అన్నప్రాశన రోజే ఆవకాయ
ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆంగ్ల పాఠ్యపుస్తకాలు ‘విద్యార్థుల’ మానసిక స్థాయిని మించి ఉన్నాయి. డిగ్రీ, పీజీ స్థాయి వారికి పరిచయం చేసే క్లిష్టమైన పదజాలం పాఠాల్లో వాడటం విడ్డూ రం. విద్యా ప్రణాళికలో విషయాత్మకతకు కాని, లక్ష్యాత్మకతకు కాని చోటులేదు. కేవలం సృజనాత్మకతకే పెద్దపీట వేశారు. ఉదా హరణకు ఒక కథను ఇచ్చి దాన్ని సంభాషణ రూపంలో ఇంగ్లిష్ లో రాయమనడం, చదవని పద్యాన్ని ఇచ్చి అం దులో ప్రశ్నలడగడం, క్రికెట్ కామెంటరీ రాయ మనడం పసి మనసులను క్షోభ పెట్టడమే. ఇది కార్పొరేట్ స్కూళ్లకే కాని ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగకరం కాదు. తెలంగాణలో పేద విద్యా ర్థినీ, విద్యార్థులకు ఇది మేలు కలిగించదు. పాఠంలో చదివిన ప్రశ్నలు రావు. ఉపాధ్యాయులకు వారిని ఎలా సిద్ధం చేయాలో తెలియని పరిస్థితి. ఇది విద్యార్థులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. పాఠ్యపుస్తకాలను సరళతరం చేసి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎల్‌కేజీ, యూకేజీ ప్రాథమిక ఇంగ్లిష్ మీడి యం పాఠశాలలు ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏర్పడుతుంది.
దేవళ్ల సుధాసాగర్ బెల్లంపల్లి, ఆదిలాబాద్
బెల్టుషాపులు రద్దు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఆర్‌టీసీ బస్సులో వారికి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేశారు. మహిళలపై అఘా యిత్యాల పట్ల దృష్టిపెడుతూ చట్టాల ద్వారా శిక్షించే విధంగా నిర్భయ చట్టాన్ని అమలుచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పనిలో పనిగా, రాష్ట్రంలో మహిళలకు కన్నీరు కురిపిస్తున్న బెల్టు షాపులను వెంటనే రద్దుచేయాలి. ఉద్యోగమో, కూలోనాలో చేసు కుంటూ కుటుంబాన్ని పోషించే మహిళలు తమ వీధుల్లో ఉన్న బెల్టు షాపుల వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మహి ళలు పని చేసి తిరిగి వచ్చే సరికి, ఇంట్లో దాచిన డబ్బులను భర్త తీసుకుని బెల్టు షాపుల్లోని చీప్ లిక్కర్ తాగి కట్టుకున్న భార్యను బెల్టుతో బాదేస్తుంటే ఆ కుటుంబం పరువు బజారులో పడు తోంది. ఈ దుస్థితి నుంచి మహిళలను, కుటుంబాలను బయట పడవేయాలంటే, తెలంగాణ వ్యాప్తంగా చీప్ లిక్కర్, గుడుంబా అమ్మే బెల్టు షాపులను ప్రభుత్వం రద్దు చెయ్యాలి. బెల్టు షాపుల వలన జనాల జీవితాలు అప్పుల పాలవుతున్నాయి, బెల్టు షాపు లను రద్దుచేస్తే తప్ప తెలంగాణ బాగుపడదని జనాభిప్రాయం. ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయంతో మనుగడ సాగించా లనుకుంటే, ఇక సంక్షేమానికి అర్థం పరమార్ధం ఉండవు.
కె.అమన్‌రాజీవ్ కుతుబుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా
ఆ బౌన్సర్ ఓ గుణపాఠం
ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్‌పై దూసుకొచ్చిన ఓ బౌన్సర్ అతని నిండు ప్రా ణాలను బలితీసుకోవడం క్రికె ట్ చరిత్రలో దురదృష్టకర ఘ టన. భారత క్రికెట్ ఆటగాడు రమణ్ లాంబా అతి పిన్న వ యసులో ఇలాగే క్రికెట్ బంతి తగిలి మృత్యువాతపడ్డాడు. జెంటిల్‌మ్యాన్ గేమ్‌గా పేరు గాంచిన క్రికెట్‌లో ఈ దుర్ఘ టనతో అర్థాంతరంగా ఒక వర్ధమాన క్రికెటర్ అసువులు బాయడం దిగ్భ్రాంతికరం. క్రీడ వినోదం కావాలి కాని విషాదం మిగల్చరాదు.
బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల, కర్నూలు జిల్లా