Blood Donation Camp
-
స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్ మరియు మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్థానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. అయితే సాటి ఇతర భారతీయ మూలాలు కలిగిన స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించిందని పాలెపు మల్లిక్ గుర్తు చేశారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు.(చదవండి: ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్) -
మీకు తెలుసా? కుక్కలు కూడా రక్తదానం చేయగలవు!
రక్తదానం చేసి ఇతర కుక్కల ప్రాణాలను కాపాడిన ఇలాంటి కుక్కలు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఉన్నాయని మీకు తెలుసా?. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన జంతు ప్రదర్శన పెటెక్స్, హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ముగిసింది. డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు బోబీ చౌహాన్ పెట్టింగ్ మ్యాటర్స్, డాగ్ స్పెషలిస్ట్ కంపెనీ ఈ సందర్భంగా గుర్తించబడింది. అలాగే ఈ డ్రైవ్‌లో రక్తదానం చేసినందుకు అనేక కుక్కలు వాటి యజమానులను కూడా సత్కరించారు. మనుషులు మాదిరిగానే కుక్కలు కూడా..! బాబ్బీ చౌహాన్ ప్రకారం, కుక్కలు, పిల్లులు మనుషుల మాదిరిగానే రక్తదానం చేయవచ్చు. నగరంలో గత ఐదేళ్లలో దాదాపు 200 రక్తదానాలు నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు, పెంపుడు కుక్కలను పెంచుకుంటున్న వారిలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. కుక్కలు ప్రతి మూడు నెలలకొకసారి మనుషుల మాదిరిగా రక్తదానం చేయవచ్చు. వీటికి 12 బ్లడ్ గ్రూపులు, 11 క్రాస్ మ్యాచింగ్ గ్రూపులు ఉన్నాయి. నగరంలో కుక్క లేదా కుక్కల బ్లడ్ బ్యాంక్ లేదని ఆయన అన్నారు. పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు రక్తదానం చేయడానికి, ఇతర కుక్కలను రక్షించడానికి సిద్ధంగా ఉంటే డాగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆలోచనతో రోస్టియన్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అంతేగాదు వారు నిహిత్ మెషిన్ ఆవిష్కరించారు. ఇది కుక్కలా ఆహరం విక్రయించే వెండింగ్ మెషీన్. ఇది ఉపయోగించిన లేదా వేస్ట్ నీటి బాటిళ్లను తీసుకుంటుంది. ముఖ్యంగా ఇది వీధి కుక్కల ప్రయోజనం కోసం పెంపుడు జంతువుల ఆహారాన్ని అందించడమే గాక రెండు సమస్యలను పరిష్కరిస్తుంది. ఒకటి ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను బాధ్యతాయుతంగా పారవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే అదే సమయంలో ప్లాస్టిక్ సమస్యకు చెక్‌పెడుతుంది. ఈ యంత్రాన్ని ఎక్స్‌పోలో ప్రదర్శించారు. Pawstive మార్పు తీసుకొద్దాం. అలాగే వెండింగ్ మిషన్‌తో భూమిని కలుషితం కాకుండా చూద్దాం అని వ్యవస్థాపకుడు నొక్కి చెప్పారు. (చదవండి: అరుదుగా కనిపించే భారీ నిమ్మకాయలు.. చూసేందుకు క్యూ కడుతున్న జనాలు!) -
వందలమందికి ప్రాణంపోసిన ‘రక్తవీర్’
బీహార్‌లోని సుపౌల్‌కు చెందిన ఒక యువకుడు రక్తదాతలకు స్ఫూర్తిదాయకునిగా నిలుస్తున్నాడు. ఈ యువకుని చొరవతో ఇప్పటివరకు 1,100 మంది ప్రాణాలు నిలిచాయి. వివిధ సామాజిక సంస్థలు ఆ యువకుడిని సన్మానించాయి. ఈ కుర్రాడి పేరు అవినాష్ కుమార్ అమర్ అలియాస్ లోలప్ ఠాకూర్(28). ఇప్పటి వరకు అవినాష్ 330 లీటర్ల రక్తాన్ని తమ సంస్థ ద్వారా దానం చేశాడు. నగరంలో ఎవరికి రక్తం కావాలన్నా అందరికీ ముందుగా అవినాష్ పేరు గుర్తుకువస్తుందని స్థానికులు చెబుతుంటారు. మూడేళ్ల క్రితం 2019 ఆగస్టు నెలలో తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు, అతనిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో తనకు తొలిసారిగా రక్తదానం చేయాలనే ఆలోచన వచ్చిందని అవినాష్ తెలిపారు. తరువాత అవినాష్ తన స్నేహితులతో కలిసి ఓ రక్తదాన సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ‘రక్తవీర్ గ్రూప్’ అని పేరు పెట్టారు. ఈ గ్రూప్ 2019 నుండి అవసరమైనవారికి రక్తం అందిస్తూ వస్తోంది. ఈ విషయం చాలామందికి తెలియడంతో వారంతా అవినాష్ మొదలు పెట్టిన సంస్థ ద్వారా రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు. తమ సంస్థకు సోషల్ మీడియా ఒక వరంలా మారిందని అవినాష్ తెలిపారు. తమ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చాలమంది చేరారని, వారంతా రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా తమ సంస్థకు అండగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి -
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
-
చర్మ దాత సుఖీభవ
నేత్రదానం, రక్తదానం గురించి అందరికీ తెలుసు కానీ చర్మదానం గురించి తెలిసింది తక్కువే. కానీ నానాటికీ విస్తరిస్తున్న వైద్యరంగంలో చర్మం ప్రాధాన్యత ఎనలేనిది. మంచి చర్మం ఆరోగ్యానికి సూచిక. అలాగే కాలిన గాయాలు, ప్రమాదాలు, జబ్బుల వల్ల అనేకమంది రోగులకు కొత్త చర్మం అవసరమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు రాజధానిలోని విక్టోరియా ఆస్పత్రిలోని స్కిన్‌బ్యాంకు కొంతమేర ఆదుకుంటోంది. కర్ణాటక: రాష్ట్రంలో ప్రప్రథమంగా చర్మ నిధి (స్కిన్ బ్యాంక్) ప్రారంభమైన ఏడేళ్లలో దాతల సంఖ్య 200 కు చేరుకుంది. అయినప్పటికీ చర్మదానం గురించి సమాజంలో అవగాహన లోపించినందున దాతల సంఖ్య పెరగడం లేదు. బెంగళూరు వైద్య పరిశోధనా సంస్థ (బీఎంసీఆర్‌ఐ) ఆధ్వర్యంలోని విక్టోరియా ఆసుపత్రిలో రోటరీ ఆశీర్వాద్ సంయుక్త ఆధ్వర్యంలో 2016లో చర్మనిధి ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు 197 మంది దాతలనుంచి త్వచాన్ని సేకరించారు. ప్రమాదాలు, జబ్బులకు గురైనవారికి చికిత్సకోసం చర్మానికి అధిక డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వినతులు కర్ణాటక మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఇంకా పలు రాష్ట్రాల నుంచి చర్మం కావాలని ఈ కేంద్రానికి వినతులు వస్తుంటాయి. కానీ అందులో 60 శాతం మాత్రమే సరఫరా సాధ్యమైందని తెలిపారు. కాలిన ప్రమాదాలలో గాయపడినవారికి స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సకు చర్మం అవసరమని బీఎంసీఆర్‌ఐ ప్లాస్టిక్ సర్జరీ విభాగం చీఫ్ కేటీ.రమేశ్ తెలిపారు. ప్రస్తుతం చర్మ నిధిలో 12 వేల చదరపు సెంటీమీటర్ల చర్మం నిల్వలు ఉన్నాయి. చర్మదానం గురించి ప్రజల్లో జాగృతం చేయడానికి సోషల్ మీడియా ప్రచారం సహా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలను సందర్శించి వివరిస్తున్నామని తెలిపారు. చర్మదానానికి ఎందుకు వెనుకంజ ప్రజలు నేత్రదానం, ఇతర అవయవ దానం చేయడానికి ప్రమాణపత్రం ఇస్తారు. ఉత్సాహంగా రక్తదానం చేస్తారు. కానీ చర్మదానం చేయడం లేదని వైద్యులు తెలిపారు. చర్మం తీయడం బాధాకరంగా ఉంటుంది, శస్త్రచికిత్స చేస్తారు వంటి అపోహలే ఇందుకు కారణమన్నారు. చర్మదానం అంటే శరీర భాగమంతా చర్మం తీసుకోరు. తొడలు, కాళ్ల నుంచి కొన్ని సెంటీమీటర్ల చర్మం పొరను మాత్రమే తీసుకుంటారు. ఏర్పడిన చిన్నపాటి కోత త్వరలోనే మానిపోతుంది. కాలిన బాధితులకు కావాలి విక్టోరియా ఆసుపత్రిలో మహాబోధి కాలిన గాయాల వార్డులో అనేకమంది రోగులకు చర్మం అవసరం పడుతూ ఉంటుంది. ప్రతి నెల ఇక్కడ 220 మంది కాలిన గాయాలతో చేరుతుండగా వారిలో 70 శాతం కేసులు తీవ్రంగా ఉంటాయి. దీంతో ఎక్కువశాతం వీరి అవసరాలకే చాలడం లేదు. ఆరోగ్యవంతులు ఎవరైనా చర్మాన్ని ధారపోయవచ్చు. విరివిగా చర్మదానం చేయడం వల్ల ఎంతోమంది క్షతగాత్రుల జీవితాలకు సాయం చేసినట్లు అవుతుంది. దాతల్లో హెచ్చుతగ్గులు చర్మనిధికి 2016లో 18 మంది దాతలు రాగా, 2017లో 40 కి పెరిగింది. కానీ మళ్లీ తగ్గిపోయింది. 2018లో 33 మంది దాతలు ఉండగా ఆపై 17కు పడిపోయింది. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో 9 మంది మాత్రమే చర్మదానం చేశారు. 2021 నాటికి 18కి, 2022లో 40 కి పెరిగింది. ఈ ఏడాదిలో 22 మంది నుంచి చర్మం స్వీకరించారు. అలాగే 44 మంది రోగుల కోసం చర్మాన్ని పంపారు. ఇప్పటివరకు 310 మంది నుంచి వినతి వస్తే 194 మందికి మాత్రం సరఫరా చేశారు. వీరిలో నాలుగేళ్ల బాలుర నుంచి 85 ఏళ్లు వృద్ధుల వరకూ ఉన్నారు. అలాగే దాతల్లో 17 ఏళ్లు యువకుని నుంచి 98 ఏళ్లు వృద్ధుని వరకు 197 మంది దానం చేశారని చర్మనిధి పర్యవేక్షకుడు బీఎన్.నాగరాజ్ తెలిపారు. -
ఒకేరోజు.. ఒకే చోట.. 6,166 యూనిట్ల రక్తదానం
