దినదినగండం నూరేళ్లాయుష్షు
ఇన్ బాక్స్
ఇటీవల రాష్ట్రంలో చాలా ప్రదేశాలలో గ్యాస్ సిలిండర్లు తరచూ సీమ బాంబుల్లా పేలిపోతున్నాయి. ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఈ మధ్యనే కర్నూలు జిల్లాలో లారీలో వెళుతున్న గ్యాస్ సిలిండర్ల లోడు పేలిపోయి ఆ శబ్దం 20 కిలో మీటర్ల దూరం వినబడిందంటే ఎంతటి విస్ఫోటనో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రభుత్వం, గ్యాస్ సిలిండర్ల తయారీ కంపెనీలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఒకే గదిలో వంట, పడక ఉండే కోట్లాది కుటుంబా లు దేశంలో ఉన్నాయి. వారికి ఈ గ్యాస్ బండతో పక్కలో బాంబును పెట్టినట్లే ఉంటుంది. ఇప్పటి వరకూ ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి అజాగ్రత్త వల్ల జరిగేవి. కాని ఇప్పుడు తరచూ పేలడంతో ప్రజల బతుకులు దినదినగండం నూరేళ్లాయుష్షు లా తయారవుతుంది. సంబంధిత అధికారులు తక్ష ణం స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పురాని విధంగా సమస్యను పరిష్కరించాలి.
ఎస్.వీనస్, ఎల్.ఎన్.పురం, తూ.గో. జిల్లా
జాబు కావాలంటే బాబే రావాలా?
దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే నాథుడే కరువయ్యారు. ఆయన తరువాత వచ్చిన ఇద్దరు సీఎంల హయాంలో ఏ నోటిఫికేషన్లు రాక, నిరు ద్యోగులు విలవిలలాడుతున్నారు. విభజన తర్వాత ఎన్నికల వేళ ‘ఇంటికో ఉద్యోగం ఇస్తా మనీ, నిరుద్యోగభృతి ఇస్తామనీ, జాబు కావాలంటే బాబే రావాలని’ ప్రకటనలు గుప్పించారు. ఆయనలాంటి అనుభవ జ్ఞుడు సీఎం అయితే ‘లక్షలాది’గా ఖాళీ ఉన్న గ్రూపు1, గ్రూపు2, గ్రూపు4, జె. ఎల్, డి.ఎల్ వంటి అనేక ఉద్యోగాలు కల్పిస్తా డనీ, టీడీపీ నేతలు నిరుద్యోగులను విపరీతంగా నమ్మించారు. ఇప్పుడు ఒక్క టీడీపీ నాయకుడు గానీ, ఎమ్మెల్యే కానీ ఉద్యోగాల గురించి ఏమీ మాట్లాడటం లేదు. ఉద్యోగాల విషయంలో నిరు ద్యోగులను సంతోషపెట్టిన రోజు బాబు చరిత్ర లోనే లేదు. ఉద్యోగాలంటే కేవలం కాంట్రాక్టు, రోజు కూలీ వంటి భవిష్యత్తుకు భద్రత లేనివి, లేదా పోలీసు-టీచరు వంటివి మాత్రమే. పరిపా లనలో అవసరమయ్యేవి, రెవెన్యూ శాఖలో ఖాళీలు.. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయటానికే ఆయన ఇష్టపడడు. ‘రాజధాని’ నిర్మాణంలో కేంద్రం డబ్బు ఇవ్వకుండా మోసం చేసిందనీ, అనాథవలే మన రాష్ట్రం మిగిలిందనీ, తన అను భవమంతా ఉపయోగించి ప్రజలకు ‘గుప్పె డు మెతుకులు-గుక్కెడు నీళ్లు’ ఇవ్వగలుగు తున్నాననీ, తనేదో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తేనే ప్రజలకు తిండి తిప్పలు అందు తున్నట్లు లేకపోతే లేనట్లు తెగ ప్రకటనలు చేస్తున్నాడు. తనతో పాటు, అందరూ కష్టపడా లనే నీతులు తప్ప ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరపడుతున్నా నిరుద్యోగులకు భరోసాగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తక్ష ణమే అన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకట నలు ఇచ్చేట్లుగా కనీసం ప్రతిపక్ష సభ్యులైనా ‘నిరుద్యోగుల తరఫున గళం’ విప్పాలి.
కె.ప్రభాకర్, ఈపూరు పాలెం, చీరాల, ప్రకాశం జిల్లా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కు
దివంగత సీఎం డా॥వైఎస్ రాజశేఖరరెడ్డి జల యజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టి అన్ని అనుమతులు తీసుకొని, శంకుస్థాపన చేశా రు. కుడి ఎడమ కాలువల తవ్వకాలు ఇంచుమిం చు పూర్తయినదశలో వైఎస్ అకాల మరణంతో ప్రాజెక్టు మొత్తంగా మూలపడింది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధు లతో నిర్మాణం చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. కానీ, మూడేళ్లలో పూర్తి చేస్తామన్న నేతలు కేవలం వంద కోట్లు విదిలించడం దుర్మార్గపు చర్య. ఇది పూర్తయితే పట్టిసీమ అవసరమే ఉండదు. గోదా వరి జిల్లాల రైతుల కలలను కల్లలను చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి పట్టిసీమ ఎత్తిపోతల పథకం తెరమీదకు తెచ్చినట్లు విమ ర్శలు వస్తున్నాయి. రైతుల అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతాన్నిమరచి వారికే ద్రోహం చేయడం క్షమార్హం కాదు. రైతుల ఆందోళన అర్థం చేసుకొని వారికి ఊరట కలిగించాలి.
కె.వి.వెంకినాయుడు, రాజ ఒమ్మంగి