pattikonda
-
Tomato Price: దారుణంగా పడిపోయిన టమాట ధర
-
‘లోకేష్, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’
కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. -
పత్తికొండ హత్య కేసులో టీడీపీ నేతే హంతకుడు
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది. ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది. అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్.. హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది. దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు. ఇప్పుడేమంటావ్ లోకేశ్? హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్సీపీ, జగన్మోహన్రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!? -
కేఈ శ్యాంబాబుకు సొంతిల్లు లేదట!
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విచారణలో ఉంది. ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు సెర్ప్ సీఈఓ, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్‌కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు. -
పడమటి ‘కొండ’లో ‘సామాజిక’ హోరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పడమటి ప్రాంతం పత్తికొండలో సామాజిక సాధికార నినాదం హోరెత్తింది. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వెల్లువలా వచ్చాయి. తరతరాలుగా మారని తమ తల రాతను సీఎం జగన్ నాలుగేళ్లలో మార్చారన్న కృతజ్ఞత ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు ప్రజలు దారికి ఇరువైపులా మేడలు ఎక్కి అభివాదం చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని వివరిస్తూ కళాకారులు పాటలు పాడారు. యువత మోటర్ సైకిల్ ర్యాలీ చేశారు. జై జగన్.. జైజై జగన్ నినాదాలు మిన్నుముట్టాయి. కర్నూలు మేయర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సాధికారత ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమైంది దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినా సామాజిక సాధికారత కోసం ఏ పార్టీ, ఏ నేతా కృషి చేయలేదని, సాధికారత చేసి చూపించింది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఈ వర్గాలవారేనని తెలిపారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు అణగారిన వర్గాల వారేనని, ఇది గతంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు. సభలో ఐక్యత చాటుతున్న ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అణగారినవర్గాలకు అందలం: మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో అణగారిన వర్గాలను అందలమెక్కించారని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ‘బీసీలలో కొన్ని కులాలకు అధికారం ఎలా ఉంటుందో తెలీదు! సర్పంచ్, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. అలాంటి కులాల వారిని కూడా ఈ రోజు చట్టసభలకు పంపుతున్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులను అణగారిన వర్గాలకు ఇస్తున్నారు. నిజమైన రాజకీయ సాధికారత ఏంటో చూపిస్తున్నారు’ అని చెప్పారు. సినిమాల్లో డైరెక్టర్ చెప్పిన రెండు ఇంగ్లిష్ మాటలు పలికే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లోని బలహీన వర్గాల పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పత్తికొండలో ఎత్తిపోతల పథకం ద్వారా 77 చెరువులకు నీరందించారన్నారు. రెవెన్యూ, పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటు చేశారని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. 14 అసెంబ్లీ స్థానాలు గెలిపించి కానుకగా ఇవ్వాలి: మంత్రి జయరాం ‘టీడీపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు మర్రిచెట్లు లాంటివి. వాటి కింద తులసి మొక్కలు మెలవవు. జగన్ వచ్చిన తర్వాత మర్రిచెట్లు కొట్టుకుపోయి, తులసి మొక్కలు మొలుస్తున్నాయి. వాల్మీకులు, కురుబ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల వారు మంత్రులుగా ఉన్నారు’ అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. జగనే లేకపోతే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మీసం మెలేసేవాళ్లమా అని అన్నారు. 2024 ఎన్నికల్లో అణగారిన వర్గాల ప్రజలందరూ సీఎం జగన్‌కి తోడుగా ఉండి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన తలరాత మార్చినందుకు ఆయనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు గెలిచి కానుకగా ఇవ్వాలని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి యాత్ర చేపట్టలేదు: మంత్రి ఉషశ్రీ చరణ్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్ మనందరినీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. అందుకే అందరమూ ఈరోజు ఎంతో ధీమాగా సాధికార యాత్ర నిర్వహిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి యాత్ర చేపట్టలేదని అన్నారు. ఒక వల, కత్తెర, ఐరన్ బాక్స్ ఇచ్చి బీసీలకు న్యాయం చేశాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారన్నారు. సీఎం జగన్ మాత్రం 139 కులాలకు వెతికి వెతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి కులగణన చేస్తున్నారని అన్నారు. -
మాట నిలబెట్టుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
మాట ఇవ్వడం.. మరచిపోవడం.. ప్రజలు గుర్తు చేసినా పట్టించుకోకపోవడం.. ఎన్నికల సమయంలో మళ్లీ అదే మాట ఇవ్వడం.. ఓట్లు అభ్యరి్థంచడం.. కొందరు ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల ‘దారి’్రద్యాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలకు ‘వారధి’ వేశారు. దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): వర్షాకాలం వచ్చిందంటే వారిలో వణుకు ప్రారంభమయ్యేది. ఊరి సమీపంలోని వాగు పొంగితే సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయేవి. పంట పొలాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అరోగ్యం బాగాలేకపోయి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది.. ఈ దుస్థితిని ఆ గ్రామ ప్రజలు ఎందరికో వివరించారు. చూద్దాం.. చేద్దాం అన్నారు తప్పితే చిత్తశుద్ధితో ఎవరూ ప్రయత్నం చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. గ్రామ ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. రూ. 6.62 కోట్ల ఖర్చు పత్తికొండ మండలం దూదేకొండ – కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవ్వేసి, రోడ్డు మ«ధ్యలో ఉన్న వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జికి రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు శ్లాబ్‌లను పూర్తి చేసి రోడ్డుకు అవసరమైన ప్రాంతాల్లో 10 కల్వర్టులను (మోరీలు) నిర్మించారు. ఈ బ్రిడ్జీ, రోడ్డు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో దూదేకొండ నుంచి కొత్తపల్లి మీదుగా పులికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమైంది. పెరగనున్న రవాణా సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు జాతీయ, జిల్లా రహదారులను అభివృద్ధి చేస్తూనే, మరో వైపు పల్లె రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ) నిధులతో జిల్లాలోని పలు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో రూ.30 కోట్ల వ్యయంతో పత్తికొండ నియోజకవర్గంలోని దూదేకొండ – కొత్తపల్లి, కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల హంద్రీ నదిపై బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఒక బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు, బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తి అయితే పది గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలను నిర్మించాలనే ప్రజల కోరికను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జీలకు మోక్షం లభించింది. మరో రెండు వంతెనలకు రూ.8.10 కోట్లతో అంచనాలు పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈఏడాది జూన్ 1వ తేదిన పత్తికొండకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ రెండు వంతెనల అంశాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తీసుకువెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి వెంటనే సమ్మతించిన నేపథ్యంలో పీఆర్ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.70 లక్షలతో కంభాలపాడు – కోయిలకొండ మార్గంలో లోలెవెల్ వంతెన, కృష్ణగిరి మండలం గోకులపాడులో రూ.7.40 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణాలకు త్వరలోనే మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయి. హంద్రీ నదిపై సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు హంద్రీ నదిపై వేగంగా బ్రిడ్జి పనులు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న హంద్రీ నదిపై రూ.24.12 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పియర్స్ పనులు పూర్తి అయ్యాయి. పియర్ క్యాప్స్, హెడ్ హారŠమ్స్ పూర్తి చేసిన అనంతరం శ్లాబ్ వేయనున్నారు. నిరీ్ణత సమయంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ... హంద్రీ నదికి ఇటు పక్క ఉన్న కృష్ణగిరి మండలంలోని బీ ఎర్రబాడు, మన్నేకుంట, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కొత్తపల్లి, రామక్రిష్ణాపురం, మల్లాపురం తదితర గ్రామాల ప్రజలకు ఉన్న రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పైగా ఈ మండలంలోని కంభాలపాడు, ఎరుకులచెర్వు తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 330 మీటర్ల పొడవుతో బ్రిడ్జి, 5.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఈ పనులను నిరీ్ణత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
చంద్రబాబు పై రైతు ఫన్నీ కామెంట్స్
-
పత్తికొండ సభకు తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకున్నాం
-
చంద్రబాబుది ఓ కాపీ పేస్ట్ బతుకు: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: గ్రామ స్థాయిలో ప్రతీ రైతన్నను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తోందని.. కానీ, చంద్రబాబు హయాంలో అలాంటి ఆలోచనల్లో ఒకటైనా ఏనాడైనా చేశాడా? అని నిలదీశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. కర్నూలు పత్తికొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. కరువు పరిస్థితులు తప్ప మరేం లేవు. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. అసలు ఆయన పాలనలో ఈ-క్రాప్ అనే మాటే లేదు. సోషల్ అడిట్ అనేది లేదు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు.. వలసలు లేవు. కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు అవుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకూ, మీ బిడ్డ పాలనకూ తేడా చూడండని ప్రజలను కోరారాయన. ► రైతుకు శత్రువు చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఆయన. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్నాడు. నిండా అన్నదాతల్ని ముంచేశాడు. మేం మాత్రం రైతన్నకు అదనపు ఆదాయం రావాలనే లక్ష్యంతో పథకాలు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ అమూల్‌ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్‌పేరుతో దోచుకున్నవారికి అడ్డుకట్ట వేశాం. అమూల్ ధర పెంచాక హెరిటేజ్ కూడా పెంచింది. దళారులు లేకుండా రైతులు పంటను అమ్ముకునే పరిస్థితి కల్పించాం. ► నమ్మిన రైతులు, పొదుపు సంఘాలు, యువత సహా అవ్వాతాతలను మోసం చేసి అప్పులపాలు జేశాడు చంద్రబాబు. ► గతంలో.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు వెటకారం చేశారు. కానీ, మీ బిడ్డ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వాళ్లే ఉన్నారు. ► రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఓ షో జరిగింది. ఆ డ్రామాపేరు మహానాడు. చంపేసిన వ్యక్తిని కీర్తిస్తూ. అదే మనిషి ఫొటోకు దండలేశారు. తానే చంపి.. తానే పూలదండలు వేస్తున్నాడు. మహానాడు సాక్షిగా జరిగిన డ్రామా ఇది. ► చంద్రబాబుకు ఒరిజినాలిటీ లేదు. పర్సనాలిటీ లేదు. క్యారెక్టర్ లేదు. క్రెడిబిలిటీ అంతకన్నా లేదు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి లేరు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు.. ఏ గడ్డైనా తింటారు. ఒక్కఛాన్స్ ఇస్తే ఏదో చేస్తా అంటున్నాడు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబిలీటీ ఉంటుంది. కానీ, చంద్రబాబు మోసంగా మార్చేశారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుతక్తులు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు. చంద్రబాబు సత్యాన్ని పలకరు.. ధర్మానికి కట్టుబడరు. విలువలు, విశ్వసనీయత రెండూ లేవు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. ► బాబు బతుకే ఒక కాపీ పేస్ట్ బతుకు, మోసం. అన్ని పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొట్టాడు. నా పాదయాత్రతో మేనిఫెస్టోను రూపొందించాం. ప్రజల కష్టాల నడుమ, పేదల గుండె చప్పుడు నుంచి మా మేనిఫెస్టో పుట్టింది. మన మట్టి నుంచి మేనిఫెస్టో పుట్టింది. కానీ, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు. అసలు మేనిఫెస్టో ఎలా పుడుతుందో చంద్రబాబుకు తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్. ► కొత్త వాగ్దానాలతో, కొంగ జపాలతో చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఒక యుద్ధం జరగబోతోంది. వీరి యుద్ధం జగన్‌తో కాదు.. పేదలతో. పేదవాడికి, పెత్తందారుడికి నడుమ యుద్ధం జరగబోతోంది. ఎల్లోమీడియా ప్రచారానికి.. ఇప్పుడు జరుగుతున్న మంచికీ యుద్ధం జరగబోతోంది. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. అందుకే చంద్రబాబు తన గజదొంగల ముఠా వెంటేసుకుని రాష్ట్రాన్ని దోచుకోవడానికి మళ్లీ వస్తున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీరికి తోడు దత్తపుత్రుడు.. వీరికి కావాల్సింది రాజకీయ పోరాటం కాదు.. అధికారం కోసం ఆరాటం. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే చంద్రబాబు ముఠా పని. చంద్రబాబు డీపీటీ(దోచుకో.. పంచుకో.. తినుకో) కావాలా? మన డీబీటీ(నేరుగా బటన్ నొక్కి సంక్షేమం అందించడం) కావాలా?.. ► మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీబిడ్డకు సైనికుల్లాగా నిలబడండి. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే. అవి ఎప్పుడూ ఉండాలనుకుంటున్నాడు. నా నమ్మకం మీరేనని గర్వంగా చెబుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: రైతులకిచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నాం -
కరువుల్లేవ్.. వలసలు తగ్గాయ్: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మధ్య మీ బిడ్డకు, మీ అన్నకు మీరు తోడుగా ఉంటున్నందుకు ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈ రోజు రైతన్నల కోసం, పొలాల్లో శ్రమించే ఆ కష్ట జీవుల కోసం పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దాదాపుగా 52.30 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు ఈ రోజు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.3900 కోట్లు జమ చేయబోతున్నాం. వరుసగా ఐదో ఏడాది– తొలివిడత సాయం.. ఈ రోజు మేనిఫెస్టోలో రైతన్నలకిచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే ప్రభుత్వంగా వైఎస్ఆర్ రైతుభరోసా– పీఎం కిసాన్ ఐదో ఏడాది తొలివిడత సాయం ఇక్కడ నుంచే విడుదల చేస్తున్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, పెట్టుబడి కోసం రైతన్న అప్పులు పుట్టని పరిస్థితి ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. చెప్పిన దాని కన్నా మిన్నగా - రైతుభరోసా... రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టారు కూడా లేని రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతులు దాదాపు 50 శాతం ఉన్నారు. అటువంటి ప్రతి రైతుకు మంచి జరగాలన్న తపనతో ప్రతియేటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాలలో రైతలు చేతుల్లో రూ.50వేలు పెడతామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. ఈ రోజు మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా... ఈ రోజు రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లు అని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతులు ఇబ్బంది పడకూడదని ఐదేళ్లు ఇస్తామని చెప్పి.. రూ.50వేలు కాకుండా రూ.67,500 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినదానికన్నా మిన్నగా.. ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా ఇచ్చే దిశగా అడుగులు వేశాం. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పై చిలుకు మంది రైతులకు.. ప్రతి రైతుకు రూ.54వేలు వైఎస్ఆర్ రైతుభరోసాగా ఆ కుటుంబం చేతిలో పెట్టాం. ఈ దఫా ఇచ్చే రూ.7,500 కలుపుకుంటే ప్రతి రైతన్న కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.61,500 ఇచ్చినట్టవుతుంది. రైతు భరోసా కింది ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయాన్ని ఐదో ఏడాది తొలివిడతగా ఈ దఫా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాలా రూ.3923 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి రైతుకు రూ.5,500 రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన రూ.2వేలు త్వరలో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. వాళ్లు ఇచ్చేది కాస్తా ఆలస్యమైనా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. మీ బిడ్డ కచ్చితంగా మే నెలలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిపిస్తూ మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ చేస్తున్నాం. ఒక్క రైతు భరోసాతోనే రూ.31వేల కోట్లు సాయం.. ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి కేవలం రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే... రూ.31 వేల కోట్లు జమ చేశాం. ఈ రోజుమరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పును మీ బిడ్డ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ సీజన్లోనైనా పంట నష్టం జరిగితే... ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పెడితే ఆ రైతన్న తన కాళ్లమీద తాను నిలబడగలుగుతాడని చెప్పి... ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. రూ. 54 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ.. ఈ సారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా, రైతన్న ఇబ్బంది పడకూడదని ఈ సంవత్సరం మార్చి, ఏఫ్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.54 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా జమ చేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా 22.70 లక్షల మంది రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్లో రైతన్నలను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రూ.1965 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం. సాగులో విప్లవాత్మక మార్పులు... మన ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు ఈ రంగంలో తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పది.. రైతు భరోసా కేంద్రాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాలంలో ఇలాంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా? రైతు భరోసా కేంద్రాల ఊసే అప్పుడు లేదు. మన ప్రభుత్వంలో గ్రామస్ధాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, చేయిపట్టుకుని నడిపిస్తూ.. 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా,అండగా ఉంటూ వారితో పాటు కలిసి అడుగులు వేస్తున్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ వీటన్నింటినీ ఒక్కచోటుకి తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది. 2014–19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నుల మాత్రమే ఉంటే... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ప్రతిఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి గమనిస్తే.. చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నుల మాత్రమే ఉంటే...మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 332 లక్షల టన్నులకు పెరిగింది. తేడా గమనించండి. బాబు పాలనంతా కరువే.. గతంలో చంద్రబాబు హయాలంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే.. కరువు. బాబు హయాలంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలు కరవు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అప్పట్లో 1623 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరవు మండలాలుగానే ఉండేవి. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడిదయతో మంచి వానలు పడ్డాయి. కరువులు లేవు. వలసలు కూడా తగ్గాయి. నాటికీ – నేటికీ తేడా చూస్తే... దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగింది. గతంలో చంద్రబాబు పాలనలోని ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద రుణాల మీద 40.60 లక్షల మంది రైతన్నలకు కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందిస్తే.. మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీ కింద రూ.1835 కోట్లు ఇచ్చాం. 74 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద ఇవ్వకుండా పెట్టిన బకాయిలు సైతం మీ బిడ్డ హయాంలో చిరునవ్వుతో చెల్లించాం. గతంలో చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతులకు కేవలం ఐదేళ్లలో రూ.3411 కోట్లు పంటల బీమా కింద ఇస్తే... మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో మాత్రమే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో 44లక్షల మంది రైతన్నలకు రూ. 6685 కోట్లు బీమాగా చెల్లించాం. ఈ సంవత్సరం కూడా నిరుడు ఖరీప్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా జూలై 8, (నాన్నగారి పుట్టిన రోజు) వైఎస్ఆర్ జయంతి రోజున జమ చేయనున్నాం. ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమయం కట్టాల్సిన అవసరం లేకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా, పూర్తిగా బీమా ప్రీమియం కూడా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే. మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇ–క్రాప్ బుకింగ్ జరుగుతుంది. రైతుల పేరులన్నీ సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో డిస్ప్లే చేస్తున్నారు. గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీ బిడ్డ హాయంలోనే జరుగుతున్నాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో ఇ– క్రాప్ అనే మాటే లేదు. ఆర్బీకే అన్న మాటే లేదు. సోషల్ ఆడిట్ కింద మొత్తం జాబితా పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా గమనించండి. ధాన్యం సేకరణలో నాడు– నేడు మరోవైపు ధాన్యం సేకరణ మీద కూడా గతానికి ఇప్పటికి ఉన్న తేడా గమనించండి.గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో సేకరించిన మొత్తం ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే, మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సేకరించిన ధాన్యం మొత్తం 3.09 కోట్ల టన్నులు. ఇంకా రబీలో సేకరణ జరుగుతుంది. ఎన్నికల్లోగా మరో ఏడాది ధాన్యం సేకరణ మళ్లీ జరుగుతుంది. గతంతో పోలీస్తే.. అప్పుడు ఏటా సగటున 53 లక్షల టన్నుల సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఇవాళ సగటున ఏటా 75 లక్షల టన్నుల సేకరిస్తున్నాం. ధాన్యం సేకరణపై గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఇప్పటికే రూ.60వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేశాం. రబీ పూర్తి కాలేదు. ఐదేళ్లకు ఇంకా మరో ఏడాది పెండింగ్ ఉంది. అది కూడా కలుపుకుంటే కనీసం రూ.77వేల కోట్లు అవుతుంది. తేడా మీరే చూడండి. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు విత్తనాలు దగ్గర నుంచి ఎరువులు వరకు నకిలీలు గుర్తించే విషయంలోనైనా, భూసార పరీక్షలు చేసే విషయంలోనూ, గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజవర్గస్ధాయిలో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు కనిపిస్తున్నాయి. 2 జిల్లా స్ధాయి ల్యాబ్‌లు, మరో 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు కడుతున్నాం. మరో 11 జిల్లా స్ధాయి ల్యాబ్స్ నిర్మాణం మొదలయ్యింది. ఆర్బీకే స్ధాయిలో కూడా సీడ్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ దిశగా అడుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీకేలు గ్రామ స్ధాయిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే... మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. రైతన్నలకు పంట ఎంత ముఖ్యమో.. భూమిమీద సర్వహక్కులు కూడా వారికి అంతే ముఖ్యం.వందేళ్లక్రితం బ్రిటీష్ హయాంలో భూసర్వే జరిగితే... ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్ధాయిలో సరిహద్దు రాళ్లు లేవు. గ్రామస్ధాయిలో సబ్‌డివిజన్ అప్డేట్ కార్యక్రమం కూడా జరగలేదు. భూవివాదాలు గ్రామాల్లో మన కళ్లెదుటనే కనిపిస్తున్నా.. పరిష్కారం రాని పరిస్థితులలో రైతులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వంగా.. వీరికి మంచి జరగాలని మన ప్రభుత్వం హయాంలో వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులు నిర్ణయించి, సర్వేరాళ్లను పాతించి, రికార్డులన్నీ అప్డేట్ చేయించి, వివాదాలకు ఏమాత్రం తావులేకుండా రైతన్నల చేతిలో భూహక్కు పత్రాలను పెట్టే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు... గ్రామ సచివాలయాలన్నింటిలోనూ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ అక్కడే జరగాలన్న ఆలోచనతో.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వహక్కులు వారికి ఇప్పించాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూముల మీద, బ్రిటీష్ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వ హయాలంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద సర్వహక్కులూ రైతులకు ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనది. 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ కోసం.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకూడదని, పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే. రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే.. రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫీడర్లను బలపరుస్తే తప్ప ఉచిత విద్యుత్ ఇవ్వలేమంటే మీ బిడ్డ హయాంలో ఆ ఖర్చు కూడా చేసి ఫీడర్లను బలపర్చే కార్యక్రమం చేశాం. ఆక్వా సాగుకు సాయంగా.... ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటివరకూ ఈ ఆక్వా రైతులకు మంచి చేస్తూ.. వాళ్లందరి తరపున నిలబడి వారికి రూ.2967 కోట్ల సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరించింది. దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కరవుసీమగా పేరున్న రాయలసీమ కూడా కళకళలాడుతుంది. రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఎప్పుడూ ఊహకందని విధంగా పెరిగాయి. రైతన్నలకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి, రైతన్న వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, వ్యవసాయం మీద వచ్చే ఆధాయానికి అదనంగా ఇంకా ఆధాయం రావాలని చెప్పి వారికి తోడుగా నిలబడుతూ.. అక్కచెల్లెమ్మలకు మరో నాలుగు రూపాయలు అదనంగా రావాలన్న తపనతో అమూల్‌ను తీసుకొచ్చి, రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన అమూల్‌ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం. అమూల్– పాడి రంగంలో మార్పులు.. అమూల్ ఇక్కడకు వచ్చింది కాబట్టి.. అంతకముందు దోచుకుంటున్న హెరిటేజ్ వంటి పాలడెయిరీలన్నీ తలవంచి పాడిరైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్ వచ్చేనాటికి ఇప్పటికీ పాలధరల్లో తేడా చూస్తే... అమూల్ వచ్చిన తర్వాత నాలుగు సందర్భాలలో ధరలు పెంచుకుంటూ పోయింది. లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు ధర అమూల్ పెంచింది. దీంతో హెరిటేజ్ వంటి పాలడెయిరీలు కూడా రేటు పెంచకతప్పనిసరి పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. మీ బిడ్డ హయాంలో ఆర్బీకే స్ధాయిలోనే ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అన్నది పోస్టర్లు ద్వారా డిస్ప్లే చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్ధతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మార్కెట్లో పోటీ పెరిగి ఈ రోజు ప్రతీ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర ఆర్బీకే స్దాయిలోనే వచ్చేట్టు, దళారులు లేకుండా అమ్ముకునే కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతోంది. మూగజీవాల కోసమూ... పశునష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్‌ఫాం రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలుచేసి.. తద్వారా అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడ్డాం. వైఎస్ఆర్ పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు సైతం 340 ఆంబులెన్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో యానిమల్ డిసీజెస్ డయాగ్నొస్టిక్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయి. చంద్రబాబు పెట్టిన బకాయిలూ చెల్లించాం... చివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. అప్పట్లో చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ మన ప్రభుత్వమే చెల్లించింది. రూ.8845 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన విద్యుత్ బకాయిలునూ రైతన్నల కోసం మన ప్రభుత్వమే చెల్లించింది. ఫామ్ మెకనైజేషన్ అన్నది ఎప్పుడూ జరగని విధంగా చేస్తున్నాం. గతంలో ఎవరికిచ్చామో, ఎందుకిచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విధానం తీసుకొచ్చాం. ఫామ్ మెకనైజేషన్... ప్రతి ఆర్బీకే స్దాయిలో ఒక సీహెచ్‌సీ(కమ్యూనిటీ హైరింగ్ సెంటర్‌ను) స్ధాపించాం. ప్రతి ఆర్బీకే స్దాయిలోనూ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫామ్ మెకనైజేషన్ కోసం రూ.1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికాలను ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఆర్బీకే స్ధాయిలో రైతులు ఒక గ్రూప్ కింద ఏర్పడి వారు కేవలం 10 శాతం చెల్లిస్తే.. 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరో 50 శాతం రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఆర్బీకే స్ధాయిలోనే దాదాపు రూ.15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న రైతులు ఆ వ్యవసాయ ఉపకరణాలను మిగిలిన రైతులకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి వారికి మేలు జరిగే విధంగా ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఇప్పుడు అర్ధవంతంగా సాగుతుంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్ధాయిలోనే డ్రోన్లు తీసుకువచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ మన రైతులే డ్రోన్లు ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా.. బాధ్యతతో, రైతుల మీద మమకారంతో చేసాం. నేరుగా రైతులకిస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతుకు మేలు జరిగేటట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా పేద కుటుంబాలన్నింటికీ వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తున్నాం. రైతుల కోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మనది అయితే.. మరోవంక రైతుకు శత్రువైన చంద్రబాబు నాయుడుని చూడండి. సాగు దండగన్న బాబు... వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమవుతాయని చెప్పాడు. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి, పొరపాటున ఓటు వేసిన రైతులను చంద్రబాబు నిలువుగా ముంచాడు. రాజమండ్రిలో డ్రామా షో... నిన్నకాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామ కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. మహానాడు అని చెప్పి ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అందులో 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని .. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, శకపురుషుడని, ఆ మనిషి రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండ వేశారు. మహానాడులో సాక్షాత్తుగా జరుగుతున్న డ్రామా ఇది. ఆ మహానాడు డ్రామాకు మందు వీళ్లంతా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటంటే... తమ పార్టీ ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ముందే ప్రకటించారు. మేనిఫెస్టోను ఆకర్షణీయమైన అని సంబోంధించి ప్రకటించడం..నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యమనిపించింది. ఈ మాట వింటే కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకువస్తాయి. పూతన, మారీచుడు, రావణుడు కలిసి చంద్రబాబులా... పసిపిల్లవాడైన కృష్ణుడుని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెపుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగా మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకువచ్చింది. అందమైన మాయ లేడీ రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్ మార్చుకుని భవతీ భిక్షాందేహీ అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. ఈ ముగ్గురు ఆత్మలూ కలిసి, ఈ మూడు క్యారెక్టర్లూ కలిపి మన ఏపీలో ఒక మనిషిగా నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి జన్మించాడు. బాబు – విలువలు, విశ్వసనీయత లేని క్యారెక్టర్.. మేనిఫెస్టో పేరుతో ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు. వాగ్ధానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారి క్యారెక్టర్ ఏమిటంటే ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు, విశ్వసనీయత అçసలే లేవు. తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీరామారావునైనా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనుకాడడు. చంద్రబాబు పొలిటిలక్ ఫిలాసపీ ఏమిటంటే... ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. మేనిఫెస్టోను చూపిస్తూ.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెపుతూ.. దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతారు. అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందన్నది బాబుకు తెలుసా ? మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందో ఈ పెద్ద మనిషికి అవగాహన ఉందా ? మన మేనిఫెస్టో... ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర, పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారిæ గుండెచప్పుడుగా పుట్టింది. మన రైతులు, మన పేదలు, నా అక్కచెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాలు నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం, వారికి మంచి భవిష్యత్ చూపించడం కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. బాబు మేనిఫెస్టో – బిసిబెళ బాత్... చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదు. వారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి.. ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజీపీ కాంగ్రెస్ రెండూ ఎదురెదురుగా తలపడి, రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక బిసిబెళ బాత్ వండేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అంతటితో సరిపోదు అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, చేయూత, రైతుభరోసా మన పథకాలన్నీ కలిపేసి ఇంకో పులిహోర వండేశాడు. వైయస్సార్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలూ కాపీ, బీజీపీ పథకాలూ కాపీ, కాంగ్రెస్ పథకాలూ కాపీ. చివరకు బాబు బ్రతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీలేదు. కేరెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంత కన్నా లేదు. పోటీ చేసేందుకు ఈపెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది కేండిడేట్లు కూడా లేని పార్టీ ఇది. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ... మైదానాల్లో మీటింగ్‌లుపెడితే జనం రారని, మనుషులు చనిపోయినా ఫర్వాలేదని ఇరుకైన సందులు, గొందులు వెదుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబు పార్టీ. జనంలో లేని బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే వీళ్ల పార్టీ ఫిలాసపీ. ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి – బాబు 1995లోనే సీఎం అయ్యి కూడా... సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఎన్నికలు మరలా వస్తుంటే... ఈ పెద్ద మనిషి ఏం అడుగుతాడంటే.. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా. మరో ఛాన్స్ ఇవ్వండి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోటిలోనుంచి మాటలు రావు. డీబీటీ రూపంలో మీ ఇంటికి ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇళ్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని, గ్రామానికి మంచి చేశానని, పిల్లలకు ఈ మంచి చేశానని కనీసం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకునే చరిత్రలేని వ్యక్తి చంద్రబాబు ఆయన పార్టీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు.. కానీ చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేని పరిపాలన ఆయన హయంలో సాగింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్ల ముందు నిలబడి మీ ఇంటికి ఈ మంచి చేశానని చెప్పలేని బాబు, సామాజిక వర్గాల ఎదురుగా నిలబడి మీకు ఈ మాట ఇచ్చి, నెరవేర్చా అని చెప్పలేని ఈ బాబు, ఏం చేశాడో తెలుసా ? నమ్మిన రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, యువతను, అవ్వాతాతలని అందరినీ హోల్‌సేల్‌గామోసం చేశాడు. అందరికీ అప్పులు పాలుజేసి, నట్టేట ముంచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. చంద్రబాబు –మొదటి సంతకమే మోసం మామాలుగా ఎవరైననా ముఖ్యమంత్రి అయ్యి.. మొదటి సంతకం చేస్తే దానికి క్రెడిబులిడీ ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొదటి సంతకాలనే మోసం, వంచన, దగాగా మార్చి.. మరోసారి మళ్లీ కొత్త వాగ్ధానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలెట్టాడన్నది గమనించండి. మంచి చేయడం అన్నది చంద్రబాబు డిక్షనరీలో లేనేలేదు. ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయడం, ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి.. నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం, సత్తా ఈ మనిషి డిక్షనరీలోనే లేవు. చంద్రబాబు నాయుడు ఆయన గజదొంగల ముఠాలో వారికి తోడుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్లు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. వీరిది అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకంటే... దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకుని తినడానికి. పేదలకు– పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం... రాబోయే రోజుల్లో ఎన్నికల్లో యుద్ధం జరగబోతుంది. ఈ కురుక్షేత్రంలో.. యుద్దం జరగబోతున్నది వారు దోచుకోవాడనికి, పంచుకోవడానికి, తినడానికి మధ్య... మన ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకివెళ్లే కార్యక్రమం (డీబీటీ) మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారీ డీపీటీ కావాలో.. మీ బిడ్డ బటన్ నొక్కే డీబీటీ కావాలో ఆలోచన చేయండి. ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు పెత్తందారీ భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్దం జరుగుతుంది. రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదు... ఇక్కడ పేదవాడు మనవైపు ఉంటే.. అటువైపు ఉన్న పెత్తందార్లతో యుద్దం జరుగుతుంది. వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్దం జరుగుతుంది. ఒకవైపు మీ బిడ్డ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే మాట ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ నోట నుంచి వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలోని కేబినెట్లో ఈ రోజు 65 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కనిపిస్తారు. మీ బిడ్డ హయాంలో 5 గురు డిప్యూటీ సీఎంలు ఉంటే వారిలో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ సోదరులే కనిపిస్తారు. ఒకవైపు మీ బిడ్డ హయాంలో ప్రతి అడుగులోనూ నా అనే మాట వినిపిస్తుంది. చంద్రబాబు మాత్రం... కానీ అటువైపున మాత్రం ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న మాట వినిపిస్తుంది. బీసీల తోకలు కత్తరిస్తా అని అప్పట్లో వెటకారం చేసిన మాటలు వినిపిస్తాయి. చివరకి అక్కచెల్లెమ్మలను సైతం వదలకుండా... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా ? అని వెటకారం చేసిన మాటలుకనిపిస్తాయి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు.... మీ బిడ్డ హయాంలో మనం చేసిన, కనిపిస్తున్న మంచికి మధ్య యుద్దం జరుగుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. వీరిది ఈ రోజు జగన్‌తో కాదు యుద్ధం, పేదలతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా నిలబడకపోవచ్చు. ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు. మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను మాత్రమే. నా ధైర్యం మీరే... నేను గర్వంగా చెప్తున్నాను. నా నమ్మకం మీరు. నా ధైర్యం మీరు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. వాళ్లు చెప్తున్న అబద్దాలను నమ్మకండి. వారు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ?లేదా ? అన్నదానిని మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు రాష్ట్రం పట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నలు ముఖాల్లో చిరునవ్వులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదీ చదవండి: 63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు -
Live: పత్తికొండలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
మన మట్టి నుంచి పుట్టిందే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో: సీఎం జగన్
Updates.. ► బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం జగన్ ► బాబు బతుకే కాపీ, మోసం. చంద్రబాబుకు క్యారెక్టర్, క్రెడిబిలిటీ లేవు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లేని పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ టీడీపీ. పొత్తుల కోసం ఎలాంటి గడ్డికరవడానికైనా సిద్దపడే పార్టీ టీడీపీ. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలగలిపిన పార్టీ టీడీపీ. ► మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. ఎవరికైనా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. గజ దొంగల ముఠా, చంద్రబాబుది అధికారం కోసం ఆరాటం. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికే వీరి పోరాటం. ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదు. ► రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది. చంద్రబాబు డీపీటీ కావాలా.. మన డీబీటీ కావాలా?. పేదవాడికి, పెత్తందారుడికీ మధ్య యుద్ధం జరుగుతోంది. మీ బిడ్డ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు. గతంలో ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని వెటకారం చేశారు. ► చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారానికి, ఇప్పుడు జరుగుతున్న మంచికీ మధ్య యుద్దం. వీరి యుద్ధం జగన్‌తో కాదు పేదలతో. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడి దయ, మీ చల్లని దీవెనలు మాత్రమే. ► నా నమ్మకం మీరేనని గర్వంగా చెబుతున్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా నిలబడండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ చల్లని దీవెనెలు ఎప్పుడూ ఉండాలి. ► ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తొస్తాయి. చంద్రబాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే కర్నూలు గుర్తొచ్చేది. తన హయాంలో కర్నూలుకు 10కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ► లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.80కోట్లు కేటాయిస్తున్నాం. టామోటా ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ.10కోట్లు కేటాయిస్తున్నాం. ► మేనిఫెస్టో ఎలా తయారవుతుందో బాబుకు తెలుసా?. నా పాదయాత్రలో ప్రజల కష్టాల నడుమ మేనిఫెస్టో పుట్టింది. పేదవాడి గుండె చప్పుడు నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. ► చంద్రబాబు మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది. కర్ణాటక రెండు పార్టీల మేనిఫెస్టోతో బిస్మిల్లా బాత్ వండేశాడు. అన్ని పార్టీల పథకాలు కాపీ చేసేసి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మన పథకాలను కాపీ కొట్టేసి పులిహోర కలిపేశాడు. ► కరువు సీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోంది. రిజర్వాయర్లు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. రైతన్నకు అదనపు ఆదాయం రావాలన్న లక్ష్యంతోనే పథకాలు తీసుకొచ్చాం. ► ప్రపంచలోనే ప్రముఖ కంపెనీ అమూల్‌ను తీసుకొచ్చాం. గతంలో హెరిటేజ్ పేరుతో దోచుకున్న వారికి అడ్డుకట్ట వేశాం. అమూల్ ధర పెంచాక హెరిటేజ్ కూడా ధర పెంచింది. ► రైతుకు శత్రువైన చంద్రబాబు అన్నదాతను ముంచేశాడు. రాజమండ్రిలో డ్రామా కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. ఆ డ్రామా పేరు మహానాడు. ► వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు. ► తానే చంపేసిన మనిషికి మళ్లీ తానే పూల దండలు వేస్తున్నారు. ► చంద్రబాబు మరోసారి మోసపూరిత మేనిఫెస్టోతో వచ్చాడు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత అసలే లేవు. చంద్రబాబు సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట నిలబడడు. చంద్రబాబును చూస్తే మారీచుడు, రావణుడు గుర్తుకొస్తారు. ► చంద్రబాబు హయాంలో ఈ-క్రాప్ లేదు, సోషల్ ఆడిట్ లేదు. ►సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే జరుగుతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మీ గ్రామానికే తీసుకొచ్చే అడుగులు పడుతున్నాయి. ► చుక్కల భూములపై సర్వ హక్కులు రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనదే. ఆక్వారైతులకు మేలు చేసిన ప్రభుత్వం కూడా మనదే. ► రైతులకు పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్. రూ.1700 కోట్లతో ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ► చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే. టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవు. ► గడిచిన నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత మంచి వానలు ఉన్నాయి. ► గత ప్రభుత్వ పాలనకు, మీ బిడ్డ పాలనకూ మధ్య తేడా చూడండి. మహానేత వైఎస్సార్ జయంతి రోజున ఇస్క్యూరెన్స్ కూడా జమ చేస్తాం. ► ప్రతీ రైతన్నకు ఇప్పటికే రూ.54వేలు చొప్పున అందించాం. ఇప్పుడు అందిస్తున్న రైతు భరోసాతో కలిపితే ప్రతీ రైతన్న ఖాతాలో రూ.61,500 జమ. ► ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రూ. 31వేల కోట్లు జమ. ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ. ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా?. ► రాష్ట్రంలో ఆహారధాన్యాల దిగుబడి పెరిగింది. ఉద్యానవన పంటల దిగుబడి 332 లక్షల టన్నులకు పెరిగింది. ► సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను. ► బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటాను. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నాం. ► రైతులు ఇబ్బంది పడకూడదనే పెట్టుబడి సాయం అందిస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు జరిగింది. ► మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రూ.12,500కి బదులుగా ఏడాదికి రూ.13,500 రైతు భరోసా అందిస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో లబ్దిదారులు మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. పంట బీమా అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. రైతు భరోసా కేంద్రాలతో ఎంతో మేలు జరిగింది. ►ఎమ్మెల్యే కొంగటి శ్రీదేవి మాట్లాడుతూ.. పత్తికొండ ప్రజల తరఫున సీఎం జగన్‌కు స్వాగతం. ► వైఎస్సార్ అడుగుజాడల్లో జగనన్న రైతులకు అండగా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చినా సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ► బడుగు బలహీన వర్గాల ఆశాదీపం సీఎం జగన్. ప్రజల గుండెల్లో జగనన్న సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన జననేత సీఎం జగన్. పాలనలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ► వేదిక వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ నివాళులు. ► సీఎం జగన్ పత్తికొండ చేరుకున్నారు. ► కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ► 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నాలుగేళ్లలో రూ.30,985.31 కోట్ల పెట్టుబడి సాయం ► వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు. ► 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది. ► 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు. -
అయ్యో.. అయ్యయ్యో.. బాబూ!
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో ‘అధికార దాహం’ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రజల సానుభూతి కోసం ఎంతగా వెంపర్లాడుతున్నాడంటే.. ఎమోషనల్ డ్రామాకు తెర తీస్తున్నారు. కర్నూల్ పత్తికొండ పర్యటనలో ఇదే తనకు చివరి ఎన్నిక అంటూ ప్రకటించి.. పక్కనే ఉన్న సొంత పార్టీ నేతలనే నివ్వెరపోయేలా చేశారు. అందుకే కర్నూల్ పర్యటనలో చంద్రబాబుకు జనం చుక్కలు చూపించారు. తనకు అవమానం జరిగిందని, మీరు(ప్రజలను ఉద్దేశించి..) గెలిపించి అసెంబ్లీకి పంపితే సరేనని, 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే నాకు ఆఖరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం చంద్రబాబు ప్రతీ మాటలోనూ కనిపించింది. అన్ని వర్గాలకు సంక్షేమం అత్యంత పారదర్శకంగా అందుతుండడం, ప్రభుత్వానికి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుండడం.. ముఖ్యంగా టీడీపీ గత ఎన్నికల్లో నెగ్గిన 23 స్థానాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం, చొరవ తీసుకుని అభివృద్ధి చేయిస్తుండడం యెల్లో బ్యాచ్‌కి మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితితో చంద్రబాబుకు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆశలు సన్నగిల్లితున్నట్లు అర్థమయింది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో పూర్తిగా అవగతం అయ్యింది. ఇక ఒక అడుగు ముందుకేసి.. ఆయన నియోజకవర్గమూ మారతారనే ప్రచారం, అదీ టీడీపీలోనే జోరుగా సాగుతుండడం గమనార్హం. అందుకే కొత్తగా చివరి ఎన్నిక అంటూ ప్రకటనలు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అందుకే ఇలా భావోద్వేగమైన ప్రకటనలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అఫ్కోర్స్.. ఆ ప్రకటనలకు జనాల నుంచి లభించిన స్పందన పెద్దగాఏమీ లేదు. తమ నాయకుడే ఇలా ధైర్యం కోల్పోతే.. ఇక తమ పరిస్థితి ఏంటని అనుకుంటేనే చంద్రబాబుపై జాలి, మరోవైపు పార్టీ పరిస్థితి ఇలా అయ్యిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకోవద్దన్న ప్రజలు.. ముందు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. తొలుత చంద్రబాబు కాన్వాయ్ పత్తికొండకు చేరుకోగానే అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. గో బ్యాక్ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇలా దొంగ డ్రామాలు ఆడుతూ.. తప్పుడు స్టేట్మెంట్లతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు నిరసన సెగలు తగలడం మాత్రం ఆగట్లేదు!. -
చంద్రబాబుకు చుక్కెదురు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు బుధవారం పత్తికొండలో చుక్కెదురైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన కర్నూలు, కోడుమూరు, దేవనకొండ మీదుగా పత్తికొండకు చేరుకున్నారు. దేవనకొండలో విద్యార్థి, ప్రజాసంఘాల సంఘాల నేతలు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకొని కాన్వాయ్‌ను ముందుకు పంపారు. పత్తికొండకు చేరుకోగానే స్థానికులు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ బాబు.. రాయలసీమ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులే సీఎం పని: బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పత్తికొండలో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయిస్తారో తెలియడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బాబు వెంట కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ, వైకుంఠం మల్లికార్జునచౌదరి, కేఈ శ్యాంబాబు, గౌరు చరితారెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి ఉన్నారు. ఈసారి అధికారంలోకి రాకపోతే ఇవే నాకు ఆఖరి ఎన్నికలు 2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే, తనకు ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. -
రాయలసీమ ద్రోహి గోబ్యాక్.. చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు జిల్లా: పత్తికొండలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. హైకోర్టును అడ్డుకుంటున్న ద్రోహి అంటూ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా, కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ ఆయన మండిపడ్డారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
కుట్ర భగ్నం: ఫ్యాక్షన్ మంటను చల్లార్చిన పోలీసులు
పత్తికొండ టౌన్ / తుగ్గలి: జిల్లా ఫ్యాక్షన్ జోన్ పోలీసులు ఓ వ్యక్తి హత్య కుట్రను భగ్నం చేశారు. తుగ్గలి మండల కడమకుంట్ల గ్రామానికి చెందిన ఊటకంటి అమరనాథరెడ్డిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు సుఫారీ ఇచ్చారు. పక్కా సమాచారంతో రెండురోజుల కిందట ఫ్యాక్షన్ జోన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం పత్తికొండ పోలీసు స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. 1998లో కడమకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు ఊటకంటి లక్ష్మీకాంతరెడ్డి, విశ్వనాథశర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హనిమిరెడ్డితో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. ఈ హత్యలకు ప్రతీకారంగా 2011లో పగిడిరాయి కొత్తూరు సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద హనిమిరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీ అయినా పాతకక్షలు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో ఆరు నెలల కిందట లక్ష్మీకాంతరెడ్డి కుమారుడు రాంభూపాల్‌రెడ్డిపై హనిమిరెడ్డి కుమారుడు అమరనాథరెడ్డి పత్తికొండ సమీపంలో జీపుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడని పత్తికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనల నేపథ్యంలో అమరనాథ్‌రెడ్డిని అంతమొందించేందుకు ప్రత్యర్థులు కుట్రపన్ని చివరకు పోలీసులకు చిక్కారు. రూ. 4 లక్షలకు సుఫారీ.. అమరనాథ్‌రెడ్డిని హత్య చేసేందుకు హనిమిరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడమకుంట్ల బొగ్గుల సుధాకర్‌తో పాటు సురేష్, సోమశేఖరరాజు కుట్ర పన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకలపెంటకు చెందిన ఎద్దుల వీరాంజినేయులుతో రూ. 4 లక్షలకు సుఫారీ మాట్లాడారు. ఈ మేరకు రూ. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. కాగా నెలలు గడుస్తున్నా పని పూర్తిచేయక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరాంజినేయులుపై సుధాకర్ ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం నిఘా వర్గాలకు తెలియడంతో ఫ్యాక్షన్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన వీరాంజినేయులతో పాటు సుధాకర్, సురేశ్, సోమశేఖరరాజును అదుపులోకి విచారణ చేశారు. సోమవారం నిందితులను పత్తికొండ కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సోమ్లానాయక్, జొన్నగిరి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న కడమకుంట్ల గ్రామంలో ఈ ఘటన అలజడి రేపింది. -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి వివాహా వేడుక రాగ మయూరి రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్యతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ బయల్దేరారు. కాగా అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. -
అరుపులుండవ్.. మెరుపు దాడులే
అవి సాదాసీదా శునకాలుగానే ఉంటాయి. అంతకుమించి విశ్వాసమూ ప్రదర్శిస్తాయి. అరుపులు వాటికి చేతకావు. అనుమానమొస్తే అమాంతం దాడి చేసి.. ప్రతాపం చూపిస్తాయ్. గ్రామ సింహాల మాదిరిగా కనిపిస్తూ.. చిరుత రాజసాన్ని ప్రదర్శించే పందికోన శునకాలకు చాలా ప్రత్యేకతలున్నాయి. చిరుత పులితో క్రాస్ బ్రీడింగ్ వల్ల కలిగిన సంతానంగా చెప్పే ఈ శునకాలు పోలీస్ శాఖలో నూ సేవలందిస్తున్నాయి. పత్తికొండ: కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. మూగజీవాలకు రక్షణగా.. పంటలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను సైతం తరిమేస్తాయి. పౌరుషానికి మారుపేరుగా నిలిచే ఈ శునకాలు పోలీస్ శాఖలో చేరి పలు కేసులను కూడా ఛేదించాయి. పౌరుషం, గాంభీర్యం, వేటాడే తత్వం వీటి సొంతం. పాలెగాళ్ల కాలంలో.. పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో భారీ కొండల మధ్య ఉండే దట్టమైన అరణ్యం నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. ఆ క్రమంలో గ్రామంలోని సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించగా.. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తదనంతర కాలంలో ఆ చిరుత, గ్రామ సింహాల సంపర్కం వల్ల ఆడ శునకాలకు చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాలుగా పేరొచ్చిందని గ్రామానికి చెందిన రంగప్పరాజు, గువ్వల రంగస్వామి చెప్పారు. దొంగల్ని ఇట్టే పట్టేస్తాయి పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు పందికోన శునకాలను వినియోగిస్తున్నారు. మృగాల వాసన పసిగట్టి వాటి బారినుంచి ఈ శునకాలే పశువుల్ని రక్షిస్తాయని, అవసరమైతే మృగాలను వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను గుర్తించి నిలువరించడం.. దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఈ శునకాలు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ ఎగుమతి అయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ బృందం 37 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. కొన్నేళ్లుగా కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని తీసుకెళ్లి పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, కొందరు గృహ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరచూ గ్రామానికి వచ్చి వీటిని తీసుకెళుతుంటారని గ్రామస్తులు తెలిపారు. పేర్లు పెట్టి.. వాతలు వేస్తారు పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉండగా.. 1,500కు పైగా శునకాలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక శునకం కనిపిస్తుంది. కొందరైతే రెండు, మూడింటిని పెంచుతుంటారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆడ కుక్కలకు ఇందిరమ్మ, ఇందిరమ్మబీ, మగ కుక్కలకు రాముడు, భీముడు, రాజు వంటి పేర్లుంటాయి. చిన్న వయసులోనే వీటి దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా పంట ఉత్పత్తులు, గొర్రెలకు ఇవి కాపలాగా ఉంటాయని గ్రామానికి చెందిన సిద్ధప్ప, బుల్లేని ఆదినారాయణ చెప్పారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం ఆరగిస్తాయి. జొన్న రొట్టెలు, చికెన్, మటన్ ఎంతో ప్రీతిగా తింటాయి. పంటల్ని నాశనం చేయడానికొచ్చే అడవి పందుల్ని వేటాడి భుజిస్తాయి. వీటి ప్రత్యేకత తెలుసు గానీ.. పందికోన కుక్కల గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. వీటి ప్రత్యేకతలు తెలుసు. చిరుత పులి, కుక్కల సంపర్కం వల్ల చిరుత లాంటి ఈ శునకాలు జన్మించాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత అనేది చెప్పలేం. వీటికి పౌరుషం ఎక్కువ. మొరగకుండా దొంగల్ని పట్టేస్తాయ్. – లక్ష్మీప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ గొర్రెలకు ఇవే కాపలా నాకు 180 గొర్రెలున్నాయి. ఎప్పుడు అడవి పందులు దాడి చేస్తాయో తెలీదు. అలాంటప్పుడు ఈ కుక్కలే నాకు సహాయంగా ఉంటాయి. నేను భోజనానికి వెళ్తే ఇవే కాపలా ఉంటాయి. కొత్త వ్యక్తులు, దొంగలు, అడవి పందులను దరిదాపుల్లోకి రానివ్వవు. – కోదండ రాముడు, గొర్రెల యజమాని డిస్కవరీ ప్రతినిధులు వస్తుంటారు ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్ ప్రతినిధులు మా గ్రామానికొచ్చి శునకాలను పరిశీలించి వెళుతుంటారు. వీటి పనితీరును పరిశీలించడానికి ఓసారి అమెరికన్లు మా పొలానికి వచ్చి రాత్రంతా పొలంలోనే ఉన్నారు. అదే సమయంలో అడవి పంది రావడంతో మా కుక్క దానిని వెంటాడి.. వేటాడి చంపేయడం చూసి ఆశ్చర్యపోయారు. – బోయ ఆదినారాయణ, రైతు -
'అందుకే నా భర్తను హత్య చేశారు'
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైఎస్సార్సీపీ నాయకుడు, తన భర్త నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించిన విషయం నారాలోకేష్ తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలే దాడి చేసిన విషయం లోకేష్ మరవడం సిగ్గుచేటని విమర్శించారు. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.1,550 ప్రభుత్వానికి చలానా కట్టి దాంతో డూప్లికేట్ సృష్టించి రోజుకు 70 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నెలకు రూ.21 లక్షలు చొప్పున దండుకున్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మండల కన్వీనర్లు బజారప్ప, జిట్టా నాగేశ్, వైఎస్ఆర్సీపీ నేతలు రామచంద్ర, రహిమాన్, పల్లె ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో ప్రసిడెంట్ అట్లా గోపాల్ రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు బద్రయ్య, నేత్రజిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
తహసీల్దార్ ముందు జాగ్రత్త!
పత్తికొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి తన చాంబర్లో అడ్డంగా తాడు కట్టించి.. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలికి ఎవర్నీ అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ హడావుడి చూసి కార్యాలయ సిబ్బందితో పాటు వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై తహసీల్దార్‌ను విలేకరులు వివరణ అడగ్గా.. ‘మా జాగ్రత్త మేం తీసుకోవాలి కదా’ అన్నారు. -
టమాటా రైతుకు సీఎం బాసట
రాష్ట్రంలో టమాటా మార్కెట్‌కు ఆ ప్రాంతం పెట్టింది పేరు.. కొద్ది రోజులుగా ధర కూడా బాగానే ఉంది.. రోజూ లాగే పెద్ద ఎత్తున రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు.. పంట ఎక్కువగా రావడం చూసిన దళారులకు కన్ను కుట్టింది.. వారి కనుసైగలతో నిమిషాల వ్యవధిలో ధర భారీగా పడిపోయింది.. అందరి నోటా ఒకే మాట.. వారు చెప్పిన ధరకే సరుకు అమ్ముకుని పోవాలని హుకుం.. నిశ్చేషు్టలవ్వడం రైతుల వంతైంది.. ఏం చేయాలో పాలుపోక తర్జనభర్జన పడ్డారు.. అంతలో విషయం సీఎం దాకా వెళ్లింది. ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించి సరుకు కొనుగోలు చేయాలంటూ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు.. కిలోకు రూ.4 అధికంగా ఇచ్చి కొనుగోళ్లు మొదలు పెట్టారు.. దళారుల దిమ్మ తిరిగిపోయింది.. ఇలాగైతే తమకు సరుకు దక్కదని వారూ ఆదే రేటుకు కొన్నారు. దళారులను అరికడతామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని సీఎం వైఎస్ జగన్ శనివారం కర్నూలు జిల్లాలో అక్షరాలా అమలు చేసి చూపారు. సాక్షి, అమరావతి : దళారులు ధరలతో దగా చేయాలనుకున్న తీరు తిరగబడింది. మార్కెట్లో టమాటా కొనుగోళ్లు నిలిపేసి రైతులకు ఇబ్బందులు సృష్టించాలనుకున్న వ్యూహం బెడిసి కొట్టింది. ముఖ్యమంత్రి దెబ్బకు దిగొచ్చిన దళారులు గత్యంతంర లేక ధర పెంచి కొనుగోలు చేశారు. మార్కెట్ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమీషన్ ఇవ్వకుండా రైతులకు వంద శాతం న్యాయం జరిగేలా పండ్లు, కూరగాయల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి డీ రెగ్యులేట్ చేసింది. దీంతో తమకు లాభంలేదని భావించిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులోని దళారులు సమస్యలు సృష్టించారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేస్తే తమకు ఉపయోగం ఉండడం లేదని, లోపల అమ్మకాలు నిలిపివేసి రైతులే బయటకు వచ్చి సరుకు విక్రయించాలని, లేకపోతే కొనుగోళ్లు చేయబోమని బెదిరింపులకు దిగారు. కానీ, రైతులు తాము లోపలే విక్రయాలు చేస్తామని చెప్పడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ సమస్య సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిపించాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరల పతనం కాకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది ఉండకూడదని.. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ.. శనివారం టమాటా కొనుగోళ్లను ప్రారంభించింది. కిలోకు అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోళ్లు మొదలెట్టింది. ఇలా 50 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. నేరుగా తాము కొనుగోళ్లు జరపడం వల్ల రూ.14, రూ.15 ఉన్న కిలో టమాటా ధర రూ.18, రూ.19కి పెరిగి రైతులకు లాభం చేకూరింది. దీంతో అవాక్కయిన దళారులు తాము నష్టపోతామని భావించి వెంటనే మార్కెట్లోనే కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారు కూడా శనివారం 100 మెట్రిక్ టన్నుల టమాటాను కోనుగోలు చేశారు. నాలుగు నెలల్లోనే గిట్టుబాటు ధర విషయమై సీఎం మాట నిలుపుకున్నారని రైతులు ప్రశంసించారు. దళారులపై ఫిర్యాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి వల్ల వెంటనే కొనుగోళ్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ ఏడాది జూలై నుంచి మార్కెట్ డి రెగ్యులేషన్‌ను ప్రారంభించామని, దీనివల్ల రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వం మా పక్షాన నిలిచింది పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా అమ్మకాలు సవ్యంగా జరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సౌకర్యాలు ఉంటాయి. కానీ రైతులకు లాభాలు రాకుండా దళారులు అడ్డుపడుతుంటారు. టమాటా రైతుల కష్టాలను తెలుసుకుని సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వడం వల్లనే అధికారులు కదిలి వచ్చి సమస్యను పరిష్కరించారు. – రామచంద్ర, రైతు, దూదేకొండ, పత్తికొండ మండలం రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు టమాటా రైతుల ఇబ్బందులపై సీఎం వైఎస్ జగన్ స్పందించడం హర్షణీయం. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తికొండ మార్కెట్ యార్డులోనే అమ్మకాలు జరిగేలా చూశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని, దళారుల బెడద లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాట నిలుపుకున్నారు. గ్రేట్ సీఎంకు ధన్యవాదాలు. – రాజశేఖర్, రైతు, చక్రాళ్ల, పత్తికొండ మండలం -
కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం
సాక్షి, పత్తికొండ(కర్నూలు) : ప్రతిభ ఉన్న ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువై ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకరు. అతని ప్రతిభకు పేదరికం అడ్డుగా మారింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారుడు కబడ్డీలో రాణిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏ జట్టులో ఉన్న ప్రత్యేకత చాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతానంటున్నాడు. మిగతా వివరాలు అతని మాటల్లో ‘మాది పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామం. వంకాయల నాగప్ప, సువర్ణమ్మలకు నేను రెండో సంతానం. మోడల్ స్కూల్‌కు ఎంపిక కావడంతో 9వ తరగతిలో చేరా. ప్రస్తుతం అక్కడే సీఈసీ సెకండియర్ చదువుతున్నా. పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ క్రీడలపై ఆసక్తితో కబడ్డీ బాగా అడేవాడిని. ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్ స్థాయి టోర్నమెంట్లో పత్తికొండ, పుచ్చకాయలమాడ, బినిగేరి, ఎం.అగ్రహారం, పత్తికొండ, మొలగవల్లి, జొహరాపురంలో టీం తరఫున ఆడాను. ఆదోని జోనల్ పోటీల్లో రాణించడంతో గుర్తించిన జిల్లా అసోషియేషన్ సహకారంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ పోటీలకు అవకాశం లభించింది. ఇండియన్ రూరల్ ఒలంపిక్ అసోషియేషన్ తరఫున మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జూన్ 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చాటాను. ఈ పోటీల్లో ఫైనల్స్ మ్యాచ్‌లో హర్యానా జట్టుపై ఆంధ్రజట్టు రన్నర్స్‌గా నిలిచింది. జట్టులో నేను ప్రతిభ కనపరచడంతో జూన్ 27న రాజస్థాన్‌లో యూత్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ప్రతిభ చాటాను. -
అక్రమాల ఇంద్రుడు
ఆ కాంట్రాక్టర్ టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడు.. విద్యుత్ శాఖలో పైరవీలతో వివిధ కాంట్రాక్టులు సొంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నికల కోడ్ సమయంలో సబ్స్టేషన్ల నిర్వహణ పనులు దక్కించుకున్నాడు.. అంతటితో ఆగకుండా... వాటిల్లో ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి అక్రమ వసూళ్లకు తెరదీశాడు. ఇలా దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బాధితులను విచారణకు రమ్మని ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ వారిని విచారణకు వెళ్లకుండా నిర్బంధించాడు. దీంతో అధికారులు బాధితుల చిరునామా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామనే పేరుతో ఓ కాంట్రాక్టర్ భారీగా వసూళ్లకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఉప కేంద్రాలను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ అక్రమాలకు తెరతీశాడు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రామలింగాయపల్లె, పందికోన వద్ద కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేశారు. అయితే వీటిని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక గత ఎస్ఈ కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రెండు సబ్స్టేషన్ల పరిధిలో పోస్టుల పేరుతో రూ.70లక్షల వసూలు చేశారనే సమాచారం మేరకు అధికారులు విచారణ జరిపారు. కేటాయింపులు ఇలా.. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మంజూరు, కేటాయింపులు, నోటిఫికేషన్లు జారీ చేయరాదు. అయితే గత అధికారి మాత్రం అందుకు విరుద్ధంగా పందికోన, రామలింగాయపల్లె సబ్స్టేషన్లను హడావిడిగా పూర్తి చేయించారు. వాటి నిర్వహణను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు మార్చి 18న కేటాయిస్తూ సంతకాలు చేశారు. రూ.70లక్షల వసూలు.. రామలింగాయపల్లె, పందికోన సబ్స్టేషన్లు తనకే వచ్చాయని, వాటిలో ఆపరేటర్ పోస్టులు ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉంటారు. ఆపరేటర్ పోస్టుకు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు, వాచ్మెన్ ఉద్యోగానికి రూ.5లక్షల వరకు బేరం కుదుర్చుకొని దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మూడు సార్లు విచారణ.. కోడ్ అమల్లో ఉండగా సబ్స్టేషన్ల కేటాయింపులు జరిగాయని ఓ కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్–2 మణిమాల తొలుత విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండోసారి చీఫ్ జనరల్ మేనేజర్ లలిత జూన్ 18న క్షేత్రస్థాయికి వెళ్లి సబ్స్టేషన్లు తనిఖీ చేశారు. ఇందులో గతంలో పనిచేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 26, 27వ తేదీల్లో ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (తిరుపతి) వెంకటరత్నం విచారణ జరిపారు. బాధితుల నిర్బంధం మోసపోయిన వారిని విచారించేందుకు గత నెల 26న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ విచారణకు రావడంతో బాధితులను కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. ‘మీకు ఉద్యోగాలు వస్తాయి, రాని పక్షంలో మీ డబ్బును తిరిగి ఇస్తాం.. విచారణకు వెళ్లొద్దని నమ్మబలికారు. అయినా వారు బస్సెక్కి వస్తుండగా అడ్డుకొని నిర్బంధించారు. విషయం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు బాధితుల అడ్రస్ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాను టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక పైరవీలు చేసుకుంటూ ఎదిగారని విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదోనితో పాటు డోన్, కర్నూలు డివిజన్లలో అధికంగా 19 సబ్స్టేషన్లు పొందాడు. కొన్ని టెండర్ల ద్వారా, మరికొన్ని నామినేటెడ్ వర్క్ పేరుతో తీసుకోవడంతోపాటు స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ కూడా దక్కించుకున్నాడు. -
చరిత్ర మరిచినా..మేం మరువం మన్రో
భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయ అధికారులు ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని పీడించారు. కానీ కొద్దిమంది అధికారులు ప్రజల సంక్షేమం కోసం కృషిచేసి వారి మదిలో నిలిచిపోయారు. అలాంటి కోవకు చెందిన వారిలో సర్ థామస్ మన్రో ఒకరు. దత్తమండలాల తొలికలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనేక సంస్కరణలు అమలు చేశారు. ఈయనకు పత్తికొండ పట్టణంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో నేటికీ మన్రోలయ్య అనే పేరు పెట్టుకుంటారంటే ఈయనపై వీరికి గల చెరిపేయలేని అభిమానం అర్థం చేసుకోవచ్చు. మన్రో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూలు : తూర్పు ఇండియా వర్తక సంఘం సైన్యంలో క్యాడెట్‌గా పనిచేసేందుకు థామస్‌మన్రో ఇండియాకు వచ్చారు. తన ప్రతిభాపాటవాలతో సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. రాయలసీమ (కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలు) దత్తమండలాలకు 1800 సంవత్సరంలో తొలి ప్రిన్సిపల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అప్పటి వరకు అమలులో ఉన్న జమీందారు పద్ధతిని రద్దు చేసి రైత్వారీని ఈయన అమలు చేశారు. సాగుచేసే భూములపై రైతులకుయాజమాన్య హక్కులు కల్పించారు. తాను కలెక్టర్‌గా పనిచేసిన 7ఏళ్లలో 3లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు భూములు అమ్ముకునేందుకు కూడా హక్కు కల్పించారు. ఈ నిర్ణయాలతో సాగుభూమి గణనీయంగా పెరగడమే కాకుండా ప్రభుత్వ ఆదాయం 50 శాతం పెరిగింది. సర్‌థామస్ మన్రోకు తెలుగుభాష అంటే ఎనలేని అభిమానం. 1805 నాటికే తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. రాయలసీమలో జిల్లాకోర్టులు ఏర్పాటు చేసి, పోలీసు యంత్రాంగాన్ని నియమించి చట్టబద్ద పరిపాలన అమలయ్యేలా కృషిచేశారు. జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రాలలో పాఠశాలలు ఏర్పాటు చేయించారు. పాలెగాళ్ల అరాచకాలకు అడ్డుకట్ట రాయలసీమ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో పన్నులు వసూలు చేయడానికి బ్రిటీష్ వారు పాలెగాళ్లను నియమించుకున్నారు. కాని కొందరు పాలెగాళ్లు ప్రజలు నుంచి వసూలు చేసిన పన్నులను బ్రిటీష్వారికి కట్టకుండా స్వాహా చేసేవారు. అలాగే 80 మంది పాలెగాళ్లు, వారి అనుచరులు ప్రజలను వేధించి దోచుకుంటూ ప్రజాకంటకులుగా మారారు. సర్‌థామస్ మన్రో సైన్యాన్ని రప్పించి పాలెగాళ్లను కఠినంగా అణచివేశారు. గ్రామాల్లో దొరల పాలనను రద్దుచేసి వారికి ఫించన్ ప్రవేశపెట్టారు. ప్రజల వద్దకు పాలన గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాలు పర్యటిస్తూ సర్‌థామస్ మన్రో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేవారు. గ్రామాల్లో డేరాలు వేసుకుని ఉంటూ అక్కడ ప్రజలతో సమావేశాలు జరిపేవారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు అమలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మైళ్ల కొద్దిదూరం నడచి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించేవారు. జ్ఞాపకాలు పదిలం మన్రో జ్ఞాపకార్థంగా ఆయన శిలాప్రతిమను పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆయన తైలవర్ణచిత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో, ప్రభుత్వ డిగ్రీకళాశాల, గ్రామపంచాయతీ లోనూ ఉన్నాయి. ప్రతిఏటా జూలై 6న తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు మన్రో వర్ధంతిని నిర్వహిస్తున్నారు. పత్తికొండ పాతబస్టాండుకు సమీపంలో ఐసీడీఎస్కార్యాలయం పక్కనే మన్రో గుర్తుగా నిర్మించిన బావి ఉంది. పట్టణంలో ఒక కాలనీకి మన్రోపేట అని పేరు పెట్టారు. మన్రోపేట బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పత్తికొండలోనే తుదిశ్వాస రాయలసీమ దత్తమండలాల ప్రిన్సిపాల్ కలెక్టర్‌గా పనిచేసిన సర్‌థామస్ మన్రో అనంతర కాలంలో మద్రాసు గవర్నర్‌గా పదోన్నతిపై వెళ్లారు. 1827 సంవత్సరంలో పత్తికొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలు అనేకమంది మృత్యువాత పడ్డారు. అప్పుడు మద్రాసు గవర్నర్‌గా ఉన్న సర్‌థామస్ మన్రో ఇక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి తెలుసుకునేందుకు పత్తికొండకు వచ్చారు.. గ్రామాలకు వెళ్లి కలరా వ్యాధిగ్రస్తులను పరామర్శించిన మన్రో కలరా వ్యాధి బారిన పడ్డారు.. కలరావ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన మన్రో పత్తికొండలోనే మకాం వేసి వైద్యులను ఇక్కడికే పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ కోలుకోలేక 1827 సంవత్సరం జూలై 6వతేదిన పత్తికొండలోనే తుదిశ్వాస విడిచారు. మన్రో భౌతికకాయాన్ని అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి తరలించి అక్కడే సమాధి చేశారు.