హైదరాబాద్, సాక్షి: కుటుంబాలు, మహిళలు గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు అలవాటు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి. ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. మార్పు రావాల్సి ఉంది. కుటుంబ వ్యక్తిగత విషయాలు ఫోన్ ట్యాప్ చేసి విని బ్లాక్ మెయిల్‌తో డబ్బులు వసూలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు విన్నరనీ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. రెండు పార్టీలు కూడా ఇలాంటి భాషతో తెలంగాణ రాజకీయాలను దిగజార్చూతున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి.
..ఏకపక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇదివరకే సీఎంకు లేఖ రాశా. గతంలో కేసీఆర్ కూడా మూసి బ్యూటీఫికేషన్ అంటూ మార్కింగ్ చేశారు. దాన్నే ఇప్పుడు సీఎం రేవంత్ తలకెత్తుకున్నారు. పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసి సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం పెట్టీ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి. డ్రైనేజీ, వరద నీటి డ్రైన్‌ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి. పేదలకు నిర్మిస్తామన్న ఇళ్లు ఏమైయ్యాయి. హామీలు పక్కదోవ పట్టించేలా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దోవలోనే సీఎం రేవంత్ వెళ్తున్నారు. కాంగ్రెస్- బీఆర్‌ఎస్ దొందూ దొందే. దొంగల పార్టీలు.. దోపిడీ పార్టీలు.
హైడ్రా అంటే రేవంత్. రేవంత్ అంటేనే హైడ్రా. హైడ్రాను పుట్టించిన రేవంత్ బాధ్యుడు. ధైర్యం ఉంటే ఫాం హౌజ్‌లు, బడా బిల్డింగ్‌లు కట్టిన వాళ్ళవి కుల్చండి. ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు? పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి ఆర్‌జీ, ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్లను కులిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు. కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
చదవండి: Konda Surekha Controversy: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా.. సమంతకు కొండా సురేఖ క్షమాపణలు
Comments
Please login to add a commentAdd a comment