Raithu
-
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
'నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే..' రైతుబడి మాస్టారు!
'దేశరాజధాని నగరం న్యూఢిల్లీలోని ట్రిపుల్ఐటీ సంస్థ. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక మీద దేశవిదేశీ ప్రముఖుల సమక్షంలో ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకున్నాడు మన తెలుగు యువకుడు. నేడు జరగనున్న ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్–2024లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకున్న వ్యాపార అవకాశాల గురించి ప్రసంగించే అవకాశాన్నందుకున్న జూలకంటి రాజేందర్‌రెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు.' ‘‘న్యూఢిల్లీ వేదికగా అది కూడా అత్యున్నత స్థాయి విద్యాసంస్థలో ప్రసంగించే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతకుముందు జాతీయ స్థాయిలో ‘ద నేషనల్ క్రియేటర్స్ అవార్డు’కు సంబంధించిన ‘మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అగ్రి క్రియేటర్’ కేటగిరీలో 36 శాతానికి పైగా ఓట్లు సాధించి రైతుబడి చానెల్ ప్రథమస్థానంలో నిలిచింది. ఇందుకు అసలైన కార్యక్షేత్రం మా నల్గొండ జిల్లా, మాడ్గుల పల్లి మండలంలోని మాచనపల్లి గ్రామం. నా ఎదుగుదల మూలాలు మా ఊరిలోనే ఉన్నాయి. మాది వ్యవసాయ కుటుంబం. కానీ నేనెప్పుడూ పొలం పని చేయలేదు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేస్తుంటే చూడాలని కలలు కన్నారు అమ్మా నాన్న. పనుల ఒత్తిడి ఉంటే సీజన్లో కూడా నాకు పొలం పనులు కాదు కదా, పశువుల దగ్గర సహాయానికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నా కెరీర్ వ్యవసాయ భూమిలోనే వేళ్లూనుకు΄ోయింది. పలక.. పేపర్! అమ్మానాన్న కోరుకున్నట్లే చదువుకున్నాను. బీఈడీ చేసిన తర్వాత స్కూల్లో పలక మీద పిల్లలకు అక్షరాలు దిద్దించాల్సిన వాడిని, అనుకోకుండా కొత్తదారిలో అడుగుపెట్టాను. రోజూ పేపర్ చదివే అలవాటు ఉండడంతో ఓ రోజు జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్ష ప్రకటన నా కంటపడింది. ఉత్సాహం కొద్దీ పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ శిక్షణ పూర్తి చేయలేదు. కానీ 2008లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌తో జర్నలిస్టుగా నా ప్రయాణం మొదలైంది. టీవీ చానెల్స్ మారుతూ కొంతకాలం హైదరాబాద్‌లో, మరికొంత కాలం జిల్లాల్లో ఉద్యోగం చేశాను. వార్తలకే పరిమితం కాకుండా ఫీచర్ స్టోరీల కోసం అన్వేషించేవాడిని. నా అన్వేషణలో కెమెరా కంటికి చిక్కిన ఓ వాస్తవం ఎంత ఆసక్తికరమైందో ఊహించగలరా!? కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే... చత్తీస్గడ్ రాష్ట్రం, జగదల్పూర్లో. ‘కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ’ అక్కడ రాజు హోదాలో ఉన్నారు. వివరాలు సేకరిస్తూ వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి షూట్ చేయడంలో కలిగిన జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంత అని చెప్పలేను. ఇలా ఆరేళ్లు గడిచింది, అనుకోకుండా ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ప్రింట్ మీడియాకి మారాను. అక్కడ ఆరేళ్లు పని చేశాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి స్థాయి క్రమంగా తగ్గి΄ోసాగింది. ఎన్నాళ్లో... ఎన్నేళ్లో ఉద్యోగిగా నీ పయనం... అని నా ఆవేదనను ఫేస్బుక్లో రాసుకునేవాడిని. కరోనా వచ్చింది.. లాక్డౌన్ తెచ్చింది! అది 2020, ప్రపంచానికి గుర్తొచ్చేది కరోనా, లాక్డౌన్. నాకు గుర్తొచ్చే అపురూపమైన ఘట్టం రైతుబడి ఆవిర్భావం. ఆ ఏడాది జనవరిలోనే రైతుబడి మొదలుపెట్టేశాను. ఉద్యోగం మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. మేలో మానేశాను. ఆశ్చర్యం ఏమిటంటే... ఉద్యోగంలో అందుకున్న జీతానికి సమానమైన రాబడిని జూన్‌లోనే చూశాను. రైతులకు ఉపయోగపడే అంశాల మీదనే ఉంటాయి నా వీడియోలన్నీ. ఒకే పంట వేస్తున్న రైతులకు రకరకాల పంటలు వేయమని మాటలతో చెప్పడం వల్ల ప్రభావితం చేయలేం. ఏకకాలంలో రకరకాల పంటలు పండిస్తున్న రైతు అనుభవాలను వారి మాటల్లో వింటే సాటి రైతులు త్వరగా ప్రభావితమవుతారు. ఇదే నా సక్సెస్ ఫార్ములా. వ్యవసాయరంగ పరిశోధకులు, అధికారుల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పించాను. కానీ రైతులు చెప్పిన విషయాలనే సాటి రైతులు గుర్తు పెట్టుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. రైతులు కొందరు వ్యవసాయ పరికరాలను సొంతంగా తయారు చేసుకుంటారు, ఉన్న పరికరాలను తమ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని కూడా బాగా చూపించేవాడిని. పంటలను, రైతులను వెతుక్కుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించాను. లక్షకు పైగా కిలోమీటర్లు ప్రయాణించాను. పదమూడు వందలకు పైగా వీడియోలు చేశాను. నా రైతుబడికి పదమూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఇప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీలాగ నేనొక్కడినే పొలాలకు వెళ్లి కెమెరా ఆన్ చేసి రైతుతో మాట్లాడేవాడిని. ఆ ఫుటేజ్‌ని మా మంజుల (భార్య) ఇంట్లో ఎడిట్ చేసిచ్చేది. ఈ మధ్యనే ఒక టీమ్‌ను తయారు చేసుకున్నాను. నా విజయగాధ నేనే రాసుకున్నాను! "నాలో ఎడతెగని ఆలోచన మొదలైంది. ఎంతోమంది సక్సెస్ స్టోరీలు రాశాను. నా సక్సెస్ స్టోరీని నేను రాసుకోలేనా అనిపించింది. నాలుగు సంస్థల్లో పని చేశాను. సంస్థ పేరు నా ఇంటిపేరుగా నా పేరుకు ముందు చేరుతోంది. కానీ నా పేరే సంస్థ పేరు కాలేదా? ఆ మధనంలో నుంచి పుట్టుకొచ్చిందే రైతుబడి. రైతుబడి అనే అమృతం పుట్టడానికి ముందు నా మదిమధనంలో అనేక గరళాలు కూడా కోరలు సాచాయి. సూపర్‌మార్కెట్, ‘రైతు పంట’ పేరుతో రైతుల ఉత్పత్తుల విక్రయం, ఇన్ షాట్ తరహాలో ‘లోకల్ న్యూస్ యాప్’ పేరుతో ఓ న్యూస్ యాప్, అదే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్... వీటిలో కొన్ని భారీ వైఫల్యాలు, మరికొన్ని పాక్షిక విజయాలనిచ్చాయి. ఆ తర్వాత మరో నాలుగు యూ ట్యూబ్ చానెళ్లు కూడా పెట్టాను. అవి విజయవంతం కాలేదు, కానీ నన్ను విజయపథంలో నడిపించే మార్గదర్శకాలయ్యాయి." – జూలకంటి రాజేందర్ రెడ్డి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, రైతుబడి యూట్యూబ్ చానెల్ గుర్తు పడుతున్నారు! ‘నాకు గుర్తింపు వచ్చింది’ అనే పెద్ద మాట చెప్పను. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా నన్ను గుర్తు పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం పని చేస్తున్న చానెళ్లలో రైతుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీలో ప్రసంగించడానికి ట్రిపుల్ ఐటీ నుంచి ఆహ్వానం రావడానికి కారణం ఈ యూ ట్యూబ్ చానెలే. నేననుకున్నట్లే నా సంస్థపేరు నా పేరు కలిసి ‘రైతుబడి రాజేందర్’నయ్యాను. ఇది కాకుండా నేను చేరాల్సిన లక్ష్యాలు రెండున్నాయి. ఒకటి... వ్యవసాయంలో అనుభవాలు పంచుతున్న రైతుబడి తరహాలోనే మరో వేదిక ద్వారా వ్యాపార అనుభవాలను యువతకు చేర్చడం, కొత్త ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడం. ఇప్పటికే బిజినెస్ బుక్ పేరుతో ఆ ప్రయత్నం మొదలైంది. మరొకటి వ్యవసాయ భూమిని కొనుక్కోవడం. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న ΄ోయారు. అనివార్యమైన పరిస్థితుల్లో మా పొలాన్ని అమ్ముకున్నాం. కొద్దిగానైనా వ్యవసాయభూమిని కొని మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లం భూమితో బంధాన్ని తెంచుకోలేం’’ అన్నారు రాజేందర్‌రెడ్డి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇవి చదవండి: నారి వారియర్! -
సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై.. హమాలీ ఒక్కసారిగా..
ఆదిలాబాద్: భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై హమాలీ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలం వట్టోలికి చెందిన శ్రీనివాస్ సోయా విక్రయించేందుకు బుధవారం భైంసా యార్డుకు వచ్చాడు. బీట్ అనంతరం సోయాలు జల్లెడ పడుతుండగా కిందపడిన గింజలు తీసుకెళ్తానని రైతు కోరడంతో ఆగ్రహించిన హమాలీ రేకుడబ్బాతో కొట్టాడు. దీంతో రైతుకు కంటి వద్ద తీవ్రగాయం కావడంతో ఆగ్రహించిన రైతులు గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం గాంధీగంజ్లోకి వెళ్లి బీట్ నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎల్.శ్రీను, ఎస్సైలు శ్రీకాంత్, సందీప్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. బాధిత రైతును ప్రథమ చికిత్స కోసం తరలించే క్రమంలో రైతులు అడ్డుకున్నారు. దాడి చేసిన హమాలీని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత రైతు శ్రీనివాస్‌ను ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, కానీ రాష్ట్రాన్ని కల్తీ సీడ్‌బౌల్‌గా కల్వకుంట్ల కుటుంబం మార్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ విధ్వంసం జరిగిందని విమ ర్శించారు. కల్తీ విధానాలపై ఉక్కుపాదం మోపుతా మని అసెంబ్లీలో, బయట సీఎం కేసీఆర్ పేర్కొన్న ప్పటికీ ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతుగోస.. బీజేపీ భరోసా’ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం దండుగలా మారింది.. ‘వ్యవసాయ ఒక పండుగ అన్నారు కానీ కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడింది. ఇన్పుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయడం లేదు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఇక వరి పంట వద్దని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు వ్యవసాయ రుణాలు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా వ్యవసాయ రుణాల మీద పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుబంధు అన్నింటికీ పరిష్కారంలా వ్యవహరిస్తోంది. అందరికంటే ఎక్కువగా కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే ఉన్నాయి. ఐదేళ్లుగా రైతు రుణమాఫీ వాయిదా వేసి ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయినా మెజార్టీ రైతులకు మాఫీ జరగలేదు. నాలుగున్నరేళ్లుగా వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి రూ.లక్ష అప్పు ఇప్పుడు రూ.2 లక్షలకు చేరింది. ధరణి పోర్టల్‌తో 20 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు..’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా సమస్యలను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అనేక ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతినే మిగిల్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం కోసం బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. -
తణుకులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
రైతులకోసం RBK సేవలు
-
నేడు రాష్ట్రవ్యాప్తంగా ’రైతు వేదిక’లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ వరంగల్: విత్తు నాటింది మొదలు పంట చేతికొచ్చే వరకు కష్టాల సాగు చేసే అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ఇస్తోంది. రైతులను ఒకే వేదిక కిందకు తీసుకురావడంతోపాటు వారు అధిక రాబడి పొందడంలో సహాయ పడేందుకు నిర్మించిన రైతు వేదికలను నేడు కర్షకులకు అంకితం చేయనుంది. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 572.22 కోట్లు కేటాయించగా క్లస్టర్లవారీగా ప్రతిపాదించిన వాటి నిర్మాణ వ్యయాలను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు భరించాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేదికల నిర్మాణాలను అనుసంధానించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,536, పట్టణ ప్రాంతాల్లో 65 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా భూసేకరణ, తదితర కారణాలతో 63 చోట్ల రైతు వేదికలకు ఇంకా పునాది రాయి పడలేదు. మిగిలిన వాటిలో పూర్తయిన 2,476 రైతు వేదికలను దసరా రోజున ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ అనివార్య కారణాలతో సాధ్యంకాలేదు. సకల సదుపాయాలతో.. రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్ పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామంలో రైతు వేదికలను నిర్మించారు. వేదికల్లో మౌలిక సదుపాయాలైన కుర్చీలు, మైకులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకొనేలా వేదికలను నిర్మించారు. క్లస్టర్ పరిధిలోని రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు సమావేశాలు అక్కడే నిర్వహించుకొనేలా నిర్మాణాలకు రూపకల్పన చేశారు. రైతులకు శిక్షణ, పథకాలపై అవగాహన కార్యక్రమాలు ఈ వేదికల్లోనే నిర్వహించనున్నారు. రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ ఇదే ‘వేదిక’ కానుంది. దాతల చేయూత... రైతు వేదికల నిర్మాణంలో కర్షక లోకానికి దాతలు అండగా నిలిచారు. కొన్నిచోట్ల స్థలాలను, మరికొన్ని చోట్ల నిర్మాణ ఖర్చులను విరాళంగా ఇచ్చారు. 135 చోట్ల రైతు వేదికల నిర్మాణ స్థలాలను దానం చేయగా 24 చోట్ల వాటి నిర్మాణ వ్యయాన్ని దాతలు భరించారు. కొడకండ్లలో ప్రారంభించనున్న సీఎం... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జనగామ జిల్లా కొడకండ్లకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొడకండ్లకు చేరుకొని 12:10 గంటలకు రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. 12:20 నిమిషాలకు సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులను పరిశీలిస్తారు. కొడకండ్లలో దాదాపు 5 వేల మంది రైతులతో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. -
శరవేగంగా రైతు వేదికల నిర్మాణం
కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పుడమి బిడ్డల సేవ కోసం రైతువేదికలు సిద్ధమవుతున్నాయి. ఈపాటికే మహబూబ్‌నగర్ మండలంలోని వెంకటాపూర్‌లో పూర్తయింది. రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించారు. కలెక్టర్ వెంకట్రావ్ సైతం నిరంతరం పర్యవేక్షిం చారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో మిగిలిన రైతువేదికల్లోనూ వేగం పెంచారు. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా 88 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో దాని పరిధిలో ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మిస్తున్నారు. వీటన్నింటిని దసరా పండుగ నాటికి పూర్తిచేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను సైతం నియమించిన విషయం విదితమే. ఈ క్లస్టర్లలో రైతువేదికలను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ నేతృత్వంలో అధికారులు యుద్ధప్రాతిపదికన అనువైన స్థలాలను గుర్తించి పనులు మొదలుపెట్టారు. పంటల సాగు, వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలను రైతులకు వివరించడం, సమావేశాల నిర్వహణ, చైతన్య కార్యక్రమాలు జరపడానికి వీలుగా ఈ వేదికలు ఉంటాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో సుమారు 2,500మంది రైతులకు మేలు చేకూరనుంది. జిల్లాలోని 15 మండలాల్లో.. మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పట్టణ ప్రాంతం కావడంతో ఎదిర రెవెన్యూ గ్రామంలో ఒకే రైతువేదికను నిర్మిస్తున్నారు. పంటల సాగులో ఉన్న మండలాల్లో మాత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు నిర్మిస్తున్నారు. ఒక్కో దాని కోసం రూ.22 లక్షలు వెచ్చిస్తున్నారు. మొత్తం 88 వేదికలను రూ.19.36 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రతి వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తే చుట్టూ ప్రహరీ నిర్మించాలని యంత్రాంగం యోచిస్తోంది. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం సేకరించారు. భూమి లభ్యత ఉన్న చోట ఎకరం కేటాయించారు. నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అప్పగించారు. భూసార పరీక్షలు సైతం.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 55క్లస్టర్లలో భూసార పరీక్ష కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. నియంత్రిత సాగు విధానంలో భాగంగా పంట మార్పిడి కోసం భూసార పరీక్షలు కీలకం అవుతున్నాయి. దీంతో పరీక్షలను విస్తృతం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో ఒకటి చొప్పున భూసార కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దసరాకు పూర్తవుతాయి జిల్లాలో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా నాటికి అన్ని వేదికలు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రైతులకు అన్నివిధాలా ఉపయోగపడే రీతిలో వీటిని నిర్మిస్తున్నాం. – సుచరిత, డీఏఓ -
ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్ విస్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. -
శివార్లను పీల్చి.. సిటీకి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ శివార్లలో నీటివ్యాపారం కోట్లు దాటింది. చాలామంది రైతులు తమభూముల్లో బోరుబావులు తవ్వి నీటిని గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం ‘నీరు’గారింది. నీటివ్యాపారం చేసే రైతులు, ట్యాంకర్ యజమానుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, రైతుల కంటే ట్యాంకర్ మాఫియాకు కోట్లాది రూపాయల లాభాలు సమకూరుతున్నాయని ఐఐటీ గౌహతి, నెదర్లాండ్స్‌కు చెందిన వేజ్ నింజెన్ వర్సిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ‘నీళ్లు ఎవరివి.. లాభాలు ఎవరికి’అన్న అంశంపై జరిగిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో వెలుగుచూసిన పలు అంశాలు ఇవీ.. తగ్గిన వ్యవసాయభూములు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల రైతులు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపైనే ఆధారపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ, బీపీవో, పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్కులు, ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించడంతో ఇక్కడ వ్యవసాయ భూముల సంఖ్య తగ్గింది. రైతులకు నష్టపరిహారంతోపాటు హెచ్ఎండీఏ లే అవుట్లలో నివాస స్థలాలు కేటాయించింది. ఆ ప్లాట్లలో ఇప్పుడు బోరుబావులు తవ్వి ఆ నీటిని ఫిల్టర్‌ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రైతులు విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా కోకాపేట్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విచక్షణా రహితంగా బోరుబావులు విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం కారణంగా శివార్లలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1,000–1,500 అడుగుల లోతుకుపైగా బోరుబావులు తవ్వాల్సి వస్తోంది. వర్షపునీటి నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార, రియల్టీ వర్గాలు చర్యలు తీసుకోవడంలేదు. నీటిలేమి కారణంగా చిన్న రైతులు వ్యవసాయం వీడి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. రైతులవి నీళ్లు..లాభాలు ట్యాంకర్ మాఫియాకు.. రైతులు నీటిని విక్రయిస్తే.. ఒక్కో ట్యాంకర్(ఐదువేల లీటర్లు)కు రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే లభిస్తోంది. అదే నీటిని తీసుకెళ్లి వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, రిసార్ట్స్,కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలకు విక్రయిస్తున్న ట్యాంకర్ యజమానులకు ఒక్కో ట్రిప్పునకు రూ.800 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటవుతోంది. సాగు తగ్గడానికి కారణాలు.. - రైతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగుచేస్తే వచ్చే దిగుబడులు ఆశాజనంగా లేకపోవడం - వర్షపాత లేమి , చీడపీడల నివారణకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండడం - పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడం -
రైతొక్కడే
నీళ్లుండవు. వానలుండవు. విత్తనాలు ఉండవు. ఎరువులు ఉండవు. రైతొక్కడే ఉంటాడు. తెల్లారే లేచి పండించడానికి వెళతాడు. ఆశ! కాల్వ పారకపోతుందా, ఆకాశం కురవకపోతుందా, విత్తనాలు రాకపోతాయా, ఎరువుల లారీలు లోడు దించకపోతాయా అని.. ఆశ. పాలనల్లో తేడాలుంటాయేమో,పంట భూముల్లో చిందే స్వేదంలో భేదాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలమైనా,ఈ భూమండలంలో ఇంకోచోట మరోచోట అయినా ఒకటే.-మాధవ్ శింగరాజు అసలుకైతే ‘రాజు’ అని పిలవాలి ఆయన్ని. అసలైన రాజొకరు ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారు కనుక ఆయన్ని రైతు అని పిలవక తప్పదు. ఆ రైతుకు ఒక పేరుంది. ఒకవేళ ‘రాజు’ అనేదే ఆ రైతు పేరు అయివున్నా, ‘రాజు’ అనే ఆ పేరు కన్నా ‘రైతు’ అనేది సిరి గల పేరు కాబట్టి ఆయన్ని రైతు అనడమే ఆయనకు సరితూగే మాట.గింజల కోసం పక్షులు రైతు ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. గింజల్ని చేర్చడం కోసం రైతే ప్రజల్ని, రాజప్రాసాదాన్ని, మంత్రివర్యుల ఇళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. గింజల్ని పండించి, బస్తాలు దించే పక్షి ఆయన. అలాంటి పక్షి రైతు ఒకరు మొన్న గురువారం.. చెట్టుపై నుంచి టప్పున రాలి పడినట్లుగా.. నిలుచున్న చోటే నేలన పడి కన్నుమూశాడు. కరెంటు తీగ మీద పక్షులన్నీ ఒక వరుసలో వాలి నిలబడినట్లు.. యూరియా కోసం రైతులంతా ఒక వరుసలో నిలబడి వేచి ఉన్నప్పుడు, మూడు రోజులుగా అలాగే నిలబడి నిలబడి చివరికి నేలకు కూలబడి తలవాల్చేశాడు. ఆయన వయసు 69 ఏళ్లు. నలుగురు కూతుళ్లు. పెద్ద కూతురి భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఏడేళ్ల క్రితమే ఆమె పుట్టింటికొచ్చేసింది. రెండో కూతురు పెళ్లయింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. మూడో కూతురు వికలాంగురాలు. నాలుగో కూతురికి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేశాడు. పెళ్లి కోసం అప్పు చేశాడు. అదింకా తీరనే లేదు.. అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఒంటరి రైతు. ఆయన చనిపోయే క్షణాల్లో ఆమె ఇంకో వరుసలో నిలబడి ఉన్నారు.. ఈ వరుసలో రాకపోయినా, అదృష్టం ఉంటే ఆ వరుసలోనైనా యూరియా వస్తుందని. చనిపోయిన రైతు పేరు, చనిపోయిన రైతు ఊరు చెప్పుకోవడం రైతును ఒక ముక్కకో, చెక్కకో పరిమితం చేయడమే. రాజుకు ఒకటే రాజ్యం. ఏ రాజ్యంలోనైనా రైతు పండించినదే భోజనం. పాలనల్లో తేడాలుంటాయేమో, పంట భూముల్లో చిందే స్వేదంలో భేదాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలమైనా, ఈ భూమండలంలో ఇంకోచోట మరోచోట అయినా ఒకటే. నీళ్లుండవు. వానలుండవు. విత్తనాలు ఉండవు. ఎరువులు ఉండవు. రైతొక్కడే ఉంటాడు. తెల్లారే లేచి పండించడానికి వెళతాడు. ఆశ! కాల్వ పారకపోతుందా, ఆకాశం కురవకపోతుందా, విత్తనాలు రాకపోతాయా, ఎరువుల లారీలు లోడు దించకపోతాయా! యూరియా కోసం మూడు రోజులు ఆశపడ్డాడు ఆ రైతు. మూడో రోజు శ్వాస వదిలాడు. అన్నం పెట్టే రైతు ఎర్రటి ఎండలో ఎరువుల కోసం విస్తరి పట్టుకుని వరుసలో నిలుచోవడం ఏంటి! ‘రైతన్నా.. నువ్వు ఇంటికెళ్లు. నీ ఇంటికే ఎరువొస్తుంది’ అనే చెప్పే రాజు ఏడి? ‘రైతన్నా.. రాజుగారు పంపించారు నీకు విత్తనా లిమ్మని’ అని రైతు ఇంటికి వెళ్లి తలుపు తట్టే మంత్రి ఏడి? ‘రైతన్నా.. ఇన్నాళ్లూ పండించావు. డెబ్బై ఏళ్లొచ్చినా ఇంకా పండిస్తానంటున్నావ్. నీ బదులు నేను వరుసలో నిలబడి ఎరువు తెస్తా. ఆ నీడన కూర్చో’ అనేవాళ్లు ఏరి?! అనేవాళ్లు లేకపోయినా.. రైతు తరఫున అడిగేవాళ్లు లేకుండా పోతారా? ‘‘ప్రభుత్వమే చంపేసింది ఈ వృద్ధ రైతుని’’ అన్నారు. ‘‘సినిమా టిక్కెట్ల కోసం క్యూలో నిలుచుని గుండెపోటుతో చనిపోతే సినిమా హాలు ఓనరు బాధ్యుడవుతాడా?’’ అన్నారు మంత్రి గారు! ఎంటర్టైన్మెంట్ కోసం క్యూలో నిలబడినవారు, పంట పండించడం కోసం వరసగట్టినవారూ ఒకటేనా?! రైతు చనిపోడానికి గుండెపోటే కారణం అయినా, గుండెపోటు రావడానికి ఒక కారణం ఉంటుందిగా? నోట్లు రద్దయినప్పుడు ఏటీఎంల దగ్గర నిలబడి చనిపోయినవారు, డెడ్లైన్లు దగ్గర పడినప్పుడు ‘ఆధార్’ కోసం నిలబడి చనిపోయినవారు, ఇప్పుడు యూరియా కోసం నిలబడి చనిపోయిన రైతూ.. వీళ్లందరికీ క్యూలో ఉన్నప్పుడే గుండెపోటు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తోంది? భారతదేశంలో ఐదు వేల ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలైందన్న సీసీఎంబీ పరిశోధనా ఫలితం ఒకటి ఆ రైతు చనిపోయిన రోజే బయటికి వచ్చింది. ఐదు వేల ఏళ్లుగా రైతు వ్యవసాయం చేస్తున్నా.. ప్రభుత్వాలు ఈనాటికీ ఆయన్ని ‘లైన్’లో నిలబెట్టకుండా చిన్న సాయం కూడా చేయలేకపోతున్నాయి! -
వరద బీభత్సం.. ఓ రైతు పెద్దమనసు
భారీ వర్షాలు, వరదలతో కేరళ, కర్ణాటక, మహారాష్ట రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ప్రజలు సర్వం కోల్పోయి సహాయక కేంద్రాల్లో కిక్కిరిసిపోతున్నాయి. వరద విపత్తు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. కేరళలో వరదల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాయనాడ్, మలప్పురం తదితర ప్రాంతాల్లో అనేక చోట కొండచరియలు విరిగి పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. సర్వం కోల్పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాదిమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇంత కష్టంలోకూడా కేరళలోని రాజాకట్టకు చెందిన అశోకన్ అనే రైతు ఆదర్శవంతంగా నిలిచారు. సర్వం కోల్పోయినా మంచినీ, మానవత్వాన్నీ కోల్పోలేదు. వరద ధాటికి తోటలో వెయ్యికి పైగా అరటి చెట్లు నిట్టనిలువునా కుప్ప కూలిపోయాయి. చేతికొచ్చిన బంగారంలాంటి పంట సర్వ నాశనమైపోయింది. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా గుండె చెరువు అవ్వక మానదు. ఇక ఆ రైతు పరిస్థితిని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే తన దాతృత్వంతో మనిషిగా అందనంత ఎత్తున నిలిచారు. ప్రకృతి ప్రకోపానికి కూలింది చెట్లే కానీ, తాను కాదంటూ పెద్దమనసు చాటుకున్నారు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి అరటిపళ్లను, పనసకాయలు తదితరాలను బాధితులకివ్వమంటూ స్థానిక మీడియా సిబ్బందికి అందించారు. తన దగ్గర ఇంతకంటే ఏమీ మిగల్లేదని వాపోయారు. న్యూస్18 ప్రతినిధి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. -
రేపు రైతులతో జగన్ ముఖాముఖి
అనంతపురం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రైతులతో సమావేశం అవుతారు. ఉదయం 10 గంటలకు బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో రైతులతో సమావేశం (ముఖాముఖి) అవుతారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజారాం తెలిపారు. పార్టీలకతీతంగా జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలను నేరుగా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు తప్పక హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. -
ఏప్రిల్ నుంచి రైతుమిత్ర గ్రూపులకు రుణాలు
- జిల్లా సహకార అధికారి ప్రవీణ అమలాపురం టౌన్ : వచ్చే ఏప్రిల్ నుంచి సహకార సంఘాల్లో జాయింట్ లైబిలిటీ గ్రూపుల (జేఎల్‌జీ) ద్వారా రైతుమిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వనున్నామని, ఈలోగా జిల్లాలోని 304 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జేఎల్‌జీ గ్రూపుల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా సహకార అధికారిణి (డీసీవో) టి.పవ్రీణ వెల్లడించారు. జేఎల్‌జీల ఏర్పాటు, రైతు గ్రూపులకు రుణాల బట్వాడా తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు స్థానిక డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో అమలాపురం డివిజన్లోని సంఘాల అధ్యక్షులు, సీఈవోలకు మంగళవారం జరిగిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇంతకాలం సహకార సంఘాల్లో రైతులకు వ్యక్తిగతంగానే పంట రుణాలు ఇచ్చేవారు, ఇప్పుడు జేఎల్‌జీ విధానంలో రైతులకు కూడా గ్రూపులుగా రుణాలు ఇచ్చే వెసులబాటు అందుబాటులోకి వస్తోంది. డివిజనల్ సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో డీసీవో ప్రవీణ పలు సహకార అంశాలపై చర్చించారు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చే విధానాలపై ఆమె సమీక్షించారు. డిజిటల్ మెంబరు రిజస్ట్రేషన్ (డీఎంఆర్)కు సంబంధించి సంఘ సభ్యుల పూర్తి సమాచారం సేకరించాలని ఆమె సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంఘాలు 50:50 పద్ధతిలో గోదాములు నిర్మించుకునే వెసులబాటును సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ పేర్కొన్నారు. సంఘాల్లో తెల్లకార్డు కలిగిన సభ్యులకు ఆరోగ్య రక్ష ద్వారా బీమా కల్పించాలని సూచించారు. జిల్లా సహకార ఆడిటర్ వీవీ ఫణికుమార్ సంఘాల్లో ఆడిట్, జేఎల్జీపై సంఘాల అధ్యక్షులకు అవగాహన కల్పించారు. జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, కోనసీమ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయ రామారావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి మాట్లాడుతూ సహకార సంఘాల్లో జేఎల్‌జీ విధానం అమలుపై ప్రసంగించారు. -
తమిళ దర్శకుడితో 101వ చిత్రం.?
తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటించిన బాలకృష్ణ ఘనవిజయం సాధించాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. అదే ఊపులో తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ప్రతిష్టాత్మక చిత్రం తరువాత చేయబోయే సినిమా కావటంతో అదే జోరును కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే రెండు, మూడు సినిమాలను పరిశీలనలో పెట్టాడు. ముందుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేసాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంప్రదిస్తున్నారు. ఆయన అంగీకరిస్తేనే రైతు సినిమా ఉంటుందని లేని పక్షంలో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేయాలని భావిస్తున్నాడు. అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసే రవికుమార్, తెలుగులోనూ ఒకటి, రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. పక్కా కమర్షియల్ సినిమాలను అందించటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న రవికుమార్ బాలయ్య బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథ రెడీ చేశాడట. రైతు సినిమా లేని పక్షంలో రవికుమార్ సినిమానే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. -
రౌడీ బజార్
రైతుల పేరుతో ‘తమ్ముళ్ల’కు దుకాణాల కేటాయింపు అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యం తమకు సంబంధం లేదంటూ ఎస్టేట్ అధికారి, తహశీల్దారుల పలాయనమంత్రం జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకూ అడ్డంకులు రైతులకు న్యాయం జరిగే వరకూ పోరు ఆగదన్న వైఎస్సార్ సీపీ నేత లీలాకృష్ణ మండపేట : మండపేట రైతుబజారు సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. అక్రమాలపై విచారణకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీశ్రేణులపై దాడికి యత్నించారు. వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. కార్యాలయం లోపలి నుంచి బయటకు వస్తున్న వారిపై కవ్వింపు చర్యలతో గలాటా సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారి మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిని లోపలికి పోనీకుండా గేటుబయట బైఠాయించి అధికారపార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక రైతుబజారులో రైతులకు కాకుండా అధికారపార్టీ నేతలకు షాపులను కట్టబెట్టడంపై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఎస్టేట్ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వస్తానన్న ఈఓ హామీ మేరకు వైఎస్సార్ సీపీ నేతలు అక్కడకు వెళ్లగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం విచారణకు వస్తున్నట్టు ఈఓ భాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు లీలాకృష్ణ, పార్టీ నేతలతో కలిసి రైతుబజారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అధికారపార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు పడాల సతీష్ తదితరులు తమ వాదనలు వినేందుకు మార్కెట్‌గేటు వద్దకు రావాలని కోరారు. అందుకు నిరాకరించిన ఈఓ కేవలం ఆరుగురు మాత్రమే కార్యాలయంలోకి రావాలని సూచించారు. లీలాకృష్ణ, వెంకన్నబాబులతో పాటు మరోనలుగురు కార్యాలయంలోకి వచ్చి తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు గూర్చి ఈఓ భాస్కర్‌కు వివరించారు. అలాగే కూరగాయలు పండిస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించారని, ఏదో ఒక రైతుకు చెందిన కూరగాయల పంటను చూపించాలని లీలాకృష్ణ ఈఓను కోరారు. తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదు, మార్కెటింగ్ అధికారులదే బాధ్యతని చెబుతున్నారని ఈఓకు లీలాకృష్ణ వివరించారు. ఎవరికి వారే తప్పించుకునే యత్నం.. వీఆర్ఓ, తహశీల్దార్, ఉద్యానవనశాఖ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రాల మేరకే తాము రైతులుగా గుర్తించి దుకాణాలు కేటాయిస్తామని, విచారణ చేసే అధికారం తనకు లేదని ఈఓ భాస్కర్ తెలిపారు. ఇదే విషయాన్ని లీలాకృష్ణ ఫోన్లో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఈఓ భాస్కర్లతో పరస్పరం మాట్లాడించారు. రైతుల గుర్తింపు తమకు సంబంధం లేదని ఈఓ అనగా, మాకూ సంబంధం లేదని తహసీల్దార్ తప్పించుకునే యత్నం చేశారు. తమ్ముళ్ల వీరంగం అప్పటికే బయట ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు లోపలికి చొరబడి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. లోపలి నుంచి బయటకు వస్తున్న లీలాకృష్ణ, పార్టీ నేతలపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం బందోబస్తు నేపథ్యం లో ఒక హెచ్‌సీ, ఒక పీసీ మాత్రమే రైతుబజారుకు వచ్చి లీలాకృష్ణతో చర్చించి రైతుబజారు నుంచి బయటకు పంపేశారు. దీంతో వారు అర్హులైన రైతులకు దుకాణాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కరాచీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అధికారపార్టీ నేతల తీరుపై ఫిర్యాదు చేసేం దుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అప్పటికే అక్కడకు చేరుకున్న అధికారపార్టీ నేతలు స్టేషన్ వద్ద లీలాకృష్ణ తదితరులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. హెచ్‌సీ సత్యనారాయణ వారి తో చర్చించి అందరిని స్టేషన్లోకి పంపా రు. రామచంద్రపురం అర్బన్ ఎస్ఐ శ్రీనివాసరావు స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. కొద్దిసేపటికి సీఐ హ్యాపీకృపావందనం స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపుచేశారు. తమపై దాడికి పాల్ప డ్డారంటూ ఇరువర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు దౌర్జన్యం రైతుబజారు షాపుల కేటాయింపులో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని లీలాకృష్ణ విమర్శించారు. తన వారికి మేలు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రైతులకు అన్యాయం చేశారన్నారు. అసలైన రైతులకు మేలు జరిగే వరకు పోరు ఆపబోమన్నారు. బయటి రైతుబజార్లతో పోలిస్తే మండపేట రైతుబజారులో కేజీకి రూ.నాలుగు వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అసలైన రైతులు ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదని లీలాకృష్ణ పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు అన్నందేవుల చంద్రరావు, పార్టీ నాయకులు పడాల కమాలారెడ్డి, పడాల సతీష్, ఎస్.కోటేశ్వరరావు, సరాకుల అబ్బులు, పొలమాల సత్తిబాబు, మేడపాటి సురేష్‌రెడ్డి, తిరుశూల శ్రీను పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసుల బనాయింపు రైతుబజారులో అక్రమాలపై విచారణ కోరిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని రైతుబజారులో సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆకస్మిక తనీఖీ నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా అధికారపార్టీ నేతలకు షాపులు కట్టబెట్టగా కొందరు బినామీల పేరుతో నిర్వహిస్తుండగా, మరికొందరు అద్దెకు ఇచ్చుకున్నట్టు తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ నిర్వహించి అసలు రైతులకు మేలు చేయాలని అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు లీలాకృష్ణ ఫిర్యాదుచేశారు. విధుల్లో ఉన్న ఈఓ బి.సతీష్‌ను వివరణ కోరగా తనకు తెలీదని బదులిచ్చాడు. కాగా లీలాకృష్ణ, మరికొందరు వచ్చి తన విధులకు ఆటంకం కలిగించినట్టు ఈఓ బి.సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ కేసు నమోదైంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు రమణమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసినట్టు పట్టణ హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు. -
రైతు బజారుల్లో బినామిల హవా
హోటళ్లకు భారీగా సరఫరా ప్రజలకు దక్కని కూరగాయాలు జాడలేని రైతులు పట్టించుకోని అధికారులు దళారుల బారిన పడకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందేందుకు రైతుల కోసం రెండు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారులు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. రైతులే తమ పొలాల్లో పండించిన స్వచ్ఛమైన తాజా కూరగాయలను రైతు బజారుకు తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బినామీ పేర్లతో బయటి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. రైతులు రైతుబజారుల బయట సైకిళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎస్టేట్ అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు తెలిసిందే. కానీ పట్టించుకోరంతే - కోటగుమ్మం (రాజమహేంద్రవరం) జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏడు, కాకినాడలో రెండు, అమలాపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి, రామచంద్రపురంలో ఒకటి, రావులపాలెంలో ఒకటి, మండపేటలో ఒక రైతు బజారు ఉంది. రాజమహేంద్రవరానికి దోసకాయలపల్లి, కోరుకొండ, సీతానగరం, బొబ్బిల్లంక, మునగాల, తదితర ప్రాంతాలు, మిగిలిన రైతు బజార్లకు ఆయా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు పండించి తీసుకువస్తుంటారు. జిల్లా నలుమూలలకు చెందిన సుమారు 1200 మంది రైతులు, పొదుపు మహిళా సంఘాలకు, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న రైతు బజార్లు పర్యవేక్షణ లోపాల వల్ల అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రైతుల స్థానంలో బినామీ వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యానశాఖ ఉద్యోగుల ఉదాసీన విధానం వల్ల సమస్యలు శృతి మించుతున్నాయి. గుర్తింపు కార్డులు లేకుండానే.. జిల్లాలో 14 రైతు బజార్లు ఉన్నాయి. అయితే పలు రైతు బజార్లలో చాలా మంది రైతులు గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కార్డులు చిరిగిపోయాయంటున్నారు. మరికొందరు కార్డులు పోగొట్టుకున్నారు. ఇదే ఆసరాగా కొందరు ఎస్టేట్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో బినామీ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరలు పక్కదారి.. ఉదయమే పార్లర్లు, రెస్టారెంట్ల సిబ్బంది వచ్చి అధిక పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తాము వచ్చేసరికి రైతుబజారులో కూరగాయాలు చాలా వరకు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇక తూనికల్లో తేడాలు సరేసరి. కొన్ని స్టాళ్లలో ఎలక్ట్రానిక్ కాటాలు మూలకు చేరాయి. మర్చిపోయిన జంబ్లింగ్ జాయింట్ కలెక్టర్లు మారిపోయినా బజార్లలో జంబ్లింగ్ జరగలేదు. గతంలో ఏడాదికోసారి జంబ్లింగ్ పద్దతిని పాటించే వారు. అయితే ఎనిమిదేళ్లుగా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫైలు ఉన్నతాధికారుల వద్ద ఉందంటూ మార్కెటింగ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఒక్కో రైతు బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. బియ్యం వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దాంతో పాత వ్యాపారులే ఇక్కడ పాతుకుపోయారన్న విమర్శలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న రైతు బజార్లను అధికారులు గాడిలో పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ప్రజావసరాలకు అనుగుణంగా రైతుబజార్లు
సీఈవో రమణమూర్తి కాకినాడ సిటీ : ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతుబజార్లలో సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్టు సీఈవో బీవీ రమణమూర్తి తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10 రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రైతుబజార్లన్నింటికీ పటిష్టమైన షెడ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురంలోని జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తొలుత జిల్లాలోని రైతుబజార్ల పనితీరును జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సీఈవోకు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీఈఈ ఎస్ఎస్వీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రజానేత స్పర్శతో బాధిత కుటుంబాల్లో ఆనందం
-
మహిళా రైతు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం చిన్నకలవలలో మధునమ్మ అనే రైతు ఆత్మహత్య కు పాల్పడింది. అప్పుల బాధతో మధునమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్టు స్తానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ముదిగొండ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కానాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజయ్య(45) తనకున్న రెండెకరాల భూమిలో పత్తిసాగు చేశాడు. ఈ రోజు ఉదయం పత్తి చేనుకు మందు కొట్టడానికి వెళ్లిన రాజయ్య అదే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ పెరగడంతో పాటు పత్తి చేనుకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాదనే బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
రైతురాజ్యం 31st July 2015
-
రైతురాజ్యం 30th July 2015
-
రైతురాజ్యం 27th July 2015
-
రైతురాజ్యం 16th July 2015
-
రైతురాజ్యం 15th July 2015
-
రైతురాజ్యం 11th June 2015
-
రైతురాజ్యం 10thJune2015
-
రైతురాజ్యం 8th June 2015
-
రైతురాజ్యం 27th May 2015
-
రైతు రాజ్యం 25th May 2015
-
రైతురాజ్యం 20th May 2015
-
రైతురాజ్యం 7th May 2015
-
రైతురాజ్యం 6th May 2015
-
రైతురాజ్యం 14th April 2015
-
రైతు రాజ్యం 8th April 2015
-
రైతురాజ్యం 1st April 2015
-
రైతురాజ్యం 31st March 2015
-
రైతురాజ్యం 30th March 2015
-
రైతురాజ్యం 24th March 2015
-
రైతురాజ్యం 20th March 2015
-
రైతురాజ్యం 19th March 2015
-
రైతు రాజ్యం 15th Jan 2015
-
రైతు రాజ్యం 13th Oct 2014
-
రైతు రాజ్యం 8th Oct 2014
-
రైతు రాజ్యం 3rd Oct 2014
-
రైతు రాజ్యం 1st Oct 2014
-
రైతురాజ్యం 1st Oct 2014
-
రైతు రాజ్యం 26th Sept 2014
-
రైతు రాజ్యం 25th Sep 2014
-
రైతు రాజ్యం 23rd Sept 2014
-
వైఎస్సార్ రైతు రాజ్యం
-
రైతు రాజ్యం 28th August 2014
-
రైతురాజ్యం - బడ్జెట్ స్పెషల్
-
రైతు రాజ్యం 26th August 2014
-
రైతు రాజ్యం 22nd August 2014
-
రైతురాజ్యం 21st August 2014
-
రైతు రాజ్యం 20th August 2014
-
రైతు రాజ్యం 15th August 2014
-
రైతురాజ్యం 8th August 2014
-
రైతు రాజ్యం 4th August 2014
-
రైతు రాజ్యం 25th July 2014
-
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ‘రైతు దీక్షలు’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతు దీక్షలను చేపడుతోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కు తగ్గే వరకూ మడమ తిప్పని ప్రజా పోరాటాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగానే గురువారం నియోజకవర్గాల కేంద్రాల్లో ‘రైతు దీక్ష’ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో బత్తలపల్లి నుంచి ధర్మవరం వరకు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. -
రైతన్న రాజ్యం 20th August 2013