
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ టూర్ అనంతరం ఈనెల 15న కరోనావైరస్ బారిన పడిన గవర్నర్ బిశ్వభూషణ్.. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఏపీకి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో.. ఏపీ అధికారులు ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత.. గన్నవరం నుండి విజయవాడలోని రాజ్‌భనవన్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బయలుదేరి వెళ్లారు.