► మున్సిపల్‌చైర్మన్ గణేశ్‌చక్రవర్తి
► రజకసంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పాలాభిషేకం
నిర్మల్‌రూరల్: తెలంగాణలోని అన్ని కులవృత్తులను ప్రభుత్వం ఆదుకుంటుందని మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి అన్నారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ ఆఫీసు ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజకసంఘం ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా చాకలి ఐలమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత వర్ణాల సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు.
రజకులకు న్యాయం చేసేలా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. అన్ని కులవృత్తుల వారికి, బీసీలకు సంపూర్ణ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపతిరెడ్డి, నేల్ల అరుణ్‌కుమార్, నాయకులు అప్పాల వంశీకృష్ణ, తారక రఘువీర్, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు అంబకంటి ముత్తన్న, రజకసంఘం నాయకులు కందుకూరి భోజన్న, చందుల ఊశన్న, శంకర్, చందుల శంకర్, రాజన్న, ఎం.శంకర్, కందుకూరి నారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.