సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను మంగళవారం ఆమె రాజ్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లు బ్లడ్ డోనర్ వద్దకే వెళ్లి రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతా యని, దాతలు కూడా ముందుకు వస్తారని తెలిపారు.
ఈ నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రెడ్‌క్రాస్ ప్రతిని«దులకు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ రెడ్‌క్రాస్ చైర్మన్ అజయ్‌మిశ్రా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment