ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల్ని గడగడ వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కరాళ నృత్యానికి చిగురుటాకుల వణికిపోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదుర్కోని ఆరోగ్య సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోంటుంది. లాక్‌డౌన్ విధించి కరోనాను అదుపుచేయాలని ప్రయత్నిస్తోన్న కరోనా కేసులు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన వారిలో కూడా కరోనా లక్షణాలు తిరిగి నమోదవుతున్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా లక్షణాలు డిశార్జ్ అయిన వ్యక్తిలో మళ్లీ కనిపించడానికి కారణం ఏంటో హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పాథాలజీ విభాగం ప్రొఫెసర్ నికోల్స్ తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. (53 మంది జర్నలిస్టులకు కరోనా)
సాధారణంగా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరం దానంతటకదే దానికి యాంటీ బయోటిక్స్‌ని తయారుచేసుకుంటుంది. ఒకసారి వ్యాధి తగ్గిన తరువాత మరలా అదే వ్యాధి తిరిగి రాకుండా ఈ
యాంటీబయోటిక్స్ రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయి. అయితే కరోనా తిరగబెడుతున్న వారిలో మాత్రం ఈ వైరస్ శ్వాసకోశంలోని కొన్ని ఉపరితల కణాలలో మాత్రమే ప్రతిబింబిస్తుందని అధ్యయానాల్లో తేలింది. అదేవిధంగా శరీరానికి రోగనిరోధకాలను తయారు చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది. (పాక్లో సామూహిక ప్రార్థనలకు అనుమతి)
సాధారణంగా మన శరీరంలోకి వైరస్ కారకాలు ప్రవేశించినప్పుడు వెంటనే యాంటీ బయోటిక్స్‌ని శరీరం తయారు చేసుకునే విధంగా కరోనా వైరస్ విషయంలో జరగకపోవడం అనేది ప్రధాన సమస్య అని అధ్యయనాల్లో తేలింది. వ్యాధి సంక్రమించింది అని నిర్ధారణ చేసుకున్న వారిలో చాలా మందిలో కొద్దిపాటి లక్షణాలే ఉండటం అవి కొన్ని రోజులకు త్వరగానే తగ్గిపోవడంతో శరీరానికి ఆ వైరస్‌కి సంబంధించి ప్రతి
రక్షకాలు తయారు చేసుకునే అవకాశం లభించకపోవడం సమస్యగా మారింది. దీంతో కరోనా ఒకసారి నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చిన తరువాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి కరోనా పాజిటివ్ అని వస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో కరోనా నుంచి కోరుకున్న చాలా మంది తిరిగి మహమ్మారి బారిన పడుతున్నారు. గతవారం సౌత్‌కొరియాలో 150 మంది కరోనా నుంచి రికవరీ అయిన వారు తిరిగి కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కాపాడుకోవాలంటే శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment