yamini reddy
-
దృశ్యకారిణి
ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు యామినీ రెడ్డి. మహాకవులు రాసిన గొప్ప గ్రంథాలలోని భావానికి నాట్య రూపం ఇది. సాహిత్యాభిలాషులకు నాట్యాన్ని దగ్గర చేయడంతోపాటు సామాన్యులకు గొప్ప గ్రంథాలలోని మార్మికత అర్థమయ్యేటట్లు భావాన్ని వివరిస్తూ దానిని కళ్ల ముందు ఆవిష్కరించడమే దృశ్య కావ్య. పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల కుమార్తె అయిన యామిని తన నాట్య ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు. మూడేళ్ల వయసులో స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి గజ్జె కట్టుకున్నారు యామిని. పాదాలతో పదనిసలు పలికించడం, కళ్లలో భావాన్ని అభినయించడం యామినికి చిన్నప్పటి నుంచే అలవాటైంది. అయితే ఆమె సంపూర్ణ నర్తకిగా రంగప్రవేశం చేయడానికి ఇరవై ఏళ్లు దాటే వరకు ఆగాల్సి వచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే యామినిని నర్తకిని చేయాలనే కోరిక అమ్మానాన్నలకు లేకపోవడంతో ఆమె రంగప్రవేశానికి అంత టైమ్ పట్టింది. కూతురు ప్రొఫెషనల్ కోర్సు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనేది తల్లి కోరిక. తండ్రికి మాత్రం కూతురికి ఏ రంగం ఇష్టమైతే ఆ రంగం వైపు ప్రోత్సహిద్దామనే అభిలాష తప్ప ప్రత్యేకంగా ఏ నిబంధనా లేదు. డాక్టర్ అయితే డ్యాన్స్ ప్రాక్టీస్‌కి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందనే భయంతో యామిని మెడిసిన్ సీటును వదులుకున్నారు. ‘ఈ సీటు వదిలేశావ్ సరే, మరేదైనా ఉద్యోగం వచ్చే కోర్సులో చేరు’ అనేది ఆమె తల్లి. అమ్మ మాట కోసం మాత్రమే యామిని ఎంబీఏ చేశారు. అప్పుడు కూడా ‘‘నాకు ఉద్యోగం చేయాలని లేదు, డ్యాన్స్ చేయాలని ఉంది’’ అందామె స్థిరంగా.‘‘పర్ఫెక్షన్ వచ్చే వరకు సాధన చెయ్యి. నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రంగప్రవేశం చేయవచ్చో లేదో నిర్ణయిస్తాను’’ అన్నారు తండ్రి. కూతురి మొండి పట్టుదలతో సాధన చేయడాన్ని, నాట్యంలో ఆమె సాధించిన మెళకువలను చూశాక మాత్రమే రంగప్రవేశం చేయడానికి అనుమతించారాయన. ‘‘మా నాన్న అంగీకారంగా తలూపడం అంటే యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చినట్లే’’ అన్నారామె నవ్వుతూ. అమ్మకు ఇష్టం లేదు ‘‘నాన్న, అమ్మ ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి పడిన కష్టం చిన్నది కాదు. కళారంగంలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని, నాట్యాన్ని కెరీర్‌గా తీసుకుంటే కొద్ది కాలానికే రిటైర్ కావలసి వస్తుందని అమ్మ భయం. ‘అమ్మా నా ఇష్టం నాట్యంలో ఉన్నప్పుడు మరే పని చేసినా మనసు చంపుకుని చేయాల్సిందే. నాట్యంలో నా కెరీర్‌ను కాపాడుకుంటాను. సవాళ్లకు భయపడను. మీరు పాటించిన సహనాన్ని నేను కూడా అలవరుచుకుంటాను’ అని అమ్మకు నచ్చచెప్పాను. నాట్యం అంటే భగవంతుడిని అర్చించే ఒక మార్గం. నేను అంతే అంకితభావంతో కూచిపూడి నాట్యం సాధన చేస్తుండడంతో అమ్మానాన్నలకు నా మీద నమ్మకం కలిగింది. నా కోసం హైదరాబాద్‌లో 2007లో నాట్య తరంగిణి డ్యాన్స్ స్కూల్ శాఖను ప్రారంభించారు. అప్పటి నుంచి నా మీద బాధ్యత పెరిగింది. నాట్య ప్రదర్శనలతోపాటు స్కూల్ నిర్వహణ చూసుకుంటున్నాను. నాట్యం ఒక ప్రవాహం నాట్యం తటాకంలా ఉండకూడదు. ప్రవహించే నదిలాగ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాలి. నాట్యంలో ప్రయోగాలు చేస్తూనే ఉండాలనేది నాన్న పాటించిన సూత్రం, మాకు నేర్పించిన పాఠం. ఈ నెల పదవతేదీన రవీంద్రభారతిలో ‘దృశ్యకావ్య’ అనే థీమ్‌తో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఇటీవల కొత్తతరంలో డ్యాన్స్‌కు ఆదరణ పెరిగింది, కానీ పొయెట్రీ చదవడం పూర్తిగా కనుమరుగైపోతోంది. ఊతుకాడు వెంకటసుబ్బయార్, తులసీదాస్, స్వాతి పెరుమాళ్, జయదేవ, నారాయణ తీర్థ వంటి మహాకవుల గురించి ఈతరం పిల్లలకు తెలిసే అవకాశం తక్కువ. వీళ్ల రచనల ఆధారంగానే దృశ్యకావ్యను రూపొందించాను. ఇందులో నాతోపాటు నా శిష్యులు పదిమంది పాల్గొంటున్నారు. ఈ ప్రయత్నం వల్ల పిల్లల్లో మన గ్రంథాల పట్ల ఆసక్తి కలగాలనేది నా కోరిక. నేర్పించాను... నిర్ణయించను మా అబ్బాయికి ఏడేళ్లు. తనకు కూచిపూడిలో బేసిక్స్ నేర్పించాను. తనను డ్యాన్సర్‌ని చేయాలనే నిర్ణయం నేను తీసుకోను. ఇప్పుడు నేనసలే ఏమీ నేర్పించకపోతే.... రేపు బాబు పెద్దయిన తర్వాత ‘నాకెందుకు నేర్పించలేదమ్మా’ అని బాధపడకూడదు కదా! అందుకోసం మాత్రమే తల్లిగా నా బాధ్యత అన్నట్లు నేర్పిస్తున్నాను. నాట్య ప్రదర్శన కోసం బయటికి వెళ్లినప్పుడు బాబు నన్ను మిస్ అవుతున్నాడనే అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది. అందుకే వారంలో రెండు రోజులు నా వర్క్ నుంచి హాలిడే తీసుకుని ఆ రెండు రోజులూ పూర్తిగా బాబు కోసమే కేటాయిస్తున్నాను. వృత్తి బాధ్యతను, తల్లి బాధ్యతను బ్యాలెన్స్ చేయడం కష్టం అని చెప్పను కానీ, చాలా సున్నితంగా డీల్ చేసుకోవాలని మాత్రం చెప్తాను. అలా సమన్వయం చేసుకోగలిగిన నేర్పు ఆడవాళ్లలో ఉంటుంది కూడా’’ అన్నారు యామిని. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేశ్ రెడ్డి ప్రశంస–పురస్కారాలు ‘యామిని డ్యాన్స్ కోసమే పుట్టిన అమ్మాయి. సంపూర్ణమైన నాట్యకారిణి’ యామిని నాట్యం చూసిన ప్రసిద్ధ సితార్ విద్వాంసులు, భారతరత్న పండిట్ రవిశంకర్ ఇచ్చిన ప్రశంస ఇది. ఆమె సంగీత నాటక అకాడమీ, జాతీయ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం, దేవదాసి నేషనల్ అవార్డు, ఫిక్కీ యంగ్ అచీవర్స్ అవార్డులు, ఐర్లాండ్, యూఎస్‌లలో స్థానిక సాంస్కృతిక పురస్కారాలు అందుకున్నారు. నాట్యం మీద ఆమె ‘ఆడియన్స్ డెవలప్మెంట్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ఇండియా’ పేరుతో పరిశోధన గ్రంథాన్ని కూడా రాశారు. -
అంతరంగం
జీవిత పరమార్థం తెలియాలంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించాలి.. కళలను ఆస్వాదించాలి.. సాహిత్యాన్ని అభిమానించాలి.. బాధను అనుభవించాలి.. అర్థం చేసుకోవాలి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ తత్వాన్ని ఒంటబట్టించుకున్నదే ‘అంతరం’. ఈ పేరుతో నగరంలో నేడు ఓ నృత్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మహిళల్లో దాగి ఉన్న అపార శక్తిని ఆవిష్కరించే ఈ దృశ్యరూపకం గురించి క్లుప్తంగా... - సాక్షి, సిటీప్లస్ థీమ్.. భారతీయ పురాణాల్లోని శక్తిమంతమైన రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్ అనే నాలుగు స్త్రీ పాత్రలే ఈ అంతరం పోషించే ముఖ్య భూమికలు. ఈ వనితల ఔన్నత్యాన్ని తమ అభినయ కౌశలంతో అంతే అద్భుతంగా మెప్పించనున్నారు సుహాసినీ మణిరత్నం, యామినీరెడ్డి, గోపికావర్మ, కృతికా సుబ్రహ్మణ్యన్. రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్ల పౌరాణిక నేపథ్యానికి విశ్లేషణను జోడించి ఆ పాత్రలకు మరింత వన్నెతేనుందీ ప్రదర్శన. వీటికి తోడు శాండ్ ఆర్ట్, తోలుబొమ్మలాట, మైమ్, శిల్పకళా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. అంతరం అంటే.. పురాణాల్లోని నాలుగు స్త్రీ పాత్రల ఆంతర్యం, స్వభావాన్ని వివరించడమే ఈ ‘అంతరం’ ఆంతర్యం. ఇది శరీరానికి, మనసుకి ఉన్న దూరాన్ని అన్వేషించేది. శోధించేది. ఈ పురాణ స్త్రీల శక్తిని ‘అంతరం’గా ప్రదర్శించాలన్న ఆలోచన గోపిక వర్మది. కార్యరూపమిచ్చింది కృతిక సుబ్రహ్మణ్యన్. ఎవరు.. ఏమిటి.. నాటకరూపంలో ‘రంభ’గా సుహాసినీ మణిరత్నం అభినయిస్తుంటే.. ‘వాసవి’గా కూచిపూడి నృత్యరూపకాన్ని యామినీరెడ్డి, మోహినీఆట్టంలో గోపికవర్మ ‘కణ్ణగి’గా, భరతనాట్యంలో కృతికసుబ్రహ్మణ్యన్ ‘ఆండాళ్’గా అలరించనున్నారు. కళాభిమానుల అపూర్వ కలయిక ఈ ప్రదర్శన. ఇటు శాస్త్రీయ నృత్యం, అటు సంగీతం, రంగస్థలం, ఆధునిక సాంకేతిక విజ్ఞానం.. ఒకే వేదికపై వీటన్నిటి సమ్మేళనమే ‘అంతరం’ అంటారు ఇందులో భాగస్వామి అయిన యామినీరెడ్డి. నేడు నృత్యనాటక ప్రదర్శన వేదిక: హెచ్ఐసీసీ, హైటెక్‌సిటీ, మాదాపూర్ సమయం: రాత్రి 7 గంటలు నిర్వహణ: హైడొరైట్ ఫౌండేషన్ -
పూలింగా.. ఫూల్స్ చేయడమా?
ఇప్పటివరకు రాజధాని గురించి సరైన స్పష్ట త ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ అని రైతుల ను గందరగోళంలో పడేసిన ఘనత చంద్రబా బుదే. ఒకసారి మంగళగిరి అని, ఒకసారి విజ యవాడ అని చెబుతూ ఎక్కడో ఇంతవరకూ తేల్చకపోవడం శోచనీయం. చంద్రబాబు అనుచరులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటోదని చెబితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఒక పక్క రైతులకు మేలు చేస్తామని చెప్పి రైతుల భూమిని తీసుకోవడంలో అర్థం ఏమిటి? దీనిపై 80 శాతం ప్రజలు, రైతులు తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రైతుల పొలాలు కారుచౌకగా కొనుక్కోవడానికి చూడటం, అలా కాకపోతే బలవం తంగా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇదే కొనసాగితే రైతులు ఉద్యమం చేయడం ఖాయం. అదే కాకుండా అధికారంలోకి వచ్చాకా బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పటివరకూ బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికయినా రాజ ధాని విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన చేసి రైతులకు నష్టం కాకుండా వ్యవహరించాలి. శొంటి విశ్వనాథం, చిక్కడపల్లి, హైదరాబాద్ కేంద్ర విద్యాసంస్థలు ఇలాగేనా? ఆంధ్రప్రదేశ్‌కి మంజూరైన 11 కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ సర్కారు రోజుకోమాటగా వ్యవహరిస్తోంది. అన్ని జిల్లా లకూ అభివృద్ధి ఫలాలు అందజేయవలసి ఉంది. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు 11 విద్యా సంస్థల్లో ఏదీ కేటాయించటం లేదట. ఈ మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ సీట్లు గెలిచిన కారణం గానే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. ఇక కర్నూలు లో ముందు ఎన్ఐటీ అని చెప్పి ఇప్పుడు ఐఐఐటీ అంటు న్నారు. అనంతపురంలో ఐఐఐటీ అని చెప్పి, తర్వాత ఎన్ఐటీ అని ఇప్పుడు సెంట్రల్ వర్సిటీ అంటున్నారు. విశాఖలో 4 విద్యా సంస్థలు పెడతామని, ఇప్పుడు ఐఐఎం అంటున్నారు. పెట్రో వర్సిటీ అయితే మొదట విశాఖలో అన్నారు. తర్వాత రాజమండ్రి అంటున్నారు. గోదావరి జిల్లాల్లో వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు గూడెంకి హార్టికల్చర్ వర్సిటీ, రాజమం డ్రికి నన్నయ వర్సిటీ ఇచ్చారు. ఇవి నిజానికి కాకినాడ, ఏలూ రుకు దక్కవలసినవి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గందరగోళానికి తెరదించుతూ కాకినాడలో పెట్రో యూనివర్సిటీ, ఏలూరులో ఎన్ఐటీ లేదా ఒక కేంద్ర విద్యాసంస్థ ఏర్పాటు చేయాలి. యామినీ రెడ్డి, విజయవాడ నిరుద్యోగులను ఆదుకోండి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా గ్రంథాలయ శాఖల్లో 430 ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగాలకు ఈ సంవత్సరం మార్చి నెలలో పరీక్షలు నిర్వ హించి 1:3 ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ఈ ఇంట ర్వ్యూలు రాష్ట్ర విభజన నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ ఉద్యోగాలను డీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ నియామకాల తర్వాత నియామకం చేయాల్సి ఉంటుంది. 1:3 ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపికయిన అభ్యర్థులందరూ, ఎక్కువ శాతం టీటీసీ, బీఈడీ చేసి ఉన్నవారే. కాబట్టి వీరిలో చాలామంది ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ 2014కు ఎంపికయ్యే అవకాశం ఉంది. డీఎస్సీకి ఎంపిక కాగా మిగిలిన అభ్యర్థులకు 1:3 ప్రకారం మెరిట్ ప్రాతిపదికన గ్రంథా లయ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కలుగుతుంది. ఈ అం శాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వయోపరిమితి దాటుతున్నా, ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన. రాను రాను ప్రభుత్వాలకు గ్రంథాలయాల పట్ల, వాటి పురోభివృద్ధి పట్ల అశ్రద్ధ పెరిగి పోతోంది. ఇకనైనా జ్ఞాన భాండాగారాలను కాపాడాలని కోరుతున్నాము. పుల్లేటి మహేంద్ర, సాయినగర్, అనంతపురం కల్లు దుకాణాలొద్దు ఒక పక్క కల్లు దుకాణాలపై మహిళలు ఆందోళన చేస్తున్నా, ఇం కా జనావాసాల ముందు, పాఠశాలలు, దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వాటికి అనుమతినివ్వడంతో ప్రభు త్వానికి ప్రజాభిప్రాయంతో పనిలేదని తేలిపోయింది. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా? దీనిపై ఏ రాజకీయ నాయకులూ పెదవి విప్పకపోవడం దురదృష్టకరం. ప్రజల ఆరో గ్యం కంటే ప్రభుత్వ ఆదాయమే ముఖ్యమైతే, పేద లవైద్యం, దవాఖానాలకు ఎంత డబ్బు కేటాయిస్తే మాత్రం ఏమిటి లాభం. సారావలన సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రయోజనం కనిపించటంలేదు. ఒకవైపు ఇదే ప్రభుత్వం పేకాట క్లబ్బులను నగరానికి దూరంగా పెట్టుకునే వీలు కల్పిస్తున్నప్పుడు కల్లు, సారా దుకాణాలను కూడా ఊరి చివ రకు తరలించే చర్యలు చేపట్టాలి. జనావాసాల మధ్య మద్యం ఉం టే మహిళల దగ్గరనుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పేద వాడి కూలి డబ్బులు కల్లు, సారా దుకాణాలకే అర్పితం అవుతున్న ప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఏమి లా భం? తెలంగాణ ప్రభుత్వం వీటిపై మరోసారి పునరాలోచించాలి. ఎస్. రాజ్యలక్ష్మి, చిక్కడపల్లి, హైదరాబాద్ -
మాట మీద నిలబడే నాయకుడు కావాలి
సీమాంధ్ర ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎదగాలి. నాలుగేళ్లుగా తెలుగు నేల అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలంతా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. సీమాంధ్రలో జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. యువ నాయకత్వంతోనే మంచి రోజులొస్తాయని పారిశ్రామికవేత్తలంతా కోరుకుంటున్నారు. మాట మీద నిలబడే వ్యక్తితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అంటున్నారు హోలీమేరీ, నలంద విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, సప్ల ఆర్గానిక్స్ డెరైక్టర్ ఆరిమంద యామినీరెడ్డి. ఆమె మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) సీమాంధ్ర శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కోవె ద్వారా మహిళలను పరిశ్రమల వైపు ప్రోత్సహిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా యువ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని యామినీరెడ్డి చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్‌తో మంచి రోజులు వచ్చాయి.. 2004కు ముందు రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య అతిస్వల్పం. వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాకే మంచి రోజులు వచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు స్థలాలు కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పుడు ఎందరో సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరం పెరుగుతుంది. 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిబ్బరంగా ఉన్నారు. ఆ పాలన మళ్లీ రావాలి.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్ బాటలు పరిచారు. ఉన్నత విద్యను సామాన్యుడి గుమ్మం ముందు నిలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అయితే కళాశాలలకు మాత్రం నాలుగేళ్లుగా నిధులు ఆలస్యంగా వస్తున్నాయి. వైఎస్ పాలన మళ్లీ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు మాఫీ అయితే వారికి పెద్ద ఊరటే. జగన్‌తోనే సాగు-బాగు సీమాంధ్రలో వ్యవసాయం ఎక్కువ. ఈ రంగాన్ని అర్థం చేసుకున్న నాయకుడే వ్యవసాయాధార పరిశ్రమలను ప్రోత్సహించగలడు. ఐటీ రంగం అంటూ బాబు వ్యవసాయాన్ని విస్మరించారు. వ్యవసాయానికి వైఎస్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వారసుడిగా జగన్ నాయకత్వంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. రెండు జిల్లాలకో వ్యవసాయ కళాశాల, ప్రాసెసింగ్ పరిశ్రమలు, అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు, రూ.3,000 కోట్ల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ఏటా ప్రత్యేక నిధి ఏర్పాటు హామీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. సామాన్యులకు రాజకీయాలు తెలియవు. వారికి కావాల్సిందల్లా కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకుడు. అండగా ఉంటాడన్న భరోసా వారు కోరుకుంటున్నారు. వైఎస్ అంటేనే 108, ఆరోగ్యశ్రీ. ఈ రెండూ పక్కాగా అమలవ్వాలని ప్రతి ఒక్కరి అభిలాష. మలి వయసులో అన్నం కోసం ఎవరూ చేయి చాచనక్కరలేదని జగన్ హామీ ఇస్తున్నారు. అవ్వా తాతలకు నెలకు రూ.700 పింఛను, వృద్ధాశ్రమాల స్థాపన హామీ ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.