deekshalu
-
ప్రజాధనాన్ని దోచుకుని సత్యాగ్రహ దీక్షలా?
సాక్షి, అమరావతి : మహాత్మాగాందీని అవమానించే రీతిలో చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పవిత్ర ఉద్దేశ్యంతో దీక్షలు చేస్తే బాగుంటుంది కానీ, అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబు గురించి టీడీపీ నేతలు దీక్షలు చేయటం సిగ్గుచేటన్నారు. దోపిడీ చేసి జైలుకెళ్లి బాబు దీక్షలు చేయటమేమిటని ఆయన ప్రశ్నించారు. మహాత్మాగాందీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట సాధనలో ఆ మహనీయుల త్యాగాలను, పోరాటాలను సజ్జల గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు సిగ్గులేకుండా గాంధీ జయంతి రోజున నిరాహారదీక్ష చేయడమేమిటి? మహాత్మాగాందీని అవమానించే రీతిలో ఆయన దీక్షలున్నాయి. బాబు ఆధారసహితంగా దొరికిపోవడంవల్లే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలులో దీక్షలు చేయడం హాస్యాస్పదం. ప్రజల కోసం పోరాటంచేసి జైలుకెళ్తే వేరు. ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా దోచుకుని సత్యాగ్రహదీక్షలు ఎలా చేస్తారు. గాంధీ జయంతి రోజున ఉదాత్తమైన లక్ష్యాల కోసం దీక్షలు చెయ్యొచ్చు. కానీ ఒక అవినీతిపరుడు అడ్డంగా బుౖకై బరితెగింపుతో దీక్షలేంటి? గాందీ, శాస్త్రీల ఆశయాలతో జగన్ ముందుకు.. అహింస, సహనం వంటివి ఉదాత్తమైన లక్షణాలు. వాటిని చెప్పే ముందు మనం ఆచరించాలి. వాస్తవ రూపంలో అది ఆచరించి చూపించటంవల్లే మన జాతిపిత మహానీయుడయ్యారు. లాల్‌బహుదూర్ శాస్త్రి స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేయడంతో పాటు విలువలతో కూడిన జీవితం గడిపారు. రాజకీయాల్లో ఆయన ఎందరికో మార్గదర్శకులు. వీరి వారి ఆశయాలను, ఆలోచనలను, స్ఫూర్తిని సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు. కిందిస్థాయి నుంచి ఆయన మార్పులు తీసుకొస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిపాలనను ఎలా అందిస్తున్నారో వాటి ఫలితాలెలా ఉన్నాయో మనకు అర్థమవుతున్నాయి. అలాగే, గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సీఎం జగన్ పాలనలో కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయాలవల్లే సాధ్యమవుతోంది. మరోవైపు.. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారవుతుంది. ప్రజలకు సంబందించిన ఆరోగ్యసేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయి. విద్యా, వైద్యరంగాలలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే. ప్రజల చేతుల్లోనే పాలన.. ఇక పేరుకు వైఎస్సార్సీపీ పాలన అయినా సీఎం జగన్ ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారు. వ్యవసాయరంగంలో కూడా రైతులకు మేలు చేసే విధానాలు అమలుచేస్తున్నాం. సీఎం జగన్ తన పరిపాలనతో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. అందుకే తన పాలనవల్ల మేలు జరిగితేనే తనకు మద్దతు ఇవ్వమని సీఎం జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీమంత్రులు శిద్ధా రాఘవరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
8వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు
-
మందడంలో 6వ రోజు కొనసాగుతున్న దీక్షలు
-
అమెరికాలో అయ్యప్ప స్వాముల దీక్ష విరమణ
-
ఒక్కరోజు దీక్షకు రూ.10 కోట్లా?
-
చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్న స్వామి స్వరుపానంద
సాక్షి, విశాఖపట్నం : స్వామి స్వరుపానంద చాతుర్మాస్య దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్‌కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన బుధవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్వామి స్వరూపానంద మాట్లాడుతూ.. దీక్ష నిమిత్తం రిషికేశ్ బయల్దేరి వెళుతున్నట్లు చెప్పారు. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15 రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్‌లో శారదా పీఠానికి చేరుకొని ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకాలంలో భక్తులెవరు తన వద్దకు రావద్దని, సెప్టెంబర్ 20 తర్వాతే భక్తులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అంతేకాక పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం సీజీఎఫ్ ఫండ్‌ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి భక్తులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కేదార్, గంగోత్రి, యమునోత్రి లో 15 రోజుల పాటు తపస్సు అనంతరం రిషికేశ్ లోని శారదా పీఠానికి చేరుకుంటారు. -
రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతోంది
-
డ్రామా సేమ్.. యాక్టర్స్ ఛేంజ్!
-
చంద్రబాబు దీక్ష అంతా బూటకమే..
-
బాబు ఢిల్లీ దీక్షకు రూ.10కోట్లు ఖర్చు
-
అంతా... సం...‘కల్పితమే’...
– వారం రోజులుగా నవ నిర్మాణ దీక్షల్లో జిల్లా యంత్రాంగం – స్తంభించిన పరిపాలన ... కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు - డ్వాక్రా మహిళలే ముడిసరుకులు - మూతపడిన 5,545 అంగన్వాడీ కేంద్రాలు - వారానికి రెండు రోజుల ఇచ్చే గుడ్లకూ కాళ్లు - పల్లెల మోహం చూడని 350 గ్రామ కార్యదర్శులు - ప్రయోజనం లేకున్నా సుమారు రూ. కోటితో దీక్షల హడావుడి సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షల పేరిటి నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా తనమునకలైంది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ అయిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజులపాటు జరిగిన సంకల్ప దీక్షల పేరుతో చేపట్టిన కార్యక్రమాల వల్ల సాధారణ పరిపాలన పూర్తిగా పడకేసింది. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకూ దీక్షల్లో పాల్గొనాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కార్యాలయాలకు స్వస్తి చెప్పి దీక్షలు జరిగే సభల వద్ద కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఈ దీక్షలను విజయవంతం చేయాలని, జయప్రదం చేసినవారికి బహుమతులు కూడా ఇస్తామంటూ ప్రకటించింది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వారం రోజులపాటు దీక్షలు నిర్వహించేందుకు రూ.కోటి మంజూరు చేసింది. ఉన్నతాధికారులంతా దీక్షల్లోనే... ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఈ దీక్షలకు ప్రత్యేక అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాల్సిన బాధ్యతలను వీరికి అప్పగించింది. అలాగే జిల్లాలోని ఏడుగురు ఆర్డీవోలు, సబ్కలెక్టర్లు, ఆరుగురు డివిజనల్ పంచాయతీ అధికారులు, కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు అందరూ నవనిర్మాణ దీక్షల్లో తీరకలేకుండా గడిపారు. ఇక క్షేత్ర స్థాయి అధికారులు తప్పని సరిగా తరలి రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు జరుగుతున్న ప్రాంగణాల వద్ద ప్రత్యేకంగా హాజరు పట్టీని ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి అధికారి వారి పేరు, వివరాలు అందులో నమోదు చేయాల్పి రావడంతో తరువాత ఎందుకీ తలనొప్పంటూ ఇష్టం లేకపోయినా...కష్టంగా ఉన్నా రావల్సి వచ్చింది. పడకేసిన పరిపాలన... ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకూ వారం రోజులపాటు దీక్షల్లో పాల్గొనడంతో జిల్లాలో సాధారణ పరిపాలన పడకేసింది. ఆయా కార్యాలయాల్లో ప్రతి రోజూ సగానికిపైగా అధికారులు, సిబ్బంది షిప్టులు వారీగా దీక్షలకు హాజరుకావడంతో వివిధ రకాల పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది. మీసేవా నుంచి దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్నాయి. జిల్లాలోని 350 మంది పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొనడంతో మరణ, జనన, నివాస ధృవ పత్రాలు జారీ నిలిచిపోయింది. వారం రోజులుగా కార్యదర్శులు గ్రామాల వైపు చూసే సమయం కూడా లేకపోయింది. ఫలితంగా గ్రామ పాలన పడకేసింది. + పర్యవేక్షణ అధికారులు లేక ఉపాధి హామీ పనులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు చేపట్టాల్సిన పనులు ఆపేశారు. గత సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో మినహా మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజా వాణి తూతూ మంత్రంగా జరిగింది. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా కింది స్థాయి సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సభలకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు... నవ నిర్మాణ దీక్షల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అధికారులు డ్వాక్రా మహిళలను దీక్షలకు తీసుకురావాలని కమ్యూనిటీ ఆర్గనైజర్స్, రిసోర్స్ పర్సన్లకు ఆదేశాలు జారీ చేశారు. డ్వాక్రా సమావేశం ఉందంటూ తప్పక రావాలని సీవోలు, ఆర్పీలు డ్వాక్రా సంఘాలకు సమచారం పంపారు. విడతల వారీగా ప్రతి రోజూ కొంతమంది చొప్పున దీక్షలకు డ్వాక్రా మహిళలను తరలించారు. ఇక నవ నిర్మాణ దీక్షలతో వారం రోజులపాటు జిల్లాలోని 5,545 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దీక్షలకు వెళ్లాల్సి రావడంతో కేంద్రాలు వారం రోజుల పాటు తెరుచుకోలేదు. ప్రతి రోజూ పౌష్టికాహారం, మంగళ, శుక్రవారాల్లో ఇచ్చే గుడ్లకు పిల్లలు దూరమయ్యారు. -
పంట నష్టం పట్టకుండా నవ నిర్మాణ దీక్షలా?
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట: అర్ధాంతరంగా వచ్చిన సుడిగాలి, వానతో వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమై రైతులు నష్టపోతే వారిని పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు నవ నిర్మాణ దీక్షలకు పరిమితమవుతారా?అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వచ్చిన గాలివానకు నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమయ్యాయి. మంగళవారం జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం, వానపల్లి లంక ప్రాంతాల్లో పర్యటించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చారా? నష్టాన్ని అంచనా వేశారా?అని జగ్గిరెడ్డి రైతులను ప్రశ్నించారు. ఇంతవరకూ ఎవరూ రాలేదని తెలపడంతో ఆయన అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్‌కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరిస్తూ వెంటనే పంట నష్టాలు నమోదు చేసి పంపిస్తే కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉందన్నారు. ఐదు రోజులుగా అధికారులను నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. పంట నష్టాలపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. జగ్గిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల సేవాదళ్ కన్వీనర్ గూడపాటి ప్రవీణ్‌కుమార్, వాడపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి శేఖర్, పార్టీ రైతు విభాగం నాయకుడు పెదపూడి శ్రీనివాస్ ఉన్నారు. -
కాపుల సత్యాగ్రహం
జిల్లావ్యాప్తంగా దీక్షలు l వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లాలోని కాపు సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన కాపులు.. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తూర్పార పడ్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యమిస్తున్న కాపులను అణగదొక్కేందుకు కుట్ర పన్నారని నాయకులు ఆరోపించారు. కాపు జాతి కోసం ప్రాణాలను ఒడ్డేస్తున్న ముద్రగడ బాటలో అలుపెరుగని పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న కాపు జాతిని అణగతొక్కేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు తిలక్‌రోడ్డులోని నందెపు ప్లాజా ఎదురుగా కాపు యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం కాపు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. దీక్షా శిబిరాన్ని విజయలక్ష్మి, పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైఖరిని మార్చుకోకుంటే 1988 నాటి సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ముద్రగడ ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమంతో టీడీపీ భూస్థాపితమవుతుందన్నారు. దుర్గేష్ మాట్లాడుతూ బీసీలకు నష్టం కలుగకుండా గతంలో అమలు చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తామని హామీని మూడేళ్లు పూర్తయినా నెరవేర్చలేదన్నారు. మంజునాథ కమిష¯ŒS పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ కాపు యువత భవిష్యత్ కోసమే ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని అణగతొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహ¯ŒSరావు, వంగవీటి రంగ, కాపు జేఏసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కార్పొరేటర్ బొంత శ్రీహరి, నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి, సుంకర చిన్ని, అడపా రాజు, సూరవరపు రామారావు, నాగిరెడ్డి సుబ్బారావు, గుర్రం గౌతమ్, ఆసూరి సుధాకర్, అనిశెట్టి ఆనంద్, కరుణామయుడు శ్రీను, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్త్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మ ణ్యం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా ఇవ్వాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : బీసీ సోదరులకు ఎటువంటి నష్టం లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భానుగుడి సెంటర్లో కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కాపు ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కాపు సత్యాగ్రహ దీక్ష ఆయన మద్దతు తెలిపారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులను రిజర్వేషన్లు ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాపులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిని అడ్డుకోవడం బాధకరమన్నారు. కాపులను మభ్యపెట్టేందుకే ఎన్నికల్లో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారన్నారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. కాపు ఉద్యమ జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ ఉద్యమం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిన భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, సిదార్ధ మూర్తి, పుల్లా కోటేష్, అప్పనపల్లి పెద్ద, దుర్గాన దొరబాబు, చెక్కపల్లి రాజబాబు, కాపు నాయకులు పాల్గొన్నారు. బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదు అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) : కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదని కాపు నేతలు స్పష్టంచేశారు. గండువీధిలోని దివంగత నల్లా సూర్య సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో కాపు జేఏసీ రాష్ట్ర నేత నల్లా పవన్‌కుమార్ ఆధ్వర్యంలో 120 మంది నేతలు, నాయకురాళ్లు దీక్షలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ రాష్ట్ర నాయకుడు మెండగుదటి మోహ¯ŒS శిబిరాన్ని ప్రారంభించారు. కాపు మహిళా జేఏసీ నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లాటి దుర్గాభాయి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కాపు మహిళలు దీక్షలు చేపట్టారు. సూర్యచంద్రరావు తనయులు, ఇంజినీరింగ్ విద్యార్థులు నల్లా అజయ్, సంజయ్ సైతం దీక్ష చేపట్టారు. ఇదిలాఉండగా, రాష్ట్ర జేఏసీ నాయకుడు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో కూడా దీక్షలు చేపట్టారు. ఇక్కడ సుమారు వంద మందికి పైగా దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాలకు పలు సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు. నల్లా పవ¯ŒS దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల యాజమానుల సంఘ అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు తదితర ప్రముఖులు మద్దతు తెలిపారు. సాయంత్రం నల్లా పవ¯ŒS దీక్షా శిబిరంలోని దీక్షాపరులకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, మిండగుదటి మోహన్, కాపు నాయకుడు సూదా గణపతి కోనసీమలోని పలు మండలాల్లో పర్యటించి కాపు దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ఓఎన్జీసీ జీసీఎస్ ముట్టడి
గొల్లపాలెంలో సంస్థ కార్యకలాపాల అడ్డగింత గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ధర్నా చర్చలు విఫలం, రిలే దీక్షలు ప్రారంభం గొల్లపాలెం (మలికిపురం) : తమ ప్రాంతం నుంచి చమురు నిక్షేపాలను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ తమ గ్రామాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం గొల్లపాలెంలోని జీసీఎస్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 25 ఏళ్లుగా గ్రామంలో జీసీఎస్ ద్వారా చమురు, సహజవాయువు ఉత్పత్తులను తరలించుకుపోతున్న ఆ సంస్థ.. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, క్రూడాయిల్‌ను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ ఈ గ్రామాన్ని తక్షణమే దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏటా రూ.3 కోట్ల చొప్పున గ్రాంట్ ఇవ్వాలని, గ్రామంలో నిరుద్యోగులకు స్థానిక జీసీఎస్లో 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. కార్పొరేట్ ప్రమాణాలతో గ్రామంలో 20 పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని కోరారు. గ్రామంలో పాడైన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఓఎన్జీసీ అధికారులు.. ఎమ్మెల్యే, ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళతామని, మూడు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చే వరకూ ఇక్కడే బైఠాయిస్తామని ఆందోళనకారులు భీష్మించారు. గ్రామానికి చెందిన అనేక మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనకారులతో ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల బీవీ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల పాల్గొన్నారు. ఈ ఆందోళనతో సోమవారం సుమారు లక్ష లీటర్ల క్రూడాయిల్ సరఫరా నిలిచిపోయింది. ఆందోళన నేపథ్యంలో రాజోలు సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
– కల్వకుర్తిలో ఐదో రోజుకు చేరిన రిలేదీక్షలు కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో నాయకులు నర్సింహ, రాంరెడ్డి, రవిగౌడ్, హన్మం™Œ గౌడ్, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు కూర్చున్నారు. వీరికి టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధనకు ఐక్యమత్యంతో చేస్తున్న పోరుకు సమాజంలోని అన్ని వర్గాల కుల సంఘాలు, ఇతరులు మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న, కష్ణ, టీడీపీ నాయకులు పాండుయాదవ్, బీజేపీ నాయకులు రాఘవేందర్, దుర్గాప్రసాద్, గంగాధర్, జగదీష్, కోఆప్షన్ ఖలీల్, బీఎస్పీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
'చెప్పింది చేయటమే ఆయన అలవాటు'
పోరాటానికి వెన్నుచూపే వ్యక్తి కాదు... మాట చెప్పి మడమతిప్పే వ్యక్తిత్వం అంతకన్నాకాదు. అవతలది వెన్నుపోటు రాజకీయమైనా, ఢిల్లీలో కూర్చుని మీటలు నొక్కే వర్గమైనా.. చెప్పింది చేయటమే ఆయన అలవాటు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడమే ధ్యేయం. నిజానికి రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో రాజ్యాంగం నిర్ధేశిస్తున్నది కూడా ఈ విధానాల్నే. సమస్య ఎక్కడుంటే అక్కడ.. ఎవరు పరిష్కరిస్తారో వారి ఎదుట ప్రజాస్వామ్యయుతంగా దీక్షలు, యాత్రలు తదితర రూపాల్లో నిరసన తెలపడం తద్వారా పరిష్కారాల సాధనను వేగవంతమయ్యేలా కృషి చేయడం వర్తమాన రాజకీయాల్లో ఒక్కరికే చెల్లింది. విభజన చట్టంలో పేర్కొనడంతోపాటు సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. జననేత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. అయినా సరే, హోదా సాధించేదాకా దీక్ష విరమించేది లేదనే మొండి పట్టుదట. ఇది ఈ రోజు వచ్చిందికాదు. ప్రజాసంక్షేమం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేయగలడటం వైఎస్ జగన్ కు తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ సందర్భంలో ఇప్పటివరకు వైఎస్ జగన్ చేసిన దీక్షల వివరాలు మరోసారి.. లక్ష్య దీక్ష: రైతాంగం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 21-12-10 నుంచి 22-12-10 ( 48 గంటలు ) విజయవాడలో లక్ష్య దీక్ష చేపట్టారు. జలదీక్ష: కృష్ణా నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఢిల్లీలో 'జలదీక్ష'కు దిగారు. 11-01-11న ఢిల్లీలో 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగింది. జనదీక్ష: సామాన్యుడి నడ్డివిరిచేలా కేంద్రం, ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేశాయి. ధరల పెంపును నిరసిస్తూ 22-01-11న విశాఖపట్టణంలో జనదీక్ష చేపట్టారు. హరిత యాత్ర: ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన జాప్యాన్ని నిరసిస్తూ 07-02-11 నుంచి 10-02-11 వరకు నాలుగు రోజులపాటు హరిత యాత్ర చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరకు సాగిన హరిత యాత్రలో వైఎస్ జగన్ కు జనం హారతులు పట్టారు. ఫీజు పోరు: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ 18-02-11 నుంచి 24-02-11 (7 రోజులపాటు) హైదరాబాద్‌లో 'ఫీజు పోరు' పేరుతో నిరసన రూపాన్ని ప్రదర్శించారు. రైతుదీక్ష: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నినదిస్తూ గుంటూరులో రైతు దీక్ష చేపట్టారు.15-05-11 నుంచి 17-05-11వరకు ఈ దీక్ష సాగింది. సాగుపోరు: నాటి ముఖ్యమంత్రి సొంతజిల్లా చిత్తూరు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్..13-06-11న చిత్తూరులో సాగు పోరుకు సై అన్నారు. కరెంట్ పోరు: పూరిగుడిసెల్లో జీవించేవారు, చిన్నచిన్న బడ్డీ కొట్లతో జీవనం సాగించేవారేకాక మధ్యతరగతి వర్గాలకు సైతం పెను భారంగా మారిన కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 11-10-11న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట 'కరెంటు పోరు' చేపట్టారు. మహాధర్నా: 01-10-11న రైతుల కోసం విజయవాడలో మహాధర్నా ఫీజుపోరు: 04-01-12 ఒంగోలు కలెక్టరేట్ ముందు ఫీజు పోరు ధర్నా రైతు దీక్ష: ఓ వైపు ప్రభుత్వ ఆంక్షలు, మరోవైపు విభజనవాదుల నిరసనల మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు తెలంగాణ రైతులు ఎల్లడలా మద్దతు పలికారు. 10-01-12 నుంచి 12-01-12 (48 గంటలపాటు) ఈ దీక్ష కొనసాగింది. వ్యాట్ పెంపును నిరసిస్తూ: వస్త్రవ్యాపారాలపై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం చిన్నస్థాయి వ్యాపారులకు అశనిపాతంలా మారిన నేపథ్యంలో వ్యాట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 27-01-12న నర్సరావుపేటలో వైఎస్ జగన్ ధర్నా చేశారు. చేనేత దీక్ష:12-02-12 నుంచి 14-02-12 వరకు చేనేత కార్మికుల కోసం ధర్మవరంలో చేనేత దీక్ష విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ: 03-04-12 న విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ స్టేషన్ ముందు ధర్నా విభజనకు వ్యతిరేకంగా జైలులో దీక్ష: రాష్ట్ర విభజన జరుగుతోన్న తీరుకు వ్యతిరేకంగా 25-08-13 నుంచి 31-08-13 వరకు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన చంచల్గూడా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజాప్రయోజనాలకోసం జైలులో సైతం దీక్షకు దిగిన ఏకైక నేత వైఎస్ జగన్ ఒక్కరే. నిరవధిక నిరాహార దీక్ష: రాష్ట్ర విభజన ప్రక్రియ సహేతుకంగా సాగటంలేదని, సమైక్యాంద్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 05-10-13 నుంచి 09-10-13 వరకు లోటస్‌పాండ్ నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేశారు. కొత్త ప్రభుత్వంపై పోరాటం: తప్పుడు హామీలతో గద్దెనెక్కి తనకు అలవాటయినట్లే రైతులను మోసం చేస్తోన్న చంద్రబాబు సర్కారు తీరును ఎండగడుతూ 05-12-14న విశాఖ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. రైతు దీక్ష: 31-01-15 నుంచి 01-02-15 తణుకులో రైతు దీక్ష సమర దీక్ష: చంద్రబాబు ఏడాది పాలనను నిరసిస్తూ 03-06-15 నుంచి 04-06-15 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో సమర దీక్ష ఢిల్లీలో ధర్నా: కేంద్ర ప్రభుత్వం పార్లంమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 10-08-15 న ఢిల్లీలో ధర్నా జ్వరపీడితుల కోసం: రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పేలా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 25-08-15న ధర్నా చేశారు. సీఆర్ డీఏ కార్యలంయ ఎదుట: రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకోవడాన్ని గర్హిస్తూ 26-08-15న విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నా పొగాకు రైతుల కోసం: పొగాకు రైతుల దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు 30-09-15 న ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద ధర్నా ప్రత్యేక హోదా కోసం: ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రాభుత్వాల వైఖరిని నిరసిస్తూ, హోదాతో మాత్రమే ఏపీ అభివృద్ధి చెందుతుందని, దానిని సాధించేవరకు విశ్రమించేదిలేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 07-10-15 నుంచి నిరవధిక నిరాహార దీక్షను చేస్తున్నారు.. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ‘రైతు దీక్షలు’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతు దీక్షలను చేపడుతోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కు తగ్గే వరకూ మడమ తిప్పని ప్రజా పోరాటాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగానే గురువారం నియోజకవర్గాల కేంద్రాల్లో ‘రైతు దీక్ష’ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో బత్తలపల్లి నుంచి ధర్మవరం వరకు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించనున్నారు.