
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వడంతో మంగళవారం రాత్రి డిశ్చార్జి చేశామని హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
కోవిడ్ అనంతర సమస్యలతో బాధ పడుతున్న గవర్నర్ వారం క్రితం ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ స్థాయి, ఇతర ఆరోగ్య ప్రమాణాలు అన్నీ సాధారణ స్థితికి రావడంతో డిశ్చార్జ్ చేశారు