ముదిగొండ(ఖమ్మం): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కానాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజయ్య(45) తనకున్న రెండెకరాల భూమిలో పత్తిసాగు చేశాడు. ఈ రోజు ఉదయం పత్తి చేనుకు మందు కొట్టడానికి వెళ్లిన రాజయ్య అదే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ పెరగడంతో పాటు పత్తి చేనుకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాదనే బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.