sampath kumar
-
నైపుణ్యాభివృద్ధి ఫలించేందుకు సవాళ్లెన్నో...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఒక విప్లవాత్మకమైన యోజనను ప్రకటించింది. రాష్ట్రంలోని ఐటీఐల (పారిశ్రామిక శిక్షణ సంస్థలు)ను క్రమేణా అధునాతన సాంకేతిక కేంద్రాలు (అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ – ఏటీసీలు)గా రూపాంతరం చేస్తూ మార్కెట్ అవసరాలకి మానవవనరులని తయారుచేస్తామని వెల్లడించింది.ఈ రంగంలో పనిచేసేవారికి ఇదొక తియ్యని వార్త. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. పారిశ్రామిక రంగానికి ఉన్నత స్థాయి ప్రమాణాలతో మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్న ఆశ ముఖ్యమంత్రి ప్రసంగం విన్నవారికి కలుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరాల్లో బంగారు తెలంగాణ ఆవిష్కృతమౌతుంది!సాంకేతిక రంగంలో నైపుణ్యాభివృద్ధి అనేది కొత్త అంశమేమీ కాదు. మన దేశంలో ఐటీఐలు, పాలిటెక్నిక్లూ దశాబ్దాల నుండి పనిచేశాయి, చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు, 255 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణనిస్తున్నాయి. ప్రకటించిన యోజన ప్రకారంగా 65 ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలు మార్చుతూ వచ్చే పదేళ్ళలో వివిధ విషయాల్లో సాంకేతిక నైపుణ్యతను సాధించిన నాలుగు లక్షల నిపుణలను తయారు చేయాలన్నది లక్ష్యం.ఈ లక్ష్యాల్ని నెరవేర్చడానికి రాష్ట ప్రభుత్వం ‘టాటా టెక్నాలజీస్ లిమిటెడ్’ సంస్థతో పదేళ్ల ఒప్పందం చేసుకొంది. వీరు స్వల్ప, దీర్ఘ కాలిక శిక్షణా కార్యక్రమాలతో ప్రతి ఏటా 30 వేలకు పైగా యువతను నిపుణులుగా తయారుచేసి పారిశ్రామిక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందేలా చేస్తారు. అలాగే విదేశాలకు వెళ్లి బతకడానికి సంసిద్ధుల్ని చేస్తారు.శిక్షణను కేవలం పుస్తక, అనుభవ సిలబస్సులకే పరిమితం చేయకుండా దాని చుట్టూతా ఆవరించి ఉన్న జీవకళలను కూడా జోడించాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. జిల్లాలవారీగా ఈ అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఆ యా ప్రాంతాల్లో ఉన్న ఏటీసీలు కోర్సుల్ని రూపొందించాలి. ఉదాహరణకు తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలస వెళతారు.ముఖ్యమంత్రి చెప్పినట్టుగా గల్ఫ్ దేశాల అవసరాలకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి జోడైతే వలసదారులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారే కాకుండా, తిరిగివచ్చిన వారికి సైతం స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు తక్షణమే అందుబాటులో ఉండాలి. వీరు మాతృదేశానికి వచ్చి స్థిరపడి పోవాలనుకొంటారు. గల్ఫ్ దేశాల్లో చేసిన పని, అనుభవం తిరిగివచ్చినవారి ఊళ్లలో పనికిరాకపోతే వారిలో నిరుత్సాహం మొదలై మళ్ళీ వలసపోవాలనే ఆలోచనలతో సతమతమౌతారు.జెండర్ వివక్ష ఎక్కువ ఉన్న మన సమాజంలో సమతుల్యం తేవడానికి అమ్మాయిలు సంప్రదాయేతర కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలి. జనవరి 2001లో భుజ్ (గుజరాత్) లో భయంకర భూకంపం వచ్చాక పునరావాసానికి వేల సంఖ్యలో ఇళ్లను కట్టడానికి తీవ్రమైన మేస్త్రీల కొరత ఏర్పడింది. అహమ్మదాబాద్‌కు చెందిన సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ వారు గ్రామీణ మహిళలకు నిర్మాణరంగంలో శిక్షణనిచ్చి పునరావాస కార్యక్రమాలను వేగంగా అమలుపరచడంలో చేయూతనిచ్చారు. నిర్మాణ రంగంలో ఎప్పుడూ మానవవనరుల కొరత ఉంటుంది. మహిళలు కేవలం అల్పస్థాయి పనులకే పరిమితమౌతున్నారు. ఇప్పుడు ఐటీఐల ప్రక్షాళన మొదలవుతుంది కాబట్టి పెద్దయెత్తున ప్రయత్నాలు చేపట్టి మహిళలకు సాంకేతిక రంగంలో సముచిత స్థానం కల్పించాలి.1980వ దశాబ్దంలో భారత ప్రభుత్వం ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీస్’(ïసీఏఆర్టీ– కార్ట్) అనే సంస్థని ఢిల్లీలో స్థాపించింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థను 25 ఏళ్లుగా పనిచేస్తున్న మరో సంస్థ, ‘పీపుల్స్ ఆక్షన్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా’ (పీఏడీఐ)తో విలీనం చేసింది. రెండు పేర్లలో ఉన్న మూలసూత్రాలను కలుపుకొని ‘కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ ఆక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీస్’– కపార్ట్ పేరుతో దేశమంతా ఎన్జీవోలకి ఆర్థిక సహాయన్నందిస్తూ చాలా సంవత్సరాలు పనిచేసింది (వ్యాస రచయిత ఈ సంస్థలో ఆరు సంవత్సరాలు పనిచేశారు).ఈ రెండు సంస్థలూ గ్రామీణాభివృద్ధి విభాగం (వ్యవసాయ మంత్రిత్వ శాఖ) కింద పనిచేసేవి. అప్పుడు కపార్ట్ ఒక వినూత్న ప్రయోగాన్ని– ‘రీజినల్ రిసోర్స్ సెంటర్స్ ఫర్ రూరల్ టెక్నాలజీస్’ (ఆర్ఆర్సీఆర్టీ) ఆరంభించింది. కపార్ట్ స్వచ్ఛందసేవా సంస్థలకు ఆర్థిక సహాయంచేసే సంస్థ కాబట్టి ఉన్నతశ్రేణి ఎన్జీవోలకు ఇది గొప్ప అవకాశంగా అందుబాటులోకి వచ్చింది. ఎన్నో పేరున్న సంస్థలు ఏళ్లనుండి గ్రామీణాభివృద్ధికి అంకితమై యువతకి ఉపాధికోసం శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్ని జరుపుకున్నాయి.ఈ యోజన ద్వారా పలు సంస్థలకి పెద్ద మొత్తాల్లో 3–5 సంవత్సరాల ప్రాజెక్టులను ఇచ్చారు. లబ్ధి పొందిన ఈ సంస్థలు తమ తమ ప్రాంతీయ అవసరాలను తెలుసుకొని మంచి శిక్షణా కార్యక్రమాలను రూపొందించి గ్రామ యువతకు శిక్షణ ఇచ్చాయి. మరింత బలపర్చడానికి గాను ఈ యోజన ఎంతో తోడ్పడి యువత భవిష్యత్తు నిర్మాణంలో గణనీయమైన పాత్ర వహించాయి. అయితే కాలక్రమేణా కపార్ట్ మూతపడింది. తెలంగాణ ప్రభుత్వం పైవిషయాలనూ దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సాగించాలి.– డా. టి. సంపత్ కుమార్, వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు. ఢిల్లీలోని కెనడియన్ హై కమిషన్ మాజీ సీనియర్ సలహాదారు -
మాదిగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్ అన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధ లేదు నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్ చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీయే గాడ్‌ఫా దర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు. -
నాగర్ కర్నూల్ టికెట్ ఫైట్
-
సీఎం జగన్ ఆపన్న హస్తం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్ జగన్.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్ తల్లి టి.ఉష, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు. -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పసునూరి దయాకర్, గ్లింప్స్‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
ఏపీలో విద్యా సంస్కరణలు అద్భుతం
రామచంద్రపురం రూరల్: ఏపీలో విద్యా సంస్కరణలు బాగున్నాయని, ఇప్పటికే ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని మేఘాలయ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.సంపత్‌కుమార్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తన తల్లి ఈశ్వరమ్మతో కలసి బుధవారం ఆయన సందర్శించారు. సంపత్‌కుమార్ ఇదే పాఠశాలలో 4వ తరగతి విద్యనభ్యసించగా, తల్లి ఈశ్వరమ్మ ఇక్కడ ఉపాధ్యాయినిగా పనిచేశారు. తాను పనిచేసిన పాఠశాలలను ఒక్కసారి చూడాలన్న తల్లి కోరికతో పాటు ఏపీలో జరుగుతోన్న విద్యా సంస్కరణలను పరిశీలించడానికి వచ్చినట్లు సంపత్‌కుమార్ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన పట్టుదలతో శ్రమించాలని సూచించారు. మంచి చదువును అందిస్తే భవిష్యత్ తరాలు అద్భుతంగా మారతాయని ఆ దిశగా పనిచేస్తోన్న సీఎం జగన్ అభినందనీయుడన్నారు. సంపత్‌కుమార్ తల్లి ఈశ్వరమ్మను ఆర్జేడీ నాగమణి ఆధ్వర్యంలో సత్కరించారు. -
అలాంటి తేడాలు ఇండస్ట్రీలో ఉండవు: హీరోయిన్
Surapanam Movie Trailer Released: సంపత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ –‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంతం నేపథ్యంలో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి అంశాలతో పాటు మంచి ప్రేమకథ ‘సురాపానం’ లో ఉంటుంది. సంపత్‌కుమార్ ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు. ‘సురాపానం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉండవు. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త కథను ‘సురాపానం’ చిత్రంలో చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్..ఇలా అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ప్రగ్యా నయన్. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్‌లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీగా ‘సురాపానం’
ప్రగ్యా నయన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సురాపానం’ (కిక్–ఫన్). సంపత్ కుమార్ దర్శకత్వం వహించి, లీడ్ రోల్ చేశారు. మట్ట మధు యాదవ్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. తాను చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశాన్ని థ్రిల్లింగ్‌గా చూపిస్తూ హాస్యాన్ని జోడించి ఈ చిత్రం తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సెసిరోలియో, కెమెరా: విజయ్ ఠాగూర్. -
హీరోగా మారిన డైరెక్టర్, సురాపానం సినిమా టీజర్ చూశారా?
సంపత్ కుమార్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’ (కిక్ అండ్ ఫన్). ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా టీజర్‌ని ‘భీమ్లా నాయక్’ ఫేమ్ దర్శకుడు సాగర్ కె. చంద్ర విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సురాపానం’ టైటిల్‌కి తగ్గట్టుగా టీజర్ కూడా చాలా బాగుంది. థ్రిల్, వినోదం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాంటసీ థ్రిల్లర్, కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సరికొత్త కథాంశంతో వస్తున్న ‘సురాపానం’ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం మా సినిమా సెన్సార్‌లో ఉంది.. మే చివరి వారంలో చిత్రం విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, సురభి ప్రభావతి, త్రిపుర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చదవండి: సరోగసీ ద్వారా బిడ్డను కోల్పోయాం: స్టార్ హీరోయిన్ యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్‌ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
జానా గులాబీ కండువా కప్పుకుంటానన్లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవమున్న జానారెడ్డి గురించి కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తగదని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తే సంతోషమని జానా అన్నారే తప్ప.. గులాబీ కండువా కప్పుకుంటానని ఆయన అనలేదని, అలా అన్నట్టు శాసనసభ రికార్డుల్లో ఎక్కడా లేదని చెప్పారు. శనివారం టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు పంటలకు కోటి ఎకరాలకు నీరిస్తే టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి చెప్పారని, కేసీఆర్ మాట్లాడింది తప్పని తాము నిరూపించినందుకు ఇప్పుడు ఆయన ఏం శిక్ష వేసుకుంటారో చెప్పాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జానారెడ్డికి సీఎం క్షమాపణలు చెప్పాలని సంపత్ డిమాండ్‌చేశారు. -
కాంగ్రెస్ ‘పవర్’పంచ్: గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ‘పవర్’పంచ్ విసిరింది. 10 మంది మంత్రులపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. దొంగలముఠాలా ఏర్పడి దోచుకుతింటున్నారని ధ్వజమెత్తింది. పేదల భూములపై రాబందుల్లా వాలిపోయి కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించింది. మంత్రుల అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్ సక్రమంగా విచారణ జరిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు లేదని, అందుకే సిటింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘గరీబోళ్ల భూముల్లో గులాబీ గద్దలు’పేరిట శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో భూకబ్జాలు తారస్థాయికి చేరాయని, కొందరు మంత్రులైతే దళితుల భూములు, దేవుడి మాన్యాలను కూడా వదలడంలేదని ఆరోపించారు. భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూమ్‌యాప్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, నాయకులు అనిల్‌యాదవ్, రోహిత్‌లు పాల్గొన్నారు. ఆయా మంత్రులపై సంపత్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో చేసిన ఆరోపణలు ఈవిధంగా ఉన్నాయి... మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ ఎంపీ రేవంత్ ఆధారాలతోసహా బయటపెడితే ఆయన్ను జైలుకు పంపారు. దేవరయాంజాల్ దేవాలయ భూములను కేటీఆర్ ఆక్రమించారు. దేవరయాంజాల్ భూముల్లోనే మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి బ్యాంక్ లాంటివాడు కాబట్టే కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మంత్రి గంగుల కమలాకర్ భూముల విషయమై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మీదనే కోర్టులో కేసు వేశారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలూ లేవు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూములను మంత్రి పువ్వాడ అజయ్ అప్పనంగా అనుభవిస్తున్నారు. ఆయన పార్టీ మారినందుకు రూ.50 కోట్ల విలువైన భూమి, మంత్రి పదవిని ఇచ్చారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించారు. 200 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకుని విలాసవంతంగా జీవిస్తున్నారు. మరోమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా భూకబ్జాల్లో ఆరితేరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కుష్టు ఆసుపత్రి భూముల్ని కూడా వదల్లేదు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ఎన్నిసార్లు భూకబ్జా ఆరోపణలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోరు. మంత్రులు ఎర్రబెల్లి, మహమూద్ అలీలపై వచ్చి న ఆరోపణలను కూడా సీఎం కేసీఆర్ పెడచెవిన పెడుతున్నారు. రాబందుల్లా పడ్డారు: ఉత్తమ్ కాంగ్రెస్ హయాంలో పేదలకు భూమి పంపిణీ చేస్తే టీఆర్ఎస్ నేతలు వాటిని కబ్జా చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఒకవైపు సీఎం కేసీఆర్ చెబుతుండగా, మరోవైపు తన కేబినెట్ సహచరులు రాబందుల్లా వారి భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. వీరంతా దొంగల ముఠాలాగా ఏర్పడి అక్రమంగా దోచుకుంటున్నారని విమర్శించారు. భూదందాలకు పాల్పడిన మంత్రులను శిక్షించాలని రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాయనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు. చదవండి: Etela Rajender: రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు -
సీఎం కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి
సాక్షి, మానకొండూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్‌కుమార్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. కేసీఆర్, సంపత్‌కుమార్ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని, ఒకే గదిలో ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. సీఎం హోదాలో కేసీఆర్ కొన్ని నెలల క్రితం కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్ వెళ్లారు. సంపత్‌కుమార్‌ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్‌ను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్ ఆ రోజు సంతోషపడ్డారు. కాగా, సంపత్‌కుమార్ అవివాహితుడు కావడంతో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: పోరాటయోధుడు గుమ్మి పుల్లన్న మృతి సింగరేణిలో ఉద్యోగాలు; హైకోర్టు కీలక ఆదేశాలు -
ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది..?
సాక్షి, హైదరాబాద్: దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధ్యక్షతన.. మహిళా కాంగ్రెస్ చైర్మన్ నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. మహాధర్నాలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మహిళా, దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (టీఆర్ఎస్ నేతల ఇళ్లకే రూ.10 వేలు) ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. 'దళితులకు, మహిళలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో కూడా దళితులు, మహిళల హక్కుల కోసం ధర్నా చేయాల్సి రావడం మన దౌర్భాగ్యం. తెలంగాణ కోసం మహిళలు, దళితులు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇందుకోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోజూ అత్యాచారాలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతిరోజు దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కల్వకుంట్ల కుటుంబ పాలన పోవడానికి ప్రతి దళితుడు పోరాటం చేయాలి. ప్రతి మహిళా టీఆర్ఎస్ను బొంద పెట్టడానికి నడుం బిగించాలి' అని సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. (హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు..?) -
ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లా మారుతోందని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మాదిరిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, దోషులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నివాసాన్ని సంపత్‌తోపాటు కాంగ్రెస్ నేతలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు అందరిని అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హోంమంత్రి సంపత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: టీఆర్ఎస్ నేతల బాహాబాహి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. ‘నిన్న(బుధవారం) కేసీఆర్ శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్లో ఆదర్శంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్‌కు సిగ్గు ఉందా. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టీఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారు ఇది ఆదర్శంగా ఉందా. ఖమ్మంలో బాలికపై అత్యాచారయత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు. ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరామర్శించారా. ఇదేనా మీ ఆదర్శం.. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. హోంమంత్రి రాజీనామా చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వైద్యశాఖను మరింత బలోపేతం చేసేలా.. -
ఒత్తిడితో సచ్చిపోతున్నా..
మిర్యాలగూడ అర్బన్: ‘చదివి.. చదివి ఒత్తిడితో సచ్చిపోతున్నాం కేసీఆర్ సార్.. పుస్తకం తీయాలంటే వణుకు వస్తుంది. త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వండి’అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు విషం తాగాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన సంపత్‌కుమార్ చాలా రోజులుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కుటుంబానికి భారం అవుతున్నానని భావించి ఓ పురుగుల మందు డబ్బాను తెచ్చుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తను పడిన మానసిక వేదనను వివరించి ఆ పురుగుల మందు తాగేశాడు. తన తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ ఉన్నత చదువులు చదివించినా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియక, చేసేదిలేక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. విషం తాగి అపస్మారక స్థితిలోకి పోయిన సంపత్‌కుమార్‌ను గుర్తించిన తల్లితండ్రులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అపాయింట్మెంట్ లేదని అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఘటనాస్థలానికి వెళ్లిక టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు మరి కొంతమంది నేతలు శనివారం నగంరలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారికి డీజీపీ అపాయింట్మెంట్ మంజూరు చేయకపోవడంతో లోపలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేసి నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా అంతకుముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన శ్రీశైలం పర్యటన ఉద్రిక్తతంగా మారింది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే... విషం చిమ్ముతారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన విషం చిమ్ముతోందని మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ సొంత బిడ్డలయిన కాంగ్రెస్ పార్టీ నేతలపై విషం చిమ్ముతున్నారని బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం సచివాలయాన్ని కట్టడం అవసరమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి వాస్తు సరిగా లేదని ప్రజలకు చెందిన వేల కోట్ల ఆస్తులతో భవనాలు నిర్మించడం, దాన్ని మంత్రులు సిగ్గులేకుండా సమర్థించడం దౌర్భాగ్యమని అన్నారు. విభజన చట్టాన్ని తామే తయారు చేశామని కేసీఆర్ చెప్పుకున్నారని, మరి ఆ చట్టంలో సెక్షన్ 8 ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు చట్టం, రాజ్యాంగం తెలియడం లేదని, చట్టంలో ఉన్నది కాబట్టే తాము అడుగుతున్నామని, అది ఆమలు చేయమని అడగడం బానిసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రులకు కనీసం సోయి లేకుండా పోయిందని, చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఉంది కాబట్టే తాము సెక్షన్ 8 గురించి అడుగుతున్నామని, అవేమీ మంత్రులకు లేవు కాబట్టి తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏందని మంత్రులు అంటున్నారని, కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల బాగోగులు తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని, ఆ సమయంలో కేసీఆర్ కనిపించకుండా పోతే ఎలా అని అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కరోనా అంటున్నారని, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తాము చేతల్లో చూపించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కరోనా కాదని, టీఆర్ ఎస్ పార్టీ ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదని సంపత్ వ్యాఖ్యానించారు. -
‘కేటీఆర్‌కు వాళ్ల సమస్య కనిపించడం లేదా’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. కంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంది రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సూచించారు. టమాటా పండించిన రైతు పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో కంది కొనుగోలుకు పరిమితులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలని, టమాటాకు మద్దతు ధర కల్పించాలని కోరారు. (ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారిణి) అదే విధంగా గిట్టుబాటు ధరను కల్పించడంలో, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే వ్యవసాయ పనిముట్ల సబ్సిడీని సైతం కేసీఆర్ సర్కార్ ఎత్తేసిందని మండిపడ్డారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ అంటే కేసీఆర్ సర్కార్ కు గుర్తుకొచ్చేది కేవలం ట్రాక్టర్లు మాత్రమేనని, ట్రాక్టర్లు ఇస్తే కమీషన్లు వస్తాయనే వాటిపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై ట్విట్టర్ లోనైనా స్పందిస్తాడో ఏమోనని ట్విట్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఈటెల రాజేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్‌కు రైతు సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. (జనరల్ మేనేజర్‌పై పగబట్టిన మేనేజర్ ) -
80 సార్లు రక్తదానం.. 127 సార్లు ప్లేట్లెట్స్
ఇప్పుడు చాలా మంది చాలా రకాల రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సాటిమనిషికి సేవచేయడంలో రికార్డు సృష్టించేవారు అరుదే. అలాంటి అరుదైన వ్యక్తి నగరవాసి సంపత్ కుమార్.వందలసార్లు రక్తదానం చేయడం ద్వారా రికార్డు సృష్టించిన ఆయన అంతకు మించిన స్ఫూర్తినింపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఒక మనిషికి అత్యంత అవసరమై, ఒక మనిషి కృత్రిమంగా తయారు చేసుకోలేని జీవ పదార్థం ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రతీ సెకనుకు ఇద్దరు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ సేవకు సమాజంలో మార్పునకునిర్విరామ రక్తదాతగా మారి మరెంతో మందిని రక్తదాతలుగా మారుస్తున్నారు నగరవాసి సంపత్ కుమార్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. చలింపజేసినమృత్యువు.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన వ్యాపార కుటుంబంలో పుట్టి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా కొద్ది రోజులు చేసి ఇప్పుడు సిటీలో స్వంత బ్యూటీ పార్లర్ నిర్విహిస్తున్నా. ఇరవైఏళ్ల క్రితం గాంధీ హస్పిటల్లో సమయానికి రక్తం అందక ఓ రోగి చనిపోవడం చూసి చలించిపోయాను. ఆ మరునాడే రక్తదానం చేశా. కనీసం 18 నుండి 65 సంవత్సరాల వయస్సు కలిగి, ఆరోగ్యంగా ఉన్నప్రతీ వ్యక్తి 3 నెలలకు ఒకనారి రక్తం, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చు.. ఈ విధంగా సంవత్సరానికి 24 సార్లు ప్లేట్లెట్స్, 4 సార్లు రక్తం దానం చేయొచ్చునని తెలిశాక ఇప్పటికి 80 సార్లు రక్తదానం, 127 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశా. 188 సార్లు రక్తదానం చేయొచ్చు దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు ప్రతీ సంవత్సరం 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 40 లక్షలు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. రక్తదానం పై అపోహలు తొలగించడానికి సదస్సులు, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నా రక్తదానం వలన గుండెపోటు, కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయనే విషయం సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దాతల రక్తాన్ని ప్రాజోన్ ప్లాస్మా, ర్యాండమ్ ప్లేట్లెట్స్, పాకెట్ సెల్స్ అనే 3 విభాగాలుగా విభజిస్తారు. ♦ ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదు. ఒక వ్యక్తి 47 సంవత్సరాల వ్యవధిలో (18–65 సంవత్సరాల మధ్య) 188 సార్లు రక్తదానం చేసి 564ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. తలసేమియా, కేన్సర్ కీమోథెరపీ, గుండె సర్జరీ, డెలివరీ సమయాల్లో... ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో రక్తం అవసరమవుతుంటుంది. గత 2008 నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ప్రయాణం చేస్తూ అక్కడే 148 సార్లు రక్తదానం చేశా. రక్తదానం, నేత్రదానంకృషి చేస్తూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసే బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవి తనను ‘‘నీ సేవలు వెల కట్టలేనివని’’ ప్రశంసించి తన కోసం ప్రత్యేకంగా బొకే పంనించడం ఎప్పటికీ మర్చిపోలేను. రక్తదాతగా పలు రికార్డులు ♦ విశ్వగురు ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఫీచర్ అబ్దుల్ కలాం ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ♦ ఇండియన్ ప్రైడ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ♦ రక్త దానానికి సంబంధించి దేశంలోనే మొదటి డాక్టరేట్–తమిళ యూనివర్సిటీ. -
‘ఆ కుట్ర వెనుక మోహన్ భగవత్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘జార్ఖండ్ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు’
సాక్షి, హైదరాబాద్ : జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యర్శి సంపత్ విమర్శించారు. జార్ఖండ్ ఫలితాల సందర్భంగా గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, దేశంలో బీజేపీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని, వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అధికారపార్టీకి దూరం అయ్యారన్నారు. అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వానిదేనని, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. (జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం) సంబంధిత వార్తలు : సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం! జార్ఖండ్‌లో నూతన శకం: సోరేన్ -
నాపై ప్రభుత్వం కక్షసాధింపుతో వ్యవహరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై తాను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ఆరోపించారు. తాను ప్రభుత్వ విధానాలను విమర్శించానని గన్మెన్లను తీసేశారని, ఏడాది కాలంగా తనకు రావాల్సిన మాజీ ఎమ్మెల్యే పింఛన్ ఇవ్వడం లేదని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తన సోదరుడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తొలగించారని, తన మరో సోదరుడు న్యాయపరంగా దక్కించుకున్న కాంట్రాక్టులను కూడా తొలగించారని ఆరోపించారు. ఐకియాకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని, హెరిటేజ్ భవనాన్ని తొలగించి కేటీఆర్ వందల కోట్లు సంపాదించడాన్ని తాను పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఏడుసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పలేదని అన్నారు. -
నాపై కక్ష సాధిస్తున్నారు: సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్: హత్యలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఓ వైపు దేశం ఆగమవుతుంటే బీజేపీ నేత అమిత్ షా అయోధ్య గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ యాదాద్రిలో పాపాలను కడిగేసుకోవడానికే దేవుడి దగ్గరకు పోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐకియా సంస్థకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. హెరిటేజ్ భవనాన్ని తొలగించి కేటీఆర్ అక్కడ వందల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు. ఇక టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లను వారితో ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే చింటూ పింటూ అని పిలిచానని సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి బూతులు మాట్లాడకుండా కేవలం ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే విమర్శించానన్నారు. కానీ వాళ్లు దీనికి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెలిపారు. ‘నాకు గన్మెన్లను తీసేశారు. మా అన్నను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తొలగించారు. నా తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్‌లను తొలగించారు. నాతోపాటు మాజీ ఎమ్మెల్యేలందరికీ ఏడాదికి పైగా రావాల్సిన పెన్షన్లను ఆపేశారు. తనపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నాపై కక్ష సాధిస్తే నేను ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది మూర్ఖత్వం. ఎన్ని చేసినా నీపై పోరాటాలు ఆపే ప్రసక్తి లేదు. ఖబడ్దార్, నీపొగరు దిగే వరకు మా పోరాటాలు ఉంటాయి’ అని సంపత్ కుమార్ తెలిపారు -
కాంగ్రెస్ అగ్నికి ఆజ్యం పోస్తోంది
డుమ్కా (జార్ఖండ్): కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పౌరసత్వ(సవరణ) చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం జార్ఖండ్‌లోని డుమ్కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగ్నికి ఆజ్యం పోస్తున్న వారిని వారి దుస్తుల ఆధారంగానే గుర్తించవచ్చునని పార్టీ, సామాజిక వర్గాల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఆస్తులకు నిప్పు పెడుతున్న వారిని టీవీల్లో చూడవచ్చు. ధరించిన దుస్తుల ఆధారంగానే వారిని గుర్తు పట్టవచ్చు’అని ఆయన అన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలన్నింటికీ ప్రతిపక్షాలు వ్యూహాత్మక సహకారం అందిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కుట్రలకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రభావితం కాలేదని అన్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు కొందరు ప్రదర్శన నిర్వహించడంపై ఆయన.. ‘దేశం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ఏళ్లుగా చేస్తున్న పనిని ఇప్పుడు కాంగ్రెస్ మొదటిసారిగా చేపట్టింది’ అని ఆరోపించారు. పార్లమెంట్లో ఎంపీలు సంతాలీ తదితర ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో సంతాలీ భాష తర్జుమాకు కూడా వీలు కల్పించారన్నారు. -
చింటూ, పింటూలు ఇప్పుడు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్ : గతంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే చింటూ (కేటీఆర్), పింటూ (హరీష్‌రావు)లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్‌లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వారి మాటల్లోనే.. ‘ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు లేదు. వర్షాలు పడినా ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియాపైన విపరీతమైన ఒత్తిడి వల్ల నిజాలు బయటకు రావడం లేద’ని విమర్శించారు. మంత్రులకు పదవీ భయం? ఇంకా ‘దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గ పాలన లేదు. అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్నారు. ప్రతీ విషయంలో మేమే పోటుగాళ్లమంటూ ముందుకు వచ్చే కేటీఆర్, హరీష్‌లు ఎక్కడ పోయారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్లు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదెందుకు? ఒకాయన జాయ్ 2019 అంటూ విలాసాలు చేస్తున్నారు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ఆ శాఖ మంత్రి ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. డెంగీతో అనేక మంది చనిపోతుంటే ఆరోగ్య మంత్రి పదవి భయంతో గొంతు మీద వేలాడుతున్న కత్తిని చూసి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ప్రజలు తిరగబడకపోతే న్యాయం జరగదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంద’ని వారు వివరించారు. -
ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం
-
ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం
సాక్షి, చౌటుప్పల్: న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా తాము సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం సోనియా గాంధీని సైతం ఎదిరించామని పేర్కొన్నారు. కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదని, ఆయన దొంగ దీక్షలతో ఎన్నో ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోల స్థలాలపై కన్నేసిన కేసీఆర్, కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దోపిడీలో భాగంగానే మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రికల్ బస్సులు, వరంగల్‌లో ఎంపీ దయాకర్‌కు ఆర్టీసీ స్థలాల కేటాయింపు బాగోతమన్నారు. కార్మికులు ఆత్మస్థైర్యంతో ఉండాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
‘రేవంత్... నా ముద్దుల అన్నయ్య’
సాక్షి, హైదరాబాద్ : తనకు యురేనియం విషయంలో ఏబీసీడీలు కూడా తెలియవని, పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ అవకాశం ఇవ్వనందుకే తాను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడానంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన మాట్లాడిన మాటలకు తాను స్పందించాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. -
రేవంత్‌కు నో ఎంట్రీ.. సంపత్ కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: యురేనియం విషయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు ఏబీసీడీలు రావని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను చదువులో పీహెచ్డీ చేశానని, ఆ విషయం ప్రజలకు బాగా తెలుసని సంపత్ వ్యగ్యంగా సమాధానమిచ్చారు. తాను గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, అందుకే మీడియాకు అందుబాటులో లేకపోయానని వివరించారు. రేవంత్ రెడ్డి నాకు అత్యంత ముద్దుల అన్నయ్య అని, కానీ తనపైన ఎందుకు అలా మాట్లాడారో అర్థంకావట్లేదని అన్నారు. యురేనియం విషయంలో రేవంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు.. పూర్తి సమాచారం తెలుసుకున్న అనంతరం మాట్లాడుతానని స్పష్టం చేశారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వంశీచందర్, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్‌కు మాత్రం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా శుక్రవారం మీడియా సమావేశంలో సంపత్ మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ నాకు సెల్ఫీ ఇవ్వలేదని నేను రేవంత్పైన పడ్డట్టు ఆయన మాట్లాడుతున్నారు. నాతో సెల్ఫీ దిగడానికి చాలా మంది వస్తారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు. కేవలం జనసేన బ్యానర్ పైన అఖిలపక్షం భేటీ జరగడం సరికాదు. కనీసం సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీ జనసేన. యురేనియం ఉద్యమ క్రెడిట్ వేరే పార్టీకి ఇవ్వొద్దు. రేపు పవన్ కల్యాణ్ యురేనియం పైన మళ్ళీ మీటింగ్ పెడితే వెళ్తా.. కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటీ అనేది ముందే పార్టీలో చర్చ జరగాలి. యురేనియం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అంతా జనసేన పార్టీకి క్రెడిట్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా ప్రశ్నిస్తా. మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెజాన్ అడవులలో మాట్లాడినా నేను సంతోషిస్తా. నేను పీసీసీ పదవికోసం ఎవరినీ అడగలేదు. ఎస్సీ సామాజికవర్గానికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తే నేను రెడీ. దామోదర రాజనర్సింహ పేరు ను పీసీసీ చీఫ్ పదవికి పరిశీలించాలని కోరతాను’ అని సంపత్ వ్యాఖ్యానించారు. చదవండి: రేవంత్ వ్యాఖ్యలపై దుమారం -
పవన్‌కల్యాణ్ మీటింగ్‌కు మనమెందుకు?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్‌పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్‌లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్‌ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు. -
హైకోర్టులో కార్యదర్శులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలి పేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అసెంబ్లీ రద్దు కావడంతో ధర్మాసనం ఆ అప్పీళ్లతో పాటు సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను కూడా మూసేసిందని, అయినా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందుకెళ్తున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరు తూ నిరంజన్‌రావు, నరసింహాచార్యులు వేర్వే రుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో సింగిల్ జడ్జి తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ధర్మాసనం కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను మూసేసినా కూడా సింగిల్ జడ్జి మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా న్యాయ, అసెంబ్లీ కార్యదర్శులకు బెయిలబుల్ వారంట్లు జారీ చేయడమే కాక, కోర్టు ముందు హాజరైన తర్వాత వారిని తిరిగి హైకోర్టు రిజిస్ట్రార్ కస్టడీకి అప్పగించారన్నారు. ఈ సమయంలో ధర్మాస నం.. కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయ వాది కోసం ఆరా తీసింది. అయితే ఏ ఒక్కరూ కోర్టులో లేకపోవడంతో, దీన్ని బట్టి ఈ కేసు పట్లవారు అంతగా ఆసక్తి చూపుతున్నట్లు లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెషల్ జీపీ శరత్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్‌జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లు గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్‌లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్.. సామాజిక సమీకరణాలపై తర్జనభర్జన పడుతోంది. కూటమిపక్షాలు సూచిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటూనే సామాజిక వర్గాల వారీగా సీట్లను ఎవరికి కేటాయించాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. మొత్తం 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 స్థానాలు మాదిగలకు, 7 స్థానాలు మాలలకు కేటాయించాలని యోచిస్తున్న కాంగ్రెస్, జిల్లాల సమీకరణలు, ఆయా కులాల జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ అభ్యర్థిని బరిలో నిలపాలన్న దానిపై విస్తృతంగా చర్చిస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధర్మపురి, బెల్లంపల్లి, మానకొండూరు, చెన్నూర్, చొప్పదండి, జూకల్, అంధోల్, జహీరాబాద్, చేవెళ్ల, వికారాబాద్, కంటోన్మెంట్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, తుంగతుర్తి, నకిరేకల్, ఆలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమిలో టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 5 నుంచి 6 స్థానాలు కేటాయించే అవకాశం ఉండగా, 13 లేక 14 స్థానాలు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. ఇందులో ఆంధోల్‌లో దామోదర రాజనర్సింహ, మధిరలో భట్టి విక్రమార్క, ఆలంపూర్లో సంపత్‌కుమార్, మానుకొండూర్లో ఆరేపల్లి మోహన్, జహీరాబాద్‌లో గీతారెడ్డి, వికారాబాద్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున అక్కడ కూటమి పక్షాలకు సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. మిగతా వాటిలో సత్తుపల్లిలో టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉంది. ఇవి పోనూ మిగతా స్థానాల్లో ఏ పార్టీకి ఏయే సీట్లు ఇవ్వాలి.. ఇక్కడ మాల, మాదిగ వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. వర్ధన్నపేట, జూకల్‌లో మాదిగ, తుంగతుర్తి, అచ్చంపేట, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాల సామాజిక వర్గ అభ్యర్థిని బరిలో నిలపాలని ఇప్పటికే కూటమి పక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. స్టేషన్ ఘన్పూర్, చొప్పదండి, కంటోన్మెంట్ విషయంలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీల తరఫున పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరి బలమెంత.. ఏ మేరకు విజయవకాశాలు ఉంటాయన్న దానిపైనా బుధవారం సైతం కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ చర్చించారు. -
కల్వకుంట్ల కుటుంబ పతనానికి ఏమైనా చేస్తా
సాక్షి, హైదరాబాద్: దేవుడినైనా ఎదిరిస్తామని అంటున్న టీఆర్ఎస్ నేతలను, ఆ పార్టీని ఆ దేవుడు కూడా క్షమించడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో తనతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు ఉండొద్దన్నదే కేసీఆర్ భావన అని, ఈ విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైందని చెప్పారు. ఈ కుట్ర వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశానని, దీని పరిణామమే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇంటి మీద కక్షపూరితంగా జరిగిన ప్రభుత్వ ప్రేరేపిత దాడిని ఖండిస్తున్నానని, రేవంత్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవారిని వేధించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు పోలీసు అధికారులు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఉంటున్న ప్రగతిభవన్‌లోకి వెళ్లి ఆయనతో ఏకాంతంగా మాట్లాడి వచ్చిన తర్వాతే ఈ దాడులు జరిగాయని చెప్పారు. ఇన్ని రోజులు గన్మన్లను తొలగించి తనను మానసిక క్షోభకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు గన్మన్లను ఇస్తామని అంటోందని, దీని వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గన్మెన్ల సాయంతో తన సమాచారం తెలుసుకోవచ్చనే ఆలోచనతో మళ్లీ గన్మన్లను ఇస్తామని అంటున్నారనే అనుమానం తనకుందని, అందుకే గన్మన్లను తిరస్కరిస్తున్నానని చెప్పారు. ‘అమ్మతోడు చెప్తున్నా.. కల్వకుంట్ల కుటుంబం పతనం అయ్యేంత వరకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఖడ్గంతో ఏమైనా చేస్తా’అని సంపత్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఊరట
-
61 రోజుల జాప్యాన్ని మన్నించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ వ్యవహారంలో మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఊపిరి పీల్చుకుంది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వీరిద్దరి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన తీర్పు అమలును 2 నెలల పాటు ధర్మాసనం నిలిపేసింది. అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ కార్యదర్శి వి.నిరంజన్‌రావుకు కోర్టు ధిక్కారం కింద ఫామ్–1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలును సైతం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లలో జరిగిన 61 రోజుల ఆలస్యాన్ని కూడా మన్నించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన బెంచ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ను బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు ఈ ఏడాది ఏప్రిల్ 17న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌కు విచారణార్హత లేదంటూ ధర్మాసనం దానిని కొట్టేసింది. అయితే కోర్టు తీర్పు మేరకు తమ పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో చేర్చలేదని, దీనికి గాను కోర్టు ధిక్కారం అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులను శిక్షించాలంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనేందుకు ప్రాథ మిక ఆధారాలున్నాయంటూ వారిద్దరికీ ఫామ్–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే కోర్టు తీర్పు నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల భద్రతను పునరుద్ధరించనందుకు డీజీపీతో పాటు నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలకు ధిక్కార నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్పీకర్ మధుసూదనాచారికి సైతం షోకాజ్ నోటీసులిచ్చారు. జస్టిస్ శివశంకరరావు ఇచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఇరువురు కార్యదర్శులు కూడా ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలు చేశారు. ఇయర్ ఫోన్లు విసరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం లేదు.. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో జరిగిన వివాదం తాలూకు వీడియో ఫుటేజీ కోర్టు ముందు సమర్పించకపోవడాన్నే సింగిల్ జడ్జి ప్రధాన అంశంగా పరిగణించారని, ఇది సరికాదన్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు కూడా ఇయర్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్‌ను గాయపరిచారని, దీంతో వారిద్దరినీ బహిష్కరిస్తూ శాసనసభ తీర్మానం చేసిందని, ఆ తరువాత వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఘటన జరిగిన మార్చి 12న గానీ, బహిష్కరణ జరిగిన 13న గానీ ఇరువురు ఎమ్మెల్యేలు మౌనంగా ఉండి ఆ తరువాత వినతిపత్రం సమర్పించారన్నారు. మండలి చైర్మన్‌పై ఇయర్ ఫోన్లు విసరలేదని ఇరువురు ఎమ్మెల్యేలు చెప్పడం లేదని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిందన్న సింగిల్ జడ్జి తీర్పు సరికాదన్నారు. బహిష్కరణ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. అందుకే 61 రోజుల జాప్యం జరిగిందని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, జాప్యం సంగతి తరువాత తేలుస్తామని, ఈ అప్పీళ్లపై విచారణ జరిపే పరిధి ఉందో లేదో చెప్పాలని స్పష్టం చేసింది. తమ అప్పీళ్లకు విచారణార్హత ఉందని రోహత్గీ తెలిపారు. సభ తీర్మానంపై న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. న్యాయ సమీక్షకు ఆస్కారం లేదు.. న్యాయశాఖ కార్యదర్శి తరఫున మరో సీనియర్ న్యాయవాది హరేన్ రావెల్ వాదనలు వినిపిస్తూ, సభ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలోని వ్యవహారమన్నారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యేల బహిష్కరణ నిర్ణయం స్పీకర్‌ది కాదని, మొత్తం సభే తీర్మానం చేసిందని ఆయన వివరించారు. సభ తీర్మానం విషయంలో న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి... కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, బహిష్కరణ తరువాత పిటిషనర్లకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అప్పీళ్ల దాఖలులో జరిగిన జాప్యంపై వాదనలు వినిపించకుండా సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. సింగిల్ జడ్జి తీర్పునిచ్చినప్పుడు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదనట్లు వ్యవహరించిన కార్యదర్శులు, కోర్టు ధిక్కార నోటీసుల జారీతో ఈ అప్పీళ్లు జారీ చేశారన్నారు. అంతేకాక సింగిల్ జడ్జి ముందు ఇరు కార్యదర్శులు కూడా కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి, ఆ పని చేయకుండా ఈ అప్పీళ్లు దాఖలు చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. లోతుగా విచారణ అవసరం ధర్మాసనం జోక్యం చేసుకుని, 12 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణార్హ త లేదంటూ కొట్టేసిందే తప్ప, కేసు పూర్వాపరాల ఆధారంగా కాదని తెలిపింది. ఇప్పుడు ఇరువురు కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లకు విచారణార్హత లేదనడం సరికాదంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు ముడిపడి ఉన్నందున లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. అప్పీళ్ల దాఖలులో జరిగిన 61 రోజుల ఆలస్యానికి కారణం ఉందని అభిప్రాయపడింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల బహిష్కరణ తీర్మానం, తదనుగుణంగా నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ జడ్జి ముందు కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుతో సహా తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
-
మీ అప్పీళ్లపై 21న విచారణ జరుపుతాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ నెల 21న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయలేదంటూ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఇరువురు కార్యదర్శులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. దీంతో జస్టిస్ శివశంకర్‌రావు ఈ ఏడాది ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 61 రోజుల ఆలస్యంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు.. గతవారం అప్పీళ్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కోర్టు ధిక్కార కేసులో ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం కింద జస్టిస్ శివశంకరరావు.. ఫాం–1 నోటీసులు జారీ చేసి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. అలాగే స్పీకర్, డీజీపీ, నల్లగొండ, జోగుళాంబ గద్వాల్ ఎస్పీలకు నోటీçసులిచ్చి ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం ఇరువురు కార్యదర్శుల అప్పీళ్లు కేసుల విచారణ జాబితాలో ఉన్నా అవి విచారణకు నోచుకునే పరిస్థితి లేకపోవడంతో వారి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్‌కు, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు జారీ చేసిన నోటీసులు, ఇరువురు కార్యదర్శులకు ఇచ్చిన ఫాం–1 నోటీసుల గురించి ధర్మాసనానికి వివరించారు. -
స్పీకర్‌కు నోటీసులపై కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది. -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
-
కోమటిరెడ్డి–సంపత్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచీ అనేక మలు పులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో మంగళవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించింది. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది! అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్‌కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆక్షేపించింది. ‘‘ఇందుకు కోర్టు ధిక్కార పిటిషన్లో స్పీకర్‌ను నేరుగా ప్రతివాదిగా చేర్చే అవకాశమున్నా అలా చేయకుండా నిగ్రహం పాటిస్తున్నాం. అలా ఎందుకు చేర్చకూడదో చెప్పాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నాం’అని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ స్పీకర్‌కు నోటీసులు జారీ చేయడం, అది కూడా కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని కోరడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కోమటిరెడ్డి, సంపత్ భద్రతను పునరుద్ధరించకపోవడంపైనా న్యాయమూర్తి స్పందించారు. డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలను సుమోటోగా ధిక్కార పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఫాం 1 నోటీసు జారీ చేసి ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులంతా మోసగించే ఆలోచలు చేశారని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ఏ ఒక్కరూ తప్పించుకోజాలరన్నారన్నారు. తీర్పును అమలు చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిందన్నారు. ‘‘బహిష్కరణ తీర్మానం రద్దుతో వారి శాసనసభ్యత్వాలు వాటంతటవే పునరుద్ధరణ అవుతాయి. ఇందుకు ప్రత్యేక ఆదేశాలేవీ అవసరం లేదు. మా తీర్పుతో ఎమ్మెల్యేలిద్దరూ చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలకూ అర్హులు. అందులో భాగంగా వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఎస్పీలు తమకు ఆదేశాలు రాలేదంటూ మౌనం వహించారు. కోర్టు తీర్పు ఉన్నాక వారికింకా ఏ ఆదేశాలు అవసరమో అర్థం కాకుండా ఉంది. బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని, కాబట్టి ఎమ్మెల్యేలకు భద్రతను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని డీజీపీ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇదెంతమాత్రమూ సరికాదు’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018 జనవరి నుంచి ఈ రోజు దాకా కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ తీసుకున్న అలవెన్సులు, సమర్పించిన బిల్లుల వివరాలను ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కార్యదర్శులకు ఫాం 1 నోటీసులు మరోవైపు తమ బహిష్కరణను రద్దు తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసులను జస్టిస్ శివశంకరరావు జారీ చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. వీరిద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్మెన్లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీ, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. అలాగే అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు ఫారం-01 నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ లా సెక్రటరీ నిరంజన్ రావ్లు ఇద్దరూ నేరుగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు, అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందించారు. తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా మని గత వారం చెప్పారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎలాంటి ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు ను అమలు చేయనందుకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్ రావులకు సోమవారం ఫారం–1 నోటీసులు జారీ చేస్తాం’’అని న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తేల్చిచెప్పారు. నోటీసులు జారీ చేయడానికి ముందు కావాలంటే వాదనలు వినిపించుకోవచ్చని వారి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫారం–1 నోటీసులు జారీ చేసేటప్పుడు వాదనలు వినాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అవకాశం ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. తీర్పు అమలుకు ప్రయత్నాలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్.. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత వారం జరిగిన విచారణ సందర్భంగా తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. ఈలోపు జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వేర్వేరుగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై అత్యవసరంగా విచారణ జరిపేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. వాటితో సంబంధం లేదు కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ శివశంకరరావు శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదుల వెంకటరమణ తాము దాఖలు చేసిన అప్పీళ్ల గురించి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, స్టే ఏమైనా వచ్చిందా? అని ఆరా తీశారు. స్టే రాలేదని చెప్పడంతో, అయితే ఆ అప్పీళ్లతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘గత వారం ఈ కేసు విచారణ సందర్భంగా నేను ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాని ఇప్పుడు ఆ విషయం గురించి కనీసం ప్రస్తావనా చేయడం లేదు. తీర్పు అమలు గురించి చెప్పకుండా, అప్పీళ్ల గురించి చెబుతారేంటి’’ అని నిలదీశారు. విచారణను వాయిదా వేయాలని వెంకటరమణ కోర గా, న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ‘మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి.. వింటాను. నిబంధనల ప్రకారం మీ వాదనలు వినాల్సిన అవసరమే లేదు. అయినా కూడా వింటా’అని అన్నారు. దీంతో అటు వేదుల వెంకటరమణ, ఇటు న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావుకు ఏం చేయాలో పాలు పోక అలా ఉండిపోయారు. ఈ సమయంలో వేదుల వెంకటరమణ.. కనీసం సోమవారానికన్నా వాయిదా వేయాలని అభ్యర్థించడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆ రోజున కార్యదర్శులిద్దరికీ ఫారం–1 కింద నోటీసులు జారీ చేస్తానని, దానికి ముందు వాదనలు వినిపించాలనుకుంటే వినిపించుకోవచ్చని చెప్పారు. ఫారం–1 నోటీసులు జారీ చేసేందుకు ధర్మాసనం ముందు దాఖలు చేసిన అప్పీళ్లు తమకు ఎంత మాత్రం అడ్డంకి కాదని పేర్కొన్నారు. విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు. -
‘బహిష్కరణ’ కేసులో మరో మలుపు
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తాము తీర్పునిచ్చినా వారిని శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సింగిల్ జడ్జి ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇప్పుడు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు అప్పీళ్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పునివ్వగా, 61 రోజుల తర్వాత వారు ఈ అప్పీళ్లు దాఖలు చేయడం గమనార్హం. కోర్టు తీర్పును పట్టించుకోవద్దన్న వైఖరితో.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు.. తమకు కోర్టు ధిక్కారం కింద ఫారం–1 నోటీసు జారీ చేసి, వాదనలు విని శిక్షించే అవకాశం ఉందని భావించిన కార్యదర్శులు ఆశ్చర్యకరంగా ఇన్ని రోజుల తర్వాత అప్పీళ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. మొదట్లో ఈ కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకూడదన్న వైఖరితో వ్యవహరించిన శాసనసభ కార్యదర్శి.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండటం, కోర్టు ధిక్కారం విషయంలో జస్టిస్ శివశంకరరావు గట్టిగా వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గత వారం జరిగిన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణలో ఇద్దరు కార్యదర్శులు కూడా నివేదించారు. ఇందుకు రెండు వారాల గడువు కోరగా.. న్యాయమూర్తి వారం గడువునిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద తీర్పు అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఇప్పుడు అప్పీళ్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. న్యాయశాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు బుధవారం ఉదయం ఈ అప్పీళ్ల గురించి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ముందు ఈనెల 10న కోర్టు ధిక్కార కేసు విచారణకు వస్తుందని, ఈ కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చి నోటీసులిచ్చేందుకు సింగిల్ జడ్జి సిద్ధమవుతున్నారని, అందువల్ల ఈ అప్పీళ్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం కేసు పూర్వాపరాల గురించి తెలుసుకుంది. అప్పీళ్ల దాఖలులో ఎన్ని రోజుల ఆలస్యం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. 61 రోజుల ఆలస్యం జరిగిందని అదనపు ఏజీ బదులివ్వగా, మరి ఇన్ని రోజుల ఆలస్యంతో అప్పీళ్లు దాఖలు చేసినప్పుడు, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. కనీసం గురువారమైనా విచారించాలని అదనపు ఏజీ అభ్యర్థించగా ససేమిరా అన్న ధర్మాసనం, ‘గతంలో అసలు కోర్టుకు విచారణ పరిధి లేదని చెప్పినట్లున్నారు..? ముందు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోండి. సింగిల్ జడ్జి ఫారం–1 నోటీసు జారీ చేస్తే అప్పుడు దానిపై ధిక్కార అప్పీల్ దాఖలు చేసుకోండి. పరిస్థితిని బట్టి అప్పుడు విచారణ జరుపుతాం’అని తేల్చి చెప్పింది. కోర్టులిచ్చే తీర్పు విషయంలో ఉదాసీనంగా ఉండరాదంటూ పరోక్షంగా కోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 61 రోజుల ఆలస్యంగా అప్పీళ్లు దాఖలు చేయడంపై తాము తమ అభ్యంతరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోమటిరెడ్డి న్యాయవాది తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
మెట్టు దిగిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చినా, దాన్ని అమలు చేయకుండా బెట్టు చేసిన శాసనసభ కార్యదర్శి మెట్టు దిగారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రెండు వారాల గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. హైకోర్టు, వారంలోపు తీర్పును అమలు చేస్తున్నారా? లేదా? స్పష్టంగా చెప్పమంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, అలాగే తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా దానిని అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. నరసింహాచార్యులు తరఫున సీని యర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ధిక్కారానికి పాల్పడ్డారని ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు కోర్టు ఫాం–1 నోటీసు జారీ చేయాలనుకుంటే తాము మొదట వాదనలు వినిపిస్తామన్నారు. ఫాం–1 కింద నోటీసు జారీ చేసేటప్పుడు నోటీసులు అందుకునే వ్యక్తుల వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పును అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వేదుల బదులిచ్చారు. రెండు వారాలు గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనికి న్యాయమూర్తి వారమే గడువిస్తానన్నారు. -
స్పీకర్‌నూ ప్రతివాదిగా చేరుస్తాం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ తీర్మానం ద్వారా రద్దు చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ తామిచ్చిన తీర్పు అమలు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. అలాగే ఆ ఎమ్మెల్యేలకు గన్మన్లను పునరుద్ధరించకుండా నల్లగొండ, గద్వాల్ ఎస్పీలు ఎ.వి.రంగనాథ్, రెమా రాజేశ్వరి సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ కేసులో అవసరమైతే స్పీకర్‌ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, పరిస్థితిని బట్టి నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తామని తేల్చిచెప్పింది. గతంలో ఎస్.ఆర్. బొమ్మై, మేఘాలయా కేసుల్లో స్పీకర్లను ప్రతివాదులుగా చేర్చగా సుప్రీంకోర్టు సమర్థించడాన్ని గుర్తు చేసింది. రాజ్యాంగమే అందరికీ సుప్రీం అని, దానికన్నా ఎవరూ అధికులు కాదని, మూడు వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేశారు. అసెంబ్లీ కార్యదర్శికి అన్నీ తెలుసు... ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసులో పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసునన్నారు. ప్రతి నెలా అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి శాసనసభ్యుల జాబితా పంపుతారని, తాజా జాబితాలో కోమటిరెడ్డి, సంపత్‌ల పేర్లు లేవన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో ఈ కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతోపాటు అప్పీల్‌నూ కొట్టేసినా పిటిషనర్ల పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చకపోవడం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ ఎస్పీలకు ఎంత ధైర్యం..? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు అందాల్సిన జీతభత్యాలు, గన్మెన్ల సౌకర్యం గురించి న్యాయమూర్తి అడగ్గా శాసనసభ్యత్వాల రద్దు తరువాత గన్మెన్లను ప్రభుత్వం ఉపసంహరించిందని వారి తరఫు న్యాయవాది బదులిచ్చారు. దీంతో ప్రభుత్వం అంటే ఎవరు అంటూ న్యాయమూర్తి గట్టిగా ప్రశ్నించారు. నల్లగొండ, గద్వాల్ జిల్లాల ఎస్పీలు న్యాయవాది బదులివ్వగా కోర్టు తీర్పు ఉన్నా గన్మెన్లను తిరిగి కేటాయించకపోవడానికి వారికి ఎంత ధైర్యం అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. వారిది కూడా ధిక్కారమేనని, వారిని ఎందుకు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేయలేదని ప్రశ్నించారు. వారిని ఈ కేసులో సుమోటోగా ప్రతివాదులుగా చేర్చే విషయాన్ని పరిశీలిస్తానన్నారు. కోర్టు తీర్పు అమలు అసెంబ్లీ కార్యదర్శి బాధ్యత... ఈ దశలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో వాదనలు వినాల్సిన అవసరం లేదని, ఫారం–1 నోటీసులు అందుకున్నాక వాదనలు వినిపించేందుకు సమయం ఇస్తానని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ సమయంలో వెంకటరమణ కొన్ని సాంకేతిక అంశాలను లేవనెత్తగా కాజ్ టైటిల్ లోపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవద్దని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును అమలు చేసి తీరాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ పిటిషనర్ల శాసనసభ్యత్వాల రద్దులో న్యాయశాఖ కార్యదర్శికి ఎటువంటి పాత్ర లేదన్నారు. పిటిషనర్లు సైతం నిరంజన్రావుపై ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని తెలిపారు. ఈ కేసులో నామమాత్రపు ప్రతివాదిగానే ఉన్నారని, అందువల్ల ఆయన చర్యలను ధిక్కారం కింద పరిగణించరాదన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. శాసనవ్యవస్థతో ఘర్షణ పడటం లేదు... న్యాయశాఖ కార్యదర్శి ఓ న్యాయాధికారి కూడానని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలెత్తే పరిణామాలేమిటో ఆయనకు స్పష్టంగా తెలుసునని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే వచ్చే పరిణామాల గురించి వివరించాల్సిన బాధ్యత న్యాయాశాఖ కార్యదర్శిపై ఉందని, ఆ బాధ్యత నిర్వర్తించకపోవడం దారుణమన్నారు. తాము ఆదేశాలు జారీ చేశాక కోమటిరెడ్డి, సంపత్‌ల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం తమ తీర్పును అమలు చేసినప్పుడు అసెంబ్లీ, న్యాయశాఖల కార్యదర్శులు మాత్రం ఎందుకు అమలు చేయరని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన రోజున ఆయన చర్యలు ఎలా ధిక్కారం కిందకు వస్తాయో అప్పుడు చెబుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో అవసరమైతే స్పీకర్‌ను సైతం ప్రతివాదిగా చేరుస్తామని, లేకపోతే ప్రతివాదిగా చేయాలని ఆదేశాలిస్తామన్నారు. అంతేకాక స్పీకర్‌కు నోటీసు జారీ చేసి హాజరుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఇలా చేయడం ద్వారా శాసనవ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నట్లు భావించాల్సిన అవసరం లేదన్నారు. ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు ఫారం–1 నోటీసులిచ్చే విషయంపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం గడువునిస్తున్నామని, ఈ కేసులో కోర్టుకు సహకరించాలని ఇరుపక్షాలకు స్పష్టం చేశారు. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసనసభలోకి అనుమతించడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న అడిషనల్ ఏజీ రామచంద్రరావును మీరు ప్రభుత్వ న్యాయవాదా? లేక రాజకీయ పార్టీకి న్యాయవాదా? అని ప్రశ్నించింది. వారంలోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ లా లేజిస్లేటివ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సివుంటుందని హెచ్చరించింది. వచ్చే నెల 3వ తేదీన ఈ కేసును కోర్టు మళ్లీ విచారించనుంది. -
కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభే
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ బహిష్కరణ తీర్మానాన్ని రద్దు చేస్తూ, వారి శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది శాసనసభేనని శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు తీర్పు మేరకు కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల పునరుద్ధరణ అనేది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారమని ఆయన తెలిపారు. అందువల్ల కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల విషయంలో తాను కోర్టు ఆదేశాలను ఏ రకంగానూ ఉల్లంఘించలేదని, కోర్టు ఆదేశాలపై తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. తమ బహిష్కరణను, నియోజకవర్గాల ఖాళీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా కూడా తమ శాసనసభ్యత్వాలను మాత్రం పునరుద్ధరించలేదని, ఇది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారమే అవుతుందని, అందువల్ల అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డి, సంపత్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు తమ వాదనలను వినిపిస్తూ కౌంటర్లు దాఖలు చేశారు. ఆ అధికారం సభకే ఉంది శానససభ చేసే తీర్మానాల విషయంలో శాసనసభ కార్యదర్శికి రాజ్యాంగం ప్రకారం ఎటువంటి పాత్ర లేదని నరసింహాచార్యులు తన కౌంటర్లో పేర్కొన్నారు. ఏదైనా విషయంపై చర్చ జరిపి, నిర్ణయం తీసుకునే అధికారం సభకు మాత్రమే ఉందన్నారు. శాసనసభ సభ్యుల హక్కులు, వారికున్న రాజ్యాంగపరమైన రక్షణ విషయాలన్నీ కూడా సభ పరిధిలోనివేనన్నారు. సభ్యుల వ్యవహారశైలిపై నిర్ణయం సభదే అవుతుందని తెలిపారు. సభ తీర్మానం మేరకు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేసి వారి పేర్లను జాబితా నుంచి తొలగించామన్నారు. హైకోర్టు ఆదేశాలతో తమ పేర్లను జాబితాలో చేర్చాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారని, దీనిపై సభే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తన కౌంటర్లో పేర్కొన్నారు. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు ఆదేశాలను తాను ఎక్కడా కూడా ఉల్లంఘించలేదన్నారు. అనవసరంగా వివాదంలోకి లాగారు ఈ మొత్తం వ్యవహారంలో తనపై ఎటువంటి ఆరోపణలు లేవని న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తన కౌంటర్లో వివరించారు. కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాల రద్దుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సభలో తీసుకున్న నిర్ణయాలకూ తనకూ సంబంధం లేదని వివరించారు. ఈ మొత్తం వివాదంలో అనవసరంగా తనను లాగారని తెలిపారు. కేవలం తాను న్యాయశాఖ కార్యదర్శినే కాక బాధ్యతాయుతమైన న్యాయాధికారిని కూడానని వివరించారు. కాబట్టి కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం అన్నదే ఉండదన్నారు. అందువల్ల తనపై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను మూసేయాలని కోరారు. కాగా కోమటిరెడ్డి, సంపత్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరపనుంది. -
ఆ ఎమ్మెల్యేలపై విద్వేషం లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు భద్రతను ఉపసంహరించామని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. వారి సభ్యత్వాన్ని స్పీకర్ కార్యాలయం పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణమే నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తామని వివరించారు. భద్రత ఉపసంహరణ విషయంలో తమకు కోమటిరెడ్డి, సంపత్‌లపై ఎటువంటి దురభిప్రాయం, విద్వేషభావం లేదని తెలిపారు. ఎమ్మెల్యేలకు భద్రత విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల మేరకే వారికి భద్రతను ఉపసంహరించినట్లు వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తమపై కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును కోరారు. తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా తమ భద్రతను పునరుద్ధరించలేదని, గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి భద్రతను కొనసాగించే విషయంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్‌ను జిల్లాస్థాయి సెక్యూరిటీ సమీక్ష కమిటీ పరిశీలించాకే పిటిషనర్ల భద్రతను ఉపసంహరించామన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తామని, ఆ హోదా లేనప్పుడు భద్రత కూడా ఉండదన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావుండదని వివరించారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
దిగొచ్చిన అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానంపై న్యాయస్థానాల్లో దాఖలైన వ్యాజ్యాలకు ఏ మాత్రం స్పందించని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పుడు దిగొచ్చారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లో హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో స్పందించక తప్పలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. మరో ప్రతివాదిగా ఉన్న న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావు తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు కూడా కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 27వ తేదీనే పూర్తిస్థాయి వాదనలు వింటానని ఉభయ పక్షాలకు స్పష్టం చేశారు. ఫుటేజీ సమర్పిస్తానని అప్పటి ఏజీ హామీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై ఇయర్ ఫోన్ విసిరి గాయపరిచారన్న ఆరోపణలపై తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ, ఎన్నికల కమిషన్ కార్యదర్శులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఇయర్ ఫోన్ విసిరిన నాటి వీడియో ఫుటేజీ సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అప్పటి అడ్వొకేట్ జనరల్ డి.ప్రకాశ్‌రెడ్డి.. ఆదేశాలు అవసరం లేదని, ఫుటేజీ సమర్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో న్యాయశాఖ, ఎన్నికల సంఘం కార్యదర్శికి నోటీసులిచ్చారు. అయితే ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఆ హామీ ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆయన రాజీనామాకు దారి తీసింది. ధిక్కార పిటిషన్‌తో కదలిన కార్యదర్శి ఫుటేజీ ఇస్తానని ఏజీ హామీ ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి మాత్రం ఏ రకంగానూ స్పందించలేదు. ఫుటేజీ ఇస్తానని కాని, ఇవ్వనని కాని కోర్టుకు చెప్పలేదు. కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి స్పందిం చకపోవడంతో వీడియో ఫుటేజీలోని అంశాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా ప్రధాన పిటిషన్లో ప్రతివాదులు కాని ఆ 12 మందికి అప్పీల్ దాఖలు చేసే అర్హత లేదంటూ ప్రాథమిక దశలోనే కోర్టు దాన్ని కొట్టేసింది. మరోవైపు బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చినా అసెంబ్లీ దాన్ని అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి.శివశంకరరావు ప్రతివాదులుగా ఉన్న నర్సింహాచార్యులు, నిరంజన్‌రావులకు గత నెల 15వ తేదీన నోటీసులు జారీ చేశారు. విచారణను శుక్రవారానికి (జూలై 13వతేదీకి) వాయిదా వేశారు. కోమటిరెడ్డి, సంపత్‌లను సభకు అనుమతించడం లేదు విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారని, వకాలత్ కూడా దాఖలు చేశామని, గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కార్యదర్శి తరఫు న్యాయవాది సాయికృష్ణ శుక్రవారం కోర్టుకు నివేదించారు. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున అదనపు ఏజీ హోదాలో తాను హాజరవుతున్నట్లు జె.రామచంద్రరావు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను తొలుత ఆగస్టు 3కు వాయిదా వేశారు. ఈ సమయంలో కోమటిరెడ్డి, సంపత్‌ల న్యాయవాది స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి అమలు చేయలేదన్నారు. వారి పేర్లను శాసనసభ సభ్యుల జాబితాలో అప్లోడ్ చేయలేదన్నారు. వారిని సభలోకీ అనుమతించడం లేదన్నారు. దీంతో విచారణను 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజే పూర్తిస్థాయి విచారణ జరుపుతానన్నారు. -
కోర్టు ధిక్కరణపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ పెట్టిన కోర్టు ధిక్కరణ కేసుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని, లా సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. లా సెక్రటరీ తరుఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్, అసెంబ్లీ సెక్రటరీ తరుఫున సాయికృష్ణ కౌంటర్ దాఖలు చేయనున్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభా సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని పిటిషనర్ తరుపున న్యాయవాది వాదించారు. తీర్పు స్పష్టంగా ఉందని, ప్రభుత్వ సమాధానం చూసిన తర్వాత స్పందిస్తామని న్యాయమూర్తి జస్టిస్ బీ. శివశంకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన తమపై విధించిన బహిష్కరణ చట్ట విరుద్ధమంటూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సపత్ కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బహిష్కరణ చెల్లదని, వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోవడంతో మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌లు దాఖలుచేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. -
కోర్టు తీర్పును కావాలనే ఉల్లంఘించారు
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి ఆ తీర్పును పట్టించుకోవడం లేదు. ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వక ధిక్కారమే. కనుక వారిపై చర్యలు తీసుకోండి’’అని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యు లు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. తమ శాసనసభ్యత్వాలపై హైకోర్టు తీర్పు ఇచ్చినా అసెంబ్లీ కార్యదర్శి తమ సభ్యత్వాలను పునరుద్ధరించడం లేదని, ఇది కోర్టు ధిక్కారమేనన్నారు. ‘‘మమ్మల్ని బహిష్కరిస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని, మా అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. దానిపై 30 రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా చేయలేదు. దాంతో సింగిల్ జడ్జి తీర్పే అంతిమం. కేసుతో సంబంధం లేని 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయగా ధర్మాసనం అనుమతినివ్వలేదు. అప్పీల్ వేయాల్సింది అసెంబ్లీ కార్యదర్శేనని స్పష్టం చేసింది. ఆయన రాజకీయ కారణాలతో కావాలనే ఇప్పటిదాకా వేయలేదు. పైగా కోర్టు తీర్పునూ అమలు చేయలేదు. ఈ వ్యవ హారంలో అన్ని విషయాలూ న్యాయ శాఖ కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఎలాంటి నోటీసులూ జారీ చేయకుండానే వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలివ్వండి’’అని కోర్టును వారు కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం విచారించే అవకాశముంది. -
స్పీకర్, రేవంత్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్‌కు, రేవంత్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్‌ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను సముదాయించారు. -
‘రద్దు’పై మళ్లీ రగడ
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై మలిదశ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలవనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రతినిధుల బృందం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలసి వినతిపత్రం ఇవ్వనుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు రాష్ట్రపతిని కలవాలని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, త్వరలో నిర్వహించనున్న బస్సుయాత్రలోనూ ఈ అంశాన్ని ఫోకస్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సభ్యత్వాల రద్దుపై తొలిదశలో 48 గంటల దీక్షలతో పాటు గవర్నర్‌ను కలసి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైకోర్టునూ ఆశ్రయించారు. సభ్యత్వాల రద్దుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. రెండు సార్లు తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎమ్మెల్యేల విషయంలో పార్టీ పరంగా సరిగా స్పందించలేదని అంతర్గత చర్చల్లో అభిప్రాయపడిన నేపథ్యంలో మరో పోరాటానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారు. ఈ వారంలోనే ‘సుప్రీం’లో పిటిషన్.. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి కార్యాచరణను నేతలు అమలు చేయనున్నారు. స్పీకర్‌ను కలవడంతో పాటు ఏఐసీసీ పెద్దల ద్వారా రాష్ట్రపతిని కలసి విన్నవించే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే కబురు పంపారు. త్వరలోనే అపాయింట్మెంట్ లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతిని కలవడంతో పాటు కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు. ఈ మేరకు పార్టీ తరఫు న్యాయవాదులు కసరత్తు ప్రారంభించారు. ఈ వారంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. మూకుమ్మడి రాజీనామాలు..? న్యాయ, రాజ్యాంగపర ప్రయత్నాలతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించడం, బస్సుయాత్రలో నిర్వహించే సభల్లోనూ నొక్కి వక్కాణించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. ఖమ్మం, అలంపూర్‌లలో బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీలో చర్చ జరుగుతున్న విధంగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతారా.. వేచిచూడాల్సిందే! -
ధిక్కరణపై కోర్టుకు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. న్యాయ పోరాటం చేస్తూనే ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని, అనంతరం దశలవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్రపతిని సైతం కలవాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మార్పు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హెచ్చరిక తదితర పరిణామాలపై చర్చించారు. కోమటిరెడ్డిపై జానా సీరియస్ ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న కోమటిరెడ్డి డిమాండ్‌పై సీఎల్పీలో ప్రస్తావన వచ్చింది. బహిరంగ వేదికలపై తనపై ఎలా నిందలు వేస్తారని, ఇలా వ్యవహరించి పార్టీని పలుచన చేయరాదని కోమటిరెడ్డిపై జానా మందలింపు ధోరణితో అన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపైనా వాడివేడిగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించారు. సమ్మెకు దిగితే ఉద్యోగాలు ఊడుతాయంటూ సీఎం వ్యాఖ్యానించటం దురదృష్ణకరమని, ఈ విషయంలో కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మూకుమ్మడి రాజీనామాలపై చర్చే జరగలేదని సమావేశం అనంతరం మీడియాతో జానారెడ్డి స్పష్టం చేశారు. కోర్టులంటే సీఎంకు గౌరవం లేదు: ఉత్తమ్ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కోర్టుల పట్ల ప్రభుత్వానికి, స్పీకర్‌కు కనీస గౌరవంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. త్వరలోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖమ్మం, అలంపూర్‌లో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టి, తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భట్టి నివాసంలో మరో భేటీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. పార్టీ జిల్లాల అధ్యక్షులను పాత పది జిల్లాలకే ఉంచాలా లేదా 31 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలా అన్న అంశంపై చర్చ జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని, పార్టీ ఎజెండాను 8 నెలల ముందే జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమంలో పాల్గొన్న కార్మికులనే బెదిరిస్తారా: జీవన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైతే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించడం దురదృష్టకరమని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వ రాయితీలు ఇవ్వకుండా డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు విషయంలో డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయడాన్ని తప్పబడుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘ కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్‌లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన పేర్కొన్నారు. మా నాయకత్వం స్పందించలేదు మా సభ్యత్వాల రద్దు విషయంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి లకు చెప్పాను. మేము మా కోసం సభలో ఆందోళన చేయలేదు. అందరం రాజీనామా చేయాలి అనుకున్నాం. ఇప్పుడైనా.. రాజీనామాల మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నా. సీఎల్పీ నేతగా మమ్మల్ని కాపాడుకోవాలి. పార్టీ నాయకులతో చర్చించి అందరం రాజీనామా చేద్దాం. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు పట్టించుకోవటం లేదో వాళ్లనే అడగండి. -
టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో అధికార పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సభ్యుల బహిష్కరణ నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన శాసనసభకు సంబంధించినదని.. అది సభ మొత్తం కలసి తీసుకునే నిర్ణయమే తప్ప, ఏ సభ్యుడికీ వ్యక్తిగత హోదాలో అధికారంగానీ, హక్కుగానీ ఉండవని స్పష్టం చేసింది. అందువల్ల అప్పీలు దాఖలు చేయాల్సింది అసెంబ్లీ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం 58 పేజీల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు హెడ్‌ఫోన్ విసిరి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను గాయపరిచారం టూ.. అసెంబ్లీ తీర్మానం ద్వారా వారిని బహిష్కరించారు. అనంతరం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టుగా నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీనిపై వెంకటరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు.. బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు దాఖలు చేశారు. అయితే సింగిల్ జడ్జి విచారణ జరిపిన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలెవరూ ప్రతివాదులు కానందున.. నిబంధనల మేరకు అప్పీల్ దాఖలు కోసం తమకు అనుమతి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో వారి అప్పీలు దాఖలుకు అనుమతించాలా, వద్దా అన్న అంశంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించగా.. కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. గత నెల 2న వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. 58 పేజీల ఈ తీర్పులో శాసనసభ అధికారాలు, హక్కులు, అసాధారణ అధికారాల గురించి సవివరంగా చర్చించింది. అసెంబ్లీకి మాత్రమే అధికారం ఉంటుంది.. సభ్యుడి బహిష్కరణ నిర్ణయం శాసనసభ ఉమ్మడి నిర్ణయమని, దానిని న్యాయస్థానాన్ని రద్దు చేస్తే అసెంబ్లీ మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. బహిష్కరణకు అనుకూలంగా తాము ఓటు వేశాం కాబట్టి.. సింగిల్ జడ్జి తీర్పు వల్ల తాము ప్రభావితమవుతున్నామని, అందువల్ల తమకు అప్పీల్ దాఖలు చేసే హక్కు ఉందన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదన సరికాదని పేర్కొంది. ‘‘ఓ సభ్యుడిని బహిష్కరించాలా? వద్దా? అన్నది పూర్తిగా సభ పరిధిలోని వ్యవహారం. శాసనసభకు ఉండే హక్కులు, అధికారాలకు, సభ్యులకు ఉండే హక్కులు, అధికారాలకు మధ్య తేడా ఉంది. ఓ సభ్యుడిని బహిష్కరించే విషయంలో ప్రత్యేకాధికారాలు, హక్కులు శాసనసభకు మాత్రమే ఉన్నాయా? లేక దాని సభ్యులకు కూడా ఉన్నాయా? అన్నది ప్రధాన ప్రశ్న. అయితే ఏ రకంగా చూసినా.. ఓ సభ్యుడి బహిష్కరణ అన్నది సభ ఉమ్మడి నిర్ణయమే అవుతుందే తప్ప.. సభ్యుల వ్యక్తిగత హక్కుకు సంబంధించింది కాదు..’’.. అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాజ్యాంగంలోని అధికరణ 194 (4) ప్రకారం సభలో మాట్లాడే, సభ ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉన్న వారందరూ శాసనసభ సభ్యులే అవుతారన్న వాదనను ప్రస్తావించింది. ఆ లెక్కన అధికరణ 177 ప్రకారం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు సైతం (ఓటు హక్కు తప్ప) సభలో మాట్లాడే, ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే హక్కు ఉంటుందని.. కాబట్టి స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయనప్పుడు ఏజీకి అప్పీల్ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. వాస్తవానికైతే ఏజీ ఇలా అప్పీల్ దాఖలు చేయడానికి కూడా వీల్లేదని పేర్కొంది. స్పీకర్‌గానీ, కార్యదర్శిగానీ అప్పీల్ చేయాలి ప్రస్తుత వ్యవహారంలో 12 మంది ఎమ్మెల్యేలు సభ ఉమ్మడి నిర్ణయానికి మద్దతు తెలిపారని.. అయితే ఇలా మద్దతు తెలిపినవారి అప్పీల్‌ను అనుమతిస్తే, సభ నిర్ణయానికి మద్దతు తెలపని వారి అప్పీల్‌ను సైతం అనుమతించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘బహిష్కరణ తీర్మానాన్ని సభ్యులందరూ కలిసి చేసినప్పుడు, దానిని కోర్టు రద్దు చేస్తే.. సభే ప్రభావిత వ్యక్తి అవుతుంది. అంతేతప్ప కొందరు సభ్యులో, సభ్యుల బృందమో ప్రభావిత వ్యక్తి కిందకు రాదు. ఇలా సభ మొత్తంగా పరిగణనలోకి వచ్చినప్పుడు స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి మాత్రమే అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది..’’అని పేర్కొంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌పై 4న తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఏ సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా?వద్దా? అన్న అంశంపై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. సోమవారం ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ వెంకటరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ప్రొసీడింగ్స్‌ను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న తీర్పు ఇచ్చారు. జస్టిస్ శివశంకరరావు తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఎదుట దాఖలైన వ్యాజ్యంలో ఈ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు.. అందువల్ల సంబంధం లేని వ్యక్తులు అప్పీల్ దాఖలు చేయాలంటే కోర్టు అనుమతినివ్వాలి. ఈ నేపథ్యంలో వారు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అప్పీల్ దాఖలుకు అనుమతినివ్వాలా? లేదా? అన్న దానిపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, కోమటిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేయాలనడం సరికాదని, నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ కూడా అప్పీల్ దాఖలు చేయవచ్చని వైద్యనాథన్ వివరించారు. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ చేసిన తీర్మానంలో ఈ ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకున్నారని, సభా గౌరవాన్ని కాపాడేందుకు ఎవరైనా కోర్టుకు రావొచ్చన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సింఘ్వీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు. సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం ఉంటే అసెంబ్లీకి ఉండాలి కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉందని అప్పీల్ దాఖలు చేశారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం మే 2న తీర్పును వాయిదా వేసింది. -
శాసన సభ్యత్వాలు పునరుద్ధరించండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల శాసన సభ్య త్వాలను పునరుద్ధరించాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ లీగల్ మెమొరాండం ఇచ్చింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అన్యాయమని రాజ్యాంగాన్ని రక్షించే అన్ని సంస్థలను సంప్రదించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, శాసనసభ వెబ్సైట్లోనూ వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా చూపిస్తున్నారని, దీన్ని అధారంగా చేసుకుని వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. -
న్యాయం దక్కకపోతే ఆమరణ దీక్ష
సాక్షి, హైదరాబాద్ : తమపై అధికార పార్టీ, సీఎం కేసీఆర్ కక్షకట్టి హక్కులను హరిస్తున్నారని ఎమ్మెల్యే లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ ఆరోపించారు. తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా గన్‌మెన్‌ను కేటాయించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వినతి పత్రం అందించామన్నారు. గురువారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తూ ఇచ్చిన తీర్పుపై సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. తీర్పు వచ్చి 20 రోజులైనా తమకు గన్‌మెన్‌ను కేటాయించకపోవడం దారుణమన్నారు. పదవుల్లేని టీఆర్ఎస్ నేతలకు గన్‌మెన్‌ను ఇస్తున్నారని.. ఎమ్మెల్యేలమైన మాకు గన్‌మెన్‌ను అడిగితే సెక్యూరిటీ రివ్యూ కమిటీకి సూచి స్తామని డీజీపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం హత్యకేసుల్లో నిందితులని, వారిపై పోరాటం చేస్తున్న తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. న్యాయం దక్కకపోతే డీజీపీ, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీలపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని కోమటిరెడ్డి హెచ్చరించారు. అక్రమ కేసులు ఆపకపోతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని డీజీపీని కోరామన్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తమ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. -
తొలగించిన గన్మెన్లను పునరుద్ధరించండి
-
మాకు ప్రాణ హాని ఉంది : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌లు రాష్ట్ర డీజీపీను కోరారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆయన్ను కలుసుకున్నారు. హైకోర్టు తమను ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పునిచ్చిందని, ఉపసంహరించిన గన్మెన్లను తిరిగి ఇవ్వాలని కోరారు. కోర్టు తీర్పు తర్వాత సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారని, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా పోలీసులు కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు ఆపకపోతే జంతర్‌మంతర్ వద్ద రెండు, మూడు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఓ ఎమ్మెల్యేకు కల్పించే సదుపాయాలను ప్రభుత్వం తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రత కల్పించడంపై సెక్యూరిటీ కమిటీకి నివేదిస్తానని డీజీపీ చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్‌లు వెల్లడించారు. -
న్యాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో న్యాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది. తమ ఎమ్మెల్యేలను అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని, వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తీర్పు వచ్చి 20 రోజులవుతున్నా ప్రొటోకాల్, ఇతర హక్కుల విషయంలో శాసనసభ్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని గవర్నర్‌కు చెప్పారు. వెంటనే శాసనసభ్యుల హక్కులు కాపాడేలా ప్రభుత్వాధినేతగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలసిన వారిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, ముఖ్య నేతలు నాగం జనార్దనరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు ఉన్నారు. సానుకూల స్పందన: ఉత్తమ్ గవర్నర్‌ను కలసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో తాము అన్ని విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గవర్నర్ తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సీఎస్‌ను కలసి వినతిపత్రం ఆ తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్.జోషిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారదలతో కలసి సచివాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. కోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు. ఏమో.. నాకా చరిత్ర తెలియదు: కాంగ్రెస్ నేతలతో గవర్నర్ కాంగ్రెస్ నేతలు తనను కలసిన సందర్భంగా వారు చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ నరసింహన్ సావధానంగా విన్నారు. ‘తప్పకుండా పరిశీలిస్తాను’ అని పలుమార్లు కాంగ్రెస్ నేతలకు ఆయన చెప్పారు. అయితే, భేటీ చివర్లో గవర్నర్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భేటీ ముగిసే సమయంలో సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి గవర్నర్ దృష్టికి ఓ విషయం తీసుకువచ్చారు. 1952 నుంచి ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలా ఎమ్మెల్యేలను బహిష్కరించలేదని గవర్నర్‌కు జనార్దనరెడ్డి చెప్పారు. దీనికి స్పందించిన గవర్నర్ ‘ఏమో నాకు తెలియదు. నేను 1952లో ఏడో తరగతి చదువుతున్నా. ఆ చరిత్ర నాకెలా తెలుస్తుంది’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
హైకోర్టు తీర్పు అమలుకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ గవర్నర్‌ను కోరనుంది. వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ కోర్టు తీర్పునిచ్చి 20 రోజులవుతున్నా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కార్యనిర్వహక అధికారులను ఉపయోగించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంతోపాటు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు అసెంబ్లీ పక్షాన కానీ మళ్లీ కోర్టులో అప్పీల్ చేయలేదని, అలాంటప్పుడు తీర్పును ఆమోదించినట్టే అవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. అలాగే తమ పార్టీ ఇద్దరు శాసనసభ్యుల పేర్లను అసెంబ్లీ వెబ్సైట్లో ఎమ్మెల్యేలుగా చూపించడం లేదని, సీఎస్, డీజీపీ అధిపతులుగా ఉన్న శాఖల్లో ఆ ఇద్దరికీ కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారాలను ఉపయోగించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్టు చెప్పారు. -
నిలదీశారు... నిప్పులు చెరిగారు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం(సీఎల్పీ) గరంగరంగా సాగింది. రాష్ట్రంలో పార్టీ అధినేతల తీరుపై ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. పలు అంశాలపై వారి వ్యవహారశైలిని నిలదీశారు. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనే విషయం, పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన ఘటనలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో గంటన్నరపాటు సీఎల్పీ భేటీ జరిగింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం... ‘ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడలేకపోయారు. రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. కార్యకర్తల్లో ధైర్యం ఎలా నింపుతారు’ అని సంపత్ నిలదీశారు. ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్ లాంటి పెద్ద తలకాయలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేకపోయారని, పార్టీ నాయకత్వం తీరు మార్చుకోకపోతే కార్య కర్తల్లో నమ్మకం కోల్పోతామన్నారు. ‘మమ్మల్ని కాపాడలేకపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. ఇక, కార్యకర్తలను ఏం కాపాడతారు’ అని కూడా ఆయన అనడంతో సీఎల్పీ సమావేశం వేడెక్కింది. అయితే, ఉత్తమ్, జానా సర్దిచెప్పేందుకు యత్నించినా సంపత్ వ్యాఖ్య లకు మద్దతిస్తూ కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడటం గమనార్హం. నిలువరించలేక పోతున్నాం... సీఎం కేసీఆర్ అండ్ టీం యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా వారిని నిలు వరించడంలో విఫలమవుతున్నామని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగాల్లేవు, డబుల్బెడ్రూం ఇళ్లు లేవు. ఇసుక మాఫి యా చెలరేగిపోతోంది. ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్న దానిపై పునరాలోచన చేయాలి. యుద్ధం పకడ్బందీగా చేయకపోతే కేసీఆర్ లాంటి వ్యక్తిని ఎదుర్కోగలమా? ప్రెస్మీట్లు పెట్టి తూతూ మంత్రపు హెచ్చరికలు చేస్తే సరిపోతుందా? ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాల్సింది. తూతూమంత్రం కార్యక్రమాలతో ఏం సాధిస్తాం.?’అని పలువురు వ్యాఖ్యానిస్తూ నిలదీశారు. నన్నూ అవమానపర్చారు ప్రోటోకాల్ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయనే చర్చ సీఎల్పీ సమావేశంలో జరిగింది. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ తనను అవమానపర్చారని, సమాచారం సరిగా ఇవ్వకుండా నలు గురు మంత్రులు వచ్చి మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వెళ్లారని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని, కేసు అడ్మిట్ అయి ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిగినా పార్టీ పక్షాన ఎందుకు పట్టించుకోవడం లేదని పొంగులేటి ప్రశ్నించినట్టు సమాచారం. కొంతమందికి అసెంబ్లీకి వచ్చే వీలు లేకపోతే గాంధీభవన్‌లో సీఎల్పీ సమా వేశం పెట్టాల్సిందని, జానా నివాసంలో పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారని కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రైతాంగాన్ని కార్యకర్తలు ఆదుకోవాలి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావాలని సీఎల్పీ సమావేశం కోరింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రోటోకాల్ అమలు విషయంలో స్పీకర్ చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో తాము వేరే మార్గం వెతుక్కోవాలని సీఎల్పీ నిర్ణయించింది. జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్కతోపాటు జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, వంశీచందర్‌రెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ ఆకుల లలితలు పాల్గొన్నారు. అసంతృప్తితో అమెరికాకు కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో శాసనసభలో మైక్ విసిరేసిన ఘటనకు సంబంధించి తనతోపాటు మరో ఎమ్మెల్యే సంపత్‌ను బహిష్కరిస్తే టీపీసీసీ, సీఎల్పీ నామమాత్రంగానైనా పట్టించు కోకపోవడంపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకత్వాల తీరుకు నిరసనగానే ఆయన అమెరికా వెళ్లినట్లు సన్నిహితులు చెప్పారు. తమ గన్మెన్లను తొలగించినా ఉత్తమ్, జానారెడ్డి కనీసం పట్టించుకో లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్‌ను హతమార్చడం, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రౌడీలతో నల్లగొండలో రాజకీయం చేయాలని చూడటం వంటి పరిణామాల నేపథ్యంలో తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని కోమటిరెడ్డి ఆరోపించారు. -
అది కోమటిరెడ్డి, సంపత్‌ల ప్రచారం: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. తన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షాలు, పంట నష్టం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యం. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశాం. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళాం. ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పండి. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే. ఆయనతో మాట్లాడింది కూడా నేనే. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నాం. అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించా. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారు. పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమే. వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటాం.. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తాం. కాంగ్రెస్‌కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసు. గెలుస్తామని పోటీ పెట్టలేదు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుంది. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నా. తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉంది. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేది. అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు. పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరు. కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుంది. మా స్పిరిట్ కూడా అంతే. ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారు. నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు సీరియస్‌గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుంద’ని జానారెడ్డి పేర్కొన్నారు. -
ప్రజల్లో తిరుగలేకపోతున్నా: సంపత్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్, జీవన్‌రెడ్డి, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. సంపత్ అసహనం ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్ ఆవేదన చెందారని సమాచారం. సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యుల వద్ద ఆయన వాపోయారని చెబుతున్నారు. కనీసం గన్మెన్ల పునరుద్ధరణపై డీజీపీని కూడా కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్, డీజీపీ, చీఫ్ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని త్వరలో అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎల్పీ సమావేశం ఇంతవరకూ ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటరని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. -
కోమటిరెడ్డి కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ రద్దు తీర్పుపై అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతివ్వాలా, వద్దా అన్న అంశంపై వాదనలు ముగిశాయి. దీనిపై నిర్ణయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు. దాన్ని సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన వ్యాజ్యంలో వారు ప్రతివాదులు కాదు గనుక నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్‌కు అనుమతిపై ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున, అభిషేక్ మను సింఘ్వీ కోమటిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయాలడం సరికాదని బుధవారం వైద్యనాథన్ వాదించారు. -
ముగిసిన వాదనలు.. రిజర్వ్‌లో తీర్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. వేసవి సెలవుల అనంతరం తీర్పును వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై కోమటిరెడ్డి, సంపత్‌ల దాడి ఆరోపణలకు సంబంధించి వీడియోలు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదనలు ముగించగా, బుధవారం తదుపరి విచారణ కొనసాగించిన హైకోర్టు హైకోర్టు తీర్పు వెల్లడిని వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం? -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హతే లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ‘‘సంబంధం లేదని వ్యక్తుల అప్పీల్‌ను విచారించడం మొదలుపెడితే సంబంధం లేని ప్రతి ఒక్కరూ అసెంబ్లీ నిర్ణయానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఇలాంటి అప్పీల్లే దాఖలు చేస్తారు. బహిష్కరణ తీర్మా నం సభ నిర్ణయమంటున్నప్పుడు ఇలా అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరు అధికారమిచ్చారు? సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరముంటే అసెంబ్లీకి ఉండాలి. అప్పీల్ చేయాలంటే స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి చేయాలి. ఎమ్మెల్యేలకు ఏం సంబంధముందని అప్పీల్ చేశారు?’’అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్పీల్‌కు అనుమతినివ్వాలా, వద్దా అన్న అంశంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరో సారి విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గానీ, ప్రజాప్రయోజనాలకు గానీ ఎలాంటి నష్టమూ కలగలేదని కోమటిరెడ్డి తరఫున సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘ఈ వ్యవహారంలో తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నోటీసివ్వకుండా, ఎమ్మెల్యేల వాదన వినకుండా బహిష్కరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా, గవర్నర్ ప్రసంగం సభా కార్యక్రమాల కిందకు వస్తుందా వంటివి తేల్చాల్సి ఉంది. సింగిల్ జడ్జికి వీడియో పుటేజీ లివ్వలేదు. కానీ ఈ అప్పీల్‌కు మాత్రం ఫుటేజీని జత చేశారు. ఇవెక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ఈ ఫుటేజీలు అసెంబ్లీ కార్యదర్శి సర్టిఫై చేసినవి కావు’’అన్నారు. ఫుటేజీలను స్పీకర్ ద్వారా తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. చానళ్లలో వచ్చిన ఫుటేజీని జత చేశామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ బదులిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద దాఖ లైన వ్యాజ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదని సింఘ్వీ గుర్తు చేశారు. ‘‘ప్రతివాదులైన ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయకుండా మౌనం వహించారు. వీడియో ఫుటేజీ సమర్పిస్తానని సింగిల్ జడ్జి వద్ద వాదనల సందర్భంగా ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. బహిష్కరణవల్ల పిటిషనర్లు నష్టపోయారు. కాబట్టి అప్పీల్ దాఖలుకు అనుమతివ్వకుండా పిటిషన్‌ను కొట్టేయండి’’అని కోర్టును కోరారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
వాళ్లిద్దరికీ మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉంది
హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి కేవలం అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిలకు మాత్రమే పిటిషన్ వేసే అర్హత ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి, ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పష్టంగా పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనర్హత కేసులో ఎమ్మెల్యేలకు జోక్యం చేసుకునే హక్కు లేదని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్పీల్ వేసే అర్హత లేదన్నారు. ఇది పరిగణనలోకి తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ ప్రకారం శాసనసభ మాత్రమే పిటిషన్ వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పీకర్‌పై దాడికి సంబంధించి వీడియోలు సమర్పించడంతో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. అనర్హత కేసుకు సంబంధించి కాంగ్రెస్ తరపు న్యాయవాది వాదనలు ముగించారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. -
వివరణకు అవకాశం ఇవ్వాల్సింది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు బహిష్కరణ వంటి తీవ్ర శిక్షను విధించేటప్పుడు వివరణకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. వివరణ ఉంటే శిక్ష తీవ్రత తగ్గి ఉండేదేమోనని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కార కేసుల్లో కూడా నిందితుడికి నోటీసులిచ్చి వివరణ కోరతాం. ఆ సమయంలో తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేసే అవకాశముంటుంది. కానీ కోమటిరెడ్డి, సంపత్‌లకు ఆ అవకాశమే ఇవ్వలేదు’’అని పేర్కొంది. గత వాదనల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ప్రస్తావించిన తీర్పును ఉటంకిస్తూ, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆ తీర్పులోనే స్పష్టంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో వివరణ ఇవ్వలేదన్న విషయమే తమకు ప్రధానమని పేర్కొంది. బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసిన 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున వాదనలు ముగిసిన నేపథ్యంలో కోమటిరెడ్డి తదితరుల తరఫున వాదనల నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడినప్పుడు సభ్యుల హక్కులకు విలువ ఉంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. విపక్ష సభ్యులను బహిష్కరిస్తుంటే వారికున్న రక్షణలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా, స్పీకర్ అనర్హత వేటు వేస్తే దానిపై సభ్యులు న్యాయసమీక్ష కోరవచ్చన్నారు. సభా మర్యాదలకు భంగం కలిగించినప్పుడు సభ్యులను బహిష్కరించవచ్చని రాజారాంపాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సంపత్‌ను ఎందుకు బహిష్కరించారన్న ధర్మాసనం ప్రశ్నకు సూటిగా బదులివ్వలేదు. ఇయర్ ఫోన్ విసిరినట్లు వీడియో క్లిప్పింగుల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఆ విషయాన్ని బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాజ్యానికి విచారణార్హత లేదని కోమటిరెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో పలువురు ఫిరాయింపుదారులని, వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం రావాల్సి ఉందని అన్నారు. దానితో తమకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందా, లేదా అన్నదే కావాలని, ఆ దిశగా వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై విచారణ వాయిదా
-
వారికి ఏం రక్షణ ఉన్నట్లు?
సాక్షి, హైదరాబాద్ : ‘అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో ఉండటం అసౌకర్యంగా ఉందని భావించి, వారిని బహిష్కరిస్తుంటే, ఆ సభ్యులకు చట్ట ప్రకారం ఏం రక్షణ ఉన్నట్లు’అని హైకోర్టు ప్రశ్నించింది. కోమటిరెడ్డి బహిష్కరణకు మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్ విసరడం కారణమైనప్పుడు, సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారో చెప్పాలని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు సీనియర్ న్యాయవాదిని నిలదీసింది. ఈ రెండు విషయాలపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది. గురువారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ తీర్మానంతోపాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఈనెల 17న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతినివ్వాలా? వద్దా? అనే దానిపై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ తన వాదనలను వినిపిస్తూ, సభ ప్రతిష్టను దిగజార్చేలా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారిని బహిష్కరించే అధికారం సభకు ఉందని వివరించారు. బహిష్కరణకు సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణ 184(3) ప్రకారం సభకు కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకు ఉందని, ఆ మేరకే కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరించారని చెప్పారు. సింగిల్ జడ్జి తన తీర్పులో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బహిష్కరణ ఉందని చెప్పారే తప్ప, సభ్యుల అనుచిత ప్రవర్తన గురించి పట్టించుకోలేదని వివరించారు. మండలి చైర్మన్‌పై హెడ్‌ఫోన్ విసిరినట్లు కోమటిరెడ్డి, సంపత్ తమ పిటిషన్లోనే అంగీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ విషయాలను తీర్మానంలో ప్రస్తావించలేదు కదా? హెడ్‌ఫోన్ విసరడం వల్లే బహిష్కరించినట్లు ఎక్కడ పేర్కొన్నారు? అని ప్రశ్నించింది. హెడ్‌ఫోన్ విసిరి గాయపరిచిన ఘటనకు సభ మొత్తం సాక్ష్యమని, అలాంటి వాటికి కారణాలు వివరించాల్సిన అవసరం లేదని వైద్యనాథన్ తెలిపారు. దీనికి ధర్మాసనం.. కోమటిరెడ్డిని హెడ్‌ఫోన్ విసిరిన కారణంగా బహిష్కరించామంటున్నారు.. మరి సంపత్‌ను ఏ కారణంతో బహిష్కరించారని అడిగింది. దీనికి వైద్యనాథన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై తమకు స్పష్టతనివ్వాలని వైద్యనాథన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీల్ విచారణార్హతపై వాదనలు వినిపించాలని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కోమటిరెడ్డి న్యాయవాదిపై ఆగ్రహం వాదనలు ప్రారంభం కావడానికి ముందు కోమటిరెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ తీరును ధర్మాసనం తప్పుపట్టింది. సింగిల్ జడ్జి వద్ద కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫున ఒక్కరే అఫిడవిట్లు దాఖలు చేసి.. తమ ముందు మాత్రం వేర్వేరుగా దాఖలు చేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది అభ్యంతరం చెబితే, విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వైద్యనాథన్ స్పందించకపోవడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. -
కాంగ్రెస్ నేతల సభ్యత్వ రద్దుపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ రేపటికి( శుక్రవారం) వాయిదా పడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ జారీ చేసిన గెజిట్ నోటిషికేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లుబాటు కాదని, సదరు గెజిట్ నోటిషికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఇచ్చిన తీర్పును కోట్టేయాలని పిటిషనర్స్ తరపు న్యాయవాది వైద్యనాథన్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల తరపు అడ్వొకేట్ జంధ్యాల రవిశంకర్ కూడా తమ వాదనలు వినిపించారు. అప్పీళ్లకు వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలకు అర్హత ఉందా లేదా అన్నదానిపై వాదనలు వినిపిస్తారా అని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఏ సభ్యుడినైనా కారణం లేకుండానే రద్దు చేసే అధికారం ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ అధికారం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది వైద్యనాథన్ తెలిపారు. వీరు వీడియో కావాలని అడుగుతున్నారంటే... స్పీకర్‌పైకి హెడ్‌ఫోన్స్ విసిరినట్టు ఒప్పుకున్నట్లేనని వైద్యనాథన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సభ్యులకు రక్షణ పరంగా ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలపాలని ధర్మాసనం పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.