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు. -
Chetana Parikh: రక్తదాతకు వందనం
ఇన్ని కోట్ల మంది ఉన్న మనదేశంలో 100 సార్లు రక్తదానం చేసినవారు కేవలం 125 మంది ఉన్నారు. వీరిలో స్త్రీలు ఇద్దరే ఉండగా మూడవ వ్యక్తిగా అహ్మదాబాద్‌కు చెందిన చేతన పారిఖ్ నిలిచింది. అక్టోబర్ 1న వందోసారి రక్తదానం చేయడం ద్వారా ఆమె ఈ ఘనత సొంతం చేసుకుంది. రక్తదాన అవసరాన్ని ప్రచారం చేయడమే కాక అనితరసాధ్యంగా పాటిస్తున్న చేతన పరిచయం. అక్టోబర్ 1, ఆదివారం, అహ్మదాబాద్‌లోని జె.ఎల్.ఠాకూర్ రెడ్‌క్రాస్ భవన్. ‘నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే’ సందర్భంగా రెడ్‌క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. అందరూ 58 ఏళ్ల చేతన పారిఖ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపటికి ఆమె వచ్చింది. రక్తం ఇవ్వడానికి అలవాటుగా చేతిని ముందుకు సాచింది. మెడికల్ స్టాఫ్ ఆమె చేతిలో సూది గుచ్చారు. ఆమె ఒంటి నుంచి రక్తం సాచెట్ వైపు ప్రవహించసాగింది. అంతే. అందరూ చప్పట్లు హోరెత్తించారు. ఎందుకంటే ఆ రోజుతో ఆమె అలా రక్తాన్ని ఇవ్వడం వందోసారి. మన దేశంలో దశాబ్దాలుగా రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల్లో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు స్త్రీలే నూరుసార్లు రక్తం ఇచ్చారు. చేతన పారిఖ్ మూడో వ్యక్తి. కాలేజీ రోజుల నుంచి అమ్మమ్మ వయసు వరకూ ఆమె ఎప్పుడూ రక్తదానం చేస్తూనే ఉంది. ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను అంటోంది. 1985లో మొదటిసారి చేతన పారిఖ్ అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగింది. నగరంలోని కలుపూర్ కాలేజీలో చదువుకుంది. ‘అది 1985వ సంవత్సరం. మా కాలేజీకి రెడ్ క్రాస్ వాళ్లు వచ్చి రక్తం ఇమ్మని అభ్యర్థించారు. అప్పటికి రక్తదాన ఉద్యమం ఊపందుకోలేదు. చాలా అపోహలు ఉండేవి. కొద్దిమంది అబ్బాయిలు ముందుకొచ్చారు. నేను, ఇంకో అమ్మాయి మాత్రమే రక్తం ఇచ్చాం. మా ఇంటిలో ఇది తెలిసి చాలా ఆందోళన చెందారు. రక్తం ఇవ్వడం వల్ల శరీరానికి నష్టం అనుకునేవారు ఆ రోజుల్లో. కాని రక్తం అందక చాలా మంది మరణిస్తున్నారని అప్పటికే నాకు తెలుసు. ఇది చేయదగ్గ మంచి పని అనిపించింది. అప్పటి నుంచి రక్తం ఇస్తూనే ఉన్నాను’ అంటుంది చేతన పారిఖ్. కుటుంబంతో ఉద్యమం చేతన భర్త వినిత్ పారిఖ్ సాదాసీదా డాక్టర్. పెళ్లయ్యాక చేతన తన భర్తను రక్తదానం వైపు ప్రోత్సహించింది. ఒక డాక్టర్‌గా రక్తదానం ఎంత అవసరమో తెలియడం వల్ల వినిత్ కూడా భార్య నుంచి స్ఫూర్తి పొందాడు. ఇద్దరూ కలిసి రెడ్ క్రాస్‌లో చేరారు. ఒకరికి చెప్పడమే కాదు తాము క్రమం తప్పకుండా రక్తదానం ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ‘నా భర్త వినిత్ నా కంటే ముందే నూరుసార్లు రక్తం ఇచ్చినవాళ్ల లిస్ట్‌లోకి ఎక్కారు. నేను తాజాగా ఆ లిస్ట్‌లో చేరాను. మనం చేసి చూపిస్తే మిగిలినవారు అందుకుంటారు. నా కొడుకు హన్షిల్, నా కుమార్తె మేహ ఇద్దరూ డాక్టర్లే. వారు కూడా మాతో కలిసి రక్తదానం చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ఇప్పటికి చెరో ముప్పైసార్లు రక్తం ఇచ్చారు. ఇలా మా కుటుంబంలోని నలుగురు సభ్యులం కలిసి మొత్తం 260 సార్లు రక్తం ఇచ్చాం. ఇన్నిసార్లు ఇచ్చిన మరో కుటుంబం లేదేమో మన దేశంలో’ అంటుంది చేతన. పెళ్లిలో వినూత్నం చేతన రక్తదానం కోసం ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. కూతురు పెళ్లిలో ఆమె రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. అందులో పెళ్లికొడుకు స్వయంగా రక్తం ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన బంధుజనుల్లో చాలామంది రక్తం ఇవ్వగా 58 యూనిట్ల సేకరణ జరిగింది. ‘రక్తం విలువ సరిగ్గా అది అవసరమైనప్పుడు తెలుస్తుంది. రక్తం ల్యాబ్‌లో తయారు కాదు. మనిషే ఇవ్వాలి. అందుకు మానవత్వం ఉండాలి. మన మానవత్వం నిరూపించుకోవడానికి రక్తదానానికి మించిన మార్గం లేదు’ అంటుంది చేతన. ఒక గృహిణిగా ఉంటూనే ఆమె చేస్తున్న ఈ విశిష్ట ప్రచారం, సేవ ఒక్కరికైనా స్ఫూర్తి కలిగిస్తే అంతే చాలు. -
బ్లడ్ డొనేషన్ పేరుతోనూ మోసాలు!
హైదరాబాద్: రక్తం, ప్లాస్మా వంటివి అత్యవసరమైన వారిని సంప్రదించి, వారి నుంచి కొంత మొత్తం తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ ఆ«దీనంలోని వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ శిల్పవల్లి శుక్రవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆరి్థక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. 2020లో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచి్చన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కొవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని బెట్టింగ్‌లతో పెట్టేవాడని డీసీపీ తెలిపారు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాజాగా మరోసారి సోషల్‌మీడియా వేదికగా బ్లడ్, ప్లాస్మా డొనేషన్ పేరుతో మోసాలు ప్రారంభించిన అతడిపై దోమలగూడ ఠాణాలో కేసు నమోదు కావడంతో వాంటెడ్‌గా మారాడు. సీసీఎస్‌లోని వెస్ట్‌జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ డి.భిక్షపతి నేతృత్వంలోని బృందం శుక్రవారం పట్టుకుంది. -
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఎస్ఏలో రక్తదానం
దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి(సెప్టెంబర్2) సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సీర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 14వ వర్ధంతి పాటు అమెరికాలో 9/11 విషాదకర ఘటనను తలచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఇక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు టీ షర్ట్ లు అందజేశారు. కాగా 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. 9/11 Attack ఘటన జరిగి 22 ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ 14వ వర్థంతి: డాలస్‌లో రక్తదాన శిబిరం
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలోని డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్‌లో బ్లెడ్ డ్రైవ్ నిర్వహించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ సభ్యులు తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు. (చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!) -
వైఎస్సార్ 14వ వర్థంతి: న్యూజిలాండ్‌లో రక్తదాన శిబిరం
సెప్టెంబర్ 2, రోజులానే తెల్లారింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమిత్తం అయ్యి ఉన్నారు. కొద్దిసేపటికే వైయస్సార్ గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయ్యిందని వార్తలు. జనాల్లో ఆందోళన ఎక్కడో ఒక చోట వాతావరణం అనుకూలించక ల్యాండ్ అయ్యి ఉంటుంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఏమి కాదు ఇంత మంది జనహృదయాల్లో నిలిచిన రాజశేఖర్ రెడ్డికి ఏమి కాదన్న భరోసా ఒకవైపు. నల్లమల కొండల్లో వెతుకులాట కోసం వేలాది జనాలు మంది వెళ్లారు. చివరికి నేవి హెలికాప్టర్ల గాలింపులో సెప్టెంబర్ 3న ఆచూకీ తెల్సింది కానీ.. అభిమానుల గుండె పగిలింది. చరిత్రలో సెప్టెంబర్ 2, 3 అలా చెరగని గుర్తు వేశాయి. పెద్దాయన అంత్యక్రియలకు దారులన్ని మూసుకుపోయాయి. అభిమానం పోటెత్తింది. కడసారి చూపు కోసం రోదించింది. గొంతు మూగబోయింది, మాకు దిక్కెవరని కన్నీరు పెట్టనివారు లేరు. అందుకే దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు.. ఆయన్ను స్మరించుకుంటూనే ఉంటారు. ఆ మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నివాళులు అర్పించింది. శనివారం సెప్టెంబర్ 2వ తేదీన ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు బుజ్జిబాబు(కన్వీనర్), ఆనంద్ ఎద్దుల(రీజినల్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం న్యూజిలాండ్‌లో ఆక్లాండ్‌లోని వెస్టీ కమ్యూనిటీ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ ఎద్దుల, సుస్మిత చిన్నమల్రెడ్డి, సమంత్ డేగపూడి, ప్రభాకర్ వాసిపల్లి, విజయ్ అల్లా, పవన్ రెడ్డిచెర్ల, ప్రణవ్ అన్నమరాజు, ఆరోన్ శామ్యూల్ తదితర ఎన్నారైలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్ వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం సభ్యుల కృషిని ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ బాబు, శ్రీకాహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఏపీ ఎన్నారై సొసైటీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి, తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, ఏపీ ప్రెస్ అకాడమీ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ తదితరులంతా అభినందించారు. ఒక మనిషి మరణం ఎంతో మందిని చీకట్లోకి నెట్టివేసింది. బహుశా ఇవాళ్టికి కూడా చాలా మంది ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే అది ఆయన చేసిన పరిపాలన, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం. డబ్బు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం అని చేతల్లో నిరూపించిన నాయకుడు వైఎస్సార్. ఇంకో 100 ఏళ్ళు అయిన రాజశేఖర్ రెడ్డి మాత్రం మరువలేరేమో. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగపూర్‌లో రక్తదాన కార్యక్రమం
భారత స్వాతంత్య్ర దినోత్సవం, సింగపూర్ జాతీయ దినోత్సవం(ఆగస్టు9)ను పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సహకారంతో సింగపూర్‌లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. HSA ఔట్రం రోడ్,కొత్తగా ఏర్పాటైన వన్ పుంగోల్‌లో ఏకకాలంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 75మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు.కుంకు వరలక్ష్మి-నాగేశ్వరరావు అనే దంపతులిద్దరూ రక్తదానంలో పాల్గొని అందరికి స్ఫూర్తిగా నిలిచారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం గురించి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ రక్తదానం చేయాలని, దీనివల్ల మరింత ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. గత ఏళ్లుగా వరుసగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎవరైనా రక్తం కావాలని సహాయం అడిగితే వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి కార్యక్రమం 29 అక్టోబర్ 2023న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్ అమర్‌రహే
సాక్షి, అమరావతి: పరిపాలనలో మానవత్వాన్ని జోడించి ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచి, పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్‌రహే’’ అంటూ వాడవాడనా నినదించారు. ప్రజలు మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. గ్రామగ్రామాన కేక్‌లు కట్ చేసి.. పేదలకు వస్త్ర, అన్నదానం చేశారు. భారీ ఎత్తున రక్తదానం చేసి మహానేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహా దేశంలో పలు రాష్ట్రాల్లో అభిమానులు, ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. మీ పథకాలు మరువలేనివి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యేలు పూల మాల వేసి నివాళులర్పించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో అభిమానులు కేక్ కట్ చేశారు. పెడన, గుడివాడ పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు జోగి రమేశ్, విడదల రజిని పాల్గొన్నారు. ఏలూరు జిల్లా గుండుగొలనులోని మెగా జగనన్న హౌసింగ్ కాలనీ ద్వారం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, చీరాల, యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి జయంతి వేడుకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. పల్నాడులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, బాపట్లలో మేరుగ నాగార్జున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఊరూరా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, రైతులకు ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేసి తమ మనసుల్లో వైఎస్సార్ గుర్తుండిపోయారని ప్రజలు, అభిమానులు కొనియాడారు. గుండెల్లో కొలువైన నేతకు జన నీరాజనం ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీచేశారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. తమ గుండెల్లో కొలువైన జననేత వైఎస్సార్ జయంతి వేడుకలను ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్వతీపురంలో వైఎస్సార్ విగ్రహానికి వేలాది మంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి పీడిక రాజన్నదొర సాలూరులో, విజయనగరంలో వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కోరుకొండలో రక్తదానశిబిరాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ బులుసు సాంబమూర్తి పాఠశాలలో పార్టీ, నాయకులు, కార్యకర్తలు, అన్న, వస్త్రదానం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు.. ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎన్నారైలు, ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర 17 దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు మహానేత వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రానికి, దేశానికి మహానేత వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సేవా మార్గంలో జయంతి వేడుకలు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్నదానం, రక్తదానం, వస్త్రదానం తదితర సేవామార్గాల్లో నిర్వహించారు. గంగాధరనెల్లూరు మండలం వెజు్జపల్లెలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో, నగరి మండలంలోని బుగ్గ అగ్రహారంలో మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, పుంగనూరులో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ జయంతి ఉత్సవాలు ఆయన సొంత జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కడపలో హెడ్ పోసా్టఫీసు వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా క్షీరాభిషేకం చేశారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
ధీరూభాయ్ అంబానీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. -
రక్తదానం జీవన దానమే!
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: రక్తదానాన్ని ప్రోత్సహించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, దీనిపై అపోహలను తొలగించి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రక్తదానం అంటే జీవన దానమే అని స్పష్టం చేశారు. కృత్రిమ శ్వాస పరిజ్ఞానం (సీపీఆర్) పట్ల ప్రజల్లో విస్తృత అవగావన కల్పించాలన్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసై టీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఏటా ఒకసారైనా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె 50సార్లకుపైగా రక్తదానం చేసిన దాతలు, అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను టీసీఎస్, ఎస్బీఐ స్టాఫ్ కళాశాల, ఉస్మానియావర్సిటీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ, నిజామాబాద్ యూనిట్లు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను పొందడాన్ని అభినందిస్తూ ఇందుకు కృషి చేసిన స్థానిక ప్రతినిధులు డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్, బుస్సా అంజన్నకు సైతం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 139 సార్లు రక్తదానం చేసిన అంజయ్య, 50 సార్లు రక్తదానం చేసిన అతడి భార్య పి.మనోరమతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కుర్రె సిద్ధార్్థ, శ్రీలేఖ, మరో పీజీ వైద్య విద్యార్థిని ఈ కార్యక్రమంలో రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ తెలంగాణ చైర్మన్ అజయ్‌మిశ్రా, వైస్ చైర్మన్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో ఎన్ఐఆర్డీ, పీఆర్ సీనియర్ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరుల మ్యాపింగ్‌తోపాటు వాటి నిర్వహణ, పునరుజ్జీవనానికి ప్రాధాన్యతతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కష్టసాధ్యంగా మారుతున్నందున ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా ఈ–మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే దిశలో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. -
సులభమైన మార్గం.. మీకు కూడా మంచిదే: మెగాస్టార్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడటానికి, మానవాళికి తోడ్పడటానికి సులభమైన, సమర్థవంతమైన, ఖర్చులేని మార్గం రక్తదానమని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉటామని సూచించారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) రక్తదాతలైన సోదర, సోదరిమణులకు రక్త దానంలోపాల్గొనేలా అవగాహన కల్పించేవారికి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరికీ సంతోషాన్ని కోరుకుంటున్నానని ట్వీట్లో ప్రస్తావించారు. The simplest, effective, no cost way to save lives and contribute to humanity. And guess what .. this is one donation that makes us healthier too !! Donate Blood & Save Lives!! Wishing everyone a Happy #WorldBloodDonorsDay ! And More power to all my Blood Brothers / Blood… pic.twitter.com/8Fqb0dt5jK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2023 -
ప్రాణం నిలిపే రక్తపు బొట్టు
రక్తపు బొట్టు... ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ రక్తం సమయానికి అందకపోతే... ప్రాణాన్ని నిలపగలిగే డాక్టర్ కూడా అచేతనం కావాల్సిందే. శిబి చక్రవర్తిలా దేహాన్ని కోసి ఇవ్వాల్సిన పనిలేదు. కొంత రక్తాన్ని పంచి మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రక్తదానానికి మగవాళ్లతోపాటు మహిళలూ ముందుకొస్తున్నారు. మహిళలు రక్తదానం చేయరాదనే అపోహను తుడిచేస్తున్నారు. రక్తదానం చేస్తూ... సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్న ఓ మెడికో... ఓ సోషల్ యాక్టివిస్ట్‌ల పరిచయం ఇది. నాన్న మాట... యాభై సార్లు రక్తదానం చేయాలనే సంకల్పం కూడా మా నాన్న చెప్పిన మాటే. రక్తదానం చేయగలిగింది ఇరవై నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే. అరవై తర్వాత రక్తదానం చేయడానికి ఆరోగ్యరీత్యా నిబంధనలు ఒప్పుకోవు. వీటికి తోడు ఆడవాళ్లకు ప్రసవాలు, పిల్లల పెంపకంలో మరో పదేళ్లు గడిచిపోతాయి. 35 నుంచి విధిగా రక్తదానం చేస్తూ యాభై సార్లు రక్తం ఇవ్వాలనే నియమాన్ని పెట్టుకోవాలనేవారు. ఆ లక్ష్యంతోనే యాభై రక్తదానాలు పూర్తి చేశాను. ఆ తర్వాత మా అమ్మకోసం మా తమ్ముడితోపాటు నేనూ రక్తం ఇచ్చాను కానీ దానిని ఈ లెక్కలో చెప్పుకోను. అమ్మరుణం ఏమిచ్చినా తీరేది కాదు. – గొట్టిపాటి నిర్మలమ్మ, రక్తదాత మా పుట్టిల్లు నెల్లూరు నగరం (ఆంధ్రప్రదేశ్). మా చిన్నాన్న జయరామనాయుడు డాక్టర్. ‘రక్తం అంది ఉంటే ప్రాణాన్ని కాపాడగలిగేవాళ్లం’ అని అనేకసార్లు ఆవేదన చెందేవారు. ఇంట్లో అందరినీ రక్తదానం పట్ల చైతన్యవంతం చేశారాయన. దాంతో మా నాన్న నెల్లూరులో రెడ్‌క్రాస్, బ్లడ్‌బ్యాంకు స్థాపించారు. ఇంట్లో అందరం రక్తదానం చేశాం. అలా నేను తొలిసారి బ్లడ్ డొనేట్ చేసినప్పటికి నా వయసు 20. మామగారి ప్రోత్సాహం పెళ్లికి ముందు నెల్లూరులో మొదలైన రక్తదాన ఉద్యమాన్ని పెళ్లయి అత్తగారింటికి నెల్లూరు జిల్లా, కావలి పట్టణానికి వెళ్లిన తర్వాత కూడా కొనసాగించాను. నలభై ఏళ్ల కిందట కావలి రక్తదాతల్లో మహిళలు దాదాపు పదిహేను మంది ఉండేవారు. రెడ్‌క్రాస్ సమావేశాలు మా ఇంట్లోనే జరిగేవి. అనేక క్యాంపులు కూడా నిర్వహించేవాళ్లం. కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చేవాళ్లు. కానీ అలా ముందుకొచ్చిన అమ్మాయిల్లో బ్లడ్ తగినంత ఉంటే కదా! వందమంది ఆడపిల్లలు వస్తే రక్తదానం చేయగలిగిన ఎలిజిబులిటీ ఉన్న వాళ్లు ఆరేడుకు మించేవాళ్లు కాదు. అండర్ వెయిట్, హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం ఎక్కువగా కనిపించేది. అరుదైన గ్రూపుల వాళ్ల నుంచి కూడా బ్లడ్ క్యాంపుల్లో సేకరించేవాళ్లం కాదు. వాళ్లకు పరీక్షలు చేసి లిస్ట్ తయారు చేసుకుని ఎమర్జెన్సీ కండిషన్లో పిలుస్తామని చెప్పేవాళ్లం. అప్పట్లో బ్యాంకుల్లేవు నా వయసు 63. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు రక్తదానమే కారణం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్‌కు సౌకర్యాలు బాగున్నాయి. కానీ మొదట్లో బ్యాంకులు ఉండేవి కాదు. మా మామగారు మాజీ ఎమ్మెల్యే సుబ్బానాయుడు ప్రోత్సాహంతో మా బంధువులు ముందుకొచ్చి కావలి హాస్పిటల్లో రక్తదానం కోసం ఒక గది కట్టించారు. యాక్సిడెంట్ కేస్ రాగానే హాస్పిటల్ నుంచి మాకు ఫోన్ వచ్చేది. అప్పటికప్పుడు మా డోనర్స్‌లో పేషెంట్ బ్లడ్ గ్రూపుతో మ్యాచ్ అయ్యే డోనర్ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. బ్లడ్ డోనర్స్ అంతా ఆరోగ్యంగా, అంటువ్యాధుల పట్ల విచక్షణతో ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలన్నీ చేయించుకుని రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఏడాదికి మూడు–నాలుగుసార్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మాయి దగ్గరకు యూఎస్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూడా ఓ సారి బ్లడ్ డొనేట్ చేశాను. అది అత్యవసర స్థితి కాదు, కేవలం యూఎస్‌లోనూ రక్తమిచ్చాననే సరదా కోసం చేసిన పని. మొత్తానికి అరవై ఏళ్లు నిండేలోపు యాభైసార్లు రక్తం ఇచ్చి మా నాన్న మాటను నెగ్గించాను. ఈ క్రమంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన మహిళగా గుర్తింపు వచ్చింది. గవర్నర్ అభినందించారు అప్పటి గవర్నర్ రంగరాజన్, ఆయన సతీమణి హరిప్రియా రంగరాజన్ దంపతులు 2000వ సంవత్సరంలో కావలికి వచ్చారు. ఆమె రెడ్‌క్రాస్‌లో చురుకైన సభ్యురాలు కూడా. రాజ్‌భవన్‌లో జరిగిన రెడ్‌క్రాస్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. నన్ను కావలిలో చూసి ‘ఈ పురస్కారం అందుకుంటున్న నిర్మలవి నువ్వేనా’ అని ఆత్మీయంగా పలకరించారు. మహిళలకు మార్గదర్శి అంటూ గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉన్నాయి కానీ జ్ఞాపికలుగా దాచుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నా జీవితం అంతా ఎదురీతలోనే గడిచింది. ఆ ఎదురీతల్లో ఇవేవీ ప్రాధాన్యతాంశాలుగా కనిపించలేదప్పట్లో. మొత్తానికి మా చిన్నాన్న, నాన్న, మామగారు అందరూ బ్లడ్ డొనేషన్ పట్ల చైతన్యవంతంగా ఉండడంతో నాకు ఇంతకాలం ఈ సర్వీస్‌లో కొనసాగడం సాధ్యమైంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే కార్యక్రమం కావడంతో ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పేవాళ్లు కాదు’’ అని తన రక్తదాన ప్రస్థానాన్ని వివరించారు సోషల్ యాక్టివిస్ట్ నిర్మలమ్మ. రక్తదానం చేద్దాం! – శృతి కోట, రక్తదాత, వైద్యవిద్యార్థిని నేను పద్దెనిమిదేళ్ల వయసు నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకుంటూ మూడు – నాలుగు నెలలకోసారి ఇచ్చేటట్లు చూసుకుంటున్నాను. ఈ మధ్య హెపటైటిస్ వ్యాక్సిన్ కారణంగా కొంత విరామం వచ్చింది. మా నాన్న సంపత్‌కుమార్ బ్లడ్ డోనర్ కావడంతో నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. రక్తదానానికి మహిళలు, మగవాళ్లు అనే తేడా పాటించక్కర్లేదు. అయితే భారతీయ మహిళల్లో రక్తహీనత ఎక్కువ మందిలో ఉంటోంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ పన్నెండు శాతానికి తగ్గకూడదు. డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలతోపాటు లాస్ట్ పీరియడ్‌లో రక్తస్రావం స్థాయులను దృష్టిలో ఉంచుకుని రక్తదానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు రక్తదానం చేయకూడదు. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఇవ్వవచ్చు. ఇక మహిళలు, మగవాళ్లు అందరూ రక్తదానం చేయడానికి ముందు చెక్‌లిస్ట్ ప్రకారం అన్ని పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. ఎయిడ్స్, హెపటైటిస్, మలేరియా, సమీప గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్లకు గురవడం, వ్యాక్సిన్లు వేయించుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉండడం వంటి కండిషన్స్‌కు స్క్రీనింగ్ జరిగిన తర్వాత మాత్రమే రక్తాన్ని సేకరిస్తారు. రక్తం ఇవ్వాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ తమ దేహ సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లడ్ డోనార్స్ మంచి ఆహారం, తగినంత నీరు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. రక్తదానం చేస్తుంటే ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుట్టుకొస్తూ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ‘రక్తాన్ని ఇవ్వండి, ప్రాణాన్ని కాపాడండి’ అనేదే మెడికోగా నా సందేశం. ప్రమాదంలో గాయపడిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంటలో వైద్య చికిత్స జరగడం ఎంత అవసరమో వైద్యానికి రక్తం అందుబాటులో ఉండడమూ అంతే అవసరం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రక్తదానంలో సెంచరీ..!
సాక్షి, కామారెడ్డి : వస్త్ర వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఒక సారి కాదు, రెండు సార్లు కాదు.. ఇప్పటికీ ఆయన 102 సార్లు రక్తదానం చేశాడు. ఎంతో మందికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాంబే క్లాథ్ హౌజ్ షాపింగ్ మాల్ యజమాని వీటీ రాజ్‌కుమార్ నాలుగున్నర దశాబ్దాలుగా రక్తదానం చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు రక్తదానం చేయడం అలవాటుగా మారింది. రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన వీటీ రాజ్‌కుమార్‌ను రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వీటీ రాజ్‌కుమార్ అందించిన సేవలపై ‘సాక్షి’ కథనం.. కామారెడ్డిలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో విపత్తులు సంభవించినా బాంబే క్లాథ్ హౌజ్ ద్వారా దుస్తులు, ఆహార పదార్థాలను పంపిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు అందజేస్తారు. రోడ్డు మీద పండ్లు, కూర గాయలు అమ్ముకుని జీవనం సాగించే వారికి ఎండ, వానల నుంచి రక్షించుకునేందుకు గొడుగులు పంపిణీ చేయడం, వైద్య శిబిరాలతో పేదలకు మందులు ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లూ చే యిస్తారు. కామారెడ్డి ఆస్పత్రి సమీపంలో రూ. 5కు భోజనం కూడా పెడుతున్నారు. ఇలా నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. తండ్రి పేరిట బ్లడ్ బ్యాంక్.. వైద్యం కోసం కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, డెలివరీల కోసం ఇక్కడి ఆస్పత్రులకు వచ్చే వారు సమయానికి రక్తం దొరక్క ఇబ్బందులు పడడమే కాదు ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. బాంబే క్లాథ్ హౌజ్ ముందరే ప్రభుత్వ ఆస్పత్రి ఉండడం, ఆస్పత్రికి వచ్చిన వారు బ్లడ్ కోసం పడే ఇబ్బందులను చూసి చలించిపోయిన వీటీ రాజ్‌కుమార్ ఆయన సోదరుడు వీటీ లాల్ బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి ముందు కు వచ్చారు. తమ తండ్రి వీటీ ఠాకూర్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంపులు నిర్వహిస్తూ రక్తం సేకరించి నిల్వ చేయడం, ఆదప లో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో వేలాది మందికి రక్తం అందించారు. కాగా రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిని గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న అవార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిలో రెండో వ్యక్తిగా వీటీ రాజ్‌కుమార్‌ను గవర్నర్ తమిళిసై అవార్డుతో సన్మానించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న రాజ్‌కుమార్‌ను అభినందించారు. రక్తదానంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది.. సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నన్నెంతగానో కలచివేశాయి. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నా.అప్పటి నుంచి ఏటా రెండు, మూడు సార్లు తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నా. బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్నాం. ఎన్ని డబ్బులు సంపాదించినా మనిషికి తృప్తి ఉండకపోవచ్చు. కానీ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినపుడు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇన్ని సార్లు రక్తదానం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మొదట్లో 20 సార్లు చేయాలనుకున్న. తరువాత టార్గెట్ 50 కి పెట్టుకున్నా. ఆ తరువాత వంద సార్లు అనుకున్నా. ఇప్పటికీ 102 సార్లు రక్తదానం చేశాను. శక్తి ఉన్నంత కాలం చేస్తూనే ఉంటా. -
ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: మెగాస్టార్ ట్వీట్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన రక్తదాతలకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'నా విజ్ఞప్తికి స్పందించి.. ఒడిశాలో బాలసోర్ ట్రైన్ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా రక్తదానం చేసిన సోదర సోదరి మణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!' అంటూ పోస్ట్ చేశారు. ట్వీట్‌తో పాటు పలు వార్త పత్రికల్లో వచ్చిన క్లిప్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు) Hearty Thanks to each and every Blood brother / sister who has responded to my appeal and donated blood specifically to help the #BalasoreTrainAccident victims in Odisha! My heartfelt gratitude to you all ! 🙏@Chiranjeevi_CT pic.twitter.com/nj6PJGJyHo — Chiranjeevi Konidela (@KChiruTweets) June 9, 2023 -
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని TCSS నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. మరియు ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు , వెంకట రమణ వ్యవహరించారు. సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు , ఇతర సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల,సాయి బాలె తదితరులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలిపారు. -
‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాల విద్యార్థులు, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పటమట, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్ ఆర్.యశోదరాజ్, క్లస్టర్ ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షించారు. విశాఖ ఆర్కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది విశాఖలో ఆర్కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యాన ఆర్కే బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకులను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్ బ్రాంచి మేనేజర్ చంద్రరావు అన్నారు. -
నంద్యాల: పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరం
-
రక్తదానంలో వైఎస్ఆర్ సీపీ ప్రపంచ రికార్డ్
-
Happy Birthday CM YS Jagan: ‘రక్తదానం’లో గిన్నిస్, జీనియస్ రికార్డులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేసేందుకు అంగీకారం తెలియజేసి(టేక్ ది ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్) రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానం చేసేందుకు సిద్ధమంటూ WWW. ysrcpblooddonation.com ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 1,28,534 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 26,503 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అలాగే బుధవారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో 13,039 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు మొత్తం 1,68,076 మందితో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇది వరకు(దక్షిణాఫ్రికా పేర్న) ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధి వీరేంద్ర.. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డికి అందించారు. 24 గంటల్లోనే రికార్డులు బద్దలు అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చేందుకు ఆసక్తి చూపే దాతల నుంచి అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా నేషనల్ బ్లడ్ సర్వీస్ అనే సంస్థ ఆన్లైన్ ద్వారా ఫ్లెడ్జ్ ఫామ్స్ సేకరించింది. అప్పుడు 24 గంటల్లో 71,121 మంది ఫ్లెడ్జ్ ఫామ్స్‌ను అందజేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పటిదాకా మన దేశంలో కేవలం ఎనిమిది గంటల్లో 10,217 మంది ప్లెడ్జ్ ఫామ్స్ ఇచ్చిందే ప్రపంచ రికార్డుగా ఉండేది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో భారీ ఎత్తున రక్తదానం చేశారు. కేవలం 24 గంటల్లోనే 1,68,076 ఈ రికార్డు సృష్టించి.. దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టారని రెడ్‌క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. రక్తదాన ఉద్యమం మరింత ముందుకు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ వెంట మనం నడుస్తున్నందునే మనం ఎక్కడికెళ్లినా ప్రజలు ఆప్యాయత, అభిమానం చూపుతున్నారని చెప్పారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం జగన్ దార్శనికుడిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమం ఇంత భారీ ఎత్తున విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు(నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ) చల్లా మధుసూదనరెడ్డిని, వారికి సహకరించిన ఐటీ వింగ్ ప్రతినిధులు, సోషల్ మీడియా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలిపారు. రక్తదాన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సజ్జల పిలుపు నిచ్చారు. -
చెన్నై: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
సాక్షి, చెన్నై: నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో భరోసానిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పాలనతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఇదే విషయాన్ని చెన్నైలోని భారత్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ముక్తకంఠంతో చెప్తున్నారు. అందుకే బుధవారం జన నేతకు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. అభిమానంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెప్పాడంటే.. చేస్తాడంతే అన్నది నిజం చేస్తూ.. రైతుల పాలిట ఆపద్భాందవుడుగా మారాడని, బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా వెలుగుతున్నాడని ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు వైఎస్ జగన్‌ను కొనియాడారు. రాజన్న ఆశయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సీఎం జగన్ ప్రజా సంక్షేమ సారథిగా ఎదిగారని మరికొందరు విద్యార్థులు చెప్పారు. పేదింటి పెద్ద కొడుకుగా, అవ్వాతాతల ముద్దుల మనవడిగా, ఆడపడుచులకు అన్నగా, విద్యార్థులకు మేనమామగా, సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్లు. ఈ కార్యక్రమంలో సైకం రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డి, నరేష్, కార్తీక్, అజయ్ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.