samaikya
-
సమైక్యాంధ్రకు కట్టుబడింది జగన్ ఒక్కరే
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమైక్య పాదయాత్రలు శనివారం జోరుగా సాగాయి. ఈ పాదయాత్రల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా అధికసంఖ్యలో పాల్గొని వైఎస్సార్ సీపీకి బాసటగా నిలిచారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. గడపగడపకూ వైఎస్సార్సీపీ సమైక్య నినాదం పాదయాత్రలో భాగంగా శనివారం రాజమండ్రిలోని జాంపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణచౌదరితో కలిసి ఆదిరెడ్డి పాదయాత్ర చేశారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ పార్టీ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టి, రాష్ర్ట విభజన వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరం శివారు ఎర్రకొండలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ నిర్వహించారు. ఇందులో కూడా ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు వెంకట రమణచౌదరి పాల్గొన్నారు. కోరుకొండ మండలం గుమ్మలేరులో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బొడ్డు వెంకట రమణచౌదరి పాదయాత్ర నిర్వహిం చారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో అయినవిల్లిలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పట్టణంలోని 22వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ప్రజలను కోరారు. -
తెలుగు ప్రజావేదిక ఆవిర్భావం
అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, కన్వీనర్‌గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్ హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్య రాష్టం కోసం పోరాడుతున్న ప్రజాసంఘాలు, జేఏసీలు ఏకతాటిపైకి వచ్చాయి. ‘తెలుగు ప్రజా వేదిక’ పేరుతో కొత్త సంఘంగా ఏర్పడ్డాయి. సంఘానికి అధ్యక్షుడిగా రిటైర్ట్ ఐపీఎస్ అధికారి చెన్నూరి ఆంజనేయరెడ్డి, కన్వీనర్‌గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్ వ్యవహరించనున్నారు. మంగళవారం బేగంపేటలోని హరితాప్లాజాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశ ంలో గంగాధర్ మాట్లాడుతూ... రైతు, విద్యార్థి, పాఠశాలలు, విద్య, వైద్య, న్యాయ, విద్యుత్, గెజిటెడ్, పంచాయతీరాజ్ సహా సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న దాదాపు 100 జేఏసీలు, సంఘాలు కలిసి ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. త్వరలో సెంట్రల్ కమిటీ ఏర్పాటుచేస్తామని, అందులో డాక్టర్ మిత్రాతో పాటు పలు జేఏసీల సభ్యులు ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజల వికాసం, అభివృద్ధి, సంక్షేమం కోసం తమ వేదిక పోరాడుతుందని వివరించారు. అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి ఐక్యత కోసం అన్ని వర్గాలు, ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి పోరాడుతామన్నారు. తెలంగాణలో దాదాపు 70 శాతం సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో చేసిన తీర్మానాలు వివరించారు. సమైక్య రాష్ర్టం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ప్రత్యేకంగా రూపొందించిన అఫిడవిట్లపై ప్రజాప్రతినిధులచే సంతకాలు చేయించి కోర్టుకు, రాష్టపతికి సమర్పించాలి. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను పక్కన పెట్టి, 9 మంది ఎమ్యెల్యేలు ఉన్న పార్టీ డిమాండ్‌కు తలొగ్గి విభజనకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధం తమ సంఘంలో పనిచేసే సభ్యులంతా వారి వారి సంఘాలు, జేఏసీల కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి, డాక్టర్ మిత్రా సహ పలు సంఘాల, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్పెషల్ ఎడిషన్: మన దారి.. సమైక్య దారి..
-
మన దారి.. సమైక్య దారి..
-
సమైక్య శంఖారావం
-
తరలిన తెలంగాణ జనం!
న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం సభకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు. వరంగల్‌లో కుండపోత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు బయల్దేరి వచ్చారు. వరంగల్ నగరం, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, జనగామ తదితర ప్రాంతాల నుంచి సభకు తరలారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి వందలాది వాహనాల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. తుక్కుగూడ శ్రీశైలం ప్రధాన రహదారిపై జెండా ఊపి వాహనాల ర్యాలీని వైఎస్సార్ సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ మండలాల నుంచి వందలాది మంది వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి సమైక్య శంఖారావానికి రైళ్లలో, బస్సుల్లో శుక్రవారం నుంచే కొందరు బయలుదేరి వచ్చారు. శనివారం ఉదయం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, చెన్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ నేతలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ, సీఈసీ సభ్యులు వంగూరు బాలమణెమ్మ, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి తదితరుల నాయకత్వంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అన్ని అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు వచ్చారు. షాద్‌నగర్, జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, సీసీకుంట, ఆలంపూర్, గద్వాల ,క ల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణుల తో పాటు వైఎస్ కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరి వచ్చారు. జిల్లా కేంద్రం నుంచి యువజన విభాగం జిల్లా క న్వీనర్ రవిప్రకాశ్, మైనార్టీ నేతలు వచ్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, అందోలు, మెదక్ తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు, ప్రజలు వాహనాల్లో తరలారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువత అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కదిలి వచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో 25 వాహనాల్లో ప్రజలు వచ్చారు. -
ఉప్పెనై కదలిరా..ఉద్యమమై కదలిరా! సమైక్య ఊపిరై కదలిరా!
-
సమైక్య శంఖారావం సభ ఏర్పాట్ల పై సమీక్ష
-
సమైక్య శంఖారావానికి రావాలని మహిళలకు పిలుపు
-
సమైక్య శంఖారావం సభ పోస్టరు విడుదల
-
ఖజానాకు గండి!
సాక్షి, హైదరాబాద్: సమైక్య, విభజనోద్యమాల నేపథ్యంలో ఈసారి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.5 వేల కోట్ల మేరకు తగ్గవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ పన్నుల వాటాను పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. వివిధ పద్దుల కింద రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల్లో కేంద్రం 33 శాతం తిరిగి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. జనాభా తలసరి వినియోగం, ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్న ప్రణాళిక సంఘం నివేదిక కొంత నిరాశాజనకంగా ఉంది. వరుస ఉద్యమాల కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా గాడితప్పింది. ఫలితంగా ఆర్థిక నిర్వహణ విషయంలోనూ రాష్ట్రానికి ప్రతికూలత తప్పదనే భావిస్తున్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రధానంగా ఆదాయం పన్ను, కస్టమ్స్, సంపద, కార్పొరేట్ పన్నుల రూపేణా ఆదాయం వెళ్తుంది. ఇందులో ఆదాయం పన్ను వాటా రూ. 59,803.36 కోట్లు. కార్పొరేట్ టాక్స్ రూ.1,10,535.36 కోట్లు. కస్టమ్స్ కింద రూ. 55,006.90 కోట్లు, సంపద పన్ను రూ. 39,562 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ రూ. 37,667.41 కోట్లు, సర్వీస్ టాక్స్ రూ. 385.2 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం మన రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో రూ. 24,132 కోట్లు దక్కుతోంది. అయితే ఈ సంవత్సరం కేంద్రం విధించిన పన్నుల టార్గెట్‌లో రాష్ట్రం నుంచి నాలుగు శాతం తక్కువ వసూళ్లు ఉన్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడంతో తాజా ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల రాబడి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ఆదాయం తగ్గవచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా ఆర్థిక నిర్వహణ, తలసరి ఆదాయం అంశాలను పక్కనబెడితే రాష్ట్రానికి కొంత ప్రయోజనం చేకూరే వీలుంది. తలసరి ఆదాయం విషయంలో కేవలం రెండు జిల్లాల్లోనే పురోగతి ఉందని, మిగతా జిల్లాల్లో ఆదాయం తక్కువగా ఉందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. నిధుల కేటాయింపులో ఈ రెండు జిల్లాలనే కొలమానంగా తీసుకుని వ్యవహరించవద్దని కోరింది. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ‘రైతు దీక్షలు’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రైతు దీక్షలను చేపడుతోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం వెనక్కు తగ్గే వరకూ మడమ తిప్పని ప్రజా పోరాటాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం(నవంబర్ 1) వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగానే గురువారం నియోజకవర్గాల కేంద్రాల్లో ‘రైతు దీక్ష’ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో బత్తలపల్లి నుంచి ధర్మవరం వరకు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎద్దుల బండ్ల ర్యాలీ నిర్వహించనున్నారు. -
ప్రజల కోసం జగన్ పోరాడుతున్నారు:భూమన
-
రెండో రోజు కొనసాగిన సీమాంధ్ర బంద్
-
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌కు సమైక్య సెగ
-
72 గంటల బంద్ తొలిరోజు సూపర్ సక్సెస్
-
దీక్షాస్ధలి వద్ద ఏర్పాట్లు పూర్తి
-
తెలంగాణ పండుగలపై సర్కార్ శీతకన్ను
బతుకమ్మ పండుగ కోసం నియెజకవర్గానికి రూ. 50 లక్షలు కేటాయించాలి ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేట అర్బన్, న్యూస్‌లైన్: తెలంగాణ పండుగలు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఎమ్మెల్యే హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా పూలను పూజించే బతకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికే సొంతమన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు, ఎర్ర చెరువు, మచ్చవానికుంట వద్ద బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను ఆయన బుధవారం మున్సిపల్ కమిషనర్ రాంబాబు, శానిటరి ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఏఈలు ఇంతియాజ్, లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. బతుకమ్మ పండగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తే ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయించి తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత సంవత్సరం బతుకమ్మ పండగ నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.లక్ష విడుదల చేసిందని అవి గ్రామంలో రెండు విద్యుత్ బుగ్గలకు కూడా సరిపోవన్నారు. ఈ సంవత్సరం వాటిని కూడా విడుదల చేయకుండా సీఎం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. పండుగ నిర్వహణ కోసం నియోజక వర్గానికి రూ.50 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిధుల కోసం వెనుకంజ వేయకుండా పండగ ఏర్పాట్లు చేయాలన్నారు. కోమటిచెరువు, ఎర్రచెరువుల వద్ద దోభీఘాట్ల నిర్మాణం కోసం రూ.6 లక్షల చొప్పున రూ.12 లక్షలు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ నిధులతో వాటిని సత్వరమే నిర్మించి అందుబాటులోకి తేవాలని, రజకుల సౌకర్యం కోసం నిర్మించిన హాల్‌ను సద్దుల బతుకమ్మరోజు ప్రారంభించేలా చూడాలన్నారు.ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, వేణుగోపాల్‌రెడ్డి, నయ్యర్ పటేల్, గుండు శ్రీనివాస్‌గౌడ్, బూర మల్లేశం, కిషన్‌రావు, బర్ల మల్లికార్జున్, నందు, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
కలిసుంటేనే కలిమి.. లక్ష గళాల సమైక్య హోరు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రం ఒక్కటిగా ఉంటేనే సాగునీటి సరఫరా సవ్యంగా సాగి మూడు ప్రాంతాలూ సస్యశ్యామలంగా ఉంటాయని నినదిస్తున్న సీమాంధ్ర ప్రజ.. రాష్ట్రం ముక్కలైతే విపరిణామాలే చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో బుధవారం జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రజలు సమైక్యఉద్యమాన్ని హోరెత్తించారు. వరుసగా 43వ రోజూ లక్షలాదిమంది జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి గళార్చనలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు.. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని పోటెత్తించారు. కొనసాగుతున్న ‘కృష్ణా’ బంద్ సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణోద్యంలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్ బుధవారం విజయవంతమైంది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు మూతపడగా, థియేటర్లలో ప్రదర్శనలు రద్దుచేశారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. విజయవాడలో క్రేన్ ఆపరేటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్జీవోల ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు రాస్తారోకో నిర్వహించారు. గురజాలలో ఉపాధ్యాయులు మానవహారంగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని చర్చి సెంటర్ వద్ద ఎన్జీఓలు, విద్యుత్ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. చీరాల పట్టణ బంద్ విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సమైక్య పోరులో ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ మృతికి సంతాప సూచికంగా జిల్లావ్యాప్తంగా బంద్‌ను పాటించారు. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాలో జోరున వర్షం కురుస్తున్నా ఆందోళనకారులు పోరుబాట పట్టారు. ఆంధ్రాయూనివర్సిటీ ఉద్యోగులంతా పెన్‌డౌన్ చేశారు. వైఎస్సార్సీపీ చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర-ఒడిశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్‌లో గేట్లు మూయించి జలదిగ్బంధం చేపట్టారు. విజయనగరం జిల్లాలో 48గంటల బంద్ ఉద్యోగ సంఘాల జేఏసీ 12వ తేదీ గురువారం అర్ధరాత్రి నుంచి 48 గంటలపాటు విజయనగరం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. తెర్లాంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అయిదుగంటల పాటు రోడ్డు దిగ్బంధించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లోని 13 మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన 5000 మంది మహిళలు ర్యాలీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో తెలంగాణ ఉద్యోగులకు సత్కారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎన్జీవోలు పల్లెయాత్ర చేపట్టారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరులో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు. చిత్తూరు జిల్లాలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లెలో ఎన్జీవోలు వర్షం లో గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు చీపుర్లతో వీధులను శుభ్రంచేసి నిరసన తెలి పారు. రాయచోటిలో ఆర్టీసీ కార్మికులు శిరోముండనం చేయించుకున్నారు. రాజంపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80మంది రిలేదీక్షలకు కూర్చున్నారు. అనంతపురం జిల్లాలో ప్రజలు వర్షం కురుస్తున్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎస్కేయూ జేఏసీ నేతలు జలదీక్ష చేశారు. రాయదుర్గంలో క్రైస్తవుల ర్యాలీలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వీధి దీపాలకు సమైక్య సెగ ప్రకాశం: సమైక్యాంధ్ర మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధి లైట్లను ఆలస్యంగా రాత్రి 9గంటలకు వెలిగించనున్నట్లు ఏపీ మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కే వెంకటేశ్వర్లు ఒంగోలులో తెలిపారు. వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య రాష్ట్ర విభజన ఆగబోదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటనను తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వల్లూరు శివారు అగ్రహారానికి చెందిన వ్యాన్ డ్రైవర్ గాది లోవరాజు(40) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రిటైర్డ్ హిందీ పండిట్ షేక్‌యూసుఫ్ హుసేన్(87) విభజన వార్తలను టీవీలో వీక్షిస్తూ కలత చెంది గుండెపోటుతో మరణించారు. బొత్స క్యాంపు ఆఫీసుపై రాళ్ల దాడి కాంగ్రెస్ నేతలపై కొనసాగుతున్న జనాగ్రహం సాక్షి నెట్వర్క్ : కాంగ్రెస్ నేతలపై కొనసాగుతున్న జనాగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. విజయనగరం జిల్లా గరివిడిలోని పీసీసీ చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంపై బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని సమైక్యవాదులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో క్యాంపుహౌస్ అద్దాలు పగిలిపోయాయి. విశాఖలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి కాన్వాయ్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు అడ్డంగా కూర్చుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎంపీతో పాటు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులను తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిలదీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఉద్యోగులు ఘెరావ్ చేశారు. తన రాజీనామావల్ల ఏమీ కాదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఉద్యోగులు శాంతించలేదు. మందకృష్ణ తీరుకు వ్యతిరేకంగా పలువురి రాజీనామా అనంతపురం : సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కించపరుస్తున్నందుకు నిరసనగా పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్ఎఫ్ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సీమాంధ్ర మాదిగల రెక్కల కష్టంతో ఎదిగిన మందకృష్ణ.. ప్రస్తుతం తెలంగాణ వేర్పాటువాదులకు వంత పాడుతూ సీమాంధ్ర ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. ‘లక్ష గళాల’ హోరు సాక్షి నెట్వర్క్ : సీమాంధ్రలో బుధవారం పలుచోట్ల లక్ష గళార్చన కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి లక్ష గళ గర్జనతో దద్దరిల్లింది. స్టీరింగ్ కమిటీ కన్వీనర్ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అన్ని వర్గాల వారూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ... పదవులు వీడని ప్రజాప్రతినిధులను రాజకీయంగా పాతరేయాల్సిన సమయం ఆసన్నమైందనిన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం పెళ్లి వుండపం వద్ద ‘శివగర్జన’ పేరిట ఉద్యవుభేరి మోగింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉగ్ర గోదావరి లక్ష జన గర్జన, తణుకులో జిల్లా కేబుల్ ఎంఎస్‌వోలు, ఆపరేటర్ల ఆధ్వర్యంలో లక్షగళార్చన, ఏలూరు, తాడేపల్లిగూడెంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. వీటికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యూరు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. -
షర్మిల యాత్రను విజయవంతం చేయండి
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాస గృహంలో రుద్రవరం, చాగలమర్రి మండలాల కార్యకర్తలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపడానికి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించారన్నారు. ఆళ్లగడ్డ ప్రాంతానికి యాత్ర వచ్చినపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో సమైక్యాంధ్రను కోరుకుంటోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల బాబును ప్రజలు నమ్మబోరన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, నిజాముద్దిన్, రంగనాయకులు, యర్రం ప్రతాపరెడ్డి, సత్యనారయణ, రాంగుర్విరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6న ఆళ్లగడ్డలో బస్సు యాత్ర షర్మిల బస్సు యాత్ర ఈనెల 6వతేదీ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటుందని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారన్నారు. ఆళ్లగడ్డలో బహిరంగ సభ ఉండబోదని స్పష్టం చేశారు. రోడ్దు వెంట ప్రజలకు అభివాదం చేస్తూ షర్మిల ముందుకు సాగుతారన్నారు.