నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం | YS Jagan Attended Marriage In Kurnool | Sakshi

నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

Published Thu, Feb 27 2020 1:25 PM | Last Updated on Thu, Feb 27 2020 2:12 PM

YS Jagan Attended Marriage In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి వివాహా వేడుక రాగ మయూరి రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్‌ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్‌ ఖాన్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్‌ రెడ్డి, బీవై రామయ్యతో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరిగి విజయవాడ బయల్దేరారు. కాగా అంతకు ముందు  గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement