గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా? | Congress leader Sampath kumar fires on Kcr government | Sakshi
Sakshi News home page

గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?

Published Sat, Mar 25 2017 3:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా? - Sakshi

గొల్లోడు గొర్లే కాయాలి..చాకలోడు బట్టలే ఉతకాలా?

కేసీఆర్‌ ఇంటి ఇల్లాలితో సహా అధికారం కావాలి
మాయ మాటలతో మభ్యపెడుతున్నారు: సంపత్‌కుమార్‌
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారపక్షం
వృత్తిని నమ్ముకున్న వాళ్లకే నిధులన్న మంత్రి ఈటల


సాక్షి, హైదరాబాద్‌: ‘గొల్లోడు గొర్రెలు కాయా లి.. చాకలోడు బట్టలు ఉతకాలి. మంగలోడు గుండ్లు కొట్టాలి.. మా (కేసీఆర్‌) ఇంటి ఇల్లాలి తో సహా అధికారం కావాలి. ప్రతిపక్షాలకు మాత్రం బిస్కెట్లు వేస్తారు’’అని కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దీంతో శుక్ర వారం శాసనసభ ఒక్కసారిగా వేడెక్కింది. సంక్షే మ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా సంపత్‌ కుమార్‌ మాట్లాడారు.

కులవృత్తులను ప్రోత్స హించేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరపడం వెనక ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నిం చారు. ‘తెలంగాణ జనాభాలో 80 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. మా ఆక్రందన, ఆర్తనాదాలు, కడుపు మంటను ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. దళితుడిని సీఎం చేస్తానన్న గొప్ప మ నిషిని చూడలేదని సంబర పడ్డాం. కానీ మోసగిం చడంతో ఓర్చుకోవడం అలవాటైంది. దళిత పారిశ్రామికవేత్తలకు రూ.400 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌ సభలో పేర్కొన్నారు. ఒక్క రూపాయీ ఇవ్వ లేదు. మాయమాటలతో ఎన్నిసార్లు మోసం చేస్తారు?’ అని నిలదీశారు. టీఎస్‌ఐపాస్, టీప్రై డ్‌ అంటూ కేటీఆర్‌ పదేపదే చెప్పే మాటలతో చెవులు గిల్లుమంటున్నాయని వ్యాఖ్యానించా రు. గిరిజన, ఆదివాసీ, అంబేడ్కర్, పూలే భవ నాలకు శిలాఫలకాలు వేసి మరిచిపోయారని, ఆ స్థలాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు.

రుణమాఫీకి ఎస్సీ,ఎస్టీ నిధుల మళ్లింపు
‘రుణమాఫీ కింద చెల్లించిన సొమ్ములో 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచే మళ్లించారు. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 26 శాతం ఉన్నా.. వారందరికీ భూములు లేవు. అందరూ రుణాలు తీసుకోలేదు..’’అని సంపత్‌ స్పష్టం చేశారు. 30 లక్షల మంది భూమి లేని ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూములు పంపిణీ చేస్తామని చెప్పి కేవలం 3,671 మందికి 9,663 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. సంపత్‌ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల బదులిచ్చారు. దేశమంతటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు ఇలానే ఉందని, సబ్‌ప్లాన్‌ నిధులను ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఖర్చు చేయడం సాంప్రదాయమని చెప్పారు.

30 లక్షల మంది ఎస్సీలకు ఒకేసారి భూములిస్తామని తాము ఎక్కడా హామీ ఇవ్వలేదన్నారు. అది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియని పేర్కొన్నారు. కుల వృత్తులకు నిధుల కేటాయింపుపై వివరణ ఇస్తూ.. గొప్పగా చదువుకున్నవాళ్లకు, వ్యాపారాలున్న వాళ్లకు నిధులివ్వబోమని.. వృత్తిని నమ్ముకుని బతికేవాళ్లకే ఇస్తామని ఈటల చెప్పారు. కుల వృత్తుల వారిని తక్కువ చేసి చూడవద్దని, మాట్లాడవద్దని సూచించారు. కొత్త సభ్యుడైన సంపత్‌కు అనుభవం, సంయమనం లేదని.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌ల నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా సంపత్‌ మాటల నుంచి సారాన్ని తీసుకుని సమాధానం ఇవ్వాలని విపక్షనేత కె.జానారెడ్డి సర్దిచెప్పారు.

గృహ నిర్మాణం అస్తవ్యస్తం
రాష్ట్రంలో గృహ నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని, పూర్తిగా ఎత్తేసినట్లు కనిపిస్తోందని సంపత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. విచారణ పేరిట 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట, ఐడీహెచ్‌ కాలనీల్లో కట్టిన 1,400 డబుల్‌ ఇళ్లను ప్రభుత్వం గొప్పగా చూపించుకుంటోందని.. డబుల్‌ ఇళ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో 16 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మాత్రమే చేపట్టారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement