అవును, సుజనా కోసం బీసీలు బలయ్యారు. ముస్లిం మైనార్టీలు మోసపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులను పక్కా ప్రణాళికతో బలి పశువుల్ని చేశారు. పార్ట్‌నర్ పవన్‌తో పోతిన వెంకట మహేష్ ను పొడిపించేశారు.
పెత్తందారీ పోకడలకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందిన చౌదరి (సుజనాను బాబుతో సహా టీడీపీలోని ముఖ్యులు సైతం చౌదరి అనే సంభోదిస్తుంటారు) కోసం బాబు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఫణంగా పెట్టేశారని ప శ్చిమలోని బీసీ, మైనార్టీ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని నిప్పులు చెరుగుతున్నారు.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని ఆక్రమించేసుకున్నాక చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అక్కడి నేతలు సొంతంగా బలపడకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడుతున్నట్లు ప్రతి ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఒంటరిగా పోటీ చేసింది తక్కువే.
1998 లోక్‌సభ ఉప ఎన్నిక మొదలు 1999, 2004, 2009, 2014 జనరల్ ఎలక్షన్లలో వామపక్షాలు, బీజేపీ, మహాకూటమి, జనసేనలతో టీడీపీ కూటమి కట్టి తలపడింది. 2019లో నేరుగా పోటీ అన్నట్లు కలరింగ్ ఇచ్చినా, జనసేనతో లోపాయికారీ ఒప్పందం లేకపోలేదు. 2004, 2009, 2019 ఎన్నికల్లో తలపడిన టీడీపీ ఓటమి చెందింది. 1983లో మాత్రమే టీడీపీ నుంచి బి.ఎస్.జయరాజ్ పోటీచేసి సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా సైద్ధాంతికంగా భిన్న ధృవాలైన సీపీఐ, బీజేపీలకు ప శ్చిమ సీటును కేటాయించడం బాబుకే సాధ్యమైంది.
తరచూ ఇంఛార్జిల మార్పుతో ఏమార్పు
పశ్చిమలో సంస్థాగతంగా పార్టీ బలపడక పోవడానికి, నిలకడగా ఏ ఒక్కరికీ నాయకత్వాన్ని అప్పగించక పోవడానికి.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేకపోవడమే. కూటమి కట్టినప్పుడల్లా ప శ్చిమ సీటును ఇతరులకు కేటాయించడం బాబుకు పరిపాటి.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పోటీ చేసి ఓడిన బీసీలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (దూదేకుల), మైనార్టీ వర్గానికి చెందిన జలీల్‌ఖాన్, ఆయన కూతురు షబనా ఖాతూన్, మొహమ్మద్ ఫతావుల్లా, ఎంఎస్ బేగ్ తదితర నాయకులు టీడీపీ నుంచి ఉన్నారు. వీరిలో ఎవరికి వారికి నియోజకవర్గ ఇంఛార్జి స్థాయి నీదే అనడం, ఆ తర్వాత కొంత కాలానికి పక్కన పెట్టేయడం చంద్రబాబుకు ఇక్కడ చెల్లుబాటయ్యింది.
ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ను అడ్డుగా పెట్టి..
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను దాదాపు రెండన్నరేళ్లకు పైగా ప శ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తూ అదే ప్రాంతానికి చెందిన బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్, నాగుల్‌మీరా, ఫతావుల్లా తదితరులను పక్కన పెట్టుకుని వారి చేతనే కేశినేనికి వ్యతిరేకంగా వ్యవహరింపజేయడం బాబుకే చెల్లిందని నగర నేతల ఏకాభిప్రాయం.
ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారమప్పుడు నగరమంతా నవ్వుకునేలా ముఖ్య నాయకులను వీధుల్లోకి చేర్చి తిట్ల దండకాలను కొనసాగించడం కొసమెరుపు. ఒకే ఎత్తుగడతో అందర్నీ చిత్తు చేయడమనేది బాబు నైజమని ఆ పార్టీలోని సీనియర్లు వల్లెవేసే మాట.
పవన్ చేత పోతినను...
జనసేన కోసం ఏళ్ల తరబడి పనిచేసిన, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి 22,367 ఓట్లు పొందిన బీసీ వర్గానికి చెందిన పోతిన వెంకట మహే‹Ùను సుజనా చౌదరి సీటు కోసం తన రాజకీయ పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పొడిపించేశాడని స్థానికంగా వాడ వాడ కోడైకూస్తోంది. చివరి నిమిషం వరకు సీటు ఆశించి మోసపోయిన పోతిన, జనసేనను వీడి వైఎస్సాఆర్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.
సుజనా చౌదరి కోటీశ్వరుడైనంత మాత్రాన బీసీలు డబ్బులకు అమ్ముడుపోతారని అనుకోవడం పొరపాటని పోతిన బాహాటంగానే ధ్వజమెత్తారు. ‘ధనికుడైనందున చౌదరిని బీజేపీ అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని మా అధినేత అనుకుని ఉండొచ్చు. నోట్లతో ఓటర్లను, భారీ బేరసారాలతో మమ్మల్ని లొంగదీసుకోవచ్చనే అంచనాకు వచ్చి ఉండొచ్చు. సమకాలీన రాజకీయాల్లోని లోతుపాతులు మాకూ తెలిసొచ్చా యి.
పెత్తందారు పచ్చనోట్లకు పేదలు, మాబోటి నాయకులందరూ లొంగి పోతారనుకోవడం పొరపాటని ‘పెద్దలు’ గ్రహించేలా గుణపాఠం నేర్పుతాం’ అని టీడీపీ, జనసేనల్లోని బీసీ, మైనార్టీల నేతలు చెబుతున్నారు. ‘వాళ్లు చేయాల్సింది చేశారు.. మేం చేయగలిగింది చేసి చూపిస్తాం’ అని వేర్వేరుగా ‘సాక్షి’తో వారు మనసులో మాట వెలిబుచ్చారు.
సుజనా మాటకు నాని అడ్డుచెప్పరనే..
బీజేపీలోకి సుజనాను పంపింది, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప శ్చిమ సీటును కేటాయించిందీ బాబు అనేది జనమెరిగిన సత్యం. పొత్తు కుదరక ముందు వరకు.. సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి అని పచ్చమీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.
సుజనా, కేశినేనిల మధ్య సాన్నిహిత్యం మెండుగా ఉన్నందున, చౌదరి మాటను నాని జవదాటరనేది బాబు నమ్మకం. బహుశా ఆ దృష్ట్యానే కేశినేనిని పశ్చిమ ఇంఛార్జిగా కొనసాగిస్తూ బీసీలు, మైనార్టీలను దూరంచేసే ప్రణాళికను బాబు అమలు పరిచారు. కాకపోతే ఊహించని రీతిలో బాబు ఎత్తులను చిత్తు చేస్తూ నాని టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment