సాక్షి, హనుమకొండ: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. సంయమనం పాటించి, ఓపికతో ఉండాలని చెప్పారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావచ్చని పేర్కొన్నారు.
ఈ మేరకు కవిత శనివారం మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బస్సు ఫ్రీ విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు.
చదవండి: ప్రజా పాలన.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండు మారదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేస్తుందని. అయితే ఎంక్వైరీ రిపోర్టు రాకముందే మంత్రులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కృషి చేయాలని తెలిపారు.
కొత్త కార్ల విషయాన్నిప్రభుత్వం రహస్యంగానే ఉంచుతుందని చెప్పారు. భద్రత దృష్ట్యా సీక్రెట్‌గా ఉంచాలని ఇంటెలిజెన్స్ చెప్పిన ప్రకారం ఈ విషయాలు రహస్యంగా ఉంచుతారని అన్నారు. ఎవరూ అధికారంలో ఉన్నా అదే పద్దతి ఉంటుందన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని పేర్కొన్నారు. దీన్ని పెద్ద అంశంగా చూపి వెటకారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుందని కవిత పేర్కొన్నారు.
సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, అందుకే పోటీ నుంచి తప్పుకున్నట్లు కవిత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మిక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అందుకే AITUC మద్దతు ఇచ్చామని చెప్పారు. సింగరేణికి అనేక పనులు చేశామన్నా ఆమె.. ఆత్మ ప్రమోధానుసారం ఓటు వేయమని కోరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment