
మద్యంతో మరణశాసనం
ఎన్నికల ముందు మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే ఆధారమన్నట్లు మరిన్ని దుకాణాల పెంపుతో మద్యాన్ని రాష్ట్ర మంతా పారించి మద్యాంధ్రప్రదేశ్ చేసేలా ఉన్నారు. బెల్టు షాపు లు రద్దుచేస్తున్నట్లు జీవో ఇచ్చినప్పటికీ తన జీవోను తానే తుం గలోతొక్కి మరిన్ని కొత్త షాపులు ప్రవేశపెట్టడా నికి మద్యం దుకాణాల సామర్థ్యం పెంపు, అనే కొత్త పేరు పెట్టి గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ మరింత మంది తాగుబోతులను చేస్తారట.
రోడ్డు మీదకొచ్చి తాగనక్కరలేకుండా వారి ఇళ్ల దగ్గర గల్లీలలోనే షాపులు పెట్టి మద్యం దాసులకు మరింత చేరువ చేస్తారట. పేదలు, మధ్యతరగతి వర్గాలు తాగే మద్యం రకాల విక్రయాలు అధికంగా ఉంటాయి గనుక వాటిపైనే ధరలు పెంచనున్నట్లు తెలుస్తుంది. కూలీనాలీ చేసుకొని తెచ్చే సొమ్ము కాస్తా పెట్టి మద్యం సేవించి ఇల్లు వళ్లూ గుల్లచేసుకొని మరణిస్తున్న వారిని చూసి అయినా ప్రభుత్వం మద్యాన్ని ఎం దుకు నిషేధించదు? మద్యం ప్రియులచేత మందు తాగించి వారి మరణ శాసనం రాసుకోడానికి సహకరిస్తోంది ప్రభుత్వం.
ఎస్.వీనస్ ఎల్‌ఎన్‌పురం, తూ.గో.జిల్లా
బస్సుబాధలకు పరిష్కారం
నేను నా కుటుంబం 17.10.2014న సాయంత్రం 4 గంటలకు హైర్ బస్సు 8027లో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ప్రయా ణించాం. బస్సు బయల్దేరిన 2, 3 నిమిషాలకే డ్రైవర్ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. 10 నిమిషాలు గడిచాక టేప్ శబ్దం భరించరానిదిగా ఉంది కాబట్టి ఆపివేయాలని డ్రైవర్ని కోరాను. నా అభ్యర్థనను పట్టించుకోలేదు. దాంతో కండక్టర్‌కి చెబితే ఆయన డ్రైవర్‌తో విషయం ప్రస్తావించారు. అయితే డ్రైవర్ వినిపించుకోకుండా మమ్మల్ని వెనక సీట్లోకి పోయి కూర్చోవాలని తృణీకారభావంతో వ్యాఖ్యానించారు. దైవదర్శనానికి బయల్దేరిన మాకు శబ్ద కాలుష్యానికి తోడు తిరస్కారం, అమర్యాద ఎదురైంది.
హైర్ బస్సుల్లో టేప్ రికార్డర్ శబ్దం, డ్రైవర్ ఎదురుగా దేవుని పటాలకు రంగు రంగుల కాంతితో వెలిగే లైట్లు ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. బస్సుల్లో పొగత్రాగనీయకుండా గత 30 ఏళ్లుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను. ప్రయాణీకులు కోరినప్పటికీ బస్సుల్లో శుభ్రమైన 200 ఎంఎల్ మంచినీరు ఇవ్వరు కానీ, కోరకుండానే శబ్ద కాలుష్యం కలిగించి ఇబ్బంది పెడు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను.
కాసర వెంకటరెడ్డి జంగారెడ్డిగూడెం
సోదరుల మధ్య తగవులా?
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోని తన తొమ్మిదేళ్ల పాలనలో శ్రీశైలం నది నీటినిల్వల విషయంగా ఇచ్చిన జీవో పట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించడంతో వివాదం మొదలై రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిగా చంద్రబాబు సీఎం స్థాయిలో సమాధానం ఇవ్వకుండా టీడీపీ మంత్రులను, శాసనసభ్యులను ఎగదోయడం తో వారు కేసీఆర్‌పై దూషణలకు దిగుతున్నారు. పాత జీవోలను చూపి మాకూ హక్కు ఉందని కేసీఆర్ అన్నప్పుడు, అది తప్ప యితే దీటుగా చంద్రబాబే ఘాటుగా స్పందించాల్సింది. ఇద్దరూ ఒకే వేదికపై చర్చించి ప్రజలకు నిజానిజాలు తెలియ జేయాల్సింది.
కేసీఆర్‌వన్నీ అబద్ధాలేనని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల నిరూపించొచ్చుగదా. బాబు కూడా రైతులు, డ్వాక్రా మహిళలకు హామీలిచ్చి ఓట్లేయించుకుని రుణ మాఫీ చేయకుండా నానా తిప్పలు పెడుతున్నారు గదా. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం సరికాదు. విషయాన్ని కేంద్రానికి నివేదించి వారి సలహా ప్రకారం సమస్య పరిష్కరిం చుకుంటే రెండు రాష్ట్రాల మధ్య తగవులుండవు. రెండు రాష్ట్రా లలోనూ ఉన్నది అన్నదమ్ములే గదా.
ఆర్.గోవిందరాజులు ఎస్.కోట, విజయనగరం జిల్లా