discharged
-
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
-
KCR Hospital Discharged Photos: యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ (ఫొటోలు)
-
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కూతురితో రామ్‌చరణ్, ఉపాసన (ఫొటోలు)
-
ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా ఉమర్ ఖలిద్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన రాళ్ల దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ లీడర్ ఉమర్ ఖలిద్‌ను నిర్దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. అతడితో పాటు మరో విద్యార్థి నాయకుడు ఖలిద్ సైఫీపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది కర్కార్దూమా కోర్టు. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో బెయిల్ రానందున వారు జుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లపై ఉమర్ ఖలిద్పై ఖాజురి ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఛాంద్బాగ్ ప్రాంతంలో అల్లరి మూకలు చేరిన సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ సమయంలో తనను తాను రక్షించుకునేందుకు ఓ షెల్టర్‌లో తలదాచుకున్నట్లు తెలిపాడు కానిస్టేబుల్. స్థానికులపై దాడి చేయటం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2020, సెప్టెంబర్‌లో ఉమర్ ఖలిద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు జడ్జీ పులస్త్యా ప్రమాచల్.. ఈ మేరకు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పారు. అల్లర్లు జరిగినప్పుడు వారు అందులో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు లేనందున వారిపై కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వివరాలను ఖలిద్ సైఫీ తరఫు న్యాయవాది రెబ్బెకా జాన్ వెల్లడించారు. కోర్టు తీర్పు పూర్తి స్థాయి ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో ముందస్తు ఎన్నికలు.. హింట్ ఇచ్చిన బీజేపీ! -
కోలుకున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వడంతో మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశామని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కోవిడ్ అనంతర సమస్యలతో బాధ పడుతున్న గవర్నర్ వారం క్రితం ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ స్థాయి, ఇతర ఆరోగ్య ప్రమాణాలు అన్నీ సాధారణ స్థితికి రావడంతో డిశ్చార్జ్ చేశారు -
కావేరి ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
-
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్
Adivi Sesh Discharged From The Hospital: టాలీవుడ్ హీరో అడివి శేష్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను' అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అడివి శేష్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డెంగ్యూ బారినపడి, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చదవండి : షాకింగ్ : రకుల్‌కు సర్జరీ వికటించిందా? అందుకేనా ఇలా! ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేష్ “మేజర్” సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. చదవండి : మహేశ్ బాబు ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్ Back home. Rest & Recuperation. — Adivi Sesh (@AdiviSesh) September 27, 2021 -
నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారినపడిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ కరోనా బారినపడ్డారు. రెండుసార్లు (మార్చి 4, ఏప్రిల్ 3) కరోనా టీకాలు తీసుకున్న తర్వాత కూడా ఆయన కరోనా బారినపడడం కలకలం రేపింది. కరోనా నిర్ధారణ అయిన అనంతరం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పది రోజుల పాటు ఎయిమ్స్‌లో చికిత్స పొందిన అనంతరం మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రావడంతో మన్మోహన్ సింగ్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మన్మోహన్ సింగ్ దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పలు సూచనలు చేయగా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి -
కోలుకుని ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు నగరి : ఎమ్మెల్యే ఆర్కేరోజా పూర్ణారోగ్యంతో ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం నేత్రప్రదాత శ్రీదేశమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే పేరిట అర్చనలు చేసి, 101 కొబ్బరికాయలు కొట్టారు. దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బాబురెడ్డి, ఆస్పత్రి కమిటీ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, మధు, బాలాజీ, సుబ్రమణ్యం, రామన్, గోవర్ధన్ పాల్గొన్నారు. నేసనూరులో.. పుత్తూరు: ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం నేసనూరులో గ్రామ దేవత శ్రీకలుగు లక్ష్మమ్మ ఆలయంలో సర్పంచి గోవిందస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం, తిరుమలరెడ్డి, కుమార్, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు. చదవండి: రోజాకు ప్రముఖుల పరామర్శ చదవండి: ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గంగూలీ
కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆదివారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండోసారి గుండె నొప్పితో దాదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. వైద్యులు గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. బుధవారం మరోసారి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు మరో రెండు స్టెంట్లు వేశారు. -
20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 నెలలు తరువాత మతిస్థిమితం లేని ఓ వ్యక్తికి ఎట్టకేలకు చిరునామా గుర్తుకొచ్చింది. దీంతో ఆయనను ప్రభుత్వ మానసిక ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జి చేయాలని వైద్యులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్(22) చినవాల్తేరులో రోడ్డు పక్కన ఉండడంతో గమనించిన ప్రభుత్వ మానసిక ఆస్పత్రి డాక్టర్ ప్రొఫెసర్ రామానంద శతపతి తన సహచరుని కారులో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. (వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!) జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాయంతో రిసెప్షన్ ఆర్డర్ తేవడంతో పోలీసులు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగి కోలుకోవడంతో తన వివరాలు తెలియజేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ డీజీపీని సంప్రదించడంతో కుమార్ డిశ్చార్జికి మార్గం సుగమమైంది. ఆస్పత్రి చిరునామా కోసం కుమార్ కుటుంబీకులు ఆస్పత్రి డాక్టర్ని ఆదివారం సంప్రదించారు. అతని కుటుంబ సభ్యులు సోమవారం మానసిక ఆస్పత్రికి వస్తారని డాక్టర్ రామానంద శతపతి ‘సాక్షి’కి తెలిపారు. (పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో..) -
ఆసుపత్రి నుంచి ట్రంప్ డిశ్చార్జ్
-
‘చిరునవ్వుతో మహమ్మారిపై విజయం’
ముంబై : కరోనా వైరస్ సోకగానే డీలా పడే వారిలో ధైర్యం నింపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 106 ఏళ్ల వయసులో మహమ్మారి బారినపడి వ్యాధి నుంచి వేగంగా కోలుకున్న బామ్మ ఉదంతం అందరిలో స్ఫూర్తి నింపుతోంది.థానే జిల్లాలో 106 సంవత్సరాల వృద్ధురాలు కరోనా వైరస్‌ను జయించి వైద్యులు, నర్సుల అభినందనల మధ్య ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పదిరోజుల పాటు కోవిడ్-19కు చికిత్స పొందిన బామ్మ చిరునవ్వుతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ తన డిశ్చార్జి సర్టిఫికెట్‌ను మీడియాకు ప్రదర్శించారు. అంతకుముందు వందేళ్లు పైబడిన మహిళను కరోనా చికిత్స అందించేందుకు పలు ఆస్పత్రులు నిరాకరించాయని, ఎట్టకేలకు ఆమె ఇప్పుడు వ్యాధిని జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండటం సంతోషకరమని వృద్ధురాలి కోడలు పేర్కొన్నారు. పదిరోజుల కిందట తమ అత్తగారిని కళ్యాణ్ డొంబివిలి మున్పిపల్ కార్పొరేషన్ పరిథిలోని ఓ కోవిడ్ సెంటర్లో చేర్చుకుని చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించి ఆమె కోలుకునేందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని కోవిడ్-19 కేంద్రాన్ని నిర్వహించే ‘ఒక రూపాయి ఆస్పత్రి’ ఎండీ డాక్టర్ రాహుల్ గులే అభినందించారు. జులై 27న తాము ఈ ఆస్పత్రిని ప్రారంభించామని, అప్పటి నుంచి 1100 మంది కోవిడ్-19 రోగులకు చికిత్స అందించామని చెప్పారు. రైలు ప్రమాదాల బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ఎంపిక చేసిన కేంద్రాల్లో రూపాయి ఆస్పత్రులను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. కరోనాను జయించిన వృద్ధురాలి ఉదంతంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే స్పందించారు. వృద్ధురాలికి మెరుగైన చికిత్స అందించిన ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులతో పాటు శివసేన స్థానిక ఎంపీ శ్రీకాంత్ షిండేను ఆయన అభినందించారు. చదవండి : 'పాపడ్'లు తిని కరోనా నుంచి కోలుకున్నారా? -
వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్
సాక్షి,ముంబై: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. అయితే తన తండ్రి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య) కాగా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు ఇటీవల కరోనా సోకడంతో హాస్పిటల్లో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీనికిముందే సీనియర్ బచ్చన్, అభిషేక్‌కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నానావతి హాస్పిటల్లో చేరారు. అయితే అమితాబ్ భార్య, నటి జయాబచ్చన్, మిగతా కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. (అది నకిలీ వార్త) Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽 Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff. — Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020 -
ఒక్క రోజులో 11వేల మంది డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 10,994 మంది 24 గంటల్లో డిశ్చార్జి అయ్యారని కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,48,189 మంది కోలుకున్నట్లయిందని, రికవరీ రేటు 56.38 శాతంగా ఉందని వెల్లడించింది. ఒక్క రోజులోనే 14,933 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,215కు చేరుకోగా మరో 312 మంది కోవిడ్‌తో మరణించడంతో ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 14,011కు ఎగబాకిందని వెల్లడించింది. దేశంలోని ప్రతి లక్ష మంది జనాభాలో ఒక్కరు మాత్రమే కోవిడ్‌తో చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతుండగా.. ప్రపంచ దేశాల్లో ఇది 6.04గా ఉందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కోవిడ్ మరణాల సంఖ్య రీత్యా ప్రపంచ దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా, తీవ్ర ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ ఉంది. కర్ణాటక మంత్రి కుటుంబంలో.. కర్ణాటక వైద్య విద్యా మంత్రి డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఆయన తండ్రి (82)కి సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, సుధాకర్ భార్య, కుమార్తెకు మంగళవారం పాజిటివ్‌గా వెల్లడైంది. ఇటీవల మంత్రి ఇంట్లో వంట మనిషికి కరోనా సోకింది. తనకు, ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా అందరినీ కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు. బెంగళూరులోని సదాశివనగరలో ఉన్న మంత్రి నివాసంలో ఏడుగురు ఉండగా నలుగురికి కరోనా సోకింది. -
కరోనా: కర్నూలులో భారీ ఊరట
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కరోనా విషయంలో జిల్లా ప్రజలకు శుభవార్త. ప్రస్తుతం యాక్టివ్ కేసుల (ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు) కంటే వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా సోమవారం శాంతిరామ్ ఆస్పత్రి నుంచి 12 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కర్నూలుకు చెందిన 9 మంది, నంద్యాల అర్బన్ ఇద్దరు, బనగానపల్లె రూరల్ , చాగలమర్రి, కోడుమూరుకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 281కి చేరింది. మరోవైపు 278 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (కరోనా : ఒక్కడి ద్వారా 20 మందికి..!) 9 మందికి పాజిటివ్ జిల్లాలో సోమవారం కొత్తగా 9 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులన్నీ కర్నూలు నగరంలోనే నమోదయ్యాయి. దీంతో నగరంలో కరోనా బాధితుల సంఖ్య 366కు చేరింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 575 మంది కరోనా బారిన పడ్డారు. -
కరోనాను గెలిచారు.. ధైర్యం నింపారు..
సాక్షి, కర్నూలు: జిల్లాలో 14 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 281 మంది కరోనాపై విజేతలుగా నిలిచారు. జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 278 కంటే డిశ్చార్జ్ అయిన కరోనా విజేతల సంఖ్య 281 కావడం విశేషం. సోమవారం నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని, కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. (అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్) కరోనా వైరస్ నివారణాకు ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనాపై విజేతలుగా నిలిచిన బాధితులు అందరిలోనూ ధైర్యంతో పాటు స్ఫూర్తిని నింపారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో కరోనా బారినపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. -
ఆశాజనకంగా కరోనా రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్ కేసలు నమోదు కాగా, 97 మంది దేశవ్యాప్తంగా మరణించారు. అయితే భారతదేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం ఆశాజనకంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కోలుకుంటున్న వారి శాతం 31.15శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 67,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,197 మంది కోలుకోగా, 2,206 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (ముగ్గురిలో ఒకరికి స్వస్థత) కరోనా బాధితులు హాస్పటల్ నుంచి డిశార్జ్ అయ్యాక హోం క్వారంటైన్లో 10 రోజుల పాటు ఉండాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అప్పటికి వారిలో ఎటువంటి లక్షణాలు లేకపోతే క్వారంటైన్ నుంచి బయటకి రావొచ్చని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన కరోనా డిశార్జ్ పాలసీలో ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్ పూర్తయ్యాక లక్షణాలు లేకుంటే పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ తెలిపారు. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హాస్సటల్లో చేరిన వారిని కూడా ఆసుపత్రిలో ఉంచి మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే డిశార్జ్ చేస్తామని వారికి డిశార్జ్ చేసే సమయంలో కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారు 10 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న 4 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన 5 లక్షల మంది వలస కార్మికులను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. (72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!) -
కరోనా.. కాచుకో!
సాక్షి, అనంతపురం: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. ఈ సూక్ష్మక్రిమి మనుషులనే మింగేస్తోంది. కానీ ‘అనంత’ వాసులు ఈ వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. జిల్లా యంత్రాంగం చూపిస్తున్న శ్రద్ధ.. వైద్యులు అందిస్తున్న మెరుగైన చికిత్స ఫలితంగా.. కరోనా బారిన పడిన వారు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు. జిల్లాలో మార్చి 29న మొదటి కేసు నమోదుకాగా, ఇప్పటి వరకు 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మెరుగైన వైద్యంతో 24 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 38 మంది బాధితులు కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (లాక్డౌన్: ఇల్లు చేరకుండానే ఆగిన కార్మికుడి గుండె) హిందూపురంలోనే అధికం కరోనా పాజిటివ్ కేసులు హిందూపురంలోనే అధికంగా ఉన్నాయి. కానీ వైరస్‌పై యుద్ధం చేసి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పురంలోనే అధికం. హిందూపురం అర్బన్, రూరల్ పరిధిలో మొత్తం 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. 50 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 22 మంది పురం వాసులు కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక అనంతపురం అనంతపురం అర్బన్, రూరల్ పరిధిలో 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 12 మంది చికిత్స పొందుతున్నారు. శెట్టూరు మండలంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా...అతను కూడా పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. మిగతా చోట్ల ఒకటీ రెండు కేసులు మించి నమోదు కాలేదు. పాటిటివ్ కేసుల్లోనూ చాలా మందికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అందరూ త్వరలోనే కోలుకుని డిశార్చ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన చికిత్సతోనే రికవరీ కరోనా బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. అందువల్లే బాధితులంతా త్వరగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో రోజురోజుకూ డిశ్చార్చ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బాధితులకు వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. – గంధం చంద్రుడు, కలెక్టర్ మూడు రెడ్జోన్లు అనంతపురం: ‘‘అనంతపురం అర్బన్‌తోపాటు హిందూపురం అర్బన్, రూరల్ ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించాం. రెడ్‌జోన్‌లో నిబంధనలు యథావిధిగా అమలు చేస్తాం. కరోనా కట్టడిలో భాగంగా అనుమానిత లక్షణాలు కలిగిన వారిని గుర్తించి రక్షించడమే లక్ష్యం. అనుమానిత లక్షణాలుంటే 1800 4256 246 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే పరీక్షలు చేయిస్తాం.’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కరోనాపై ఎవరూ పెద్దగా ఆందోళన చెందవద్దని, పాజిటివ్ బాధిత కుటుంబాలను వెలివేసినట్లుగా చూడకూదన్నారు. వారి వద్ద భౌతిక దూరం పాటిస్తే చాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి, 60 ఏళ్ల వయసు దాటిన వారికి మొదటగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య దృష్ట్యా గర్భిణులకు తప్పనిసరిగా పరీక్షలు చేయిస్తామన్నారు. ప్రత్యేకంగా 1,000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లక్షణాల స్థాయి తక్కువగా ఉన్న కరోనా పాజిటివ్ వ్యక్తులు హోమ్ ఐసోలేషన్‌లో(స్వీయ నిర్భందం) ఉండేందుకు సమ్మతిస్తామన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. రెడ్‌జోన్‌లో 14 రోజుల్లో ఒక్క కేసూ నమోదు కాకపోతే ఆరెంజ్ జోన్‌గా మారుస్తామని.. 28 రోజుల్లో ఒక్క కేసూ నమోదవ్వకపోతే గ్రీన్‌జోన్‌గా మారుస్తామన్నారు. రెడ్‌జోన్: 4 కేసులకు మించిన ప్రాంతాలు (అనంతపురం అర్బన్, హిందూపురం రూరల్, అర్బన్ ) యథావిధిగా లాక్డౌన్ నిబంధనలు ఆరెంజ్ జోన్: నాలుగు కంటే తక్కువ కేసులు (రాప్తాడు, శెట్టూరు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, లేపాక్షి ) మెడికల్ ఎమర్జెన్సీ పనులు. వ్యవసాయం. అనుబంధ పనులు గ్రీన్ జోన్: జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు వ్యవసాయం. పరిశ్రమలు. వ్యవసాయ కూలీలు. కారి్మకులు. మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు అవకాశం. -
నెగిటివ్ అని తేలిన కరోనా మళ్లీ ఎందుకు వస్తుందంటే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల్ని గడగడ వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కరాళ నృత్యానికి చిగురుటాకుల వణికిపోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదుర్కోని ఆరోగ్య సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోంటుంది. లాక్డౌన్ విధించి కరోనాను అదుపుచేయాలని ప్రయత్నిస్తోన్న కరోనా కేసులు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన వారిలో కూడా కరోనా లక్షణాలు తిరిగి నమోదవుతున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా లక్షణాలు డిశార్జ్ అయిన వ్యక్తిలో మళ్లీ కనిపించడానికి కారణం ఏంటో హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పాథాలజీ విభాగం ప్రొఫెసర్ నికోల్స్ తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. (53 మంది జర్నలిస్టులకు కరోనా) సాధారణంగా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరం దానంతటకదే దానికి యాంటీ బయోటిక్స్‌ని తయారుచేసుకుంటుంది. ఒకసారి వ్యాధి తగ్గిన తరువాత మరలా అదే వ్యాధి తిరిగి రాకుండా ఈ యాంటీబయోటిక్స్ రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయి. అయితే కరోనా తిరగబెడుతున్న వారిలో మాత్రం ఈ వైరస్ శ్వాసకోశంలోని కొన్ని ఉపరితల కణాలలో మాత్రమే ప్రతిబింబిస్తుందని అధ్యయానాల్లో తేలింది. అదేవిధంగా శరీరానికి రోగనిరోధకాలను తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది. (పాక్‌లో సామూహిక ప్రార్థనలకు అనుమతి) సాధారణంగా మన శరీరంలోకి వైరస్ కారకాలు ప్రవేశించినప్పుడు వెంటనే యాంటీ బయోటిక్స్‌ని శరీరం తయారు చేసుకునే విధంగా కరోనా వైరస్ విషయంలో జరగకపోవడం అనేది ప్రధాన సమస్య అని అధ్యయనాల్లో తేలింది. వ్యాధి సంక్రమించింది అని నిర్ధారణ చేసుకున్న వారిలో చాలా మందిలో కొద్దిపాటి లక్షణాలే ఉండటం అవి కొన్ని రోజులకు త్వరగానే తగ్గిపోవడంతో శరీరానికి ఆ వైరస్‌కి సంబంధించి ప్రతి రక్షకాలు తయారు చేసుకునే అవకాశం లభించకపోవడం సమస్యగా మారింది. దీంతో కరోనా ఒకసారి నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చిన తరువాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి కరోనా పాజిటివ్ అని వస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో కరోనా నుంచి కోరుకున్న చాలా మంది తిరిగి మహమ్మారి బారిన పడుతున్నారు. గతవారం సౌత్‌కొరియాలో 150 మంది కరోనా నుంచి రికవరీ అయిన వారు తిరిగి కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కరోనాపై 10 మంది పాజిటివ్ రోగుల విజయం
గన్నవరం రూరల్: అవును.. వారు కరోనాను జయించారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా పది మంది 17 రోజుల పాటు చిన్న ఆవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొంది.. పూర్తిగా కోలుకుని ఆదివారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రి వైద్య అధికారులు, సిబ్బంది హర్షధ్వానాలతో బాధితులకు వీడ్కోలు పలికారు. కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోన్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో 10 మంది వైరస్‌ను జయించడం కొంత ఊరటనిచ్చింది. ప్రభుత్వం ప్రోత్సాహం, వైద్యుల కృషితో తాము కరోనాపై విజయం సాధించామని బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటి వరకూ జిల్లాలో 75 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. ఇప్పుడు మరో పది మంది డిశ్చార్జి అవుతుండగా, ఐదుగురు మృతి చెందారు. ఇంకా మరో 55 మంది విజయవాడ ప్రభుత్వాస్పత్రి, పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జి అయిన వారి వివరాలు.. కరోనాపై విజయం సాధించిన వారిలో జగ్గయ్యపేటకు ఇద్దరు వ్యక్తులు(31),(34), నూజివీడుకు చెందిన ఓ యువకుడు(21), విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన వ్యక్తి(47), కేదరేశ్వరపేటకు చెందిన వ్యక్తి (41), లబ్బీపేటకు చెందిన మరో వ్యక్తి (40), విద్యాధరపురం కుమ్మరపాలెం సెంటర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు యువకులు(33), (28) ఉన్నారు. వీరందరూ ఈ నెల 2న కరోనా పరీక్షలో పాజిటివ్ రాగా, అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నాణ్యమైన వైద్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో కరోనాపై విజయం సాధించగలిగారు. వారికి రెండు పర్యాయాలు పరీక్షలు జరపగా నెగిటివ్ రావడంతో ఆదివారం డిశ్చార్జి చేశారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు.. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా ప్రత్యేక అధికారి సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అభినందనలు తెలిపారు. ఈ విపత్కర సమయంలో రోగులకు మెరుగైన వైద్యం అందించి వారిలో మనోస్థైర్యం పెంచేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్చార్జి అవుతున్న వారికి కూడా వారు అభినందనలు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీఎన్ చందర్, మెడికల్ హెడ్ డాక్టర్ జి. ఈశ్వరప్రసాద్, ప్రొఫెసర్ ఆంజనేయ ప్రసాద్, పల్మనాలజిస్ట్ డాక్టర్ భానురేఖ తదితరులు ఉన్నారు. పూర్తిగా కోలుకున్నారు.. ఆస్పత్రిలో ఈ నెల 2న పది మంది పాజిటివ్ రోగులు చేరారు. ఇప్పుడు వారందరూ పూర్తిగా కోలుకున్నారు. తొలుత 14 రోజుల చికిత్స అనంతరం పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది, మరలా 16వరోజు పరీక్ష చేయగా నెగిటివ్ రావడంతో ఇప్పుడు వారందరినీ డిశ్చార్జి చేస్తున్నాం. ఆస్పత్రికి వచ్చిన వారినందరికీ మెరుగైన చికిత్స అందించి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపుతున్నాం. – డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్, పిన్నమనేని సిద్ధార్థ కోవిడ్ ఆస్పత్రి -
కరోనాపై తొలి విజయం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నమోదైన కరోనా తొలి బాధితుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు. మధ్యాహ్నం 2గంటలకు ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు డిశ్చార్జి చేశారు. మార్చి 17న కరోనా లక్షణాలతో ఛాతీ ఆస్పత్రిలో చేరిన 65 ఏళ్ల వృద్ధుడు మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా సోకినట్లు నిర్థారించిన విషయం తెలిసిందే. ఐసోలేటెడ్ వార్డులో సేవలందిస్తూనే మూడు సార్లు రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. మొదటిసారి పాజిటివ్ వచ్చిన తర్వాత రెండు సార్లు నెగిటివ్ రావడంతో డిశ్చార్చి చేశారు. యంత్రాంగం పటిష్టమైన చర్యలు మార్చి 19న అల్లిపురానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడమే కాకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టింది. (పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్) ఆయన మక్కా నుంచి వచ్చిన తరువాత సన్నిహితంగా మెలిగిన వారు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి 11 మంది అనుమానితులను ఛాతీ ఆస్పత్రికి, విమ్స్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. వారందరికీ రక్త పరీక్షలు చేశారు. అందులో అందరికీ నెగిటివ్ వచ్చినప్పటికీ భార్యకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సనపల తిరుపతిరావు మాట్లాడుతూ అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడు పూర్తిగా కోలుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఇంటికి పంపించేశామని, 14 రోజులపాటు హోం క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. -
దానికి మార్గాలున్నాయా?
నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఈమధ్య ‘ప్రెగ్నెన్సీ గ్లో’ అనే మాట విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. నాకు కవలపిల్లలు అంటే చాలా ఇష్టం. కవలపిల్లలను కనడానికి మార్గాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయగలరు. – కె.మనస్వి, నాయుడుపేట ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగా చర్మంలోని గ్రంథులు ఎక్కువగా ఆయిల్‌ను స్రవించడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో రక్త ప్రసరణ పెరగడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, చర్మానికి రక్తనాళాలు విస్తరించడం వల్ల వ్యాకోచించి చర్మం మెరిసినట్లుగా ఉంటుంది. దీనినే ప్రెగ్నెన్సీ గ్లో అంటారు. సాధారణంగా గర్భం దాల్చాలంటే ఒక శుక్రకణం ఒక అండంతో కలవడం వల్ల ఏర్పడాలి. కవల పిల్లలు కనడానికి గర్భాశయం నుంచి రెండు అండాలు విడుదలై, అవి ఫలదీకరణ చెందాలి లేదా పిండం ఆరంభ దశలోనే రెండుగా విభజన చెంది కవలలుగా పెరగడం జరుగుతుంది. కొందరిలో పిల్లల కోసం చికిత్స తీసుకోవడం వల్ల అండాలు ఎక్కువగా తయారై కవల పిల్లలు ఏర్పడతారు. కొందరిలో వారి ఫ్యామిలీలో కవలలు ఉన్నప్పుడు జన్యుపరంగా కవలలు పుట్టవచ్చు. కొందరిలో సాధారణంగానే అవవచ్చు. కవల పిల్లలు కావాలనుకుని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమీ లేదు. అండాలు ఎక్కువగా తయారై, విడుదలవడానికి నిపుణుల పర్యవేక్షణలో మందులు వాడవలసి ఉంటుంది. అలాగని కచ్చితంగా కవలలు పుడతారనేమీ లేదు. ఒక్కోసారి ట్రిప్లెట్స్ కూడా పుట్టవచ్చు. కవలలు ఏర్పడినా, అందులో ఉండే సమస్యలు ఒక శిశువు పుట్టేదాని కంటే ఎక్కువగా ఉంటాయి. నాకు ఈమధ్య వైట్ డిశ్చార్జి ఎక్కువ అవుతోంది. దుర్వాసన వస్తోంది. దీనికి కారణం మరియు నివారణ గురించి వివరంగా తెలియజేయగలరు. – సీఆర్, కదిరి మీ వయసు రాయలేదు. వివాహం అయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అనేది రాయలేదు. ఆడవారిలో వైట్ డిశ్చార్జి అంటే తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి: ఏ సమస్యా లేకుండా గర్భాశయ ముఖద్వారం, యోనిలో ఉండే గ్రంథుల నుంచి స్రవించే మ్యూకస్ ద్రవాల వల్ల వచ్చే వైట్ డిశ్చార్జిని ల్యూకేరియా అంటారు. ఇందులో వాసన, దురద ఉండవు. నీరులాగ జిగటగా వస్తుంది. ఇది పీరియడ్ వచ్చే ముందు, పీరియడ్‌లో, అండం విడుదలయ్యే సమయంలో, కలయికలో ప్రేరణకు గురైనప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండవది: బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జి. వీటిలో తెల్లబట్ట కొద్దిగా పచ్చగా, పెరుగులాగ దురద, మంట, వాసనతో కూడుకుని ఉంటుంది. కొందరిలో గర్భాశయ ముఖద్వారం వద్ద పుండ్లు, గడ్డల వల్ల కూడా తెల్లబట్ట రావచ్చు. ఇలాంటి వాటిని అశ్రద్ధ చేయకూడదు. నీకు వచ్చే తెల్లబట్టతో పాటు దురద కూడా ఉంది కాబట్టి గైనకాలజిస్టును సంప్రదించి లోకల్ ఎగ్జామినేషన్, వివాహిత అయితే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, అవసరమైతే వెజైనల్ స్వాబ్ కల్చర్ పరీక్ష, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. యోని ఇన్ఫెక్షన్లు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, మలద్వారం నుంచి క్రిముల వల్ల, కలయిక వల్ల, లైంగిక సంబంధాల వల్ల, ఇంకా ఇతర కారణాల వల్ల రావచ్చు. నివారణ చర్యల్లో భాగంగా శారీరక శుభ్రతను, జననేంద్రియాల శుభ్రతను పాటించాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, రోజుకు కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగడం, మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనకాలకు శుభ్రపరచుకోవడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నాకు మెనోపాజ్ గురించి అవగాహన ఉంది. ‘పెరీ మెనోపాజ్’ అంటే ఏమిటి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేగలరు. – రమ్య, వినుకొండ పెరీ మెనోపాజ్ అంటే మెనోపాజ్ దశకు చేరే ముందు ఉండే దశ. దీనిలో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయి మెనోపాజ్ దశకు చేరే ముందు అండాశయాల నుంచి స్రవించే ఈస్ట్రోజన్ హార్మన్ మూడు నుంచి ఐదేళ్ల ముందు నుంచే కొద్ది కొద్దిగా తగ్గుతూ విడుదలవడం జరుగుతుంది. ఈ సమయంలో జరిగే శారీరక, మానసిక మార్పులకు చెందిన దశను పెరీ మెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు చేరువలో ఉండే దశ అన్నమాట. ఇది సాధారణంగా నలభై ఏళ్ల వయసు దాటిన తర్వాతి నుంచి మొదలవుతుంది. ఇందులోని లక్షణాల్లో భాగంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఒంట్లో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లషెస్), చెమటలు పట్టడం, పీరియడ్స్‌లో మార్పులు, మూత్ర సమస్యలు, కలయికలో ఇబ్బంది, నొప్పి, మంట, లైంగిక కోరికలు తగ్గడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఈ లక్షణాలు మెనోపాజ్‌కు ముందు మూడు–ఐదేళ్ల నుంచి మూడు నెలల లోపల ఎప్పుడైనా ఉండవచ్చు. కొందరిలో ఏ లక్షణాలూ లేకుండా ఉన్నట్లుండి పీరియడ్స్ ఆగిపోయి (పన్నెండు నెలలు పీరియడ్స్ రాకుండా ఉండటం) మెనోపాజ్ దశకు చేరవచ్చు. పెరీ మెనోపాజ్లోని ఈస్ట్రోజన్ మార్పులను మనం మార్చలేం. కాకపోతే లక్షణాల తీవ్రతను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే ప్రదేశాలలో ఉండటం, ఫ్యాను లేదా ఏసీ కింద ఉండటం, మెడిటేషన్, యోగా, వ్యాయామాలు చేయడం, వదులుగా పలచగా ఉండే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరీ అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, ఈస్ట్రోజన్లా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్ ఉండే సోయాబీన్స్, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆహారంలో తీసుకుంటూ, ఐసోఫ్లావోన్ సప్లిమెంట్లు మాత్రల రూపంలో తీసుకోవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన మధులిక
-
ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ మార్పిడి కోసం మూడు వారాల పాటు ఎయిమ్స్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్‌లో తన పట్ల ఆప్యాయత కనబరిచిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ జైట్లీ ట్వీట్ చేశారు. మే 12న ఆస్పత్రిలో చేరిన జైట్లీ (65)కి మే 12న శస్త్రచికిత్స జరిగింది. అప్పటినుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్సోకకుండా ఆయనకు ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించారు. మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆస్పత్రి నుంచే ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని, గత మూడువారాలుగా తనకు అంకితభావంతో సేవలందించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడిక్స్ అందరికీ కృతజ్ఞతలంటూ జైట్లీ ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రేయోభిలాషులు, సహచరులు, స్నేహితులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. జైట్లీ ఆస్పత్రిలో ఉండగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.