కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు | Viswabrahmin caste occupations disappearing | Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు

Published Tue, Jan 6 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు

కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు

 ఇన్ బాక్స్
 భారతీయ ఖ్యాతిని ఖండాంతరం చేసిన విశ్వబ్రా హ్మణుల వృత్తులు ‘చితి’కిపోతున్నాయి. ఇప్పటికే అనేక చేతివృత్తులు మూగబోతుండగా పారంపర్యం గా వస్తున్న కులవృత్తిని కాదని కూలీలుగా మారుతు న్నారు. మరెందరో చేయి తిరిగిన కళాకారులు ఆత్మా భిమానాన్ని చంపుకోలేక, పని లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ సంతతీయులు. ఒకప్పుడు అద్భుత నైపుణ్యంతో శిల్పకళల నిర్వహణలో సుప్రసిద్ధులైన వీరి ప్రతిభ గుండుసూది నుంచి ఇనుపగోడల వరకు, గుడిసెలో వాసము నుంచి సోమనాథ సుందర దేవాలయ ద్వారాల వరకు, రాళ్లు పగులకొట్టడం నుంచి అజం తా, ఎల్లోరా, కోణార్క, ఖజురహో, నాగార్జునకొం డ, అమరావతి, హంపి, లేపాక్షి, రామప్ప దేవాల యం వరకు పలు చిత్రశిల్ప కళాక్షేత్రాల్లో విరాజిల్లు తోంది. నేటికీ తుప్పుపట్టని అశోక స్తంభం మన కమ్మరుల నైపుణ్యానికి నిదర్శనం. క్రీస్తుపూ ర్వమే మన మేటుపల్లి రేవులో అందమైన ఓడలను తయా రుచేసింది మన వడ్రంగుల కౌశలమే. ప్రపంచం లోనే అత్యున్నత ప్రమాణాలతో నాణేలు ముద్రిం చిన టంకశాల.. రోమన్ సామ్రాజ్య వాణిజ్యానికి మన సింహద్వారంలా నిలిచింది. దేదీప్య మానంగా శోభించిన మన పంచ వృత్తుల తేజో వైభవం నేడు పూర్తిగా కొడిగట్టి మసిబారిపోతోంది.

గ్రామీ ణుల ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభా లనదగిన చేతివృత్తులు ఆకలితో అలమటి స్తున్న నిర్భా గ్యులకు, వారి ఆత్మహత్యలకు నిలయమ య్యాయి. సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యం లో ఏర్పడే పోటీకి తట్టుకోలేక జీవనభృతిని కోల్పో తున్న చేతివృత్తుల వారి సమస్యలకు ప్రభుత్వం పరి ష్కారం చూపకపోవడంతో గ్రామీణ భారతం నిస్తేజ మైపోయింది. ఇటీవలి వరకు గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్నాలి. నాగలికర్రు సరిచేసి పెడతావా అనే పలకరింపులు వినిపించేవి. కానీ పల్లెను చుట్టుము డుతున్న యాంత్రికీకరణ చేతివృత్తుల అవసరాన్ని దూరంగా విసిరిపారేసింది.

 శ్రామిక విశ్వబ్రాహ్మణ సమాజంలో ప్రధానం గా ఐదు చేతివృత్తులు ఉంటున్నాయి. అవి కమ్మరం, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తి. వీటిలో కమ్మరులు మను బ్రహ్మలు (కొలిమి ఉత్పత్తులు), వడ్రంగులు మయబ్రహ్మలు (గృహ, వ్యవసాయ వినియోగవస్తు ఉత్పత్తులు), కంచరిలు తృష్ణ బ్రహ్మలు (వంటపాత్రలు, దేవతా విగ్రహా లు), శిల్పులు శిల్పిబ్రహ్మలు (శిలాశిల్పాలు, దేవాలయ కట్టడాలు), స్వర్ణకారులు విశ్వజ్ఞ బ్రాహ్మణులు (బంగారు, వెండి మజూరీ పని). నేడు దేశంలో అంతరించిపోతున్నాయి. వెను కబడిన కులాలలో యాదవులు, గౌడులు, పద్మశా లీల తర్వాత విశ్వబ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ 1980లో నాటి సీఎం అంజయ్య, 2009 మార్చిలో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో వీరికి కాస్త మేలు చేకూరింది కానీ తతిమ్మా కాలాల్లో ఏ పాలకుడూ వీరి గోడును, వ్యధను పట్టించుకున్న పాపానపోలేదు.

 విశ్వబ్రాహ్మణులలోని ఈ అయిదు వృత్తుల వా రిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కారణం.. వీరిలో ఐకమత్యం లేదు. వీరు ఓటు బ్యాంకుగా లేరు. ఏ కులంలోనూ లేనన్ని సంఘాలు, సంస్థలు, పీఠాలు, పరిషత్తులుగా చీలిపోవడంతో చట్టసభల్లో, రాజకీయాల్లో, ఆర్థికంగా వీరు అట్టడుగునే ఉండిపో యారు. పురాతన కాలం నుండి నేటివరకు మన దేశ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మూలాధారంగా ఉన్న విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సుఖమయ జీవనానికి ప్రభుత్వాలు తగిన విధానం ప్రకటించాలి. మన రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి వీటిపై కోటి ఆశలు పెట్టుకుని ఉన్నాం. విశ్వబ్రాహ్మ ణులు పూర్వవైభవం సాధించేందుకోసం ప్రభుత్వా లు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటం, కుల వృత్తులను ఆధునీకరించడంతో సహా అన్ని రకాల సంక్షేమ చర్యలు చేపట్టాలి.
 కట్టా సత్యనారాయణాచారి,  అడ్వకేట్,
 ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ స్వర్ణకార సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement