
ఇదేనా బీసీలపై ప్రేమ!
అన్ని రాజకీయ పార్టీలూ వెనుకబడిన కులాలను ప్రత్యే కించి బీసీలను కరివేపాకులాగా వాడుకుంటున్నాయి. ఎన్నికలముందు అన్ని పార్టీలూ దళితులకు, బీసీలకు పెద్ద పీటవేస్తున్నాం అంటూ ఊరించి గద్దెనెక్కిన తర్వాత అలా గే వదిలేస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ ఏర్పడినప్పటి నుం చి బీసీలు ఆ పార్టీకి అండగా నిలిచారు. కానీ పార్లమెంటులో సుదీర్ఘ అనుభవమున్న బీసీ నేతలను కాదని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించారు.
పొలిట్ బ్యూరోలోనూ వారికే స్థానాలు కల్పించడం, అదే సామాజిక వర్గానికి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పదవిని కట్టబెట్టడం వంటి నిర్ణయాలతో పలురకాలుగా బీసీలను టీడీపీలో వెనుక బెంచీలకే పరిమి తం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలలో ఒకరిని కేంద్రమంత్రిగా నియమించేందుకోసం ప్రయత్నించాలి. రాబోయే శాసనమండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలి.
యర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం, తూ.గో. జిల్లా