Inbox
-
మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్ క్లిక్‌తో ఇలా చేయండి!
బొత్తిగా అక్కర్లేని ఇ–మెయిల్స్ వస్తూనే ఉంటాయి. వాటి మానాన అవి పడి ఉంటాయిలే...అనుకోవడానికి లేదు. ఫ్రీ స్టోరేజ్ స్పేస్ నిండిపోతే సమస్య! ఈ నేపథ్యంలో వాటిని డిలీట్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మాన్యువల్‌గా పాత ఇ–మెయిల్స్‌ను వన్–బై వన్ సెలెక్ట్ చేసుకొని, డిలీట్ చేయడం కష్టం అనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకే టైమ్‌లో ఎక్కువ మొత్తంలో ఇ–మెయిల్స్‌ను డిలీట్ చేయడానికి ఒక ఫిల్టర్‌ను సెట్ చేసుకోవాలి. సెర్చ్బార్లో ఇ–మెయిల్ అడ్రస్ ఎంటర్ చేశాక ‘ఆల్’ ట్యాబ్‌ను సెలెక్ట్ చేసుకొని ‘డిలీట్’ ఐకాన్‌ను నొక్కాలి. ఇక లార్జ్ ఇ –మెయిల్స్ డిలీట్ చేయడానికి... ►జీమెయిల్ ఓపెన్ చేసి ‘ఎటాచ్మెంట్ లార్జర్: 10ఎమ్’ అని టైప్ చేయాలి. ►లార్జ్ ఇ– మెయిల్ ‘మెయిల్ బాక్స్’లో కనిపిస్తాయి. ►వీటిని సెలెక్ట్ చేసుకొని, ముఖ్యమైనవి, డిలీట్ వద్దనుకుంటున్నవి ‘అన్మార్క్’ చేయాలి ►డిలీట్ బటన్ నొక్కాలి. ►‘ఎంప్టీ ట్రాష్’ బటన్ నొక్కాలి. -
పాములు పగబడతాయా.. అందులో నిజమెంత..?
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ సందర్భంగా పాముల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అవసరం. అన్ని పాములూ విషం కలిగి ఉండవు. కేవలం నాలుగయిదు రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్నిచోట్లా డాక్టర్లు ఉండరు కాబట్టి కరిచినా విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది. పాము కరిచిన తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఆ పాము మనిషిని కరవక ముందు, ఏదైనా జంతు వును కరచినట్లయితే, ఆ తరువాత మనిషిని కరచినా కూడా ప్రమాద ముండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కోరల్లో ఉండదు. ఇది తెలియక కూడా భయపడతాం. కొంతమంది తమపై పాము పగబట్టిందనీ, అందుకే కాటేసిందనీ లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నదనీ భయపడుతుంటారు. పాము పగ బట్టడం అబద్ధం. మనకి పాముని చూస్తే, ఎలా భయమేస్తుందో, పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటేనే కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలే కానీ మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాముకాటుకు గురైనా బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. – నార్నె వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు, ఏపీ హేతువాద సంఘం -
పుస్తకాలే ప్రియనేస్తాలు
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి, వర్థంతి రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో అంతర్జాతీయ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు 1995 నుంచి ఏటా పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఏటా వంద దేశాల్లో ఈ ఉత్సవం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఆత్మీయులు మరణించిన సందర్భాలలో పుస్తకాలే ప్రియ నేస్తాలై ఆ బాధను మరచిపోవడానికి దోహదపడినట్టు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన అనుభవాన్ని వివరించారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మదళ్ళను కదిలిస్తుందన్నారు కాళోజీ. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ పుస్తకాలు చదివి అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. గ్రంథ పఠనానికే అగ్ర తాంబూలం ఇచ్చి, భోజనం చేయడం మర్చిపోయిన సందర్భాలెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. చిరిగిపోయిన వస్త్రాలనైనా ధరించు కానీ, కొత్త పుస్తకం దొరికితే కొనుక్కో అని జార్జి బెర్నార్షా, కందుకూరి వీరేశలింగం ఏనాడో సెలవిచ్చారు. అయితే చెడ్డ పుస్తకాలను చదవడం విషం సేవించడంతో సమానమని టాల్‌స్టాయ్ ప్రవచించారు. (నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం) వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం ‘ 94905 28730 -
ఇన్‌బాక్స్‌కు గుడ్‌బై చెబుతున్న గూగుల్
గూగుల్ తన ‘ఇన్‌బాక్స్’ యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. జీమెయిల్‌కు రీఫోకస్ చేసే క్రమంలో ఈ ఈ-మెయిల్ యాప్‌ను నిలిపివేస్తుంది. 2019 మార్చి నుంచి ఇన్‌బాక్స్ గుడ్‌బై చెప్పడంటూ గూగుల్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్. వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది. అయినా 2014లో ఈ 'ఇన్‌బాక్స్' యాప్‌ని రూపొందించింది. అయితే 'ఇన్‌బాక్స్' యాప్‌కు అంత స్పందనేమీ రాలేదు. అందుకే సేవల్ని నిలిపివేసి, జీమెయిల్‌పై రీఫోకస్ చేయాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్‌బాక్స్ యూజర్లు ఆన్లైన్ గైడ్ ద్వారా జీమెయిల్‌తో అనుసంధానం కావాలంటూ గూగుల్ జీమెయిల్ ప్రొడక్ట్ మేనేజర్ మాథ్యూ ఇజట్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. జీమెయిల్లో మీ సంభాషణలన్నీ ఇప్పటికే వేచిచూస్తున్నాయంటూ మాథ్యూ పేర్కొన్నారు. అంటే స్టోర్ చేసుకున్న ఈమెయిల్స్‌ను యూజర్లు బదిలీ చేసుకోవాల్సినవసరం లేదని తెలిసింది. 'ఇన్‌బాక్స్' యాప్‌లో ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లున్నాయి. ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఇటీవలే జీమెయిల్ యాప్‌ను గూగుల్ సరికొత్త డిజైన్‌లో అప్డేట్ చేసింది. దాంతో 'ఇన్‌బాక్స్' యాప్ తన ప్రత్యేకతను కోల్పోయి, యూజర్లూ తగ్గారు. అందుకే ఇక ఈ యాప్‌ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. -
దళిత పరిరక్షకుడు జగ్జీవన్‌రాం
ఇన్‌బాక్స్ సమాజంలో వివక్షకు గురై సామాజికంగా, ఆర్థి కంగా వెనుకబడిన వర్గాలైన దళిత గిరిజనులకు రాజ్యాం గంలో ప్రత్యేక హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన చైతన్య దీప్తి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్. ఆయన రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు తన జీవితాంతం పోరాడిన దళిత జనో ద్ధ్ధారకుడు బాబూ జగ్జ్జీవన్రాం. ఆయన 1908 ఏప్రిల్ 5న బిహార్ రాష్ట్రంలో జన్మించారు. 82 సంవత్సరాలు జీవించి 1986 జూలై 6న పరమపదించారు. సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధా నిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన తన తుదిశ్వాస వరకు దళిత హక్కుల పరి రక్షణే ధ్యేయంగా పనిచేశారు. కేంద్ర కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న కాలంలో హరిత విప్లవం సాధించడంలో కీలక పాత్ర పోషించి రైతు పక్షపాతిగా నిలిచారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ఆ నిరంకుశ చర్యలు వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి వైదొ లిగి ‘కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తర్వాత తన పార్టీని జనతాపార్టీలో విలీనం చేశారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్ప డినప్పుడు దేశ ప్రధాని పదవికి ఆయన ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ కొందరు దళిత వ్యతిరేకులు అడ్డుకోవడంతో దేశ తొలి దళిత ప్రధాని అయ్యే అవకాశం కోల్పోయారు. ఆ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. దళితులు రాజ్యాధికారం సాధించినప్పుడే వారి పట్ల ఉన్న వివక్ష పూర్తిగా తొలగి పోతుందని భావించారు. ఆయన ఆశయ సాధనకు దళి తులు అందరూ ఏకమై పనిచేయాలి. పాలక పార్టీల చేతుల్లో పావులుగా మారకుండా, ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలకు ఉపయోగ పడకుండా రాజ్యాధి కార సాధన కోసం దళితులు పోరాడటమే బాబు జగ్జ్జీవన్రాంకు నిజమైన నివాళి కాగలదు. (నేడు బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి) ఎస్. బాబురావు, కావలి మొబైల్ : 9573011844 ప్రపంచ శాంతికి ఉగ్రవాదం అడ్డు మొన్న బ్రస్సెల్స్, నిన్న ఢాకా, నేడు బాగ్దాద్.. ఇలా ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా వరుస పేలుళ్లతో రెచ్చిపోతున్నారు. ఈ దారుణంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి అమాయక ప్రజ లను బలితీసుకుంటున్నారు. ఇంత ఘోర మైన ఘాతుకానికి కారణం తామేనని ఉగ్ర వాద సంస్థ ఐసిస్ గొప్పలు చెప్పుకోవడం గర్హనీయం. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యం చేసుకొని పథకం ప్రకారం మూకు మ్మడి దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులు చేస్తున్న మారణహోమంలో అభంశుభం తెలి యని చిన్నారులు, మహిళలు, అమాయకులు ఎంతో మంది చనిపోతున్నారు. ఢాకాలోని ఓ బేకరీ రెస్టారెంట్లో 20 మంది విదేశీయులను మతం గురించి అడిగి మరీ హింసించి, గొంతు కోసి, కసితీరా చంపి రాక్షసకాండ సృష్టించారు. మతం పేరుతో దుండగులు ప్రజలను చంపడం, విధ్వంసాలు, దాడులకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి దుశ్చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ముక్తకంఠంతో ప్రతి ఘటిం చాలి. ఇలాంటి ఘటనలపై ఐక్యరాజ్యసమితి వెంటనే స్పందించి నిర్ణయాత్మకమైన మార్పు నకు నాంది పలికి ఉగ్రవాదాన్ని తుదముట్టిం చాలి. అప్పుడే శాంతి, సామరస్యాలు వర్ధిల్లు తాయి. ఉగ్రవాద సంస్థల స్థావరంగా హైదరా బాద్ తయారైంది. దేవాలయాలు, జనసమ్మ ర్థంగా ఉండే ఐటీ కారిడార్లు వంటి ముఖ్యమైన ప్రాంతాలలో, దాడులు జరిపేందుకు కుట్రలు పన్ను తున్నారు. ఉగ్రమూకలు ఏకకాలంలో పేలుళ్లకు, మార ణహోమం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్న తరు ణంలో ఐఎన్ఏ బలగాలు దానిని భగ్నం చేయడం ఎంతో గర్వించదగ్గది. పట్టుబడిన ముష్కరులను కాలయాపన చేయకుండా కఠి నంగా శిక్షించాలి. ఇలాంటి ఉగ్రమూకల పిరికి చర్యలకు బెదిరేది లేదు. ఇదే తరుణంలో భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల ప్రజలకు సంఘీభావం తెల్పాలి. దృఢ సంకల్పంతో నిలవాలి. బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు అవశ్యం ప్రపంచ దేశాల్ని నిత్యమూ వణికిస్తున్న స్థాయికి ఉగ్రవాదం పెరిగిపోవడం ఆందోళనకరం. దాదా పుగా ప్రతిరోజూ ఏదో ఒక దేశం తీవ్రవాద గాట్లతో నెత్తురోడటం సర్వసాధారణమైపోయింది. పేర్లు, వాదాలు, రూపాలు, సిద్ధాంతాలు ఏైవైనా అంతి మంగా అమాయకుల్ని బలిగొనడం, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి అస్తవ్యస్త పరచడమే లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలు విరుచుకు పడుతు న్నాయి. ఇది నాగరిక సమాజానికి సంబంధించి ఉమ్మడి వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుంది. మానవ నాగరికతకే పెనుసవాలు విసురుతున్న ఉగ్రవాద సమస్యపై నేటికీ ప్రపంచం ఏకాభి ప్రాయంతో లేకపోవడం విచారకరం. జనావాసాలపై విరుచుకు పడుతున్న తీవ్రవాద సమస్యను తక్కువ చేసి చూడడం ద్వారా కొన్ని దేశాలు ఉదాసీనత వహి స్తుండగా, లాభనష్టాల బేరీజులతో మరికొన్ని దేశాలు ఉత్తుత్తి యుద్ద్ధం చేయడంతో చివరకు అన్ని దేశాలూ నష్టపోయే దశకు చేరు కున్నాయి. ఇంతవరకూ ఉగ్రవాదాన్ని ఎలా నిర్వచిం చాలి? ఏ స్థాయిలో ఎదుర్కోవాలి? అన్న ప్రాథమిక అంశాల పట్లనే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలకు ఏకాభిప్రాయం కుదరలేదు. వివిధ కార ణాలతో అమెరికా, లాటిన్ అమెరికా, ఇస్లామిక్ యూనియన్ దేశాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుకనే భారత్ ప్రతిపాదించిన ’అంత ర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర విధానం’ (సీసీఐటీ) దశాబ్ద కాలంగా ఐక్యరాజ్య సమితిలో అతీగతీ లేకుండా పడి ఉంది. దాని బూజు దులపాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడే అన్ని సభ్య దేశాలపై ఉంది. ఈ వైరస్ విషయంలో త్వరితంగా తమ భిన్నాభిప్రాయాల్ని తగ్గించుకొని, ఏకాభిప్రాయంతో ఏకోన్ముఖంగా అన్నిరూపాల తీవ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉమ్మడి పోరు దిశగా ప్రణాళికల్ని రచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాసీనత, పక్షపాత పాక్షిక యుద్ధాలతో ప్రమాదం పెరగడమేగాని ఫలితం ఉండదు. డాక్టర్ డీవీజీ శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం -
జీవో 98/68 అమలు చేయాలి
మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ కొల్లాపూర్, వనపర్తి నియోజక వర్గాలలోని 65 గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీట మునిగిపోయి 34 సంవత్సరాలు గడచిపోయాయి. 1986లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్కొక్క నిర్వాసిత కుటుంబానికి ఒక్కొక్క ప్రభుత్వోద్యోగం ఇచ్చేట్టుగా జీవో 98/68ని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి ముంపునకు ఆనాడు మొత్తం 11,200 ఇళ్లకు చెందిన 36,000 కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. గత మూడున్నర దశాబ్దాల్లో కుటుంబ పెద్దలు చాలా మంది మరణించారు. ఇల్లూ, వాకిళ్లు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాల సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడితేగా 153 మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి. ఇంకా 2,000 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ పేర్లను ఉద్యోగం కొరకు నమోదు చేసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వాసిత కుటుంబాల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వ్లలనే నేటికీ ఆ జీవో అమలు కావడం లేదు. మరోవంక కర్నూలు జిల్లాలోని ముంపు గ్రామాల నిర్వాసితులు స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వోద్యోగాలను సంపాదించుకోగలిగారు. ఇకనైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు నిర్వాసితుల గోడును పట్టించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందనుకుంటే అదీ నిరాశే అయింది. అందుకే గత 35 రోజులుగా శ్రీశైలంముంపు బాధితులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా నిర్వాసితుల గోడును పట్టించుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చొరవచేసి మూడున్నర దశాబ్దాల బాధితుల వ్యధను చల్లార్చాలని విజ్ఞప్తి. తక్షణమే జీవో 98/36 అమలుకు ఆదేశించి నేటికైనా బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ( డాక్టర్ ఏ సిద్ధన్న, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా) -
అశ్లీలతకు వేయలేమా కళ్లెం?
దేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు రుగ్మతలు అశ్లీలత, అవినీతి. అవినీతి విషయంలో ఏదో ఒక మేరకు సామాజిక స్పృహ కనిపిస్తున్నా, ప్లేగు వ్యాధిలా విస్తరిస్తున్న అశ్లీలత విషయంలో పెద్దగా పట్టింపు కనబడటం లేదు. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన అశ్లీలత, అసభ్యత నేడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంటింటికీ ప్రవేశిస్తోంది. ఎంటర్టైన్మెంట్ పేరిట అసభ్య, అశ్లీల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నా పట్టడం లేదు. సినిమాల్లాగే టీవీ కూడా కుటుంబ సభ్యులంతా కలసి కూచుని చూసేలా ఉండకుండా పోతుండటం విచారకరం. పైగా వినోదం పేరిట పబ్, క్లబ్‌ల సంస్కృతిని విస్తరింపజేస్తు న్నారు. ఈ వికృత జీవన శైలి విద్యార్థులను, యువతను పెడదోవపట్టిస్తోంది. ఈవ్ టీజింగ్, అత్యాచారాలు, హింసా కాండ, నాటకీయమైన దోపిడీలు ఇటీవలి కాలంలో పెచ్చు పెరిగాయి. కానీ యువతను అటు ప్రేరేపిస్తున్న ఈ ‘వినోదం’ జోలికి పోవడం లేదు. వీటికి తోడు ఇంటర్నెట్ ద్వారా వ్యాపిస్తున్న నీలి సంస్కృతి విషయంలోనూ ఆర్భాటా నికి మించిన ఆచర ణ కనబడటం లేదు. ఇప్పటికైనా పాలకు లు, పార్టీలు, మీడియాల తీరు మారాలి. అశ్లీలత, అసభ్యత, నేరగ్రస్తతలకు తావులేని సమాజం కోసం నడుంబిగించాలి. కె. శారదా ప్రసాద్, హైదరాబాద్ -
విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలి
(ఇన్ బాక్స్) తెలంగాణ రాష్ట్రం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్ కొరత. నేటి విద్యుత్ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన డానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ, దీర్ఘకాలిక చర్యలను చేపట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ప్రజలు కలసికట్టుగా విద్యుత్ ఆదా కోసం ప్రయత్నించాలి. దుర్వినియోగాన్ని అరికట్టాలి. ప్రజోపయోగాన్ని ఆశించి ప్రభుత్వం ఏటా కోట్ల కొలదీ నిధులను విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చి స్తోంది. ఏటా ప్రభుత్వం విద్యుత్‌పై చేసే ఖర్చు లో 40 శాతం కూడా తిరిగి చేతికి రావడం లేదు. సరఫరాలో జరిగే విద్యుత్ నష్టానికి తోడు విని యోగమయ్యే ప్రతి యూనిట్ నమోదు కాకపో వడం వల్ల భారీగా నష్టాలు తప్పడం లేదు. పేద, అల్పా దాయ వర్గాల లబ్ధి కోసం ఉద్దేశించిన స్లాబ్ విధానం దుర్విని యోగమవుతోంది. ఒకే కుటుంబం ఉంటున్న ఇంటికి సైతం రెండు, మూడు అదనపు కనెక్షన్లను తీసుకొని కొందరు స్లాబ్ విధానంలో సామాన్యుల్లా లబ్ధిని పొందుతుండటం తరచుగా జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం విద్యుత్ చౌర్యం, అదనపు మీటర్లు, ఉద్యోగుల అవినీతి, అక్రమాలను అరికట్టడంపై దృష్టిని కేంద్రీకరించాలి. (కంది కృష్ణారెడ్డి, కరీంనగర్) -
బెల్టుషాపులు రద్దు చేయాలి
ఇన్ బాక్స్ రాష్ట్రవ్యాప్తంగా కష్టజీవుల శ్రమను బెల్టు షాపులు, గుడుంబా, కల్తీ కల్లు, నాటు సారా వంటివి దోచుకుంటున్నాయి. ప్రకృతి సహజమైన కల్లును స్పిరిట్ తదితర విషపదార్థాలను కలుపుతూ పట్టణాల్లో కల్తీకల్లు అమ్మించి ప్రజల జీవితాలను హరీమనిపిస్తున్నారు. మత్తుకు లోనైన వారు భార్యా పిల్లలను మర్చిపోవడమే కాకుండా నేరాలు ఘోరాలకు పాల్పడటం ద్వారా శాంతిభద్రత లకు భంగం కలిగిస్తున్నారు. 2004కి ముందు టీడీపీ హయాంలో ప్రజలకు మంచినీరు కన్నా బెల్టుషాపుల్లోని మద్యమే ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బెల్టు షాపులు రద్దు చేస్తూ దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలి. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు రావాలంటే విద్యలో, ఉద్యోగాల్లో, వృత్తుల్లో పొరుగు రాష్ట్రంతో పోటీ పడాలంటే అన్నిటికంటే ముందు బెల్టు షాపులను రద్దు చేయాలి. ఇలా అయితే మాత్రం పరిపూర్ణ ఆరోగ్యవంతులతో కూడిన బంగారు తెలంగాణ నిజంగా సాధ్యమ వుతుంది. బెల్టుషాపులతో పాటు గుట్కా, ఖైని, అంబర్ వంటి విషపదార్థాలను కూడా నిషేధించాలి. కట్టుకున్న భార్య కన్నా వీధుల్లో దొరికే కల్తీ కల్లు, చీప్ లిక్కరే మద్యంరాయుళ్లకి ముఖ్యమై కుటుంబ జీవితం ధ్వంసమవుతోంది. రాష్ట్రంలోని ప్రతి వీధిలో, వాడలో తాగుడు మూలంగా జరుగుతున్న కుటుంబ ఘర్షణలను మనం చూడవచ్చు. లక్షలాది గృహాలను కబళిస్తున్న మద్యపానాన్ని అరికట్టాలంటే, బెల్టు షాపులను రద్దు చేయడం ఒకటే మార్గం. కేసీఆర్ ప్రభు త్వం చిత్తశుద్ధితో సత్వరం స్పందించాలని కోరుతున్నాము. కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ కృత్రిమ ఎరువుల కొరత ఒకవైపు అకాల వర్షపాతం లేదంటే అనావృష్టితో కునారిల్లుతున్న తెలంగాణ రైతాంగానికి ఎరువుల కృత్రిమ కొరత వీడని పీడలా దాపురిస్తోంది. ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనలేక కుప్పగూలుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకోకుంటే వ్యవసాయానికి మంగళం పలికే రోజులు తప్పదు. తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడిన ఎరువుల కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా కొందరు వ్యాపారస్తులు, డీలర్లు అక్రమ నిల్వలకు పాల్పడి కృత్రిమ కొరతను సృష్టించి, ధరలను విపరీతంగా పెంచేశారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు, లభ్యం కాని నాణ్యమైన విత్త నాలు, బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకపోవడం ఇత్యాది కారణాల వలన ఇప్పటికే పలు సమస్యలలో కూరుకుపోయిన రైతాం గానికి తాజాగా ఎరువుల కొరత మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా ఉంది. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్న తెరాస ప్రభు త్వం తన మాట నిలుపుకుని తక్షణం ఎరువుల కొరతను తీర్చేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. రైతు సమస్యల పరిష్కారా నికి, కృత్రిమ ఎరువు కొరత నివారణకు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎరువుల కర్మాగారాల స్థాపనకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. సీహెచ్ సాయిఋత్విక్ పాన్‌గల్ రోడ్డు, నల్లగొండ నిరుద్యోగుల వెతలు తెలంగాణలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1, 2 ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నారే కానీ పని మాత్రం జరగటం లేదు. రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదన్న సాకుతో ఇంకె న్నాళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాయిదా వేస్తారు. ఇప్పటికే వేల మంది నిరుద్యోగులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైద రాబాద్‌కు తరలివచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. బీఈడీ, డీఎడ్ తదితర ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేసుకున్న వారు సైతం డీఎస్సీ లేకపోవడంతో గ్రూప్ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమ వుతున్నారు. మరోవైపు ఎమ్మెస్సీ, ఎమ్మే తదితర పోస్ట్ గ్రాడ్యు యేషన్, ఇంజనీరింగ్ కోర్సులు చదివినవారు కూడా ఉద్యోగాలు లేక గ్రూప్స్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటూ వేలరూపా యలను ఖర్చు పెట్టుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే తెలం గాణ ప్రభుత్వం మరికొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని నానబెట్టే ప్రమా దం కనిపిస్తోంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల బాగోగులను పట్టించుకుంటే మంచిది. ఇకనైనా ప్రభుత్వం దృఢంగా పూనుకుని లక్షలాది నిరుద్యోగులు ఆశగా చూస్తున్న తెలంగాణ పీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలి. పి.శ్రీనివాస్ అమ్మక్కపేట, కరీంనగర్ -
గుట్కా మాఫియా
ఇన్ బాక్స్ అన్ని మాఫియాల్లాగే గుట్కా మాఫియా కూడా రెండు రాష్ట్రాలలోనూ విస్తరించి ప్రజల ప్రాణాల మీదికి తెస్తూ కేన్సర్ వంటి రోగాలు విస్తరిం పజేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్టు వ్యవహ రించడం శోచనీయం. గుట్కా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. కానీ పట్టుకోవడానికి మాత్రం ఏ అధికారికీ సాహసం లేదు. వాళ్లిచ్చే కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యాపారాన్ని పరోక్షంగా అధికారులే నడిపిస్తున్నారంటే ఇంతకం టే ఘోరం ఇంకొకటి ఉంటుందా? గుట్కా వ్యాపారం ఏడాదికి 2,000 కోట్లు ఉందంటే ఇంక ఏమి చెప్పాలి? మొక్కుబడికి ఏవో రెండు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం కృషి చేయడం లేదు. జంటనగరాలలో ఏ పాన్‌షాప్‌లో చూసి నా గుట్కా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. కాలేజీలు, స్కూళ్లు ఇంకా అక్కడా ఇక్కడా అని లేకుండా ఎక్కడైనా విచ్చలవిడిగా వ్యాపా రం జరుగుతోందంటే ఇంక నిషేధం మాటెక్కడ? పైగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తరలించడం. ఎన్ని చట్టాలు చేస్తే మాత్రం ఏమి లాభం? ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న గుట్కా కేంద్రాలు మూయించడమే కాదు అమ్ముతున్న వాళ్లకు కూడా కఠినంగా శిక్షలు వేయాలి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి వెంటనే ఈ గుట్కా మహమ్మారిని అంతం చేయాలి. పద్మావతి హైదరాబాద్ ఒంటినిండా విషపదార్థాలే! సహజ సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలకు మనం ఎప్పుడో దూరమయ్యాము. అధిక దిగుబడుల కోసం సేంద్రియ ఎరువులను వదిలి, రసాయన ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర వుతున్న విషయం తెలిసిందే. వరి, గోధుమ, మక్క, జొన్న లాంటి ఆహార పంటలను చూస్తే.. మనం సహజ పంటలకు ఎప్పుడో దూరమయ్యాం. మన ఆరోగ్యానికి అవసర మైన ఏ పదార్థమూ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇక ఫలాల విషయానికి వస్తే, మామిడి, సపోట, అరటి లాంటి పండ్లయితే అచ్చం విష పదార్థాలు కలిపి మగ్గిస్తున్నారు. ముఖ్యంగా రానున్న మధుర ఫలం మామిడి విషయా నికి వస్తే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం వేసి మగ్గించి అమ్మడం సర్వసాధారణమైపోయింది. ఈ విష పదార్థం వాడి పండించిన పండ్లు చూడ్డానికి తేడా కనిపించకపోయినా రుచి, వాసన సహజంగా పండిన పండుకు ఎంతమాత్రం సాటిరాకపోగా అనేకమైన ఉదరకోశ వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే రసాయనాలను తక్షణం అరికట్టే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. తవుటు రాంచంద్రం జగిత్యాల, కరీంనగర్ జిల్లా పాల(కు)ల పునరావాసం సిఫార్సులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకే టీటీడీ పాలక మండలిలో స్థానం. కానీ ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి చోటులేదు. ఇంతవరకూ పాలక మండలి నియామకం ఇలాగే జరగడంపై ఎన్ని విమర్శలు వచ్చినా వీసమంత మార్పు మాత్రం శూన్యం. సారా కాంట్రాక్టర్లు, వ్యాపారం చేసుకునే వాళ్లు, సినిమాలో స్త్రీల అందాలను చూపించే వాళ్లు ఇలా చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడు. అక్కడ వీఐపీలకు సేవలు చేస్తూ తెరవెనుక వాళ్ల వ్యాపారాలు, పైరవీలు చేసు కునేందుకు అదొక రాజకీయ పునరావాసం. తిరుపతి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినందుకు గాను మన బాబుగారు, కృష్ణమూర్తికి చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇంతవరకూ ఏ పాలక మండలి కూడా భక్తుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, సరికదా ఆర్జిత సేవాటికెట్ల కుంభ కోణం దగ్గర నుంచి ఫినాయిల్ కాంట్రాక్ట్ కుంభకోణం వరకూ ఏ ఒక్క దానికీ అతీగతీలేదు సరికదా బుట్టదాఖలు కావడం శోచనీయం. అసలు పాలక మండలి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది వీఐపీలకు సేవా మం డలి కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా మాత్రం ఏనాడూ ఏమీ చేసిన పాపాన పోలేదు సరికదా భక్తులను లాఠీలతో కొట్టించి తప్పుడు కేసులు పెట్టిన ఘనత మాత్రం మన పాలక మండలి ఘనతే అని చెప్ప వచ్చు. కాబట్టి ఇప్పటికైనా పాలక మండలి తీరు మార్చుకుని భక్తులకు సేవ చేయాలి. ఎస్ విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
దినదినగండం నూరేళ్లాయుష్షు
ఇన్ బాక్స్ ఇటీవల రాష్ట్రంలో చాలా ప్రదేశాలలో గ్యాస్ సిలిండర్లు తరచూ సీమ బాంబుల్లా పేలిపోతున్నాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈ మధ్యనే కర్నూలు జిల్లాలో లారీలో వెళుతున్న గ్యాస్ సిలిండర్ల లోడు పేలిపోయి ఆ శబ్దం 20 కిలో మీటర్ల దూరం వినబడిందంటే ఎంతటి విస్ఫోటనో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రభుత్వం, గ్యాస్ సిలిండర్ల తయారీ కంపెనీలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఒకే గదిలో వంట, పడక ఉండే కోట్లాది కుటుంబా లు దేశంలో ఉన్నాయి. వారికి ఈ గ్యాస్ బండతో పక్కలో బాంబును పెట్టినట్లే ఉంటుంది. ఇప్పటి వరకూ ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి అజాగ్రత్త వల్ల జరిగేవి. కాని ఇప్పుడు తరచూ పేలడంతో ప్రజల బతుకులు దినదినగండం నూరేళ్లాయుష్షు లా తయారవుతుంది. సంబంధిత అధికారులు తక్ష ణం స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పురాని విధంగా సమస్యను పరిష్కరించాలి. ఎస్.వీనస్, ఎల్.ఎన్.పురం, తూ.గో. జిల్లా జాబు కావాలంటే బాబే రావాలా? దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే నాథుడే కరువయ్యారు. ఆయన తరువాత వచ్చిన ఇద్దరు సీఎంల హయాంలో ఏ నోటిఫికేషన్లు రాక, నిరు ద్యోగులు విలవిలలాడుతున్నారు. విభజన తర్వాత ఎన్నికల వేళ ‘ఇంటికో ఉద్యోగం ఇస్తా మనీ, నిరుద్యోగభృతి ఇస్తామనీ, జాబు కావాలంటే బాబే రావాలని’ ప్రకటనలు గుప్పించారు. ఆయనలాంటి అనుభవ జ్ఞుడు సీఎం అయితే ‘లక్షలాది’గా ఖాళీ ఉన్న గ్రూపు1, గ్రూపు2, గ్రూపు4, జె. ఎల్, డి.ఎల్ వంటి అనేక ఉద్యోగాలు కల్పిస్తా డనీ, టీడీపీ నేతలు నిరుద్యోగులను విపరీతంగా నమ్మించారు. ఇప్పుడు ఒక్క టీడీపీ నాయకుడు గానీ, ఎమ్మెల్యే కానీ ఉద్యోగాల గురించి ఏమీ మాట్లాడటం లేదు. ఉద్యోగాల విషయంలో నిరు ద్యోగులను సంతోషపెట్టిన రోజు బాబు చరిత్ర లోనే లేదు. ఉద్యోగాలంటే కేవలం కాంట్రాక్టు, రోజు కూలీ వంటి భవిష్యత్తుకు భద్రత లేనివి, లేదా పోలీసు-టీచరు వంటివి మాత్రమే. పరిపా లనలో అవసరమయ్యేవి, రెవెన్యూ శాఖలో ఖాళీలు.. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయటానికే ఆయన ఇష్టపడడు. ‘రాజధాని’ నిర్మాణంలో కేంద్రం డబ్బు ఇవ్వకుండా మోసం చేసిందనీ, అనాథవలే మన రాష్ట్రం మిగిలిందనీ, తన అను భవమంతా ఉపయోగించి ప్రజలకు ‘గుప్పె డు మెతుకులు-గుక్కెడు నీళ్లు’ ఇవ్వగలుగు తున్నాననీ, తనేదో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తేనే ప్రజలకు తిండి తిప్పలు అందు తున్నట్లు లేకపోతే లేనట్లు తెగ ప్రకటనలు చేస్తున్నాడు. తనతో పాటు, అందరూ కష్టపడా లనే నీతులు తప్ప ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరపడుతున్నా నిరుద్యోగులకు భరోసాగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తక్ష ణమే అన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకట నలు ఇచ్చేట్లుగా కనీసం ప్రతిపక్ష సభ్యులైనా ‘నిరుద్యోగుల తరఫున గళం’ విప్పాలి. కె.ప్రభాకర్, ఈపూరు పాలెం, చీరాల, ప్రకాశం జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు దివంగత సీఎం డా॥వైఎస్ రాజశేఖరరెడ్డి జల యజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టి అన్ని అనుమతులు తీసుకొని, శంకుస్థాపన చేశా రు. కుడి ఎడమ కాలువల తవ్వకాలు ఇంచుమిం చు పూర్తయినదశలో వైఎస్ అకాల మరణంతో ప్రాజెక్టు మొత్తంగా మూలపడింది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధు లతో నిర్మాణం చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. కానీ, మూడేళ్లలో పూర్తి చేస్తామన్న నేతలు కేవలం వంద కోట్లు విదిలించడం దుర్మార్గపు చర్య. ఇది పూర్తయితే పట్టిసీమ అవసరమే ఉండదు. గోదా వరి జిల్లాల రైతుల కలలను కల్లలను చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి పట్టిసీమ ఎత్తిపోతల పథకం తెరమీదకు తెచ్చినట్లు విమ ర్శలు వస్తున్నాయి. రైతుల అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతాన్నిమరచి వారికే ద్రోహం చేయడం క్షమార్హం కాదు. రైతుల ఆందోళన అర్థం చేసుకొని వారికి ఊరట కలిగించాలి. కె.వి.వెంకినాయుడు, రాజ ఒమ్మంగి -
దళితులెప్పుడూ రాజకీయ యాచకులేనా?
సుమారు 65 ఏళ్ల క్రితం డా. బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ దళి తులకు అన్నిరంగాలలో 15 శాతం రిజర్వేషన్ కలిపించమని రాజ్యాం గంలో ప్రతిపాదించారు. అయితే 15 శాతం రిజర్వేషన్ అన్నది శాశ్వతం కాదు. ఈ 65 ఏళ్ల కాలంలో దళిత జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది. కానీ పాలక పార్టీలు దళితులలో, వారి ఉప కులాల్లో చిచ్చు పెట్టి మీరు, మీరు కొట్టుకొని చావండి అనే చందంగా తమాషా చూస్తున్నారు. భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్ విధా నాన్ని పునరాలోచించాలి. మొత్తం జనాభాలో ఎస్సీలు, ఎస్టీల సంఖ్య ప్రస్తుతం 35-40 శాతం పైచిలుకే ఉంటుంది అని అంచనా. పైగా జనా భా పెరుగుతున్నప్పటికీ, వారి ఆర్థిక స్థితిగతులలో ఏ మాత్రం మార్పు రాలేదు. దళితులు ఎంతసేపటికీ రాజకీయ పదవులు అడుక్కునే విధం గా వ్యవహరించడం, మరిన్ని రాయితీల కోసం ప్రాధేయపడటం అంత మంచిది కాదు. రాజ్యాధికారం వారి లక్ష్యం కావాలి. అంతే కాని దళితు లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, మంత్రి పదవులు ఇవ్వాలని యాచకుల లాగ అడుక్కోవడం భావ్యం కాదు. దళితుల ఓట్లు దళితులకే దక్కేవిధంగా రాజ్యాంగంలో మార్పు చేయవలసినది పోయి ఒకరి మోచేతి గంజి తాగే లాగ వ్యవహరించవద్దు. ప్రతి దళితుడు ఆర్థికంగా సామాజికంగా బలపడినప్పుడే దళిత వర్గాలకు దళిత కులాలకు సమా నత్వం వస్తుంది. ఆనాడు అంబేద్కర్.. దళిత ప్రజలు పాలితులుగా కాకుండా పాలకులుగా ఎదగాలని బోధించారు. కానీ నేడు ఎస్సీలను ఎ,బి,సి,డి,లుగా చెయ్యాలని వీరు, చెయ్యొద్దని వారు తమలో తాము వైషమ్యాలు పెంచుకొని అన్ని విషయాలలో దళితులు నష్టపోతున్నారు. రిజర్వేషన్‌ను వేరే వారికిచ్చే దిశగా దళితులు ఎదగాలి కానీ దళితులను ఎ,బి,సి,డి,లుగా గుర్తించమని ఒకరి దగ్గరకువెళ్లి అడుక్కునే పద్ధతిని విడ నాడాలి. గతంలో యూపీయే ప్రభుత్వం 9 రాష్ట్రాలలో జాట్ కులస్తులను ఓబీసీ. జాబితాలో చేర్చి వారికి రిజర్వేషన్లు కలిపించడంపై సుప్రీంకోర్టు కొట్టివేసింది. కుల ప్రాతిపదికన కాకుండా సామాజిక, ఆర్థికస్థితిగతు లను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను కలిపించాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. రిజర్వేషన్ కోటా అనేది ఎప్పుడూ ఉండేది కాదు. దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నంతవరకే రిజర్వేషన్లు అమలులో ఉంటాయి. రిజర్వేషన్లను శాశ్వతంగా పొందుతుండటం అంటే ఆ మేరకు వారిలో వెనుకబాటుతనం కొనసాగుతున్నట్లే అని అర్థం. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ప్రజల అవకాశాలను మెరుగుపర్చి వారు అందరితో పోటీ పడి బతుకగలిగే పరిస్థితులను కల్పించాలే తప్ప దళిత కులాలకు వాటి ఉప కులాలకు మధ్య చిచ్చు పెట్టి కొట్టుకొని చావండి అనే చందంగా ఉండకూడదు. కోదాటి శ్యాంసుందర్, కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం, హైదరాబాద్ వయోపరిమితి పెంచాలి తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఇక్కడి నిరుద్యోగులకు అన్యా యం జరిగే అవకాశాలు ఉన్నట్టు చాలామంది భావిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి తమను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని కూడా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి అమ లుచేస్తోంది. దీనితో అన్ని వైపుల నుంచి కేసీఆర్ సర్కార్ పట్ల, నిర్ణ యాల పట్ల హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పుడు నిరుద్యోగ యువత పట్ల కూడా కేసీఆర్ దృష్టి పెట్టవలసి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే అన్ని ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచడం గురించి యోచించాలి. ప్రభుత్వ శాఖలలోనే కాకుండా, సింగరేణి, ట్రాన్స్‌కో వంటి సంస్థలలో నియామకాలను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే చేట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అప్పుడే నియామకాలు పార దర్శకంగా, అవినీతికి తావు లేని విధంగా జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయనందువల్ల, అవినీతి వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. దీనితో వారి వయోపరి మితి దాటిపోయింది. నిరుద్యోగులు బాధలను గమనించిన కేసీఆర్ ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని వయోపరిమితిని పెంచాలి. తెలంగాణ నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. కంది కృష్ణారెడ్డి , కరీంనగర్ -
‘మా’ ఎన్నికల్లో గ్రూపులు?
ఇన్ బాక్స్ అందరూ ఆ కళామతల్లి బిడ్డలే, అందరూ కళాకారులే కానీ ఒకళ్లు అంటే ఒకళ్లకు విభేదాలు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అధ్యక్ష పదవి కోసం ఒకళ్లపై ఒకళ్లు దుమ్మెత్తిపోసుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇంత వరకూ మా అసోసియేషన్‌కు భవనం లేకపోవడం దురదృష్టకరం. వృద్ధ, పేద కళాకారులకు సరైన సహకారం వైద్య సదు పాయం అందటంలేదని ఇప్పుడు అందరూ ప్రకటించడం గమనార్హం. మరి ఇన్నాళ్లు, ఈ విషయాలు బయటకు రాకపోవడం గమనార్హం. కేవలం 700 ల మంది సభ్యులున్న ‘మా’ లో 7 గ్రూపులు. ఇక విభేదాలు, ఆరోపణలు చెప్ప నక్కర్లేదు. ఇక ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపి స్తున్నాయి. ‘మా’ ఎన్నికలు పూర్తయ్యే వరకూ, ఎప్పుడు ఎవరు ఎవరి వైపు మాట్లాడతారో ఎవరి వైపు ఉంటారో తెలియని అనిశ్చితి. ఎవరికి వారే ప్రెస్మీట్లు పెట్టుకొని తిట్టుకోవడం, విమర్శిం చుకోవడం చూసేవాళ్లకు చిన్న పిల్లలు కొట్లాడుతున్నట్టుంది. ఇవన్నీ ప్రేక్షకులకు మా అసోసియేషన్ వాళ్లు చూపిస్తున్న సిన్మా అని విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఎందరో బీద కళాకారులకు, వృద్ధ కళాకారులకు అండగా ఉండి ఆదుకోవాల్సిన మా అసోసియేషన్ ఇలా రోడ్డునపడి, పదవుల కోసం విమర్శలు చేసుకోవడం ఏమీ బాగాలేదు. ఏదిఏమైనా, ఎవరు గెలిచినా పేద కళాకారులకు అండగా ఉండి వాళ్లకు ఆసరాగా ఉండాలని అందరం ఆశిద్దాం! - ఎస్.విశ్వనాథం, హెదరాబాద్ -
ఖైదీల హక్కుల కోసం పోరాడాలి
ఇన్ బాక్స్ రాజకీయ ఖైదీలను, ఏడేళ్ల శిక్షాకాలం పూర్తయిన జీవి త ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్‌తోను; 1994-95 జైలు పోరాటంలో సాధించుకున్న డిమాం డ్ల పునరుద్ధరణ ధ్యేయంగా కమిటీ ఫర్ ది రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ) హక్కుల వారోత్స వాన్ని నిర్వహిస్తున్నది. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ దేవ్ల 84వ వర్ధంతి సందర్భంగా మార్చి 23 నుంచి 30 వరకు ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నది. భగత్ సింగ్ కాలం నుంచి ఖైదీల హక్కుల కోసం పోరాటం సాగుతూనే ఉంది. విప్లవకారులు, ప్రజాస్వామ్యవా దులు రాజకీయ హక్కుల కోసం దేశంలోను, ఇప్పు డు రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగు ప్రాంతంలోను అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలోను, నక్సల్బరీ, శ్రీకాకుళం రైతాంగ పోరాట కాలంలోను మలి తెలంగాణ పోరాటకాలం లోను జైల్లో ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు చేశా రు. వాటిలో చరిత్రాత్మకమైనది 1994-95 నాటి పోరాటం. దీనితో ఏడేళ్లు పూర్తి చేసిన జీవిత ఖైదీల విషయం సహా అన్ని న్యాయమైన డిమాండ్లు ఆమో దం పొందాయి. దానితో నాలుగు వందల మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. గతంలో ఎన్టీఆర్, అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు, ఇప్పుడు చంద్రశే ఖరరావు హయాంలోను అణచివేత కొనసాగుతూనే ఉంది. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న మేధా వులపైన, అమాయక గిరిజనుల పైన, విప్లవకారుల పైన ఈ నిర్బంధం ఆగడంలేదు. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. ఆదివాసీల భూములు బహు ళ జాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. నిజానికి ఇది ఆదివాసేతర ప్రజల ప్రయోజనాల కోసమనే కాదు, ఇప్పుడు బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం నాయకులు శక్తి వంచన లేకుండా పాటు పడుతున్నారు. ఆదివాసేత రుల నుంచి భూమిని కాపాడుకోవడానికి గిరిజనులు ప్రయత్నించినపుడు ఎన్టీఆర్ చింతపల్లి అడవులలోకి రిజర్వు దళాలను పంపారు. నక్సలైట్ల సానుభూతిప రులనే నెపంతో ఇప్పుడు చంద్రశేఖరరావు తెలంగా ణలో గుత్తికోయలను తరిమివేయాలని చూస్తున్నారు. చింతపల్లిలో వేల ఎకరాలను బాక్సైట్ కోసం పెద్ద కంపెనీకి ఇవ్వాలని చూస్తున్నారు. అక్కడి కాఫీ తోట లు ఇప్పటికే కాంట్రాక్టర్ల పరం చేశారు. వీటిని ప్రతి ఘటించిన గిరిజనులను అరెస్టు చేయిస్తున్నారు. పోరాడి బయటపడుతున్నా, మళ్లీ అరెస్టు చేయిస్తూ వేధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సెషన్స్ కోర్టులో యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు హైకోర్టులో అప్పీలు చేసుకుంటే ఐదా రేళ్లు గడిచినా విచారణ చేపట్టడంలేదు. దీనితో ఇలాం టి విచారణలు త్వరగా చేపట్టాలని లేదా బెయిల్ ఇవ్వాలని ప్రొ. హరగోపాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించలేదు. ఇలాంటి ధోరణి వ్యాజ్యా నికే విరుద్ధమని వాదనలు వచ్చాయి. ఇక సుప్రీం కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. అంటే 1994-95 ప్రాంతంలో సాధించుకున్న హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. మళ్లీ పాత అణచివేతే తలె త్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారోత్సవాన్ని జరుపు కుంటూ, ఇందులో భాగంగా మార్చి 28న హైదరా బాద్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని అందరూ సమర్ధించవలసిన అవస రం ఉంది. - ఎ. నరసింహారెడ్డి, ఎ. దశరథ్ సీఆర్పీపీ. హైదరాబాద్ -
రుణమాఫీనా... శాసనమండలి భర్తీనా?
ఇన్ బాక్స్ రాష్ట్ర శాసనసభ సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి తీర్మానం పెడితే, చిన్న రాష్ట్రమే కదా 17 రోజులు సరిపోతాయంటూ ఆ తీర్మా నాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. మరి ఈ చిన్న రాష్ట్రానికి శాసన మండలి ఎందుకు? ప్రభుత్వ కోశాగారం నుంచి ఖర్చు మినహా! అప్పట్లో డా॥వైఎస్ రాజశేఖరరెడ్డి శాసన మండలి ఏర్పాటు చేయటానికి కారణం ఉంది. ఎందు కంటే ఉమ్మడి రాష్ర్టంలో విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేసేవారు, వాటిని సమర్థ వంతంగా పర్యవేక్షించేందుకు శాసన సభ్యుల తోపాటు, శాసన మండలి సభ్యుల సహాయం ఉంటే మరింత సమర్థవంతంగా సంక్షేమ పథ కాలు ప్రజలకు చేరతాయని అప్పటిలో ఆయ న ఉద్దేశం. మరిప్పుడు ఉమ్మడి రాష్ట్రం లేదు, సంక్షేమ పథకాలు లేవు కాని శాసన మండలి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధపడింది. ఆంధ్రప్ర దేశ్ ఆర్థికంగా కుదేలు అయిందని జాతీయ ప్రసార సాధనాల ముందు ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతూనే, శాసన మండలి ఎన్ని కలకు మాత్రం జెండా ఊపేశారు. కేంద్రంలో మిత్ర కూటమి ఉంది కాబట్టి, సాధారణ మెజారిటీతో శాసన మండలిని రద్దు చేయటం చిటికెలో పని. 51 మంది శాసనమండలి సభ్యులకు ఇచ్చే జీతాలు, ఇతర ఖర్చులతో ఎన్ని గ్రామాలు దత్తత తీసుకోవచ్చు? ఎంత మంది రైతులను రుణవిముక్తులను చేయవ చ్చు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ చార్జీలం టూ వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ రైతులరుణాలను మాఫీ చేయమంటే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా వెనక బడిందనీ, 5 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రమే వాటిని తీర్చగలమని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉద్యోగస్తులకు ఇచ్చిన ఫిట్ మెంట్ చార్జీలతో ఎంత మంది రైతులు రుణ విముక్తి అయ్యేవారు? అప్పులలో ఉన్న ప్రజ ల కష్టాలు తీర్చకుండా ఆర్థిక స్థిరత్వం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ చార్జీలు అంటూ వేలకోట్ల రూపాయలు కేటాయింపు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యతి రేకతతో ఇలా చెప్పడం లేదు. వారికి న్యాయం గా అందవలసిన ప్రయోజనాలు అందించకూ డదని కూడా దీని అర్థం కాదు. ఎప్పుడైనా ఆక లిగా ఉన్న వ్యక్తికి మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది. ఫిట్మెంట్ చార్జీలు ఉద్యోగస్తు లకు ప్రభుత్వం ఇవ్వడం అంటే ఆకలి లేని వాడికి అన్నం పెట్టినట్లే. ఆ సొమ్ము విలువ ప్రభుత్వ ఉద్యోగస్తులకు తెలియదు. అదే సొమ్ముతో ఈ ఆర్థిక సంవత్సరానికి రైతుల రుణాలను మాఫీ చేసి ఉంటే ఎందరో రైతులు రుణవిముక్తి పొంది, సమస్యల నుంచి కొం తైనా ఊరట కలిగేది. అలాగే పలువురు రైతుల ఆత్మహత్యలను కూడా ఆపగలిగే వారమేమో కాస్త ఆలోచించండి? పి.పాపారావు జగ్గయ్యపేట, శ్రీకాకుళం జిల్లా గురుకుల విద్యార్థుల స్థానికత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1972 నుంచి దశల వారీగా కొన్ని జిల్లాలకు ఉమ్మడిగా కొన్ని గురుకుల పాఠశాలలు స్థాపించారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉత్తమంగా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇటీవలి వరకు ఈ పాఠశాలలు మంచి ఉత్తీర్ణతతో ఒక వెలుగు వెలుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు గురుకుల విద్యార్థులు స్థానికత విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుండటం ఎవరికీ తెలియకుండా పోతోంది. ఉత్తమ విద్య అందిస్తారనే కారణంతో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు దాటి వీరు జోనల్ పాఠశాలల్లో చదివారు. కాని వీరు ఏ జిల్లాలోని జోనల్ స్కూల్లో చదివితే అక్కడే ‘లోకల్’గా ప్రకటిస్తున్నారు. వాస్తవంగా వీరికి మినహాయింపు ఇవ్వవచ్చు. దానికి 1 నుంచి 4వ తరగతి స్థానికతనే పరిగణనలోకి తీసుకోవచ్చు. అలా తీసుకోవటం లేదు. ఇలా చేయటం వలన వారు ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్ల వలసివస్తోంది. కేవలం చదువు కోసం వెళ్లి జీవితాంతం ఇలా బాధలు పడుతున్నారు. కానీ ఈ విషయమై ఎన్ని విన్నపాలు ఇచ్చినా పట్టించుకున్న వారు లేరు. పైగా ఏ జిల్లాలో అయినా జోనల్ స్కూలు ఉంటే అక్కడ చదివిన గురుకుల విద్యార్థులకు అదే లోకల్ అవటం వలన ఉద్యోగాలలో స్థానికులకు అన్యాయం జరుగుతున్నది. ఇప్ప టికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలి. బి.శంకరరావు సీతారామపురం, తుని, తూ.గో. జిల్లా ఆహార భద్రత కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల విషయంలో పారదర్శకత పూర్తిగా లోపించింది. రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం, మూడు గదుల ఇల్లు ఉన్న వారికి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం లేని వారికి ఆహారభద్రత కార్డులివ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. కానీ, నేటికీ మధ్యతరగతి కుటుంబా లలో చాలామందికి ఈ కార్డులు రాలే దు. పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వీటిని తప్పనిసరిగా అందించాల్సి ఉంది. ఒక్క ఆహార భద్రత కార్డులే కాదు కుటుంబంలో కనీసం ఒక్కరి కైనా పెన్షన్ సదుపాయం కల్పించాలి. వితంతు, విక లాంగ, బీడీ కార్మిక, వృద్ధాప్య పెన్షన్లలో ఏదో ఒకటి అందించాలి. దీనివల్ల ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబానికీ లబ్ధి చేకూరుతుంది. నవ తెలంగాణ నిర్మాణం కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చడంతోనే మొదలుకావాలి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నిత్యం అవసరమైన సంక్షేమ చర్యలను చేపట్టి అమలుచే యాలని అభ్యర్థన. తవుటు రామచంద్రం జగిత్యాల, కరీంనగర్ -
సెలవుల్లోనూ భోజనం
ఇన్ బాక్స్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవులలో కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోని నిరుపేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ ఆహారం అందుతుంది. కానీ వేసవి, దసరా, సంక్రాంతి సెలవులలో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో నిరుపేద విద్యా ర్థులు పస్తులుండాల్సి వస్తుంది. కావున ప్రభుత్వం మానవతా దృక్ప థంతో సెలవు దినాలలో కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. సెలవు దినాలలో కూడా మధ్యాహ్న భోజనం చేయడానికి ఆసక్తి కలిగిన విద్యార్థుల వివరాలు సేకరించి, వారికి ఆహారం అందించే విధంగా చూడాలి. సెలవుదినాల్లో ఈ పథకం అమలుకు ఆయా ప్రాంతాలలోని విద్యావంతులను తాత్కాలిక పద్ధతిలో నియమించి, వారికి గౌరవ వేతనం ఇవ్వాలి. ఒకవేళ ఉపాధ్యాయులకు సెలవుల్లో కూడా ఈ పథకం అమలు బాధ్యత ఇవ్వాలనుకుంటే సంఘాలతో చర్చించి వారికి సంపాదిత సెలవులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. సెలవుల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా నిరుపేద విద్యార్థులకు ఒకపూట సంపూర్ణ ఆహారం అందడంతో పాటు, పౌష్టికాహారం లభించి చురుకుగా తయారవుతారు. బి. ప్రేమ్‌లాల్ వినాయక్‌నగర్, నిజామాబాద్ రైళ్లలో భద్రత డొల్లేనా? చట్ట సభల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు మాత్రమే మహిళల భద్రత గురించి ప్రస్తావిస్తారు, మళ్లీ మామూలే! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రైలులో ప్రయాణికులు ముఖ్యం గా మహిళా ప్రయాణికులు తమ విలువైన బంగారు నగలు పోగొట్టుకోవడమే కాకుండా, గాయాలపాలైన సంఘటనలు జరుగుతూనే ఉండటం శోచనీయం. నిన్నటికి నిన్న నెల్లూరు శివార్లలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన సంఘటన, మొన్న 10 రోజుల క్రితం మరో మహిళా ప్రయాణికు రాలి బ్యాగ్‌లో నగలు మాయమవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు? కానీ ఇంతవరకూ ఏ ఒక్క కేసు కొలిక్కి రాకపోవ డం మన రైల్వే శాఖ పనితీరుకు అద్దం పడు తున్నది. ఇలా దొంగతనం జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం పరిపాటైపోయింది. మహిళలకు మాత్రమే కేటా యించిన బోగీల్లో పురుషులు ప్రవేశిస్తున్నా పట్టించుకోరు. ఖాళీ బోగీలలో ప్రయాణిస్తున్నప్పుడు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు, నిఘా పెట్టడం గురించి ఏ ఒక్కరూ ఆలోచిం చరు. ఇప్పటికైనా రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉమా రాజిరెడ్డి వివేక్‌నగర్, హైదరాబాద్ నిర్భాగ్య నగరం! నగరంలో పెట్రోలింగ్ పెంచినా అంతంత మాత్రమే! కీలక ప్రాంతాలకే అది పరి మితం. ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు నగర ప్రజలను భయాందోళ నలకు గురిచేస్తున్నాయి. బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి వచ్చేవరకూ నమ్మకం లేదు. ఎక్కడా భద్రత లేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కు బిక్కు మం టూ గడపవలసిన పరిస్థితి దాపురించింది. అత్యంత భద్రత గల నగరంగా తీర్చి దిద్దుతామని గొప్పలు చెప్పిన మన సర్కారు చేతలలో మాత్రం చతికిలపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పెట్రోలింగ్ వాహనాలు కేవలం వీఐపీలు నివసించే ప్రాంతాలకే పరిమితమవడం శోచనీయం. నిన్న ఐఏఎస్‌ల నివాస ప్రాం తంలో యువతి దహనం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాక్షాత్తు హోంమంత్రి విచారం వెలిబుచ్చడం ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు! అలాగే బేగంపేటలో ఒక చాయ్ ఆలస్యమైనందుకు హత్య జరగడం నగర ప్రజలను భయాందోళన లకు గురిచేస్తోంది. మనిషి ప్రాణం తీయటమంటే ఏదో చీమనో దోమనో చంపి నంత తేలికగా మారిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నేరగాళ్లు రెచ్చి పోతూనే ఉన్నారు. ఇంక నగర శివారు ప్రాంతాలలో గస్తీ అంతంత మాత్రమే. హత్యలు, గొడవలు ఆగటం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు శివారు ప్రాంతా లలో గస్తీ పెంచాలి. ఇప్పుడు ఈ కొత్త పోలీసింగ్ వాహనాలు తెల్లవారు జామున ఎక్కువగా, హోటళ్ల ముందు, చాయి తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటిైకైనా పోలీసులు, అన్ని ప్రాంతాలలోనూ గస్తీ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ పోలవరం ప్రాజెక్టు గోదావరిపై పోలవరం ప్రాజెక్టు గురించి గత 30 ఏళ్లుగా చర్చలు జరు గుతూనే ఉన్నాయి. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టేంతవరకు దీనిపై నిర్దిష్ట చర్యలు తీసుకోలేక పోయారు. రాయలసీమ జిల్లాలకు కూడా నీరందేలా పోలవరంని కృష్ణానదితో అనుసంధానిస్తానని వైఎస్ అధికారంలోకి వచ్చాక వాగ్దా నం చేశారు. అధికారంలో ఉండగా దీని గురించి ఎన్నడూ ఆలోచించని చంద్రబాబునాయుడు నిధులు ఎక్కడినుంచి వస్తాయంటూ అవహేళన చేశారు. పైగా ఈ ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడుతారని ప్రకటించారు. ఇదే వ్యక్తి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇంకా ఆచరణ రూపం దాల్చకముందే దాని సమీపంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆగమేఘాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. సాగునీటి ప్రాజె క్టుల గురించి ఏనాడూ ఆలోచించని చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఇంతగా అంగలార్చడం... ఒక్క కాంట్రాక్టర్లను మినహాయిస్తే మిగతా అందరినీ గాభరాపెడుతోంది. ఎందుకంటే పట్టిసీమ ప్రాజె క్టును అధిక అంచనాలతో కాంట్రాక్టర్లకు దఖలు పరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని కేంద్ర ప్రాజెక్టుగా స్వీకరిస్తున్న తరుణంలో పోలవరం మినీ ప్రాజెక్టుగా పట్టిసీమను చేపట్టి ధనం దుబారా చేయడ మెందుకు? పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న ఈ తొందర పాటు చర్యలు ఏమాత్రం సమర్థనీయం కావు. కె.ఎమ్. లక్ష్మణరావు విశాఖపట్నం ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాలేవీ? ఆంధ్రప్రదేశ్‌లో యువత ఉద్యోగాల కోసం వేయికళ్లతో ఎదురుచూ స్తోంది. ఉద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏమా త్రం కృషి చేయడం లేదు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యో గరహిత రాష్ర్టంగా మారుస్తామన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచింది. అయితే ఇంతవరకూ ఏ ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయ లేదు. ప్రస్తుతం రాష్ర్టంలోని వివిధ శాఖల్లో ఖాళీలు లక్షలాదిగా ఉన్నా యి. ఇప్పటివరకూ డీఎస్సీ మినహా ఏ ఒక్క నోటిఫి కేషన్ వెలువడలేదు. దీంతో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగులు, ఉద్యోగ అర్హతకు వయోపరిమితి మించి పోతుండటంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతు న్నారు. ఇటీవల పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. ప్రభు త్వం వెంటనే స్పందించి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగం కొంతవ రకైనా తగ్గుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను నిరుద్యోగ రహిత రాష్ర్టంగా మారుస్తామన్న సర్కారు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగుల కష్టనష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఏలికలపైనే ఉంది. బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా ప్రతిపక్షాల గోడు పట్టించుకోరా? అసలు ప్రతిపక్షం వద్దా? పాలక పక్షం ఉంటే సరా అనిపిస్తోంది మన సభాపర్వం!. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయటం ఎంతవరకు సమంజసం? ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పాలక పక్షం గమనించాలి! మీడియాను కూడా పాలక పక్షం వైపే చూపెట్టి నిజానిజాలను నిర్వీర్యం చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే చెల్లింది. సభలో పాలక పక్షం సభ్యుడు బొండా ఉమా చేసిన అనుచిత వ్యాఖ్యలతో ప్రజలకు ఔరా ఇది శాసన సభేనా? అనిపించింది. ఏవైనా విభేదాలు ఉంటే పరస్పరం సామరస్యంగా చర్చించుకోవాలి గానీ ఇదేమి తీరు? ఏది ఏమైనా పాలక పక్షం ఆగడాలు మితి మీరిపోయాయనడానికి అసెంబ్లీలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. సభలో వైకాపా అడిగిన ప్రశ్నలకు జవాబులు లేక ఇలాంటి ఆరోపణలు చేసి సభను తప్పు తోవపట్టించిన ఘనత పాలక పక్షానిదే అని పలువురు విమర్శి స్తున్నా ఇంకా ముఖ్యమంత్రి అదే తీరుతో వ్యవహరించడం బాధాకరం. ఇప్పుడు అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు... రేపు ప్రతిపక్షంలో కూర్చునే సమయం కూడా వస్తుందని అధి కార పార్టీ వాళ్లు గమనించాలి. కనుక ఇప్పటికైనా అధికార పక్షం సభలో హుందాగా వ్యవహరించాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజు త్వర లోనే వస్తుంది. శిష్ట్లా మురళీసుధాకర్ చందానగర్, హైదరాబాద్ -
ఇది తిరోగమనమా? పురోగమనమా?
ఇన్ బాక్స్ మార్చి 1న తెలంగాణ రాష్ట్ర సీపీఎం ప్లీనరీ సమా వేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చేతి వృత్తులను పునరుద్ధరిస్తామని సీపీఎం నాయ కులు ప్రకటించారు. కొందరు చెప్పులు కుడుతూ, కొందరు పాలిష్ చేస్తూ కుల వృత్తులకు పూర్వ వైభ వం తీసుకొస్తామని ఫొటోలు దిగారు. కమ్యూనిస్టులు ఇంత అశాస్త్రీయంగా, అనాలో చితంగా ఎలా మాట్లాడతారో? చెప్పులు కుట్టే వృత్తిని పునరుద్ధరిస్తాం, ఆ పనికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పులు కుడుతూ ఫొటోలకు ఫోజు లిస్తే అది అత్యంత మహిమాన్వితం కాజాలదు. చెప్పులు కుట్టే వృత్తి గాని, ఇతర చేతివృత్తులు గాని కాలక్రమంలో అవి ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మార్గనిర్దేశనం చేయా ల్సిన వారు ఇలా మహాసభల సందర్భంగా కొంద రిని ఆకర్షించడానికి మాట్లాడటం, పాట్లు పడటం సమంజసంగా లేదు. చేతివృత్తుల్లో భృతి లేదు. గిట్టుబాటు కావడం లేదు. సరైన ‘డిమాండ్’ లేదు. డిమాండ్ లేని దాన్ని ‘సప్లై’ చేస్తే నష్టపోయేది సదరు వ్యక్తులే. ఈ విష యం చేతివృత్తుల వారు చాలా కాలం క్రితమే గుర్తిం చారు. జీవనానికై కొత్త బాటలను ఎంచుకుంటు న్నారు. ఇది కాల ధర్మం. అంతేగాని ప్రపంచీకరణ కారణంగా ఇది జరుగుతోందని విశ్లేషించుకోవడం విషాదం. ప్రపంచీకరణ ఛాయలు లేనప్పటి తరా లైనా ఆ వృత్తి నుంచి బయట పడటానికి పడరాని పాట్లు పడ్డాయి. ఇప్పుడు షష్టిపూర్తి చేసుకున్న వారు తమ యుక్త వయసులో చేతి వృత్తుల నుంచి దూరం జరిగిన వారే. ఎందుకంటే అందులో మెరుగైన జీవ నం లేదని ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తెస్తామంటున్న నాయకులు, మేధావులు తమ తమ వృతు ్తలకు ఎప్పుడో దూరమైన విషయం మరచి ఇప్పుడు హిపోక్రసీతో మాట్లాడితే ఎలా? మేధావులు, నాయకులు ఎప్పుడు... ఏది చెప్పినా అది ఆచరణ సాధ్యమయ్యేదిగాను, ప్రజల జీవన విధానం మెరుగుపడేందుకు ఉపకరించేది గాను ఉండాలి తప్ప ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా ఉండకూడదు కదా! వాస్తవానికి ఇప్పుడు చెప్పులు కుట్టే వృత్తి దశాబ్దాల క్రితమే కనుమరు గైంది. చెప్పుల, బూట్ల తయారీ ఫ్యాక్టరీలు వచ్చా యి. అనేక బ్రాండ్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పులు కుట్టే వృత్తికి ప్రాసంగికత ఉందా? ఉంటుందని వామపక్ష నాయకులు, మేధావులు భావిస్తున్నారా? పారిశ్రామిక విప్లవం వచ్చి దాదాపు రెండు శతాబ్దాలు అవుతున్నా, అనంతరం అనేక సాంకేతిక, సామాజిక విప్లవాలు చోటుచేసుకున్నా, ఇప్పుడు ప్రపంచం ఒక కక్ష్యలో ప్రవేశించి అనూహ్య వేగంతో, చాలా మంది ఊహకు అందనంత రీతిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దూసుకు పోతూ ఉంటే కొత్త తరాలు ఆ దారుల వెంట పరుగులు పెడుతుంటే వామపక్షాల నాయ కులు, కొందరు మేధావులు, శతాబ్దపు క్రితం నాటి చేతి వృత్తుల పునరుద్ధరణ, నాటి పునర్ వైభవం గూర్చి మాట్లడటం తిరోగమన వైఖరే తప్ప, పురోగ మన దృక్పథం కాదు. చెప్పులు కుట్టే వృత్తి నుంచి వచ్చిన వారికి విద్య అబ్బేలా చూసి, వారి నైపుణ్యాలు పెంచి, సాం కేతిక అవగాహన కల్పించి, చెప్పుల తయారీ భారీ కర్మాగారాల్లో పనిచేసేందుకు తర్ఫీదు ఇచ్చేలా ప్రోత్సహించడం, లేదా ఆయా వ్యక్తుల అభిరుచి మేరకు, ఆసక్తి మేరకు కొత్త వృత్తిలో (ఇంజనీరింగ్ మరొకటో) చేరేలా ప్రోత్సహించి ఈ కాలానికి తగ్గ ఆదాయం లభించే వృత్తిలో నైపుణ్యం సాధించమని సహకరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అంతే తప్ప ఇప్పుడు చెప్పుల జత తయారు చేసి మార్కె ట్లో అమ్మకానికి పెడితే డిమాండ్ లేకపోవడమే గాక అమ్మినా కూలి గిట్టుబాటు కాదు. కావడం లేదు. ఈ విషయాన్ని దశాబ్దాలుగా ఆయా చేతి వృత్తుల వాళ్లు నెత్తి నోరూ కొట్టుకున్నా పట్టించుకోకుండా తమ జండా ప్రాభవం పెరిగేందుకు ఇలా అమాయకు లను ఉద్దేశించి అమాయకంగా, అశాస్త్రీయంగా ప్రక టనలు గుప్పించడం సబబు కాదు. సెల్‌ఫోన్, యాప్స్, కంప్యూటర్ ఉపయోగిస్తున్న వారేనా ఇలా మాట్లాడేది! పేద ప్రజల బతుకులు బాగు చేస్తాం. వారికి సాధికారత సాధించి పెడతామని తాపత్రయపడే వామపక్షాలు ఎంత నిశితమైన విశ్లేషణ చేసి నికార్స యిన ప్రకటనలు చేయాలి? వాటన్నింటినీ గాలి కొదిలేసి ‘గాలివాటం’ నినాదాలు, కాలం చెల్లిన ప్రక టనలు, విశ్లేషణలు చేసి ఎవరిని ఆకట్టుకుంటారు? ఉప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్టు -
స్ఫూర్తి ప్రదాతలు
ఇన్ బాక్స్ మారుతున్న జీవనశైలితోపాటు మనుషుల్లో కూడా మానవత్వం ఉం దని నిరూపించే జీవన దానం ఒక గొప్ప ఆదర్శమని రుజువు చేసిన మణికంఠ అనే డ్రైవర్ నేడు తెలుగువారికి స్ఫూర్తిదాతగా నిలిచారు. తాను చనిపోతూ కూడా ఐదుగురు ఆపన్నులకు ప్రాణదానం చేయ డాన్ని జాతి మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి చివరి నిమిషంలో కూడా తోడ్పాటు నందించాలని భావించే ఈ ఉత్కృష్ట గుణంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. వందల కిలో మీటర్ల దూరం నుంచి అవయవాలను శరవేగంగా తరలించి సంబం ధిత ఆసుపత్రికి చేర్చడంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత కీలకం. అవయవ దానం చేయడం ఒక వంతు అయితే, దాన్ని నిర్దిష్ట సమయంలో అవసరమైన రోగులకు అందించడంలో పోలీసులు అంది స్తున్న సేవలు అమోఘం. యశోదా ఆసుపత్రిలో ఇటీవల ఇలాగే గుండె చికిత్సను సకాలంలో నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మన దేశం ఖర్మకొద్దీ వీఐపీల సేవల్లోనే మునిగిపోతున్న పోలీసుల పట్ల ప్రజ లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నా, ఇలాంటి మానవీయ అంశాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టడం వారిపై సదభిప్రాయాన్ని పెంచు తోంది. ఎంతోమంది మణికంఠలు ముందుకు రావాలి. ఎందుకంటే ఆపత్కాలంలో నిజమైన సహాయాన్ని అందించేది పేదలే. వీరే మానవ లోకంలో మణిదీపాలు. శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ మృత్యుంజయ యాగమా? తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహామహులంతా వరుసగా కాలం చేయడం టాలివుడ్‌కి అరిష్టంగా భావిస్తూ కళాకారుల క్షేమం కోసం, మృత్యుంజయ యాగం నిర్వహించనున్నట్లు ఇటీవల నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. చిత్రపరిశ్రమలో ఆకస్మిక మరణాలను నియం త్రించడానికి పరిపూర్ణానందస్వామి వారిచేత మనుషు లను సజీవులుగా ఉంచే యాగం చేయాలన్నది వీరి లక్ష్యం. సినీ ప్రముఖుల మరణాలకు అసలు కారణాలు మరొక చోట ఉండగా మృత్యుంజయ యాగాలతో ఆ మర ణాలను ఆపివేయాలనుకోవడమే హాస్యాస్పదం. చిత్ర సీమలో నటీనటులు తమ మేకప్ కోసం నిత్యం ఉపయోగి స్తున్న రసాయనాల ప్రభావం, ఆహార నియమాలు ఏమాత్రం పాటించ కపోవటం, మాదక ద్రవ్యాలు, మద్యం అతిగా సేవించడం, వేళా పాళా లేని షెడ్యూళ్ల భారం వంటివి టాలివుడ్లో ఆకస్మిక మరణాలను బాగా పెంచుతున్నాయి. పైగా హైదరాబాద్ వాసులు హుస్సేన్‌సాగర్ నీటితో పండించిన పంటలు ఉపయోగించడం, భారీ పరిశ్రమలు విడుదల చేస్తున్న విషవాయువుల వలన కాలుష్యం కోరల్లో చిక్కి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. హుస్సేన్ సాగర్ నీటిని ప్రక్షాళన చేసే కార్యక్రమం ఎంత త్వరగా పూర్తి చేస్తే మహానగరంలో ప్రజల ఆరోగ్యానికి అంతగా భరోసా ఉంటుంది. ఎ.వై. శెట్టి సీనియర్ సిటిజన్, పత్తిపాడు అపరిశుభ్రతకు ఆవాసాలు జంటనగరాల్లో ఆర్టీసీ బస్టాండ్లు మహత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుక్ నగర్ ఇలా అవీ ఇవీ అనే తేడా లేకుండా అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులతో రద్దీగా ఉండేచోట మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు గొడుతున్నా పట్టించుకునే నాధు లులేరు. ఆ మరుగుదొడ్లు ఉపయోగిస్తే రోగాలు రావడం ఖాయం. అటువైపుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు ముక్కుమూసుకుని వెళ్లవల సిన పరిస్థితి దాపురించంది. మరి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇక తినుబం డారాల స్టాల్స్ విషయం చెప్పే పనిలేదు. ఇష్టం వచ్చిన రేట్లతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం పండుగ పబ్బం అంటూ రెట్టింపు చార్జీలు వడ్డిస్తూ ప్రయాణి కుల నడ్డి విరవడం సమంజసమా? బస్టాండులలో ఈ అసౌకర్యం పట్ల ఒక్క అధికారి కానీ, సంబంధిత మంత్రి కానీ నిలదీసిన పాపాన పోలేదు. ఇక భద్రత విషయం అంతంత మాత్రమే. ఏ ఇద్దరూ ముగ్గురూ పోలీసులు అక్కడ తచ్చాడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం. మళ్లీ సద్దుమణగటం షరా మామూలే. ఆకస్మిక తనిఖీలను అధికారులు చేపడుతున్నారో లేక చూసీ చూడనట్లు ఊరకుంటున్నారో తెలియని పరిస్థితి. వేలాది ప్రయాణికు లకు నిత్యం కలుగుతున్న ఈ అసౌకర్యాల పట్ల ఇకనైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాలని విన్నపం. శిష్ట్లా అన్నపూర్ణ చందానగర్, హైదరాబాద్ -
చిత్రసీమను వీడిన మరో తార
ఇన్ బాక్స్ రామానాయుడు మృతితో తెలుగు జాతి మరో తేజోపుంజాన్ని కోల్పోయినట్టయింది. ఆ లోటు పూడ్చలేనిది. నేనూ, శ్రీ రామా నాయుడుగారు 13వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ తరఫున మొద టిసారి ఎంపీలం. రాజకీయాలకు కొత్త. 1999 నుంచి ఐదేళ్లపాటు పార్లమెంటులో కలసి పనిచేశాం. ఆయన చిత్తశుద్ధి, పట్టుదల, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూడగలిగాం. సాధారణంగా వేరే రంగంలో అప్పటికే లబ్దప్రతిష్టులైన వారు చట్టసభల్లోకి వస్తే, మాతృ రంగా నికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రజాసేవకి ఇవ్వాలనుకోరు. అయితే ఆయన పార్లమెంటరీ విధివిధానాలు తెలుసుకోవడానికి కనపర్చిన ఆసక్తి, తన విస్తృత పరిచయాల ద్వారా నియోజక అభివృద్ధికి అద నపు నిధులు తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు అబ్బురపరిచేవి. ముఖ్యంగా తన నియోజకవర్గం బాపట్లలో క్రీడామైదాన స్టేడి యంలు ఏర్పాటు చేయమంటూ సంబంధిత మంత్రి ఉమాభార తిని కనబడినప్పుడల్లా కోరేవారు. జన్మభూమి తదితర ప్రభుత్వ నిధులతో బాటు తన సొంత ట్రస్ట్ నిధులతో మంచి అభివృద్ధి కార్య క్రమాలు చేశారు. అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి వెం కయ్యనాయుడు గారిని, ఆ శాఖ సలహా సంఘ సభ్యులమైన నేనూ, మరికొంత మంది పార్లమెంటు సభ్యులందర్నీ బాపట్ల నియోజక వర్గ పర్యటనకి తీసుకువెళ్లారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఎంపీలెంత గానో ప్రభావితులయ్యారు. 2002 డిసెంబర్ 13వ తేదీ బాగా గుర్తు. పార్లమెంటు సమావేశం మొదలయీ అవగానే వాయిదా పడింది. పార్లమెంటు భవనంలో పార్టీ కార్యాలయంలో టీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం. ఆయన నవ్విస్తూ చెప్పే కబుర్లదే అలాంటి సందర్భాల్లో ముఖ్య భూమిక. ఇంతలో బయట బాంబు శబ్దాలు. తీవ్రవాదుల దాడి. ఒక్కసారిగా అంతా సస్పెన్స్ సినిమా సీనుగా మారిపోయింది. మిగతాదంతా చరిత్ర. ఆయన కొలీగ్స్‌తో ఎంతో కలివిడిగా, స్నేహభావంతో ఉండేవారు. నన్ను వైద్యసలహాలు అడిగేవారు. సరదాగా సినిమా స్క్రిప్టులు చద వమని ఇస్తుండేవారు. నేను ఎంపీగా ఉంటూ, వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ప్పుడు, ఎంతో దూరంలో ఉన్న ఆయన వెంటనే ఫోన్ చేశారు. అలా చెయ్యొద్దు అని చెప్పారు. అయితే ఆ పీరియడ్ తర్వాత ఆయనే రాజకీయాలకు దూరమవడం, అలా ఉండాలనుకోవడం విచిత్రం. ఆయన రాజకీయాల్ని కొనసాగించి ఉంటే ప్రజలకు మరిన్ని సేవలందేవేమో? ఎంచుకొన్న రంగమేదైనా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, క్రమశిక్షణతో ఇష్టపడి చెయ్యడం ఆయన నైజం. అందుకే ఆయన లెజెండ్. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. డా॥డి.వి.జి.శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం శ్రీవారి ఆలయంలో హైరానా? దేశంలోనే అత్యంత పెద్ద ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా యావత్ ప్రజల పూజ లందుకుంటున్న దేవదేవుడి సన్నిధిలో, ఎప్పుడూ ఏదో ఒక సమస్యే!వెంకన్న సన్నిధి అపవిత్రం అవుతోందనడానికి నిలువెత్తు సాక్ష్యం నిన్నటి బంగారు వాకిలి ముందు తలుపులు తెరుచుకోకపోవడం.. అదీ ఒక విదేశీ అతిథి ముందు ఇలా జరగడం దురదృష్టకరం. ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తిరుమల భక్తులకు అందించే సౌకర్యాలు సమాచారం కేవలం కాగితం మీది రాతలకే పరిమితమౌతోంది. అక్కడ ఎంత మంది సిబ్బంది ఉన్నా సామాన్య భక్తులను పట్టించుకునే నాథుడే లేడన్నది అక్షర సత్యం. ఇంక కొండ మీద జరిగే అపచారాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇంక అలిపిరి దగ్గర భద్ర త అంతంత మాత్రమే! ఇది అవకాశంగా తీసుకుని, మద్యం, సిగరెట్లు మాదక ద్రవ్యాలు మొదలైనవి కొండ మీదకు చేరవేయడం శోచనీ యం. ఏదో రకంగా తిరుమల అపవిత్రం అయిపోతోంది. కాబట్టి అధికారులు తిరుమల పవిత్రతపై ఇకనైనా దృష్టి పెట్టాలి. ఎస్. పద్మావతి చిక్కడపల్లి, హైదరాబాద్ -
మాతృభాషకు అపచారం
ఇన్ బాక్స్ ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత స్థానికుల భాషలోనే అన్ని లావాదే వీలు జరగాలని విజ్ఞులు భావిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దేమిటి? తెలుగువారంతా జీతాలు ఇచ్చి మరీ ఆంగ్ల భాషకు పట్టం కడు తున్నారు. పైగా ఇలాంటి మౌలిక అంశాలపై దిశానిర్దేశం చేయవలసిన న్యాయస్థానాల నుంచి కూడా తెలుగుభాషకు న్యాయం లభించడం లేదు. హైకోర్టుతో సహా అన్ని స్థాయిలలోను కోర్టులు, అన్ని ఇతర ప్రభు త్వశాఖలు, పోలీసుస్టేషన్లు, ఆఖరికి శాసనసభ, మండలి, సచివాలయా లలోను ఆంగ్లమే రాజ్యమేలుతోంది. ఇంగ్లిష్‌లోనే తెలుగు రాష్ట్ర పాలన సాగుతోంది. రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైన ఈ ప్రక్రియ 2-6-2014 నుంచి మొదలైంది. ఇంగ్లిష్‌లోనే దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తున్నా రు. అధికారభాషా చట్టం-1966ను పూర్తిగా పక్కనపెట్టారు. చాలామం దికి అర్థంకాని ఆంగ్లంలోనే కోర్టులు కూడా తీర్పులను వెలువరిస్తు న్నాయి. వాదులు, ప్రతివాదులు, న్యాయవాదులు అంతా తెలుగులో తమ గోడు వెళ్లబోసుకుంటూంటే, వాటి మీద తీర్పు ఆంగ్లంలో రావడం ఎంతవరకు న్యాయం? ఇంత జరుగుతున్నా మన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నారు. నిజానికి ఈ విషయంలో చైతన్య వంతులు కావలసింది ప్రజలే. మాతృభాషకు న్యాయం చేయలేని ప్రజా ప్రతినిధులను పదవులకు రాజీనామా చేయించాలి. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా తెలుగుకు పట్టం కట్టాలని కోరుతున్నాను. పి. గంగునాయుడు శ్రీకాకుళం తెలంగాణ గాంధీకి నివాళి స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి, జాతిపిత గాంధీ బాటలో, ఆయన నేతృత్వంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, ముఖ్యం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి మరణం తీరనిలోటు. తెలంగాణ ఉద్యమా నికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, సాకారమైన తెలం గాణ రాష్ట్రాన్ని కనులారా వీక్షించిన యోధుడు కృష్ణ మూర్తి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ పోరా టానికి ఎక్కడ తెలంగాణ నినాదం కనిపించినా పరి గెత్తే మనిషి వీరు. 1968లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఏకం చేయడం లో వారు చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ తొలి ఉద్యమంలో స్వర్గీయ జయశంకర్‌తో కలసి అనేక ఉద్యమాలలో పాల్గొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, వివక్షతపై ప్రసంగించిన వ్యక్తి కృష్ణ మూర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా తెలంగాణ ప్రజల మదిలో జీవితాంతం ఉంటారు. అమర్ రహేగా తెలంగాణ గాంధీ.. కామిడి సతీష్ రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా భద్రాద్రిపై చిన్నచూపేలా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలోని దేవాలయాలకు వరాలు ప్రకటిస్తున్నా రు. రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రా నికి 100 కోట్లు ప్రకటించడంతోపాటు కేరళ వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకోసం శబరిమలలో, అజ్మీర్ దర్గా వెళ్లే ముస్లిం భక్తుల కోసం రాజస్థాన్ లోని అజ్మీ ర్లో వసతి గృహాలు నిర్మిస్తాననడం హర్షణీ యం. కానీ మరికొద్ది రోజుల్లో శ్రీరామనవమి రాబోతోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో స్వామివా రికి పట్టువస్త్రాలు సమర్పించే కేసీఆర్ ఇంత వరకు భద్రాచలం రాములవారి ఆలయానికి అభి వృద్ధి నిధులు ప్రకటించకపోవడం గర్హనీయం. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి రాముల వారి దేవస్థానానికి నిధులు ప్రకటించి స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని యావ న్మంది భక్తుల ఆకాంక్ష. భద్రాద్రి రామన్న ఆలయా న్ని అభివృద్ధి చేయడమంటే చారిత్రక స్థలాన్ని అభి వృద్ధి చేయడమని కూడా గమనించాలి. కలకొండ నరేష్ కుమార్ పరకాల, వరంగల్ నష్టపరిహారం చెల్లించాలి తెలంగాణ నూతన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ కాలాల లో సరైన విధంగా వర్షాలు కురవక చాలా మంది వ్యవసాయ రైతులు పంటలు వేసి నష్టపోయారు. పంట చేలు వర్షాల లేమి కారణంగా ఎడారిగా మారి పోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఇటీ వల అధికారులు నామమాత్రంగా నివేదికలు తయారు చేసి ఇచ్చిన నష్టపరిహారం పంపి ణీపై ప్రభుత్వంలో కదలికలు కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రైతుల కష్టా లను ప్రభుత్వాలు నెరవేర్చుతాయని గంపె డాశతో రైతులు ఉన్నారు. ఇటు సంపూర్ణంగా వ్యవ సాయ రుణాలు మాఫీ లేక డబ్బులు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల వారు పేర్కొనడం రైతులను మరింతగా కష్టాల్లోకి నెటుతుంది. కనీసం పంట నష్ట పరిహారమైనా అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న కోటి ఆశలతో రైతులు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పంట నష్టపరిహారం అందించి కరువు కాలంలో రైతులకు అండగా నిలవాలి. వి.నవనీతరావు మద్నూర్, నిజామాబాద్ ఫ్లెక్సీలతో బేజార్ నగరంలో ప్రతీ ఒక్క కార్యానికి అది ఏరకమైన కార్యక్రమమైనా సరే రోడ్లపై పెద్ద పెద్ద బోర్డులు నగరంలో అక్కడా ఇక్కడా అనిలేకుండా ఎక్కడప డితే అక్కడ వెలుస్త్తున్నాయి. ప్రధాన కూడళ్లలో అయితే సిగ్నల్స్ కనిపించక వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నా మన నగర పాలక అధికా రులు మాత్రం కాసుల కోసం ఆశపడి యథేచ్ఛగా ైలెసైన్సులు జారీచేయడం శోచనీయం. వీటివలన నిఘా కెమెరాలకు కూడా ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. పుట్టిన రోజు వేడుక నుంచి ఇంకా అది ఇది అనిలేకుండా అన్ని కార్యక్రమాలకు, అన్ని రాజకీయ పార్టీల వాళ్లు ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఇదివరలో ఇవి కూలి పోయి ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయి. అయినా మళ్లీ అదే తంతు. ఇటీవల దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందించి వీటిని తొలగించమని అధికా రులను ఆదేశించినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే తొలగించాలి. శోంఠి విశ్వనాథం హైదరాబాద్ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలవల్ల వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలనుంచి తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్ల పంిపిణీ ప్రారంభమైంది. అయితే లబ్ధిదారుల వేలిముద్రలు బయోమె ట్రిక్ యంత్రాలలో నమోదు కాకపోవడం, ఆధార్ నంబర్లు గల్లంతు తదితర కారణాలతో వేలాది మందికి పింఛన్లు ఇవ్వలేదు. దీంతో వారంతా పింఛను కేంద్రాలవద్దే మండుటెండలో పడిగాపులు కాయవలసివస్తోంది. కొన్ని ప్రాంతాలలో అయితే గత నెల పిం ఛన్లు అందుకున్న వారి పేర్లు ఈసారి జాబితాలో లేకపోవడంతో వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పింఛన్ల పంపిణీ తయారైందని లబ్ధిదారులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ కార్డులతోనే 5 నెలలు సజావుగా పింఛన్లు అం దజేసి, ఇప్పుడు మళ్లీ బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయడం వెనుక ఏదో గూడుపుఠాని ఉందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యం గా నడుము సహకరించక, పైకి లేవలేక, వంగలేక పింఛను అందుకోవ డానికి వచ్చే వృద్ధుల కష్టాలు చూస్తే ఎవరైనా చలించక మానరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదృష్టితో ఆలోచించి అర్హులైన లబ్ధిదా రులందరికీ యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలి. దేవాంగ రామకృష్ణ సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా గంగ సరే.. కాలువల మాటో గంగా గోదావరి నదుల ప్రక్షాళనను కేంద్ర ప్రభుత్వం చూసుకుం టుంది. ఒకవేళ ఆ నదుల ప్రక్షాళన విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనా నష్టం లేదు. ఎందుకంటే ఆ పని ప్రకృతే చేస్తుంది. జీవనదులన్నింటికీ ప్రతి సంవత్సరం కచ్చితంగా వరదలు వస్తాయి. అంతవరకు ఆ నదుల్లో పేరుకుని పోయి ఉన్న చెత్తా చెదారం, కాలు ష్యం సముద్రంలోకి వెళ్లిపోతుంది. ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ గ్రామీణ ప్రాంతాలకు తాగు, సాగు నీరందిస్తున్న కాలువల ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి. దేశంలోని కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండి పోవటమే కాకుండా, తూడు, గుర్రపు డెక్కతో పూర్తిగా మూసుకుపోయాయి. అలాగే దారుణంగా ఆక్రమణలకు గురై కనీసం నీరు రావటం లేదు. వెళ్లటం లేదు. కాలువలలో పూడిక తీయకపోవడం వల్ల వ్యవసాయానికి ఎంత నష్టం జరుగుతున్నదో కూడా ఆలోచించాలి. కాలువలతో పాటు పంట కాలువల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడం అవసరం. గోదావరి జిల్లాలలో కాలువల మరమ్మతులు సక్రమంగా చేపట్టే ప్రక్రియ చాలా కాలం నుంచి ఆగి పోయింది. దీని వల్ల సేద్యంతో పాటు, చౌకగా సాగే రవాణా కూడా కుంటుపడుతోంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి. ముందుగా కాలువల ప్రక్షాళన చేపట్టండి! విశ్వతేజ చంద్రవరం, ప.గో.జిల్లా -
ఉపాధ్యాయ విద్యలో నాణ్యతేదీ?
ఇన్ బాక్స్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, పట్టణాలలో నెలకొల్పి న ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో చదువుతున్న ఛాత్రో పాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందడం లేదు. దీం తో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత వారు విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించ లేకపోతున్నారు. బీఈడీ, డీఈడీ శిక్షణా కాలేజీల్లో సరైన విద్యార్హతలున్న అధ్యాపకులు ఉండటం లే దు. అందువలన బీఈడీ కోర్సు చేసిన వారే ఛాత్రోపాధ్యాయులకు అధ్యాపకులు గా బోధన చేస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యా య విద్య పట్ల ప్రతి ఒక్కరిలో అనాసక్తత పెరుగుతోంది. మరో వైపున తెలంగాణ ప్రభుత్వం, ఎన్సీటీఈలు ఇబ్బడిముబ్బడిగా ఉపాధ్యా య విద్యా కాలేజీలకు అనుమతులను ఇస్తున్నాయి. దీంతో కేవలం లాభాపేక్ష వైఖరితోనే కాలేజీలు పుట్టుకు రావడంతోపాటు, విద్యార్థులకు నామమాత్రంగానే శిక్షణ అందుతోంది. దీంతో సత్ఫలితాలు రావడంలేదు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నిరంతరం నాణ్యమైన విద్యను అందిం చేలా, అనుభవం గల అధ్యాపకులను నియమించేలా ప్రభుత్వం తగిన చొరవ చూపాలి. - కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా అధిక సంతానమా, నియంత్రణా? గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా అధిక జనాభా వలన దేశం అనేక రంగాల్లో తగినన్ని నిధులు, వనరులు లేక నిర్వీర్యమైపోయింది. యాభై కోట్ల జనాభాను మాత్రమే భరించగల మన దేశం 130 కోట్ల మందిని ఎలా భరించగలగటం అసాధ్యం. దేశంలో రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తీవ్రస్థాయిని చేరడానికి కారణం అధిక జనాభా. కొద్ది మేరకు ధనిక మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. కాని కొన్ని మతాల వారు మరియు సంతానాన్ని ఆదాయ వనరులుగా భావించే కార్మికులు, కూలీలు కుటుంబ నియంత్రణ పాటించకుండా జనాభాను అధికాధికంగా పెంచుతున్నారు. ఫలితంగా ఆ దేశ జనాభా పెరిగిపోతోంది. దీంతో జనాభా సమతుల్యత దెబ్బతిన్నది. కనుక ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే కుల మత రాజకీయాలు పక్కన పెట్టి నిర్బంధ కుటుంబ నియంత్రణ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి. మానవ వనరుల పరంగా దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడం అంటే జనాభాను అదే పనిగా పెంచాలని అర్థం కాదు. రాజకీయ నేతలు అధిక సంతానంపై ఇటీవల చేస్త్నున వరుస ప్రకటనలు ఏ రకంగా చూసినా సమంజసం కాదు. - గోపాలుని శ్రీరామమూర్తి వినుకొండ, గుంటూరు జిల్లా భారత జట్టుకు జేజేలు లబ్ డబ్ .. లబ్ డబ్.. ఇది ఆదివారం భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడు. ప్రపంచకప్‌లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన భారత్, పాకిస్థాన్‌ల క్రికెట్ పోరు ఆద్యంతం కనువిందు చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత ఘన విజయం సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనా... ప్రపంచకప్‌లో మాత్రం తమ తొలి మ్యా చ్లోనే అదర గొట్టే ఆట తీరును భారత జట్టు ప్రదర్శించడం విశేషం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించడంతో, కోట్లాది భారతీయుల ముఖాల్లో ఆనందం పెల్లుబికింది. ఈ మ్యాచ్ ప్రపంచకప్‌కే కళ తెచ్చింది అనడంలో అతిశ యోక్తి లేదు. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత ఆటగాళ్ల సమిష్టి కృషి ఫలితంగానే ఈ విజయం దక్కింది. దీంతో భారత్ వరుసగా ఆరు ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించింది. మన ఆటగాళ్లు ఇదే ఆటతీరుతో విజయ పరంపరను చివరి వరకూ కొనసాగించాలి. గతంలో రెండుసార్లు వరల్డ్‌కప్‌ను మనదేశానికి తీసుకొచ్చిన టీమ్ ఇండియా ముచ్చటగా మూడోసారి కూడా కప్‌ను ఎగురేసుకొచ్చి విశ్వవిజేతగా నిలవాలని ఆశిద్దాం. - బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు బాసర భక్తులకు బస్టాండ్ ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే తల మానికం. ఇది చదువులతల్లి, జ్ఞాన సరస్వతి ఆలయం. నిత్యం వేలాది భక్తులతో శోభాయ మానంగా కళకళలాడుతోంది. భక్తులు తమ పిల్లలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పిల్లలకు అక్షరాభ్యాసం కార్య క్రమంలో పాల్గొని, పూజలు నిర్వహిస్తుంటారు. బాసర సరస్వతిమాత ఆలయ చరిత్ర విస్తృత ప్రచారం లోకి రావడంతో దేశం నలు మూలల నుండి యాత్రి కులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవస్థానం వద్ద భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఆయా సమాజాల వారు ధర్మసత్రాలు, నిత్య అన్నదాన కార్య క్రమం చేపడుతూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాని ఇక్కడ ఒకే ఒక్క లోపం ఏమిటంటే ప్రయాణీకుల సౌకర్యార్థం బాసర సరస్వతి మందిరం వద్ద ఆర్టీసీ బస్సులు రోడ్డు పక్కనే ఉన్న ఇరుకైన స్థలంలో నిలబడ తాయి. వీరి ఇక్కట్లు తీరాలంటే సరస్వతి ఆలయం పక్కనే విశాలమైన పది ప్లాట్‌ఫారాలున్న బస్టాండ్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సత్వరం స్పందించి భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చాలి. - గంగాప్రసాద్ అప్పా బోధన్, నిజామాబాద్ జిల్లా -
నీతి ఆయోగ్ - అవినీతి
ఇన్ బాక్స్ ప్రధాని నరేంద్రమోదీ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రారంభించారు. కాలంచెల్లిన వ్యవస్థలస్థానే ప్రస్తుత అవసరాల కోసం నూతన వ్యవస్థను నెలకొల్పుకోవడం ఎంతైనా అవసరమే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలనా వ్యవస్థలో అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు, ఉద్యోగులలో కూడా జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నాలకు పూనుకోవడం ప్రశంసించదగిన విషయమే. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెం ట్‌తో జీతాలు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో కుల, ఆదాయ, నివాస, బర్త్ సర్టిఫికెట్ల జారీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం కనబడేలా సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఆహారభద్రత, ఆసరా, 58, 59 నంబర్ పట్టాల జారీ కోసం సుశిక్షితులైన ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది. నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు రాక మునిసిపల్ కార్యాల యాల్లో గంటల తరబడి వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నందున తాహసీ ల్దార్లకే ఆహార భద్రత బాధ్యతలు అప్పగించాలి. ప్రభుత్వ ఉద్యోగులు నీతి, నిజాయితీతో పనిచేసేలా చర్యలు తీసుకొనడమే కాకుండా ప్రతి కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు రాసి ఉంచితే అవినీతికి చాలా వరకు అడ్డుకట్టలు వేయవచ్చు. రాజీవ్ అమన్, కరీంనగర్ మత వాదమా! మానవతా వాదమా? ఎంతో మంది మేధావులు, జాతీయ నాయకులు ఆనాడు మన దేశానికి ఒక విధానపరమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించ డం జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం సమకూర్చడమే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటు వంటి రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక అనే పదాలు తొలగించాలని ఇటీవల కొంత మంది ప్రకటనలు చేయడం హేయమైన చర్య, రాజ్యాం గాన్ని అవమానించడమే అవుతుంది. ప్రజాస్వామ్యయుత మైన భారతదేశ ప్రభుత్వానికి ‘‘పవిత్ర గ్రంథం రాజ్యాం గం’’. ఇంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగంలో 42వ సవ రణ ద్వారా చేసిన సామ్యవాద, లౌకిక పదాలు తొలగించా లనడం చాలా విడ్డూరం. స్వేచ్ఛ సమానత్వం, న్యాయం, వర్గరహిత సమాజం, ప్రభుత్వ పరమైన పరిశ్రమల ఏర్పా టు వంటి వాటికి సామ్యవాదం ప్రాముఖ్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తుం ది. మనదేశంలో భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీక రణలు సామ్యవాద స్థాపన చేయడంలో చేసిన కృషిగా చెప్పవచ్చు. పెట్టుబడుల కోసం సంస్కరణలు కాకుండా సామ్యవాద వ్యవస్థను బలోపేతం చేయాలి. భారతదేశం వివిధ మతాల పుట్టినిల్లు. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా... మిగతా వారు కూడా ఉన్నారు. కేవలం భారతదేశంలో హిందువులే ఉండాలి. హిందువుల రాజ్యమని అనడం మానుకోవాలి. మొన్నటికి మొన్న మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో... మతాల మధ్య శాంతి, సౌఖ్యా లు వర్ధిల్లాలని... మతం ఐక్యతను సాధించే సాధ నం... భారతీయులంతా ఐక్యమత్యంతో మెలగాలని కోరారు. మతం అనేది వ్యక్తి అవసరానికి సంబంధించిన ఒక అవసరం. ఇది ఆ వ్యక్తి నమ్మకంపై ఆధారపడి ఉం టుంది. వివిధ మతాలున్న సమాజంలో లౌకికతత్వం ఒక అత్యవసరమైన జీవన విధానం. అందువల్ల మన దేశంలో లౌకికతత్వాన్ని ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎం తైనా ఉంది. మతవాదానికి బదులు మానవతావాదం అవసరం అనే నమ్మకం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది అత్యవ సరం. మహాకవి గురజాడ అప్పారావు ‘‘మతముల న్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’’ అని శతాబ్దం కిందటే అన్న విషయం గుర్తుంచుకోవాలి. బుర్రి శేఖర్ ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా ఈ ఘోరం ఇంకెన్నాళ్లు? హైదరాబాద్ వాటర్ బోర్డు ద్వారా, అలాగే ఇతర ప్రైవేట్ సంస్థల ద్వారా నీటిని అమ్మకాలు జరిపే ట్యాంకర్ల నిర్వాహకులు, వ్యాపారంలో పోటీ కారణంగా వాహనం నడిపేందుకు ఎలాంటి అర్హతలు లేని చిన్న వయసు పిల్లల చేత ట్యాంకర్లు నడిపిస్తూ నగరంలో చాలా ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇటీవల నగరంలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకోబో తున్న ఒక విద్యార్థినిని అన్యాయంగా ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ బలి తీసుకోవడం గర్హనీయం. ఈ ట్యాంకర్లు నడిపే చిన్న వయసు పిల్లలకు ఎలాంటి మానసిక పరిపూర్ణతా ఉండదు. ఇందువల్ల వీరు విపరీతమైన వేగంతో వాహనాలు నడుపుతూ, ప్రమాదాలకు కారణమవుతూ, అమాయ కుల ప్రాణాలు ముప్పు కలిగిస్తున్నారు. అలాగే ఈ వాహనాలకు ఎటువంటి పిట్నెస్లు ఉండవేమోననే అనుమానం కూడా కలుగుతోంది. కాబట్టి, నగరంలో అనేక ప్రమాదాలకు కారకులౌతున్న ఈ నీళ్ల ట్యాంకర్లను కొన సాగించడంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుని, నగర పౌరులకు భద్రత కలిపించగలరని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ హెచ్ఎమ్డబ్ల్యూఎస్ ఎస్ మేనేజింగ్ డెరైక్టర్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకరవర్గాల ప్రజాప్రతినిధులైన రాష్ట్ర శాసనసభ సభ్యులు ఇంజనీరింగ్ విద్యార్థిని అమూల్యమైన ప్రాణాలను బలిగొన్న ట్యాంకర్ ప్రమాదం వంటి ఘటనలను ఇకనైనా తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై కఠిన చర్యలు చేపడితేనే దీనికి అడ్డుకట్ట వేయగలుతాం. ఎం. అశోక్, ఎర్రగడ్డ, హైదరాబాద్ సికిల్ సెల్ నివారణకు చర్యలేవీ? ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గిరిజన సీమల్లో సికిల్ సెల్ వ్యాధి పంజా విసురుతూ ఎందరో చిన్న పిల్లలను బలిగొంటున్నప్పటికీ ఎ.పి. వైద్య ఆరోగ్యశాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీస స్పందన కూడాలేదు. నివారణ చర్యల ఊసేలేదు. జన్యుపరమైన మార్పుల ఫలితంగా వచ్చే ఈ రక్తహీనత జబ్బునకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది. సికిల్‌సెల్ అనీమియా అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో వైద్య, ఆరోగ్యశాఖ ఉండటం దారుణమని చెప్పక తప్ప దు. ఈ వ్యాధికి గురై మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపకపోవడం అత్యంత బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యవైఖరికి ఇది ప్రబల నిదర్శనం. ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్తపరీక్ష ఖరీదు రూ.10కి మించి ఉం డదు. కాగా ఈ వ్యాధి నివారణకు మందులు అందుబాటులో లేవు. వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జబ్బును ప్రాథమిక దశలో గుర్తిం చి తగు మందులు తీసుకుంటే రోగి ఎక్కువ కాలం బతికేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిష్ణాతులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం కామెర్లు ఉండ టం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతుల వేళ్లు వాచి పోయి వంపు తిరగడం, ప్లీహం వాచిపోయి ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని నయం చేసే వైద్య విధానం ఇంకా అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమే. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తున్నా, గిరిజనేతర ప్రాంతాల్లో సైతం ఇది కనిపిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో ఈ వ్యాధి విజృంభిస్తుండగా, విజయ నగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పల్లెల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు సమాచారం. సికిల్ సెల్ అనీమి యా వ్యాధిని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం క్షమార్హం కాదు. ఈ వ్యాధిపై కనీసం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గిరిజనులను, గిరిజనేతరు లను చైతన్యపరచాలి. అలాగే వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహించి రక్త పరీక్షలు జరపాలి. నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్‌పై చర్చించడని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగానే సికిల్ సెల్ అనీమియాపై చైతన్య కార్యక్రమాలలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చాలి. ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చాలి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్టు గానే, మన రాష్ట్రం కూడా తగు విధంగా వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవాలి. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో కూడా సెమినార్లు జరపాలి. వైద్య నిష్ణాతులు అవసరమైన పత్రాలు సమర్పిం చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇకనైనా చొరవ తీసుకోకపోతే గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసి ఉంటుంది. అందరికీ ఆరో గ్యం అనే నినాదం అందని మానిపండుగా మారకూడదు. వి.కొండలరావు, సీనియర్ జర్నలిస్టు, పొందూరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం! ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 ఏళ్లపాటు రాష్ట్ర విభజన అంశం కీలకంగా సాగింది. ఈ నేపథ్యంలో విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. విభజన వలన నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు సహాయం అందించడా నికి కేంద్రం కొన్ని ప్రతిపాదనలను సభ ముందుం చింది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా మని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, పర్యావరణ, ప్రాజెక్టు అనుమతులను సైతం కేం ద్రమే తెస్తుందని తెలిపారు. వీటితోపాటు నూతనంగా రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని విభజన బిల్లులో పేర్కొన్నారు. సభలో ఆనాటి బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యే క హోదాతో ప్రజలు సంతృప్తి చెందరని మాట్లాడారు. ఇప్పుడేమో మాట మార్చి ఇతర రాష్ట్రాలు ఆమోదించే అవకాశం లేనందున ప్రత్యేక హోదా మరచిపోవాలం టున్నారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేని రోజు ల్లో మంత్రి కాని రోజుల్లో, ప్రత్యేక హోదా సాధించా మని ప్రగల్బాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వం ఉండగా ఈ రకమైన మాటలు మాట్లాడ టం ప్రజలను మోసగించడమే అవుతుంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 23,500 కోట్ల రూపా యల ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపా దనలు పంపగా 350 కోట్ల రూపాయలతో సరిపెట్టడం ఏ రకంగా భావ్యమో వారే చెప్పాలి. జిల్లాకు 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే 10 కి.మీ. తారు రోడ్డు వేయ డానికి మాత్రమే సరిపోతుంది. అంతేగాకుండా బడ్జె ట్లో ఏడాదికి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉం దని తెలిసి 500 కోట్లు మాత్రమే కేటాయించడం విచా రకరం. రాజధాని నిర్మాణానికి 1,13,000 కోట్ల నిధు లు అవసరమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 20 వేల కోట్ల రూపాయలు కావాలని కోరింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన బిల్లులోని అంశాలను అమలు పరచా లని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 18న 13 జిల్లాల్లో నిర సన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ విజ్ఞప్తి చేస్తున్నది. కె. రామకృష్ణ, కార్యదర్శి సీపీఐ ఏపీ రాష్ట్రసమితి -
సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు
హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌చార్జీలు, ఇతర కేటాయింపులు 2012 నాటివే నేటికీ కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అను గుణంగా పెంచాలనే డిమాండు ముందుకొస్తూనే ఉన్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా హాస్టళ్లకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు ఉండ టం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలకు అవి ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు/మేట్రెన్లు అనేక అవస్థలు పడు తున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి ఏటా 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకో వటం లేదు. ఒక యంత్రాంగమంటూ లేనందున ప్రభుత్వం పావలా పెంచి, ముప్పావలా ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆ పెంపుదల కూడా ఏదో భిక్షం వేస్తున్నట్లుగా ఉంటున్నది. అసెంబ్లీలో, పార్లమెంట్లో సభ్యుల జీత, భత్యాలను వారే పెంచుకుంటారు. ఉద్యోగు ల వేతనాల పెరుగుదలకు పి.ఆర్.సి లాంటి శాశ్వత యంత్రాంగాలు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో దాదాపు 2,217 హాస్టళ్లలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి మా త్రం ఏ యంత్రాంగమూ లేదు. భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరా స్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాపవుట్ రేటు తగ్గించటానికి, మళ్లీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కాని ఇప్పటికే వసతి గృహాల్లో చదువుకుంటామని వ స్తున్న విద్యార్థులను అర్ధాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్ విద్యార్థులకు కేవలం మెస్ చార్జీలే కాదు. జి.ఓ-126 ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు వాటికి కేటా యింపులు కూడా సరిపోయే విధంగా పెంచాల్సివుంది. కాస్మో టిక్స్, బట్టల కట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్ నిర్వహణ, ట్యూషన్ ఫీజు లను మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించే వస్తువుల కొనుగోలుకి రాష్ర్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఉన్నట్లే వార్షిక సమీక్షా కమి టీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ర్టస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇం దులో కొనుగోలు కమిటీ చైర్మన్, పౌర సరఫరాల అధికారి, ఏఎస్డబ్ల్యూఓ, వార్డెన్, మేట్రన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి ఏటా హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అం దుతున్నాయా? లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికను గుణంగా మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయిం పులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి. ఎం.శోభన్ నాయక్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు కార్టూన్ సూపర్ స్టార్ ఐదు దశాబ్దాలపాటు జాతి అంతర్వాణిగా, సామాన్యుల మనస్సాక్షిగా కోట్లమంది హృదయాల్లో నిలిచిన మహోన్నత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్. భారతీయ ప్రజాస్వామ్యం, రాజకీయాలు నడుస్తూ వచ్చిన బాధామ యమైన ప్రక్రియలో హాస్యాన్ని, చమత్కారాన్ని ఇంత గొప్పగా చిత్రిం చిన కార్టూనిస్టు మరొకరు లేరు. కార్టూన్లలో ఆయన పొందుపర్చిన హాస్య చమత్కార వ్యాఖ్యలు జీవితానికి సంబంధించిన అత్యద్భుత కొటేషన్లుగా రూపొందాయి. సామాన్యుల వాణిని తన రేఖలో ఇముడ్చుకుని అట్టడుగు ప్రజల వేదనను రాజ కీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వద్దకు ప్రతిరోజూ కార్టూన్ రూపంలో తీసుకునిపోయి తన కాలపు కలలను, వాటి వెనుక వాస్తవ జీవిత వేద నను జాతిముందు పరిచిన మాన్యుడు ఆయన. కార్టూన్ అంటేనే ఒక ధిక్కార కళ అని, పరిహాస కళ అని నిర్వచించిన వాడు.. సామాన్యుల తరపున నిలిచి ఆ పరిహాసాన్నే, తిరస్కారాన్నే వ్యంగ్యరేఖగా మలచి పాలకులను హెచ్చరించాడు. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామా న్యుల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన వక్రరేఖే కామన్ మేన్. తన మనోగతాన్నే సామాన్యుల మనోగతంగా మార్చి చూపిన ఈ అపర కార్టూన్ బ్రహ్మకు నివాళి. ప్రత్యూష బంజారా హిల్స్, హైదరాబాద్ -
స్వైన్‌ఫ్లూపై స్పష్టత ఏది?
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాలేదని కొట్టిపారేయడంతోనే ఇటీవల వరకు సరి పెడుతూ వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ప్రజలలో మాత్రం ఈ వ్యాధిపై ఒక భయానక వాతావరణం నెలకొంది. పత్రికలలో స్వైన్‌ఫ్లూ వ్యాధి వలన ఇప్పటికే చాలా మంది మృత్యువాతపడుతు న్నట్లు ప్రతి రోజూ కథనాలు వస్తున్నా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అసలు స్వైన్‌ఫ్లూ లేదని కరాఖండిగా చెబుతూ వచ్చింది. ఇప్పుడు సైతం ఈ వ్యాధితో చనిపోయేంత ప్రమాదం ఉండదని ఊపిరితిత్తులు, కాలే యం, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి స్వైన్‌ఫ్లూ వస్తే పరిస్థితి విషమిస్తుందని తెలుపుతూ చేతులు దులుపుకుంటోంది. మరో వైపున తెలంగాణలోని ప్రధాన ఆస్పత్రులలో సైతం వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటికైనా మేల్కొని స్వైన్‌ఫ్లూ వ్యాధిపై నిజానిజాలు వెల్లడించాలి. ప్రజలలో రోజు రోజుకు పేరుకుపోతున్న భయాందోళనలను పార ద్రోలి, అందరికీ వైద్య చికిత్సకు వీలుకల్పించి భరోసా ఇవ్వాలి. కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ వీరికి విద్యార్హత వద్దా? మన దేశంలో గుమాస్తా పదవులకు కూడా కనీస విద్యార్హతగా 5వ తర గతిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి రాజ్యాంగ విధులను నెరవేర్చే నాయకులకు కనీస విద్యార్హత లేకపోవడం వలన అవినీతి చెర గని సిరాగా మారిపోయింది. పైగా మన నేతలు శాసనసభకు, పార్ల మెంటుకు ఒకేసారి పోటీ చేస్తూ గెలిచాక ఏదో ఒకదాన్ని నిలుపుకుంటూ తక్కిన సీటుకు రాజీనామా చేస్తున్నారు. అలా వదులు కున్న సీటుకు మళ్లీ ఎన్నికలు జరపడం, లక్షలు, కోట్లలో ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా దేశం తీవ్రంగా నష్టపో తోంది. కాబట్టి గెలిచిన వారే రాజీనామా చేసిన నియోజ కవర్గం ఎన్నికల ఖర్చు భరించేలా ఎన్నికల కమిషన్ నిబంధన విధించాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంటర్ ఉత్తీర్ణతను, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి కనీసం డిగ్రీ విద్యార్హతగా నిర్ణ యించాలి. లేదంటే ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ ఉద్యో గులు విద్యార్హత లేని నేతలముందు చేతులు కట్టుకుని మెలగాల్సి వస్తుంది. ఇది ఉన్నత విద్యకే అవమానం. ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఓట ర్లను ఆకర్షించే నేతల వాగ్దానాలపై కొరడా ఝళిపించాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కనీస విద్యను అర్హతగా పెట్టాలి. కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి మురుగన్‌లు మరణించరు ప్రశ్నకు సమాధానం లేనప్పుడు, దౌర్జన్యమే శరణ్యమవుతుంది. భావ స్వేచ్ఛ మీద నమ్మకం లేనప్పుడు దాడే ఆయుధమవుతుంది. ప్రజాస్వా మ్యంలో విశ్వాసం లేనప్పుడు నిరంకుశత్వం పడగ విప్పుతుంది. గతం మీద మత్తు ఉన్నప్పుడు వర్తమానం మీద అసహ నం కలుగుతుంది. తార్కికబుద్ధి లోపించినప్పుడు మౌడ్యం విజృంభిస్తుంది. తమిళ రచయిత మురుగన్ విషయంలో ఇదే జరిగింది. దౌర్జన్యాలకు తలొగ్గి ఒక రచయిత తాను రచయితగా మరణించినట్లు తనకు తానుగా ప్రకటన చేయడం స్వతంత్ర భారతదేశ చరిత్రకు మాయనిమచ్చ. రచన వెలువ డినప్పుడు దాంట్లోని మంచి చెడులను నిర్ణయించడం ఒక నాగరిక చర్య. అలాకాకుండా, రచయిత మీద దాడిచేసి తాను మరణించానని అతడే స్వయంగా ప్రకటించేలా చేయడమంటే మనకు ప్రజాస్వామ్యం ఇంకా జీర్ణం కాలేదని అర్థం. దేశ గౌరవానికి ఇలాంటి సంఘటనలు తలవంపులు తెస్తాయి. ఒక అంశం మీద అందరికీ ఒకే రకమైన అభిప్రా యం ఉండదు. అభిప్రాయ భేదాలను గౌరవించడం కనీస ప్రజాస్వా మ్యం. భౌతిక దాడులతో బౌద్ధిక శక్తులను అణచివేయాలనుకోవడం అప్రజాస్వామికం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ మీద వీరి దాడిని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గర్హించి ఖండి స్తోంది. మురుగన్‌లు ఎన్నటికీ మరణించరని చాటుతున్నది. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం ధూమపాన నియంత్రణ! ధూమపానాన్ని నియంత్రించే దిశగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిజంగానే స్వాగతించదగినవి. దేశం లో 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పొగాకు ఉత్పత్తులను అమ్మాలనడం, సిగిరెట్లు విడిగా అమ్మకూడదనటం.. ఇవన్నీ ధూమ పాన నియంత్రణలో భాగమే. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమ పానం చేస్తే 200ల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తామనడం కూడా మంచి నిర్ణయమే. అయితే ఈ నిర్ణయాలన్నీ కచ్చితంగా అమలయ్యే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కొన్ని సంవత్స రాల క్రితం గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు కలిగించే పొగాకుతో కూడిన ఉత్పత్తులపై నాటి కేంద్ర ప్రభుత్వం ఇలాగే నిషేధం విధించింది. కానీ ఈ ఉత్పత్తులు నేటికీ దేశంలోని ప్రతి దుకాణంలోనూ లభ్యం కావడమనేది, నిషేధం అమలుపై కేంద్ర ప్రభు త్వ నియంత్రణా లోపాలను అత్యంత స్పష్టంగా ఎత్తి చూపుతోంది. దీని ఫలితంగా ప్రకటన చేయడం సాధ్యమే కాని, అమలు అసాధ్యం అని తేలుతోంది. ఇక్కడ ప్రభుత్వమే గాక, ప్రతి పౌరుడూ స్వచ్ఛందంగా వీటి అమలుకు తన సహకారాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తెరిగి నడుచుకోవాలి. సలగల వెంకటేశ్వర్లు, బాపట్ల, గుంటూరు ఉద్యోగులకు జీతాల్లేవా! రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలకుగాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించ డానికి కూడా డబ్బు లేని స్థితిలో పడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. వేలాది కోట్ల మేరకు రైతుల రుణాలను మాఫీ చేయగలిగిన, కోటిమంది తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుక అందివ్వగలిగిన ప్రభు త్వం... తన ఉద్యోగులకు నెల జీతాలుకూడా చెల్లించలేని దుస్థితిలో ఉందా? ఇది నిజమే అయితే దీనికో పరిష్కారం ఉంది. సింగపూర్ తన భూమిని విస్తరించుకోడానికి తన చిన్న దీవి చుట్టూ ఉన్న లోతులేని సముద్ర ప్రాంతాన్ని నివాస యోగ్యంగా చేసుకోవడంలో విజయం సాధించింది. మనం కూడా ప్రతిపాదిత రాజధాని చుట్టూ ఉన్న 50 చద రపు కిలోమీటర్ల పరిధిలోని భూమిని కనీసం 50 ఏళ్లపాటు లీజుకిచ్చి దీనిపై ప్రతి ఏటా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మడం అవసరమయ్యాక ఇక కించపడాల్సిన పనిలేదు. నెపోలియన్ తన యుద్ధావసరాల కోసం లూసియానా ప్రాంతాన్ని అమెరికాకు అమ్మే శాడు. రష్యా జార్ చక్రవర్తి అలస్కాను అమెరికాకు అమ్మేశాడు. చైనా కూడా హాంగాంగ్, మకావూలను ఇంగ్లండ్, పోర్చుగీసులకు వందేళ్లపాటు లీజుకు ఇచ్చేసింది. పోర్చుగీసు రాజు మన ముంబైని బ్రిటిష్ రాణికి కట్నం కింద అప్పగించేశాడు. ఇలా చరిత్రలోని ఆచరణాత్మక అనుభవాలతో కొత్త రాష్ట్రం కూడా సింగపూర్ బాటలో నడవవచ్చు. డాక్టర్ టి. హనుమాన్ చౌదరి, కార్ఖానా, సికిందరాబాద్ -
పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయా?
మన పాలక ప్రభుత్వాలు ప్రస్తుతం పెట్టుబడుల కోసం ఆరాటపడుతున్నాయి. సకల సౌకర్యాలను కల్పిస్తామని దేశదేశాల పెట్టుబడిదారులకు పోటీపడి మరీ హామీలిస్తు న్నాయి. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగావకాశాలు పెరు గుతాయని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నాయి. పెట్టుబ డులకు భారత్ ఎర్రతివాచీ పరిచిందని మోదీ పలికిన ఆహ్వానానికి ప్రపంచ పెట్టుబడిదారులు ఉప్పొంగిపో యారు. కానీ, వందమంది చేయాల్సిన పనిని ఒకే ఒక సాంకేతిక యంత్ర పరికరంతో పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎన్ని పెట్టుబడులు వస్తే ఎంతమంది నిరు ద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నది ఎవరూ స్పష్టం చేయటం లేదు. 1947 నుంచి 1989 వరకు కేంద్రప్రభుత్వాలు 232 ప్రభుత్వరంగ సంస్థల వృద్ధి వికాసం కోసం రూ.85,564 కోట్ల పెట్టుబడులను కేటాయించాయి. కానీ 1991 నుంచి ప్రపంచీకరణ పేరిట నూతన సంస్కరణల వైపు వేగంగా అడుగులు వేశాయి. ప్రభుత్వరంగ సంస్థల నుం చి పెట్టుబడుల ఉపసంహరణ మొదలుపెట్టి తమ సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ఉదాహరణకు 2002 మార్చిలో 3 మిలియన్ టన్ను ల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించటానికి 17,026 మంది ప్రభుత్వ ఉద్యోగులను విశాఖ ఉక్కు కర్మాగారం వినియోగించింది. కానీ, 2005లో 6.3 మిలి యన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి విస్తరణకు 34 వేల మంది ఉద్యోగులకు అవకాశం ఇవ్వవలసి ఉండగా సాంకేతిక యంత్రాల వినియోగంతో కేవలం 18,328 మంది ప్రభు త్వ ఉద్యోగుల్ని వినియోగించింది. విడిభాగాల తయారీ, ఇతర అనుబంధ పరిశ్రమల్లో కాంట్రాక్టు పద్ధతిని అమలు చేశారు. దీంతో తాత్కాలిక ఒప్పంద కార్మికులు నేడు పది వేలకు చేరుకున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే వేతన ఒప్పందాలు ఏవీ వారికి వర్తించవు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికుడికి చేతికందే నెలజీతం కేవలం రూ.6,122లు మాత్రమే. ఇక అసంఘ టితరంగాల్లో రోజువారీ కూలీలుగా పనిచేసే శ్రామికుల జీతభత్యాల గురించి చెప్పే పనిలేదు. ఎవరు ఆధికారం లోకి వచ్చినా ప్రైవేటీకరణ విధానాలకు అందరూ దాసో హులేనని బీజేపీ రుజువు చేసింది. విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచిన రోజునే బీజేపీ జాతీయవాదంలో డొల్లతనముందని తేటతెల్లమైంది. పెట్టుబడులు పెరిగితే ఉద్యోగావకాశాలు పెరగవని, ఎంత త్వరగా గ్రహిస్తే శ్రామికవర్గానికి అంత మంచిది. కొప్పోలు పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి, యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్, విశాఖ స్టీల్ ప్లాంట్ -
అధ్వానంగా ప్రాథమిక విద్య
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల స్థితిగతులు, విద్యా ర్థుల నైపుణ్యంపై జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యాట్రస్టు ఇటీవల విడుదల చేసిన సరికొత్త వార్షిక విద్యాస్థితి నివేదికలోని పలు అంశాలు ఆం దోళనకు గురిచేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల లోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే 5వ తరగతి విద్యార్థులకు రెండో తరగతి పాఠ్య పుస్తకం కూడా చదవడం రాదని తేలింది. మూడొంతుల మంది సాధారణ తీసివేతలు, భాగహారాలు చేయలేకున్నారని తెలిపింది. మౌలిక వసతుల కల్పన కోసం పాఠశాలలకు కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతోందో ప్రభుత్వ పకడ్బందీగా సమగ్ర పరిశీలన చేయాలి. బి. ప్రేమ్ కుమార్, వినాయక్‌నగర్, నిజామాబాద్ -
ప్రజల వద్దకు ముఖ్యమంత్రి
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరంగల్ ఖిల్లాకి రావడం, నగరంలోని మురికివాడలు గల కాలనీ లలోకి స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమ స్యలను తెలుసుకోవడం, అధికారులకు చివాట్లు పెట్టడం, సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్ట డం అభినందనీయం. వివిధ నియోజకవర్గాల పరి ధిలో గల కాలనీలను సందర్శించి వారి బాగో గులు తెలుసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, అవినీతి అధికారుల సమాచా రం తెలపాలంటూ ప్రజలందరికీ టోల్‌ఫ్రీ నంబర్ ఇవ్వ డం, ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. గతంలో ఏ సీఎం పర్యటించని విధంగా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించిన కేసీఆర్‌కు అభినందనలు. కామిడి సతీష్‌రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా -
అగ్గిపెట్టెలో చే‘నేత’ పట్టుచీర
తెలంగాణ రాష్ట్రంలో చేనేత కులస్తుల దశ మారిపో నుంది. పద్మశాలి (చేనేత) కులస్తుల కోసం, సీఎం కేసీఆర్ వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయ టానికి ముందుకురావడం అభినందనీయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమెరికా అధ్య క్షుడు ఒబామాకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను మగ్గం పై నేసి కానుకగా ఇవ్వబోతున్న చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్‌కు ప్రశంసలు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసి గతంలోనే రికార్డు సాధించిన నల్ల పరంధా ములు వంశీయుడీయన. సిరిసిల్ల, సుల్తానాబాద్, వరం గల్, జనగామ, హుజురాబాద్ ప్రాంతాల్లో నివసించే పద్మశాలి (చేనేత) కులస్తుల దయనీయ జీవితాలను మెరుగుపర్చేందుకు సత్వర చర్యలు తీసుకోవాలి. కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి, ఆదిలాబాద్ -
స్త్రీలపై హింస, అత్యాచారాలు ఇంకానా?
ఇన్ బాక్స్ స్వతంత్ర భారతంలో వరకట్న హత్యలు, గృహహింస, అత్యాచారాలు, లైంగిక వివక్ష ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి అని ఒక స్త్రీగా, అంట రానితనాన్ని ఇంకా ఎంతకాలం భరించాలని ఒక మాదిగ కులస్తురాలిగా ప్రశ్నించిన లక్ష్మి గొంతు మూగబోయి నేటికి తొమ్మిదేళు. 1996లో ఒక మహిళగా తన వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) దరిచేరిన లక్ష్మి అతి తక్కువ కాలంలోనే సంస్థ క్రియాశీల కార్యకర్త అయింది. 2004లో మార్కాపురం వద్ద పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో ఆమెను కాల్చి చంపారు. అప్పటికి ఆమె సీఎంఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. కర్నూలు పట్టణంలో ఒక పక్క టైలరింగ్ వృత్తి చేసుకుంటూనే తనలాంటి బాధిత మహిళల తరఫున నిలిచింది, కళాకారిణిగా నాటికలు, పాటలతో మహిళా చైతన్యం కోసం కృషి చేసింది. మహిళలపై హింస, అత్యాచారాలు వ్యవస్థీకృతమవుతుండటంతో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా బాధితులకు న్యాయం జరగ డం లేదు. విశాఖజిల్లా వాకపల్లిలో 2008లో పోలీసులు గిరిజన స్త్రీలపై జరిపిన సామూహిక అత్యాచారాల నుండి ఢిల్లీలో 2011లో జ్యోతీసింగ్ పాండేపై జరిగిన అత్యాచారం వరకు అది అడుగడుగునా రుజువవుతూనే ఉంది. నిర్భయ చట్టం వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. 75 శాతం అత్యాచారాలు పురుషాధిక్యతను నిరూపించుకోవడానికే జరుగుతు న్నాయి. మోదీ ప్రభుత్వానికి దేశాన్ని కాషాయీకరించే తాపత్రయమే తప్ప పురుషులలోని పితృస్వామ్య భావజాలం చెత్తను ఊడ్చి పారేయ డంపై ఆసక్తిలేదు. నేటి ఏపీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మద్య నిషేధం ఎత్తేసి మహిళలకు అన్యాయం చేస్తే, తెలంగాణలో నేడు కేసీఆర్ ఆత్యాచారాలకు వ్యతిరేకంగా మాలకొండయ్య కమిషన్ వేసి చేతులు దులిపేసుకున్నారు. ఆరు నెలల పసిగుడ్డు నుండి తొంభై ఏళ్ల వృద్ధురాలి వరకు అత్యాచారాలు జరుగుతుండగా.. మహిళలు ధరించే దుస్తులే అత్యాచారాలకు కారణమనే దుష్ర్పచారంతో పురుషాధిక్యతకు సమంజ సత్వాన్ని కల్పించే ప్రయత్నాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అశ్లీల సినిమాలను, టీవీ కార్యక్రమాలను అనుమతిస్తూ, ఇంటర్నెట్లో అశ్లీల సైట్లను నిషేధించకుండా అత్యాచారాలకు మహిళలను బాధ్యులను చేయ డం పాలక వర్గాలలోని పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలి పెట్టుబడి దారుల కొమ్ము కాస్తున్నాయి. మహిళలపై హింసకు, అత్యాచారాలకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయని గుర్తించి నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకోవాలి. అదే లక్ష్మికి అర్పించగల నివాళి. (నేడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లక్ష్మి తొమ్మిదవ వర్ధంతి సభ జరుగుతున్న సందర్భంగా) పి. జయ, చైతన్య మహిళా సంఘం, రాష్ట్ర అధ్యక్షురాలు బాపూ హంతకుని విగ్రహాలా? దేశ దాస్య శృంఖలాలు తెంచడం కోసం యావత్ భారత జాతిని ఒక్క తాటిపై నిలిపి బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్రయోధుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శనీయంగా మారింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అరుదైన ప్రజానేతగా గుర్తింపు పొందిన ఆ అహింసా మూర్తిని కిరాతకంగా హతమార్చిన నాథూరామ్ గాడ్సేను అఖిల భారత హిందూ మహాసభ గొప్ప దేశభక్తునిగా కీర్తించడం శోచనీయం. అంతకు మించి గాడ్సే విగ్రహాలను దేశవ్యాప్తంగా ప్రతిష్టి స్తామనడం, అందుకు స్థలాలను కేటాయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం అనుచితం, ఆక్షేపణీయం. సంఘ్ పరివార్‌కే చెందిన విశ్వహిందూ పరిషత్ చేపట్టిన పునః మత మార్పిడులతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుం టున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం హిందూ మహాసభ కోరికను మన్నించడమంటే హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికే అది ప్రాధాన్యం ఇస్తోందని సంకేతాలను పంపడమే అవుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా గాడ్సే విగ్రహాల స్థాపనను ప్రోత్సహించి అనర్థదాయక పరిణామాలకు దారి వేయరాదని కోరుతున్నాం. ఎస్.వీనస్, ఎల్.ఎన్. పురం, తూర్పుగోదావరి జిల్లా -
‘ఆహుతి’ ప్రసాద్
ఇన్ బాక్స్ ప్రముఖ సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో కన్నుమూయడం తెలు గు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సహజ నటనతో డైలాగులతో అల రించిన ప్రసాద్ తొలిదశలో ఆహు తి సినిమాతో, మలిదశలో చంద మామ చిత్రంతో విశేష గుర్తింపు ను పొందారు. చందమామలో గోదావరి యాసతో ఆయన పలి కిన సంభాషణలు ఎన్నటికీ మర పురావు. సినిమాకే అంకితమై చివ రివరకు నటననే వృత్తిగా చేసు కున్న వారిలో ఆహుతి ప్రసాద్ ఉచ్ఛ స్థాయిలో, దెబ్బతిన్నప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకుం డా మెలిగారు. వయసు మీరకుం డానే వెళ్లిపోయిన ఆహుతి ప్రసాద్ కు నివాళి. కామిడి సతీష్ రెడ్డి, పరకాల -
కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు
ఇన్ బాక్స్ భారతీయ ఖ్యాతిని ఖండాంతరం చేసిన విశ్వబ్రా హ్మణుల వృత్తులు ‘చితి’కిపోతున్నాయి. ఇప్పటికే అనేక చేతివృత్తులు మూగబోతుండగా పారంపర్యం గా వస్తున్న కులవృత్తిని కాదని కూలీలుగా మారుతు న్నారు. మరెందరో చేయి తిరిగిన కళాకారులు ఆత్మా భిమానాన్ని చంపుకోలేక, పని లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ సంతతీయులు. ఒకప్పుడు అద్భుత నైపుణ్యంతో శిల్పకళల నిర్వహణలో సుప్రసిద్ధులైన వీరి ప్రతిభ గుండుసూది నుంచి ఇనుపగోడల వరకు, గుడిసెలో వాసము నుంచి సోమనాథ సుందర దేవాలయ ద్వారాల వరకు, రాళ్లు పగులకొట్టడం నుంచి అజం తా, ఎల్లోరా, కోణార్క, ఖజురహో, నాగార్జునకొం డ, అమరావతి, హంపి, లేపాక్షి, రామప్ప దేవాల యం వరకు పలు చిత్రశిల్ప కళాక్షేత్రాల్లో విరాజిల్లు తోంది. నేటికీ తుప్పుపట్టని అశోక స్తంభం మన కమ్మరుల నైపుణ్యానికి నిదర్శనం. క్రీస్తుపూ ర్వమే మన మేటుపల్లి రేవులో అందమైన ఓడలను తయా రుచేసింది మన వడ్రంగుల కౌశలమే. ప్రపంచం లోనే అత్యున్నత ప్రమాణాలతో నాణేలు ముద్రిం చిన టంకశాల.. రోమన్ సామ్రాజ్య వాణిజ్యానికి మన సింహద్వారంలా నిలిచింది. దేదీప్య మానంగా శోభించిన మన పంచ వృత్తుల తేజో వైభవం నేడు పూర్తిగా కొడిగట్టి మసిబారిపోతోంది. గ్రామీ ణుల ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభా లనదగిన చేతివృత్తులు ఆకలితో అలమటి స్తున్న నిర్భా గ్యులకు, వారి ఆత్మహత్యలకు నిలయమ య్యాయి. సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యం లో ఏర్పడే పోటీకి తట్టుకోలేక జీవనభృతిని కోల్పో తున్న చేతివృత్తుల వారి సమస్యలకు ప్రభుత్వం పరి ష్కారం చూపకపోవడంతో గ్రామీణ భారతం నిస్తేజ మైపోయింది. ఇటీవలి వరకు గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్నాలి. నాగలికర్రు సరిచేసి పెడతావా అనే పలకరింపులు వినిపించేవి. కానీ పల్లెను చుట్టుము డుతున్న యాంత్రికీకరణ చేతివృత్తుల అవసరాన్ని దూరంగా విసిరిపారేసింది. శ్రామిక విశ్వబ్రాహ్మణ సమాజంలో ప్రధానం గా ఐదు చేతివృత్తులు ఉంటున్నాయి. అవి కమ్మరం, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తి. వీటిలో కమ్మరులు మను బ్రహ్మలు (కొలిమి ఉత్పత్తులు), వడ్రంగులు మయబ్రహ్మలు (గృహ, వ్యవసాయ వినియోగవస్తు ఉత్పత్తులు), కంచరిలు తృష్ణ బ్రహ్మలు (వంటపాత్రలు, దేవతా విగ్రహా లు), శిల్పులు శిల్పిబ్రహ్మలు (శిలాశిల్పాలు, దేవాలయ కట్టడాలు), స్వర్ణకారులు విశ్వజ్ఞ బ్రాహ్మణులు (బంగారు, వెండి మజూరీ పని). నేడు దేశంలో అంతరించిపోతున్నాయి. వెను కబడిన కులాలలో యాదవులు, గౌడులు, పద్మశా లీల తర్వాత విశ్వబ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ 1980లో నాటి సీఎం అంజయ్య, 2009 మార్చిలో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో వీరికి కాస్త మేలు చేకూరింది కానీ తతిమ్మా కాలాల్లో ఏ పాలకుడూ వీరి గోడును, వ్యధను పట్టించుకున్న పాపానపోలేదు. విశ్వబ్రాహ్మణులలోని ఈ అయిదు వృత్తుల వా రిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కారణం.. వీరిలో ఐకమత్యం లేదు. వీరు ఓటు బ్యాంకుగా లేరు. ఏ కులంలోనూ లేనన్ని సంఘాలు, సంస్థలు, పీఠాలు, పరిషత్తులుగా చీలిపోవడంతో చట్టసభల్లో, రాజకీయాల్లో, ఆర్థికంగా వీరు అట్టడుగునే ఉండిపో యారు. పురాతన కాలం నుండి నేటివరకు మన దేశ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మూలాధారంగా ఉన్న విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సుఖమయ జీవనానికి ప్రభుత్వాలు తగిన విధానం ప్రకటించాలి. మన రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి వీటిపై కోటి ఆశలు పెట్టుకుని ఉన్నాం. విశ్వబ్రాహ్మ ణులు పూర్వవైభవం సాధించేందుకోసం ప్రభుత్వా లు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటం, కుల వృత్తులను ఆధునీకరించడంతో సహా అన్ని రకాల సంక్షేమ చర్యలు చేపట్టాలి. కట్టా సత్యనారాయణాచారి, అడ్వకేట్, ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ స్వర్ణకార సంఘం -
కాకా కలల సాకారం
ఇన్ బాక్స్ నిరుపేదలు, ఆశ్రీతుల హృదయాల్లో కాకాగా నిలిచిపోయిన అరు దైన నేత జి.వెంకటస్వామి కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసింది. నెహ్రూ హయాం నుంచి రాజీవ్ గాంధీ వరకు ఆయన కాంగ్రెస్‌కే అంకితమయ్యారు. అట్టడుగు జీవితం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ రాజకీయాల దాకా పయనించిన కాకా నిమ్న వర్గాలకు ఎన్నటికీ చెరగని స్పూర్తి ప్రదాత. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో పోలీసు కాల్పుల బారిన పడిన కాకా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమయ్యే దాకా బతికే ఉంటానని ప్రకటించి మృత్యువు సమీపానికి వెళ్లి కూడా నవతెలంగాణ కోసం ఊపిరి నిలుపుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్న ప్రాణహి త- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డితో పలుసార్లు చర్చించి ఆమోద ముద్రవేయించుకున్నారు. నిజాం వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, ఆర్యసమాజ్, రామానంద తీర్థ శిష్యరికం, జైలు జీవితం, అనంతరం కూలీ వృత్తి, ఆపై కార్మికనాయకత్వం.. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల దాకా ప్రస్థానం. దళిత నేతకు దక్కిన అరుదైన గౌరవమిది. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వంతో మెలిగిన కాకాకు అశ్రు నివాళి. రామచంద్ర, పెద్దపల్లి, కరీంనగర్ -
మహిళా శక్తికి జోహార్లు - ఇన్ బాక్స్
మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు కాంట్రాక్టర్ల అవినీతిపై విరుచుకు పడిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహి ళ కావడం గర్వకారణం. రహదారుల నిర్మాణంలో అవకతవకలపై ఆమె స్పందన అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని యూట్యూబ్‌లో చూసిన లక్షలాదిమంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో యూపీ లోనే ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపిన దుర్గాశక్తి నాగ్‌పాల్ కూడా నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ఇలాంటి ఐఏఎస్ అధికా రులు మనకూ ఉంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ నిజాయితీగా ఉన్నతాధికారులను మన నేతలు ప్రాధాన్యత లేని శాఖ లకు బదిలీచేయడం ద్వారా అభివృద్ధికి పాతరేస్తున్నారు. మళ్లీ ఇదే నాయకులు అభివృద్ధిపై ఉపన్యాసాలు దంచుతుంటారు. ఇలాంటి వాళ్లని ఏమనాలి? దీనికి ఒకే ఒక్క ఉదాహరణ. లిక్కర్ సిండికేట్ వ్యవ హారంలో అత్యంత నిజాయితీగా వ్యవహరించిన అధికారి శ్రీనివాస్‌ను ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి ప్రమోషన్ సాకుతో విశాఖకు బదిలీ చేసిన ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది. నూటికో కోటికో ఇప్ప టికీ నిజాయితీకి కట్టుబడిన అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ఉంటే అభివృద్ధి చర్యలు పూర్తి కావడమే కాకుండా అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. శొంటి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ లక్ష ఉద్యోగాల మాటేంటి? కొత్తగా ఏర్పడిన ‘నవ తెలంగాణ’ రాష్ట్రంలో ఒక లక్ష పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక మంత్రివర్యులే స్వయంగా సెలవిచ్చారు! సంవత్సరాల తరబడి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగావకా శాలు లేకుండాపోయాయి. వేలాది మంది ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల నుండి, ఉన్నత విద్యాసంస్థల నుండి విద్య పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు కానీ, నిరుద్యోగం మాత్రం తీవ్రస్థాయిలో పేరుకుపోయింది. ఉద్యమాల బాటలో నడిచిన విద్యార్థులు నవ తెలంగాణలో ఉద్యోగా లపై కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగుల స్థితిగతుల గురించి ఆలోచించి, వారి ఆశలని వమ్ము చేయకుండా ఒక నిర్దిష్ట దృక్పథంతో అన్ని ప్రభుత్వశాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల్లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను పూరించవల సివుంది. ఉద్యోగ ఖాళీలను దశల వారీగా నింపినా, ఒకేసారి నింపినా సామాజికంగా అన్నివర్గాల వారికి న్యాయం చేయవలసి ఉంది. ఒప్పం ద ఉద్యోగులుగా ఉన్న వారికి సైతం కొంత శాతం మేరకు బోనస్ మా ర్కులిచ్చి, ఉద్యోగ ఖాళీల భర్తీకోసం నిర్వహించు పోటీ పరీక్షలో అవకా శం కలిగిస్తే వారు ప్రయోజనం పొందుతారు కదా! ఎంప్లాయ్మెంట్ ఆఫీసు వారిని కూడా వినియోగించుకుంటే అందరికీ మేలు. కూర్మాచలం వెంకటేశ్వర్లు ఎం.ఎం.తోట, కరీంనగర్ అగ్ర రాజ్యం ‘ఉగ్ర’మూలం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధాలు అమ్ముకుని సొమ్ము చేసుకునే అగ్రరాజ్యం అమెరికాయే ప్రపంచమంతటా ఉగ్రవాదానికి ఆజ్యం పోసి, దేశదేశాల మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తోంది. ఇదిలా ఉంటే తీరుమారని పాకిస్తాన్, దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషించిన పాపం నేడు పాములా వెంటాడి పెషావర్ సైనిక పాఠశా లలో పసిపిల్లల మరణానికి కారణమైంది. తనదాకా వస్తే కానీ తెలియ దన్నట్లు, ఆఖరికి ఉగ్రవాదం వల్ల తామే నష్టపోయామన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లయింది. అమాయక పసిప్రాణాలు బలి అయితే తప్ప పాకిస్తాన్ పాలకులకు తాము చేసిన పాపం తెలిసి రాలేదు. భారతదేశం ఎన్నిసార్లు ఉగ్రవాదుల విషయంలో విజ్ఞప్తులు చేసినా బేఖాతరు చేసిన పాపం నేడు పసిపిల్లల ప్రాణాలను అన్యా యంగా బలి గొన్నది. భారత్‌తో సహా ప్రపంచ దేశాలన్నీ పాక్ వైఖరిని తప్పు పట్టిన నాడే ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదా? తాలిబాన్ ఉగ్రవాదులు విచక్షణారహి తంగా తలపెట్టిన ఈ దుశ్చర్యకు యావత్ ప్రపంచం పాకిస్తాన్‌పై మం డిపడుతోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు తాము చేసిన తప్పు తెలుసుకుని సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికి, ప్రపంచవ్యాప్త ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలి. శిష్ట్లా మురళీ సుధాకర్ చందానగర్, హైదరాబాద్ రైతు భారతం బతుకు భారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ శాంపిల్ సర్వే సంస్థ తాజా నివేదిక ప్రకారం దేశంలో దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రైతుల్లో తొంభై శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. వీరిలో సగానికి పైగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. పదేళ్లలో రైతుల సంఖ్య దిగ జారి కూలీల సంఖ్య పెరగటం ఒకెత్తు కాగా, వారి జీవనావసరాలు తీర్చే తృణమో, ఫణమో ఆదాయం వ్యవసాయేతర మార్గాల్లో వస్తు న్నది తప్ప వారి ముఖ్య ఆధారమైన వ్యవసాయం ద్వారా వస్తున్నది కాదు. ఈ గణాంకాల ద్వారా సగటు రైతు బతుకు ఎంత చితికిపో యిందో తెలుస్తోంది. దేశంలో మూడొంతుల జనాభాకి వ్యవసాయమే ముఖ్య ఆదాయ వనరు అయినప్పుడు ఆ రంగం కుదేలైతే దేశం కుదేలై నట్లే. డెబ్బైలలో హరిత విప్లవం ద్వారా స్వయంసమృద్ధి సాధించిన మనదేశం ఆ ఫలశ్రుతిని రాన్రానూ కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నమవు తున్నాయి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య ధోరణి మన దేశానికి ఆత్మహత్యా సదృశ్యమే. పారిశ్రామిక ప్రగతికి ఆలోచించడం, పెట్టుబడులను ఆకర్షించడంలో తప్పులేదు. అయితే అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయరంగం బలోపేతం కాకుండా దేశం సొంతకాళ్లమీద నిలబడటం సాధ్యం కాదు. రైతు సంక్షే మం కోసం ప్రభుత్వం ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. డా॥డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం గిరిజనం పురజనం కావద్దా? రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులే. ఈ గిరిజనం పురజనం కాకుండా ఉంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు కనబడుతోంది. విద్యతోపాటు ఆర్థిక రంగానికి కూడా గిరిజనులను దూరంగా ఉంచాలని చేస్తున్న ప్రయ త్నాన్ని తరచిచూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ‘బీద లు బీదలుగానే ఉండాలి. నిరక్షరాస్యులు నిరక్షరాస్యులు గానే ఉండాలి’ అనే లక్ష్య సాధనలో అటు ప్రభుత్వమూ, ఇటు ఉన్నతాధికారులూ చేయి కలిపినట్లుంది. నవ్యాంధ్ర నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యం లేకపోవటం బాధాకరం. చంద్రబాబు మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించకపోగా గిరిజన సలహా మండలి, ఎస్టి లెజిస్లేటివ్ కమిటీని నేటివరకూ నియ మించలేదు. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకోసం ప్రభు త్వం ఎలాంటి కార్యాచరణను రూపొందించలేదు. గత ఆరునెలలుగా గిరిజనుల అభివృద్ధికి ఒక్క అంశం కూడా ప్రారంభించకపోవడం బాధాకరం. మెగా సిటీలు, స్మార్ట్ సిటీ లపై, గిరిజన ప్రాంతాల్లోని ఖనిజ నిక్షేపాలు, బాక్సైట్... ఎర్రచందనంపై ఉన్న ప్రేమ గిరిజనుల అభి వృద్ధిపై లేదు. కనీసం తమకు ఇది కావాలి అని నోరు తెరిచి అడగలేని గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఎం. హనుమంత నాయక్ ఏపీ గిరిజన జేఏసీ, గుంటూరు -
సైన్స్ ఎందుకు రాశాం?
ఇన్ బాక్స్: శాస్త్ర విజ్ఞానం అందరికీ చెందాలని ప్రయత్నించిన తెలుగు రచయి తలు ఎందరో ఉన్నారు. జనరంజక విజ్ఞాన వ్యాసాలు మాత్రమే కాక, సైన్స్ ఫిక్షన్ విభాగంలో విజ్ఞానానికి కల్పనా చాతురి జోడించి కథలు, నవలలు, నాటకాలు కూడా రాసిన సృజనాత్మక సాహితీ వేత్తలు కూడా ఉన్నారు. సైన్స్ రచయితలు ఏ నేపథ్యంలో, ఏ ఉద్దేశాలతో ఈ రం గంలో రచనను ప్రారంభించారో తెలుసుకోవడం ఆసక్తికరంగానే కాదు, ప్రేరణాత్మకంగా కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్య కథనాలను సంక లనం చేయాలని తలంచాం. ఇప్పటికే కొంతమంది తమ వ్యాసాలు పంపారు. మాకు తెలిసిన, మావద్ద సమాచారం లేని రచయితలు కూడా ఈ పత్రికా ప్రకటననే ఆహ్వానంగా పరిగణించి వ్యాసం పంపా లని మనవి. సైన్స్ రచనలనే పంపగలరు. రేపటి తెలుగు సైన్స్ రచనా దీపాన్ని జేగీయమానం చేయడానికి, రేపటి రచయితల కోసం రాస్తు న్నారని గమనించగలరు. జనవిజ్ఞాన వేదిక ప్రచురించే ఈ పుస్తకం ప్రతిని ప్రచురణ తర్వాత పంపగలం. మీ రచనలు పంపాల్సిన చిరునామా: జి.మాల్యాద్రి, ప్లాట్ నంబర్- 162, విజయలక్ష్మినగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ -524004.మొబైల్: 9440503061, ఈమెయిల్: malyadrig1955@gmail.com రచనలు చేరడానికి చివరి తేదీ: 2015, జనవరి 26 డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి ప్రయోక్త -
కాలుష్యాన్ని గమనించాలి
ఇన్ బాక్స్ గణపురం(ఎం) మండలం, పరిసరాలు టీఎస్ జెన్కో, కాకతీయ లోంగోవాల్ ప్రాజెక్టుల వల్ల పారిశ్రామికంగా కొంత అభివృద్ధిని సాధి స్తున్నాయి. కానీ దీని వల్ల ఈ ప్రాంత పర్యావరణం కలుషితమవు తోంది. ప్రజలు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ ప్రాంతాల నిండా ప్రభుత్వ భూములలో సామాజిక అడవులు పెంచడానికి తక్షణమే చర్యలు తీసు కోవాలి. ఈ బాధ్యతను టీఎస్ జెన్కో, కాకతీయ- లోంగోవాల్ ప్రాజెక్టు వారే స్వీకరించాలి. ఇందులో భాగంగానే ఈత, తాటి చెట్లను పెంచి గీత కార్మికులను ఆదుకోవాలి. కాలుష్య సమస్య మరింత తీవ్రం కాకుండానే ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా నివారణకు కృషిని ఆరంభించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో గణపురం పెద్ద చెరువును కూడా అభివృద్ధి చేయాలి. కట్టను విస్తరించి మినీ ట్యాం క్బండ్గా రూపొందించాలి. తెలంగాణ మహనీయుల, త్యాగధనుల విగ్రహాలను ఏర్పాటు చేయించాలి. విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన స్థానికుల చరిత్ర వెలుగులోకి వస్తుంది. అలాగే కాలుష్యం మీద దృష్టి పెట్టడం ఆధునిక దృష్టికి కొలమానం కాగలదు. ఆ రెండింటినీ కరీంనగర్ పట్టణంలో ఆవిష్కరించి అందరికీ ఆదర్శం కావాలి. తాళ్ల హరిప్రసాద్ గణపురం, వరంగల్ జిల్లా ఆ విమర్శలు గుర్తు లేవా? ఆధార్‌తో, వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీని అనుసంధానం చేయడంలో ప్రభుత్వాలు అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టి, బ్యాంకు ద్వారా తిరిగి చెల్లించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చింది. దీని మీద దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. ప్రజా గ్రహాన్ని యూపీఏ ప్రభుత్వం చవి చూడవలసి వచ్చింది. దీనితో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నిజానికి ఈ విధానాన్ని అప్పుడు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎన్డీఏ కూడా విమర్శించింది. ఆధార్ అనుసంధానం ద్వారా కాంగ్రెస్ నిరాధా ర్గా మారిందని వెంకయ్యనాయుడు విమర్శించారు కూడా. ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం వింత కాదా? మధ్య తరగతి కుటుంబాలను ఎంతగానో ఇబ్బందికి గురిచేస్తున్న ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఏ విధంగా చూసినా ఈ పద్ధతిలోని హేతు బద్ధత ఏమిటో సామాన్య జనానికి అంతుపట్టడం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించడం, అందులో కొంత మళ్లీ వినియోగదారుల ఖాతా లలో జమచేయడం, ఇంత ప్రక్రియ ఎందుకో ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించాలి. ఏ వ్యవస్థనైనా కాలం గడిచేకొద్దీ సరళతరం చేయాలి తప్ప మరింత జటిలం చేయరాదు. రఘుముద్రి అప్పలనరసమ్మ బాలిగాం, శ్రీకాకుళం జిల్లా యాత్రల మతలబేమిటి? ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విదేశీ యాత్రల హడావుడి చూస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి. దీనికి తోడు పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ యాత్రలను ప్రశ్నించారు. ఆయన విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడం కోసమే తాను యాత్రలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ దీనిని ఎక్కువ మంది నమ్మడం లేదు. అందుకు కారణం ఆయన నైజం. గతంలో ఆయన విదేశీయాత్రల పేరుతో చేసిన నిర్వాకం, ఎదుర్కొన్న విమర్శలు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా సింగ పూర్‌తో తన అనుబంధం సాగుతుందని ఇటీవల ఆయన అన్నట్లు వార్తాపత్రికల్లో కూడా వెలువడింది. సింగపూర్‌కు చంద్రబాబుతో ఉన్న అనుబంధం గతంలో కూడా వివాదాస్పదమే. కాబట్టి బాబు యాత్రల మర్మమేమిటో ఆయనే వెల్లడించడం మంచిది. రాజధాని నిర్మాణాన్నీ, ఇతర ప్రణాళికలను అంత ఆగమేఘాల మీద విదేశీ సంస్థలకు అప్ప గించాలని చంద్రబాబు అనుకోవడం అందరికీ తెలుసు. ఇంత తొందర ఎందుకు? అని అన్ని వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త రాష్ట్రం అభి వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల విషయంలో ఎవరికీ స్వలాభా పేక్ష ఉండరాదు. అయినాల కనకరత్నాచారి కొరిశపాడు, ప్రకాశం జిల్లా మళ్లీ మోసపోయిన ప్రజలు పాత ప్రభుత్వాలతో విసిగిపోయిన ప్రజలు కొత్త పార్టీలకు ఓట్లు వేసి మోసపోయారు. పాత ముఖాలే అని తెలిసినా, మార్పు ఉంటుందని ఆశపడి ఓట్లు వేశారు. కానీ భంగపడ్డారు. భారతదేశంలో రాజకీయ పార్టీల చేతుల్లో నాయకుల మాటలతో సామాన్య ప్రజానీకం చిరకాలంగా మోసపోతూనే ఉంది. ఇందుకు ప్రజాస్వామ్య విధానంలో ఉన్న లొసుగులను నాయకులు ఉపయోగించుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదీ సరికొత్త మోసమే. ఇద్దరూ తమ ఎన్నికల ప్రణాళికలను తుంగలో తొక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడుస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యం కలిగిన సమస్యల గురించి కూడా ఆయన ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రైతుల రుణాలు రద్దు కాలేదు. నిరుద్యోగులను మరింత నిరాశ పరుస్తూ ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచారు. ఈ సమస్యలను పరి ష్కరించకుండా, కమిటీల పేరుతో జాప్యం చేస్తూ, ఏదో పేరు చెప్పి విదేశాలకు వెళుతున్నారు. కేంద్రం కూడా నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానం చేసి, ఇప్పుడు గాలికి వదిలేసింది. జాతీయ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా మోదీ కూడా విదేశీ యాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదెంత వరకు సబబు? ఈశ్వర్ ప్రొద్దుటూరు, కడప జిల్లా -
డీఎస్సీతో నిరుద్యోగులకు తీరని బాధలు
ఇన్ బాక్స్ టెట్‌కు అర్హత సాధించిన వారికిచ్చే సర్టిఫికెట్ ఏడేళ్ల వరకు చెల్లు బాటవుతుందని చెప్పారు. కాని ఇప్పుడు టెట్, డీఎస్సీ రెండిం టికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని, గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ ప్లస్ డీఎస్సీ పరీక్షను రాయాలని షరతు పెట్టా రు. అలాంటప్పుడు గత టెట్ సర్టిఫికెట్కున్న ఏడేళ్ల వ్యాలిడిటీ పరిస్థితేమిటి? ఒక డీఎస్సీకి మరో డీఎస్సీకి విధానాలు మారు తుంటే మేమెలా సిద్ధం కావాలి? ఇప్పటికే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన మాకు మళ్లీ కోచింగ్‌కు సిద్ధమవటం తలకు మించిన భారమే. ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ లేనన్ని పరీక్షలను ఉపాధ్యాయ ఉద్యోగాలకు పెట్టి నిరుద్యోగులను కుంగదీస్తున్నారు. పైగా ఎస్సీఆర్టీ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో జరుగుతున్న పాఠ్యపుస్తకాలతోటే టెట్, డీఎస్సీ పెట్టాలంటున్నారు. కానీ గతం లో ఉన్న పాత పాఠ్యపుస్తకాలను అనుసరించి పరీక్ష ఉంటుందని పాత, కొత్త పాఠ్యపుస్తకాలకు బోధించే విధానం మాత్రమే వేరని వాటిలో ఉండే సబ్జెక్టు ఒకటేనని మన ప్రభుత్వం సర్దిచెబుతోం ది. నిజానికి ఎస్సీఆర్టీ ప్రకారం పాఠశాల విద్య ప్రస్తుతం గుణాత్మక విద్యావిధానంలో అమలవుతోంది. కాని పాత పాఠ్య పుస్తకాలు గుణాత్మక విద్యావిధానం ప్రకారం లేవు. అంటే పాత పాఠ్యపుస్తకాలననుసరించి డీఎస్సీ పరీక్ష రాయాలి. తరువాత పాఠశాలల్లో పిల్లలకు కొత్త పాఠ్యపుస్తకాలను గుణాత్మక విద్యావి ధానంలో చెప్పాల్సి ఉంటుంది. అంటే చదివేది పాత పాఠ్యపుస్త కాలు, పిల్లలకు బోధించాల్సింది మాత్రం కొత్త పాఠ్యపుస్తకాలు. ఇలా కాకుండా పాత పద్ధతి ప్రకారం టెట్, డీఎస్సీలకు విడివి డిగా తగిన సమయం కేటాయించి నిర్వహిం చాలి. పైగా, ఎంతోమంది నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. టెట్, డీఎస్సీ కోచింగ్ కోసం విద్యాసంవత్సరం మధ్యలో వారు పని చేస్తున్న పాఠశాలలను వదిలి బైటకువచ్చి ఎగ్జామ్ పూర్తి చేసుకుని మరలా పోస్టు కోసమని ప్రైవేట్ స్కూల్‌కు వెళితే వాళ్ల పోస్టుల్లో మరొకరు ఉంటున్నారు. కాబట్టి ఈ టెట్, డీఎస్సీ పరీక్షలను విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా మే, జూన్ నెల లో నిర్వహిస్తే మంచిది. కోర్టుల ద్వారా ఈ సమస్యను పరిష్క రించుకునేంత ఆర్థికస్తోమత లేనందున ఇలా పత్రిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. నిరుద్యోగుల ఆశలను పట్టించుకుంటారని, అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. జ్యోతి, వినుకొండ, గుంటూరు జిల్లా ‘మేముసైతం’ సందేశం భేష్ ఉత్తరాంధ్రను వణికించిన హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ‘మేము సైతం’ కార్యక్రమం అందరినీ అలరించింది. సాటి మనుషు లను ఆదుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్నీ ఇచ్చింది. ఈ వినోద కార్యక్రమాల ద్వారా వచ్చిన 11.51 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించడం అభినందనీయం. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా వారిని ఆదుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటోంది. గతంలో ఎన్నో విపత్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశాయి. అప్పుడు కూడా తెలుగు ప్రజలకు అండగా నిలబడిన ఘనత మన చిత్ర పరిశ్రమది. ఈసారి అక్టోబర్‌లో ఉత్తరాంధ్రను హుద్ హుద్ తుపాను భయపెట్టింది. దీంతో వెంటనే చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఎవరికి తోచిన సహాయం వారు అందించారు. మీకు అండగా మేమున్నా మంటూ చేయూతనిచ్చారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక తాటిపై నిలిచి ఉత్తరాంధ్ర బాధితులను ఆదు కోవడం ప్రశంసనీయం. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా ‘చిత్ర’ స్పందన ఇక్కడేదీ? విశాఖలో జరిగిన హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించిన తీరు అమోఘం. ఆంధ్రప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారీ పరిశ్రమ బాగానే స్పందిస్తుంది. సంతోషం. నిజానికి తెలుగు చిత్రపరిశ్రమకు ఆయువుపట్టు నైజాం ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వ్యాపారం ఎక్కువ. స్టూడియోలకు, ఫిలింనగర్‌లకు, ఫిల్మ్ సొసైటీలకు, థియేటర్లకు భూములు ఇచ్చింది ఈ ప్రాంతమే. కానీ, ఈ ప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరదలు, కరువుకాట కాలు వచ్చినప్పుడు చిత్రపరిశ్రమ స్పందించలేదు. తెలంగా ణలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం, వడగండ్ల వానలకు నష్టపో యిన రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం చిత్ర పరిశ్రమ స్పం దించిన దాఖలా లేదు. ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నా చిత్రపరిశ్రమ కనీసంగా స్పందించలేదు. అదే సమయం లో తెలంగాణలో ప్రతి నటీనటులకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రాంతాలకు అతీతంగా వీరు నటీనటులను అభిమాని స్త్తున్నారు. తెలంగాణ కోసం కూడా స్పందించాలని చిత్రపరిశ్రమ పెద్దలను కోరుతున్నాము. ఇక్కడి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతిని ధులు ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సురేష్ కాలేరు, భువనగిరి, నల్లగొండ జిల్లా వికలాంగుల విన్నపం ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా సభలూ సమావేశాలూ నిర్వహించడమే కాకుండా వారికి ఇచ్చే పెన్షన్ రూ. 1,500కు పెంచడం చాలాబాగుంది. ప్రభుత్వ చర్య వికలాంగులకు నజరానా అనే చెప్పాలి. దీంతోపాటు వికలాం గుల కోసం నూతనంగా మంచి సంక్షేమ పథకాలను చేపట్టాలి. వారికి ప్రత్యేక గృహ సముదాయం, కాలనీలు నిర్మించి ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా వారికి ప్రత్యేక రుణాలు కల్పించాలి. వారి సౌకర్యార్థం మరుగు దొడ్లు నిర్మించాలి. గ్యాస్ పథకం ద్వారా సబ్సిడీలు అందించాలి. వికలాంగుల హాస్టళ్లు ఏర్పర్చి సౌక ర్యాలు కల్పించాలి. డిసెంబర్ 3 నుంచి 10 వరకు వికలాంగుల వారోత్సవాలు నిర్వహించి వికలాంగుల సంక్షేమం కోసం బడ్జెట్, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ, పంచా యతీరాజ్, విద్య, ఆరోగ్యం, రేషన్ కార్డులు వంటి అంశాలపై 7 రోజుల పాటు చర్చించాలి. అన్ని రకాల ఉద్యోగాల్లో, వృత్తుల్లో వికలాంగులకు డిసెంబర్ 3న సెలవుదినం ప్రకటించాలి. ప్రతిభా వంతులైన వికలాంగులను ఈ వారోత్సవాల సందర్భంగా ప్రోత్సహించాలి. ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ, వరంగల్ జిల్లా ‘ఉసూరు’ మానియా ఆసుపత్రి మన ఆరోగ్య మంత్రిగారు రాత్రి మొత్తంగా ఉస్మానియా ఆసు పత్రిలో ఉండి రోగులను పరామర్శించడం బాగుంది కానీ ఒక్కరోజు ఆయన ఆసుపత్రిలో ఉంటే సమస్యలు తీరిపోతా యా? ఆయన వస్తున్న సంగతి తెలిసి సిబ్బంది పైపైన శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. ఆసుపత్రి లోపల అన్ని విభాగాల పనితీరు చూసి అప్పుడు చెప్పాలి. అంతే కాని తూతూ మంత్రం తనిఖీ వల్ల ఏమీ ఒరగదని రోగుల మాట.. ఉస్మానియాకి వెళ్తే గేటు దగ్గర నుంచి అవినీతిమయం, చేయి తడిపితే కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. వీల్‌చైర్ ఉండదు. స్ట్రెచ్చర్ దొరకదు. ఎలా గోలా లోపలికి వెళితే పారిశుధ్యం అంతంత మాత్రమే. కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు, సమస్త జీవరాసులకూ ఉస్మానియానే నిలయం. పైగా భయంకర దుర్గంధం, గోడలనిండా ఉమ్ములు. ఇక వైద్యులు ఎప్పుడొస్తారో తెలియని స్థితి. సెలైన్ బాటిల్స్ కొరత. బెడ్లు లేక రోగులు నేలమీదే పడుకుంటున్నారు. రోగులు వైద్యం అందే లోపే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారదు. ప్రభుత్వం ఇకనైనా అక్కడ సౌక ర్యాలు మెరుగుపర్చాలి. రాజ్యలక్ష్మి, చిక్కడపల్లి, హైదరాబాద్ -
అన్నప్రాశన రోజే ఆవకాయ
ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆంగ్ల పాఠ్యపుస్తకాలు ‘విద్యార్థుల’ మానసిక స్థాయిని మించి ఉన్నాయి. డిగ్రీ, పీజీ స్థాయి వారికి పరిచయం చేసే క్లిష్టమైన పదజాలం పాఠాల్లో వాడటం విడ్డూ రం. విద్యా ప్రణాళికలో విషయాత్మకతకు కాని, లక్ష్యాత్మకతకు కాని చోటులేదు. కేవలం సృజనాత్మకతకే పెద్దపీట వేశారు. ఉదా హరణకు ఒక కథను ఇచ్చి దాన్ని సంభాషణ రూపంలో ఇంగ్లిష్ లో రాయమనడం, చదవని పద్యాన్ని ఇచ్చి అం దులో ప్రశ్నలడగడం, క్రికెట్ కామెంటరీ రాయ మనడం పసి మనసులను క్షోభ పెట్టడమే. ఇది కార్పొరేట్ స్కూళ్లకే కాని ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగకరం కాదు. తెలంగాణలో పేద విద్యా ర్థినీ, విద్యార్థులకు ఇది మేలు కలిగించదు. పాఠంలో చదివిన ప్రశ్నలు రావు. ఉపాధ్యాయులకు వారిని ఎలా సిద్ధం చేయాలో తెలియని పరిస్థితి. ఇది విద్యార్థులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. పాఠ్యపుస్తకాలను సరళతరం చేసి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక ఇంగ్లిష్ మీడి యం పాఠశాలలు ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏర్పడుతుంది. దేవళ్ల సుధాసాగర్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ బెల్టుషాపులు రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సులో వారికి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేశారు. మహిళలపై అఘా యిత్యాల పట్ల దృష్టిపెడుతూ చట్టాల ద్వారా శిక్షించే విధంగా నిర్భయ చట్టాన్ని అమలుచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పనిలో పనిగా, రాష్ట్రంలో మహిళలకు కన్నీరు కురిపిస్తున్న బెల్టు షాపులను వెంటనే రద్దుచేయాలి. ఉద్యోగమో, కూలోనాలో చేసు కుంటూ కుటుంబాన్ని పోషించే మహిళలు తమ వీధుల్లో ఉన్న బెల్టు షాపుల వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మహి ళలు పని చేసి తిరిగి వచ్చే సరికి, ఇంట్లో దాచిన డబ్బులను భర్త తీసుకుని బెల్టు షాపుల్లోని చీప్ లిక్కర్ తాగి కట్టుకున్న భార్యను బెల్టుతో బాదేస్తుంటే ఆ కుటుంబం పరువు బజారులో పడు తోంది. ఈ దుస్థితి నుంచి మహిళలను, కుటుంబాలను బయట పడవేయాలంటే, తెలంగాణ వ్యాప్తంగా చీప్ లిక్కర్, గుడుంబా అమ్మే బెల్టు షాపులను ప్రభుత్వం రద్దు చెయ్యాలి. బెల్టు షాపుల వలన జనాల జీవితాలు అప్పుల పాలవుతున్నాయి, బెల్టు షాపు లను రద్దుచేస్తే తప్ప తెలంగాణ బాగుపడదని జనాభిప్రాయం. ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయంతో మనుగడ సాగించా లనుకుంటే, ఇక సంక్షేమానికి అర్థం పరమార్ధం ఉండవు. కె.అమన్‌రాజీవ్ కుతుబుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా ఆ బౌన్సర్ ఓ గుణపాఠం ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్‌పై దూసుకొచ్చిన ఓ బౌన్సర్ అతని నిండు ప్రా ణాలను బలితీసుకోవడం క్రికె ట్ చరిత్రలో దురదృష్టకర ఘ టన. భారత క్రికెట్ ఆటగాడు రమణ్ లాంబా అతి పిన్న వ యసులో ఇలాగే క్రికెట్ బంతి తగిలి మృత్యువాతపడ్డాడు. జెంటిల్‌మ్యాన్ గేమ్‌గా పేరు గాంచిన క్రికెట్లో ఈ దుర్ఘ టనతో అర్థాంతరంగా ఒక వర్ధమాన క్రికెటర్ అసువులు బాయడం దిగ్భ్రాంతికరం. క్రీడ వినోదం కావాలి కాని విషాదం మిగల్చరాదు. బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల, కర్నూలు జిల్లా -
ఇదేనా బీసీలపై ప్రేమ!
అన్ని రాజకీయ పార్టీలూ వెనుకబడిన కులాలను ప్రత్యే కించి బీసీలను కరివేపాకులాగా వాడుకుంటున్నాయి. ఎన్నికలముందు అన్ని పార్టీలూ దళితులకు, బీసీలకు పెద్ద పీటవేస్తున్నాం అంటూ ఊరించి గద్దెనెక్కిన తర్వాత అలా గే వదిలేస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ ఏర్పడినప్పటి నుం చి బీసీలు ఆ పార్టీకి అండగా నిలిచారు. కానీ పార్లమెంటులో సుదీర్ఘ అనుభవమున్న బీసీ నేతలను కాదని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించారు. పొలిట్ బ్యూరోలోనూ వారికే స్థానాలు కల్పించడం, అదే సామాజిక వర్గానికి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పదవిని కట్టబెట్టడం వంటి నిర్ణయాలతో పలురకాలుగా బీసీలను టీడీపీలో వెనుక బెంచీలకే పరిమి తం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలలో ఒకరిని కేంద్రమంత్రిగా నియమించేందుకోసం ప్రయత్నించాలి. రాబోయే శాసనమండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలి. యర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం, తూ.గో. జిల్లా -
గీత కార్మికులకు సర్కారు వాత
కల్లుగీత అనేది అతి పురాతన వృత్తి. కానీ ప్రభుత్వ విధానాల వల్ల, ప్రపంచీకరణ వల్ల కల్లుగీత వృత్తి నిరాదరణకు గురైంది. ఈ వృత్తినే నమ్ముకుని దీనిపైనే ఆధారపడి బతికే పరిస్థితీ లేకుండా పోయింది. ప్రకృతి సిద్ధంగా పెరిగిన తాటి, ఈత చెట్లపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోంది. కానీ గీత కార్మికుల గురించి అబ్కారీశాఖ, ప్రభుత్వం, ఈ సామాజిక వర్గం నుండి గెలుపొంది పదవులు అనుభవిస్తున్న వారు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కల్లు అమ్మ కాలు లేకుండా చేసి మద్యం అమ్మకాలు వేల కోట్లకు పెంచుకోవా లనే దుర్బుద్ధితో ప్రభుత్వం బహుళ జాతి మద్యం కంపెనీలతో, స్వదేశీ, విదేశీ లిక్కర్ సంస్థలతో మద్యం సిండికేట్లతో కుమ్మక్క యింది. వృత్తికి రక్షణలేకుండాపోయింది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అయినా గీత కార్మికుల బతుకులు బాగుపడతాయని, ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత కల్పిస్తుందని ఆశిం చారు. చంద్రబాబు ఆర్నెల్ల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ, మాకు మద్యం ప్రధానం కాదు. రాష్ట్రంలో అనధికారికంగా ఉన్న బెల్టు షాపులు తొలగిస్తున్నామని ప్రకటించి జీవో కూడా ఇవ్వ డంతో గీత కార్మికులు సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలువలేదు. 5 నెలలకే మా ప్రభుత్వానికి మద్యం ఆదాయం చాలా అవసరం. కొత్తగా ఊరూరా 10 వేల మద్యం షాపులు అధి కారికంగానే తెరుస్తున్నాం అని ఆదేశాలు ఇవ్వడంతో గీత కార్మి కుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఏపీలో కేరళ, తమిళనాడు మద్య విధానం అమలు జరుపుతామని పైకి చెబుతూ ఆదాయం కోసం మద్యాన్ని వరదలా పారించే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నా రు. వాస్తవానికి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గీత వృత్తిని ఉపాధి కలిగించేదిగా, ఒక ఆర్థిక విధా నంగా గుర్తించారు. ఏపీ ప్రభుత్వం మాటల్లో ఒకరకంగా, చేతల్లో మరో రకంగా వ్యవహరిస్తూ గీత కార్మికులపై కక్షకట్టి కల్లు అమ్మ కాలు దెబ్బతీయడానికి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. పూనేలో వలే మన రాష్ట్రంలో ఆరు నెలలపాటు కల్లును నిల్వ ఉంచే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలి. నీరా, కల్లును నేచురల్ డ్రింక్‌గా ప్రచారం కల్పించాలి. గీత వృత్తిని ఆధునీకరించి, తగిన గౌరవం, రాబడి కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఉపా ధి కాపాడాలి. ప్రతి గీత కార్మిక కుటుంబానికి మూడెకరాల భూమి ఇచ్చి సమాజంలో హోదా కల్పించాలి. జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం -
పూలింగా.. ఫూల్స్ చేయడమా?
ఇప్పటివరకు రాజధాని గురించి సరైన స్పష్ట త ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ అని రైతుల ను గందరగోళంలో పడేసిన ఘనత చంద్రబా బుదే. ఒకసారి మంగళగిరి అని, ఒకసారి విజ యవాడ అని చెబుతూ ఎక్కడో ఇంతవరకూ తేల్చకపోవడం శోచనీయం. చంద్రబాబు అనుచరులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటోదని చెబితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఒక పక్క రైతులకు మేలు చేస్తామని చెప్పి రైతుల భూమిని తీసుకోవడంలో అర్థం ఏమిటి? దీనిపై 80 శాతం ప్రజలు, రైతులు తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రైతుల పొలాలు కారుచౌకగా కొనుక్కోవడానికి చూడటం, అలా కాకపోతే బలవం తంగా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇదే కొనసాగితే రైతులు ఉద్యమం చేయడం ఖాయం. అదే కాకుండా అధికారంలోకి వచ్చాకా బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పటివరకూ బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికయినా రాజ ధాని విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన చేసి రైతులకు నష్టం కాకుండా వ్యవహరించాలి. శొంటి విశ్వనాథం, చిక్కడపల్లి, హైదరాబాద్ కేంద్ర విద్యాసంస్థలు ఇలాగేనా? ఆంధ్రప్రదేశ్‌కి మంజూరైన 11 కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ సర్కారు రోజుకోమాటగా వ్యవహరిస్తోంది. అన్ని జిల్లా లకూ అభివృద్ధి ఫలాలు అందజేయవలసి ఉంది. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు 11 విద్యా సంస్థల్లో ఏదీ కేటాయించటం లేదట. ఈ మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ సీట్లు గెలిచిన కారణం గానే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. ఇక కర్నూలు లో ముందు ఎన్ఐటీ అని చెప్పి ఇప్పుడు ఐఐఐటీ అంటు న్నారు. అనంతపురంలో ఐఐఐటీ అని చెప్పి, తర్వాత ఎన్ఐటీ అని ఇప్పుడు సెంట్రల్ వర్సిటీ అంటున్నారు. విశాఖలో 4 విద్యా సంస్థలు పెడతామని, ఇప్పుడు ఐఐఎం అంటున్నారు. పెట్రో వర్సిటీ అయితే మొదట విశాఖలో అన్నారు. తర్వాత రాజమండ్రి అంటున్నారు. గోదావరి జిల్లాల్లో వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు గూడెంకి హార్టికల్చర్ వర్సిటీ, రాజమం డ్రికి నన్నయ వర్సిటీ ఇచ్చారు. ఇవి నిజానికి కాకినాడ, ఏలూ రుకు దక్కవలసినవి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గందరగోళానికి తెరదించుతూ కాకినాడలో పెట్రో యూనివర్సిటీ, ఏలూరులో ఎన్ఐటీ లేదా ఒక కేంద్ర విద్యాసంస్థ ఏర్పాటు చేయాలి. యామినీ రెడ్డి, విజయవాడ నిరుద్యోగులను ఆదుకోండి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా గ్రంథాలయ శాఖల్లో 430 ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగాలకు ఈ సంవత్సరం మార్చి నెలలో పరీక్షలు నిర్వ హించి 1:3 ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ఈ ఇంట ర్వ్యూలు రాష్ట్ర విభజన నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ ఉద్యోగాలను డీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ నియామకాల తర్వాత నియామకం చేయాల్సి ఉంటుంది. 1:3 ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపికయిన అభ్యర్థులందరూ, ఎక్కువ శాతం టీటీసీ, బీఈడీ చేసి ఉన్నవారే. కాబట్టి వీరిలో చాలామంది ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ 2014కు ఎంపికయ్యే అవకాశం ఉంది. డీఎస్సీకి ఎంపిక కాగా మిగిలిన అభ్యర్థులకు 1:3 ప్రకారం మెరిట్ ప్రాతిపదికన గ్రంథా లయ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కలుగుతుంది. ఈ అం శాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వయోపరిమితి దాటుతున్నా, ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన. రాను రాను ప్రభుత్వాలకు గ్రంథాలయాల పట్ల, వాటి పురోభివృద్ధి పట్ల అశ్రద్ధ పెరిగి పోతోంది. ఇకనైనా జ్ఞాన భాండాగారాలను కాపాడాలని కోరుతున్నాము. పుల్లేటి మహేంద్ర, సాయినగర్, అనంతపురం కల్లు దుకాణాలొద్దు ఒక పక్క కల్లు దుకాణాలపై మహిళలు ఆందోళన చేస్తున్నా, ఇం కా జనావాసాల ముందు, పాఠశాలలు, దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వాటికి అనుమతినివ్వడంతో ప్రభు త్వానికి ప్రజాభిప్రాయంతో పనిలేదని తేలిపోయింది. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా? దీనిపై ఏ రాజకీయ నాయకులూ పెదవి విప్పకపోవడం దురదృష్టకరం. ప్రజల ఆరో గ్యం కంటే ప్రభుత్వ ఆదాయమే ముఖ్యమైతే, పేద లవైద్యం, దవాఖానాలకు ఎంత డబ్బు కేటాయిస్తే మాత్రం ఏమిటి లాభం. సారావలన సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రయోజనం కనిపించటంలేదు. ఒకవైపు ఇదే ప్రభుత్వం పేకాట క్లబ్బులను నగరానికి దూరంగా పెట్టుకునే వీలు కల్పిస్తున్నప్పుడు కల్లు, సారా దుకాణాలను కూడా ఊరి చివ రకు తరలించే చర్యలు చేపట్టాలి. జనావాసాల మధ్య మద్యం ఉం టే మహిళల దగ్గరనుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పేద వాడి కూలి డబ్బులు కల్లు, సారా దుకాణాలకే అర్పితం అవుతున్న ప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఏమి లా భం? తెలంగాణ ప్రభుత్వం వీటిపై మరోసారి పునరాలోచించాలి. ఎస్. రాజ్యలక్ష్మి, చిక్కడపల్లి, హైదరాబాద్ -
ఏమిటీ 'ముద్దు గోల'
ఇటీవల కేరళలో ప్రారంభమైన ముద్దుల గోల అవమానకరంగా ఉంది. ఏం సాధించాలని విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు? ఉద్యమాల బాట వీడి ముద్దుల బాట పడతామని వారు అనడం విచారకరం. కల్చరల్ పోలీసింగ్‌కు నిరసన తెలియచేయాలంటే ఇదా మార్గం? వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వేరే విధంగా నిరసన తెలియ చేయవచ్చు. వ్యక్తి స్వేచ్ఛకూ మతానికీ ముడిపెడితే దానికి కూడా అభ్యంతరం చెప్పవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ముద్దులు ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడైనా ఎవరో అందమైన బాలిక దగ్గరే కుర్రకారు అంతా కనిపించింది తప్ప, మామూలు బాలికలు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కదా! పాల్గొన్నా వారిని అబ్బాయిలు ఆకర్షించలేదా? ఒకనాడు తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి విద్యార్థులు గొప్ప ఉద్యమాలు చేశారు. సినిమాలలో ముద్దు సీన్లకు వ్యతిరేకంగా పోరాడివారే ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు భంగం పేరుతో బహిరంగ ముద్దులను ప్రేరేపించడం ఏమిటి? ఇదంతా విద్యార్థులలో, యువతలో తీవ్రంగా ఆలోచించగలిగే మనస్తత్వం నశించిపోవడమే. దీనిని సరిదిద్దాలి. బి. సాయికిరణ్ గుంటూరు నత్తనడకన 'బాబు'పాలన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు నత్తనడకను తలపించింది. ఈ వ్యవధిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకపోవడం దురదృష్టకరం. రైతు రుణ మాఫీ అంటూ వాగ్దానాలను కురిపిం చి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు, ఆ దిశగా ఇప్పటికీ సుస్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఒక వైపు బ్యాంకర్ల ఒత్తిడి, మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు పొందాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు డ్వాక్రా రుణాలను లక్ష రూపాయల వరకే మాఫీ ప్రకటించారు. ఒక్కో గ్రూపులో పది మందికి పైగా సభ్యులున్న మహిళలకు దీని వల్ల ఒనగూరేది అంతంత మాత్రమే. చౌక దుకాణ వస్తువుల సరఫ రాను గ్రామాల్లో 2 రోజులకు, పట్టణ, నగరాల్లో 3 రోజులకు కుదించడం హేయమైన చర్య. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆధార్ లేకపోయినా బియ్యం కోత పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల మనసెరిగి పాలించేందుకు సమాయత్తం కాచాలి. బట్టా రామకృష్ణదేవాంగ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా న్యాయమే అయినా, సమస్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండటం చాలా వరకు న్యాయమే. అయితే అక్కడ రాజధానిని నిర్మిస్తే మనకున్న భౌగోళిక స్థితి వల్ల చాలా వరకు పంట భూములను కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికి చాలా మంది రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదంటున్నారు. మనిషిని బతికించేది ఆహారం. ఆ కొరత రానివ్వకుండా ఆంధ్ర అన్నపూర్ణగానే ఉండాలి. రాయలసీమ వాసులు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చాలా బాగుంది. వారి సూచనకు మౌలిక మార్పులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. భారతదేశంలో చివరిసారిగా రెండు ముక్కలైంది మన తెలుగు రాష్ట్రమే ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్రను చూసి నేర్చుకోవాలని మిగిలిన రాష్ట్రాలు అనుకోవాలి. ఈ విషయంలో నేతలు వినాయకులుగా మారకుండా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ ప్రత్యేకతను నిరూపించుకోవలసిందే! ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీర ప్రాంతం మనకు మాత్రమే ఉంది. ఒకరకంగా అదృష్టం. మైనేపల్లి సుబ్రహ్మణ్యం ఆకునూరు, కృష్ణా జిల్లా -
మద్యంతో మరణశాసనం
ఎన్నికల ముందు మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే ఆధారమన్నట్లు మరిన్ని దుకాణాల పెంపుతో మద్యాన్ని రాష్ట్ర మంతా పారించి మద్యాంధ్రప్రదేశ్ చేసేలా ఉన్నారు. బెల్టు షాపు లు రద్దుచేస్తున్నట్లు జీవో ఇచ్చినప్పటికీ తన జీవోను తానే తుం గలోతొక్కి మరిన్ని కొత్త షాపులు ప్రవేశపెట్టడా నికి మద్యం దుకాణాల సామర్థ్యం పెంపు, అనే కొత్త పేరు పెట్టి గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ మరింత మంది తాగుబోతులను చేస్తారట. రోడ్డు మీదకొచ్చి తాగనక్కరలేకుండా వారి ఇళ్ల దగ్గర గల్లీలలోనే షాపులు పెట్టి మద్యం దాసులకు మరింత చేరువ చేస్తారట. పేదలు, మధ్యతరగతి వర్గాలు తాగే మద్యం రకాల విక్రయాలు అధికంగా ఉంటాయి గనుక వాటిపైనే ధరలు పెంచనున్నట్లు తెలుస్తుంది. కూలీనాలీ చేసుకొని తెచ్చే సొమ్ము కాస్తా పెట్టి మద్యం సేవించి ఇల్లు వళ్లూ గుల్లచేసుకొని మరణిస్తున్న వారిని చూసి అయినా ప్రభుత్వం మద్యాన్ని ఎం దుకు నిషేధించదు? మద్యం ప్రియులచేత మందు తాగించి వారి మరణ శాసనం రాసుకోడానికి సహకరిస్తోంది ప్రభుత్వం. ఎస్.వీనస్ ఎల్‌ఎన్‌పురం, తూ.గో.జిల్లా బస్సుబాధలకు పరిష్కారం నేను నా కుటుంబం 17.10.2014న సాయంత్రం 4 గంటలకు హైర్ బస్సు 8027లో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ప్రయా ణించాం. బస్సు బయల్దేరిన 2, 3 నిమిషాలకే డ్రైవర్ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. 10 నిమిషాలు గడిచాక టేప్ శబ్దం భరించరానిదిగా ఉంది కాబట్టి ఆపివేయాలని డ్రైవర్ని కోరాను. నా అభ్యర్థనను పట్టించుకోలేదు. దాంతో కండక్టర్‌కి చెబితే ఆయన డ్రైవర్‌తో విషయం ప్రస్తావించారు. అయితే డ్రైవర్ వినిపించుకోకుండా మమ్మల్ని వెనక సీట్లోకి పోయి కూర్చోవాలని తృణీకారభావంతో వ్యాఖ్యానించారు. దైవదర్శనానికి బయల్దేరిన మాకు శబ్ద కాలుష్యానికి తోడు తిరస్కారం, అమర్యాద ఎదురైంది. హైర్ బస్సుల్లో టేప్ రికార్డర్ శబ్దం, డ్రైవర్ ఎదురుగా దేవుని పటాలకు రంగు రంగుల కాంతితో వెలిగే లైట్లు ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. బస్సుల్లో పొగత్రాగనీయకుండా గత 30 ఏళ్లుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను. ప్రయాణీకులు కోరినప్పటికీ బస్సుల్లో శుభ్రమైన 200 ఎంఎల్ మంచినీరు ఇవ్వరు కానీ, కోరకుండానే శబ్ద కాలుష్యం కలిగించి ఇబ్బంది పెడు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. కాసర వెంకటరెడ్డి జంగారెడ్డిగూడెం సోదరుల మధ్య తగవులా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోని తన తొమ్మిదేళ్ల పాలనలో శ్రీశైలం నది నీటినిల్వల విషయంగా ఇచ్చిన జీవో పట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించడంతో వివాదం మొదలై రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిగా చంద్రబాబు సీఎం స్థాయిలో సమాధానం ఇవ్వకుండా టీడీపీ మంత్రులను, శాసనసభ్యులను ఎగదోయడం తో వారు కేసీఆర్‌పై దూషణలకు దిగుతున్నారు. పాత జీవోలను చూపి మాకూ హక్కు ఉందని కేసీఆర్ అన్నప్పుడు, అది తప్ప యితే దీటుగా చంద్రబాబే ఘాటుగా స్పందించాల్సింది. ఇద్దరూ ఒకే వేదికపై చర్చించి ప్రజలకు నిజానిజాలు తెలియ జేయాల్సింది. కేసీఆర్‌వన్నీ అబద్ధాలేనని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల నిరూపించొచ్చుగదా. బాబు కూడా రైతులు, డ్వాక్రా మహిళలకు హామీలిచ్చి ఓట్లేయించుకుని రుణ మాఫీ చేయకుండా నానా తిప్పలు పెడుతున్నారు గదా. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం సరికాదు. విషయాన్ని కేంద్రానికి నివేదించి వారి సలహా ప్రకారం సమస్య పరిష్కరిం చుకుంటే రెండు రాష్ట్రాల మధ్య తగవులుండవు. రెండు రాష్ట్రా లలోనూ ఉన్నది అన్నదమ్ములే గదా. ఆర్.గోవిందరాజులు ఎస్.కోట, విజయనగరం జిల్లా