ఇప్పుడు చాలా మంది చాలా రకాల రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే సాటిమనిషికి సేవచేయడంలో రికార్డు సృష్టించేవారు అరుదే. అలాంటి అరుదైన వ్యక్తి నగరవాసి సంపత్ కుమార్.వందలసార్లు రక్తదానం చేయడం ద్వారా రికార్డు సృష్టించిన ఆయన అంతకు మించిన స్ఫూర్తినింపుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ఒక మనిషికి అత్యంత అవసరమై, ఒక మనిషి కృత్రిమంగా తయారు చేసుకోలేని జీవ పదార్థం ఏదైనా ఉంది అంటే అది రక్తం మాత్రమే. మనదేశంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రతీ సెకనుకు ఇద్దరు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ సేవకు సమాజంలో మార్పునకునిర్విరామ రక్తదాతగా మారి మరెంతో మందిని రక్తదాతలుగా మారుస్తున్నారు నగరవాసి సంపత్ కుమార్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
చలింపజేసినమృత్యువు..
ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన వ్యాపార కుటుంబంలో పుట్టి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా కొద్ది రోజులు చేసి ఇప్పుడు సిటీలో స్వంత బ్యూటీ పార్లర్ నిర్విహిస్తున్నా. ఇరవైఏళ్ల క్రితం గాంధీ హస్పిటల్‌లో సమయానికి రక్తం అందక ఓ రోగి చనిపోవడం చూసి చలించిపోయాను. ఆ మరునాడే రక్తదానం చేశా. కనీసం 18 నుండి 65 సంవత్సరాల వయస్సు కలిగి, ఆరోగ్యంగా ఉన్నప్రతీ వ్యక్తి 3 నెలలకు ఒకనారి రక్తం, 15 రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్స్ దానం చేయొచ్చు.. ఈ విధంగా సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్, 4 సార్లు రక్తం దానం చేయొచ్చునని తెలిశాక ఇప్పటికి 80 సార్లు రక్తదానం, 127 సార్లు ప్లేట్‌లెట్స్ దానం చేశా.
188 సార్లు రక్తదానం చేయొచ్చు
దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు ప్రతీ సంవత్సరం 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా కేవలం 40 లక్షలు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. రక్తదానం పై అపోహలు తొలగించడానికి సదస్సులు, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నా రక్తదానం వలన గుండెపోటు, కేన్సర్ బారిన పడే అవకాశాలు చాలా తగ్గుతాయనే విషయం సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దాతల రక్తాన్ని ప్రాజోన్ ప్లాస్మా, ర్యాండమ్ ప్లేట్‌లెట్స్, పాకెట్ సెల్స్ అనే 3 విభాగాలుగా విభజిస్తారు.
♦ ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను కాపాడగలదు. ఒక వ్యక్తి 47 సంవత్సరాల వ్యవధిలో (18–65 సంవత్సరాల మధ్య) 188 సార్లు రక్తదానం చేసి 564ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. తలసేమియా, కేన్సర్ కీమోథెరపీ, గుండె సర్జరీ, డెలివరీ సమయాల్లో... ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో రక్తం అవసరమవుతుంటుంది. గత 2008 నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో ప్రయాణం చేస్తూ అక్కడే 148 సార్లు రక్తదానం చేశా. రక్తదానం, నేత్రదానంకృషి చేస్తూ ఎన్నో కుటుంబాలకు మేలు చేసే బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవి తనను ‘‘నీ సేవలు వెల కట్టలేనివని’’ ప్రశంసించి తన కోసం ప్రత్యేకంగా బొకే పంనించడం ఎప్పటికీ మర్చిపోలేను.
రక్తదాతగా పలు రికార్డులు
♦ విశ్వగురు ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
♦ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
♦ ఫీచర్ అబ్దుల్ కలాం ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
♦ ఇండియన్ ప్రైడ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్.
♦ రక్త దానానికి సంబంధించి దేశంలోనే మొదటి డాక్టరేట్–తమిళ యూనివర్సిటీ.
Comments
Please login to add a commentAdd a comment