shobharani
-
చీర, గాజులు VS చెప్పు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘మహిళలను అడ్డుపెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర, గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్‌కే పంపాలి. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసిఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మహిళ కమిషన్ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలు సుమోటోగా తీసుకొని విచారణకి పిలవాలి. ఆయన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటేనే నిలబెడుతామని ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లో చేరారు’’అని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఒక దశలో.. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిది ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత అన్నారు.‘ తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతామని ప్రచారం చేసి మరీ గెలుపొందావు. పాడి కౌశిక్ రెడ్డి నిజాయితీ గల లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవ పరిస్తే చెప్పుదెబ్బల పాలు అవుతారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే బయట తిరగనివ్వం’ అని తీవ్రంగా హెచ్చరించారు.చదవండి: పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: కౌశిక్ రెడ్డి -
కాంగ్రెస్‌లో చేరిన శోభారాణి
సాక్షి,హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికాలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్య క్రమంలో శోభారాణి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీని యర్ నేత మధుయాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చు కున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ నేతృ త్వంలో కాంగ్రెస్ విధానాలను నమ్మి ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుని శోభారాణి పార్టీలో చేరినట్లు తెలిపారు. అమెరికాకు వెళ్లేముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా పంపించినట్లు ఆయన తెలిపారు. భిక్షమయ్య చేరికతోనే..: కొన్నిరోజుల క్రితమే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచే టికెట్ ఆశిస్తున్న శోభారాణి బీజేపీలో తనకు అవకాశం లేదని అంచనాకు వచ్చే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. -
అ‘త్త’మ్మ
అమ్మతనం కోసం పరితపించిన దివ్యాంగురాలు ఒకరు. ఆమె కల నెరవేరిందని సంతోష పడే అత్త మరొకరు. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అత్త అనే పదానికే సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. గయ్యాళి పేరును తుడిచేసి.. అ‘త్త’మ్మ అని చాటిచెబుతున్నారు. వారే పుత్తూరుకు చెందిన కోడలు రాజాలియోనా.. అత్త శోభారాణి. ఆ ఇద్దరూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, తిరుపతి: ‘నా పేరు పల్లం రాజాలియోనా. నేను పుట్టింది శ్రీకాళహస్తిలో. పోలియో కారణంగా రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అమ్మ కృపావరమ్మ మెడికల్ ఫీల్డ్‌లో పనిచేస్తోంది. నాన్న రాజు సినిమా థియేటర్లో పనిచేస్తున్నాడు. అమ్మ వృత్తిరీత్యా ఇంటి వద్ద ఉండే అవకాశమే లేదు. కాళ్లు పనిచేయకపోయినా ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేది. ఆ సమయంలో అన్నీ నాయనమ్మ వైలెటమ్మే చూసుకునేది. నాకు కాళ్లు లేవని ప్రేమగా ఆదరించేది. ఎనిమిదో తరగతి వరకు శ్రీకాళహస్తిలోనే చదువుకున్నా. నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. తప్పని పరిస్థితుల్లో నన్ను పుత్తూరులో ఉన్న అమ్మమ్మ పరంజోతమ్మ వద్దకు చేర్చారు. అప్పటి నుంచి అమ్మమ్మే నాకు అన్నీ. తొమ్మిది, పదో తరగతి పుత్తూరులోనే చదువుకున్నా. వికలాంగురాలిని కావడంతో మైసూరులో జేఎస్ఎస్ మహా విద్యాపీఠంలో డిప్లొమో, కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాను. పుత్తూరులో ఉద్యోగం దొరక్క 2005లో చెన్నైకి వెళ్లా. వర్కింగ్ హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ కాల్సెంటర్లో 2010 వరకు పని చేశా. ఆ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పెయింటర్ దీపక్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పరిచమయ్యారు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరం చెన్నైలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. కొన్నాళ్లకు భర్తకు కూడా తనతో పాటే ఎస్బీఐ కాల్సెంటర్లో పనిదొరికింది. భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు’. ప్రాణాలు పోయినా బిడ్డ కావాలనుకున్నా.. నేను చాలా మొండిదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. నాకు కాళ్లు పనిచేయకపోయినా ఇంట్లో ఎవ్వరూ నన్ను తక్కువ చేసి చూసేవారు కాదు. తన జీవితం ఇంతటితోనే అంతమైపోవాలా? అని ఆలోచించేదాన్ని. అమ్మా అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. తనలా కాకుండా పుట్టే పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలని నిర్ణయించుకున్నా. వివాహం అయ్యాక డాక్టర్ని కలిశాం. గర్భం దాల్చితే తల్లి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించారు. ప్రాణం పోయినా పర్వాలేదని పిల్లలు కావాలని నిర్ణయించుకున్నా. గర్భం దాల్చిన తర్వాత చెన్నైలో ఉండడం మంచిది కాదని పుత్తూరుకు వచ్చేశాం. పుత్తూరు మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నాకు కాదు భర్త దీపక్‌కు ఇస్తామని చెప్పారు. తరువాత ఆయన ఉద్యోగం నాకు ఇప్పించాడు. ప్రస్తుతం పుత్తూరు మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. భర్త ఆటో నడుపుతున్నాడు. పండంటి పాపకు జన్మనిచ్చా పురిటినొప్పులతో తిరుపతిలో తిరుపతిలో ఆసుపత్రులన్నీ తిరిగినా డాక్టర్లు బిడ్డను బతికిస్తాము, తల్లి గురించి చెప్పలేమని చెప్పారు. ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డకావాలని పట్టుబట్టా. భర్త ఒప్పుకోలేదు. తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు నా పరిస్థితిని చూసి తిట్టారు. ‘శరీరంలో ఎముకలు కూడా సరిగాలేవు. నీ ఆరోగ్యం ఏమిటి.. గర్భం దాల్చటం ఏంటమ్మా’ అన్నారు. దేవుడిచ్చిన వరం అమ్మతనం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. బిడ్డ కావాలి సార్’ అని అన్నాను. డాక్టర్ నా మాటలు విని చలించిపోయారు. అతికష్టమ్మీద పండంటిపాప పుట్టింది. నా పరిస్థితి సీరియస్ అయ్యింది. రెండు రోజులు స్పృహలో లేను. నేను బతకనేమో అనుకున్నారంతా. డాక్టర్ దేవుడిలా నా ప్రాణాలు కాపాడారు. నేను కళ్లు తెరవడంతో డాక్టర్ కూడా సంతోషపడ్డారు. అమ్మనయ్యాను అని తెలిసి సంబరపడ్డాను. అత్తమ్మే అన్నీ నా భర్త దీపక్ అమ్మ శోభారాణి. ప్రస్తుతం అన్నీ తానై చూసుకుంటోంది. చిన్న బిడ్డలా సపర్యలు చేస్తోంది. పాప ఆలనా, పాలనా అన్నీ తనే చూసుకుంటుంది. వంట చేయడం, పాపకు, నాకు స్నానం చేయించడం, బాత్రూముకి తీసుకెళ్లడం అన్నీ అత్తమ్మే. అత్తాకోడళ్లకు పడకుండా కొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే మేము అందుకు విరుద్ధం. నాకు, నా బిడ్డకు అత్తమ్మే అమ్మ. నన్ను అత్తమ్మ చూసుకున్నట్లు మా అమ్మ కూడా చూసుకోలేదు. ఆమె నాకు అమ్మకంటే ఎక్కువ. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా భర్త కూడా. ఇంట్లో భర్త, అత్తమ్మ, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. నేను వికలాంగురాలిని అనే ఆలోచనే రాకుండా చూసుకుంటున్నారు. మానవత్వం బతికే ఉందనటానికి నా చుట్టూ ఉన్న వాళ్లే నిదర్శనం అని పల్లం రాజాలియోనా స్పష్టం చేశారు. -
జెడ్పీ సీఈఓగా శోభా స్వరూపరాణి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సీఈఓగా శోభా స్వరూప రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి డీటీసీ(డిస్టిక్ట్ ట్రైనీ ఇన్స్ట్రక్టర్)గా విధులు నిర్వహిస్తున్న ఆమె పదోన్నతిపై అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందు ఆమె కర్నూలు జిల్లా పంచాయతీ అధికారిగా సేవలందించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకిత భావంతో పని చేస్తారనే గుర్తింపు ఉంది. మరో రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. -
జీవితంపై విరక్తితో..
- భర్త, అత్తింటి వేధింపులు భరించలేక కోడలి ఆత్మహత్యాయత్నం.. - కడుపునొప్పి తాళలేక మరొకరు.. - ధర్మవరంలో ఒకే రోజు రెండు ఘటనలు ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకు పెళ్లై పట్టుమని మూడేళ్లు కాకనే వేధింపులు మొదలయ్యాయి. సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురి చేశారు. వారి వేధింపులు, చేష్టలు శ్రుతిమించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. చావే శరణ్యమనుకున్న ఆమె చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. కడుపునొప్పి భరించలేక మరొకరు కూడా తనువు చాలించాలనుకుని యాసిడ్ సేవించాడు. ఇలా వారిద్దరూ ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యారు. - ధర్మవరం అర్బన్ ధర్మవరం రాంనగర్‌కు చెందిన శోభారాణి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మంజునాథ్ సహా అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె ఫినాయిల్ తాగి ఈ చర్యకు యత్నించారు. వారి వివాహమై మూడేళ్లవుతోంది. మంజునాథ్ ఉరవకొండలోని గాలిమరల కార్యాలయంలో పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా భార్యను మంజుతో పాటు అతని కుటుంబ సభ్యులు మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని బాధితురాలు తన పుట్టింటి వారికి తెలిపారు. వారు రంగంలోకి దిగి పలుమార్లు పంచాయితీ పెట్టి సర్దుబాటు చేసి, తిరిగి కాపురానికి పంపారు. అయినా భర్త, అత్తింటి వారిలో మార్పు రాకపోగా, పంచాయితీ పెట్టిస్తావా అంటూ.. మరింతగా వేధించేవారు. ఇక ఫలితం లేదనకున్న శోభారాణి చివరకు ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోభారాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని శోభారాణి విలేకరులకు తెలిపారు. ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన డ్రైవర్ మారుతీ కడుపునొప్పి తాళలేక యాసిడ్ తాగి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు బంధువులు తెలిపారు. గమనించి భార్య శివమ్మ బంధువుల సహకారంతో వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా జిల్లాకు చెందిన నాయకురాలు బండ్రు శోభారాణి నియమితులయ్యారు. ఆలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న శోభారాణికి తెలుగు మహిళా పగ్గాలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చాలాకాలం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న శోభారాణి గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో కూడా పార్టీలో పలు పదవులు నిర్వహించారు. పార్టీలో తెలంగాణవాదిగా ముద్ర ఉన్న ఈమె ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈమెతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి పదవులు లభించాయి. మునుగోడు, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జులు చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారిలను పార్టీ అధికార ప్రతిని ధులుగా నియమించారు. ఈ పదవిలో గతంలో జిల్లాకు చెందిన నన్నూరి నర్సిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు కొత్తగా ఇద్దరు కొనసాగుతారని సమాచారం. మహిళల గొంతుకనవుతా: శోభ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర మహిళా విభాగం బాధ్యతలు ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.రాష్ట్ర మహిళాలోకానికి ఒక గొంతుకగా నిలుస్తానని ఆమె చెప్పారు. -
యశోద నుంచి సీఎం సతీమణి డిశ్చార్జి
సాక్షి, హైదరాబాద్: తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఐదురోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీమణి శోభారాణి శనివారం రాత్రి 10 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
జిల్లాకు వచ్చిన కేసీఆర్ సతీమణి
వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం మొదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి ఉత్సవాలు కావడంతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐనవోలులో జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి శనివారం రాత్రి వరంగల్‌కు చేరుకున్నారు. దీంతో కేసీఆర్ మరొక రోజు జిల్లాలోనే ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతుఆన్నయి. కేసీఆర్ ఆది వారం లేదా సోమవారం వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి, ఐనవోలు ఉత్సవాలకు వెళ్తారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయూనికి వెళ్తున్నారు. -
మన జిల్లా.. మన ప్రణాళిక..ఆమోదం
ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ టౌన్ : ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక ఆమోదం పొందింది. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రూ.10,240 కోట్లతో ప్రణాళికకు ఆమోదముద్ర వేశారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 6 గంటల వరకు సాదాసీదాగా సాగింది. ఈనెల 13వ తేదీ నుంచి 18 వరకు గ్రామస్థాయిలో, 18వ తేదీ నుంచి 23 వరకు మండల స్థాయిలో, 23వ తేదీ నుంచి 27 వరకు జిల్లాస్థాయిలో జరిగిన ప్రణాళికలు సర్వసభ్య సమావేశంలో ఆమోదం తెలుపుతున్నట్లు చైర్ పర్సన్ శోభారాణి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి.. : స్వామిగౌడ్, రామన్న ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అటవీశాఖ మంత్రి జోగు రామన్నలు మాట్లాడుతూ జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఈ ప్రణాళికలు దోహదపడతాయని, ప్రణాళికలో చేర్చిన అంశాలతోపాటు దృష్టికి రాని అంశాలు కూడా చేర్చి అభివృద్ధి సాధించేలా ప్రణాళిక ఉండాలని వారు పేర్కొన్నారు. తమ వంతుగా రాష్ట్రం నుంచి జిల్లాకు నిధులు రప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చైల్డ్ కేర్ మొబైల్ వ్యాన్‌ను అంగన్వాడీల పిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని, కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, జిల్లాను రెండో కాశ్మీర్‌గా తీర్చిదిద్దాలని, ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు స్నేహభావంగా పనులు చేయించుకోవాలని వారు సూచించారు. జిల్లా ప్రణాళిక ‘మన ఊరు.. మన ప్రణాళిక..’ కింద రూ.10,240 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో గ్రామపంచాయతీ ప్రణాళిక కింద రూ.3,020 కోట్లు, మండల ప్రణాళిక కింద రూ.4,606, జిల్లా ప్రణాళిక కింద రూ.2,613 కోట్లుగా చేర్చారు. జిల్లాస్థాయి సమస్యలు గుర్తించి ఆయా నియోజకవర్గాల పరిధిలో 1,060 పనులకు సంబంధించి రూ.4,606 కోట్ల ప్రణాళికగా రూపొందించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 46 పనులకు రూ.1,149 కోట్లు, ఆసిఫాబాద్‌లో 117 పనులకు రూ.997 కోట్లు, బెల్లంపల్లిలో 72 పనులకు రూ.213 కోట్లు, బోథ్‌లో 296కు రూ.439 కోట్లు, చెన్నూర్‌లో 61కు రూ.138 కోట్లు, ఖానాపూర్‌లో 136కు రూ.1027 కోట్లు, మంచిర్యాలలో 33కు రూ.94 కోట్లు, ముథోల్‌లో 54కు రూ.227 కోట్లు, నిర్మల్‌లో 151కు రూ.163 కోట్లు, సిర్పూర్-టిలో 94కు రూ.155 కోట్లతో జిల్లా ప్రణాళికలో చేర్చారు. ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలు ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సమస్యలను చేర్చడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా సీసీ రోడ్లు, తారు రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణాలకు రూ.167 కోట్ల పనులు చేర్చారు. విద్యాశాఖ ద్వారా జిల్లాలో సైన్స్ మ్యూజియం, ఓరియంటేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.15 కోట్లతో చేర్చారు. రూ.47 కోట్లతో 42 కొత్త జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలో ఉంది. నీటి పారుదల శాఖ ద్వారా బ్రిడ్జిలు, చెక్‌డ్యాంలు నిర్మించడానికి రూ.43 కోట్లు ప్రణాళికలో చేర్చారు. గ్రామీణ నీటి సరఫరా ద్వారా 8 ప్రాజెక్టు పనులకు రూ.434 కోట్లు, వైద్యారోగ్య శాఖ ద్వారా పౌష్టికాహారం, చిన్నపిల్లల ఆరోగ్యం, రక్తనిధి కేంద్రాలు, కొత్త శిక్షణ కేంద్రాలకు 19 పనులకు రూ.352 కోట్లు, విద్యుత్ శాఖకు సంబంధించి 76 పనులకు రూ.343 కోట్లు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా జిల్లా క్రీడాభివృద్ధి కోసం రూ.33 కోట్లు, రోడ్డు భవనాల శాఖ ద్వారా 99 పనులకు రూ.1,175 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. సభా దృష్టికి సమస్యలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశంలో ఆయా నియోజకవర్గ, జిల్లా, మండలాల సమస్యలను సభాదృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను ప్రణాళికలో చేర్చి అమలు చేయాలని కోరారు. మొదటగా ఎంపీలు సమస్యలు తెలుపగా, అనంతరం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు వారివారి నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను సభలో లేవనెత్తారు. ఈ సమస్యలను ప్రణాళికలో చేర్చడంతోపాటు ఆమోదించేలా చూడాలని మంత్రి, జెడ్పీ చైర్మన్‌కు సభ్యులు విన్నవించారు. సమస్యలు ఎక్కువవుతున్న తరుణంలో రాతపూర్వకంగా కూడా అందజేయవచ్చని, ఇందుకు రెండు రోజుల సమయం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. విన్నవించిన సమస్యలను కూడా ప్రణాళికలో చేర్చి వాటికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామని జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి పేర్కొన్నారు. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్ల నిర్మాణాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ సమస్యలను సభా దృష్టికి తెచ్చారు. ప్రజాప్రతినిధులకు సన్మానం శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, వెంకట్రావ్‌లను జెడ్పీ చైర్ పర్సన్ శోభారాణి, జెడ్పీ సీఈవో అనితాగ్రేస్, ఉద్యోగులు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్యారోగ్య శాఖ ద్వారా నిర్వహిస్తున్న డయేరియా, అతిసార నివారణ పక్షోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్, ‘మన ఊరు.. మన ప్రణాళిక..’ ప్రత్యేక అధికారి అశోక్, ఎంపీలు నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, వెంకట్రావ్, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆమె వెనుక అతను..
ఉద్యోగం పురుష లక్షణం.. రాజకీయాలూ వారికే సొంతం.. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆడాళ్లూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఆ దూకుడు వెనకాల పురుషుల ప్రోత్సాహమూ ఉంది. వంటిల్లు దాటి చట్టసభల్లోకి అడుగుపెట్టినా.. తమ భర్తల ఆదరణ లేనిదే ఇదంతా సాధ్యం కాలేదంటున్నారు వారు. భర్త అంటే భరోసా ఇచ్చేవారే కారు.. అన్నింటా వెన్నంటి ఉండేవారని నిరూపించారు. రాజకీయాల్లో తమ విజయం తమ భర్తల వల్లే సాధ్యమైందని సగర్వంగా చాటుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల విజయంపై ఈ వారం సండే స్పెషల్.. శోభారాణి : జెడ్పీ చైర్పర్సన్ నిర్మల్ : సాధారణ గృహిణి స్థానం నుంచి భర్త ప్రోత్సాహంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్థాయికి ఎదిగారు వల్లగొండ శోభారాణి. భర్త సత్యనారాయణగౌడ్ 25 ఏళ్లుగా రాజకీయాల్లో వివిధ పదవులు చేపట్టారు. ఇప్పుడామెకు అన్ని విధాలా తోడూనీడగా నిలుస్తున్నారు. శోభారాణి తల్లిదండ్రులు ఎల్లాగౌడ్, గోపమ్మలది భైంసా. వీరిది వ్యవసాయ, వ్యాపార కుటుంబం. అక్టోబర్ 28 1965లో జన్మించిన ఆమెకు ఇంటర్మీడియట్ పూర్తయిన అనంతరం నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన వల్లగొండ సత్యనారాయణగౌడ్‌తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కుమార్తె డాక్టర్ కృప అరవింద్, రెండో, మూడో కుమార్తెలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు శృతి రాకేశ్, కృషి. సత్యనారాయణగౌడ్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినది. సత్యనారాయగౌడ్ తండ్రి గోవింద్‌గౌడ్ నిర్మల్ మండలం కడ్తాల్ గ్రామ సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేశారు. అనంతరం సత్యనారాయగౌడ్ 1988లో కడ్తాల్ సర్పంచ్‌గా, 1995లో నిర్మల్ ఎంపీపీగా, 2004 వరకు కాకతీయ యూనివర్సిటీ పాలకవర్గ సభ్యులుగా పనిచేశారు. 2004లో టీడీపీ నుంచి నిర్మల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అనంతరం రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈసారి నిర్మల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సత్యనారాయణగౌడ్ తన భార్య శోభారాణిని బరిలో నిలపాలని పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనను కోరారు. ఈ క్రమంలో శోభారాణిని జెడ్పీటీసీగా బరిలో నిలవడం, గెలుపొందడం, జెడ్పీ చైర్పర్సన్ అవడం జరిగిపోయాయి. వీటన్నింటిలోనూ తన భర్తే వె న్నుదన్నుగా ఉన్నారని చెప్తున్నారు శోభారాణి. కోవ లక్ష్మి : ఎమ్మెల్యే-ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోవ లక్ష్మి రాజకీయ ప్రస్థానం ఎంపీటీసీ నుంచి మొదలైంది. భర్త సోనేరావు ప్రోత్సాహంతోనే ఎంపీటీసీ నుంచి ప్రారంభమై ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఐదోసారి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(కాంగ్రెస్)పై విజయం సాధించింది. ఓటమి ఎరుగని ధీరురాలిగా నిరూపించుకుంది. వాంకిడి మండలం బంబార గ్రామానికి చెందిన దివంగత మాజీ గిరిజన మంత్రి కొట్నాక భీమ్రావు, భీమ్బాయిల కుమార్తె కోవ లక్ష్మి. పదో తరగతి వరకు చదివారు. తిర్యాణి మండలం పంగిడి మాదర పంచాయతీ భీమ్గూడకు చెందిన కోవ సోనేరావుతో 1986లో వివాహమైంది. సోనేరావు ప్రస్తుతం ఆసిఫాబాద్ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు సాయినాథ్(ఎంబీఏ), కుమార్తెలు అరుణ డిగ్రీ, కామేశ్వరి లా చదువుతున్నారు. రాజకీయ ప్రస్థానం కోవ లక్ష్మి 1995లో మొట్టమొదటిసారిగా టీడీపీ నుంచి తిర్యాణి మండలం పంగిడి మాదర ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి 2001లో అదే స్థానం నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి తిర్యాణి ఎంపీపీగా ఎన్నికయ్యారు. భర్త సోనే రావు ఉద్యోగ రీత్యా ఆసిఫాబాద్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో 2006 స్థానిక ఎన్నికల్లో ఎస్టీకి రిజర్వ్ చేసిన ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊపందుకున్న సమయంలో 2010లో టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ అధిస్టానం బాధ్యతలప్పగించారు. గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండోసారి ఆసిఫాబాద్ సర్పంచ్‌గా పోటీ చేసి సోదరి మర్సుకోల సరస్వతీపై విజయం సాధించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తన భర్త సోనేరావు ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణిస్తూ, ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని కచ్చితంగా చెప్తున్నారు లక్ష్మి. నాన్నలాగే గిరిజన మంత్రి కావడమే తన లక్ష్యమంటున్నారు. కళావతి :ఎంపీపీ-చెన్నూర్ చెన్నూర్ : పట్టణానికి చెందిన మైదం కళావతి భర్త మైదం రవి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే భార్యను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించారు. గృహణిగా ఉన్న కళావతిని రాజకీయరంగ ప్రవేశానికి ప్రోత్సహించారు. రవి ప్రోత్సాహంతో రెండుసార్లు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. కళావతిని 2006లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 7వ ఎంపీటీసీ స్థానంలో పోటీకి నిలబెట్టి గెలిపించారు. రిజర్వేషన్ అనుకూలించడంతో చెన్నూర్ మండల ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆమె ఎంపీపీ హోదాలో మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారు. 2014లో చెన్నూర్ ఎంపీపీ జనరల్ మహిళకు కేటాయించడంతో మళ్లీ చెన్నూర్ పట్టణంలోని 6వ ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. భర్త ప్రోత్సాహంతోనే రెండుసార్లు ఎంపీపీగా, ఒకసారి సర్పంచ్‌గా ఎనికయ్యానంటున్నారు కళావతి. మీరాబాయి : ఎంపీపీ-ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి : భర్త కృషితోనే ఎంపీపీ అయ్యానని జాదవ్ మీరాబాయి చెప్తున్నారు. ఆమె భర్త జాదవ్ ప్రకాశ్ వ్యవసాయం చేస్తూనే పదేళ్లుగా టీఆర్ఎస్ నాయకుడిగా ఉ న్నారు. ప్రజా క్షేత్రంలో ఆయన నడిచిన దారులు భార్య మీరాబాయి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యేందుకు ఉపాయోగపడ్డాయి. 2006 నుంచి 2011 వరకు కేస్లాపూర్ సర్పంచ్‌గానూ పనిచేశారామె. భర్త సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు. బుక్యా అమ్మీబాయి : ఎంపీపీ-కడెం కడెం : మండలంలోని చిట్యాల పంచాయతీ పరిధి లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన బుక్యా అమ్మీబాయి-బాపురావు దంపతులు కలిసి ప్రజా ప్రతినిధులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అమ్మీబాయి కుటుంబానికి రాజకీయ సంబంధాలున్నాయి. గతంలో అత్త అమ్మీబాయి గ్రామ సర్పంచుగా పనిచేసింది. అలా ఆమె భర్త బాపురావు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కడెం జెడ్పీటీసీ స్థానం మహిళలకు రిజర్వు అయింది. అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు అమ్మీబాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మళ్లీ టీడీపీలోకి వచ్చారు. జెడ్పీటీసీగా ఐదేళ్లు కొనసాగారు. కడెం ఎంపీపీ స్థానం మహిళలకు రిజర్వు కావడంతో ఎంపీటీసీగా పోటీ చేసి అధ్యక్ష పదవి అందుకున్నారు. రాథోడ్ యోగిత :ఎంపీపీ-కుభీర్ కుభీర్ : కుభీర్ ఎంపీపీ రాథోడ్ యోగిత తాను భర్త కంలేశ్ ప్రొత్సాహంతోనే ఎంపీపీ కాగలిగానని తెలిపారు. ఇంటర్ వరకు చదివిన తనను భర్తే ప్రోత్సహించి డిగ్రీ చేయిస్తున్నారని చెప్పారను. రాజకీయాల్లోకీ ఆయనే తీసుకువచ్చారని, ప్రచార బాధ్యతలు పూర్తిగా ఆయనే చూసి ఇటీవలి ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచేలా చేశారని తెలిపారు. ఎంపీపీ ఎన్నికకు అవసరమైన అన్ని విషయాలు ఎంపీటీసీలతో మాట్లాడి ఎంపీపీని చేశారని పేర్కొన్నారు. భర్త సహకారం మరువలేనిదంటున్నారామె. గంగామణి : ఎంపీపీ-కుంటాల కుంటాల : కుంటాల మండలం అందాకూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి బుచ్చన్న ప్రోత్సాహంతో ఆమె భార్య గంగామణి ఎంపీపీగా గెలుపొందారు. సర్పంచ్‌గా పనిచేస్తున్న బుచ్చన్న ప్రజాసేవకు అంకితం కాగా.. భార్య గంగామణి కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. మహిళా రిజర్వేషన్ల అనుకూలించి భర్త ప్రోత్సాహంతో ఎంపీటీసీగా విజయం సాధించారు. రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా గంగామణిని ఎంపీపీ పదవి వరించింది. ఇదంతా భర్త కృషితోనే సాధ్యమైందంటున్నారు గంగామణి. మనీషా :మున్సిపల్ చైర్పర్సన్-ఆదిలాబాద్ ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్‌కు చెందిన రంగినే ని లక్ష్మణరావు గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పనిచేయగా.. ప్రస్తుతం ఆయన కోడలు మనీషా చైర్ పర్సన్‌గా గెలుపొందారు. భర్త పవన్‌రావు సహకారం, మామ లక్ష్మణ్రాంవు ప్రోత్సాహంతో తాను విజయం సాధించానని మనీషా అంటున్నారు. కాగాచ మనీషా ఆదిలాబాద్‌లోని బాలాజీ విద్యామందిర్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. మొదటిసారి కౌన్సిలర్ గెలిచి చెర్మైన్‌గా ఎన్నికయ్యారు. మొదటిసారిగా రాజకీయంలో ఉన్నత పదవిని అలంకరించించారు. మామ లక్ష్మణ్‌రావు సలహాలు సూచనలను తీసుకుంటూ.. భర్త అండదండలతో ఆదిలాబాద్ ప్రజలకు సేవనందించెందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొంటున్నారు. కేవలం ప్రజా సేవేలక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల్లోని మున్సిపల్ చైర్ పర్సన్ల విద్యార్హతతో పోలిస్తే మనీషా ముందంజలో ఉంది. ఎమ్మెస్సీ, ఎఈడీ చదివారు. అందరికంటే ఉన్నత విద్యభ్యాసించిన చైర్‌పర్సన్‌గా గుర్తింపు ఉంది. ఆమెది జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామం. అంతేకాక చిన్న వయసులోనే ఆదిలాబాద్ మున్సిపల్ చెర్మైన్‌గా పగ్గాలు చేపట్టారు. ఇప్పటివరకు 30 ఏళ్లలోపు వయసు వారు చైర్ పర్సన్‌గా పనిచేయడం ఇదే తొలిసారి. వసుంధర : మున్సిపల్ చైర్పర్సన్ -మంచిర్యాల మంచిర్యాల టౌన్ : మామిడిశెట్టి వసుంధర భర్త రమేశ్ సహకారంతో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ అయ్యారు. చెన్నూర్‌కు చెంది న వసుంధరకు 1995 మే 4న వి వాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సాత్విక్, రిత్విక్. రమేశ్ కౌన్సిలర్ గా, కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన వసుంధర భర్త సహకారంతో 2005లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదటిసారి బల్దియా ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా ఎ న్నికయ్యారు. 2014లోనూ టీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యా రు. అనూహ్యంగా పట్టణ ప్రథమ పౌరురాలి(చైర్ పర్సన్)గానూ ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం. ఆ ప్రభావంతో క్రమేపీ రాజకీయాలకు ఆకర్షితులవ్వడం. తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం, భర్త తోడ్పాటు ఆమెకు ఈ పదవి కట్టబెట్టాయి. ప్రజా సేవ పరమావధిగా భావించిన భర్త రమేశ్ సూచన, ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకున్న వసుంధర రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నిక కావడంలో భర్త సహకారం ఎంతగానో ఉందని అంటున్నారామె. పట్టణ ప్రథమ పౌరురాలిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు వసుంధర. మున్సిపల్ చైర్పర్సన్-బెల్లంపల్లి : సునీతారాణి బెల్లంపల్లి : రాజకీయాల్లో రావడానికి భర్త మహేశ్‌కుమార్ తోడ్పా టు ఎంతో ఉందని ఆయన ప్రో ద్బలంతోనే రాజకీయ అరంగే ట్రం చేశానని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పి.సునీతారాణి చెప్తున్నారు. సునీతారాణిది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం గుట్రాజ్‌పల్లి. అమ్మ, నాన్న లక్ష్మి-గంగారాం. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. మోహన్‌కుమార్, మల్లేశ్వర్, ప్రవీణ్‌కుమార్ తమ్ముళ్లు. ఇందులో చిన్నవాడైన ప్రవీణ్‌కుమార్ గట్రాజ్పల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా, అమ్మ లక్ష్మి వార్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మహేశ్‌కుమార్‌తో పదిహేనేళ్ల క్రితం జరిగింది. వ్యవసాయం, టైలరింగ్ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు తొలుత రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. మరిది పసుల సురేశ్ టీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలువురు ప్రజలకు వారింటికి వెళ్లి తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు సురేశ్, ఆమె భర్త మహేశ్‌కుమార్‌తో చర్చించేవారు. ఈ క్రమంలో ఆమెకూ రాజకీయాలపై ఆసక్తి కలిగింది. భర్త ప్రోత్సాహంతో బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. భర్త తోడ్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని అంటున్నారు సునీతారాణి. -
వర్గల్లో త్రిముఖ పోటీ
వర్గల్,న్యూస్‌లైన్: ‘స్థానిక’ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు) స్థానాలకు గాను మొత్తం 116 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ము గియడంతో 42 మంది బరిలో నిలిచారు అన్ని స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పాములపర్తిలో బీజేపీ, సీపీఐ అభ్యర్థులు, నెం టూరులో ఒక స్వ తంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. అభ్యర్థుల వివరాల ను ఎంపీడీఓ శోభారాణి వెల్లడించా రు. మజీద్‌పల్లి నుంచి హజారి వేణుగోపాల్‌రావు (కాంగ్రెస్), హజారి సుధాకర్‌రావు(టీడీపీ),పాలేటిరాజు(టీఆర్ఎస్) నెంటూరు నుంచి మాసాన్‌పల్లి నర్సయ్య (కాంగ్రెస్), డాకని సత్తయ్య (టీడీపీ), కొత్తోల్ల భిక్షపతి (టీఆర్ఎస్), కంటం రవికుమార్ (స్వతంత్ర) పాములపర్తి నుంచి కొంచెంల స్వప్న (కాంగ్రెస్), సిల్వేరు లక్ష్మి (టీడీపీ), బోయిని సావిత్రి (టీఆర్ఎస్), దాచారం కలమ్మ (బీజేపీ), గుండ వెంకటమ్మ (సీపీఐ) చౌదరిపల్లి నుంచి ఎర్ర కొండల్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రొద్దుటూరి శ్రీనివాస్ (టీడీపీ), జిన్న బాషయ్య (టీఆర్ఎస్) గౌరారం నుంచి గుండు భాగ్యమ్మ (కాంగ్రెస్), కడపల బాల్‌రెడ్డి (టీడీపీ), పాశం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్),తున్కిఖాల్సా నుంచి గడ్డమీది కళావతి (కాంగ్రెస్), బొర్ర అర్చన (టీడీపీ), గౌసియాబీ (టీఆర్ఎస్) అంబర్‌పేట కీసరి నాగమణి (కాంగ్రెస్), జాలిగామ లక్ష్మి (టీడీపీ), జనగామ మంజుల (టీఆర్ఎస్) వేలూరు అట్ల రాధిక (కాంగ్రెస్), పంజాల సంతోషి (టీడీపీ), మల్లెల నవనీత (టీఆర్ఎస్) గిర్మాపూర్ నుంచి కొండ మహేష్ (కాంగ్రెస్), పూస రమేష్ (టీడీపీ), మహ్మద్ హసన్ (టీఆర్ఎస్) మైలారం నుంచి లింగ సువర్ణ (కాంగ్రెస్), శేషమ్మగారి పద్మ (టీడీపీ), లింగ కవిత (టీఆర్ఎస్) నాచారం నుంచి ఏమ చంద్రకళ (కాంగ్రెస్), ఎల్లంకుల బుచ్చమ్మ (టీడీపీ), బక్కోల్ల పోచమ్మవర్గల్-1 నుంచి మక్తాల మల్లమ్మ (కాంగ్రెస్), గజ్వేల్ నాగమణి (టీడీపీ), రాపర్తి ఈశ్వరమ్మ (టీఆర్ఎస్) వర్గల్-2 నుంచి పసుల కుమార్ (కాంగ్రెస్), గుర్రాల యాదయ్య (టీడీపీ), దేవగణిక సాయి ప్రవీణ్ కుమార్ (టీఆర్ఎస్) పోటీలో ఉన్నారు. -
‘మీ సేవ’లో ఆధార్ సమాచారం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకున్న వారిలో 26 లక్షల మందికి యూఐడీ నెంబర్లు జనరేట్ అయ్యాయని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీటిని గ్రామం, మండలం వారీగా ఆల్ఫాబెటికల్ పద్ధతిలో ఉంచామని, వివరాలను మీసేవ కేంద్రాల నుంచి పొందవచ్చన్నారు. వీటితోపాటు ఆధార్ సమాచారం మొత్తం మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు. రూ. 25 చెల్లించి యూఐడీ నెంబర్‌తోపాటు కార్డు కూడా పొందవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 300 ఆధార్ సెంటర్లు నడుస్తున్నాయని, ఇప్పటిదాకా నమోదు చేయించుకోని వారు వెంటనే ఏదో ఒక కేంద్రాన్ని సందర్శించి నమోదు చేయించుకోవాలన్నారు. స్కాలర్షిప్ దరఖాస్తుల పొడిగింపుపై ప్రచారం చేయండి స్కాలర్షిప్ దరఖాస్తు గడువును నవంబర్ 30వతేదీ నుంచి డిసెంబర్ 10 వరకు పొడిగించామని, ఈ విషయంపై ప్రచారం చేసి విద్యార్థులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. శనివారం తన ఛాంబర్లో డీబీటీపై నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అనేకమంది యూఐడీ నెంబర్లు రాలేదనే అసంతృప్తితో ఉన్నారని, అటువంటి వారందరూ మీ సేవ సెంటర్లకు వెళ్లి కార్డులు పొందాలన్నారు. బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసి ఎల్డీఎంకు అప్పగించాలన్నారు. ఉపకార వేతనాలకు 84 వేల మంది అర్హులుగా ఉంటే ఇప్పటి వరకు 45 వేల మంది మాత్రమే ఆధార్ నమోదు చేయించుకున్నారని, మిగతా వారు వెంటనే నమోదు చేయించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు రవిచంద్ర, గిరిధర్ పాల్గొన్నారు.