వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్య ‘రైతు దీక్షలు’ | YSRCP Conducting Samaikya 'Raithu Deekshalu' | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్య ‘రైతు దీక్షలు’

Published Thu, Oct 10 2013 3:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

YSRCP Conducting Samaikya 'Raithu  Deekshalu'

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతు దీక్షలను చేపడుతోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కు తగ్గే వరకూ మడమ తిప్పని ప్రజా పోరాటాలను నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగానే గురువారం నియోజకవర్గాల కేంద్రాల్లో ‘రైతు దీక్ష’ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో బత్తలపల్లి నుంచి ధర్మవరం వరకు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement