సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు | Inbox | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు

Published Wed, Jan 28 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు

సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు

 హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌చార్జీలు, ఇతర కేటాయింపులు 2012 నాటివే నేటికీ కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అను గుణంగా పెంచాలనే డిమాండు ముందుకొస్తూనే ఉన్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినా హాస్టళ్లకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు ఉండ టం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలకు అవి ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు/మేట్రెన్లు అనేక అవస్థలు పడు తున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి ఏటా 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకో వటం లేదు. ఒక యంత్రాంగమంటూ లేనందున ప్రభుత్వం పావలా పెంచి, ముప్పావలా ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆ పెంపుదల కూడా ఏదో భిక్షం వేస్తున్నట్లుగా ఉంటున్నది. అసెంబ్లీలో, పార్లమెంట్లో సభ్యుల జీత, భత్యాలను వారే పెంచుకుంటారు. ఉద్యోగు ల వేతనాల పెరుగుదలకు పి.ఆర్.సి లాంటి శాశ్వత యంత్రాంగాలు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో దాదాపు 2,217 హాస్టళ్లలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి మా త్రం ఏ యంత్రాంగమూ లేదు.

భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరా స్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాపవుట్ రేటు తగ్గించటానికి, మళ్లీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కాని ఇప్పటికే వసతి గృహాల్లో చదువుకుంటామని వ స్తున్న విద్యార్థులను అర్ధాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్ విద్యార్థులకు కేవలం మెస్ చార్జీలే కాదు. జి.ఓ-126 ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు వాటికి కేటా యింపులు కూడా సరిపోయే విధంగా పెంచాల్సివుంది. కాస్మో టిక్స్, బట్టల కట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్ నిర్వహణ, ట్యూషన్ ఫీజు లను మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించే వస్తువుల కొనుగోలుకి రాష్ర్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఉన్నట్లే వార్షిక సమీక్షా కమి టీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ర్టస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇం దులో కొనుగోలు కమిటీ చైర్మన్, పౌర సరఫరాల అధికారి, ఏఎస్‌డబ్ల్యూఓ, వార్డెన్, మేట్రన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి ఏటా హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అం దుతున్నాయా? లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికను గుణంగా మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయిం పులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి.
 ఎం.శోభన్ నాయక్  ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు


 కార్టూన్ సూపర్ స్టార్
 ఐదు దశాబ్దాలపాటు జాతి అంతర్వాణిగా, సామాన్యుల మనస్సాక్షిగా కోట్లమంది హృదయాల్లో నిలిచిన మహోన్నత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్. భారతీయ ప్రజాస్వామ్యం, రాజకీయాలు నడుస్తూ వచ్చిన బాధామ యమైన ప్రక్రియలో హాస్యాన్ని, చమత్కారాన్ని ఇంత గొప్పగా చిత్రిం చిన కార్టూనిస్టు మరొకరు లేరు. కార్టూన్‌లలో ఆయన పొందుపర్చిన హాస్య చమత్కార వ్యాఖ్యలు జీవితానికి సంబంధించిన అత్యద్భుత కొటేషన్‌లుగా రూపొందాయి. సామాన్యుల వాణిని తన రేఖలో ఇముడ్చుకుని అట్టడుగు ప్రజల వేదనను రాజ కీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వద్దకు ప్రతిరోజూ కార్టూన్ రూపంలో తీసుకునిపోయి తన కాలపు కలలను, వాటి వెనుక వాస్తవ జీవిత వేద నను జాతిముందు పరిచిన మాన్యుడు ఆయన. కార్టూన్ అంటేనే ఒక ధిక్కార కళ అని, పరిహాస కళ అని నిర్వచించిన వాడు.. సామాన్యుల తరపున నిలిచి ఆ పరిహాసాన్నే, తిరస్కారాన్నే వ్యంగ్యరేఖగా మలచి పాలకులను హెచ్చరించాడు. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామా న్యుల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన వక్రరేఖే కామన్ మేన్. తన మనోగతాన్నే సామాన్యుల మనోగతంగా మార్చి చూపిన ఈ అపర కార్టూన్ బ్రహ్మకు నివాళి.
 ప్రత్యూష  బంజారా హిల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement