ఆస్పత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జీ | Hema Malini discharged from hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జీ

Published Sat, Jul 4 2015 11:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ఆస్పత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జీ

ఆస్పత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జీ

జైపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమా మాలిని శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజస్తాన్‌లోనో దౌసా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఓ ఆల్టో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన హేమ మాలినికి....... ఫోర్టిస్ అస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు హేమామాలిని డిశ్చార్జ్ చేసినట్లు ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ప్రమాద సమయంలో హేమామాలిని వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దౌసా వద్ద హేమామాలిని ప్రయాణిస్తున్న బెంజ్ కారు మితిమీరిన వేగంతో ఓ ఆల్టో కారును ఢీకొట్టడంతో కారులోని వ్యక్తులకు గాయాలయ్యాయి. అందులో రెండేళ్ల చిన్నారి సోనమ్ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఐతే ప్రమాదం తర్వాత హేమామాలినిగాయపడినవారిని పట్టించుకోకుండానే వెళ్లిపోయారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా గాయపడిన వారి క్షేమసమాచారాల గురించి కానీ, వారికి చికిత్స గురించి కానీ పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. తాను మాత్రం మెరుగైన చికిత్స కోసం ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్లారని, బాధితులను మాత్రం గాలికొదిలేశారని ప్రత్యక్ష్యసాక్షులు ఘాటుగా విమర్శిస్తున్నారు.

ప్రమాదంలో హేమామాలినికి కూడా గాయాలైన మాట వాస్తవమే అయినా...... కనీసం బాధితుల గురించి అడిగి ఉండాల్సిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఐతే హేమామాలిని కుమార్తె ఈషాడియోల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement