
నీళ్లు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలి: వైఎస్ జగన్
రాష్ట్రాన్ని విభజిస్తే.. నీళ్ల కోసం ఎక్కడికెళ్లాలో చంద్రబాబును, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని అడగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పత్తికొండలో సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు లేఖ ఇవ్వట్లేదని ఆయన నిలదీశారు.
మనమంతా ఒక్కటైనప్పుడే సమైక్యాంధ్ర సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో మనందరం ఒకే తాటిపై నడుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలను మనమే గెలిపించుకుందామని, అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విడగొడతారో చూడొచ్చని తెలిపారు.