'చెప్పింది చేయటమే ఆయన అలవాటు' | ys jagan mohan reddy is the only leader who held mayn deekshas over various issues | Sakshi
Sakshi News home page

'చెప్పింది చేయటమే ఆయన అలవాటు'

Published Mon, Oct 12 2015 5:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'చెప్పింది చేయటమే ఆయన అలవాటు' - Sakshi

'చెప్పింది చేయటమే ఆయన అలవాటు'

పోరాటానికి వెన్నుచూపే వ్యక్తి కాదు... మాట చెప్పి మడమతిప్పే వ్యక్తిత్వం అంతకన్నాకాదు. అవతలది వెన్నుపోటు రాజకీయమైనా, ఢిల్లీలో కూర్చుని మీటలు నొక్కే వర్గమైనా.. చెప్పింది చేయటమే ఆయన అలవాటు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడమే ధ్యేయం. నిజానికి రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో రాజ్యాంగం నిర్ధేశిస్తున్నది కూడా ఈ విధానాల్నే. సమస్య ఎక్కడుంటే అక్కడ.. ఎవరు పరిష్కరిస్తారో వారి ఎదుట ప్రజాస్వామ్యయుతంగా దీక్షలు, యాత్రలు తదితర రూపాల్లో నిరసన తెలపడం తద్వారా పరిష్కారాల సాధనను వేగవంతమయ్యేలా కృషి చేయడం వర్తమాన రాజకీయాల్లో ఒక్కరికే చెల్లింది.

విభజన చట్టంలో పేర్కొనడంతోపాటు సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. జననేత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. అయినా సరే, హోదా సాధించేదాకా దీక్ష విరమించేది లేదనే మొండి పట్టుదట. ఇది ఈ రోజు వచ్చిందికాదు. ప్రజాసంక్షేమం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేయగలడటం వైఎస్  జగన్ కు తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ సందర్భంలో ఇప్పటివరకు వైఎస్ జగన్ చేసిన దీక్షల వివరాలు మరోసారి..

లక్ష్య దీక్ష: రైతాంగం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 21-12-10 నుంచి  22-12-10 ( 48 గంటలు ) విజయవాడలో  లక్ష్య దీక్ష చేపట్టారు.

జలదీక్ష: కృష్ణా నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఢిల్లీలో 'జలదీక్ష'కు దిగారు. 11-01-11న ఢిల్లీలో 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగింది.

జనదీక్ష: సామాన్యుడి నడ్డివిరిచేలా కేంద్రం, ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేశాయి. ధరల పెంపును నిరసిస్తూ 22-01-11న విశాఖపట్టణంలో జనదీక్ష చేపట్టారు.

హరిత యాత్ర: ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన జాప్యాన్ని నిరసిస్తూ  07-02-11 నుంచి 10-02-11 వరకు నాలుగు రోజులపాటు హరిత యాత్ర చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరకు సాగిన హరిత యాత్రలో వైఎస్ జగన్ కు జనం హారతులు పట్టారు.

ఫీజు పోరు: పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ 18-02-11 నుంచి 24-02-11 (7 రోజులపాటు) హైదరాబాద్‌లో 'ఫీజు పోరు' పేరుతో నిరసన రూపాన్ని ప్రదర్శించారు.

రైతుదీక్ష: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నినదిస్తూ గుంటూరులో రైతు దీక్ష చేపట్టారు.15-05-11 నుంచి 17-05-11వరకు ఈ దీక్ష సాగింది.

సాగుపోరు: నాటి ముఖ్యమంత్రి సొంతజిల్లా చిత్తూరు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్..13-06-11న చిత్తూరులో సాగు పోరుకు సై అన్నారు.

కరెంట్ పోరు: పూరిగుడిసెల్లో జీవించేవారు, చిన్నచిన్న బడ్డీ కొట్లతో జీవనం సాగించేవారేకాక మధ్యతరగతి వర్గాలకు సైతం పెను భారంగా మారిన కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో 11-10-11న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట 'కరెంటు పోరు' చేపట్టారు.

మహాధర్నా: 01-10-11న  రైతుల కోసం విజయవాడలో మహాధర్నా

ఫీజుపోరు: 04-01-12  ఒంగోలు కలెక్టరేట్ ముందు ఫీజు పోరు ధర్నా

రైతు దీక్ష: ఓ వైపు ప్రభుత్వ ఆంక్షలు, మరోవైపు విభజనవాదుల నిరసనల మధ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు తెలంగాణ రైతులు ఎల్లడలా మద్దతు పలికారు. 10-01-12 నుంచి 12-01-12 (48 గంటలపాటు) ఈ దీక్ష కొనసాగింది.

వ్యాట్ పెంపును నిరసిస్తూ: వస్త్రవ్యాపారాలపై వ్యాట్ పెంచుతూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం చిన్నస్థాయి వ్యాపారులకు అశనిపాతంలా మారిన నేపథ్యంలో వ్యాట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 27-01-12న నర్సరావుపేటలో వైఎస్ జగన్ ధర్నా చేశారు.

చేనేత దీక్ష:12-02-12 నుంచి 14-02-12 వరకు చేనేత కార్మికుల కోసం ధర్మవరంలో చేనేత దీక్ష

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ: 03-04-12 న విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ స్టేషన్ ముందు ధర్నా

విభజనకు వ్యతిరేకంగా జైలులో దీక్ష: రాష్ట్ర విభజన జరుగుతోన్న తీరుకు వ్యతిరేకంగా 25-08-13 నుంచి 31-08-13 వరకు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన చంచల్‌గూడా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజాప్రయోజనాలకోసం జైలులో సైతం దీక్షకు దిగిన ఏకైక నేత వైఎస్ జగన్ ఒక్కరే.

నిరవధిక నిరాహార దీక్ష: రాష్ట్ర విభజన ప్రక్రియ సహేతుకంగా సాగటంలేదని, సమైక్యాంద్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 05-10-13 నుంచి 09-10-13 వరకు లోటస్‌పాండ్ నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేశారు.

కొత్త ప్రభుత్వంపై పోరాటం: తప్పుడు హామీలతో గద్దెనెక్కి తనకు అలవాటయినట్లే రైతులను మోసం చేస్తోన్న చంద్రబాబు సర్కారు తీరును ఎండగడుతూ 05-12-14న విశాఖ కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు.

రైతు దీక్ష: 31-01-15 నుంచి 01-02-15 తణుకులో రైతు దీక్ష

సమర దీక్ష: చంద్రబాబు ఏడాది పాలనను నిరసిస్తూ 03-06-15 నుంచి 04-06-15 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలో సమర దీక్ష

ఢిల్లీలో ధర్నా: కేంద్ర ప్రభుత్వం పార్లంమెంట్ లో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 10-08-15 న ఢిల్లీలో ధర్నా

జ్వరపీడితుల కోసం: రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పేలా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో 25-08-15న ధర్నా చేశారు.

సీఆర్ డీఏ కార్యలంయ ఎదుట: రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకోవడాన్ని గర్హిస్తూ 26-08-15న విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం ముందు ధర్నా

పొగాకు రైతుల కోసం: పొగాకు రైతుల దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు 30-09-15 న ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద  ధర్నా

ప్రత్యేక హోదా కోసం: ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రాభుత్వాల వైఖరిని నిరసిస్తూ, హోదాతో మాత్రమే ఏపీ అభివృద్ధి చెందుతుందని, దానిని సాధించేవరకు విశ్రమించేదిలేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 07-10-15 నుంచి నిరవధిక నిరాహార దీక్షను చేస్తున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement