సాక్షి, కర్నూలు: జిల్లాలో 14 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 281 మంది కరోనాపై విజేతలుగా నిలిచారు. జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 278 కంటే డిశ్చార్జ్ అయిన కరోనా విజేతల సంఖ్య 281 కావడం విశేషం. సోమవారం నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 12 మందిని, కర్నూలు జీజీహెచ్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రి నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.
(అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్)
కరోనా వైరస్ నివారణాకు ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో జిల్లాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనాపై విజేతలుగా నిలిచిన బాధితులు అందరిలోనూ ధైర్యంతో పాటు స్ఫూర్తిని నింపారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో కరోనా బారినపడిన బాధితులు క్షేమంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment