Caste occupations
-
కులవృత్తులకు పూర్వ వైభవం
మణికొండ: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుల వృత్తులకు పూర్వ వైభవం వస్తోందని, అందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరశివారు కోకాపేటలో గౌడ్లకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం వైన్స్‌ల కేటాయింపులో గౌడ్లకు 15శాతం రిజర్వేషన్ కల్పిస్తోందని, నీరా పాలసీతో వేలాది మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఎప్పటినుంచో ఉన్న కల్లు దుఖాణాలను తాడి బార్లుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నామని, నీరా కేఫ్‌లను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.30 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటామని, కల్లు అంటే ఉన్న చులకన భావం పోగొట్టి, కల్లు దుఖాణాల రూపురేఖలను మార్చితే మరింత మందికి ఉపాధి కలుగుతుందన్నారు. గౌడ్ల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ పథకాలను తేవాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, వారంతా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, కల్లుగీత సహకార సంఘం చైర్మన్ పల్లె రవికుమార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజయ్యగౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బి.భిక్షమయ్య, సత్యనారాయణ, గౌడ సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, వనజ ఆంజనేయులుగౌడ్, పెద్ద ఎత్తున గౌడ కులçస్తులు పాల్గొన్నారు. -
కుల వృత్తులకు కేసీఆర్ అండ
కొడంగల్: గొల్లకురుమల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బొంరాస్‌పేట మండలం ఎనికెపల్లికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెలు ఇస్తున్నట్లు చెప్పారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నట్లు తెలిపారు. యూనిట్‌ను ధరను రూ. లక్షా 75వేలకు పెంచినట్లు చెప్పారు. ఇందులో లక్షా 31వేల 250 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు తమ వాటా కింద రూ.43,750 చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధు యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్‌బాబు, గొల్ల కురుమ సంఘం నాయకులు, పశువైద్యాధికారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం పట్టణంలోని మున్సిపల్ పార్క్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత్సోవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు మధుసూదన్‌రావ్ యాదవ్, రమేష్, మాజీ సర్పంచ్ రమేష్‌బాబు, మహిళా సమాఖ్య సభ్యులు ఆనందమ్మ, అన్నపూర్ణ, మున్సిపల్ సిబ్బంది క్రాంతి, భరత్ పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలి దౌల్తాబాద్: హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమెల్యే నరేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో హరితోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై మొక్కలను నటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్. వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ తిరుమల స్వామి, ఏపీఓ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. -
Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
సాక్షి, హైదరాబాద్: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు. బీసీల్లోని ఎన్ని వర్గాలకు? వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ఇవీ అర్హతా నిబంధనలు ►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. ►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు. -
కులవృత్తుల్లో ఆర్టీసీ సిబ్బంది
ఆర్టీసీ సిబ్బందికొన్ని రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఓవైపు నిరసనల్లో పాల్గొంటూనే కుటుంబ పోషణకు కుల వృత్తిని ఎంచుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ యాజమాన్యం జీతాలు నిలిపివేయడంతో ఆర్థిక ఇబ్బందులుపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఇలా పనులకు వెళ్తున్నారు. ఇస్త్రీ పనిలో డ్రైవర్ తిమ్మాపూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన రాందండ రాజమల్లయ్య కరీంనగర్– 1డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా వేతనాలు లేకపోవడం, కుటుంబపోషణ భారంగా మారడంతో లాండ్రీషాపు పెట్టుకుని బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని వాపోయాడు. ఇన్సూరెన్స్, ఈఎంఐ వాయిదాలు కూడా నిలిపేశామన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికులు సమ్మె విరమించేలా చూడాలని కోరారు. ఆర్టిస్ట్‌గా కండక్టర్ శంకరపట్నం (మానకొండూర్): హుజురాబాద్ ఆర్డీసీ డిపోలో కండక్డర్గా పని చేస్తున్న శ్రీనివాస్ గురువారం కేశవపట్నం పంచాయతీ బోర్డుపై రంగులు వేశారు. కుటుంబపోషణకు ఆర్టిస్ట్‌గా మారాడు. గతంలో గోడలపై రాతలు రాసిన అనుభవం ఉండడంతో కష్టకాలంలో ఉపాధి పొందుతున్నాడు. వచ్చిన డబ్బుతో బియ్యం, నిత్యవసర సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. వ్యవసాయ పనుల్లో కండక్టర్ గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన కండక్టర్ మడుపు మల్లారెడ్డి కొద్దిరోజులుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. కౌలుకు ఇచ్చిన వ్యవసాయ భూమిలో వరి కోయించి, ఎండకు ఆరబోస్తూ, సాయంత్రం కుప్ప పోస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వేడుకుంటున్నాడు. కూలీగా కోచ్ బిల్డర్ కరీంనగర్‌కు చెందిన కనుకుంట్ల కరుణాకర్ ఆర్టీసీ డిపోలో కోచ్బిల్డర్గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా జీతంరాక కరీంనగర్‌లోని రేకుర్తిలో బిల్డింగ్ కూలీ పనికి వెళ్లాడు. రోజుకు నాలుగు వందల రూపాయలు వస్తున్నాయని దీంతో కుటుంబ పోషణకోసం అవసరానికి ఉపయోగపడుతున్నాయని కరుణాకర్ తెలిపారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
మట్టికి జైకొట్టి..
ఓల్డు మళ్లా గోల్డు అయింది.. మట్టి పాత్రల వినియోగం జనంలో మళ్లీ పెరిగింది.. దీంతో కుమ్మరి కొలిమిలు కళకళలాడుతున్నాయి.. అటు ప్రభుత్వమూ మట్టిపాత్రల వాడకం, కులవృత్తులకు ప్రోత్సాహాన్నిస్తుండటంతో మార్కెట్లో మట్టి పాత్రలు సందడి చేస్తున్నాయి. మట్టి పాత్రల్లో వండిన ఆహారం..పోషక విలువల గురించి ఈమధ్య అవగాహన పెరిగింది. దీంతో జనం వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకువస్తున్నారు. జిల్లాకు 30 మంది చొప్పున.. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌లోని రామానంద తీర్థ చేతి వృత్తుల సంస్థలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల మంది కుమ్మరులకు శిక్షణ అందించారు. మెషీన్ ద్వారా మట్టి పాత్రల తయారీపై శిక్షణ పొందినవారు జనం అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పాత్రలను తయారు చేస్తున్నారు. వారికి కావాల్సిన డిజైన్లలో రూపొందించి.. మార్కెటింగ్ చేస్తున్నారు. సురాయిలు, రంజన్లు, కుండలు, గ్లాసులు, వాటర్‌బాటిళ్లు, దీపపు ప్రమిదలు, బిర్యానీ పాత్రల వంటివి వేలాది ఆకృతుల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వీటి ధర సైజు, నాణ్యతను బట్టి రూ.20 మొదలుకుని రూ.1,000 వరకు ఉంటున్నాయి. దేశీయ సంప్రదాయ పాత్రలు కావడంతో జనం కూడా వీటి వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ తరహా శిక్షణ కోసం గతంలో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మెషీన్ల ద్వారా మట్టి పాత్రలు తయారు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాయితీ కల్పిస్తున్నాం.. చేతి వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లాలలో స్టాల్స్‌తో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అటు ఉపాధినీ కల్పిస్తున్నాం. పర్యావరణానికి మేలు చేసే మట్టి పాత్రల తయారీలో ప్రభుత్వం తరఫున శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షల విలువైన తయారీ, అమ్మకాల యూనిట్‌ను రాయితీతో ఇస్తున్నాం.. అలోక్ కుమార్, బీసీ సహకార ఆర్థిక సంస్థ, కార్యనిర్వాహక డైరెక్టర్ మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి వృత్తి శిక్షణ పొందిన వారు ఉపాధి దిశగా ముందుకు సాగడానికి ప్రభుత్వం వాటికి మార్కెటింగ్తోపాటు పట్టణ ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. కోల్‌కతా, గుజరాత్ నుంచి వచ్చే మట్టి పాత్రల రేటు ఎక్కువగా ఉంటోంది. వాటి తయారీలో కొంత మేరకు రసాయనాలు వాడతారు. వీటి ద్వారా వాటి ఫినిషింగ్‌లో తేడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ తయారు చేసే మట్టి పాత్రలు సహజసిద్ధమైన మట్టితో తయారవుతాయి. నడికుడి జయంత్‌రావు రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ అధ్యక్షుడు -
కుల వృత్తులకు కళ తెచ్చేందుకు..
సాక్షి, హైదరాబాద్: మట్టి పాత్రలు, వెదురు వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో వాటిని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుల వృత్తులకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు ఇప్పటికే అడుగులేస్తున్న సర్కారు.. మట్టి, వెదురు ఉత్పత్తులకు సాంకేతికతను జోడించి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయాలని భావిస్తోంది. కాస్త పెట్టుబడి పెడితే అధిక సంఖ్యలో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకుగాను దరఖాస్తులు స్వీకరిస్తోంది. రూ.100 కోట్ల నిధి మట్టి, వెదురుతో తయారు చేసే వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గృహోపకరణాల్లో వాడటంతో పాటు కార్పొరేట్ సంస్థలూ వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పోల్చితే వీటి ధరలు తక్కువగా ఉండటమూ మరో కారణం. పొరుగు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయి. మట్టి పాత్రల తయారీలో గుజరాత్.. వెదురు ఉత్పత్తుల్లో త్రిపుర ప్రథమ స్థానంలో ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అధికారుల బృందం ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి వస్తువుల తయారీ పరిశ్రమలను పరిశీలించింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తుండటాన్ని గమనించింది. దీంతో ఈ పరిశ్రమలపై రూ.100 కోట్లు ఖర్చు చేయాలని ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.లక్షతో యూనిట్ మట్టి పాత్రల తయారీ యూనిట్‌ను రూ.లక్షతోనే ఏర్పాటు చేయొచ్చు. ముడి ‘క్లే’మిక్స్ చేసేందుకు, వస్తురూపంలో మార్చేందుకు ఉపయోగించే రెండు మెషీన్లను రూ.లక్షలోపు ఖరీదుతోనే కొనుగోలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో మట్టి కలపడం, తయారీకి ఎక్కువ శ్రమ పడుతుండటంతో కార్మికులు త్వరగా అలసిపోతున్నారు. ఈ అధునాతన యంత్రాలతో శ్రమ తగ్గుతుంది. కుర్చీలో కూర్చొని పనిచేసే వీలుంటుంది. మట్టితో నమూనాలు చేసిన తర్వాత ఫినిషింగ్ ఇచ్చేందుకు సహజసిద్ధ రంగులు వాడుతారు. దీంతో పాత్రలు సరికొత్త అందాలతో కనిపిస్తాయి. ఇక వెదురు పరిశ్రమల ఏర్పాటులో ఎక్కువ యంత్రాలు అవసరమవుతాయి. సగటున రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మంది కలసి సొసైటీగా ఏర్పాటై యూనిట్ స్థాపించవచ్చు. యూనిట్లో సగటున 100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా వెదురు క్లీనింగ్ అండ్ కట్టింగ్, సన్నని పుల్లల్లా కటింగ్ చేసే యంత్రం, అతికించి చెక్కలుగా ప్రెస్ చేసే యంత్రాలుంటాయి. అలా వుడ్ రూపంలోకి వచ్చిన సరుకును ఫర్నిచర్‌గా తయారు చేయొచ్చు. జిల్లా, తాలూకా కేంద్రాల్లో.. ‘మట్టి, వెదురు పరిశ్రమలను జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే సత్ఫలితాలుంటాయి. ఔత్సాహికులు వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మందితో సొసైటీ రూపంలో ఏర్పాటవ్వాలి. దీంతో పరిశ్రమలకు స్థలం కేటాయించడమో.. లీజుకివ్వడమో జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దొరికే బంకమట్టిని పరీక్షలకు పంపించనున్నాం. పాత్రల తయారీకి ఏ మేరకు సహకరిస్తుందో, లేదంటే మరిన్ని మిశ్రమాలేమైనా కలపాలో పరీక్షలో తెలుస్తుంది. వెదురు సాగుకు ఏటా సగటున 1,500 ఎంఎం వర్షపాతం కావాలి. కానీ రాష్ట్ర సగటు 800 ఎంఎం. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో 1,100 పైగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నీటి వనరులు అందించడంపై పరిశీలన చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో కార్యాచరణ పూర్తవుతుంది. ఈ పరిశ్రమలతో 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తర్వాత యూనిట్ మంజూరు చేస్తాం’ అని జోగు రామన్న తెలిపారు. -
కుల వృత్తులకు నేరుగా రుణం
సాక్షి, హైదరాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచే నేరుగా లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది. 80 శాతం సబ్సిడీపై ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు తగినన్ని నిధులు కేటాయించాలని భావిస్తోంది. వచ్చే బడ్జెట్లో ఈ రెండు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తోంది. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసినప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) రూ.వెయ్యి కోట్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. కానీ బీసీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికల పేరుతో జాప్యం జరగడంతో ఆ నిధులు ఖర్చు కాలేదు. ఎంబీసీ కులాలపై కొరవడిన స్పష్టత మరోవైపు ఎంబీసీ కులాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏయే కులాలను ఎంబీసీల జాబితాలో చేర్చనున్నారో వెల్లడించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా, వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని సీఎం సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈసారి బడ్జెట్లో ఎంబీసీల జాబితా, వారి సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసి చూపింది. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తికి వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని ఇప్పటికే నిర్ణయించింది. సంబంధిత కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు కూడా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ప్రధానంగా స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రాయితీతో కూడిన రుణాలను ఇవ్వాలని యోచిస్తోంది. రూ.లక్ష లోపు రుణాలను 80 శాతం రాయితీతో అందించేందుకు ప్రాధాన్యమివ్వనుంది. వీలైతే బడ్జెట్‌కు ముందుగానే ఈ పథకాలను పట్టాలెక్కించాలని సీఎం భావిస్తున్నారు. సంచార జాతు లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వకర్మలు.. ఇలా ఆయా వర్గాల ప్రతినిధులతో విడివిడిగా ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమావేశమవుతారు. ఆయా వర్గాల కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు లబ్ధిదారులకు రుణాల చెక్కులను కూడా అక్కడే మంజూరు చేయాలని భావిస్తున్నారు. సీఎం వద్ద నివేదికలు బీసీల సంక్షేమంపై ఎమ్మెల్సీ గంగాధర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ ఒక నివేదికను సిద్ధం చేయగా, బీసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్చలు జరగ్గా, అదే వరుసలో బీసీ ప్రజాప్రతినిధులు తమ సిఫారసులతో నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలన్నీ ఇటీవల సీఎం కేసీఆర్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలన్న డిమాండ్ వ్యక్తమైనప్పటికీ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులే లేనందున ఉప ప్రణాళికకు అవకాశం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు తేల్చేశాయి. ఎస్సీ, ఎస్టీలకు మాదిరే ప్రత్యేక అభివృద్ధి నిధిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. బడ్జెట్లో బీసీలకు భారీ వాటా కేటాయించే దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?
కేసీఆర్ ఇంటి ఇల్లాలితో సహా అధికారం కావాలి ⇒ మాయ మాటలతో మభ్యపెడుతున్నారు: సంపత్‌కుమార్ ⇒ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారపక్షం ⇒ వృత్తిని నమ్ముకున్న వాళ్లకే నిధులన్న మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘గొల్లోడు గొర్రెలు కాయా లి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. మా (కేసీఆర్) ఇంటి ఇల్లాలి తో సహా అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు’’అని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దీంతో శుక్ర వారం శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. సంక్షే మ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడారు. కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు. ‘తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. మా ఆక్రందన, ఆర్తనాదాలు, కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. దళితుడిని సీఎం చేస్తానన్న గొప్ప మ నిషిని చూడలేదని సంబర పడ్డాం. కానీ మోసగిం చడంతో ఓర్చుకోవడం అలవాటైంది. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్ సభలో పేర్కొన్నారు. ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. మాయమాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?’ అని నిలదీశారు. టీఎస్ఐపాస్, టీప్రై డ్ అంటూ కేటీఆర్ పదేపదే చెప్పే మాటలతో చెవులు గిల్లుమంటున్నాయని వ్యాఖ్యానించా రు. గిరిజన, ఆదివాసీ, అంబేడ్కర్, పూలే భవ నాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రుణమాఫీకి ఎస్సీ,ఎస్టీ నిధుల మళ్లింపు ‘రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచే మళ్లించారు. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 26 శాతం ఉన్నా.. వారందరికీ భూములు లేవు. అందరూ రుణాలు తీసుకోలేదు..’’అని సంపత్ స్పష్టం చేశారు. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. సంపత్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల బదులిచ్చారు. దేశమంతటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు ఇలానే ఉందని, సబ్‌ప్లాన్ నిధులను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఖర్చు చేయడం సాంప్రదాయమని చెప్పారు. 30 లక్షల మంది ఎస్సీలకు ఒకేసారి భూములిస్తామని తాము ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని పేర్కొన్నారు. కుల వృత్తులకు నిధుల కేటాయింపుపై వివరణ ఇస్తూ.. గొప్పగా చదువుకున్నవాళ్లకు, వ్యాపారాలున్న వాళ్లకు నిధులివ్వబోమని.. వృత్తిని నమ్ముకుని బతికేవాళ్లకే ఇస్తామని ఈటల చెప్పారు. కుల వృత్తుల వారిని తక్కువ చేసి చూడవద్దని, మాట్లాడవద్దని సూచించారు. కొత్త సభ్యుడైన సంపత్‌కు అనుభవం, సంయమనం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా సంపత్ మాటల నుంచి సారాన్ని తీసుకుని సమాధానం ఇవ్వాలని విపక్షనేత కె.జానారెడ్డి సర్దిచెప్పారు. గృహ నిర్మాణం అస్తవ్యస్తం రాష్ట్రంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని, పూర్తిగా ఎత్తేసినట్లు కనిపిస్తోందని సంపత్‌కుమార్ వ్యాఖ్యానించారు. విచారణ పేరిట 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, ఐడీహెచ్ కాలనీల్లో కట్టిన 1,400 డబుల్ ఇళ్లను ప్రభుత్వం గొప్పగా చూపించుకుంటోందని.. డబుల్ ఇళ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రమే చేపట్టారని విమర్శించారు. -
అన్నివర్గాల వారిని ఆదుకుంటుంది
► మున్సిపల్‌చైర్మన్ గణేశ్‌చక్రవర్తి ► రజకసంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పాలాభిషేకం నిర్మల్‌రూరల్: తెలంగాణలోని అన్ని కులవృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుందని మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అన్నారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ ఆఫీసు ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజకసంఘం ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా చాకలి ఐలమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత వర్ణాల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. రజకులకు న్యాయం చేసేలా బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. అన్ని కులవృత్తుల వారికి, బీసీలకు సంపూర్ణ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపతిరెడ్డి, నేల్ల అరుణ్‌కుమార్, నాయకులు అప్పాల వంశీకృష్ణ, తారక రఘువీర్, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు అంబకంటి ముత్తన్న, రజకసంఘం నాయకులు కందుకూరి భోజన్న, చందుల ఊశన్న, శంకర్, చందుల శంకర్, రాజన్న, ఎం.శంకర్, కందుకూరి నారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
కనుమరుగవుతున్న విశ్వబ్రాహ్మణ కులవృత్తులు
ఇన్ బాక్స్ భారతీయ ఖ్యాతిని ఖండాంతరం చేసిన విశ్వబ్రా హ్మణుల వృత్తులు ‘చితి’కిపోతున్నాయి. ఇప్పటికే అనేక చేతివృత్తులు మూగబోతుండగా పారంపర్యం గా వస్తున్న కులవృత్తిని కాదని కూలీలుగా మారుతు న్నారు. మరెందరో చేయి తిరిగిన కళాకారులు ఆత్మా భిమానాన్ని చంపుకోలేక, పని లేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ సంతతీయులు. ఒకప్పుడు అద్భుత నైపుణ్యంతో శిల్పకళల నిర్వహణలో సుప్రసిద్ధులైన వీరి ప్రతిభ గుండుసూది నుంచి ఇనుపగోడల వరకు, గుడిసెలో వాసము నుంచి సోమనాథ సుందర దేవాలయ ద్వారాల వరకు, రాళ్లు పగులకొట్టడం నుంచి అజం తా, ఎల్లోరా, కోణార్క, ఖజురహో, నాగార్జునకొం డ, అమరావతి, హంపి, లేపాక్షి, రామప్ప దేవాల యం వరకు పలు చిత్రశిల్ప కళాక్షేత్రాల్లో విరాజిల్లు తోంది. నేటికీ తుప్పుపట్టని అశోక స్తంభం మన కమ్మరుల నైపుణ్యానికి నిదర్శనం. క్రీస్తుపూ ర్వమే మన మేటుపల్లి రేవులో అందమైన ఓడలను తయా రుచేసింది మన వడ్రంగుల కౌశలమే. ప్రపంచం లోనే అత్యున్నత ప్రమాణాలతో నాణేలు ముద్రిం చిన టంకశాల.. రోమన్ సామ్రాజ్య వాణిజ్యానికి మన సింహద్వారంలా నిలిచింది. దేదీప్య మానంగా శోభించిన మన పంచ వృత్తుల తేజో వైభవం నేడు పూర్తిగా కొడిగట్టి మసిబారిపోతోంది. గ్రామీ ణుల ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభా లనదగిన చేతివృత్తులు ఆకలితో అలమటి స్తున్న నిర్భా గ్యులకు, వారి ఆత్మహత్యలకు నిలయమ య్యాయి. సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యం లో ఏర్పడే పోటీకి తట్టుకోలేక జీవనభృతిని కోల్పో తున్న చేతివృత్తుల వారి సమస్యలకు ప్రభుత్వం పరి ష్కారం చూపకపోవడంతో గ్రామీణ భారతం నిస్తేజ మైపోయింది. ఇటీవలి వరకు గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్నాలి. నాగలికర్రు సరిచేసి పెడతావా అనే పలకరింపులు వినిపించేవి. కానీ పల్లెను చుట్టుము డుతున్న యాంత్రికీకరణ చేతివృత్తుల అవసరాన్ని దూరంగా విసిరిపారేసింది. శ్రామిక విశ్వబ్రాహ్మణ సమాజంలో ప్రధానం గా ఐదు చేతివృత్తులు ఉంటున్నాయి. అవి కమ్మరం, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తి. వీటిలో కమ్మరులు మను బ్రహ్మలు (కొలిమి ఉత్పత్తులు), వడ్రంగులు మయబ్రహ్మలు (గృహ, వ్యవసాయ వినియోగవస్తు ఉత్పత్తులు), కంచరిలు తృష్ణ బ్రహ్మలు (వంటపాత్రలు, దేవతా విగ్రహా లు), శిల్పులు శిల్పిబ్రహ్మలు (శిలాశిల్పాలు, దేవాలయ కట్టడాలు), స్వర్ణకారులు విశ్వజ్ఞ బ్రాహ్మణులు (బంగారు, వెండి మజూరీ పని). నేడు దేశంలో అంతరించిపోతున్నాయి. వెను కబడిన కులాలలో యాదవులు, గౌడులు, పద్మశా లీల తర్వాత విశ్వబ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ 1980లో నాటి సీఎం అంజయ్య, 2009 మార్చిలో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం లో వీరికి కాస్త మేలు చేకూరింది కానీ తతిమ్మా కాలాల్లో ఏ పాలకుడూ వీరి గోడును, వ్యధను పట్టించుకున్న పాపానపోలేదు. విశ్వబ్రాహ్మణులలోని ఈ అయిదు వృత్తుల వా రిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కారణం.. వీరిలో ఐకమత్యం లేదు. వీరు ఓటు బ్యాంకుగా లేరు. ఏ కులంలోనూ లేనన్ని సంఘాలు, సంస్థలు, పీఠాలు, పరిషత్తులుగా చీలిపోవడంతో చట్టసభల్లో, రాజకీయాల్లో, ఆర్థికంగా వీరు అట్టడుగునే ఉండిపో యారు. పురాతన కాలం నుండి నేటివరకు మన దేశ పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి మూలాధారంగా ఉన్న విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సుఖమయ జీవనానికి ప్రభుత్వాలు తగిన విధానం ప్రకటించాలి. మన రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి వీటిపై కోటి ఆశలు పెట్టుకుని ఉన్నాం. విశ్వబ్రాహ్మ ణులు పూర్వవైభవం సాధించేందుకోసం ప్రభుత్వా లు వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటం, కుల వృత్తులను ఆధునీకరించడంతో సహా అన్ని రకాల సంక్షేమ చర్యలు చేపట్టాలి. కట్టా సత్యనారాయణాచారి, అడ్వకేట్, ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ స్వర్ణకార సంఘం -
'అవమానాలు పడ్డ చోటే.. లక్ష కోట్ల బడ్జెట్'
బడ్జెట్‌పై అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాసగౌడ్ లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టుకోవడం, ఏ అసెంబ్లీలో అవమానపడ్డారో అక్కడే కేటాయించుకోవడం పట్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఉద్యమ నేతగా 14 ఏళ్లు పాటుపడిన సంపూర్ణ అవగాహనతో సీఎంగా కేసీఆర్ 43 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు చేశారు. మన వూరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే వంటి ఉపయోగపడే చర్యలు తీసుకున్నారు. 90 శాతం కులవృత్తులు చెరువులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నందున చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సీఎం చర్య తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రీమియం లేకుండా హెల్త్‌కార్డులు, పీఆర్సీ ఉద్యోగులంతా సంతోషపడేలా ఉంటుంది. అయితే తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌పై, కేంద్ర ప్రభుత్వంపై పోట్లాడి సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కలసి రావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఎందుకు రావడం లేదని పార్టీలకతీతంగా ప్రశ్నించాలి. రూ. వంద కోట్ల విలువైన విద్యుత్‌ను రాకుండా అటువైపు వారు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించేలా కొందరు మాట్లాడుతున్నారు. కేవలం విద్యుత్‌కే కాకుండా నీళ్లు, బొగ్గు వంటి వాటిలో తెలంగాణకు కూడా తగిన వాటా రావాలి.