మాతృభాషకు అపచారం | Inbox | Sakshi
Sakshi News home page

మాతృభాషకు అపచారం

Published Thu, Feb 19 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

మాతృభాషకు అపచారం

మాతృభాషకు అపచారం

 ఇన్ బాక్స్

 ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత స్థానికుల భాషలోనే అన్ని లావాదే వీలు జరగాలని విజ్ఞులు భావిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దేమిటి? తెలుగువారంతా జీతాలు ఇచ్చి మరీ ఆంగ్ల భాషకు పట్టం కడు తున్నారు. పైగా ఇలాంటి మౌలిక అంశాలపై దిశానిర్దేశం చేయవలసిన న్యాయస్థానాల నుంచి కూడా తెలుగుభాషకు న్యాయం లభించడం లేదు. హైకోర్టుతో సహా అన్ని స్థాయిలలోను కోర్టులు, అన్ని ఇతర ప్రభు త్వశాఖలు, పోలీసుస్టేషన్లు, ఆఖరికి శాసనసభ, మండలి, సచివాలయా లలోను ఆంగ్లమే రాజ్యమేలుతోంది. ఇంగ్లిష్‌లోనే తెలుగు రాష్ట్ర పాలన సాగుతోంది. రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమైన ఈ ప్రక్రియ 2-6-2014 నుంచి మొదలైంది. ఇంగ్లిష్‌లోనే దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తున్నా రు. అధికారభాషా చట్టం-1966ను పూర్తిగా పక్కనపెట్టారు. చాలామం దికి అర్థంకాని ఆంగ్లంలోనే కోర్టులు కూడా తీర్పులను వెలువరిస్తు న్నాయి. వాదులు, ప్రతివాదులు, న్యాయవాదులు అంతా తెలుగులో తమ గోడు వెళ్లబోసుకుంటూంటే, వాటి మీద తీర్పు ఆంగ్లంలో రావడం ఎంతవరకు న్యాయం? ఇంత జరుగుతున్నా మన ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నారు. నిజానికి ఈ విషయంలో చైతన్య వంతులు కావలసింది ప్రజలే. మాతృభాషకు న్యాయం చేయలేని ప్రజా ప్రతినిధులను పదవులకు రాజీనామా చేయించాలి. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా తెలుగుకు పట్టం కట్టాలని కోరుతున్నాను.
 పి. గంగునాయుడు  శ్రీకాకుళం

 తెలంగాణ గాంధీకి నివాళి
 స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి, జాతిపిత గాంధీ బాటలో, ఆయన నేతృత్వంలో అనేక ఉద్యమాలలో పాల్గొని, ముఖ్యం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ గాంధీ భూపతి కృష్ణ మూర్తి మరణం తీరనిలోటు. తెలంగాణ ఉద్యమా నికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, సాకారమైన తెలం గాణ రాష్ట్రాన్ని కనులారా వీక్షించిన యోధుడు కృష్ణ మూర్తి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ పోరా టానికి ఎక్కడ తెలంగాణ నినాదం కనిపించినా పరి గెత్తే మనిషి వీరు. 1968లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఏకం చేయడం లో వారు చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ తొలి ఉద్యమంలో స్వర్గీయ జయశంకర్‌తో కలసి అనేక ఉద్యమాలలో పాల్గొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, వివక్షతపై ప్రసంగించిన వ్యక్తి కృష్ణ మూర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా  తెలంగాణ ప్రజల మదిలో జీవితాంతం ఉంటారు. అమర్ రహేగా తెలంగాణ గాంధీ..
 కామిడి సతీష్ రెడ్డి  పరకాల, వరంగల్ జిల్లా
 
 భద్రాద్రిపై చిన్నచూపేలా?
 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రంలోని దేవాలయాలకు వరాలు ప్రకటిస్తున్నా రు. రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రా నికి 100 కోట్లు ప్రకటించడంతోపాటు కేరళ వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకోసం శబరిమలలో, అజ్మీర్ దర్గా వెళ్లే ముస్లిం భక్తుల కోసం రాజస్థాన్ లోని అజ్మీ ర్‌లో వసతి గృహాలు నిర్మిస్తాననడం హర్షణీ యం. కానీ మరికొద్ది రోజుల్లో శ్రీరామనవమి రాబోతోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో స్వామివా రికి పట్టువస్త్రాలు సమర్పించే కేసీఆర్ ఇంత వరకు భద్రాచలం రాములవారి ఆలయానికి అభి వృద్ధి నిధులు ప్రకటించకపోవడం గర్హనీయం. ఇప్ప టికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి రాముల వారి దేవస్థానానికి నిధులు ప్రకటించి స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని యావ న్మంది భక్తుల ఆకాంక్ష. భద్రాద్రి రామన్న ఆలయా న్ని అభివృద్ధి చేయడమంటే చారిత్రక స్థలాన్ని అభి వృద్ధి చేయడమని కూడా గమనించాలి.
 కలకొండ నరేష్ కుమార్  పరకాల, వరంగల్
 
 నష్టపరిహారం చెల్లించాలి
 తెలంగాణ నూతన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ కాలాల లో సరైన విధంగా వర్షాలు కురవక చాలా మంది వ్యవసాయ రైతులు పంటలు వేసి నష్టపోయారు. పంట చేలు వర్షాల లేమి కారణంగా ఎడారిగా మారి పోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో, తెలంగాణ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఇటీ వల అధికారులు నామమాత్రంగా నివేదికలు తయారు చేసి ఇచ్చిన నష్టపరిహారం పంపి ణీపై ప్రభుత్వంలో కదలికలు కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రైతుల కష్టా లను ప్రభుత్వాలు నెరవేర్చుతాయని గంపె డాశతో రైతులు ఉన్నారు. ఇటు సంపూర్ణంగా వ్యవ సాయ రుణాలు మాఫీ లేక డబ్బులు కడితేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకుల వారు పేర్కొనడం రైతులను మరింతగా కష్టాల్లోకి నెటుతుంది. కనీసం పంట నష్ట పరిహారమైనా అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న కోటి ఆశలతో రైతులు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పంట నష్టపరిహారం అందించి కరువు కాలంలో రైతులకు అండగా నిలవాలి.
 వి.నవనీతరావు  మద్నూర్, నిజామాబాద్
 
 ఫ్లెక్సీలతో బేజార్
 నగరంలో ప్రతీ ఒక్క కార్యానికి అది ఏరకమైన కార్యక్రమమైనా సరే రోడ్లపై పెద్ద పెద్ద బోర్డులు నగరంలో అక్కడా ఇక్కడా అనిలేకుండా ఎక్కడప డితే అక్కడ వెలుస్త్తున్నాయి. ప్రధాన కూడళ్లలో అయితే సిగ్నల్స్ కనిపించక వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నా మన నగర పాలక అధికా రులు మాత్రం కాసుల కోసం ఆశపడి యథేచ్ఛగా ైలెసైన్సులు జారీచేయడం శోచనీయం. వీటివలన నిఘా కెమెరాలకు కూడా ఆటంకం కలుగుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. పుట్టిన రోజు వేడుక నుంచి ఇంకా అది ఇది అనిలేకుండా అన్ని కార్యక్రమాలకు, అన్ని రాజకీయ పార్టీల వాళ్లు ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. ఇదివరలో ఇవి కూలి పోయి ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయి. అయినా మళ్లీ అదే తంతు. ఇటీవల దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందించి వీటిని తొలగించమని అధికా రులను ఆదేశించినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే తొలగించాలి.
 శోంఠి  విశ్వనాథం  హైదరాబాద్
 
 కన్నీటి పర్యంతమవుతున్నారు
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలవల్ల వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి నెలనుంచి తపాలా కార్యాలయాల ద్వారా పింఛన్ల పంిపిణీ ప్రారంభమైంది. అయితే లబ్ధిదారుల వేలిముద్రలు బయోమె ట్రిక్ యంత్రాలలో నమోదు కాకపోవడం, ఆధార్ నంబర్లు గల్లంతు తదితర కారణాలతో వేలాది మందికి పింఛన్లు ఇవ్వలేదు. దీంతో  వారంతా పింఛను కేంద్రాలవద్దే మండుటెండలో పడిగాపులు కాయవలసివస్తోంది. కొన్ని ప్రాంతాలలో అయితే గత నెల పిం ఛన్లు అందుకున్న వారి పేర్లు ఈసారి జాబితాలో లేకపోవడంతో వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పింఛన్ల పంపిణీ తయారైందని లబ్ధిదారులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్ కార్డులతోనే 5 నెలలు సజావుగా పింఛన్లు అం దజేసి, ఇప్పుడు మళ్లీ బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయడం వెనుక ఏదో గూడుపుఠాని ఉందని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యం గా నడుము సహకరించక, పైకి లేవలేక, వంగలేక పింఛను అందుకోవ డానికి వచ్చే వృద్ధుల కష్టాలు చూస్తే ఎవరైనా చలించక మానరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదృష్టితో ఆలోచించి అర్హులైన లబ్ధిదా రులందరికీ యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయాలి.
 దేవాంగ రామకృష్ణ  సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా
 
 గంగ సరే.. కాలువల మాటో
 గంగా గోదావరి నదుల ప్రక్షాళనను కేంద్ర ప్రభుత్వం చూసుకుం టుంది. ఒకవేళ ఆ నదుల ప్రక్షాళన విషయంలో  కేంద్ర ప్రభుత్వం విఫలమైనా నష్టం లేదు. ఎందుకంటే ఆ పని ప్రకృతే చేస్తుంది.  జీవనదులన్నింటికీ ప్రతి సంవత్సరం కచ్చితంగా వరదలు వస్తాయి. అంతవరకు ఆ నదుల్లో పేరుకుని పోయి  ఉన్న చెత్తా చెదారం, కాలు ష్యం సముద్రంలోకి వెళ్లిపోతుంది. ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ గ్రామీణ ప్రాంతాలకు తాగు, సాగు నీరందిస్తున్న కాలువల ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి. దేశంలోని కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండి పోవటమే కాకుండా, తూడు, గుర్రపు డెక్కతో పూర్తిగా మూసుకుపోయాయి. అలాగే దారుణంగా ఆక్రమణలకు గురై కనీసం నీరు రావటం లేదు. వెళ్లటం లేదు. కాలువలలో పూడిక తీయకపోవడం వల్ల వ్యవసాయానికి ఎంత నష్టం జరుగుతున్నదో కూడా ఆలోచించాలి. కాలువలతో పాటు పంట కాలువల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించడం అవసరం. గోదావరి జిల్లాలలో కాలువల మరమ్మతులు సక్రమంగా చేపట్టే ప్రక్రియ చాలా కాలం నుంచి ఆగి పోయింది. దీని వల్ల సేద్యంతో పాటు, చౌకగా సాగే రవాణా కూడా కుంటుపడుతోంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి.  ముందుగా కాలువల ప్రక్షాళన చేపట్టండి!
 విశ్వతేజ  చంద్రవరం, ప.గో.జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement