samaikya sankharavam
-
అమరారామంలో సమైక్యధ్వనులు
అమరావతి,న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పెదకూరపాడు నియోజకవర సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన సమైక్యశంఖారావం సభలో పార్టీ శ్రేణులు, ప్రజలు చేసిన సమైక్య నినాదాలతో అమరావతి ప్రతిధ్వనించింది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రెహమాన్ మాట్లాడుతూ హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు గోడ మీద పిల్లి లాంటివారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రాష్ట్రానికి ఏంతో అవసరమన్నారు. ఓట్లు, సీట్లు కోసం కాంగ్రెస్, తెలుగుదేశ కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. ముస్లింలకు మేలు చేసిన రాజన్న పాలన రావాలంటే జగన్‌ను గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రం ఇంత దారుణంగా ఉండేది కాదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దేశ,రాష్ట్ర రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడన్నారు. తెలుగుదేశం పార్టీకి సిద్దాంతం లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు పక్కన బెట్టడంతోనే తనలాంటి వారు ఆ పార్టీని వీడారని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కేవలం పదవుల కోసమే ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు విభజనను అడ్డుకోలేదన్నారు. నాలుగు నెలల క్రితం వారంతా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలుగుదేశం కూడా విభజనకు అనుకూలంగా మారటంతో విభజన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసిందన్నారు. ఎన్నికలు రెండు నెలల్లో వస్తాయని ముఖ్యమంత్రి రాజీనామా డ్రామాలు అడుతున్నారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం కేవలం సమైక్య డ్రామా అడుతుందన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. నిత్యం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సమైక్యం కావాలంటే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ సీసీ చేతల పార్టీ అని అన్నారు. తాను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాన న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జంగా కృష్ణమూర్తి, రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడి,్డ నసీర్ అహ్మద్, షౌకత్, కోన రఘుపతి, నన్నపనేని సుధ, రాష్ట్ర పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, నాయకులు నర్సిరెడ్డి, మంగిశెట్టి కోటేశ్వరరావు, బెల్లంకొండ మీరయ్య, మర్రి ప్రసాదరెడ్డి, సందెపోగు సత్యం, షేక్ మస్తాన్, పులివర్తి రత్నబాబు, కంచేటి సాయిబాబు, పానెం హనిమిరెడ్డిలతోపాటు విజయవాడకు చెందిన నాయకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిక.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాంబాబు నాయకత్వంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు పార్టీకండువాలు కప్పి సాదరంగా అహ్వానించారు. -
విశాఖ జిల్లాలో జగన్ సభలు విజయవంతం
-
బంగారం లాంటి రాష్ట్రాన్ని విభజిస్తున్నారు
-
జగన్ వెంటే నడుద్దాం
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా పెద్ద దిక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డేనని, ఆయన వెనుకనే నడుద్దామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీను వీడి వైఎస్సార్సీపీలోకి రావాల్సిన పరిస్థితులను వివరించారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరించిన తీరు దారుణమని, రాష్ట్రాన్ని స్వార్థం కోసం ముక్కలు చేయడాన్ని సహించలేకపోయూనని వాపోయూరు. ఈ మేరకు నిర్వహించిన సమాలోచన సభలో వైఎస్సార్ సీపీలో చేరాలంటూ నాయకులు, కార్యకర్తలు కోరారని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమైక్య రాష్ట్ర సాధన కోసం పోరాడుతూ, ఉద్యమిస్తున్న ఏకై క నాయకుడిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. 2010 సంవత్సరంలో పార్లమెంట్‌లోనే తన వైఖరిని స్పష్టం చేసిన నిజమైన నాయకుడు జగన్ అని కొనియాడారు. దీంతో సభాప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసలు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడంలో విఫలమయ్యారని విమర్శించారు. సమైక్యమా...కాదా..అనే విషయాన్ని ప్రజలతో పాటు టీడీపీ నాయకులకు కూడా స్పష్టంగా చెప్పలేక వ్యాపారస్థుడిలా ఆలోచిస్తూ ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం అతనికి చెందిన ఓ రెండు ప్రచారసాధనాల సాయంతో ఎంత నీచానికైనా దిగజారే స్థితి చంద్రబాబుది అని దుయ్యబట్టారు. ఆకలికి, కన్నీరుకు రాజకీయాలతో ముడిపెట్టే సంసృ్కతి చంద్రబాబుది అని, సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీరు తుడిచే పథకాలు పెట్టి ఆదుకున్న పాలన వైఎస్సార్‌ది అని వివరించారు. 2001-03 మధ్య కాలంలో తీవ్ర కరువొస్తే, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏఒక్క రైతుకైనా ఒక్క రూపాయి సాయంచేశారా అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆధ్వర్యంలో పార్టీల కతీతం గా సంక్షేమ ఫలాలిచ్చిన సంగతి అందరి మనస్సులోనూ ఉందని గుర్తు చేశారు. అదే చంద్ర బాబుకాలంలో పచ్చ చొక్కాల వారికే పథకాలు అందజేశారని విమర్శించారు. తను ఏవో కోరికలతో పార్టీ మారలేదని, ఇక ప్రతి ప్రయోజనం పార్టీ పటిష్టత కోసమేనని తెలిపారు. జిల్లాలో రైతాంగం కోసం వంశధార వంటి సమస్యల సాధన కోసం రానున్న ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను తప్పనిసరిగా గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఇంతవరకు వైఎస్సార్సీపీని నడిపిన శ్రేణుల కృషిని ధర్మాన అభినందించారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే తైలాన విజయ్‌కుమార్ మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మృతితో రాష్ట్రంలో దీపం ఆరిపోయిందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సమైక్య రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, దీనికి కారణమైన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉద్యమంలో పాల్గొనడం ఇష్టంలేక పార్టీను వీడినట్టు తెలియజేశారు. తను మాత్రం కేవలం పార్టీ కార్యకర్తలాగానే పార్టీలో చేరానని, జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌లో ఎవరూ ఉండొద్దని పిలుపునిచ్చారు. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మత్స్యకారుడిని ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత మహానేత రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం కోసం, సమైక్య రాష్ట్ర సాధన కోసం జగనన్న సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరానని వివరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం ప్రజలందరి తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా వైఎస్సార్సీపీలో విలీనం చేసి, తన పార్టీలో చేరానని తెలిపారు. ఇదే జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో కలిసి చివరి అధికారిక పర్యటన చేసినట్టు గుర్తుతెచ్చారు. ఆ పర్యటనలో తమ వెంటే ఉన్న దొంగల్లుడు చంద్రబాబు, కొద్ది నెలల తర్వాతే మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కాజేశాడని, ఆ పదవి కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేశాడని చెమర్చిన కళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు చెప్పులు వేయించి మానసికంగా చంపేసిన చంద్రబాబు నయవంచకుడని దుయ్యబట్టారు. తండ్రిని అవమానపర్చిన బావకు వత్తాసు పలికిన ఎన్టీఆర్ కుమారుల కంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తున్న కుమారుడు జగన్మోహన్రెడ్డే ఎంతో గొప్పవాడని కొనియాడారు. ఇదే సందర్భంలో చంద్రబాబు అబద్దాలపై వ్యంగ కథను చెబుతూ... ఓరాక్షసుడికి దేవుడి వరం ఇచ్చేందుకు మూడు ప్రశ్నలు వేశాడని, మొదటి ప్రశ్నగా భూమిమీద చెట్లు ఎన్ని...? అన్నదానికి మూడు రోజుల్లో సమాధానం చేప్పేశాడని, ఆకాశంలో చుక్కలెన్ని..? సముద్రంలో ఇసుక రేణువుల సంఖ్య ఎంత..? అనే ప్రశ్నలకు తక్కువ రోజుల్లోనే సమాధానాలిచ్చిన రాక్షసుడికి ఇక ఆఖరిగా చంద్రబాబు ఇంత వరకు ఎన్ని అబద్దాలు ఆడారో చెప్పాలని దేవుడు ప్రశ్నించగా, ఆ రాక్షసుడు ఇంకా లెక్కపెడుతూనే ఉన్నాడని, దీంతో దేవుడు ఏ వరం ఇవ్వకుండా వెళ్లిపోయాడని చెప్పడంతో సభికులంతా నవ్వుకున్నారు. -
సమైక్యవాదులంతా వైఎస్సార్ సీపీవైపే
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని కోరుకునే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం సిక్కోలు తిరుగుబాటు పేరిట ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎంపీగా పార్లమెంట్లో సమైక్యరాష్ట్రం కోరుతూ ప్లకార్డులు ప్రద రించిన నాటి నుంచి నేటి వరకు మాట మార్చని నేత జగనేనని అన్నారు. అందువల్లనే ఎందరో నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర సార్వత్రిక విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ తెలుగుజాతి ఐక్యతను కాంక్షిస్తున్న నాయకుడు జగన్‌నేనని, అందువల్లనే ఆయనను చూస్తే కాంగ్రెస్, టీడీపీలకు దడ అని పేర్కొన్నారు. ప్రజలంతా నా కోసం కాకుండా, రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం పోరాడాలంటూ కరుణామయుడు తరహాలో అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. జెడ్పీ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ సమైక్యం కోరుకొనే వారంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. వారికి జగన్ నాయకత్వంలోని వైఎ స్సార్ సీపీ దశ, దిశా నిర్దేశం చేసి అండగా నిలుస్తుం దని చెప్పారు. అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బేబినాయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కొన్ని మీడియాలు పార్టీ బలం తగ్గుతుందని అనడంలో వాస్తవం లేదనడానికి ఇటువంటి సభలే నిదర్శనమన్నారు. ప్రజలు అబద్దపు ప్రచారాలను నమ్మే అమాయకులు కాదని తప్పుడు ప్రచారమాధ్యమాలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే కుటుం బం వైఎస్సార్ కుటుంబమని చెప్పారు. అటువంటి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ మున్సిపల్ పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మాటకు కట్టుబడే వంశం వైఎస్సార్‌ది అని, ఆ కుటుంబం నుంచి వచ్చిన జగన్ అదేబాటలో నడుస్తున్నారని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదని ఉపేక్షించబడిన జిల్లా అని, దానిని వైఎస్సార్ విశేషంగా అభివృద్ధి చేశారన్నారు. సిద్ధాంతాల కోసం పనిచేసే జగన్‌కు గౌరవించాలన్నారు. చంద్రబాబుది మూడు నాల్కల ధోరణి అని దుయ్యబట్టారు. ధర్మాన కూడా సిద్ధాంతాల కోసం పనిచేసే వ్యక్తి అని, సంస్కారం ఉన్న వారంతా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని.. అటువంటి సభకు తిరుగుబాటు సభ అని కాకుండా సంస్కార సభ అని నామకరణం చేస్తే బాగుండేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ పార్లమెం టరీ నియోజ కవర్గ సమన్వయకర్త పిరియా సాయి రాజ్, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, పీఎంజె బాబు, కిల్లి రామ్మోహ నరావు, బొడ్డేపల్లి మాధురి, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్యే పి.రాజన్నదొర, కలమట మోహ నరావు, మినతి గొమాంగో, నియోజకవర్గ సమన్వ యకర్తలు తమ్మినేని సీతారాం, వరుదు కళ్యాణి, వై.వి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూ రావు, విశ్వసరాయ కళావతి, పాలవలస విక్రాంత్, కలమట వెంకటరమణ, గొర్లె కిరణ్ కుమార్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షు డు హనుమంతు కిరణ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షు రాలు బల్లాడ హేహమాలి నీరెడ్డి, పార్టీ నాయ కులు కడబండి శ్రీనివాసరావు, కొత్తపల్లి గీత, రవి రాజ్, పాలవలస ఇందుమతి, డాక్టర్ పైడి మహేశ్వ రరావు, గేదెల పురుషోత్తం, బొడ్డేపల్లి పద్మజ, చల్లా రవి, ధర్మాన ఉదయ్ భాస్కర్, ఎం.వి పద్మావతి, అంధవ రపు వరహానర్శింహం, అంధవరపు సూరి బాబు, అల్లు జోగినాయుడు, కొమరాపు తిరు పతిరావు, ప్రధాన రాజేంద్ర, పేరాడ తిలక్, బల్లాడ జనార్ధనరెడ్డి, కూన మంగమ్మ, కోత మురళీ, టి. కామేశ్వరి, జెఎం శ్రీనివాస్, పైడి రాజారావు, ఎన్ని ధనుంజయ్, మూ కళ్ల సుగుణ, టి. మోహిని, చల్లా అలివేలు మంగ, చల్లా మంజుల, గుంట జ్యోతి, గురుగుబిల్లి లోకనాధం, మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీనివాస్, నర్తు నరేం ద్రయాదవ్, మండవిల్లి రవి, ఎంవి స్వరూప్, ధర్మాన రామ్మ నోహరనాయుడు, వి.చిన్నరాం నాయుడు, దుంగ సుధాకర్, ధర్మాన రామలిం గంనాయుడు, ధర్మాన రాందాస్, కరిమి రాజేశ్వర రావు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పింఛన్ రూ.700 చెల్లిస్తాం... ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: పాలకొండ రోడ్డులో మహాబైక్ ర్యాలీ సాగుతున్న సమయంలో దళితవాడ వృద్ధులు పలువురు జగన్వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారు. పింఛన్ సొమ్ము ఎంత అందుతుందని జగన్ వృద్ధులను ప్రశ్నించగా రూ.200 వస్తుందని సమాధానమిచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రూ.700 పింఛన్ అందజేస్తామని చెప్పడంతో వృద్ధులంతా సంతోషించారు. అదే సమయంలో ఓ వృద్ధుడు అక్కడకు చేరుకుని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తనకు ఆరోగ్యశ్రీ పథకంలో జరిగిన బైపాస్ సర్జరీ వివరాలను వెల్లడించారు. పార్ట్‌టైం ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయండి శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సుమారు 12,271 మంది ఆర్ట్స్, క్రాఫ్ట్స్, పీఈటీ పార్టుటైం ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిం చాలని ఆ సంఘ ప్రతిని ధులు గంగు వెంకటరమణమూర్తి, సీహెచ్ శ్రీనివాసరావు, బూరవెల్లి ఉగాది తదితరులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సమైక్య శంఖారావం సభకు జిల్లాకు విచ్చేసిన జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న పరిస్థితులను ఈ సందర్భంగా జగన్‌కు వివరించారు. దీనిపై ప్రభుత్వం వస్తే తగుచర్యలు చేపడతామని జగన్ హామీనిచ్చారు. -
సమైక్య సారథికి బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, విజయనగరం :సుమారు రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. ఆత్మీయ పలకరింపు మలయమారుతమై తాకింది. సమైక్య శంఖారావం పూరించేందుకు వచ్చిన ఆత్మీయ అతిథికి భోగాపురం ప్రజానీకం నీరాజనం పట్టింది. తరలివచ్చిన జనంతో వీధులన్నీ కిటకిటలాడాయి. రహదారులన్నీ జనదారులయ్యాయి. అడుగడుగునా జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలు మిన్నంటాయి. చెరగని దరహాసంతో, తరగని అభిమానంతో తమ చెంతకు వచ్చిన జననేతపై స్థానికులు ప్రేమాభిమానాన్ని కురిపించారు. శంఖారావం సభలో జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్తేజాన్ని నిపింది. పజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించింది. ‘ఇవాళ ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు అయినా ఆడడానికి వెనుకాడడంలేదు. కొందరు రాజకీయ నాయకులు ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తిపైన దొంగ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించడానికీ వెనుకాడడం లేదు. జైలుపాలు చేయడానికి కూడా మనస్సాక్షి అడ్డురావడం లేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీయడానికి కూడా వెనుకాడని పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.’ అంటూ చేసిన ప్రసంగం ప్రజల్ని ఆలోచింప చేసింది.‘ సోనియా గాంధీ, కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు పోవాలి. ఆ ముగ్గురూ పోయే రోజులు త్వరలో వస్తాయి. వీరు చేస్తున్న అన్యాయాలు పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఒకటవుతుంది. దివంగత నేత, ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి హృదయం ఒకటవుతుంది. ఒకటైనప్పుడు ఒక ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెన నుంచి ఒక తుపాను వస్తుంది. దానిలో అంతమందీ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని గట్టిగా చెబుతున్నాను.’ అని అనగానే ప్రజల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మగౌరవానికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని అనగానే ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయా, కాంగ్రెస్‌ను ఎప్పుడు గద్దె దించుతామా అన్న ఊపు ప్రజల్లో కనిపించింది. ‘ నాలు గు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుంటాం. ఆ తరువాత రాష్ట్రాన్ని విడగొట్టే దమ్మూ ధైర్యం ఎవరికి ఉందో చూద్దాం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వాళ్లనే ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడదాం.’ అని ప్రకటించగానే ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలింది. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలో ఎవరూ కూడా ఆలోచన చేయని విధంగా చేశారు. ఆరోగ్యం బాగోలేని ఏ పేదవాడు అయినా సరే ఆ పేదవాడు చేయాల్సిందల్లా 108 నంబరుకు ఫోన్ చేస్తే... కుయ్...కుయ్...కుయ్ అంటూ 20 నిమిషాల్లో పేదవాడు ఇంటికి అంబులెన్స్ రావాలి.. వచ్చి ఆ పేదవాడిని పెద్ద ఆస్పత్రికి తీసుకుని పోవాలి’ అని మ హా నేత చేసిన మేలును గుర్తు చేయగానే ప్రజలు చప్పట్లతో హర్షధ్వానాలు ప్రకటించారు. కుయ్...కుయ్...కుయ్..శబ్దాన్ని విని మహానేతను గుర్తు చేసుకున్నప్పుడు వారి కళ్లు చెమర్చాయి. ఇలా ఆద్యంతం ఆసక్తికర ప్రసంగం సాగింది. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసింది. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు కార్యోన్మోఖులై కన్పించారు. -
జగన్‌కు సమైక్యవాదుల నుంచి ఘనస్వాగతం
-
9న భోగాపురంలో సమైక్య శంఖారావ
భోగాపురం, న్యూస్‌లైన్ : కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుని బయటకొచ్చిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈనెల 9న తొలిసారిగా జిల్లాకు రానున్నారు. సమైక్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన ఆది వారం భోగాపురం పంచాయతీ సెంటర్ వద్ద నిర్వహించనున్న సమైక్య శంఖారా వం సభలో పాల్గోనున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు పార్టీ జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు తదితరులు మొయిదలో సమావేశమై అధినేత జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకుముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు సాంబశివరాజు, నెల్లిమర్ల సమన్వయకర్త సురేష్‌బాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు భోగాపు రం వెళ్లి సమైక్య శంఖారావం సభా వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివరాజు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని, భోగాపురం పంచాయతీ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానున్నట్టు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం ఎంత అవసరమో వివరిస్తూ, కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ఎండగడు తూ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారని తెలి పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణు లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్య క్షుడు వరుపుల సుధాకర్, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల కన్వీనర్లు సింగుబాబు, మహంతి లక్ష్మణరావు, సబ్బవరపు వెంకటరమణ, దారపు లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. -
ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధించుకుందాం
ఢిల్లీ కోటను బద్దలు కొట్టి సమైక్యాంధ్రను సాధించుకుందామని నాయుడుపేట సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో 44 రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన సమైక్య శంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ప్రతి పేదవాడి చదువు రాజశేఖరుడి స్వప్నమని, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకతీతంగా పలికే పేరు వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెట్టిస్తున్న నేత వైఎస్ఆర్ అని ఆయన చెప్పారు. రాజకీయనాయకుడంటే నేనున్నానని ప్రజలందరికీ భరోసా ఇచ్చేవాడిలా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని జగన్ అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకటమేనని వైఎస్ఆర్ నిరూపించారని, ఈసారి ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలు సాధించి మనమే ప్రధానిని నిర్ణయిద్దామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి - తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే రైతన్నకు నీరెక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. అలాగే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ తాగునీరు ఎలా తెస్తారని నిలదీశారు. -
ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధిద్దాం
-
నెల్లూరులో రేపు జగన్ సమైక్య శంఖారావం రద్దు
హైదరాబాద్ : ఫిబ్రవరి 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో శనివారం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం రద్దు అయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కన్వీనర్ తలశిల రఘురాం ప్రకటించారు. కాగా సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. నాల్గో విడతలో చిత్తూరు జిల్లాలో 11 రోజుల పాటు కొనసాగిన శంఖారావం యాత్రకు అపూర్వ స్పందన లభించింది. 12వ రోజు శుక్రవారం ఉదయం జిల్లాలోని సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. -
నేడు నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారవం
-
'మాట మీద నిలబడేది వైఎస్సాఆర్ ఒక్కరే'
-
20 నుంచి సమైక్య శంఖారావం
-
20 నుంచి సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోన్రెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి మెడ నొప్పితో బాధపడుతున్నందున యాత్ర ఒక రోజు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు మరో రెండు రోజులు వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సోమవారం నుంచి నగరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సమైక్య శంఖారావం యాత్ర సాగనుంది. -
జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి బదులు 18వ తేదీకి వాయిదాపడింది. జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి జగన్ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. -
ప్రతి గుండె నినాదం జై సమైక్యాంధ్ర
-
జననేతకు నీరాజనం
-
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసారు
-
'ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారు'
-
చర్చ విభజించడానికే
-
బాబు, కిరణ్ దొంగ నాటకాలు ఆడుతున్నారు: వైఎస్ జగన్
-
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం
-
పీలేరులో నీళ్ళూ కొనాల్సిందేనా!
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో బిందె నీళ్లు మూడు రూపాయలకు కొనాల్సి వస్తోందా? అని వైఎస్సార్ సీపీ అ ధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మూడో విడత చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజైన గురువారం పీలేరులో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ప్రతి అంశానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పీలేరులో బిందె నీరు ఎంతకు కొంటున్నారని అడిగితే కొంతమంది రెండు రూపాయలని, మరికొంతమంది మూడు రూపాయలని, మరికొంతమంది ఐదు రూపాయలని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నీళ్లు కొనాల్సి వస్తోందని జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మూడు నా లుగు గంటలు మాత్రమే రైతులకు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. కరెంటు బిల్లు తాకితేనే షాక్ కొడుతోందన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంతో, ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. దీనికి ప్రజలు అవునన్నారు. ఈ సభలోని వారి ప్రతి గుండెచప్పుడు జై సమైక్యాంధ్ర అని కోరుకుంటోందని అన్నారు. విభజన కు వ్యతిరేకంగా తీర్మానం చేయమని అడిగితే కాంగ్రెస్, టీడీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం నినదించే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని తెలిపారు. ఒక్క తాటిపై నిలిచినందుకు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబా బు నాయుడు ఇద్దరూ శాసనసభకు వెళ్లకుండా, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి, సీమాంధ్రులతో సమైక్యమని, తెలంగాణ వారితో తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటూ, సొంత పార్టీ నాయకులనే మభ్యపెడుతున్నారని తెలిపారు. ఇందుకు ప్రజల నుంచి అవునని స్పందన వచ్చింది. కేంద్రం నుంచి వ చ్చిన బిల్లును వెనక్కు పంపాల్సింది పోయి, శాసససభలో చర్చించాలని పట్టుబడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు కోరుతున్నారు అనగానే ‘జై సమైక్యాంధ్ర’ అని ప్రజలు నినాదాలు చేశా రు. గురువారం సదుం, పీలేరు, దామలచెరువులో బహిరంగ సభలు జరిగాయి. ప్రతి సభకూ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జగన్మోహన్రెడ్డికి తమ మద్దతు తెలియజేశారు. ఘనంగా స్వాగతం పలికారు. ఈ బహిరంగసభల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ఆర్కె.రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, షమీమ్ అస్లాం, మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, బాబ్జాన్, జీవరత్నం పాల్గొన్నారు. -
రైతులను ముంచేందుకే ఒక్కటయ్యారు
చంద్రగిరి, న్యూస్‌లైన్: రైతులను వురోసారి ముంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, వుంత్రి గల్లా అరుణ ఒక్కటయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సవున్వయుకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి పాకాల వుండలం దావులచెరువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం సభలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు తన స్వంత డెయిరీ హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయూ డెయిరీని మూతవేయించారన్నారు. నేడు పాడి పరిశ్రవును నాశనం చేసి రైతుల నోట్లో వుట్టి కొట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం వూమిడి వ్యాపారంలో గల్లా ఫుడ్స్ ప్రవేశించి వూమిడి రైతులకు వుద్దతు ధర లేకుండా చేస్తున్నారన్నారు. ఇప్పుడు బాబు, గల్లా ఒక్కటైతే పాడిపరిశ్రవు, వూమిడి, నల్లబెల్లం అవ్ముకాలు ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జగనన్న సీఎం అరుుతే పాకాల వుండలానికి హంద్రీ-నీవా నీళ్లు, చంద్రగిరి వుండలానికి కళ్యాణిడ్యాం నీటిని తీసుకొస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏమిచేశారని నిలదీశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి అనేక వూర్లు గెలిచిన గల్లా కూడా ఏమీచేయులేదని వుండిపడ్డారు. -
'భవిష్యత్ తరాల ఉసురు మీకు తగులుతుంది'
-
జగన్ సమైక్య సారధి
-
చర్చ జరిగితే అంగీకరించినట్లే: జగన్
-
కిరణ్ నియోజకవర్గం పీలేరులో పోటెత్తిన జనం
-
సమైక్య సారధి
-
కొల్లూరులో సమైక్య శంఖారావం
కొల్లూరు, న్యూస్‌లైన్: తమ అధినేత రాష్ట్ర విభజనకు అనుకూలమా లేక వ్యతిరేకమా స్పష్టం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబునాయుడిపై ఎందుకు వత్తిడి తీసుకురావడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని, ప్రజలు గర్జిస్తే ఆయన దిక్కులేకుండా పోతారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ మేరుగ నాగార్జున అధ్యక్షతన ఆదివారం రాత్రి మండలం కేంద్రం కొల్లూరులోని బస్టాండ్ సెంటరులో నిర్వహించిన సమైక్యశంఖారావం బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమైక్యం అనే మాట చంద్రబాబు నోట ఎందుకు రాదన్న విషయాన్ని సీమాంధ్ర ప్రాంత టీడీపీ నాయకులే ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ నాయకులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. నిధులెక్కడి నుంచి వస్తాయి.. పార్టీ విజయవాడ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు నిధులు లేవని చెబుతున్న అధికార పక్ష నాయకులు, రాష్ట్రం విడిపోతే వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జనంతో మమేకం అవగల నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే అని, దీన్ని ఓర్చుకోలేకే చంద్రబాబు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా అని చెప్పుకొంటున్న చంద్రబాబు దీక్షల పేరిట ఎవరి కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధానమనే ఆలోచనతో జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని చెప్పారు. తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అని నినదిస్తున్నారని, మరోవైపు టీడీపీ అధ్యక్షుడు మాత్రం తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేయిస్తున్నారని విమర్శించారు. సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుటుంబాలు ఉమ్మడిగా ఉండాలనేది తెలుగువారి సంస్కృతి అన్నారు. అలాంటిది రాష్ట్ర విభనకు ఇతర పార్టీలు ఎలా సహకారం అందిస్తున్నాయని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ఒప్పుకోకపోయినా, ఆమె కోడలు సోనియా అందుకు పూనుకోవడం దారుణమన్నారు. తరలివచ్చిన నాయకులు సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, వాణిజ్య విభాగం రాష్ర్ట కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్టీయూసీ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీభాషా, బీసీసెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, జిల్లా మహిళ కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు బండారు సాయిబాబు, హనుమంత్‌నాయక్, మైనారిటీ కన్వీనర్ మహబూబ్, తాడికొండ నియోజకవర్గ కన్వీనర్ కె.సురేష్‌కుమార్, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ గుదిబండి చినవెంకటరెడ్డి, కృష్ణా జిల్లా నాయకుడు సింహాద్రి రమేష్ ప్రసంగించారు. చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల కన్వీనర్లు ఉయ్యూరు అప్పిరెడ్డి, చందోలు డేవిడ్ విజయ్‌కుమార్, రాపర్ల నరేంద్ర, తూము నాగేశ్వరరావు, పడమట వెంకటేశ్వరరావు, కొల్లూరు గ్రామ కన్వీనర్ బిట్రగుంట సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సెల్ సభ్యులు అంగిరేకుల ఆదిశేషు, పిడపర్తి క్రిష్ట్రోఫర్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చిలకా ప్రకాష్, యువజన విభాగ కన్వీనర్ కూచిపూడి మోషే, సీనియర్ నాయకులు నర్రా అప్పారావు, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి
పొన్నూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధ్రుతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పొన్నూరు పట్టణం ఐలాండ్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ సీఈసీ సభ్యులు రావి వెంకటరమణ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్య పెడుతున్నారని సమైక్య ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను ఆపాలని అన్ని రాజకీయపార్టీ నాయకుల మద్దతు కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని ముఖ్యనేతలను కలిశారని గుర్తు చేశారు. జగనన్న ఆశయ సాధనలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తనపై ఎలాంటి కేసులు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేని చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్నారు. గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర విడిపోతే తెలంగాణాలోనైన కొన్ని సీట్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పాటుపడుతున్న జననేత జగన్మోహన్రెడ్డికి సీమాంధ్ర ప్రాంత ప్రజలు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాజన్న మృతితో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరో సమన్వయకర్త షౌకత్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సాగు,తాగు నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. జననేతకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, గులాం రసూల్, మండల కన్వీనర్లు పఠాన్బాబుఖాన్, డక్కుమళ్ల రవి, యర్రంశెట్టి రామకృష్ణ, నాయకులు బొనిగల రాజారావు, గేరా సుబ్బయ్య, మొల్లా కరీమ్,షేక్ షఫాయితుల్ల, వాహిదుల్లా, గడ్డం వెంకట్రావు, పల్లెపాటి కోటేశ్వరారవు, అల్లాభక్షు, గైరుబోయిన వేణుగోపాల్, నెలటూరి రఘుబాబు, కర్లపూడి రమేష్, దొప్పలపూడి రాజా, మండ్రు అనిత పాల్గొన్నారు. -
చంద్రబాబుకు జగన్ చాలెంజ్
-
ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది: జగన్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం కొనసాగుతోంది. డిసెంబర్ 27న మొదలైన రెండో విడత సమైక్య శంఖారావానికి చిత్తూరు జిల్లా ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. మహిళలు, యువత , విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వృద్దులు నడవలేని స్థితిలో కూడా మహానేత వైఎస్ఆర్ తనయుడ్ని చూడటానికి తరలి వస్తున్నారు. తనకోసం వచ్చిన ప్రతి ఒక్కరితో జగన్ ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. పెద్దాయన ఉన్నప్పుడు పించన్ వచ్చేదని..ఆయన పోయిన తరువాత రావడంలేదని ఓ వృద్దురాలు చెప్పటంతో...... మన ప్రభుత్వం వచ్చిన తరువాత అప్లికేషన్ పెట్టు..నీకు న్యాయం జరిగేటట్లు చూస్తానని జగన్ ఆవృద్దురాలికి మాట ఇచ్చారు. ఇక మహిళలు హారతులు పడుతూ జగన్‌కు గ్రామగ్రామాన స్వాగతం పలుకుతున్నారు. ఓ వికలాంగ వృద్దురాలు తనకు పింఛన్ రావడంలేదని...అధికారులు పింఛన్ ఇవ్వడానికి నిరాకరించారని ఆమె తన గోడును వెలిబుచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలుకు జగన్ ధైర్యం చెప్పి పంపించారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అంటూ తనను కలవడానికి వచ్చిన వృద్దులకు జగన్ భరోసా చెప్పారు. మరోవైపు మహిళలు చంటి పిల్లలను చంకన వేసుకుని మహానేత తనయుడ్ని చూడటానికి వచ్చారు. -
విభజనపై ‘దేశం’ ద్వంద్వ వైఖరి
-
జగన్‌కు అపూర్వ స్వాగతం..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య శంఖారావం యాత్ర సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సాగింది. ఆదివారం రాత్రి చౌడేపల్లెలో బస చేసిన జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం అక్కడి నుంచి యాత్ర ప్రారంభించారు. అడుగడుగునా జన హోరుతో ఆయన అరకిలోమీటర్ దూరంలో ఉన్న జంక్షన్‌కు చేరుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. చౌడేపల్లె, కొండమర్రిలలో దివంగత మహానేత వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. కొండమర్రికి వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మతపెద్దలు ఆయన్ను కలసి సంఘీభావం ప్రకటించారు. వారి కోరిక మేరకు జగన్మోహన్రెడ్డి వారిని ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. పార్టీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కొండమర్రిలో గిరిజనులు జగన్మోహన్రెడ్డికి డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్, చింతమాకులపల్లె క్రాస్, పుదిపట్ల, బోయకొండ క్రాస్‌ల మీదుగా లద్దిగం చేరుకున్నారు. అక్కడ కణగాని అంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు. మార్గమధ్యంలో పాఠశాల విద్యార్థులు, రైతు కూలీలు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రహదారులకు ఇరువైపులా బారులుతీరి స్వాగతం పలికారు. అక్కడి నుంచి చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరు చేరుకున్న జగన్మోహన్రెడ్డి పాత బస్టాండ్ సర్కిల్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాత్రి పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంట్లో జగన్ బస చేశారు. మంగళవారం యాత్ర పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సాగనుంది. -
విభజనపై ‘దేశం’ ద్వంద్వ వైఖరి
తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయలేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తెనాలిలో నిర్వహించిన సమైక్యశంఖారావం బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభకు ఉమ్మారెడ్డి అధ్యక్షత వహించారు. అంబటి మాట్లాడుతూ సీమాంధ్రలో టీడీపీ నేతలు సమైక్యం కోరుతుంటే, తెలంగాణాలో ఆ పార్టీ నేతలు విభజన కోరుతున్నారని, చంద్రబాబు మాత్రం తన వైఖరిని స్పష్టం చేయటం లేదన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆ పార్టీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమ తదితరులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పదే పదే ప్రకటనలు చేస్తుంటే, అదే పార్టీకి చెందిన యర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులు ప్రత్యేక తెలంగాణకు జై అనడం టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞతకే తెలియాలన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో దేశంలో అన్ని పార్టీల మద్దతును జగన్మోహన్రెడ్డి కూడగడుతున్నారన్నారు. సభాధ్యక్షుడు ఉమ్మారెడ్డి మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరుగుతున్న విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం పూరించారన్నారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనతోనే అమరజీవి ఆత్మకు శాంతి కలుగుతుందని, ఇందు కోసం పాటు పడుతున్న జగన్మోహన్రెడ్డికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు. కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కుటుంబంపై విషం కక్కుతున్నారన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే నాయకులు లేరన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త జలీల్‌ఖాన్ మాట్లాడుతూ ముస్లింలంతా జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ కన్వీనర్ ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్ టీయూజీ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జానీబాషా, బీసీసెల్ కన్వీనర్ దేవళ్ళ రేవతి, జిల్లా మహిళ కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు బండారు సాయిబాబు, హనుమంత్‌నాయక్, మైనారిటీ కన్వీనర్ మహబూబ్, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ఉత్తమకుమార్‌రెడ్డి, రాష్ట్ర బీసీసెల్ సభ్యుడు అంగిరేకుల ఆదిశేషు, జిల్లా రైతు విభాగం కన్వీనర్ మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, సమన్వయకర్తలు గుదిబండి చినవెంకటరెడ్డి, డాక్టర్ మేరుగ నాగార్జున, రావి వెంకటరమణ, సురేష్‌కుమార్, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, నన్నపనేని సుధ, కొల్లిపర, తెనాలి మండల కన్వీనర్లు సుంకర శ్రీనివాసరావు, జంగా శివనాగిరెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్లు కె.రాజమోహనరావు, ఎన్.ప్రభాకర్, మహిళా విభాగం కన్వీనర్లు కె.వరదానమ్మ, సీహెచ్ ఝాన్సీ, పట్టణ యువజన విభాగం కన్వీనర్ మేడిశెట్టి కృష్ణ, బీసీె సల్ కన్వీనర్ డి.వెంకట నరసయ్య, అమృతలూరు మండల కన్వీనర్ రాపర్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
'ప్రజలకు అన్యాయం జరుగుతుంటే పట్టదా'
హైదరాబాద్ : ఓటుతో విభజన రాజకీయాలకు బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా గర్జనలో చంద్రబాబు ఒక్కసారంటే..ఒక్కసారి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పలేదన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లా....చౌడేపల్లిలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజాగర్జనలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు తిరుపతిలాంటి ప్రాంతాల్లో మాత్రమే సమావేశాలు పెట్టుకోవాలి తప్ప..గ్రామగ్రామాన తిరిగే పరిస్థితి లేదన్నారు. -
కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పు నీళ్లే
-
చౌడేపల్లి నుంచి జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చౌడేపల్లి నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చౌడేపల్లి, కొండమర్రి, లద్దిగాం, చందల్లా, పుంగనూరు గ్రామల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బిల్లేరు, పూదిపట్ల, భగత్‌సింగ్ నగర్ మీదగా జగన్ పర్యటన కొనసాగనుంది. లద్దిగాంలో అంజన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం పుంగనూరులో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. యాత్రకు 1 నుంచి 3 దాకా విరామం చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం పుస్కరించుకొని ఈనెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను నిలిపి వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు జగన్ డిసెంబర్ 31 సాయంత్రమే యాత్ర ముగిస్తున్నారని తెలిపారు. మదనపల్లిలో బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం జగన్ హైదరాబాద్‌కు వెళ్లిపోతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్ర పునః ప్రారంభిస్తారని తెలిపారు. -
ఢిల్లీని శాసిద్దాం
-
విభజన జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడే!
వినుకొండ, న్యూస్‌లైన్: తెలుగుజాతిని రెండుగా చీల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద సమైక్యశంఖారావం బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అధికశాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, విభజన జరిగితే అందుకు ప్రధాన కారణమైన చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో ఒక మాట, సీమాంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేలతో మరో మాట చెప్పి ఉద్యమాలు చేయాలని ఉసికొల్పడ ం బాబు నైజమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పోయి ఇప్పుడు సమన్యాయం అంటున్న బాబుకు రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర సాధిస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి బంతి వరకు ఆట ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన అసలు బ్యాట్ ఊపని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. విడిపోతే ఇబ్బందులు తప్పవు.. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ప్రసంగిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని పాటు పడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ పాలనలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. విజయవాడ పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తాను ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఒంటరిగా వచ్చిన వైఎస్ జగన్ శక్తిగా మారారని పేర్కొన్నారు. నరసరావుపేట సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ మర ణానంతరం రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ బండారు సాయిబాబు, మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్, ఎస్టీ సెల్ కన్వీనర్ హనుమంతునాయక్, పిల్లా ఓబుల్‌రెడ్డి, ఎలిశెట్టి ఆదినారాయణ, ఆర్. శ్రీను, కర్నాటి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపంజానిలో కొనసాగుతున్న సమైక్య శంఖారావం
-
జగన్ నేటి సమైక్య శంఖారావం యాత్ర రద్దు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర నేడు రద్దు అయ్యింది. ఆదివారం నుంచి యాత్ర యథాతథంగా జరుగుతుందని ఆపార్టీ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కొత్తవలస వద్ద ఈరోజు తెల్లవారుజామున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనా స్థలానికి ఆయన బయల్దేరి వెళ్లారు. బాధితులను జగన్ పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది. -
మన మహానగరం మనకు ఉండాలి: జగన్
దశాబ్దాల తరబడి నిర్మించుకున్న మన మహానగరం మనకు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ సమైక్య శంఖారావం యాత్రను శుక్రవారం చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. నీటి కోసం నిలదీయాల్సిందిపోయి టీడీపీ అధ్యక్షుడు విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం ప్రజలు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల చొక్క పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం మన పిల్లల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలకు దమ్ము, దైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా సమైక్య నినాదం వినిపించే దమ్ము, ధైర్యం తనకుందని జగన్ అన్నారు. -
నీళ్లు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలి: వైఎస్ జగన్
రాష్ట్రాన్ని విభజిస్తే.. నీళ్ల కోసం ఎక్కడికెళ్లాలో చంద్రబాబును, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని అడగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పత్తికొండలో సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వట్లేదని ఆయన నిలదీశారు. మనమంతా ఒక్కటైనప్పుడే సమైక్యాంధ్ర సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో మనందరం ఒకే తాటిపై నడుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలను మనమే గెలిపించుకుందామని, అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూడొచ్చని తెలిపారు. -
జగన్‌కు సమైక్యవాదుల ఘన స్వాగతం
-
జగన్‌కు సమైక్యవాదుల ఘన స్వాగతం
పలమనేరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమైక్యవాదులు చిత్తూరు జిల్లాలో ఘన స్వాగతం పలికారు. రెండో విడత సమైక్య శంఖారావంతో పాటు ఓదార్పు యాత్రను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు జగన్‌కు జంగాలపల్లె వద్ద భారీ స్వాగతం లభించింది. పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వినర్ నారాయణస్వామి, అభిమానులు, పార్టీ నేతలు, సమైక్యవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు. జగన్ పర్యటన వివరాలు : జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం జంగాలపల్లెకు చేరుకున్నారు. అక్కడ నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని గండ్రాజుపల్లె, నాలుగురోడ్ల కూడలి మీదుగా పత్తికొండకు వస్తారన్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం మామడుగులో రోడ్‌షో నిర్వహించి ఆర్టీఏ చెక్‌పోస్టు మీదుగా పలమనేరు మండలంలోని నక్కపల్లెకు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి కొలమాసనపల్లె రోడ్‌షోల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట మీదుగా వెళ్లి అప్పినపల్లెలో చేలూరి జగన్నాథం కుటుంబాన్ని ఓదారుస్తారు. అనంతరం అక్కడి నుంచి కుంబార్లపల్లె, సంపల్లె మీదుగా పర్యటన సాగుతుంది. పెద్దవెలగటూరు గ్రామంలో రోడ్‌షో నిర్వహించి అక్కడే జగన్ రాత్రికి బస చేస్తారు. శనివారం ఉదయం రాజుపల్లె, కరసనపల్లె, ముతుకూరు, పెద్దపంజాణి, బసవరాజు కండిగ, కోగిలేరుల మీదుగా వెళ్లి రాయలపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కమ్మపాళెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి కొళత్తూరు, తుర్లపల్లె, కొత్తూరుల మీదుగా వెళ్లి కెళవాతిలో రాత్రి బస చేస్తారు. 29వ తేదీన వీరప్పల్లె మీదుగా వెళ్లి చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, దుర్గ సముద్రంలో తోటి సంకరమ్మ కుటుంబాన్ని ఓదారుస్తారు. అలాగే చారాలలో వైఎస్సార్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అక్కడి నుంచి శెట్టిపల్లె చౌడేపల్లె, ఠాణాఇండ్లు, పుదిపట్ల మీదుగా లద్దిగం చేరుకుని, అక్కడ అంజప్ప కుటుంబాన్ని ఓదారుస్తారు.. చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరుకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రాత్రికి అక్కడే బస చేసి 30వ తేదీ రాంపల్లె, సుగాలీమిట్ట, ఈడిగపల్లె, మొలకలదిన్నెల మీదుగా మదనపల్లెకు చేరుకుంటారు. గొల్లపల్లెలో జరిగే ఓదార్పులో పాల్గొంటారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
కల చెదిరింది.. కథ మారింది
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం.. మలుపులు తిరిగిన రాజకీయం.. ఈ రెండు అంశాలు పశ్చిమగోదావరి తీరానికి ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. చరిత్రకే వన్నె తెచ్చేలా జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం.. రోజుకో తీరున మారిన రాజకీయం.. జిల్లా ముఖచిత్రాన్నే మార్చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణే అభిమతంగా ముందుకుసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయంపై ద్వంద్వ వైఖరితో టీడీపీ క్యాడర్‌ను దూరం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. - సాక్షి ప్రతినిధి / ఏలూరు వైఎస్సార్ సీపీలో ఉత్సాహం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. గడపగడపకూ పాదయాత్ర ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకెళ్లారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 24 రోజుల పాటు 278 కిలోమీటర్ల మేర జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించి ఔరా అనిపించారు. ఆ తర్వాత సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్రను కూడా ఆమె జిల్లాలో చేపట్టారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విపత్తులు సంభవించినప్పుడు జిల్లాలో పర్యటించి రైతులను ఓదార్చారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లెహర్ తుపాను తర్వాత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. సమైక్యమే ఊపిరిగా.. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత మూడు నెల లపాటు జిల్లా అంతటా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల భావోద్వేగాలను బయటపెట్టింది. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆందోళన, ఆవేదన ఒక్కసారిగా బయటపడ్డాయి. రోజురోజుకీ ఉద్యమం విస్తరించిన విధానం, అట్టడుగు నుంచి ఉన్నత వర్గాల వరకూ భాగస్వాములైన తీరు రా జకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఎవరి ప్రోద్భలం లేకుండానే, ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని నడిపించడం మేధావుల్ని సైతం నివ్వెరపరిచింది. జనమంతా ఒక్కటై.. జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్, భీమవరం ప్రకాశంచౌక్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో ప్రతిరోజూ 15 వరకూ ఆందోళనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు అనేక ఇతర రంగాలకు చెందిన వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. యువజనం.. ఉద్యోగుల ప్రభంజనం సమైక్యాంధ్ర ఉద్యమానికి యువకులు కొండంత అండగా నిలిచారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిచోటా ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వోద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. ఏపీఎన్జీవోలు ఒక దశలో ఉద్యమానికి సారథులుగా వ్యవహరించి ముందుకుతీసుకెళ్లారు. వారు చేసిన 66 రోజుల నిరవధిక సమ్మె కారణంగానే ఉద్యమ ప్రభావం అందరికీ తెలిసింది. వారితోపాటు రైతులు, కార్మికులు, రిక్షా కార్మికులు, తోపుడు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకరేమిటి చివరికి హిజ్రాలు కూడా సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏలూరు నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జేఏసీలు ఏర్పాటై పకడ్బందీ ఉద్యమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. ఉద్యమం.. వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన, ఒక ధర్నా, ఒక బహిరంగ సభ గురించే అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుం టాం. కానీ సమైక్య ఉద్యమంలో చేసినన్ని వినూత్న ఆందోళనలు గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటల ద్వారా ప్రజలు తమ నిరసన తెలిపారు. కేబినెట్లో కావూరి ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం ఒక్కటే కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిచ్చింది. ఆయనకు కేంద్ర జౌళి శాఖ లభించింది. అయితే మంత్రి పదవి దక్కిందనే ఆనందం పంచుకునేలోపే విభజన వ్యవహారం ముందుకురావడంతో కావూరి అడుగడుగునా నిరసనలు ఎదుర్కోక తప్పలేదు. దివికేగిన కోటగిరి జిల్లాపై చెరగని ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి ఈ సంవత్సరం రాజకీయాల్లో అనూహ్యంగా చెప్పుకోవచ్చు. జులై 20న అకస్మాత్తుగా గుండెపోటుతో ఆయన మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం హవా నడిపిన విద్యాధరరావు ఆ తర్వాత పీఆర్పీలో చేరి అది కాంగ్రెస్‌లో విలీనమవడంతో ప్రాధాన్యతను కోల్పోయారు. మళ్లీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విద్యాధరరావు మృతి చెందారు. ఇరకాటంలో టీడీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 2013లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా జిల్లాలో తెలుగుదేశం పరిస్థితిని మెరుగు పరచలేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆ పార్టీ వైఖరి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేకపోవడంతో క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విభజనపై పార్టీ వైఖరిని వివరించేందుకు చంద్రబాబు జిల్లాలో పర్యటించాలని భావించినా ఇక్కడి నేతలు చేతులెత్తేయడమే ఆ పార్టీ పరిస్థితికి ఒక ఉదాహరణ. దీంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. కాంగ్రెస్‌కు కష్టకాలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2013లో ఒక్కసారిగా తల్లకిందులైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాతో కుదేలైన ఆ పార్టీ సమైక్య ఉద్యమంతో పాతాళానికి వెళ్లిపోయింది. ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీసి జిల్లాలో తిరగనివ్వలేదు. దీంతో చాలామంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అయితే సహకార ఎన్నికల్లో అధికారం అండతో ఎలాగోలా నెగ్గుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన ముత్యాల వెంకటరత్నం డీసీసీబీ చైర్మన్‌గా, రవివర్మ డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ వెనుకబడిపోయింది. మారిన రాజకీయ ముఖచిత్రం సమైక్య ఉద్యమ ప్రభావంతోపాటు అంతకుముందు జరిగిన పరిణామాలతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ప్రజల దృష్టిలో చులకనైపోయారు. గందరగోళంతో తెలుగుదేశం కూడా జనంలోకి వెళ్లడానికి ఇబ్బంది పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంలో మమేకమైంది. -
'కాంగ్రెస్‌వి దిగజారుడు రాజకీయాలు'
శ్రీకాకుళం : రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్ జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి అంతా మద్దతు ఇవ్వాలని ఆయన గురువారమిక్కడ కోరారు. ఆనాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్లు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు జగన్ మాత్రమే సమైక్య రాష్ట్రం కోసం స్పష్టమైన ఆశయంతో పోరాడుతున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ పలు వార్డుల్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమైక్య నినాదం కార్యక్రమాన్ని తమ్మినేని సీతారాం నిర్వహించారు. -
నిర్వాసితులకు పునరావాసం
హిరమండలం, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే..వంశధార నిర్వాసితు లకు పునరావాసం కల్పిస్తామని, తాగు, సా గునీటి సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ జి ల్లా కన్వీనర్, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. స్థానిక పాతబ స్టాండ్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ విజయవంతమైంది. ముఖ్య అతిథిగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బలాన్ని కూడగడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఓదార్పు యా త్రకు వచ్చిన ఆదరణ చూసి, ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డాయని పేర్కొన్నా రు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథం లో నడిపించాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ ‘విభజించు..పాలించు’ రాజకీయాలకు చరమగీతం పాడాల న్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై పోరాడేందుకు అహర్నిశలూ కష్టపడతామన్నారు. రాజకీయ భిక్షపెట్టిన హిరమండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. భారీగా చేరికలు ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. హిరమండలం మేజరు పంచాయతీ సర్పంచ్ ఎ.సూర్యకుమారి, ఉపసర్పంచ్ ఎ. అబ్బాయితో పాటు 14మంది వార్డు సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ ఎ.రవిబాబు, డి.రమేష్, ఎస్.గోవింద, డి.నగేష్, కె. మల్లేశ్వరరావు, లాడె భాస్కరరావు, పి.నాగేశ్వరరావు, పి.రామారావు, పుల్లా నాగేశ్వరరావు, ఎ.నాగేశ్వరరావు, బి.అప్పలనాయుడు, పెరైడ్డి తవుడు, కె.కామేశ్వరరావు, డి.రామారావు, కె.మురళి, ఎం.మురళి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నా రు. అలాగే దుగ్గుపురం సర్పంచ్ ఆర్.మోహనరావు, మాజీ సర్పంచ్ మడపాన భాస్కరరావు, చల్ల భాస్కరరావు, రేగాన కృష్ణారావు, పాడలి పంచాయతీ నుంచి మాజీ ఉప సర్పంచ్ పెదకోట సాధుబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు యర్లంకి వెంకటరావు, గొర్లె మోహనరావు, పి.గోవిందరావు, బి.వెంకటరావు, కె.గోవిందరావు, బర్రి ఆఫీసు, గొర్లె రమేష్, అం పోలు అప్పలనాయుడు, సోలిపి నుంచి నేరడి రామయ్య, ఎన్.పున్నయ్య, పి.దండాసి, కె.గణపతిరావు, పి.వీరన్న, దబ్బగూడ నుంచి సవర బాపన్న, సన్నాయి, పి.అప్పల స్వామి, పి.చిన్నప్పలస్వామి, కొమనాపల్లి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, గొట్ట నుంచి మాజీ సర్పంచ్ వంజరాపు రామారావుతో పాటు వారి అనుచరులు పార్టీ గూటికి చేరారు. -
సమైక్యం కోసం.. సమర శంఖం..!
మందస, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రే ధ్యేయమని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య ఉద్యమానికి పార్టీ నేతలతో పాటు అభిమానులు, కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. పార్టీ యువజన విభాగం చొరవతో హరిపురంలో మంగళవా రం ‘సమైక్య శంఖారావం’ నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు తదితరులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ స్వప్రయోజనం, రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విభజిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుట్రను పార్లమెంట్లో ప్రథమంగా ఖండించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డేనన్నారు. సమైక్యాంధ్ర కోసం అన్ని రాష్ట్రాల నాయకుల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విభజన వల్ల యువకులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతారన్నారు. జల పంపకాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుం డా..విభజనకు పూనుకోవడం బాధాకరమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరె డ్డి సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు కావాలంటే.. జగన్మోహన్రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతా ఆయనకు సహకరించాలని కోరారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి, పార్టీని గెలిపిస్తామన్నారు. జై సమైక్యాంధ్ర, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏకగ్రీవ తీర్మానం.. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని, తెలుగు వారంతా..కలిసి ఉండాలని కోరుతూ..నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, అభిమానులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మాన పత్రాన్ని రాష్ట్రపతి, గవర్నర్‌కు అందజేస్తామని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ టి.సురేష్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ యువజన విభాగం జిల్లా శాఖ అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర శాఖ సభ్యుడు మామిడి కృష్ణారావు, మండల కన్వీనర్ కురాగౌడ, మహిళా విభాగం కన్వీనర్ బల్ల లీలాకుమారి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందాల శేషగిరి, అడ్‌హక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ జి.నర్సునాయుడు, పార్టీ నాయకులు పులారి పాపారావు, ఎన్ని ధనుంజయరావు, సర్పంచ్ మేకల గౌరి, కర్రి గోపాలకృష్ణ, దుంపల లింగరాజు, మాలతి మురళి, మాజీ సర్పంచ్ బొడ్డు హరికృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మామిడి సిం హాద్రి, బల్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల కోసం పోరాటం
కమలాపురం/కడప: సాక్షి: ‘‘రాష్ట్రం విడిపోతే భావి తరాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అన్ని విధాల నష్టం వాటిల్లుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు మినహా మంచినీరు దొరకని పరిస్థితి. విభజన వల్ల వాటిల్లే నష్టాలను సవివరంగా చెబుతున్నా కేంద్రం విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది. దీనికి కారణం సీఎం కిరణ్ అసమర్థ వైఖరి, చంద్రబాబు రెండు నాల్కల ధోరణే. ఇప్పటికైనా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. అందుకోసం పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా అఫిడవిట్లను దాఖలు చేసి రాష్ట్రపతికి ఇవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నిపార్టీలకు విన్నవించారు. కమలాపురంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన ఆదివారం ‘సమైక్యశంఖారావం’ సభ నిర్వహించారు. ఈసభకు కేంద్రపాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులంతా ఓ వైపు...ప్రజలంతా మరో వైపు ఉన్నారని, ప్రజల తరఫున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్ పోరాటం చేస్తున్నారని రవీంద్రనాథరెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడా విభజనకు సహకరిస్తున్నాయన్నారు. ప్రజలు రేషన్ కార్డుల నుండి పింఛన్ల వరకూ అన్ని సమస్యలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభ జించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని లేదంటే భావితరాల భవిష్యత్తును అంధకారం చేసిన వారికి చరిత్రలో నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తిరుపాలరెడ్డి, రైతువిభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు అఫ్జల్ఖాన్, కాల్టెక్స్ హఫీజుల్లా, మైనార్టీసెల్ రాష్ట్రనేత ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘం నేత అమ్ముడుపోయారు: - కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే సమైక్యవాదం ముసుగులో ఉద్యమించిన ఓ ఉద్యోగ సంఘం నాయకుడు టీడీపీ, కాంగ్రెస్‌లకు అమ్ముడుపోయాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు దారుణానికి ఒడిగట్టాడు. అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి జగన్‌కు మాత్రమే ఉంది. అందుకే దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టి సమైక్యం కోసం పోరాడుతున్నారు. ఎంపీ సీట్లు మినహా మరో ఆలోచనలేదు: - ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనే ఆలోచన తప్ప సోనియాకు మరో ఆలోచన లేదు. బిల్లు అడ్డుకుంటామని చెప్పిన సీఎం కిరణ్, చంద్రబాబు అసలు అసెంబ్లీకే రాలేదు. దీంతో తెలంగాణ నేతలు బిల్లుపై చర్చ జరిపారు. చర్చ జరగకుండా అడ్డుపడ్డాం. -
సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తశుద్ధితో పోరాడుతోంది వైఎస్ఆర్ సీపీ మాత్రమేనని పార్టీ ఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఉదయం తన నివాసంలో బాలినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వంద్వ నీతితో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం కిరణ్ తీరును ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే సమైక్య శంఖారావం చేపడుతున్నట్లు వివరించారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సమైక్య శంఖారావాన్ని జయప్రదం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగం కరపత్రాలు, వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సమైక్యవాదులంతా జగన్‌కు మద్దతివ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, ైనాయకులు తిరుమలరావు, సింగరాజు వెంకట్రావు, మీరావలి, శంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
27 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
-
27 నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు జిల్లాలో రెండవ విడుత సమైక్య శంఖారావాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం మీడియాకు వెల్లడించారు. పలమనేరులో నియోజవర్గంలో డిసెంబర్ 27 తేది నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం కొనసాగుతుంది అని రఘురాం తెలిపారు. పలమనేరులోని 4 రోడ్ క్రాస్ కు మధ్యాహ్నం చేరుకుని యాత్రను ప్రారంభిస్తారన్నారు. పత్తికొండ, నక్కపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి విగ్రహా ఆవిష్కరణ జరుగుతుంది అని, అప్పిన పల్లిలో వైఎస్ మృతి వార్త తట్టుకోలేక మరణించిన వ్యక్తి కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారని రఘురాం తెలిపారు. 28 తేదిన రాయలపేటలో బహిరంగ సభ, కమ్మపాలెంలో మరో కుటుంబాన్ని జననేత పరామర్శిస్తారు. అదే రాత్రి మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి నివాసంలో బస చేస్తారని కార్యక్రమ వివరాలను మీడియాకు తెలిపారు. తొలి విడుత సమైక్య శంఖారావం కార్యక్రమం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
నేడు పత్తికొండలో ‘సమైక్య శంఖారావం’
పత్తికొండ టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకుడు, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విభజన కుట్రను వ్యతిరేకిస్తున్నది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోరాడుతున్నారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడా కూడగడుతున్నట్లు చెప్పారు. సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యతకు మద్దతుగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పిస్తే విభజనను అడ్డుకోవచ్చని తమ నేత పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక ఊరివాకిలి సమీపంలోని ముత్యాలశెట్టి గోడౌన్లో నిర్వహించనున్న శంఖారావం సభకు పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. సమైక్యవాదులంతా సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సి.శ్రీరంగడు, మాజీ జెడ్పీటీసీ పి.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్లు దామోదరాచారి, పందికోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యం జగన్‌తోనే సాధ్యం
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర ప్రజలను నమ్మించి ముంచేశాయని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సమైక్య నినాదంతో తమ పార్టీ పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్, టీడీపీల నేతలు మాత్రం బయటకు సమైక్యవాదులమేనంటూ మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌తోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల రథంబజారు సెంటర్లో శుక్రవారం రాత్రి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇక్కడ సమైక్యాంధ్ర...అక్కడ జై తెలంగాణ అంటూ ద్వంద వైఖరి అవలంభిస్తున్న చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ర్టం మొత్తం తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే కనీసం సమావేశానికి కూడా హాజరు కాకపోవడం కుమ్మక్కులో భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. బెల్టుషాపుల ఘనత బాబుదే.. గ్రామాల్లో సైతం ఇంటికో బెల్టుషాపు ఏర్పడిందంటే ఆ ఘనత చంద్రబాబుదేనని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యం అంటున్న తరుణంలో అక్కడ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, సీమాంధ్రలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరగటం రాజకీయ డ్రామా కాదా అని నిలదీశారు. ఎన్ని ఎత్తుగడలు పన్నినా ప్రజలు నమ్మకపోవడంతో మతిభ్రమించిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం, దాన్ని ఎల్లోమీడియా కథలుగా ప్రచురించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి దిక్చూచి జగన్ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దిక్చూచి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఒక వైపు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఒంటిచేత్తో పోరాడుతున్న యోధుడు జగన్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఆయన వల్లే సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, మైనార్టీ విభాగం కన్వీనర్ సయ్యద్ మాబు, బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ళ రేవతి, విద్యార్థి విభాగం కన్వీనర్, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు. -
నేడు చిలకలూరిపేటలో సమైక్య శంఖారావం సభ
చిలకలూరిపేట,న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిలకలూరిపేట పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించే సమైక్యశంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ మర్రిరాజశేఖర్ విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఆయన కళామందిర్‌సెంటర్‌లో సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్షించారు. సమైక్యవాదులందరూ పార్టీలకు అతీతంగా సభకు హాజరుకావాలని ఆయన కోరారు. ఆయన వెంట పార్టీ పట్టణ,మండల కన్వీనర్లు ఏవీఎం సుభానీ, చాపలమడుగు గోవర్ధన్, పార్టీనాయకులు మటన్‌బాషు, సాప నూర్‌అహ్మద్, జిలానీ, సుధాకర్ తదితరులున్నారు. -
సమైక్య ద్రోహుల చొక్కా పట్టుకోండి
మడకశిర, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ద్రోహులను చొక్కా పట్టుకుని నిలదీయండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేమని గుర్తించిన ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నడం రాష్ట్ర విభజనకు దారితీసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు చేతులెత్తేసి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్సార్సీపీ కోరిన విధంగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి వుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియాగాంధీ ఓట్లు, సీట్ల రాజకీయం చేసి తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర పన్నిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చంద్రబాబు వత్తాసు పలికి సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన విజయవాడ ఎంపీ లడగపాటి రాజగోపాల్ కూడా చివరకు చేత్తులెత్తేశారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ద్రోహులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ర్టంలో సువర్ణయుగం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దూరదృష్టి గల నాయకుడని, అందుకే ఆయన హయాంలో సువర్ణయుగం సాగిందన్నారు. చంద్రబాబు హయాంలో వరుస కరువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మడకశిరలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం తథ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైఎస్సార్ రుణాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి మంత్రి రఘువీరారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు. -
జగన్ సమైక్య శంఖారావం యాత్రకు సంఘీభావం
-
సమైక్యానికి నువ్వే...
-
రతనాల సీమను నరికేస్తారా?
* ఎవరిచ్చారు మీకు ఈ అధికారం.. * సమైక్య శంఖారావంలో జగన్ నిప్పులు * కావాలంటే మిగిలిన జిల్లాలన్నింటినీ తెలంగాణకే కలిపేసి ‘తెలంగాణ’ అని పేరు పెట్టండి * ఓట్లు, సీట్ల కోసం, కుమారుడిని ప్రధానిని చేయడం కోసం సోనియా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు * సోనియా ఏం చెబితే దానికి చంద్రబాబు, సీఎం కిరణ్ తందానా అంటున్నారు * ఇప్పుడు రాయల తెలంగాణ అని ఇంకోటి తెస్తున్నారట * మనల్ని చులకనగా చూస్తూ వారిష్టం వచ్చినట్లు చేసేస్తున్నారు.. ఇది తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య పోరాటం * బాబూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఢిల్లీకి ఎందుకు లేఖ రాయడం లేదు? * కిరణ్.. అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం ఎందుకు చేయడం లేదు? * 30కిపైగా ఎంపీ స్థానాలను మనమే తెచ్చుకుందాం.. ఢిల్లీ కోటను నిర్మిద్దాం సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాయలసీమను అడ్డంగా నరికేసి రెండు జిల్లాలను తెలంగాణలో కలపటం కన్నా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను తెలంగాణకు కలిపేసి ఆ సమైక్య రాష్ట్రానికి తెలంగాణ అని పేరు పెట్టండని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తన కుమారుడిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చో బెట్టుకోవడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తుంటే అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుజాతి ఆత్మ గౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 30 పైచిలుకు పార్లమెంటు స్థానాలు తెచ్చుకుని ఢిల్లీ కోటను మనమే నిర్మిద్దాం.. అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం అని నినదించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర సోమవారం మూడోరోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో సాగింది. బెరైడ్డిపల్లె మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మనల్ని ఎంత చులకనగా చూస్తున్నారు.. పేపర్లో చదివాను. రాయల తెలంగాణ అని ఇంకొకటి తీసుకొస్తున్నారట. రాయల సీమను కూడా అడ్డంగా నరికేస్తారట. రాయలసీమను అడ్డంగా నరికేసి రెండు జిల్లాలను అటువైపు కలపటం కన్నా.. మిగిలిన అన్ని జిల్లాలను అటువైపే కలిపేసి రాష్ట్రం పేరు తెలంగాణ రాష్ట్రం అని పెట్టేస్తే ఎవరు వద్దంటున్నారు? రాష్ట్రం పేరు మార్చేయండి.. తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టండి.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి.. వాళ్ల ఇష్టమొచ్చినట్టు చేసేస్తున్నారు. వీళ్లు మనలను ఎంత చులకనగా చూస్తున్నారో ఇంత కన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? పైనుంచి దేవుడు చూస్తున్నాడు. కచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్లకు బుద్ధి వచ్చేటట్టు దేవుడు మొట్టికాయ వేస్తాడు. రాయలసీమ రతనాల సీమ. ఆ రాయలసీమలో అట్టడుగున ఉన్న జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సమైక్య శంఖారావం పూరించడానికి కారణం ఏమిటంటే .. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్ర ప్రజలు సమైక్యమే కోరుకుంటున్నారన్న సందేశం ఢిల్లీకి చేరాలి. ప్రజలంతా సమైక్యంగా ఉండాలని, తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని కోరుకుంటుంటే సోనియాగాంధీ మాత్రం ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవడం కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. అందుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తందానా అంటున్నారు. రాష్ట్రం విడిపోతే ఉత్పన్నమయ్యే సమస్యలు వీళ్లకు తెలుసా? తెలిసినా కళ్లున్న కబోదుల్లా ఉన్నారా? ఈరోజు రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణ్‌పూర్ డ్యాంలు నిండిన తర్వాతగానీ మన రాష్ట్రానికి చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మధ్యలో మరో రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంటుంది? రాష్ట్రం విడిపోతుందనే సంకేతాలు వచ్చాకే బ్రిజేశ్ కుమార్ టిబ్యునల్ కృష్ణా జలాల మీద తీర్పు చెప్పింది. రాష్ట్రం విడిపోతుంది కదా.. ఎవరూ అడిగే వారు లేరని మిగులు జలాలపై మనకున్న హక్కులను ఇతర రాష్ట్రాలకు పంచేసింది. పై రాష్ట్రాలకు ఎక్కువగా నీళ్ల కేటాయింపులు చేసింది. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఈ అన్యాయాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మాకు నీరు ఎక్కడ్నుంచి వస్తుందని రైతన్నలు రేపు మీ కాలర్ పట్టుకొని నిలదీస్తే ఏం సమాధానం చెప్తారని సోనియాను, కిరణ్‌కుమార్‌రెడ్డిని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబును అడుగుతున్నా. హంద్రీ-నీవా, గాలేరు-న గరి, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌కు నీళ్లు ఎక్కడ్నుంచి తెచ్చిస్తారని అడుగుతున్నా. ఆ ఆధికారం ఎవరిచ్చారు మీకు? ఈ పాలకులు హైదరాబాద్ నగరాన్ని ఒకవైపు, సముద్ర తీరాన్ని మరోవైపు విభజిస్తారట. ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులను విడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసే అధికారం మీకు ఎవరిచ్చారు? పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోవాలట మనం. విభజిస్తే తామంతా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని చదువుకున్న ప్రతి పేద పిల్లవాడు మీ కాలర్ పట్టుకొని అడిగితే సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ ఏం సమాధానం చెబుతారు? రాష్ర్ట్ర ఆదాయంలో 55 నుంచి 60 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. హైదరాబాద్‌ను విడదీస్తే ఆ తర్వాత ఉద్యోగుల జీతాలకు డబ్బులెక్కడ్నుంచి తెచ్చి ఇస్తారు? దివంగత నేత వైఎస్సార్ బతికున్న రోజుల్లో హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏడాదికి 57 వేల మంది విద్యార్థులకు క్యాంపస్‌లో ఉద్యోగాలు వచ్చేవి. కానీ వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం జరుగుతోంది? హైదరాబాద్‌ను నాశనం చేసి పెడుతున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయాయి. విభజన చేస్తున్న సోనియాను ఒక్క మాట అడుగుతున్నా.. మీరు 1968లో మా దేశానికి వచ్చారు. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకుని 1983వ సంవత్సరంలో భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా మాలో ఒకరిగా బతికారు. ఈరోజు ఎవరైనా పార్లమెంటులో బిల్లు తీసుకొని వచ్చి మీ దేశానికి తిరిగి వెళ్లిపోవాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? అలా అంటే కాంగ్రెస్ వాళ్లంతా కల్లు తాగిన కోతుల్లా ఎగరరా? 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే 60 ఏళ్లుగా కలిసిబతుకుతున్న మమ్మల్ని పదేళ్లలో వెళ్లిపొమ్మంటే మాకెలా ఉంటుంది? బాబూ.. లేఖ ఎందుకివ్వవు? రాష్ర్టం నాశనమై పోతుంటే చంద్రబాబు కళ్లున్న కబోదిలా చూస్తున్నారు. రేపు ఆయన ఇక్కడి కి వచ్చినప్పుడు అడగండి. ఎందుకు సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వడం లేదని ప్రశ్నించండి. బాబుగారి నోట సమైక్యం అన్న మాట ఎందుకు రాదో గట్టిగా అడగండి. సీఎం కిరణ్ ఓవైపు సమైక్యమంటూనే మొసలి కన్నీరు కారుస్తారు. మరోవైపు సోనియా చెప్పినట్టు చేస్తారు. ఉద్యోగులను భయపెట్టి సమ్మె విరమింపజేస్తారు. ఇదేనా సమైక్యం అంటే? సమైక్యం అంటున్న కిరణ్ ఎందుకు అసెంబ్లీని సమావేశపర్చడం లేదు. ఎందుకు సమైక్యరాష్ట్రం కోసం తీర్మానం చేయడం లేదు? వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మనమంతా ఒక్కటవుదాం. ఎన్నికల్లో 30పై చిలుకు ఎంపీ స్థానాలను మనమే తెచ్చుకుందాం. ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం. దుర్మార్గులను ఇంటికి పంపిద్దాం. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. మీ నినాదం ఢిల్లీకి వినిపించాలి.. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఢిల్లీ వాళ్లకు వినిపించేలా గట్టిగా సమాధానాలు చెప్పండి. రాష్ట్రాన్ని విభజిస్తే ఒప్పుకుంటామా? (ఒప్పుకోం.. ఒప్పుకోం అని ప్రజా స్పందన) తెలుగులో చెప్తే ఢిల్లీ వాళ్లకు అర్థం కాదు.. వాళ్లకు కొంత చెవుడు ఉంది. గట్టిగా ‘నో’ అని చెప్పండి (‘నో..నో’ అని జన స్పందన) తెలుగు జాతిని విడగొడతామంటే ఒప్పుకుంటామా (ప్రజలు: నో..నో..) అన్నదమ్ములమైన మనమే తన్నుకునే పరిస్థితి రావాలా? (జనం: నో..నో..) మన హైదరాబాద్ కోసం మనలో మనమే తన్నుకొని చావాలా (జనం: నో..నో..) ఇంకొక స్లోగన్ కూడా చెప్పాలి. అది ఇంకా భీకరంగా ఉండాలి. ఢిల్లీకి వినపడాలి. జై సమైక్యాంధ్ర.. జై తెలుగుతల్లి... జై వైఎస్సార్’’ -
3వ రోజు కొనసాగుతున్న జగన్ శంఖారావం
-
చిత్తూరు జిల్లాలో మూడో రోజు ఆరంభమైన జగన్ పర్యటన
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు సోమవారం చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది. వి. కోట నుంచి ఆరంభమైన ఈ యాత్ర ప్రధానంగా వి.కోట బస్టాండు సెంటర్, దొడ్డిపల్లి, కొమ్మరామడుగు, దియోదొడ్డి మీదుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో రోడ్డు షోగా కొనసాగి, బైరెడ్డిపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు విభజనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్ కుట్రలను, ఆ పార్టీకి వంతపాడుతున్న తెలుగుదేశం పార్టీ మోసాలను ప్రజలకు వివరించి, దాంతో పాటు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబీకులను కూడా జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. -
నేడు చిత్తూరు జిల్లాలో జగన్ సమైక్య శంఖారావం
-
నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సమైక్య శంఖారావం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజు సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరులో కొనసాగనుంది. వి. కోట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రధానంగా వి.కోట బస్టాండు సెంటర్, దొడ్డిపల్లి, కొమ్మరామడుగు, దియోదొడ్డి మీదుగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ అన్ని ప్రాంతాల్లో రోడ్డు షోగా కొనసాగి, బైరెడ్డిపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు విభజనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్ కుట్రలను, ఆ పార్టీకి వంతపాడుతున్న తెలుగుదేశం పార్టీ మోసాలను ప్రజలకు వివరించి, దాంతో పాటు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబీకులను కూడా జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. -
జగనన్నతోనే అభివృద్ది సాద్యం
-
కుప్పంలో జగన్ రెండో రోజు సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభం
-
సమైక్య శంఖారావం సాగుతుందిలా
-
సమైక్య శంఖారావానికి బయల్దేరిన వైఎస్ జగన్
-
సమైక్య శంఖారావానికి బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్రకు బయల్దేరారు. శనివారం ఉదయం ఆయన లోటస్ పాండ్ నుంచి చిత్తూరు జిల్లాకు పయనం అయ్యారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ నుంచి కుప్పం చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు. కాగా జన హృదయనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు. తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. ఇక ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
-
'కుప్పంలో జగన్‌కు బ్రహ్మరధం పట్టేందుకు జనం సిద్ధం'
తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు సమైక్యాంధ్ర ద్రోహి అయినందునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోండి అని చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని భూమన వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్ ఒకవైపు దేశంలోని వివిధ పార్టీల మద్దాతు కూడగడుతూనే మరోవైపు ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం దిగ్విజయం అవుతుందని భూమన తెలిపారు. -
త్వరలో సమైక్య శంఖారావం
-
త్వరలో సమైక్య శంఖారావం
సమైక్యాంధ్ర కోసం కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా యాత్ర: జగన్ సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలో సమైక్య శంఖారావం పూరించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సమైక్యాంధ్ర సాధన కోసం చేపట్టబోయే ఈ సమైక్య శంఖారావం యాత్ర రాష్ర్టవ్యాప్తంగా సాగుతుందని తెలిపారు. దారి మధ్యలో ఓదార్చాల్సిన కుటుంబాలను ఓదారుస్తూ త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ప్రజలనుద్దేశించి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీ వివాహానికి జగన్ హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. దారి మధ్యలో రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఇక్కడ జక్కంపూడి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు నేను అనుకోని పరిస్థితుల్లో కుట్రలు, కుతంత్రాల మధ్య జైలుపాలయ్యాను. అందువల్లే రాలేకపోయాను. మీ ఆప్యాయతలు, దేవుని చల్లని ఆశీస్సులతో మళ్లీ మీ అందరి ప్రేమానురాగాలు పొందేందుకు మీ మధ్యకు రాగలిగాను’’ అని అన్నారు. త్వరలోనే సమైక్య శంఖారావం పూరిస్తూ ఇక్కడకు వస్తానని చెప్పారు. జగన్‌కు జన నీరాజనం.. ఏడాదిన్నర తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు మధురపూడి చేరుకున్న తమ అభిమాన నేతకు స్వాగతం చెప్పడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. మధురపూడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి కంబాల చెరువు సెంటర్‌కు చేరుకునేందుకు ఏకంగా నాలుగున్నర గంటల సమయం పట్టింది. దారిపొడవునా వేలాదిగా జనం బారులు తీరారు. మహిళలు అడుగడుగునా మంగళ హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. పెద్ద సంఖ్యలో యువకులు మోటారు బైకులపై ర్యాలీగా వచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. మేళ తాళాలు, బాణసంచా కాల్పులతో హోరెత్తించారు. పిల్లాపాపలతో సహా జనమంతా రోడ్లపైకి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. తనను చూసేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కంబాల చెరువు సెంటర్లో జక్కంపూడి విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత జగన్ జక్కంపూడి విజయలక్ష్మి నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన జక్కంపూడి తనయ సింధుసహస్ర-భుజంగరాయుడు దంపతులను ఆశీర్వదించారు. తర్వాత అక్కడ్నుంచి కాకినాడ చేరుకొని పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. జగన్ వెంట పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, గొల్ల బాబూరావు, పార్టీ సీజీసీ సభ్యులు గంపల వెంకట రమణ, జ్యోతుల నెహ్రూ, పార్టీ నేతలు ఇందుకూరి రామకృష్ణంరాజు, కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాతపాటి సర్రాజు, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరిజాల వెంకట స్వామినాయుడు తదితరులు ఉన్నారు. -
మళ్లీ తెరపైకి రాయల తెలంగానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర మహోద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రెండున్నరేళ్ల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. బయట సమైక్యాంధ్ర గానం చేస్తూ.. లోపల వేర్పాటువాదాన్ని బలంగా చాటిచెబుతోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేను ఉద్యమాన్ని తప్పుదోవపట్టించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దించారు. ఆది నుంచి జేసీ కుటుంబంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ వస్తోన్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే.. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి జేసీతో కలిసి ముందుకు సాగుతున్నారు. ‘రాయల తెలంగాణ’కు అనుకూలంగా జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో బహిరంగంగా సంతకాల సేకరణ చేస్తోంటే.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రహస్యంగా సంతకాలను సేకరిస్తూ మద్దతు కూడగడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జూలై 30న కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన నిమిషాల్లోనే ‘అనంత’ నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకుంది. ఇది సీమాంధ్రకు దావానంలా వ్యాపించి.. మహోగ్ర రూపం సంతరించుకుంది. 99 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతోన్న ఉద్యమమే అందుకు తార్కాణం. ఓట్లు, సీట్లే లక్ష్యంగా కుమ్మక్కై రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు.. ఉద్యమాల పురిటిగడ్డ ‘అనంత’ వేదికగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆది నుంచి పావులు కదుపుతూ వచ్చాయి. రాయలసీమను నిట్టనిలువున చీల్చి.. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చాలని కుట్రపన్నాయి. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతను రైల్వేశాఖ సహాయ మంత్రి, కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అప్పగించారు. ఆ మేరకు ఆగస్టు 5న కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామిలతో కలిసి సోనియాను కోట్ల కలిశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను సీమ నుంచి చీల్చి తెలంగాణలో కలిపి.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి తనను కలిసే బాధ్యతను సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అప్పట్లోనే సోనియా అప్పగించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో ‘రాయల తెలంగానం’ చేయించే బాధ్యతను తాను సమైక్యవాదిగానే ప్రకటించుకునే ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేకు చంద్రబాబు అప్పగించారు. కానీ.. కోట్ల ప్రతిపాదనపై సీమలో, ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. సమైక్యాంధ్ర ఉద్యమ ఉద్ధృతి కాస్త తగ్గిందని కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చింది. సోనియా కనుసైగల మేరకు జేసీ దివాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డిలతో రాయల తెలంగాణకు మద్దతుగా సంతకాలు సేకరించి.. అధిష్టానానికి పంపారు. మిగతా ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరహాలోనే ప్రతినిధి బృందంతో కలిసి సోనియాతో సమావేశమయ్యేందుకు జేసీ దివాకర్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల టీడీపీ ప్రజాప్రతినిధులతో రాయల తెలంగాణకు అనుకూలంగా రహస్యంగా సంతకాలు సేకరిస్తోన్న ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే.. వాటిని జీవోఎంకు పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ కుట్ర గుట్టు బహిర్గతం కాకుండా చూసేందుకు సమైక్యాంధ్రగానం వడిని మరింత పెంచి విన్పిస్తున్నారు. ముందే రచించిన ప్రణాళిక మేరకు ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో తనపై విమర్శలు చేయించుకుంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సమైక్యవాదుల కన్నుగప్పేయత్నం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శిస్తున్నారు. అధిష్టానాల ఆదేశాల మేరకు రాయల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కోట్ల, జేసీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నేతృత్వంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు జీవోఎంను కలిసి తమ వాదనను విన్పించడానికి సిద్ధమయ్యారని ఇరు పక్షాల నేతలూ అంగీకరిస్తుండటం గమనార్హం. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచే కాంగ్రెస్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేల వైఖరిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. -
'సమైక్య శంఖారావం' వల్లే మళ్లీ అఖిలపక్ష భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని మాజీ ఐఏఎస్ అధికారి, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం ఆయన ఏలూరులో విలేకర్లతో మాట్లాడుతూ... అందువల్లే కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు కోర్టు అనుమతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి... వైఎస్ విజయమ్మ పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకున్నారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. గత నెల 26న సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ఆ సభకు హజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. -
జగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం : జస్టిస్ లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి కట్టుబడే వారినే ప్రధానమంత్రిని చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం సభలో ఇచ్చిన పిలుపును తాము స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షించే తెలుగువారంతా పార్టీలకతీతంగా దీన్ని ఆహ్వానించాలని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని వేదిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి పీఠం ఆశించే రాజకీయ పార్టీలు సమైక్యాన్ని కాంక్షించే తెలుగు ప్రజలు అందిస్తున్న సువర్ణావకాశంగా భావించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు తోడ్పాటు అందించాల్సిందిగా వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు లక్ష్మణరెడ్డి వెల్లడించారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా సమైక్యతా మానవహారాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నట్టు వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం పనిచేస్తున్న అన్ని జేఏసీలను ఒక వేదికపైకి తెచ్చి సమైక్య జేఏసీగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. తాను సమైక్యవాదినంటూ పదేపదే చెప్పే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇక మాటలు చాలించి వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దాన్ని కేంద్రం ముందుంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బిల్లు రాకముందే ఇది జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే అవకాశం లేదంటూ చెబుతున్న కేంద్ర మంత్రులను ప్రజలు శాంతియుతంగా నిలదీయాలని పిలుపునిచ్చారు. నాయకులు నిస్సహాయులైతే వచ్చే ఎన్నికల్లో గెలవలేరనే సంకేతాలివ్వాలని సూచించారు. -
బస్సుపై తెలంగాణవాదుల దాడి
యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభకు వెళ్లిన కనకాయలంక, అబ్బిరాజుపాలెం గ్రామాల వైఎస్సార్ సీపీ శ్రేణులపై తెలంగాణవాదులు దాడి చేశారు. రెండు గ్రామాల నుంచి సుమారు 35 మంది బస్సులో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయూణంలో శనివారం రాత్రి ఖాజీపేట వద్ద దారికాసిన తెలంగాణవాదులు బస్సుపై రాళ్ల వర్షం కురిపించారని ప్రత్యక్ష సాక్షి, కనకాయలంక గ్రామ వైసీపీ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వర్షం కురుస్తుండటంతో బస్సు నెమ్మదిగా వెళుతుండగా సుమారు 20 మంది యువకులు బస్సుపై రాళ్లు రువ్వినట్లు చెప్పారు. బస్సు అద్దాలు పగలడంతో పాటు క్లీనర్ మోకాలికి బలమైన గాయమైందని తెలిపారు. -
రాష్ట్రం విడిపోదనే నమ్మకం కలుగుతోంది!
* ‘సమైక్య శంఖారావం’లో ప్రజల స్పందనపై కొణతాల వ్యాఖ్య * సమైక్య స్ఫూర్తిని చాటిన లక్షలాది మంది ప్రజలకు ధన్యవాదాలు * ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు విభజనపై పునరాలోచించాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి వాటాలు, ఒడంబడికలు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు సమైక్య శంఖారావం సభకు హాజరై చూపిన సమైక్య స్ఫూర్తి రాష్ట్రం విడిపోదనే నమ్మకాన్ని తమలో కలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సభను చూసైనా ఢిల్లీ పెద్దలు విభజన నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను, వరదలు అతలాకుతలం చేస్తున్నా లెక్క చేయకుండా సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి వచ్చిన లక్షలాది మంది ప్రజలకు పార్టీ తరపున, అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే రాష్ట్రంగా ఉండాలనే స్ఫూర్తితో సమైక్య శంఖారావానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రకృతి సహకరించకపోయినా ఈ స్థాయిలో జరిగిన సభను తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ చూడలేదని, ఈ సభకు వచ్చిన ప్రజలకు పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి ైవె ఎస్ రాజశేఖరరెడ్డికి, ఎల్బీ స్టేడియం సభలకూ మధ్య అవినాభావ సంబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఇదే స్టేడియంలో వేదికపై నుంచి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని, రైతులకు రుణమాఫీ ప్రకటన కూడా ఇక్కడే చేశారన్నారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ నిర్వహించిన సభ తరువాత రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే విశ్వాసం ప్రజలకు కలుగుతోందన్నారు. సమైక్య సభకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని వారు కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందుకే సమైక్య శంఖారావానికి ప్రత్యేక రైళ్లను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విమర్శలకు కొణతాల స్పందిస్తూ.. పాట్నాలో నరేంద్రమోడీ తలపెట్టిన సభకు 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారని అది కూడా మ్యాచ్ ఫిక్సింగేనంటారా? అని ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాలి తుపాను, ఇటీవలి వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల కోసం తక్షణమే సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని కొణతాల డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో రోడ్లు దెబ్బతినడమే కాక, రిజర్వాయర్లు నిండి లక్షలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగిందన్నారు. 30 మంది వర్షాల బారిన పడి మరణించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
'సమైక్యనినాద బలం ఢిల్లీకి చూపిన శంఖారావం'
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభ సమైక్యవాద నినాద బలాన్ని ఢిల్లీకి చూపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా సమైక్య శంఖారావానికి వచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుజాతి ఐక్యతకు వైఎస్ జగన్ చేస్తోన్న పోరాటానికి లక్షలాదిగా తరలివచ్చి మద్దతు తెలిపారన్నారు. ఆఖరి నిమిషం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పోరాటం ఆగదని చెప్పారు. గాంధేయ మార్గంలో రాష్ట్ర సమైక్యతకు పోరాడతామన్నారు. సమైక్య నినాదం ఎంత బలంగా ఉందో శంఖారావం సభతో ఢిల్లీకి తెలిసిందని చెప్పారు. విభజనపై ఇకనైనా ఢిల్లీ పెద్దలు పునరాలోచించుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే కొందరు తెలంగాణ నేతలు హాజరుకాలేదని చెప్పారు. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కొణతాల డిమాండ్ చేశారు. వర్షాలతో చాలా జిల్లాలు నష్టపోయాయి. లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. కోస్తాలో ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రైతులు, ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పునరావాస ఏర్పాట్లతో పాటు పంట నష్టపరిహారంపై ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. -
'సమైక్యనినాద బలం ఢిల్లీకి చూపిన శంఖారావం'
-
సమైక్య శంఖారావం
-
జన శంఖారావం
-
ఉద్యమ శంఖం
-
జన తుపాన్
వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. జగన్నినాదం, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. -
అందరికీ ధన్యవాదాలు : తెల్లం బాలరాజు
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యదీక్షకు ప్రకృతి కూడా సహకరించిందని, ఆయన పూరించిన సమైక్య శంఖారావం సభ ఊహించిన దానికంటే విజయవంతమైందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శంఖారావం సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, చెరువులకు గండ్లుపడి రోడ్లు జలమయమై ప్రతి కూల పరిస్థితులు ఉన్నా మొక్కవోని ధైర్యంతో సమైక్య శంఖారావం సభకు ప్రజలు తరలి వచ్చారని పేర్కొన్నారు. సీమాంధ్రలోని ప్రజలంతా ముక్తకంఠంతో సమైక్యాంధ్రకు జై కొట్టటమే కాకుండా, జగన్ నాయకత్వంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ సభతో నిజం చేశారని తెలిపారు. వరదలతో ఇళ్లు కూలిపోయే పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే దృఢచిత్తంతో మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున సభకు తరలివచ్చారన్నారు. హైదరాబాద్‌లో లక్షలాదిమంది ప్రజలతో మార్మోగిన సమైక్య శంఖారావంతో కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం దిగివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు -
ఉద్యమానికి ఉత్తేజం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం సభ నిర్వహించిన తీరు, ప్రతికూల పరిస్థితుల్లోనూ లక్షలాది మంది హాజరు కావడం అందరినీ అశ్చర్యపరిచింది. ఎడతెరిపిలేకుండా వర్షాలు కరుస్తుండటంతో అసలు సభ జరుగుతుందో లేదోననే అనుమానాలు అంతటా వ్యక్తమయ్యాయి. రవాణా సదుపాయాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌తోపాటు అభిమానులు, సమైక్యవాదులు ఆందోళన చెందారు. శంఖారావం సభకు వెళ్లాలనే సంకల్పం ఆ అనుమానాలు, భయాలను పటాపంచలు చేసింది. అడ్డంకులను అధిగమించి.. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలకు ఇబ్బంది తలెత్తినా.. ప్రత్యామ్నాయ మార్గంలో చాలామంది హైదరాబాద్ చేరుకున్నారు. మార్గమధ్యంలో సమైక్యవాదులు ప్రయూణించిన బస్సులు, కార్లను నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వర్థన్నపేట వద్ద దెందులూరు, ఉంగుటూరు నుంచి వెళ్లిన 30కిపైగా బస్సులను ఆపి వెనక్కు వెళ్లిపోవాలని బెదిరించినా లెక్కచేయలేదు. వైసీపీ శ్రేణులు, సమైక్యవాదులు వారితో గొడవపడి.. పోలీసుల సాయంతో హైదరాబాద్ చేరుకున్నారు. తణుకు, ఆచంట నుంచి వెళ్లిన బస్సులపైనా తెలంగాణవాదులు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా వేలాదిమంది పట్టువిడవకుండా సభకు హాజరై తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ఉత్సాహం నింపిన వైఎస్ జగన్ ప్రసంగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించిన తీరు పార్టీ క్యాడర్‌తోపాటు సమైక్యవాదులను ఆకట్టుకుంది. ‘ఢిల్లీ కోటను బద్దలు కొడదాం’, ‘ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది’ వంటి పదునైన మాటలతో.. రావి నారాయణరెడ్డి భావజాలాన్ని ఉటంకిస్తూ వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోజింపజేసింది. విభజన వల్ల ఏర్పడే దుష్పరిణామాలను స్పష్టం చేయడంతోపాటు కవితాత్మక ధోరణిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం గతం కంటే భిన్నంగా సాగి అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అన్ని రంగాలవారు సభా విశేషాలను, జగన్ ప్రసంగాన్ని టీవీల్లో ఆసక్తిగా తిలకించారు. మహిళలు సైతం టీవీలకు అతుక్కుపోయి సమైక్య శంఖారావ సభను వీక్షించారు. కొత్త కోణం తెలంగాణకు చెందిన వారు సైతం ఈ సభలో పాల్గొనడం సమైక్య ఉద్యమంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సభ విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే ఉద్యమంలో కీల కపాత్ర పోషిస్తున్న శ్రేణులు సభ సక్సెస్ తర్వాత దానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉద్యమ బాధ్యతను మరింతగా భుజాన కెత్తుకునేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. -
సడలని సంకల్పం
సాక్షి, కడప : ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నా వైఎస్ఆర్సీపీ శ్రేణుల సంకల్పం సడలలేదు. జోరు వానను సైతం లెక్క చేయకుండా అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపడుతూనే ఉన్నారు. సమైక్య ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. సమైక్య శంఖారావం సభకు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివెళ్లినా దీక్షలను మాత్రం ఆపలేదు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలో కృష్ణ శారద విద్యార్థులు 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో అంబేద్కర్ నగర్ వైఎస్సార్సీపీ నాయకురాలు శారదమ్మ నేతృత్వంలో ఆరు మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జమ్మలమడుగులో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విజయకుమారి ఆధ్వర్యంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. రాయచోటిలో వీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు 15మంది దీక్షలు చేపట్టారు. కమలాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మెడికల్ స్టోర్ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో డ్వాక్రా మహిళలు 30మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, కడప, రాయచోటిలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. -
'సమైక్య శంఖారావం' సభలో ఎవరేమన్నారు...
బాబును జాతి క్షమించదు: మేకపాటి ‘‘రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు దాన్ని వెనక్కు తీసుకోకుంటే తెలుగు జాతి ఆయనను క్షమించదు. ఈ అపవాదు ఆయన జన్మకే గాక ఆయన బిడ్డలకూ ఉంటుంది. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం లేకుండా ఈ రాష్ట్రం ఎలా నడుస్తుందని బాబు అనుకుంటున్నారు? తెలంగాణలో పుట్టిన వారిగా కొందరు రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడంలో ఒక అర్థముంది. కానీ బాబూ! చిత్తూరు జిల్లాలో పుట్టిన వాడివి, నువ్వెలా (అందుకు) సిద్ధపడ్డావ్? ఏం జన్మ నీది? మనిషి రూపంలో ఉన్న వికృత రూపుడివి నువ్వు. రాజశేఖరరెడ్డి చనిపోయాక రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియా ప్రయత్నించడం దారుణం. కేసీఆర్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి వారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే తెలుగు ప్రజలందరి ఆమోదంతో ఆ పదవి తీసుకోవాలి. ఆరు నెలల కాలంలోనే జగన్మోహన్రెడ్డి వంటి సరైన నాయకత్వం రాష్ట్రాన్ని పాలించనుంది. అందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ ప్రజలను మోసగిస్తున్న కిరణ్: కొణతాల ‘‘అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ఇప్పటికీ ముఖ్యమంత్రి తప్పుడు మాటలు చెబుతున్నారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓటింగ్ జరగదని స్పీకర్‌గా చేసిన ఆయనకు తెలియదా? తెలిసీ ప్రజలను మోసగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీఎం పదవినైనా వదలిపెడతానంటున్న కిరణ్, రాష్ట్ర విభజన పూర్తయ్యాక ఆ పని చేస్తారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జెండాలతో గానీ, వాటి పక్కన పెట్టయినా ఎలా వీలైతే అలా కలిసి రావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలకు జగన్ సూచించారు. ఇప్పటికైనా వారు తమ జెండాలతో గానీ, వాటిని పక్కన పెట్టయినా కలిసి రావాలి.’’ మంత్రి పదవిని వదులుకున్నా: విశ్వరూప్ ‘‘విభజన వల్ల తలెత్తే సమస్యలేమిటో తెలుసు కాబట్టే రాష్ట్ర సమైక్యత కోసం నినదించి మంత్రి పదవికి రాజీనామా చేశా. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు సమ్మె చేసినా కేంద్రం స్పందించలేదు. వారు సమ్మె విరమించాక ఉద్యమంలో విరామం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ చాలా స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చింది. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడగలిగేది వైఎస్సార్ కాంగెస్ పార్టీ ఒక్కటే. అందుకే నేనందులో చేరాను. ’’ ఢిల్లీ పీఠానికి జగన్ తుపాన్: జూపూడి ‘‘స్వార్థపూరితంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన ఢిల్లీ పీఠాన్ని ఇప్పుడు జగన్ అనే తుపాను తాకింది. ఆ తుపానులో కొట్టుకుపోయేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ఎవర్నడిగి, ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? వైఎస్ మరణానంతరం ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కలిసి తీసుకున్న నిర్ణయమిది. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజిస్తారా?’’ మొరిగే కుక్కలకు జవాబివ్వగలం: కొడాలి ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆజ్యం పోసిన దుర్మార్గుడు చంద్రబాబే. రాజశేఖరరెడ్డి మరణించాక తన దగ్గర ఉన్న పెంపుడు కుక్కలతో రోజూ వైఎస్సార్, జగన్‌పై మొరిగిపిస్తున్నారు. బాబుకు తగిన జవాబు చెబుతామంటుంటే, ‘ఆయన పెద్దాయన , ఎందుకులె’మ్మంటూ మా అధినేత సర్దిచెబుతున్నారు. అధినేత మాకు అవకాశమిస్తే, బాబు మొరిగిపిస్తున్న వారందరికీ జవాబు చెప్పగలిగే సత్తా ఉంది.’’ సమైక్యం చివరిదాకా పోరు: శోభానాగిరెడ్డి ‘‘పాలకులు అసమర్థులైతే ప్రజలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఈ నాలుగేళ్ల పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. వైఎస్సార్ ఉండుంటే ఈ కష్టాలు వచ్చేవి కాదని అందరూ భావిస్తున్నారు. మళ్లీ అలాంటి నాయకత్వం జగన్‌తోనే సాధ్యం. బాబుకు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోనియాతో చేతులు కలిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి చేసిన ఉద్యమాలు కిరణ్, బాబులను కదిలించలేకపోయాయి’’ హైదరాబాద్ అందరిదీ: రెహ్మాన్ ‘‘హైదరాబాద్ ఎవరబ్బ సొత్తూ కాదు, ఇది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలందరిదీ. ఇక్కడ నివసించేవారు ఏ భయాందోళనలూ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు దిశా దశ లేవు. రాష్ర్టంలో దీక్ష చేస్తే రాళ్లతో కొడతారని భయపడి ఢిల్లీలో చేశారు. మా పార్టీ అధినేత జగన్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తామంటే అనుమతివ్వలేదు గానీ బాబుకు ఢిల్లీ ఏపీభవన్‌లో అనుమతిచ్చారు.’’ సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి: నల్లా ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు కూడా బాగా లబ్ధి పొందారు. మళ్లీ అలాంటి పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు’’ వాదనల మధ్య ఘర్షణ: గట్టు ‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ కాదు, రెండు వాదన మధ్య ఘర్షణ. తీర్పేమిటో ప్రజలే చెబుతారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తేనే ఉద్యమంలో పాల్గొంటామని అప్పట్లో ఇక్కడి నేతలు గాంధీకే తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికే జగన్ ముఖ్యమంత్రి కావాలని మే కోరుకుంటున్నాం’’ తీర్మానంతో బాబు ముందుకు రావాలి: దాడి ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయడానికి చంద్రబాబు ముందుకు రావాలి. పీసీసీ కూడా అలాంటి తీర్మానం చేయాలి. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్ముతారు. విభజనకు ఉత్సాహం చూపుతున్న సోనియా, బాబులను బహిష్కరించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ విభజిస్తే దిశ దశ ఉండవు ‘‘రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దిశ దశ ఉండవు. హైదరాబాద్ నగరం మనదని భావించే కోస్తాలో ఎకరాలు అమ్ముకుని ఇక్కడ గజాల స్థలం కొని అభివృద్ధి చేశాం. ఐటీ, ఫార్మా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాక, ఇప్పుడు వెళ్లిపోమడం ఎంతవరకు సమంజసం?’’ -గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అభినందనీయం ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీకి, జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. కొందరు నేతలు రహస్య ఎజెండాతో విభజనతో మన భవిష్యత్తును అంధకారం చేయజూస్తున్నారు. ’’ -ఏవీ పటేల్, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ నేత విద్యార్థుల భవిష్యత్తేమిటి? ‘‘రాష్ర్టం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. చదువుల తర్వాత తమ భవిష్యత్తేమిటనే బెంగ వారిలో ఉంది. వెఎస్సార్ సీపీ నిర్ణయాన్ని సీమాంధ్రలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులమూ స్వాగతిస్తున్నాం. ’’ -అడారి కిషోర్‌కుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత -
తరలిన తెలంగాణ జనం!
న్యూస్‌లైన్ నెట్వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం సభకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు. వరంగల్‌లో కుండపోత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సభకు బయల్దేరి వచ్చారు. వరంగల్ నగరం, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, జనగామ తదితర ప్రాంతాల నుంచి సభకు తరలారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి వందలాది వాహనాల్లో ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. తుక్కుగూడ శ్రీశైలం ప్రధాన రహదారిపై జెండా ఊపి వాహనాల ర్యాలీని వైఎస్సార్ సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ మండలాల నుంచి వందలాది మంది వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి సమైక్య శంఖారావానికి రైళ్లలో, బస్సుల్లో శుక్రవారం నుంచే కొందరు బయలుదేరి వచ్చారు. శనివారం ఉదయం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, చెన్నూర్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ నేతలు సమైక్య శంఖారావం సభలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ, సీఈసీ సభ్యులు వంగూరు బాలమణెమ్మ, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి తదితరుల నాయకత్వంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అన్ని అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు వచ్చారు. షాద్‌నగర్, జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, సీసీకుంట, ఆలంపూర్, గద్వాల ,క ల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణుల తో పాటు వైఎస్ కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో బయలుదేరి వచ్చారు. జిల్లా కేంద్రం నుంచి యువజన విభాగం జిల్లా క న్వీనర్ రవిప్రకాశ్, మైనార్టీ నేతలు వచ్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, అందోలు, మెదక్ తదితర నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు, ప్రజలు వాహనాల్లో తరలారు. మెదక్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు వచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువత అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు సభలో పాల్గొన్నారు. పటాన్చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు కదిలి వచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాణిక్‌రావు నేతృత్వంలో 25 వాహనాల్లో ప్రజలు వచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం
కేతేపల్లి, న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమైక్య శంఖారావం సభ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎస్ఐ ఎల్. రాములు నాయక్‌కు నకిరేకల్ సర్కిల్ పరిధిలోని కేతేపల్లి మండలంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బందోబస్తు విధులు వేశారు. ఇనుపాముల శివారులోగల వై-జంక్షన్ వద్ద ఆయన విధి నిర్వహణలో ఉండగా, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నాయక్‌ను వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్ : సమైక్య శంఖారావం సభ నిర్వహణ నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎస్ఐ రాములు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసి సంతాపం ప్రకటించారు. రాములు కుటుంబానికి జగన్ ఒక సందేశంలో తన సానుభూతిని తెలియజేశారు. -
‘శంఖారావం’ బస్సులపై దాడి
సాక్షి నెట్వర్క్: సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి శంఖారావం సభకు వెళ్లే బస్సులను ఖమ్మం, వరంగల్ మీదుగా దారి మళ్లించారు. దాంతో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర్లోని కడిపికొండ వద్ద హైదరాబాద్ వెళ్తున్న బస్సులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కొన్ని బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడగా, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యూయి. అనంతరం పోలీసులు బస్సులను ఎస్కార్ట్ సహాయంతో హైదరాబాద్ పంపించారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట - స్టేషన్ ఘన్‌పూర్‌ల మధ్య తెలంగాణవాదు లు సమైక్య సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు బస్సులను కదలనివ్వలేదు. అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో బస్సులను వెనక్కు మళ్లించి తిరిగి వరంగల్ మీదుగా హైదరాబాద్ పంపించారు. జనగామ- సూర్యాపేట రోడ్డులో దేవరుప్పల, సింగరాజుపల్లి వద్ద కూడా ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. దేవరుప్పల వద్ద పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పోలీసులను వారించారు. ఆ తరువాత పోలీసులు పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేసి సీమాంధ్ర వాహనాలను సురక్షితంగా హైదరాబాద్‌కు పంపించారు. విద్యార్థుల ఆందోళన సమైక్య శంఖారావం సభకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు, నిజాం హాస్టల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మరికొందరు విద్యార్థులు హాస్టల్ పైనుంచి స్టేడియంలోకి రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఎల్బీ స్టేడియంలోకి దూసుకెళ్లిన పలువురు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆఫీసుల్లోనూ ‘సభ’ చర్చలే!
టీవీలకు అతుక్కుపోయిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో పాటు జంటనగరాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉన్నతాధికారులందరు శనివారం సమైక్య శంఖారావం సభపైనే దృష్టి పెట్టారు. ఉదయం కార్యాలయాలకు వచ్చినప్పటి నుంచి సభ ఎలా జరుగుతుంది, వర్షం ఇబ్బంది పెడుతుందా? అనే విషయాలనే చర్చించుకున్నారు. సచివాలయంలో ఉద్యోగుల నుంచి ఐఏఎస్‌ల వరకు అంతా మధ్యాహ్నం నుంచి సాయంత్రం జగన్మోహన్రెడ్డి ప్రసంగం ముగిసేదాకా టీవీల ముందే కనిపించారు. సభకు భారీగా వచ్చిన జనం, వారి స్పందన చూసిన కొంత మంది ఉద్యోగులు మళ్లీ ఇదే స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని జగన్ ప్రశ్నించిన తీరును ఉన్నతాధికారులు, ఉద్యోగులు మెచ్చుకున్నారు. అలాగే రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను సోదాహరణంగా చెప్పడంతో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఎందుకు ఉంచాలో కూడా జగన్ స్పష్టంగా వివరించారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు, వరదలను కూడా లెక్కచేయకుండా భారీ సంఖ్యలో జనం తరలిరావడం సాధారణమైన విషయం కాదని, వారిలోని బలమైన సమైక్య ఆకాంక్షకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నాం 1.30 గంటల ప్రాంతంలో వర్షం జల్లులు రావడంతో కొంత మంది ఉద్యోగులు వర్షం ఆగిపోవాలని కోరుకున్నారు. పటిష్ట బందోబస్తు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నగర పోలీసులు మాత్రం తమ విధుల్ని పక్కాగా నిర్వర్తించారు. ఫలితంగా ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభ పూర్తి ప్రశాంతంగా ముగిసింది. సభకు పోలీసులు కనీవినీ ఎరుగని బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి నుంచే ఆ విధుల్లో నిమగ్నమయ్యారు. సభకు వచ్చిన సమైక్యవాదులు కూడా పూర్తి సంయమనం, క్రమశిక్షణలతో నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నారు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సభా వేదికైన ఎల్బీ స్టేడియం ఉన్న మధ్యమండలంతో పాటు రాజధాని మొత్తాన్ని డేగ కళ్లతో పహారా కాశారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 5,000కు పైగా సిబ్బంది తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనా జరగకుండా పర్యవేక్షించారు. స్టేడియం పరిసరాల్లోనే 3,000 మంది దాకా విధుల్లో ఉన్నారు. స్టేడియాన్ని లోనికి దారి తీసే కీలక మార్గాలతో సహా కేంద్ర బలగాల అధీనంలో ఉంచారు. నగరంలోని ఒక్కో జోన్‌కు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరించారు. -
నగరం.. జన సంద్రం
శంఖారావానికి పోటెత్తిన సమైక్యవాదులు.. ఎటు చూసినా జన ప్రవాహమే సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావానికి ప్రజలు పోటెత్తారు. సభ జరిగిన ఎల్బీ స్టేడియంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. చుట్టూ దాదాపు నాలుగైదు కిలోమీటర్ల మేర దాకా పరిసరాలన్నీ వైఎస్సార్సీపీ అభిమానులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులతో నిండిపోయాయి. హైదరాబాద్ నగరం మొత్తం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే మొదలైన సమైక్య సందడి శనివారం సాయంత్రం 5 గంటలకే సభ ముగిసినా రాత్రి దాకా కొనసాగింది. శనివారం ఉదయం 9 గంటల నుంచే నగరమంతటా ప్రారంభమైన రద్దీ, చూస్తుండగానే తారస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అభిమానుల్ని నగరానికి తీసుకుని వచ్చే వాహనాల రాక శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. వారంతా నగరంతో పాటు శివార్లలో ఉన్న అనేక ఫంక్షన్ హాళ్లల్లో బస చేసి, ఉదయాన్నే విడతల వారీగా ఎల్బీ స్టేడియం వైపు బయల్దేరారు. విజయవాడ వైపున్న వనస్థలిపురం, దక్షిణ మండలంలో ఉన్న జూపార్కులతో పాటు కూకట్పల్లి తదితర మార్గాల్లో ఎక్కడ చూసినా సమైక్య సభకు వచ్చిన వాహనాలే కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కన్పించాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన వాహనాలు పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే, మెహదీపట్నం మీదుగా నెక్లెస్ రోడ్‌కు చేరుకున్నాయి. అక్కడ నుంచి అభిమానులంతా కాలినడకన స్టేడియానికి చేరుకున్నారు. దాంతో ఆ మార్గమంతా వారితోనే పూర్తిగా నిండిపోయింది. అటు పబ్లిక్ గార్డెన్స్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ తదితర చోట్ల కూడా ఉదయం 8 నుంచే సందడి మొదలైంది. 9 తరవాత స్టేడియంలోకి అనుమతి...: ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచే సందడి నెలకొన్నా పోలీసులు 9 గంటల తరవాత ప్రజలను కొద్దికొద్దిగా స్టేడియంలోకి అనుమతించారు. అది 10 గంటలకల్లా ఊపందుకుంది. చూస్తుండగానే స్టేడియమంతా జనంతో నిండి కిక్కిరిసిపోయింది. ఆయకార్ భవన్ వైపున్న ‘జీ’ ఔటర్ గేట్, ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ వైపున్న ‘ఎ’ గేటు ద్వారా పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియం ప్రాగణంలోకి ప్రవేశించారు. నిజాం కళాశాల ఎదురుగా ఉన్న ఎఫ్, ఎఫ్-1 ఔటర్ గేట్లలో ఒకటి వీఐపీలకు, మరోటి సాధారణ ప్రజలకు కేటాయించాలని తొలుత పోలీసులు భావించారు. కానీ జనసంద్రాన్ని చూసి రెండింటి నుంచీ అభిమానులనే పంపారు. వీఐపీలను కూడా వారితో పాటే స్టేడియంలోకి అనుమతించారు. ప్రాంగణంలోని ఇన్నర్ గేట్ 6ను మాత్రం వీఐపీలకే ప్రత్యేకంగా కేటాయించారు. మధ్యాహ్నం ఒంటి గంటకే స్టేడియం కిక్కిరిసిపోవడంతో లోపలకు వెళ్లే అవకాశం లేక భారీ సంఖ్యలో అభిమానులు, కార్తకర్తలు గేట్ల వద్దే నిలిచిపోయారు. లోనికెళ్లే అవకాశం లేదని గ్రహించి, చుట్టుపక్కల రోడ్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. లోపల వేదికపై సాంసృ ్కతిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో వర్షం కురిసింది. అయినా ఎల్ఈడీల వద్ద గుమిగూడిన అభిమానులు ఒక్కరు కూడా కదల్లేదు. మొక్కవోని అభిమానంతో అక్కడే ఉండి తమ ప్రియతమ నేత జగన్ రాక కోసం ఎదురుచూశారు. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఉన్న ‘సి’ గేట్‌ను జగన్, ఆయన కుటుంబీకుల కోసం కేటాయించినట్టు పేర్కొంటూ అక్కడ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో అటు నుంచి స్టేడియంలోకి వెళ్లే జగన్‌ను చూడాలనే కోరికతో ఆ ప్రాంతంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా బారులుతీరారు. శంఖారావం ప్రారంభమయ్యే సమయానికే ముందుగానే స్టేడియం జనంతో పోటెత్తిపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కొన్ని గేట్లను మూసేశారు. అప్పటిదాకా నాలుగు ఔటర్ గేట్ల నుంచి అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులను అనుమతించిన పోలీసులు.. ఆ తర్వాత జీ, ఏ గేటు మాత్రమే తెరిచి ఉంచారు. ఎఫ్, ఎఫ్-1 గేట్లను మూసేశారు. దాంతో ఆయా గేట్ల వద్దకు వచ్చిన వారంతా ఎల్ఈడీ తెరల వద్దకు చేరారు. మధ్యాహ్నం మూడింటి నుంచి జీ, ఏ గేట్ల నుంచి కూడా రాకపోకలను నియంత్రించారు. ప్రతి దారీ జన ప్రభంజనమే...: కేవలం ఎల్బీ స్టేడియం, చుట్టు పక్కల ఉన్న రహదారులు మాత్రమే కాకుండా అటుకేసి దారి తీసే అన్ని మార్గాలూ కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయాయి. నాంపల్లి, పోలీసు కంట్రోల్ రూమ్‌లతో పాటు ఏఆర్ పెట్రోల్ పంప్ చౌరస్తా, బీజేఆర్ స్టాట్యూ జంక్షన్, చర్మాస్ రోడ్, గన్‌ఫౌండ్రీ ఎస్బీహెచ్ రహదారి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మార్గం, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బొగ్గులకుంట, తాజ్‌మహల్ హోటల్, ఈడెన్‌గార్డెన్స్, కింగ్ కోఠి తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ స్టేడియం వైపు కాలినడకన వస్తున్న వారితో నిండిపోయాయి. బీజేఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం, స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి లక్డీకాపూల్ వరకు ఎటు చూసినా నేల ఈనినట్టుగా జనమే! వారి వాహనాలకు కేటాయించి పార్కింగ్ స్థలాలు చాలకపోవడంతో చాలాచోట్ల వాటిని రోడ్ల పక్కనే ఆపుకోవాల్సి వచ్చింది. -
ఢిల్లీని శాసిద్దాం: వై.ఎస్.జగన్ పిలుపు
అమ్మా సోనియాగాంధీ.. 1968లో మీకు రాజీవ్‌గాంధీతో పెళ్లయ్యింది. ఆ తర్వాత 15 ఏళ్లకు అంటే 1983లో మీరు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ 30 ఏళ్లలో భారత పౌరసత్వం తీసుకుని మాలో ఒకరిగా అయ్యారు. ఇవ్వాళ పార్లమెంటులో బిల్లు తెచ్చి.. భారత పౌరసత్వం తీసుకున్న వారంతా వెనక్కి వెళ్లాలంటే మీకు నచ్చుతుందా అమ్మా..? 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం. మాకెంత బాధ ఉంటుంది? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తుదివరకూ అలుపెరుగని పోరాటం కొనసాగిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అశేష జనవాహినికి పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు. రాష్ట్రాన్ని నిరంకుశంగా విభజించేందుకు ముందుకు వెళుతున్న ఢిల్లీ కోటను బద్దలు కొడదామని పిలుపునిచ్చారు. ‘‘ఈ రాష్ట్రం ముక్కలు కాకుండా పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకూ పోరాటం చేస్తూనే ఉందాం. రేపు జరగబోయే ఎన్నికల వరకూ పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 పార్లమెంటు స్థానాలను మనమే గెలిపించుకుందాం. ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం. ఎలా విభజిస్తారో చూద్దాం. ఇక్కడ 30 లోక్‌సభ స్థానాలు మనమే తెచ్చుకుని.. రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని స్థానంలో కూర్చోబెడదాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం...’’ అంటూ జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం పూరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో అశేష జనవాహినిని ఉద్దేశంచి ఆయన 45 నిమిషాల పాటు ప్రసంగించారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తల్లడిల్లుతున్న కోట్లాది మంది ప్రజల ఆవేదనను జగన్ ఎలుగెత్తిచాటారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును తూర్పారబట్టారు. తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటానికి కోట్ల మంది తల్లుల కొడుకులు, కూతుళ్ల భవిష్యత్తును కాలరాస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైఖరిని ఎండగట్టారు. విభజనకు వంత పాడుతూ ఓట్లు, సీట్లు పోతాయని.. ప్యాకేజీల పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, సోనియాకు మడుగులొత్తుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరూ 80 రోజులుగా ఉద్యమిస్తోంటే.. ఆ ముగ్గురిలో ఒక్కరూ ఆలోచించకపోవటం ఎంతో బాధకలిగిస్తోందన్నారు. అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు తప్ప మంచి నీరులేని దిగువ రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పదేళ్లలో విడిచిపెట్టిపోవాలంటే.. చదువు అయిపోయిన ప్రతిపిల్లాడు సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ ల కాలర్ పట్టుకుని.. తాము ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని అడిగితే ఏం సమాధానం చెబుతారని జగన్ నిలదీశారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం లేకపోతే దిగువ రాష్ట్రంలో జీతాలకు, పథకాలకు డబ్బులెక్కడి నుంచి వస్తాయన్నారు. ‘‘30 ఏళ్ల క్రితం భారతదేశ పౌరసత్వం తీసుకున్న సోనియాగాంధీకి ఈ దేశంపై ఇంత వ్యామోహం ఉంటే 60 ఏళ్లుగా కలిసి ఉన్న తెలుగు ప్రజలను విడదీస్తే మనకెంత బాధ ఉంటుంది..? ఈ దేశ పౌరసత్వం తీసుకున్నవాళ్లంతా మీ దేశాలకు వెళ్లిపోండని పార్లమెంటులో బిల్లు తెస్తే సోనియాగాంధీకి నచ్చుతుందా..?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విశాలాంధ్ర కోసం ఇరు ప్రాంతాల్లో ఎందరో మహనీయుల ఆకాంక్షలు, వారు జరిపిన పోరాటం, వారి త్యాగాల చరిత్రను సోనియాగాంధీ తెలుసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ కేంద్రం నిరంకుశ విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అన్యాయాన్ని దేశ రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటే.. రేపు మిగతా రాష్ట్రాలకూ ఇదే పరిస్థితి వస్తుందని జగన్ హెచ్చరించారు. ఓట్ల కోసం సీట్ల కోసం విభజించి పాలించే రాజకీయాలు తెరమరుగు కావాలన్నారు. జగన్ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే... కలిసుందామని వచ్చిన ప్రతి ఒక్కరికీ సలాం.. ‘‘సమైక్య శంఖారావాన్ని పూరించి కలిసి ఉందామని అప్యాయత చూపిస్తూ, కలిసి ఉందామని నినదిస్తూ.. వర్షాల వల్ల, వరద ల వల్ల అపార నష్టం జరిగినా.. హైదరాబాద్ వరకూ రావడానికి కష్టమనిపించినా.. అన్ని బాధలనూ పక్కనబెట్టి లక్షలాదిగా తరలివచ్చిన అశేష జనవాహినికి.. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించి ఇక్కడికి పంపించిన ఆ కోట్లాది తల్లులకు, అక్కచెల్లెళ్లకు, అవ్వాతాతలకు, చిన్నారులకు, సోదరులకు, స్నేహితులకు చేతులు జోడించి శిరసు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయతీ చూడడం కోసం ఆరాటపడుతున్న ప్రతి హృదయానికీ సలాం చేస్తున్నా. రాజకీయాలంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం కాదు.. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తట్టాలని, ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని.. అలా మనసు తట్టినప్పుడు, అలా గుండెచప్పుడు విన్నప్పుడు ఆ పేదవాడు ఆశీర్వదించినప్పుడే రాజకీయమని, అలా చేస్తేనే రాజకీయమని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నా. మనుషులమోయి.. ఆటవస్తువులం కాదు.. మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకంటే కాదు.. అన్యాయం చేస్తే ఊరికే చూస్తూ కూర్చోం.. వందేమాతర గీతం నినదిస్తాం.. విప్లవ జెండా అందుకుంటాం.. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి వెనకడుగు వేయమని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికీ సలాం చేస్తున్నా. ఇన్ని కోట్ల మంది ఉద్యమం వారికి పట్టదా? రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పిల్లాడు గత 80 రోజులుగా పుస్తకాన్ని పక్కనబెట్టి.. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తూ ఉద్యమబాట పట్టాడు. పనిచేస్తున్న ప్రతి ఒక్కరు 80 రోజులుగా తమకు రావాల్సిన జీతాలు వదులుకుని తినడానికి తిండి దొరికే పరిస్థితి లేకపోయినా ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమ బాటపట్టారు. విభజిస్తే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని 80 రోజులుగా రైతన్న నాగలి పక్కనపెట్టి ఉద్యమబాట పట్టాడు. అక్కాచెల్లెళ్లు తమ చంటిపిల్లలను చంకనవేసుకుని రోడ్డుపైకొచ్చి పిల్లలను చూపిస్తూ.. వీరి భవిష్యత్తు ఏంటని ఉద్యమబాట పట్టారు. మేం రాజీనామా చేశాం. నిరాహార దీక్ష చేశాం. లేఖల మీద లేఖలు రాసి విభజించవద్దని జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నించాం. కానీ.. ఇన్ని కోట్ల మంది ఉద్యమాలు చేస్తుంటే.. వీరంతా ఎందుకు ఉద్యమం చేస్తున్నారని కనీసం ఆలోచన చేయలేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం విభజించవద్దని సోనియాగాంధీ ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. తన కొడుకును ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీకి ఉద్యమాలను చూసి విభజన చేయవద్దని తట్టలేదా? ప్యాకేజీలని అడుగుతున్న చంద్రబాబుకు తట్టలేదా? మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి తట్టలేదా? నిజంగా ఈ వ్యవస్థ ఇంతలా దిగజారుతున్న పరిస్థితులు చూస్తుంటే బాధనిపిస్తోంది. వీళ్లందరూ మనుషులేనా అని బాధ కలుగుతోంది. ఇప్పుడు ట్రిబ్యునళ్లు, బోర్డులున్నా నీళ్లు వస్తున్నాయా? రాష్ట్ర విభజన కోసం ఉర్రూతలూగుతున్న సోనియాగాంధీని అడగదలుచుకున్నా.. ప్యాకేజీలంటూ మోసం చేస్తున్న చంద్రబాబును అడగదలుచుకున్నా.. పట్టపగలు మోసం చేస్తూ సోనియా గీతను దాటని కిరణ్‌కుమార్‌రెడ్డిని అడగదలుచుకున్నా.. సమైక్యంగా ఉన్నప్పుడే కృష్ణానది నీళ్ల పరిస్థితిని చూడండి. రాష్ట్రంలో ఇప్పుడు ట్రిబ్యునళ్లు లేవా? బోర్డులు లేవా? కోర్టులు లేవా? అవన్నీ ఉన్నపుడే.. కృష్ణానది నీళ్లు పైన మహారాష్ట్ర అవసరాలు తీరాకే కింద కర్ణాటకకు వస్తున్నాయి. కర్ణాటకలోని నారాయణ్‌పూర్, ఆల్మట్టి డ్యాములు నిండాక గానీ మన రాష్ట్రానికి రాని పరిస్థితి. ఇది మీకు కనిపించడం లేదా? కళ్లుండీ చూడలేని కబోదులా? ఈ పరిస్థితుల్లో మన మధ్య మరో రాష్ట్రం వస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎలా వస్తాయి? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? విభజన సంకేతాలు అందగానే మహారాష్ట్ర, కర్ణాటకలు నికరజలాల్లో వాటా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మిగులు జలాల్లో హక్కు అడుగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఒకటి చెబితే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంకోటి చెబుతుంది. ఒక్కటిగా ఉన్నప్పుడే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడుతుంటే కనిపించడం లేదా? కింద కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం తప్ప తాగడానికి మంచినీళ్లు ఏవీ? ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారు? మహబూబ్‌నగర్‌లోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? నల్లగొండలో ఎస్ఎల్బీసీకి ఎక్కడి నుంచి వస్తాయి? రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెలిగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజలస్రవంతి పథకాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? కావేరి నదీ జలాలపై కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం కొట్టుకునే పరిస్థితి. ప్రతి సంవత్సరం కోర్టులు, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా ఏటా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ట్రిబ్యునళ్లు లేవా? బోర్డులు లేవా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారట. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాక నీళ్లెలా ఇస్తారు? ప్యాకేజీలు ఇస్తే సరిపోద్దంటున్నారు. ఇంకో ట్రిబ్యునల్, ఇంకో బోర్డు ఇస్తామంటున్నారు. మీ చావు మీరు చావండని అంటున్నారు. చంద్రబాబు ఇదే గొప్ప ప్యాకేజీ అని మోసం చేస్తూ ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లా పాలకులు? 60 ఏళ్లుగా కలిసున్న మాకు ఎంత బాధగా ఉంటుంది? వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రెండుసార్లు సోనియాగాంధీని ప్రధానమంత్రి సీటులో కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చారు. కానీ ఆయన చనిపోయాక సోనియాగాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేసేందుకు ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రంతో చెలగాటమాడుతున్నారు. నీ కొడుక్కి ఉద్యోగం కోసం మా కొడుకుల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతారా? అమ్మా సోనియాగాంధీ.. 1968లో నీకు రాజీవ్‌గాంధీతో పెళ్లయ్యింది. ఆ తర్వాత 15 ఏళ్లకు అంటే 1983లో మీరు భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. ఈ 30 ఏళ్లలో భారత పౌరసత్వం తీసుకుని మాలో ఒకరిగా అయ్యారు. ఇవ్వాళ పార్లమెంటులో బిల్లు తెచ్చి.. భారత పౌరసత్వం తీసుకున్న వారంతా వెనక్కి వెళ్లాలంటే మీకు నచ్చుతుందా అమ్మా..? సోనియాగాంధీ గారికి అది నచ్చదు. కాంగ్రెస్ వారంతా కల్లుతాగిన కోతుల్లా రెచ్చిపోతారు. 30 ఏళ్లకే నీకు ఇంత వ్యామోహం ఉంటే మేం 60 ఏళ్లుగా కలిసి ఉన్నాం. మాకెంత బాధుంటుంది. రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అవుతోంది.. హైదరాబాద్ నుంచి ఆదాయం రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా ఉంటుంది. పదేళ్లలో విడిచిపెట్టి పోవాలంటున్నారు. ఈ డబ్బులు రాకపోతే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా వద్ద డబ్బులెక్కడి నుంచి వస్తాయి? సంక్షేమ పథకాలు అమలుచేసేందుకు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్‌లో చిన్నచిన్న మనుషులు చిన్నచిన్న వ్యాపారాలు, చిన్నచిన్న షాపులు నిర్వహిస్తూ చిన్నచిన్న ఇళ్లు కట్టుకుని, ఫ్లాట్లు కట్టుకుని వాటిల్లో బతుకుతున్నారు. విభజన జరిగితే వారి ఆస్తుల విలువ సగానికి పడిపోతే ఆ విలువను సోనియాగాంధీ ఇస్తారా? చంద్రబాబు ఇస్తారా? దేశంలో హిందీ తరువాత రెండో అతిపెద్ద జాతి తెలుగుజాతి. 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఒకసారి విభజన జరిగితే 17 లోపు ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు 12 అవుతాయి. ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్న రాజకీయాల కారణంగా రాష్ట్రం అన్ని రకాలుగా నాశనం అవుతుంది. విభజన కోసం బాబు ఢిల్లీలో దీక్ష చేశారు... చంద్రబాబు దగ్గరికి ఏపీఎన్జీవోలు పోయి విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కితీసుకోవాలని, సమైక్యాంధ్ర కోసం పాటుపడాలని ప్రాధేయపడితే.. ఆయన నిర్దయగా ‘ఆ లేఖను నేను వెనక్కి తీసుకోను. బెంగళూరు, చెన్నై నగరాల్లో తెలుగువాళ్లు ఎలా బతుకుతున్నారో ఇక్కడ కూడా బతుకుతారు’ అని చెప్పారట. మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నాయని, మీరు కూడా వ్యతిరేకిస్తూ రాజీనామా చేయాలని ఎన్జీవోలు అడిగితే.. నిర్దయగా ‘చేయను పో’ అని చెప్పారట. అంతటితో ఆగలేదు. ఢిల్లీ వెళ్లి ఏకంగా విభజన చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష సమయంలో ఎవరెవరితో ఏం మాట్లాడారో నాకు తెలియదు గానీ.. దీక్ష అయ్యేలోగా ఇక్కడ కిరణ్ ఉద్యమ సంఘాలను పిలిచి బెదిరించి ఒక్కొక్కరిగా సమ్మె విరమణ చేయించారు. వీళ్లు మనుషులేనా? పట్టపగలే మోసం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ముందే ‘తీర్మానం’ చేద్దామన్నా కిరణ్ స్పందించలేదు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ ఎందుకు రాజీనామా చేయలేదు? సోనియాగాంధీ ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు అంతా అయిపోయాక రాజీనామా చేసి మొసలి కన్నీరు కారుస్తారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఆమోదం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ విభజిస్తున్నారు. కేబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచి మనం సమైక్యంగా ఉండాలని తీర్మానించి పంపుదామని, అలా పంపితే దేశం మొత్తం చూస్తుందని, అలజడి పుడుతుందని కిరణ్‌ను కలిశాం. గవర్నర్‌ను కలిసి ప్రాధేయపడ్డాం. కానీ ఎవరూ పలుకలేదు. ఆ తరువాత నేను నిరాహార దీక్ష చేశా. గతంలో అమ్మ చేసింది. మళ్లీ కిరణ్గారిని అడిగాం. కార్యాలయం వద్ద ధర్నా చేశాం. ఇప్పటికైనా ముసాయిదా బిల్లు రాకముందే సమావేశమై సమైక్యంగా ఉండాలని తీర్మానం పంపుదామని ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను అడిగాం. కానీ మేం చేసిన ప్రతి ప్రయత్నం అరణ్యరోదనే అయ్యింది. మన రాష్ట్రంలో ఉండి వెన్నుపోటు పొడుస్తున్న తీరుతో బాధ కలుగుతోంది. చంద్రబాబు, కిరణ్‌ల గూబలు అదిరేలా చెప్పండి ఇక్కడ జరుగుతున్న పోరాటం.. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు.. అందుకు మీరంతా అవుననో కాదనో సమాధానం చెప్పాలి. ఢిల్లీకి వినబడేలా చెప్పాలి. చంద్రబాబు, కిరణ్ గూబలు అదిరేలా చెప్పాలి. ఈ విడగొట్టడాన్ని ఒప్పుకొంటారా?... (ఒప్పుకోబోమని దిక్కులు పిక్కటిల్లేలా సభికుల నినాదాలు.) తెలుగులో చెబితే వాళ్లకు అర్థం కాదు. నో అని చెప్పండి. తెలుగుజాతి రెండు ముక్కలు కావాలా? నీటికోసం కొట్టుకోవాలా? మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకు చావాలా? అన్నదమ్ముల మధ్య రోజూ గొడవలుండాలా? తెలుగు జాతికి అన్యాయం చేస్తున్న సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా? నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అటకెక్కితే చూస్తూ ఊరుకోవాలా? (అన్నింటికీ సభికుల నుంచి పెద్ద ఎత్తున ‘నో’ అనే సమాధానం) ఇప్పటికైనా జ్ఞానోదయమై చరిత్రహీనులుగా మిగిలిపోకుండా తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తారని ఆశిస్తున్నా. శీతాకాల సమావేశాల వరకూ పోరాటం చేస్తూనే ఉందాం. అవసరమైతే రేపు జరగబోయే ఎన్నికల వరకు పోరాటం చేద్దాం. 30 లోక్‌సభ స్థానాలను మనమే గెలిపించుకుందాం. ఆ తరువాత ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం. ఎలా విభజిస్తారో చూద్దాం. ఇక్కడ 30 పార్లమెంటు స్థానాలు మనమే తెచ్చుకుని రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాని స్థానంలో కూర్చోబెడదాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం. జై తెలుగుతల్లి. జై సమైక్యాంధ్రప్రదేశ్. జై వైఎస్సార్.’’ విపత్తు మృతులకు సంతాపం... జగన్మోహన్రెడ్డి సభలో తన ప్రసంగానికి ముందు.. రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ‘ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మకు శాంతి కలిగేలా ఒక నిమిషం పాటు అందరం కూడా మౌనం పాటిద్దాం’ అంటూ ఆయనతో పాటు సభికులంతా మౌనం పాటించి నివాళులర్పించారు. వాళ్ల ముగ్గురి కాలర్ పట్టుకుని అడిగితే ఏం చెప్తారు? నిజంగా బాధనిపిస్తుంది హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నప్పుడు. హైదరాబాద్‌ను పదేళ్లలో విడిచిపెట్టిపోవాలంట ? చదువు అయిపోయిన ప్రతిపిల్లాడు సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్ .. ఈ ముగ్గురిని కాలర్ పట్టుకుని.. ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలని అడిగితే ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో హైదరాబాద్ అనేది మహానగరం. ఎక్కడైనా, ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే మహానగరం, సముద్రాలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు అన్నీ ఒక్కటిగా ఉండాలి. అన్నీ ఒక్కటిగా ఉన్నప్పుడు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. కానీ గత మూడేళ్లలో వీళ్లు చేసిన పాపానికి.. దేశం మొత్తం మీద పెట్టుబడులు ఆకర్షించడంలో మూడు లేదా నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ 12వ స్థానానికి పడిపోయింది. చివరికి కోయంబత్తూరు కూడా ఏడో స్థానంలో ఉంది. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు హైదరాబాద్ పరిస్థితి ఒక్కసారి గమనించండి. కళాశాలలకే కంపెనీలు వచ్చి క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఏటా 57 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మూడేళ్లకూ కలిపి 25 వేలకు పడిపోయింది. హైదరాబాద్ ను ఎలా నాశనం చేశారో ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? విశాలాంధ్ర చరిత్ర సోనియాకు తెలుసా? సోనియాగాంధీని ప్రశ్నించదలుచుకున్నా. అమ్మా.. అసలు నీకు విశాలాంధ్ర చరిత్ర తెలుసా? తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉండాలని 1955లో తెలంగాణ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి విశాలాంధ్ర కోసం పాటుపడ్డారు. ఆ రోజు అసెంబ్లీలో 147 మంది సభ్యులకు 103 మంది సభ్యులు విశాలాంధ్ర కోసం ఓటేసి తెచ్చుకున్న సమైక్యాంధ్ర రాష్ట్రం ఇది. విశాలాంధ్ర కావాలని పోరాటం చేసిన రావి నారాయణరెడ్డి నీకు తెలుసా? మాడపాటి హనుమంతరావు తెలుసా? సురవరం ప్రతాపరెడ్డి తెలుసా? డాక్టర్ జయసూర్య తెలుసా? రావి నారాయణరెడ్డి ఏమన్నారో తెలుసా..? ‘వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదు’ అని అన్నాడు. చీలికవాదం తెలంగాణకు హానికరం అన్న మాటలు గుర్తుతెచ్చుకోవాలి. మీ అత్తగారైన ఇందిరాగాంధీ 1972 డిసెంబర్ 21న ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువు తల్లీ. ‘1972లో నేనున్నా.. 1955 నాకు ఇంకా గుర్తుంది. దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నా. విశాలాంధ్ర కావాలని తెలుగువాళ్లు ఘోషపెడుతున్నప్పుడు ఆ మాటలు ఇవాళ్టికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయ’ని ఇందిర అన్నారు. విశాలాంధ్ర అంటే తెలంగాణ కూడా అని అర్థం. రాయలసీమ అని కూడా అర్థం. కోస్తాంధ్ర అని కూడా అర్థం. బలమైన రాష్ట్రాన్ని చీల్చి బలహీనం చేసే మీ ప్రయత్నం న్యాయమేనా? . ఈ అన్యాయాన్ని చూస్తూ ఉంటే..రేపు మీ వెనక ఎవ్వరూ ఉండరు! రాష్ట్రాన్ని విభజించటానికి కేంద్రం చేస్తున్న నిరంకుశ ప్రయత్నానికి.. మార్టిన్ నిమోలర్ అనే ఒక జర్మన్ మేథావి రాసిన ఒక వాక్యం అద్దం పడుతుంది. హిట్లర్ తన సేనలతో నరమేథం సృష్టించేందుకు వస్తున్న సమయం అది. ‘హిట్లర్ సేనలు నాజీలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు.. నేను కమ్యూనిస్టు కాదు కదా.. నాకోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత నాజీలు సోషలిస్టుల కోసం వచ్చారు.. నేను సోషలిస్టును కాదు కదా.. నా కోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత ట్రేడ్ యూనియన్ నేతల కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ నేతను కాదు కదా.. వాళ్లొచ్చింది నాకోసం కాదు కదా.. అని మళ్లీ గమ్ముగా ఉండిపోయాను. తరువాత యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కదా.. వాళ్లొచ్చింది నా కోసం కాదు కదా అని గమ్ముగా ఉండిపోయాను. తరువాత నాజీలు నా ఇంటికోసం వచ్చారు. నా కోసం వచ్చారు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి నా కోసం ఎవ్వరూ కనిపించలేదు’ అని ఆయన రాసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం విషయంలో అదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కనబెట్టి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీచేస్తున్న తీరుపై దేశ రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం మీరు చూస్తూ ఊరుకుంటే రేపు బెంగాల్‌కు వస్తారు.. మమతాబెనర్జీ, కమ్యూనిస్టుల వెనక ఎవరూ ఉండరు. తమిళనాడుకూ వస్తారు.. కరుణానిధి, జయలలిత, చిదంబరం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. ఒడిశాకూ వస్తారు.. నవీన్‌పట్నాయక్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. కర్ణాటకకూ, పంజాబ్‌కూ వస్తారు.. పంజాబ్‌లో మన్మోహన్సింగ్ ఆమోదిస్తారేమో తెలియదు కానీ అక్కడి నాయకులు, ప్రజలు వెనక్కితిరిగి చూసుకుంటే ఎవరూ కనిపించరు. ఇక్కడ జరుగుతున్న తీరు రేపు ఇంకొక రాష్ట్రంలో జరగొచ్చు. విభజించి పాలించడం, ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేయడం తెరమరుగుకావాలి. జగన్‌కు జస్టిస్ లక్ష్మణరెడ్డి సంఘీభావం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి సమైక్య శంఖారావం వేదికపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. జనసంద్రంలో చిక్కుకున్న జస్టిస్ లక్ష్మణరెడ్డి ఎల్బీ స్టేడియానికి ఆలస్యంగా చేరుకున్నారు. అందువల్ల వేదికపై నుంచి ఆయన ప్రసంగించలేకపోయారు. సభ ముగిసే సమయానికి వేదిక వద్దకు చేరుకున్న ఆయనను జూపూడి ప్రభాకరరావు తీసుకెళ్లి జగన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న జగన్‌కు జస్టిస్ లక్ష్మణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. -
జనప్రభంజనం 'సమైక్య శంఖారావం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించిన 'సమైక్య శంఖారావం' భారీ బహిరంగ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూల నుంచి లక్షల మంది జనం తరలి వచ్చినప్పటికీ సభ ప్రశాంతంగా ముగిసింది. ఒక్క ఎల్బి స్టేడియమే కాదు హైదరాబాద్ అంతా సమైక్యవాదులతో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ వల్ల వందల వాహనాలు నగర శివార్లలోనే ఆగిపోయాయి. భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా 23 జిల్లాల నుంచి జనం రైలు, రోడ్డు మార్గాలలో సభకు వచ్చారు. యువకులు, వృద్ధులు, మహిళలు అన్ని వయసుల వారు, రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు..... అన్నివర్గాల ప్రజలు ఎవరికి అందిన వాహనంలో వారు హైదరాబాద్ చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనం కదలి వచ్చారు. వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు కదలి వచ్చారు. తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనం రావడం విశేషం. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. నేల ఈనిందా అన్నట్లు నగరం సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. అందరిది ఒకటే లక్ష్యం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే వారి కోరిక. అందు కోసం పోరాడే ఒకే ఒక్క నాయకుడుగా వైఎస్ జగన్ వారికి కనిపించారు. దిక్కలు పిక్కటిల్లేల్లాగా, ఢిల్లీ వరకు వినిపించేలా జనం సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర రాజధాని సమైక్యవాదుల నినాదాలతో హోరెత్తింది. తుపాను ప్రభావం వల్ల నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. పంటలు నీట మునిగాయి. మార్కెట్లకు చేరిన పంటలు కూడా తడిసి మద్దయిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు నీటి ప్రవాహంలో చిక్కకున్నాయి. జనం వరదల తాకిడికి విలవిలలాడుతూ, ప్రకృతి బీభత్సాన్ని కూడా లెక్కచేయకుండా 'సమైక్య శంఖారావం' సభకు వచ్చారు. అంటే వారిలో సమైక్యవాదం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాజధానిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ర్యాలీలుగా తరలివచ్చారు. నగరం ట్రాఫిక్ పద్యవ్యూహంలో చిక్కుకుపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకొని లక్షల మంది ప్రజలు సభా వేదికవరకు రాలేకపోయారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సమైక్య శంఖారావం సభ జరగదని చాలా మంది అనుకున్నారు. అయితే వారి ఊహలు ఏమీ ఫలించలేదు. రెండు రోజుల నుంచి నగరాన్ని తడిపి ముద్ద చేస్తున్న వరుణుడు కూడా కరుణించాడు. సమైక్యాంధ్రకు మద్దతు పలికాడు. సభ జరిగినంతసేపు వాన వెలిసింది. శుక్రవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి వర్షం ఆగిపోయి, వాతావరణంలో ఒక్కసారిగా మార్పురావడంతో సమైక్యవాదులు అత్యంత ఉత్సాహంతో తరలివచ్చారు. సభ దిగ్విజయంగా జరిగింది. జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర విభన వల్ల తలెత్తే సమస్యలను జగన్ వివరించారు. ఎన్నో కొత్త అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది తమ సమస్య కాదులే అని దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలు ఏమీ మాట్లాడకపోతే రేపు తమ దాకా వచ్చినప్పుడు మద్దతు పలికేవారు ఉండరని హెచ్చరించారు. సభ విజయవంతం కావడంతో సమైక్యవాదులు కొత్త ఉత్సాహంతో వెనుదిరిగి వెళ్లారు. -
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
-
హైదరాబాద్‌లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్
హైదరాబాద్ : విద్య, ఉద్యోగ అవకాశాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత కిషోర్ కుమార్ అన్నారు. ఎల్బి స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్
హైదరాబాద్: తమ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్న సోనియా గాంధీకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలుసా అని అడిగారు. వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడి ఆస్తుల విలువలు పడిపోతే ఆ విలువ సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న వారిని ఇటలీకి తిరిగి వెళ్లిపోమంటే ఒప్పుకుంటారా అంటూ అడిగారు. 30 ఏళ్లుగా ఉంటున్న సోనియాకే భారతదేశంపై ఇంత అధికారం ఉంటే వందల ఏళ్లుగా ఉంటున్న తమకు ఎంత అధికారం ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని జగన్ ఎద్దేవా చేశారు. ఓట్ల, సీట్ల కోసం విభజించే రాజకీయాలు తెరమరుగు కావాలని ఆకాంక్షించారు. సోనియా గుండెలు అదిరేలా, కిరణ్-చంద్రబాబు గూబలదిరేలా సమైక్య గళాన్ని వినిపించాలన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా అంటూ సభలోని వారిని జగన్ ప్రశ్నించగా 'నో' అనే సమాధానం వచ్చింది. విభజన బిల్లు ఆపే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ పోరాడుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నేతనే ప్రధానిని చేద్దామన్నారు. -
సమైక్యంగా ఉంచే సత్తా జగన్‌కే ఉంది: విశ్వరూప్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా గల నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఒక్కరేనని మాజీ మంత్రి విశ్వరూప్ చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్ సిపిలో చేరినట్లు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం తాను మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. రాష్ట్ర విభజనకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడంతో పినిపే విశ్వరూప్ మంత్రి పదవికి, పార్టీకి గత నెలలో రాజీనామా చేశారు. నేరుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కే ఆయన రాజీనామా లేఖ ఇచ్చారు. గవర్నర్ దానిని ఆమోదించారు. -
రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకునేది లేదు
రాష్ట్ర విభజన విషయంలో ప్రజలు ఏమంటారో తెలుసుకోడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభలో నేరుగా ప్రజలకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయా ప్రశ్నలకు అశేషసంఖ్యలో హాజరైన ప్రజలు ఒప్పుకొనేది లేదని సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకొంటారా.. నో, ఒప్పుకోం తెలుగు జాతి ముక్కలు కావాలా.. నో మన నీటి కోసంమనమే కొట్టుకుని చావాలా.. నో మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకుని చావాలా.. నో అన్నదమ్ముల మధ్య రోజూ గొడవలు జరగాలా.. నో తెలుగుజాతికి ద్రోహం చేస్తున్న సోనియా, కిరణ్, చంద్రబాబును క్షమించాలా.. నో నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను అటకెక్కిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా.. నో -
జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ప్రభంజనంలో రెండు కళ్లు, మూడు కాళ్ల సిద్ధాంతంతో ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి హెచ్చరించారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సమైక్య పోరు చేస్తోన్న జగన్‌కు తెలుగు ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి పరిచిన సమర్ధనేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అని చెప్పారు. వారి ఆశయాలను అమలు చేయగల ఏకైక నేత జగన్ అని లక్ష్మిపార్వతి అన్నారు. -
సోనియా నిర్ణయం ఎంపి సీట్ల కోసమే: మేకపాటి
హైదరాబాద్ : ఎంపి సీట్ల కోసమే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి విమర్శించారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొన్ని ఎంపీ సీట్లు గెలవవచ్చునని తెలుగు రాష్ట్రాన్ని విభజించడం సోనియాకు తగదన్నారు. ఆమె విభజన చర్యలు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె విధానాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ నాయకత్వంలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రెండు సార్లు 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుందని తెలిపారు. దాంతోనే కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నిందించడానికి తెలుగులో పదాలు లేవన్నారు. ఆరు నెలల్లో సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పాలించబోతోందన్నారు. అందుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని మేకపాటి చెప్పారు. -
సోనియా నిర్ణయం ఎంపి సీట్ల కోసమే: మేకపాటి
-
రాష్ట్రం విభజించి.. ప్యాకేజిలిస్తే సరిపోతుందా?
వర్షాలు, వరదల వల్ల నష్టం కలిగినా, సమైక్య శంఖారావం చేసి.. కలిసుందామని ఆప్యాయతను చూపిస్తూ, నినదిస్తూ లక్షలాదిగా తరలివచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరించిన చంద్రబాబు, కిరణ్, సోనియాలకు విభజిస్తే రాష్ట్ర దుస్థితి అర్థం కావట్లేదా అని నిలదీశారు. సమావేశంలో జగన్ మధ్యలో ఓ చిన్న కథ కూడా చెప్పారు.. ఈమధ్య ఓ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఓ సన్నివేశం ఇలా ఉంటుంది.. హిట్లర్ నరమేధం సృష్టిస్తున్నప్పుడు మార్టిన్ నిమోనర్ రాసిన విధానం ఇది.. ''ఆ నాజీలు.. హిట్లర్ సేనలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టును కాదుకదా, నాకోసం రాలేదని ఊరుకున్నాను. తర్వాత వాళ్లుసోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడూ ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నాకు సంబంధించిన విషయం కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు యూదుల కోసం వచ్చారు. అది కూడా నేను కాదుకదాని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేవలు నా ఇంటి దాకా వచ్చారు.. నా కోసం వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే నా కోసం ఎవ్వరూ కనపడలేదు'' జగన్ ప్రసంగంలో హైలెట్స్ వైఎస్ జగన్ వేదికపైకి రాగానే ఈలలు, కేకలతో సభా ప్రాంగణంలో ప్రజల ఉత్సాహం తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములుచ బూర్గుల కృష్ణారావు చిత్రపటానికి జగన్ పుష్పాంజలి వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ నివాళి వేదికపై నాయకులకు పేరు పేరునా పలకరించిన జగన్ సభాధ్యక్షుడు కొణతాల రామకృష్ణ ప్రారంభోపన్యాసం తర్వాత వైఎస్సార్ సీపీ, సమైక్యవాదుల ప్రసంగాలు ప్రసంగానికి ముందు శంఖం పూరించిన జననేత భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన జగన్ వర్షాలు, వరదలను లెక్కచేయకుండా తరలివచ్చిన జనానికి జగన్ ధన్యవాదాలు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ కోసం ఆరాటపడుతున్న ప్రతి హృదయానికి సలాం చేస్తున్నా రాజకీయ చదరంగంలో పావులం కాదు అన్యాయం చేస్తే ఊరుకోం వందేమాతర గేయాన్ని, విప్లవ జెండాను అందుకుంటాం.. మిమ్నల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం పేదవాడికి మేలు చేయడమే రాజకీయం తినడానికి తిండి లేకపోయినా జీతాన్ని పక్కనపెట్టి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమబాట పట్టాడు పనివాడు అక్కచెల్లెళ్లు చంటిబిడ్డలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి తమ బిడ్డల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తూ ఉద్యమించారు ఇంతమంది ఎందుకు ఉద్యమం చేస్తున్నారని రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని ప్రధాని చేయాలనుకుంటున్న సోనియాకు తట్టలేదు ప్యాకేజీ లు కోరుతున్న చంద్రబాబుకూ తట్టలేదు, మోసం చేస్తున్న సీఎం కిరణ్‌కు తట్టలేదు ఈ నాయకులందరినీ నీళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నా ఆల్మట్టి,నారాయణపూర్ నిండనిదే కిందకు నీళ్లు ఎలా వస్తాయని ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురినీ ప్రశ్నిస్తున్నా కర్ణాటక, తమిళనాడు ప్రతియేటా నీటి కోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి తెలియదా? ట్రిబ్యునళ్లు, బోర్డులు ఏం చేయగలిగాయో తెలియదా? రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీళ్లు ఎలా వస్తాయి? మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లకు ఎక్కడ నుంచి నీళ్లు ఇస్తారు? నల్గొండ ఎస్ఎల్బీసీకి ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయి? గాలేరునగరి, హంద్రీనీవాలకు నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు? కృష్ణా ఆయకట్టులో రైతులు కొట్టుకునే పరిస్థితి రాదా అని ప్రశిస్తున్నా? పోలవరం ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎలా తీసుకొస్తారు? కళ్లార్పకుండా ప్రజలను మోసం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లు సమాధానం చెప్పాలి హైదరాబాద్‌ను 10ఏళ్లలో విడిచి వెళ్లమంటున్నారు చదువు పూర్తైన యువకులు సోనియా, బాబు, కిరణ్‌లను ఉద్యోగం కోసం కాలర్ పట్టుకుని అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఏ రాష్ట్రం బాగుపడాలన్నా మహానగరంలో సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి. అలా అయితేనే పెట్టుబడులు వస్తాయి. వైఎస్ ఉన్నప్పుడు క్యాంపస్ ద్వారా ప్రతియేటా 50వేల ఉద్యోగాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య 25వేలకు మించడం లేదు. దేశంలోనే హిందీ తర్వాత అతిపెద్ద జాతి తెలుగుజాతి సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా? నాది వీర తెలంగాణే తప్ప.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి సోనియాకు తెలుసా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎదురైన పరిస్థితి రేపు దేశంలో కూడా వస్తుందని హెచ్చరిస్తున్నా తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా? 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందాం.. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం.. ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దాం జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైఎస్ఆర్ అంటూ ప్రసంగాన్ని ముగించిన జగన్ -
సమైక్యంగా ఉంచే సత్తా జగన్‌కే ఉంది: విశ్వరూప్
-
సమైక్య శంఖారావంలో ఎస్పివై రెడ్డి ప్రసంగం
-
సమైక్య శంఖారావంలో ఎన్.జి.ఓ,విద్యార్ధి నేతల ప్రసంగం
-
'ప్లకార్డు పట్టుకుని ఆనాడే జగన్ మద్దతు తెలిపారు'
-
జనమే జగన్ వద్దకు వచ్చారు: లక్ష్మీ పార్వతి
-
'ప్లకార్డు పట్టుకుని ఆనాడే జగన్ మద్దతు తెలిపారు'
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండానే రాష్ట్ర విభజన చేస్తామనడం అప్రజాస్వామికమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రాష్ట్రాన్ని రెండుముక్కులు చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకుని ఆనాడే జగన్ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, టీడీపీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విభజన నిర్ణయం శిలాశాసనం అయితే సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ప్రజలు శిలగా మారుస్తారన్నారు. విభజన జరిగితే పోలవరం సాధ్యం కాదని, డెల్టా ఎడారి అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. నిరంకుశంగా విభజనను కొనసాగిస్తే రాష్ట్రం భగ్గుమంటుందని హెచ్చరించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని విభజన ప్రక్రియ ఆపాలన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమైక్య శంఖారావం సభకు తరలివచ్చిన వారందరికీ బోస్ ధన్యవాదాలు తెలిపారు. -
చంద్రబాబు గజని: కొడాలి నాని
-
ఎల్బీ స్టేడియంలో జగన్ 'సమైక్య శంఖారావం'
ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ సందడిగా ప్రారంభమైంది. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. అంచనాలను మించి జనం రావడంతో స్టేడియంతో పాటు చుట్టుపక్కల పలు రోడ్లు కూడా జన ప్రవాహంతో నిండిపోయాయి. -
అభివాదాలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకోగానే అభివాదాలతో ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. సభకు చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు, వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు...ఆయనతో కరచాలనం చేసేందుకు జనాలు పోటీ పడటంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కాగా జన సందోహంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసి పోవటంతో సభకు వెళ్లలేని ప్రజలు ఎల్ఈడీల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు. -
చంద్రబాబు గజని: కొడాలి నాని
హైదరాబాద్: విభజన ప్రక్రియను మొదలుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొడాలి నాని విమర్శించారు. ఎల్బీ స్టేడియంతో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు గజని అని ఎద్దేవా చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన వైఎస్సార్‌పై చంద్రబాబు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలన్నారు. అనేక సంక్షేమ పార్టీలు పెట్టి ప్రజల గుండెల్లో వైఎస్సార్ గూడు కట్టుకున్నారని చెప్పారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన అవసరముందని హెచ్చరించారు. చంద్రబాబు తన పిచ్చి కుక్కలను మా నాయకుల మీదకు వదిలితే తగువిధంగా బుద్ధి చెబుతామని కొడాలి నాని అన్నారు. 150మంది ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు పెట్టినా పదవికి ఆశపడని నైజం ఆయనదన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ద్వారా సీఎం అయ్యారని గుర్తు చేశారు. -
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు: కొణతాల
-
ఎవరిని అడిగి విభజన నిర్ణయం తీసుకున్నారు: జూపూడి
-
తెలుగువాళ్ల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
-
తెలుగువాళ్ల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించింది జగన్ ఒక్కరేనని గుర్తుచేశారు. సోనియాతో చంద్రబాబు చేతులు కలిపి విభజన అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆరోపించారు. ఎల్బీ స్టేడియంతో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలంతా జగన్‌తో ఉన్నారని తెలిపారు. జగన్ ఆలోచనల నిండా ప్రజలే ఉన్నారన్నారు. తెలుగువాళ్ల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని ఆమె అన్నారు. విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. జగన్ నాయకత్వంలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శోభా నాగిరెడ్డి ప్రకటించారు. -
ఎవరిని అడిగి విభజన నిర్ణయం తీసుకున్నారు: జూపూడి
హైదరాబాద్ : ఎవర్ని అడిగి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ...దాన్ని వెనక్కి తీసుకునేది లేదంటున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఎవరి కోసం విభజన చేశారని ఆయన నిలదీశారు. ఎవరి కోసం విభజన నిర్ణయాన్ని తీసుకున్నారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా విభజన నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయాన్ని మార్చుకున్న సోనియా...విభజన విషయంలో ఎందుకు మార్చుకోవటం లేదని జూపూడి ప్రశ్నించారు. వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు అందుకున్న ప్రజలు...ఆయన మరణం తర్వాత ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుతోనే విభజన కుట్ర జరిగిందని జూపూడి ఆరోపించారు. తుపాన్, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా వచ్చినవారిని జూపూడి స్వాగతించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ తరలి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జగన్ వెంట నడుస్తున్న సైన్యం తుపానులో ఢిల్లీ నాయకులు కొట్టుకుపోవాలని ఆయన అన్నారు. -
తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు: కొణతాల
హైదరాబాద్: సమైక్యంగా ఉంచడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తెలుగు జాతిని విడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ సంక్షోభం తీసుకురావడం ద్వారానే విభజనను అడ్డుకోగలమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టినపుడే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు. విభజనకు పూర్తిగా ఫుల్ స్టాఫ్ పెట్టాల్సిన అవసరముందన్నారు. తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య జరుగుతున్న పోరాటంలో తెలుగు ప్రజలదే విజయమని వ్యాఖ్యానించారు. విభజనపై ప్రజలను మభ్యపెడుతూ సీఎం కిరణ్ మోసం చేస్తున్నారని కొణతాల ఆరోపించారు. విభజన సాఫీగా జరిగిపోవడానికి సీఎం సహకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తీర్మానం, బిల్లుపై గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని చెప్పారు. -
సమైక్య శంఖారావం సభ ప్రారంభం
-
తెలంగాణ నుంచి సమైక్య శంఖారావానికి వెల్లువ
ఏకపక్షంగా రాష్ట్ర విభజనను చేపట్టారని, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'సమైక్య శంఖారావం' సభకు తెలంగాణ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయా జిల్లాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. మరోవైపు సమైక్య శంఖారావానికి వెళుతున్న సమైక్యవాదులను ...ఆందోళనకారులు అడ్డుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. 44వ జాతీయ రహదారిపై అలంపూర్ చౌరస్తా నుంచి కొత్తూరు వరకూ పోలీసులు మోహరించారు. అలంపూర్, గద్వాల, మదనాపురం, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్ తదితర రైల్వేస్టేషన్లలో పోలీసులు నిన్న సాయంత్రం నుంచే పహరా నిర్వహిస్తున్నారు. -
మిమిక్రీ రమేశ్ ప్రసంగం @ సమైక్య శంఖారావం
-
హైదరాబాద్‌లో ఎటు చూసినా ర్యాలీలే!
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు జంట నగరాల నుంచి భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నేతృత్వంలో సమైక్యవాదులు సభకు తండోప తండాలుగా కదలివస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలుగా తరలివస్తున్నారు. దారి పొడుగునా సమైక్య నినాదాలు చేస్తూ సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. * అంబర్‌పేట కార్పొరేటర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో 3వేల మందితో బైక్ ర్యాలీ * కూకట్పల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డేపల్లి నర్సింహరావు నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ ముక్కారూపానందరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * సనత్‌నగర్ ఇంఛార్జ్ వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో వాహనాలతో భారీ ర్యాలీ * కుత్భుల్లాపూర్ ఇంఛార్జ్ కొలను శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వాహనాలతో భారీ ర్యాలీ * కేపీహెచ్పీలో జార్జ్ హెర్బట్ ఆధ్వర్యంలో 100 మీటర్ల వైఎస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరణ, ర్యాలీగా బయల్దేరిన నేతలు * రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్ సీపీ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో సభకు వేలాదిగా తరలివెళ్లిన కార్యకర్తలు -
వైయస్ మీద పాట పాడిన మిమిక్రీ రమేశ్ @ సమైక్య శంఖారావం
-
సమైక్య శంఖారావానికి వరుణుడి మద్దతు!
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి వరుణుడు కూడా మద్దతు పలికాడు. గత రెండు రోజులుగా నగరాన్ని తడిపిముద్ద చేసిన వరుణుడు సమైక్య శంఖారావం సభ సందర్భంగా నేడు విరామం ప్రకటించాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో వాతావరణం పొడిగా మారింది. ప్రతికూల వాతావరణం తొలగిపోవడంతో సమైక్య వాదుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గత రెండు రోజులుగా ఎండపొడ లేకుండా గడిపిన భాగ్యనగరానికి నేడు ఊరట లభించింది. ఎడతెరిపిన లేకుండా వర్షాలతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు వర్షం తెరిపివ్వడంతో సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పోటెత్తుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ఎల్బీ స్టేడియం వైపు కదులుతున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. -
'సమైక్య వాణిని ఢిల్లీకి వినిపిస్తాం'
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, సమైక్యంగా ఉంచాలనే మెజారిటీ ప్రజల బలీయమైన ఆకాంక్షను చాటిచెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలి వచ్చారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా... ఏ మాత్రం లెక్క చేయని వారు హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సభ జరగనున్నా... సమైక్యవాదులు మాత్రం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సమైక్యవాదులతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే శాశ్వత నష్టాన్ని నిరోధించే లక్ష్యంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి వివిధ జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నందున.. భారీ వర్షాలు, వరదలతో తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా నష్టాలొచ్చినా లెక్కచేయకుండా సమైక్య శంఖారావానికి తరలి వచ్చినట్లు సమైక్యవాదులు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం భగ్నమైతే రాబోయే తరాల భవిష్యత్తుకు భరోసా ఏదీ? సీమాంధ్ర తాగునీరు, సాగునీటికి భద్రత ఏదీ? అంటూ ఎల్లెడలా వ్యక్తమవుతున్న ఆవేదనను ఢిల్లీకి వినిపించి తీరుతామని వారు తెలిపారు. భారీ వర్షాలూ వరదల్లోనూ చెదరని సంకల్పంతో.. ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా సమైక్య లక్ష్యం సాధించాల్సిందేనని అకుంఠిత దీక్షతో తరలి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో సమైక్య వాణిని ఢిల్లీకి వినిపించడానికి ఇదొక్కటే సరైన వేదిక అని ప్రజలు తెలిపారు. ఇక శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సజావుగా, శాంతియుతంగా సభను నిర్వహించడానికి పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సభ నిర్వహణకు సంబంధించి పలుమార్లు ముఖ్య నేతలతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న ఎల్బీ స్టేడియానికి హైదరాబాద్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణంగా నామకరణం చేశారు. పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర ముఖ్య నేతలు ఆసీనులయ్యే వేదికకు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలంటూ ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఎనభై అడుగుల వేదిక పార్టీ ముఖ్య నేతలు ఆసీనులు కావడానికి 80 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటుచేశారు. ఈ వేదికపై పదహారు అడుగుల ఎత్తై ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పటం, తెలుగుతల్లి విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిల చిత్రాలను ఏర్పాటు చేశారు. సమైక్య శంఖారావం సభను దగ్గరి నుంచి తిలకించడానికి వీలుగా ప్రాంగణంలో నాలుగు అతి పెద్ద ఎల్సీడీలను ఏర్పాటు చేయటం జరిగింది. స్టేడియం బయట కూడా వీక్షకుల సౌకర్యం కోసం మరో నాలుగు మొబైల్ ఎల్సీడీలను కూడా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణమైన ఎల్బీ స్టేడియంను నిన్న శాసనసభలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు జూపూడి ప్రభాకరరావు, వై.వి.సుబ్బారెడ్డి, మూలింటి మారెప్ప, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు -
ఎల్.బి.స్టేడియంలో కళాకారుల ఆటపాటలు
-
రాష్ట్రం నలు మూలల నుంచి హైదరాబాద్ కు సమైక్యవాదులు
-
ఆటపాటలతో ఉత్తేజపరుస్తున్న కళాకారులు
సమైక్య శంఖారావానికి తరలి వస్తున్నవారిలో అనేకమంది కవులు, కళాకారులు, గాయకులు అందరూ ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ కవి గాయకుడు తన బృందంతో సహా కలిసి వచ్చి సభా ప్రాంగణం సమీపంలో కంజీర పట్టుకుని కదలి రా అన్నయ్యా అంటూ పాట పాడి అందరినీ ఉత్సాహపరిచారు. కదలిరా అన్నయ్యా.. కదలిరా అక్కయ్యా.. కదలిరా తమ్ముడా.. కదలిరా చెల్లెలా కసికసిగా రాష్ట్రాన్ని విడదీయాలని.. ఉసిగొల్పే దుర్నీతిని మసిచేయడానికి.. కదలిరా అన్నయ్యా (2) కుళ్లుగొట్టి కంపుగొట్టు రాజకీయ మలినము.. కదంతొక్కి కదలి సాగి చేయాలి ప్రక్షాళనము.. అంటూ ఈ పాట సాగింది. -
సమైక్యవాదుల్ని అడ్డుకున్న ఆందోళనకారులు
-
సమైక్యవాదుల్ని అడ్డుకున్న ఆందోళనకారులు
వర్థన్నపేట : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సమైక్య శంఖారావానికి వస్తున్న సమైక్యవాదులను ....ఆందోళనకారులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి సమైక్య శంఖారావానికి అశేష సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారీ వర్షాల కారణంగా .. వారు వరంగల్ జిల్లా వర్థన్నపేట నుంచి వస్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అలాగే సమైక్య శంఖారావానికి తరలి వస్తున్న సమైక్యవాదుల 50 వాహనాలను జనగామ వద్ద కూడా ఆందోళనకారులు అడ్డుకుని నాలుగు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఇక గడిపికొండ వద్ద 150 బస్సులను అడ్డుకున్నారు. -
చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం
-
హైదరాబాద్ పయనమవుతున్న జనం
-
చెదరని సంకల్పం.. తరలి వస్తున్న జనం
వర్షాలు, వరదలు వారి సంకల్పాన్ని ఏమాత్రం చెదరగొట్టలేకపోయాయి. ఇళ్లు కూలుతున్నా, పంట మునుగుతున్నా, జీవితమే స్తంభించిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. రైళ్లు, బస్సులు, జీపులు.. ఇలా ఏవి దొరికితే వాటిలోనే బయల్దేరారు. వందలు.. వేలసంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం జరిగే సమైక్య శంఖారావం సభకు హాజరయ్యేందుకు సీమాంధ్రలోని పదమూడు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు బయల్దేరి వచ్చారు. సభ ప్రారంభమయ్యే సమయం మధ్యాహ్నం రెండు గంటలకే అయినా, ట్రాఫిక్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని తెల్లవారు జాము నుంచే హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి... ఇలా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, జీపులు, కార్లలో సమైక్య వాదులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేలాదిగా శుక్రవారం సాయంత్రం నుంచే బయల్దేరారు. వీరంతా శనివారం ఉదయానికి హైదరాబాద్ చేరుకున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద నుంచి ఎల్బీ స్టేడియం వైపు తరలి వెళ్తున్నారు. ఎల్బీ స్టేడియానికి ఇప్పటికే చేరుకున్న పలువురిని అక్కడినుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపుతున్నారు. స్టేడియం బయట మరింతమంది లోపలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్న గట్టి నమ్మకం తమకుందని.. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టాలని సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రజలు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ఏకైక లక్ష్యమని, తమ ప్రాంతాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నా.. వాటివల్ల కలిగే నష్టం కంటే విభజన వల్ల శాశ్వతంగా కలిగే నష్టమే ఎక్కువని, తమతో పాటు తమ బిడ్డల జీవితాలను కూడా రాష్ట్ర విభజన సర్వనాశనం చేస్తుందని.. అందుకోసమే దాన్ని అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న తమ డిమాండును ఢిల్లీ గల్లీల్లో కూడా గట్టిగా వినిపించేలా సమైక్య శంఖాన్ని పూరించి తీరాలని అంటున్నారు. -
మండే గుండెల తరపున సమైక్య శంఖారావ సభ
-
ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిన మహిళలు
-
సభకు ఏర్పాట్లు పూర్తి
-
నేడే సమైక్య శంఖారావం సభ
-
ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
-
భారీఎత్తున సమైక్య సభకు...
బెలగాం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం పార్వతీపురంలో ఉద్ధృతంగా కొనసాగుగోంది. ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని అన్ని బస్సులకు, ప్రధాన రహదారిలో వెళ్తున్న వాహనాలకు, రైల్వేస్టేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లకు విభజన వద్దు- సమైక్యాంధ్రే ముద్దు అంటూ స్టిక్టర్లను జేఏసీ నాయకులు, సభ్యులు అతికించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం సాంకేతికంగా సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించారని, ప్రభుత్వంలోని పెద్దలు కూడా బలపరుస్తున్నారన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గంజి లక్ష్మీనాయుడు, కార్యదర్శి జి.వీఆర్ఎస్ కిశోర్, నాయకులు కత్తిర నర్సింగరావు, మండల సత్తిబాబు, ఆర్ఎస్రావు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షసమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు జంక్షన్ వద్ద శుక్రవారం దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగే న్యాయవాదుల జేఏసీ సమావేశంలో తీసుకునే నిర్ణయం ప్రకారం కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ పీ. రాజేంద్ర, న్యాయవాదులు జి. వెంకట్రావు, ఎస్. ప్రభాకరరావు, పివి క్రిష్ణారావు, గొర్లి రమణ, గిరీష్‌కుమార్‌మారో, జి. విజయశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
కదిలిన సమైక్య దండు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్వచ్ఛందంగా తరలివెళ్లిన వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల పార్టీ నాయకులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న సభకు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రజలు మద్దతిస్తుండటం విశేషం. వర్షం మరింత అధికమైనా సభను విజయవంతం చేసి తీరుతామని సమైక్యవాదులు భీష్మించారు. జిల్లా వ్యాప్తంగా 11 ఆర్టీసీ డిపోల నుంచి 280 బస్సులు, 1602 క్రూజర్లు, జీపులు, సుమోలతో పాటు 101 ప్రైవేట్ బస్సుల్లో ప్రజలు శంఖారావానికి బయలుదేరారు. శుక్రవారం రాత్రి కర్నూలు, కోడుమూరు నియోజక వర్గాలకు సంబంధించిన 10వేల మంది సమైక్యవాదులకు పార్టీ ఆధ్వర్యంలో భోజనాలు సిద్ధం చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలు రాత్రి భోజనాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టారు. ఇదిలాఉండగా గుంతకల్లు నుంచి ఆదోని, మంత్రాలయం మీదుగా హైదరాబాద్ చేరుకునేందుకు సమైక్యవాదులు 18 బోగీలు కలిగిన రైలును రిజర్వు చేసుకున్నారు. డోన్, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లల్లోనూ ప్రజలు భారీగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లోనే బయలుదేరారు. సభకు బయలుదేరే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కాటసాని రామిరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, సాయిప్రసాద్‌రెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ తదితర నాయకులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల జిల్లా కన్వీనర్లు, మండల కన్వీనర్లు ముమ్మర ఏర్పాట్లు చేశారు. -
సమైక్య సభకు సిక్కోలు జనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం రాష్ట్ర రాజధానిలో శనివారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వేల సంఖ్యలో ప్రజ లు తరలివెళ్లారు. బస్సులు కేటాయించేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరించడంతో ప్రైవేట్ వాహనాల నే పార్టీ నాయకులుబుక్ చేసుకున్నారు. రైళ్లు, ప్రైవేట్ బస్సు లు, కార్లలో గురు, శుక్రవారాల్లో వీరంతా బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల ముందు నుంచే పార్టీ అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు వెళ్లినా.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధిక సం ఖ్యలో తరలి వెళ్లారు. కొందరు విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి రైళ్లలో రాజధానికి ప్రయాణమయ్యారు. వర్షాలు, వరదలు జిల్లాను అతలాకుతలం చేస్తున్న సమయంలో ఒకవైపు బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొం టూనే.. మరోవైపు పార్టీ పిలుపు మేరకు, సమైక్యాంధ్ర లక్ష్యసాధనకు తమ వంతు కృషి చేస్తున్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో జనం తరలివెళ్లారు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని కళింగ పట్నం తీరప్రాంతంలో భారీగా వరదనీరు గ్రామాల్లోకి చేరడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు సహాయ కార్యక్రమాల్లో మునిగితేలారు. పలువురికి ఆహారం అందించారు. కాగా పార్టీ జిల్లా కన్వీనర్, నర్సన్నపేట ఎమ్మె ల్యే ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవ ర్గ పరిశీలకుడు పిరియా సాయిరాజ్, సీజీసీ సభ్యులు పాలవలస రాజశేఖరం, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్, అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల నాయకత్వంలో నాయకులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాగా పార్టీతో సంబంధం లేని అనేక మంది ఉద్యోగు లు, అభిమానులు, సమైక్యాంధ్రను కోరుకునే ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. జిల్లాలో తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టించినా జనం లెక్కచేయకుండా సమై క్య నినాదాన్ని వినిపించాలని గత రెండు రోజులుగా ఎవరికి వారు తరలి వెళ్లడం విశేషం. -
మొక్కవోని దీక్షను చాటాలి: మేకపాటి
వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభకు లక్షలాదిగా తరలివస్తున్న ప్రజానీకం రాష్ట్ర సమైక్యత పట్ల తమ మొక్కవోని దీక్షను చాటిచెప్పాలని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పిలుపునిచ్చారు. సభకు వచ్చేవారందరికీ ఎల్.బి.స్టేడియం లోపల సరిపడా ఏర్పాట్లు లేనందున బయటే ఎక్కువమంది ఉండిపోయే అవకాశం ఉంటుందని, అందువల్ల లోపలికి వెళ్లలేకపోయామే అన్న భావన, బాధ లేకుండా అక్కడే ఉండి.. సభ పూర్తయ్యేం త వరకూ ఓర్పుగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే మహదాశయంతో వస్తున్న లక్షలాదిమంది స్టేడియం లోపల, బయట చివరి వరకూ ఉన్నపుడే మన పోరాటపటిమ ఏమిటో ఢిల్లీకి తె లిసి వస్తుందన్నారు. భారీగా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా వస్తున్నవారంతా అభినందనీయులని, అదే స్ఫూర్తిని సభ పూర్తయ్యేవరకూ ప్రదర్శించాలని కోరారు. కేంద్రప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్న ఈ తరుణంలో దీన్నొక ప్రతిష్టాత్మకమైన పోరాటంగా భావించి సభా ప్రాంగణం లోపల, బయటా ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే ఉద్యమానికి అంత బలం చేకూరుతుందన్నారు. వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని పార్టీ శ్రేణులు నిలబడాలని మేకపాటి కోరారు. ఇదీ కార్యక్రమం: మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రసంగాలు ఉంటాయి. వారితోపాటుగా సమైక్య శంఖారావానికి సంఘీభావం తెలపడానికి వచ్చే వివిధ జేఏసీలు, ప్రజాసంఘాల నేతల ఉపన్యాసాలు ఉంటాయి. ఆ తరువాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. -
విభజనతో రాష్ట్రానికి శాశ్వత నష్టం: కొణతాల
విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేయడానికి శనివారం సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని శుక్రవారం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ సమీక్షించింది. సవూవేశం అనంతరం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డిలతో కలిసి కొణతాల మీడియాతో మాట్లాడారు. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను ఢిల్లీకి తెలియపరుస్తామని, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని, సభను వాయిదా వేయలేకపోతున్నామని కొణతాల చెప్పారు. విభజనను 60 శాతంవుందిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కేంద్రం పునరాలోచన చేయకపోవడం సరికాదన్నారు. నవంబర్ 15లోగా విభజన బిల్లు రూపొందిస్తామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పడం దారుణమని, ఓట్లు, సీట్లు లెక్కలతో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పీఠం కదిలేలా, విభజనకు సహకరించే ఆ రెండు పార్టీలకు కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయుక చర్యల్లో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొంటున్నాయని కొణతాల చెప్పారు. వర్షబాధిత ప్రాంతాల్లో పరిస్థితిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గంటగంటకూ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశించారన్నారు. అధికారుల సహాయ సహకారాలతో బాధితు లను పునారావాస కేంద్రాలకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు సభ జరిగే రోజు కూడా యథావిధిగా అవే పనుల్లో కొనసాగాలని జగన్ సూచించినట్టు కొణతాల చెప్పారు. మిగతా వారు మాత్రమే సభకు రానున్నారని ఆయున చెప్పారు. సాయంత్రం కూడా సమీక్ష: సమైక్య శంఖారావానికి వరద బాధిత ప్రాంతాల నుంచి తరలి వస్తున్న పార్టీ నేతలతో వారు జిల్లాల నుంచి బయల్దేరే ముందు కూడా శుక్రవారం సాయంత్రం జగన్ ఆయా జిల్లాల్లో వరద గురించిన తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని కొణతాల చెప్పారు. హైదరాబాద్ సభకు బయల్దేరకుండా జిల్లాల్లోనే ఉన్న కొందరు నేతలను స్థానికంగా సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జగన్ సూచించారని ఆయన వివరించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులకు శని, ఆదివారాల్లో ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా జగన్ వారిని కోరినట్టు కొణతాల తెలిపారు. -
కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం
యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి కాంగ్రెస్ హ్యాట్రిక్‌కు మాత్రం దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా. రాజకీయ పార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్సీపీ 26న ‘సమైక్య శంఖారావం’ పూరించబోతున్నది. స్వతంత్రం వచ్చాక వ్యవస్థల పునర్ నిర్మాణం జరగాలి. మన దేశం కూడా అందుకు ప్రయ త్నించింది. స్వాతంత్య్రం ఇచ్చిన స్ఫూర్తితోనే మేరునగధీరులైన నాటి రాజనీతిజ్ఞులు, మేధావు లు, కవులూ కళాకారులు మన సావాచా నమ్మారు. అందులో భాగమే తెలుగువారికి ఒక రాష్ట్రం. తెలుగువారంతా ఒకే ఛత్రంకింద ఉండాలని ప్రజా కవులు, గాయకులు గానం చేశారు.‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అందరి నాల్కల మీద నడయాడింది ఆ రీతిలోనే. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అందుకు ఎన్టీఆర్ ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా!’ (వేములపల్లి శ్రీకృష్ణ గేయం) లీడ్ సాంగ్ చేసు కున్నారు. ఆంధ్రమహాసభ నాయకత్వంలో సాగిన తెలం గాణ సాయుధ పోరాట లక్ష్యాల్లో విశాలాంధ్ర స్థాపన ఒక టన్నది ఎలా విస్మరిస్తాం? ఆ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, ఆరు ట్ల కమలాదేవి వంటి ఎందరో సమైక్యతనే చాటి చెప్పారు. బూర్గుల రామకృష్ణారావు లాంటి వారి అసమాన త్యాగాల వల్లనే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆనాడు కాంగ్రెస్‌లోని మితవాదవర్గం వ్యతిరేకించినా, వారి ఆటలు, అపశ్రుతు లు ఆంధ్రప్రదేశ్ అవతరణను అడ్డుకోలేకపోయాయి. నెహ్రూ మాటను ఎవరూ కాదనలేకపోయారు. ఆంధ్రప్ర దేశ్ అవతరణలో భాగస్వాములు కానివారూ, పదవుల కోసం ఆరాటపడేవారు విభజన వాదాన్ని అందుకున్నారు. సమైక్యాంధ్రకు చక్కటి రాజధాని దేశంలో మేటి నగరంగా హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉన్నదని భావిస్తున్న తరుణంలో ఈ విభజన నిర్ణయం ఆ నగరాన్ని గందరగోళంలో పడేసింది. కేవలం డబ్బుతో చక్కటి రాజధాని సిద్ధించదు. ఈ 57 ఏళ్లలో భాగ్యనగరం అన్ని హంగులతో చక్కటి రాజధానిగా రూపొందింది. ఎన్ని ప్రతిష్టాత్మక సంస్థలు విద్య, వైద్య, వ్యాపార రంగా లలో నెలకొన్నాయో! ఐదు లక్షల కోట్లు కాదు, పది లక్షల కోట్లు ఖర్చు చేసినా; పదికాదు, ముప్ఫై ఏళ్లయినా అటు వంటి మరో నగరాన్ని నిర్మించలేము. అంత ఆదాయం చేకూర్చగల నగరం సాధ్యమా? కొత్త రాజధాని కోసం కొందరు అంచనా వేస్తున్న ఆ పది లక్షలతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు అభివృద్ధి ప్యాకేజీలు ఇవ్వవచ్చు. జలయజ్ఞాన్ని వేగంగా పూర్తి చేయవచ్చు. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, ఒక విశ్వవిద్యాలయం అన్న వైఎస్ కలను సాకారం చేయవచ్చు. ప్రతి స్కూలుకు టాయిలెట్ సమకూర్చవచ్చు. ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కలిగించవచ్చు. సమై క్యాన్ని అలాగే ఉండనివ్వండి. రాజధానిని గురించిన సీమాంధ్రుల కలలను వికలం కానీయరాదు. కొత్త రాజ ధాని మీద పెట్టే ఖర్చంతా అనుత్పాదకమైందే. దిగ్విజయ్ లిటిగెంటు విభజనకు ప్రధాన పక్షాలన్నీ సమ్మతించాయట. అందుకే ఈ నిర్ణయమట. సోనియా ముచ్చట తీర్చడానికి కాదట! ఇందులో రాజకీయమే లేదట! ఎనభై రోజులు దాటిపో యినా, ఇంకా సాగుతున్న కోట్లాది సీమాంధ్ర జనఘోష సైతం దిగ్విజయ్‌సింగ్‌కు వినపడలేదట! కనబడలేదట! పైగా తగ్గుముఖం పట్టిందట! కాంగ్రెస్ వారు ఎవరైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ప్రతి ఒక్కరు అధి ష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిందేనట! అంటే ఎన్ను కున్న ప్రజలు దిగ్విజయ్ దృష్టిలో దద్దమ్మలు. మనకు స్వాతంత్య్రం సాధించి పెట్టిందీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది ప్రజలు కాదా? రాజకీయ పక్షాలు మాట ఇచ్చాయి, కాబట్టి ప్రజల ఆకాంక్ష ఏమైనా, వారి ఘోష ఏైదైనా రాజకీయ పక్షాలు ఇచ్చిన మాట వల్ల మరచిపోవలసిందేనని దిగ్వి జయ్ భాష్యం చెప్పడం కక్షిదారుని మనస్తత్వం. ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందింది. ఈ విషయాన్నే జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ఘంటాపథంగా చెప్పింది. తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడిందని వెల్లడించింది. హైద రాబాద్ పది జిల్లాలకు రాజధాని కావటంకంటే 23 జిల్లాల రాజ ధాని కావటం ఎంతో మేలని రావి నారాయణరెడ్డి చెప్ప లేదా? రాజధాని ప్రభావం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీద పడిం ది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. భూముల ధరలు పెరి గాయి. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాంతీయ అసమానతల మీద దృష్టి పెట్టి, తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొని వారిని అనాథలనుచేస్తే, వైఎస్ ఆ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టి, పనులను పరుగులు తీయించాడు. ఏ ఇతర జిల్లాకు పెట్టనంత ఖర్చు ఆ జిల్లాకు పెట్టాడు. పచ్చటి తెలంగాణ వైఎస్ కల తెలంగాణను కోసాంధ్ర స్థాయికి పెంచాలని వైఎస్ ఆశ. ఆ ఉద్దేశంతోనే తెలంగాణలోని ఆరు జిల్లాలో 16 లక్షల ఎకరా లకు నీరందించే ప్రాణహిత చేవెళ్ల భారీ పధకాన్ని సర్వే చేయించి శంకుస్థాపన చేశారు. ఆ పధకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్న సమ యంలో కన్నుమూశారు. వైఎస్ అధికారం స్వీకరించిన వెంటనే తొలి సంతకం చేసింది ఉచిత విద్యుత్ పధకం మీదనే! దానితో ఎక్కువ లబ్ధి చేకూరినది తెలంగాణకే. రాష్ట్రంలో 32 లక్షల పంపుసెట్లు ఉంటే అందులో తెలం గాణలోనే 18 లక్షలు ఉన్నాయి. వారి విద్యుత్ బకాయిలు రద్దయ్యాయి. విద్యుత్ కేసులు మాఫీ అయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరి మీద నిర్మి స్తున్న భారీ ఎత్తిపోతల పధకాలకు భారీ స్థాయిలో విద్యు త్తు అవసరం. వాటికి మాత్రమే ఆరువేల మెగావాట్ల విద్యుత్తు అవసరం. విభజన జరిగితే ఈ ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుదిబండ కాగలదు. ఆరుసూత్రాల పధకం లోని 610 జీవో ఉల్లంఘనలను పరిశీలించి, సరిచేయడా నికి వైఎస్ శ్రద్ధ తీసుకున్నారు. అందుకు తెలంగాణ మం త్రులతోటి ఒక ఉపసంఘాన్ని నెలకొల్పారు.ఇవన్నీ సౌల భ్యం కోసం నాయకులు విస్మరిస్తున్నారు. కానీ ప్రజలు మరచిపోతారని అనుకోలేం. జలయుద్ధాలను ఆపగలరా? నీటి యుద్ధాలు వర్తమాన భారత, అంతర్జాతీయ దృశ్యం. వీటిని నివారించాలంటే సమైక్యతతోనే సాధ్యం. దీనిని గుర్తించబట్టే వైఎస్ జల యజ్ఞాన్ని రూపొందించి, తాను మరణించే నాటికి సుమారు 40 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులకు ఖర్చు చేసి, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయించారు. కేంద్రం ఇప్పుడు ఆహారభద్రత అంటూ ఒక చట్టం చేసి ఉండవచ్చు. కానీ వైఎస్ జీవించి ఉండగానే ఆహార భద్రత, కరువుల నివారణ అన్న రెండు లక్ష్యాలతో జలయజ్ఞానాన్ని రూపొందించాడు. కృష్ణ నీరు ప్రతి బొట్టు వినియోగం జరుగుతోంది. గోదావరి నీరు ప్రతి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల వరకు సముద్రం పాలవుతోం ది. ఆ నీటిలోని 20 శాతమైనా సద్వినియోగం చేసుకోగలి గితే కరువుసీమ ప్రజల వెతలు తీరుతాయి. కర్ణుని చావుకి కారణాలు ఎన్నో! సీమకు ఉన్న శాపాలెన్నో! చరిత్ర తెలిసి కొందరు, తెలియక కొందరు మాట్లాడుతున్నారు. వాస్తవా లను మరుగుపరచడం విజ్ఞత కాదు. సీమాంధ్ర ఎడారి కాకుండా ఉండాలంటే సమైక్య రాష్ట్రం నిలబడాలి. కుమ్మక్కులు ముంచాయి! సీల్డ్ కవర్ ముఖ్యమంత్రినని కిరణ్ కుమార్ తిరుగులేకుం డారుజువు చేసుకున్నాడు. తన జీవితంలో ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు సోనియాకు పరమ విధేయుడుగా ఉండాలి. పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా అంతే. కానీ 2014 ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపించాలంటే సమైక్యవాదులం అన్న ముసుగు తగిలిం చుకు తీరాలి. వారిద్దరూ మొదటనే రాజీనామా చేసి ఉంటే ప్రజలకు ఈ బాధలు తప్పేవి. రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు చంద్రబాబు ప్రతీకగా మారాడు. వైఎస్ అనం తర రాజకీయాలు భ్రష్టుపట్టడానికి ఈ నేతలే కారణం. రాష్ట్రం కష్టాలు, నష్టాలు ఎలా ఉన్నా రాహుల్‌గాం దీని గద్దెనెక్కించడమే ధ్యేయంగా సోనియా ఈ నాటకం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయత్నం విజయవంతమయ్యే సూచనలే లేవు. యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి ఆ పార్టీ హ్యాట్రిక్‌కు దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా. రాజకీయపార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్సీపీ 26వ తేదీన ‘సమైక్య శంఖారావం’ పూరించ బోతున్నది. ఇది న్యాయం కోసం ఆక్రోశిస్తున్న జనాల ఘోష. చరిత్రనీ, నిన్నటి త్యాగాలనీ అవహేళన చేస్తున్న వైఖరికి, పెడార్థాలు తీసే ధోరణికి జవాబు చెప్పే ప్రయ త్నం. ఇదైనా ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించాలి. - ఎన్.శివరామిరెడ్డి, మాజీ శాసన సభ్యులు -
రేపటి సమైక్య శంఖారావంకి తరలి వస్తాం గుంటూరు వాసులు