హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘మహిళలను అడ్డుపెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్‌కే పంపాలి. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసిఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో.
పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మహిళ కమిషన్ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు సుమోటోగా తీసుకొని విచారణకి పిలవాలి. ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటేనే నిలబెడుతామని ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లో చేరారు’’అని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఒక దశలో.. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెప్పు చూపించి మరీ హెచ్చరించారు.
కౌశిక్ రెడ్డిది ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత అన్నారు.‘ తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతామని ప్రచారం చేసి మరీ గెలుపొందావు. పాడి కౌశిక్ రెడ్డి నిజాయితీ గల లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవ పరిస్తే చెప్పుదెబ్బల పాలు అవుతారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే బయట తిరగనివ్వం’ అని తీవ్రంగా హెచ్చరించారు.
చదవండి: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment