సాక్షి, కర్నూలు(హాస్పిటల్): కరోనా విషయంలో జిల్లా ప్రజలకు శుభవార్త. ప్రస్తుతం యాక్టివ్ కేసుల (ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు) కంటే వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా సోమవారం శాంతిరామ్ ఆస్పత్రి నుంచి 12 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో కర్నూలుకు చెందిన 9 మంది, నంద్యాల అర్బన్ ఇద్దరు, బనగానపల్లె రూరల్ , చాగలమర్రి, కోడుమూరుకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 281కి చేరింది. మరోవైపు 278 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (కరోనా : ఒక్కడి ద్వారా 20 మందికి..!)
9 మందికి పాజిటివ్
జిల్లాలో సోమవారం కొత్తగా 9 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులన్నీ కర్నూలు నగరంలోనే నమోదయ్యాయి. దీంతో నగరంలో కరోనా బాధితుల సంఖ్య 366కు చేరింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 575 మంది కరోనా బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment