పూలింగా.. ఫూల్స్ చేయడమా? | Inbox | Sakshi
Sakshi News home page

పూలింగా.. ఫూల్స్ చేయడమా?

Published Fri, Nov 7 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

పూలింగా.. ఫూల్స్ చేయడమా?

పూలింగా.. ఫూల్స్ చేయడమా?

 ఇప్పటివరకు రాజధాని గురించి సరైన స్పష్ట త ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ అని రైతుల ను గందరగోళంలో పడేసిన ఘనత చంద్రబా బుదే. ఒకసారి మంగళగిరి అని, ఒకసారి విజ యవాడ అని చెబుతూ ఎక్కడో ఇంతవరకూ తేల్చకపోవడం శోచనీయం. చంద్రబాబు అనుచరులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటోదని చెబితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఒక పక్క రైతులకు మేలు చేస్తామని చెప్పి రైతుల భూమిని తీసుకోవడంలో అర్థం ఏమిటి? దీనిపై 80 శాతం ప్రజలు, రైతులు తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రైతుల పొలాలు కారుచౌకగా కొనుక్కోవడానికి చూడటం, అలా కాకపోతే బలవం తంగా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇదే కొనసాగితే రైతులు ఉద్యమం చేయడం ఖాయం. అదే కాకుండా అధికారంలోకి వచ్చాకా బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పటివరకూ బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికయినా రాజ ధాని విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన చేసి రైతులకు నష్టం కాకుండా వ్యవహరించాలి.
 శొంటి విశ్వనాథం,  చిక్కడపల్లి, హైదరాబాద్

 కేంద్ర విద్యాసంస్థలు ఇలాగేనా?
 ఆంధ్రప్రదేశ్‌కి మంజూరైన 11 కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ సర్కారు రోజుకోమాటగా వ్యవహరిస్తోంది. అన్ని జిల్లా లకూ అభివృద్ధి ఫలాలు అందజేయవలసి ఉంది. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు 11 విద్యా సంస్థల్లో ఏదీ కేటాయించటం లేదట. ఈ మూడు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ మెజారిటీ సీట్లు గెలిచిన కారణం గానే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. ఇక కర్నూలు లో ముందు ఎన్‌ఐటీ అని చెప్పి ఇప్పుడు ఐఐఐటీ అంటు న్నారు. అనంతపురంలో ఐఐఐటీ అని చెప్పి, తర్వాత ఎన్‌ఐటీ అని ఇప్పుడు సెంట్రల్ వర్సిటీ అంటున్నారు. విశాఖలో 4 విద్యా సంస్థలు పెడతామని, ఇప్పుడు ఐఐఎం అంటున్నారు. పెట్రో వర్సిటీ అయితే మొదట విశాఖలో అన్నారు. తర్వాత రాజమండ్రి అంటున్నారు. గోదావరి జిల్లాల్లో వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు గూడెంకి హార్టికల్చర్ వర్సిటీ, రాజమం డ్రికి నన్నయ వర్సిటీ ఇచ్చారు. ఇవి నిజానికి కాకినాడ, ఏలూ రుకు దక్కవలసినవి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గందరగోళానికి తెరదించుతూ కాకినాడలో పెట్రో యూనివర్సిటీ, ఏలూరులో ఎన్‌ఐటీ లేదా ఒక కేంద్ర విద్యాసంస్థ ఏర్పాటు చేయాలి.
 యామినీ రెడ్డి,  విజయవాడ

 నిరుద్యోగులను ఆదుకోండి
 రాష్ట్రవ్యాప్తంగా జిల్లా గ్రంథాలయ శాఖల్లో 430 ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగాలకు ఈ సంవత్సరం మార్చి నెలలో పరీక్షలు నిర్వ హించి 1:3 ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ఈ ఇంట ర్వ్యూలు రాష్ట్ర విభజన నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ ఉద్యోగాలను డీఎస్సీ టీచర్ రిక్రూట్‌మెంట్ నియామకాల తర్వాత నియామకం చేయాల్సి ఉంటుంది. 1:3  ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపికయిన అభ్యర్థులందరూ, ఎక్కువ శాతం టీటీసీ, బీఈడీ చేసి ఉన్నవారే. కాబట్టి వీరిలో చాలామంది ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ 2014కు ఎంపికయ్యే అవకాశం ఉంది. డీఎస్సీకి ఎంపిక కాగా మిగిలిన అభ్యర్థులకు 1:3 ప్రకారం  మెరిట్ ప్రాతిపదికన గ్రంథా లయ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కలుగుతుంది. ఈ అం శాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వయోపరిమితి దాటుతున్నా, ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన. రాను రాను ప్రభుత్వాలకు గ్రంథాలయాల పట్ల, వాటి పురోభివృద్ధి పట్ల అశ్రద్ధ పెరిగి పోతోంది. ఇకనైనా జ్ఞాన భాండాగారాలను కాపాడాలని కోరుతున్నాము.
 పుల్లేటి మహేంద్ర,  సాయినగర్, అనంతపురం


కల్లు దుకాణాలొద్దు
 ఒక పక్క కల్లు దుకాణాలపై మహిళలు ఆందోళన చేస్తున్నా, ఇం కా జనావాసాల ముందు, పాఠశాలలు, దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వాటికి అనుమతినివ్వడంతో ప్రభు త్వానికి ప్రజాభిప్రాయంతో పనిలేదని తేలిపోయింది. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా? దీనిపై ఏ రాజకీయ నాయకులూ పెదవి విప్పకపోవడం దురదృష్టకరం. ప్రజల ఆరో గ్యం కంటే ప్రభుత్వ ఆదాయమే ముఖ్యమైతే, పేద లవైద్యం, దవాఖానాలకు ఎంత డబ్బు కేటాయిస్తే మాత్రం ఏమిటి లాభం. సారావలన సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రయోజనం కనిపించటంలేదు. ఒకవైపు ఇదే ప్రభుత్వం పేకాట క్లబ్బులను నగరానికి దూరంగా పెట్టుకునే వీలు కల్పిస్తున్నప్పుడు కల్లు, సారా దుకాణాలను కూడా ఊరి చివ రకు తరలించే చర్యలు చేపట్టాలి. జనావాసాల మధ్య మద్యం ఉం టే మహిళల దగ్గరనుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పేద వాడి కూలి డబ్బులు కల్లు, సారా దుకాణాలకే అర్పితం అవుతున్న ప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఏమి లా భం? తెలంగాణ ప్రభుత్వం వీటిపై మరోసారి పునరాలోచించాలి.
 ఎస్. రాజ్యలక్ష్మి,  చిక్కడపల్లి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement