ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు | BJP Hema Malini meets farmers during poll campaign in Mathura | Sakshi
Sakshi News home page

ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు

Published Fri, Apr 12 2024 11:56 AM | Last Updated on Fri, Apr 12 2024 12:12 PM

BJP Hema Malini meets farmers during poll campaign in Mathura - Sakshi

ప్రముఖ నటి  బీజేపీ ఎంపీ హేమమాలిని  లోక్‌సభ ఎన్నికల  ప్రచారంలో బిజీగా ఉన్నారు.  ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని   గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు.  దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఈ పదేళ్లుగా  తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో  మరోసారి మమేకమయ్యేందుకు  వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని,  రైతు మహిళలతో  కలిసి  ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి  బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు  బీజేపీకి కంచుకోటగా ఉంది.  అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత  2014లో  హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 

తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో  హేమమాలిని నామినేషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో  ఓటింగ్‌ జరుగుతుంది.  ఏప్రిల్‌ 19, 26 మే 7, మే 13,  మే 20, మే 23 , జూన్  1 ఏడు దశల్లో ఓటింగ్‌ జరుగుతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement