
రక్త దానం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో ఎస్.ఎం.హుస్సేన్, మహ్మద్ సలీం
నాంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేన్(ముజీబ్) ఆధ్వర్యంలో గురువారం నాంపల్లి, గృహకల్ప భవన సముదాయంలో 6వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె రక్త దానం చేశారు. అనంతరం మాట్లాడుతూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
టీఎన్జీఓ ఉద్యోగులు భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 730 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment