో 36.1 శాతం ఉంది. అంటే 15 శాతం పెరిగింది. - రెండో తరగతిలో 40 శాతం మంది విద్యార్థులు సులభమైన పదాలు కూడా చదవలేకపోతున్నారు. పాఠ్యాంశాలు చదవడం, నేర్చుకోవడం, లెక్కలు చేయగలిగే వారి సంఖ్య ప్రైవేటు స్కూళ్లలోనే ఎక్కువగా ఉంది. - విద్యార్థుల్లో రెండో తరగతి నుంచే చదవడం, రాయడం, ఆలోచించడం, లెక్కలు చేయడంపై ప్రత్యేక దృష్టి అవసరం. 12వ పంచవర్ష ప్రణాళికలో వీటికే ప్రాధాన్యం. 2014-15లో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సర్వశిక్షా అభియాన్ మార్గదర్శకాలను జారీ చేసింది. -
నిధుల్లో కోత విద్యాశాఖపై సర్కార్ నిర్లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విద్యా సంవత్సరం మండల వనరుల కేంద్రాలు(ఎమ్మార్సీ), పాఠశాల సముదాయాల(స్కూల్ కాంప్లెక్స్)కు నిధుల కేటాయింపుల్లో భారీ కోతలు విధించి విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తోంది. సర్కారు తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతానికి.. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ప్రతీ విద్యా సంవత్సరంలో స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్‌లకు కేటారుుంచే నిధుల్లో 50 శాతం కోత విధించగా, ఉపాధ్యాయులకు కేటాయించే గ్రాంట్‌లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యావ్యవస్థపై పడనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు కృత్యధారణ బోధన చేసి విద్యార్థులకు పాఠాలు బోధించాలి. మాదిరి చిత్రాల బోధనతో విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమవుతాయి. నిధుల కోతతో పిల్లలకు నైపుణ్యత విద్య అందకుండా పోనుంది. ఎమ్మార్సీలకు.. జిల్లాలో 52 మండల రిసోర్స్ సెంటర్లు (ఎమ్మార్సీ) ఉన్నాయి. ఇదివరకు వీటికి రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించేవారు. ఈ విద్యా సంవత్సరం ఆ నిధులను రూ.50 వేలకు కుదించారు. నిధులు విడుదల చేసిన వాటిలో సంవత్సరానికి ఇంటర్నెట్ కోసం రూ.9వేలు, స్టేషనరి కోసం రూ.8,600, విద్యుత్ బిల్లు కోసం రూ.7200, ఎంఈవో ఫోన్ బిల్లు, టీఏ, ఇతర ఖర్చుల కోసం రూ.7200, మిగితా ఖర్చులు మెయింటనెన్స్ గ్రాంట్, ఎంఈవో ఎఫ్‌టీఎ, సమావేశాల కోసం రూ.18 వేలు చొప్పున కేటారుుంచారు. స్కూల్ కాంప్లెక్స్‌లకు.. జిల్లాలో 275 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నె లకోసారి ఆ మండల ఆవాస పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు నెలనెలా సమావేశాలు నిర్వహిస్తారు. ఆ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులు కృత్యాధారణలతో పాఠాలు బోధించే విధానంపై మిగితా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. దీనికి సంబంధించి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) కోసం నిధులు కేటాయిస్తారు. ఇదివరకు ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.27 వేలు చొప్పున విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం రూ.10వేలు మాత్రమే విడుదల చేశారు. కాంటింజెన్సీ కోసం గతంలో రూ.10 వేలు విడుదల చేయగా, ప్రస్తుతం రూ.6500లకు కుదించారు. సమావేశాలు, టీఏ గ్రాంట్స్ కోసం రూ.12 వేలు ఉండగా రూ.2 వేలకు, కృత్యధారణ కోసం రూ.3 వేల నుంచి రూ.1500లకు తగ్గించారు. ఉపాధ్యాయులకు కేటాయించని నిధులు.. పాఠశాలలో విద్యార్థులకు కృత్యాలు తయారు చేసి బోధించేందుకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున ఇదివరకు నిధులు విడుదల చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో 9 వేల మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ నిధులు కేటాయించకపోవడంతో కృత్యాధారణ బోధన లేకుండా బోర్డుపైనే బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు గుణాత్మక బోధించాల్సిన విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది. నిధు ల కోతపై మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచడంపోరుు తగ్గించారు.. స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలకు నిధులు పెంచాల్సింది పోయి సగానికి తగ్గించారు. ఉపాధ్యాయులకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ విడుదల చేయలేదు. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడనుంది. మాదిరి పాఠ్య బోధన సామగ్రి కోసం నిధులు లేకపోవడంతో నాణ్యమైన విద్య కష్టమే. - పి.సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేం.. కఠినతర అంశాలను సులభంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు బోధన సామగ్రి అవసరం. ఏటా ఉపాధ్యాయుల గ్రాంటు కింద రూ.500 విడుదల చేశారు. ఈ ఏడాది నిధుల్లో కోత విధించారు. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కష్టంగా మారింది. నిధులు పెంచాలి. ప్రతాప్, ఉపాధ్యాయుడు, గిమ్మ పాఠశాల కుదింపుతో నష్టం లేదు.. మానవ వనరుల శాఖ నుంచి కుదించి జిల్లాకు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ ప్రకారం స్కూల్ కాంప్లెక్స్‌లు, ఎమ్మార్సీలకు నిధులు కేటాయించారు. నిధుల కుదింపుతో విద్యార్థుల ప్రగతికి ఎలాంటి నష్టం వాటిల్లదు. గతంలో ఇచ్చిన నిధులతోనే బోధన చేయవచ్చు. 50 శాతం పరికరాలు పాఠశాలలో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. - పెర్క యాదయ్య, పీవో, ఆర్వీఎం