యశోద ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీమణి శోభారాణి శనివారం రాత్రి 10 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఐదురోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీమణి శోభారాణి శనివారం రాత్రి 10 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వచ్చి ఆమెను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.