న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం సభకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు. వరంగల్‌లో కుండపోత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు బయల్దేరి వచ్చారు. వరంగల్ నగరం, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, జనగామ తదితర ప్రాంతాల నుంచి సభకు తరలారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి వందలాది వాహనాల్లో ఎల్‌బీ స్టేడియానికి చేరుకున్నారు.
తుక్కుగూడ శ్రీశైలం ప్రధాన రహదారిపై జెండా ఊపి వాహనాల ర్యాలీని వైఎస్సార్ సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ మండలాల నుంచి వందలాది మంది వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి సమైక్య శంఖారావానికి రైళ్లలో, బస్సుల్లో శుక్రవారం నుంచే కొందరు బయలుదేరి వచ్చారు. శనివారం ఉదయం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, చెన్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ నేతలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు.
జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ, సీఈసీ సభ్యులు వంగూరు బాలమణెమ్మ, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్‌రాంరెడ్డి తదితరుల నాయకత్వంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అన్ని అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు వచ్చారు. షాద్‌నగర్, జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, సీసీకుంట, ఆలంపూర్, గద్వాల ,క ల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణుల తో పాటు వైఎస్ కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరి వచ్చారు.
జిల్లా కేంద్రం నుంచి యువజన విభాగం జిల్లా క న్వీనర్ రవిప్రకాశ్, మైనార్టీ నేతలు వచ్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నర్సాపూర్, అందోలు, మెదక్ తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు, ప్రజలు వాహనాల్లో తరలారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ యువత అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. పటాన్‌చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కదిలి వచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో 25 వాహనాల్లో ప్రజలు వచ్చారు.