కాపుల సత్యాగ్రహం | kapu leaders deekshalu | Sakshi
Sakshi News home page

కాపుల సత్యాగ్రహం

Published Sun, Feb 26 2017 11:47 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

కాపుల సత్యాగ్రహం - Sakshi

కాపుల సత్యాగ్రహం

  • జిల్లావ్యాప్తంగా దీక్షలు  l
  • వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం
  • కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లాలోని కాపు సత్యాగ్రహ దీక్షలు చేపట్టిన కాపులు..  సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తూర్పార పడ్టారు. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యమిస్తున్న కాపులను అణగదొక్కేందుకు కుట్ర పన్నారని నాయకులు ఆరోపించారు. కాపు జాతి కోసం ప్రాణాలను ఒడ్డేస్తున్న ముద్రగడ బాటలో అలుపెరుగని పోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
     
    కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : 
    ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న కాపు జాతిని అణగతొక్కేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు తిలక్‌రోడ్డులోని నందెపు ప్లాజా ఎదురుగా కాపు యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం కాపు సత్యాగ్రహ దీక్షను  చేపట్టారు. దీక్షా శిబిరాన్ని విజయలక్ష్మి, పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వైఖరిని మార్చుకోకుంటే  1988 నాటి సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే ముద్రగడ  ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమంతో టీడీపీ భూస్థాపితమవుతుందన్నారు. దుర్గేష్‌ మాట్లాడుతూ బీసీలకు నష్టం కలుగకుండా గతంలో అమలు చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తామని హామీని మూడేళ్లు పూర్తయినా నెరవేర్చలేదన్నారు. మంజునాథ కమిష¯ŒS పేరిట కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జక్కంపూడి గణేష్‌ మాట్లాడుతూ కాపు యువత భవిష్యత్‌ కోసమే ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని అణగతొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహ¯ŒSరావు, వంగవీటి రంగ, కాపు జేఏసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, కార్పొరేటర్‌ బొంత శ్రీహరి, నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి, సుంకర చిన్ని, అడపా రాజు, సూరవరపు రామారావు, నాగిరెడ్డి సుబ్బారావు, గుర్రం గౌతమ్, ఆసూరి సుధాకర్, అనిశెట్టి ఆనంద్, కరుణామయుడు శ్రీను, నందెపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్త్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మ ణ్యం, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు.
     
    బీసీలకు అన్యాయం జరగకుండా ఇవ్వాలి
    బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ) : బీసీ సోదరులకు ఎటువంటి నష్టం లేకుండా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భానుగుడి సెంటర్‌లో కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ కాపు ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన కాపు సత్యాగ్రహ దీక్ష ఆయన మద్దతు తెలిపారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులను రిజర్వేషన్లు ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. 
    ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాపులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిని  అడ్డుకోవడం బాధకరమన్నారు. కాపులను మభ్యపెట్టేందుకే ఎన్నికల్లో చంద్రబాబు ఈ హామీ ఇచ్చారన్నారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. కాపు ఉద్యమ జేఏసీ కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ ఉద్యమం చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిన భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ కో ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్, సిదార్ధ మూర్తి, పుల్లా కోటేష్, అప్పనపల్లి పెద్ద, దుర్గాన దొరబాబు, చెక్కపల్లి రాజబాబు, కాపు నాయకులు పాల్గొన్నారు. 
     
    బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదు
    అమలాపురం టౌ¯ŒS (అమలాపురం) :
    కాపులను బీసీల్లో చేర్చేవరకూ పోరు ఆగదని కాపు నేతలు స్పష్టంచేశారు. గండువీధిలోని  దివంగత నల్లా సూర్య సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో కాపు జేఏసీ రాష్ట్ర నేత నల్లా పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో 120 మంది నేతలు, నాయకురాళ్లు దీక్షలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ రాష్ట్ర నాయకుడు మెండగుదటి మోహ¯ŒS శిబిరాన్ని ప్రారంభించారు. కాపు మహిళా జేఏసీ నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లాటి దుర్గాభాయి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కాపు మహిళలు దీక్షలు చేపట్టారు. సూర్యచంద్రరావు తనయులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు నల్లా అజయ్, సంజయ్‌ సైతం దీక్ష చేపట్టారు. ఇదిలాఉండగా, రాష్ట్ర జేఏసీ నాయకుడు, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో కూడా దీక్షలు చేపట్టారు. ఇక్కడ సుమారు వంద మందికి పైగా దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాలకు పలు సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు. నల్లా పవ¯ŒS దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల యాజమానుల సంఘ అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు తదితర ప్రముఖులు మద్దతు తెలిపారు. సాయంత్రం నల్లా పవ¯ŒS దీక్షా శిబిరంలోని దీక్షాపరులకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు నల్లా విష్ణుమూర్తి, మిండగుదటి మోహన్, కాపు నాయకుడు సూదా గణపతి కోనసీమలోని పలు మండలాల్లో పర్యటించి కాపు దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement