నీతి ఆయోగ్ - అవినీతి | Inbox | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్ - అవినీతి

Published Sun, Feb 15 2015 2:38 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

నీతి ఆయోగ్ - అవినీతి - Sakshi

నీతి ఆయోగ్ - అవినీతి

 ఇన్ బాక్స్
 ప్రధాని నరేంద్రమోదీ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రారంభించారు. కాలంచెల్లిన వ్యవస్థలస్థానే ప్రస్తుత అవసరాల కోసం నూతన వ్యవస్థను నెలకొల్పుకోవడం ఎంతైనా అవసరమే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలనా వ్యవస్థలో అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు, ఉద్యోగులలో కూడా జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నాలకు పూనుకోవడం ప్రశంసించదగిన విషయమే. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెం ట్‌తో జీతాలు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో కుల, ఆదాయ, నివాస, బర్త్ సర్టిఫికెట్ల జారీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం కనబడేలా సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఆహారభద్రత, ఆసరా, 58, 59 నంబర్ పట్టాల జారీ కోసం సుశిక్షితులైన ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది. నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు రాక మునిసిపల్ కార్యాల యాల్లో గంటల తరబడి వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నందున తాహసీ ల్దార్‌లకే ఆహార భద్రత బాధ్యతలు అప్పగించాలి. ప్రభుత్వ ఉద్యోగులు నీతి, నిజాయితీతో పనిచేసేలా చర్యలు తీసుకొనడమే కాకుండా ప్రతి కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు రాసి ఉంచితే అవినీతికి చాలా వరకు అడ్డుకట్టలు వేయవచ్చు.
 రాజీవ్ అమన్,  కరీంనగర్

 మత వాదమా! మానవతా వాదమా?
 ఎంతో మంది మేధావులు, జాతీయ నాయకులు ఆనాడు మన దేశానికి ఒక విధానపరమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించ డం జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం సమకూర్చడమే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటు వంటి రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక అనే పదాలు తొలగించాలని ఇటీవల కొంత మంది ప్రకటనలు చేయడం హేయమైన చర్య, రాజ్యాం గాన్ని అవమానించడమే అవుతుంది. ప్రజాస్వామ్యయుత మైన భారతదేశ ప్రభుత్వానికి ‘‘పవిత్ర గ్రంథం రాజ్యాం గం’’. ఇంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగంలో 42వ సవ రణ ద్వారా చేసిన సామ్యవాద, లౌకిక పదాలు తొలగించా లనడం చాలా విడ్డూరం. స్వేచ్ఛ సమానత్వం, న్యాయం, వర్గరహిత సమాజం, ప్రభుత్వ పరమైన పరిశ్రమల ఏర్పా టు వంటి వాటికి సామ్యవాదం ప్రాముఖ్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తుం ది. మనదేశంలో భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీక రణలు సామ్యవాద స్థాపన చేయడంలో చేసిన కృషిగా చెప్పవచ్చు. పెట్టుబడుల కోసం సంస్కరణలు కాకుండా సామ్యవాద వ్యవస్థను బలోపేతం చేయాలి. భారతదేశం వివిధ మతాల పుట్టినిల్లు. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా... మిగతా వారు కూడా ఉన్నారు. కేవలం భారతదేశంలో హిందువులే ఉండాలి. హిందువుల రాజ్యమని అనడం మానుకోవాలి. మొన్నటికి మొన్న మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో... మతాల మధ్య శాంతి, సౌఖ్యా లు వర్ధిల్లాలని... మతం ఐక్యతను సాధించే సాధ నం... భారతీయులంతా ఐక్యమత్యంతో మెలగాలని కోరారు. మతం అనేది వ్యక్తి అవసరానికి సంబంధించిన ఒక అవసరం. ఇది ఆ వ్యక్తి నమ్మకంపై ఆధారపడి ఉం టుంది. వివిధ మతాలున్న సమాజంలో లౌకికతత్వం ఒక అత్యవసరమైన జీవన విధానం. అందువల్ల మన దేశంలో లౌకికతత్వాన్ని ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎం తైనా ఉంది. మతవాదానికి బదులు మానవతావాదం అవసరం అనే నమ్మకం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది అత్యవ సరం. మహాకవి గురజాడ అప్పారావు ‘‘మతముల న్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’’ అని శతాబ్దం కిందటే అన్న విషయం గుర్తుంచుకోవాలి.
 బుర్రి శేఖర్  ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా

 ఈ ఘోరం ఇంకెన్నాళ్లు?
 హైదరాబాద్ వాటర్ బోర్డు ద్వారా, అలాగే ఇతర ప్రైవేట్ సంస్థల ద్వారా నీటిని అమ్మకాలు జరిపే ట్యాంకర్ల నిర్వాహకులు, వ్యాపారంలో పోటీ కారణంగా వాహనం నడిపేందుకు ఎలాంటి అర్హతలు లేని చిన్న వయసు పిల్లల చేత ట్యాంకర్లు నడిపిస్తూ నగరంలో చాలా ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇటీవల నగరంలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకోబో తున్న ఒక విద్యార్థినిని అన్యాయంగా ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ బలి తీసుకోవడం గర్హనీయం. ఈ ట్యాంకర్లు నడిపే చిన్న వయసు పిల్లలకు ఎలాంటి మానసిక పరిపూర్ణతా ఉండదు. ఇందువల్ల వీరు విపరీతమైన వేగంతో వాహనాలు నడుపుతూ, ప్రమాదాలకు కారణమవుతూ, అమాయ కుల ప్రాణాలు ముప్పు కలిగిస్తున్నారు. అలాగే ఈ వాహనాలకు ఎటువంటి పిట్‌నెస్‌లు ఉండవేమోననే అనుమానం కూడా కలుగుతోంది. కాబట్టి, నగరంలో అనేక ప్రమాదాలకు కారకులౌతున్న ఈ నీళ్ల ట్యాంకర్లను కొన సాగించడంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుని, నగర పౌరులకు భద్రత కలిపించగలరని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ ఎస్ మేనేజింగ్ డెరైక్టర్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిషనర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని నియోజకరవర్గాల ప్రజాప్రతినిధులైన రాష్ట్ర శాసనసభ సభ్యులు ఇంజనీరింగ్ విద్యార్థిని అమూల్యమైన ప్రాణాలను బలిగొన్న ట్యాంకర్ ప్రమాదం వంటి ఘటనలను ఇకనైనా తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై కఠిన చర్యలు చేపడితేనే దీనికి అడ్డుకట్ట వేయగలుతాం.
 ఎం. అశోక్, ఎర్రగడ్డ, హైదరాబాద్

  సికిల్ సెల్ నివారణకు చర్యలేవీ?
 ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గిరిజన సీమల్లో సికిల్ సెల్ వ్యాధి పంజా విసురుతూ ఎందరో చిన్న పిల్లలను బలిగొంటున్నప్పటికీ ఎ.పి. వైద్య ఆరోగ్యశాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీస స్పందన కూడాలేదు. నివారణ చర్యల ఊసేలేదు. జన్యుపరమైన మార్పుల ఫలితంగా వచ్చే ఈ రక్తహీనత జబ్బునకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది. సికిల్‌సెల్ అనీమియా అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో వైద్య, ఆరోగ్యశాఖ ఉండటం దారుణమని చెప్పక తప్ప దు. ఈ వ్యాధికి గురై మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపకపోవడం అత్యంత బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యవైఖరికి ఇది ప్రబల నిదర్శనం. ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్తపరీక్ష ఖరీదు రూ.10కి మించి ఉం డదు. కాగా ఈ వ్యాధి నివారణకు మందులు అందుబాటులో లేవు.  వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జబ్బును ప్రాథమిక దశలో గుర్తిం చి తగు మందులు తీసుకుంటే రోగి ఎక్కువ కాలం బతికేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిష్ణాతులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం కామెర్లు ఉండ టం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతుల వేళ్లు వాచి పోయి వంపు తిరగడం, ప్లీహం వాచిపోయి ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని నయం చేసే వైద్య విధానం ఇంకా అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమే. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మన ముందున్న ఏకైక పరిష్కారం.

ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తున్నా, గిరిజనేతర ప్రాంతాల్లో సైతం ఇది కనిపిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో ఈ వ్యాధి విజృంభిస్తుండగా, విజయ నగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పల్లెల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు సమాచారం. సికిల్ సెల్ అనీమి యా వ్యాధిని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం క్షమార్హం కాదు. ఈ వ్యాధిపై కనీసం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గిరిజనులను, గిరిజనేతరు లను చైతన్యపరచాలి. అలాగే వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహించి రక్త పరీక్షలు జరపాలి. నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్‌పై చర్చించడని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగానే సికిల్ సెల్ అనీమియాపై చైతన్య కార్యక్రమాలలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చాలి. ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చాలి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్టు గానే, మన రాష్ట్రం కూడా తగు విధంగా వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవాలి. ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో కూడా సెమినార్లు జరపాలి. వైద్య నిష్ణాతులు అవసరమైన పత్రాలు సమర్పిం చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇకనైనా చొరవ తీసుకోకపోతే గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసి ఉంటుంది. అందరికీ ఆరో గ్యం అనే నినాదం అందని మానిపండుగా మారకూడదు.
 వి.కొండలరావు,  సీనియర్ జర్నలిస్టు, పొందూరు

 ప్రత్యేక హోదా కోసం ఉద్యమం!
 ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 ఏళ్లపాటు రాష్ట్ర విభజన అంశం కీలకంగా సాగింది. ఈ నేపథ్యంలో విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. విభజన వలన నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు సహాయం అందించడా నికి కేంద్రం కొన్ని ప్రతిపాదనలను సభ ముందుం చింది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా మని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, పర్యావరణ, ప్రాజెక్టు అనుమతులను సైతం కేం ద్రమే తెస్తుందని తెలిపారు. వీటితోపాటు నూతనంగా రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని విభజన బిల్లులో  పేర్కొన్నారు. సభలో  ఆనాటి బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యే క హోదాతో ప్రజలు సంతృప్తి చెందరని మాట్లాడారు. ఇప్పుడేమో మాట మార్చి ఇతర రాష్ట్రాలు ఆమోదించే అవకాశం లేనందున ప్రత్యేక హోదా మరచిపోవాలం టున్నారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేని రోజు ల్లో మంత్రి కాని రోజుల్లో, ప్రత్యేక హోదా సాధించా మని ప్రగల్బాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వం ఉండగా  ఈ రకమైన మాటలు మాట్లాడ టం ప్రజలను మోసగించడమే అవుతుంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 23,500 కోట్ల రూపా యల ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపా దనలు పంపగా 350 కోట్ల రూపాయలతో సరిపెట్టడం ఏ రకంగా భావ్యమో వారే చెప్పాలి.

జిల్లాకు 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే 10 కి.మీ. తారు రోడ్డు వేయ డానికి మాత్రమే సరిపోతుంది. అంతేగాకుండా బడ్జె ట్‌లో ఏడాదికి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉం దని తెలిసి 500 కోట్లు మాత్రమే కేటాయించడం విచా రకరం. రాజధాని నిర్మాణానికి 1,13,000 కోట్ల నిధు లు అవసరమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 20 వేల కోట్ల రూపాయలు కావాలని కోరింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన బిల్లులోని అంశాలను అమలు పరచా లని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 18న 13 జిల్లాల్లో నిర సన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ విజ్ఞప్తి చేస్తున్నది.
 కె. రామకృష్ణ,  కార్యదర్శి సీపీఐ ఏపీ రాష్ట్రసమితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement