రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల స్థితిగతులు, విద్యా ర్థుల నైపుణ్యంపై జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యాట్రస్టు ఇటీవల విడుదల చేసిన సరికొత్త వార్షిక విద్యాస్థితి నివేదికలోని పలు అంశాలు ఆం దోళనకు గురిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల లోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే 5వ తరగతి విద్యార్థులకు రెండో తరగతి పాఠ్య పుస్తకం కూడా చదవడం రాదని తేలింది. మూడొంతుల మంది సాధారణ తీసివేతలు, భాగహారాలు చేయలేకున్నారని తెలిపింది.
మౌలిక వసతుల కల్పన కోసం పాఠశాలలకు కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతోందో ప్రభుత్వ పకడ్బందీగా సమగ్ర పరిశీలన చేయాలి.
బి. ప్రేమ్ కుమార్, వినాయక్‌నగర్, నిజామాబాద్