వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న హుస్సేన్‌బాషా
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : నెగటివ్ గ్రూపు కలిగిన రక్త దాత దొరకాలంటే అనేక అగచాట్లు పడాల్సి వస్తోంది. అలాంటిది ఒకే వ్యక్తికి 30 యూనిట్ల నెగిటివ్ గ్రూపు రక్తం కావాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. సహృదయంతో ఆ గ్రూపు కలిగిన దాతలు ముందుకు వస్తే తప్ప ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని సేకరించలేం. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన హుస్సేన్‌బాషా అనే 20 ఏళ్ల యువకుడు బ్లడ్ సర్కులేషన్ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరిశీలించిన వైద్యులు చికిత్స సమయంలో నెల రోజుల పాటు రోజుకు ఒక బ్యాగ్ చొప్పున 30 బ్యాగుల రక్తం ఎక్కించాలని తెలిపారు.
అతడిది ఏ నెగిటివ్ రక్తం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందసాగారు. బ్లడ్ బ్యాంకుల నుంచి తెచ్చిన రక్తాన్ని స్విమ్స్ ఆస్పత్రి లో అనుమతించరు. నేరుగా డోనర్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన దాతల కోసం హుస్సేన్‌బాషా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. దాతలు 9390819132 అనే నంబర్‌కు ఫోన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మధ్య తర గతి కుటుంబానికి చెందిన హుస్సేన్‌బాషా కు టుంబ సభ్యులకు చిన్న పాటి ఖర్చులు భరాయించే స్థోమత కూడా లేదు. ఆస్పత్రిలో రో జు వారి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాతలు స్పందించాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment