Kangati Sridevi
-
అసలు నువ్వు మంత్రివేనా? టీడీపీ హత్య కేసులో అసలు నిజం
-
మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా సిద్ధం అన్నా...ఎమ్మెల్యే శ్రీదేవి
-
మాట నిలబెట్టుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
మాట ఇవ్వడం.. మరచిపోవడం.. ప్రజలు గుర్తు చేసినా పట్టించుకోకపోవడం.. ఎన్నికల సమయంలో మళ్లీ అదే మాట ఇవ్వడం.. ఓట్లు అభ్యరి్థంచడం.. కొందరు ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల ‘దారి’్రద్యాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలకు ‘వారధి’ వేశారు. దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): వర్షాకాలం వచ్చిందంటే వారిలో వణుకు ప్రారంభమయ్యేది. ఊరి సమీపంలోని వాగు పొంగితే సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయేవి. పంట పొలాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అరోగ్యం బాగాలేకపోయి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది.. ఈ దుస్థితిని ఆ గ్రామ ప్రజలు ఎందరికో వివరించారు. చూద్దాం.. చేద్దాం అన్నారు తప్పితే చిత్తశుద్ధితో ఎవరూ ప్రయత్నం చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. గ్రామ ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. రూ. 6.62 కోట్ల ఖర్చు పత్తికొండ మండలం దూదేకొండ – కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవ్వేసి, రోడ్డు మ«ధ్యలో ఉన్న వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జికి రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు శ్లాబ్‌లను పూర్తి చేసి రోడ్డుకు అవసరమైన ప్రాంతాల్లో 10 కల్వర్టులను (మోరీలు) నిర్మించారు. ఈ బ్రిడ్జీ, రోడ్డు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో దూదేకొండ నుంచి కొత్తపల్లి మీదుగా పులికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమైంది. పెరగనున్న రవాణా సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు జాతీయ, జిల్లా రహదారులను అభివృద్ధి చేస్తూనే, మరో వైపు పల్లె రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ) నిధులతో జిల్లాలోని పలు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో రూ.30 కోట్ల వ్యయంతో పత్తికొండ నియోజకవర్గంలోని దూదేకొండ – కొత్తపల్లి, కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల హంద్రీ నదిపై బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఒక బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు, బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తి అయితే పది గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలను నిర్మించాలనే ప్రజల కోరికను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జీలకు మోక్షం లభించింది. మరో రెండు వంతెనలకు రూ.8.10 కోట్లతో అంచనాలు పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈఏడాది జూన్ 1వ తేదిన పత్తికొండకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ రెండు వంతెనల అంశాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తీసుకువెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి వెంటనే సమ్మతించిన నేపథ్యంలో పీఆర్ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.70 లక్షలతో కంభాలపాడు – కోయిలకొండ మార్గంలో లోలెవెల్ వంతెన, కృష్ణగిరి మండలం గోకులపాడులో రూ.7.40 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణాలకు త్వరలోనే మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయి. హంద్రీ నదిపై సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు హంద్రీ నదిపై వేగంగా బ్రిడ్జి పనులు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న హంద్రీ నదిపై రూ.24.12 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పియర్స్ పనులు పూర్తి అయ్యాయి. పియర్ క్యాప్స్, హెడ్ హారŠమ్స్ పూర్తి చేసిన అనంతరం శ్లాబ్ వేయనున్నారు. నిరీ్ణత సమయంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ... హంద్రీ నదికి ఇటు పక్క ఉన్న కృష్ణగిరి మండలంలోని బీ ఎర్రబాడు, మన్నేకుంట, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కొత్తపల్లి, రామక్రిష్ణాపురం, మల్లాపురం తదితర గ్రామాల ప్రజలకు ఉన్న రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పైగా ఈ మండలంలోని కంభాలపాడు, ఎరుకులచెర్వు తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 330 మీటర్ల పొడవుతో బ్రిడ్జి, 5.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఈ పనులను నిరీ్ణత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ..!
-
కర్నూలులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులో పర్యటించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నివాసానికి చేరుకొని, నూతన వధూవరులైన చెరుకులపాడు వంశీధర్ రెడ్డి, ప్రియదర్శినిని ఆశీర్వదించారు. చదవండి: (YSR District: రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్) కర్నూలు జిల్లాకు విచ్చేసిన సీఎంకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
పత్తికొండ టౌన్: రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ దందా నడిపిన మాజీ సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. ఆదివారం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని గత టీడీపీ పాలకులు పూర్తిగా విస్మరించారన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపడుతుంటే చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి రాజధాని అయిన కర్నూలును న్యాయరాజధానిగా చేసి హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. శాసనమండలిలో, కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. కొద్దిమంది కోసమే సేవ్ అమరావతి చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు. అమరావతి చుట్టూ ఆయన బంధువులు, సొంత సామాజికవర్గం వారు, టీడీపీ నాయకులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి, రియల్ఎస్టేట్ వ్యాపారాల ద్వారా కోట్లు కొల్లగొట్టాలన్నారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం చంద్రబాబు సేవ్ అమరావతి అంటూ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. 29 గ్రామాల్లో ప్రారంభమైన ఉద్యమం ప్రస్తుతం 3 గ్రామాలకే పరిమితమయ్యిందన్నారు. అక్కడ కూడా చంద్రబాబు ఆదేశాల మేరకు ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉద్యమాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్‌రెడ్డి వివాహా వేడుక రాగ మయూరి రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, సాయిప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, బీవై రామయ్యతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నేతలు హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ బయల్దేరారు. కాగా అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. -
'అందుకే నా భర్తను హత్య చేశారు'
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైఎస్సార్సీపీ నాయకుడు, తన భర్త నారాయణరెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించిన విషయం నారాలోకేష్ తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలే దాడి చేసిన విషయం లోకేష్ మరవడం సిగ్గుచేటని విమర్శించారు. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.1,550 ప్రభుత్వానికి చలానా కట్టి దాంతో డూప్లికేట్ సృష్టించి రోజుకు 70 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నెలకు రూ.21 లక్షలు చొప్పున దండుకున్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదన్నారు. సమావేశంలో కేడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మండల కన్వీనర్లు బజారప్ప, జిట్టా నాగేశ్, వైఎస్ఆర్సీపీ నేతలు రామచంద్ర, రహిమాన్, పల్లె ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో ప్రసిడెంట్ అట్లా గోపాల్ రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు బద్రయ్య, నేత్రజిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరిస్తాం
-
ప్రజల రుణం తీర్చుకుంటా
పత్తికొండ: టీడీపీ కంచుకోటగా ఉన్న పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండాను రెపరెపలాడించి అఖండ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శనివారం పత్తికొండలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చక్రాళ్లరోడ్డులో దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పత్తికొండ–గుత్తిరోడ్డు కూడలికి వచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే..అదే స్ఫూర్తితో ప్రజలు గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తారన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన పేదలందరికీ నవరత్నాల పథకాలు అందుతాయన్నారు. గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందులు స్వయంగా చూశానని, వాటి పరిష్కార మార్గం కోసం నిత్యం కృషి చేస్తానన్నారు. ఫ్యాక్షన్ ఊబిలో ఉన్న పత్తికొండను అభివృద్ధి కొండగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. పదేళ్ల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా.. తక్షణమే వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, పింఛన్లు అందిస్తామన్నారు. ప్రజలందరి అండదండలతో తన భర్త నారాయణరెడ్డి ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుస్తానన్నారు. ఎవరికి ఏకష్టం వచ్చినా ‘అమ్మా’ అని పిలవగానే పలుకుతానన్నారు. 2024 ఎన్నికల నాటికి పత్తికొండలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి జగనన్నకు రెండో కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు ఘర్షణలు సృష్టించాలని చూస్తారని.. ఇలాంటి సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు సంయమనం పాటించాలన్నారు. అందరూ శాంతియుత జీవనం సాగించాలన్నారు. టీడీపీ ముఖ్య నాయకుల అడ్రస్ గల్లంతు వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైరామయ్య మాట్లాడుతూ.. ఫ్యాన్ గాలి జోరులో టీడీపీకి చెందిన ముఖ్యనాయకుల అడ్రస్‌లు గల్లంతయ్యాయన్నారు. జగనన్న పాలనలో నవరత్నాలు నేరుగా ఇంటికి అందుతాయన్నారు. గ్రామ వలంటీర్లలో అవినీతి, అక్రమాలు లేకుండా పథకాలను అందించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, మాజీ మండలాధ్యక్షురాలు నాగరత్నమ్మ, జిల్లా నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, పార్టీ నేత రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు శాంతన్న, మల్లికార్జున యాదవ్, మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రతాప్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ప్రహల్లాదరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల సమస్యల పరిష్కారనికి కృషిచేస్తా
-
కేఈ కుటుంబానికి దిమ్మతిరగాలి
సాక్షి, వెల్దుర్తి : ప్రజా సమస్యలు గాలికొదిలి ఇంట్లో కూర్చొని గెలుద్దామనుకున్న కేఈ కుటుంబానికి ఎన్నికల ఫలితాలను చూసి దిమ్మతిరగాలని వైఎస్సార్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాతబస్టాండులో శ్రీదేవి మాట్లాడుతూ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు నింపలేదు, తాగు నీటి సమస్య తీర్చలేదు. ఇవి చేయనిదే ఓటడగనన్న డిప్యూటీ సీఎం ఏ మొహం పెట్టుకుని నేడు తన కుమారుడికి ఓటెయ్యాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. తన భర్తను హత్య చేసి గెలిచేశామనుకున్న వాళ్ల గుండెల్లో నేడు తనకు, పార్టీకి వస్తున్న ఆదరణ చూసి దడ మొదలైందన్నారు. ఆసుపత్రుల వెంట పరుగులెడుతున్నారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే అభిమానాన్ని మరో ఆరు రోజులు కొనసాగించి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలో తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి సంజీవ్‌కుమార్‌కు మరో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు లేకున్నా తన సోదరుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి నియోజకవర్గంలో చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఉన్నాయన్నారు. కంగాటి శ్రీదేవి రోడ్‌షో సందర్భంగా వెల్దుర్తి పట్టణం జనసంద్రమైంది. ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రోడ్డు నిండిపోయింది. రోడ్‌షోలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కన్వీనర్లు బొమ్మన రవిరెడ్డి, ఆర్బీ వెంకట్రాముడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్, చెరుకులపాడు వెంకట్రామిరెడ్డి, స్నేహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శివారెడి, జెడ్పీటీసీ సభ్యుడు సమీర్‌కుమార్ రెడ్డి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, నాయకులు సుబ్బారెడ్డి, శరభారెడ్డి, ఆవుల భారతీ వెంకటేశ్వర్లు, అగస్టీన్, పెద్దిరెడ్డి, సుధీర్, ప్రశాంత్,, చిట్యాల నక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ మండలంలో.. పత్తికొండ టౌన్: వైఎస్సార్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి శుక్రవారం కేడీసీసీ మాజీ వైస్‌చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్.నాగరత్నమ్మ దంపతులతో కలసి పత్తికొండ మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక రామక్రిష్ణారెడ్డినగర్ కాలనీతో పాటు, మండలంలోని కొత్తపల్లి, పందికోన, కోతిరాళ్ల, కనకదిన్నె అటికెలగుండు గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీని గెలిపించాలని ఆయా గ్రామాల్లోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజారప్ప, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, అడ్వకేట్లు ప్రసాద్‌బాబు, నాగరాజు, వాసు, నాయకులు బలరాముడు, బాబుల్‌రెడ్డి, కృష్ణ, మస్తాన్, రవికుమార్, వెంకటేశ్, నారాయణస్వామి, అంజినయ్య, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వీరన్న, హనుమంతు పాల్గొన్నారు. ఓటుతో బుద్ధి చెప్పండి కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కంగాటి శ్రీదేవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే నవతర్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌రెడ్డి, రాజారెడ్డి, తిమ్మరాజు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్పు తథ్యం!
సాక్షి, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే..రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సంఘటనలు కూడా ఇక్కడే జరిగాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 7 సార్లు టీడీపీ, ఒక సారి సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కేఈ సోదరులకు రెండు పర్యాయాలు మద్దతు పలికినా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి జనం ముందుకు ఓట్లడగటానికి వస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలను విస్మరించడంతో రైతులు, ప్రయాణికులు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రకాశం పంతులు ప్రభుత్వాన్ని కూల్చిన పత్తికొండ ఎమ్మెల్యే 1952లో ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అప్పటి పత్తికొండ ఎమ్మెల్యే ముడుమాల శంకరరెడ్డి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. అంతకుముందు రెండుసార్లు నియోజకవర్గాన్ని పునర్విభజించగా 2007లో మూడోసారి విభజించారు. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి మూడుసార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. అమలు కాని హామీలు పందికోన, కొత్తపల్లి, రిజర్వాయరు నుంచి 32,200 ఎకరాలకు, కృష్ణగిరిలో రిజర్వాయరు నుంచి 5,100 ఎకరాలకు సాగునీరందించి 68 చెరువులకు జలకళ తెస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు.అంతేకాక ఆర్టీసీ మినీ డిపో నుంచి పూర్తిగా స్థాయిలో ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల, బీసీ బాలికలకు వసతి గృహం ఏర్పాటు, 80 గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తరువాత పట్టించుకోలేదు. కేఈ కుటుంబంపై ఆగ్రహం రెండుసార్లు కేఈ కుటుంబానికి మద్దతు పలికినా హామీల గురించి మాటెత్తకుండా మూడోసారి కేఈ శ్యాం కుమార్ (కేఈ కృష్ణమూర్తి కుమారుడు) బాబుకు ఓట్లు వేయాలని అడుగుతుంటే ఓటర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏడాది పాటు శ్యామ్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక ఆర్అండ్బీ రోడ్లు, నీరుచెట్టు ,చెక్‌డ్యాంలు, సీసీ రోడ్లు నిర్మాణాల్లో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పక్కాగృహం మంజూరు కావాలంటే రూ.50వేలు ఇవ్వాల్సిందే. ఇలా లక్షల రూపాయలు వసూలు చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడంతో కేఈ సోదరులపై ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు ప్రకటించిన 650 çహామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడం వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. జోరుగా ఫ్యాను గాలి.. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి, ఆక్రమాలు, ప్రత్యర్థుల చేతిలో భర్తను కోల్పోయిన శ్రీదేవికి నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన కేఈ సోదరులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో కంగాటి శ్రీదేవికి పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ఈఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిళ్లు లేచిపోవడం ఖాయమని భావిస్తున్నారు. – పూజారి గోపాల్, పత్తికొండ ఓటర్ల వివరాలు మొత్తం 1,89,409 పురుషులు 95,751 మహిళలు 93,640 ఇతరులు 18 -
జగనన్నే.. నా ధైర్యం
సాక్షి, కర్నూలు : భర్త చాటు భార్యే అయినా ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారామె. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులకు చేతనైనంత సాయం చేశారు. మంచి పేరు తెచ్చుకుంటున్న దశలో అనుకోకుండా పదవిని వదులుకోవాల్సి రావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న భర్తకు చేదోడు వాదోడుగా మెలిగారు. ఇంతలో ప్రత్యర్థుల పాశవిక దాడిలో భర్త దారుణ హత్యకు గురి కావడం ఆమె జీవితాన్ని కుదిపేసింది. ‘నీకు పూర్తి అండగా ఉంటాం’ అని చెప్పిన సమీప బంధువులు సైతం ప్రత్యర్థులతో చేయి కలిపారు. ఇన్ని కష్టాల్లోనూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసానే తనకు ధైర్యాన్నిచ్చిందని.. అదే తనను ముందుకు నడిపిస్తోందని అంటున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి. ఇంకా ఏమన్నారో ఆమె మాటల్లోనే.... ‘నా రాజకీయ ప్రస్థానం ఊహించనిది. కాంగ్రెస్ పార్టీలో తిరిగే నా భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి ప్రోత్సాహంతో కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యా. రాజకీయ ఒడుదొడుకుల నేపథ్యంలో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. అయినా నిరుత్సాహం చెందలేదు. తదనంతర పరిణామాల్లో నా భర్త నారాయణరెడ్డి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. దీనిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రెండేళ్ల క్రితం ఓ వివాహానికి హాజరై వస్తుండగా వేట కొడవళ్లు, బాంబులు వేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇలాంటి స్థితిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను ఓదార్చారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తామని ప్రకటించారు. అలా టిక్కెట్ దక్కిన తొలి వ్యక్తి నేనే. నా భర్త హత్య అనంతరం నన్ను పరామర్శించిన దగ్గరి బంధువులు ఇప్పుడు అదే హంతకులతో చేతులు కలిపారు. జగనన్న ఇచ్చిన కొండంత ధైర్యం తోడుగా నన్ను, పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నా. కేఈ ఏమీ చేయలేదు... మా నియోజకవర్గం దశాబ్దాలుగా కరువు కాటకాలకు నిలయం. రైతుల సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇక్కడి ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ప్రజల తాగు నీటి, రైతుల సాగునీటి ఇబ్బందులు తీరలేదు. హంద్రీ నీవా నీటితో నియోజకవర్గంలో మొదట 106 చెరువులను నింపుతామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి తర్వాత 68 చెరువులని మాట మార్చారు. ఈ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి . కేఈ హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ నీవా నీటితో చెరువులను నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. సాగునీటి కల్పనే ధ్యేయం నియోజకవర్గంలోని 32 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే నా ధ్యేయం. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలను తీసుకుంటాం. ఏ గ్రామంలోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తా. సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బాలికా విద్యకు ప్రాధాన్యం నేను డిగ్రీ (బీఏ) చదివా. బాలికా విద్య ప్రాధాన్యం తెలుసు. నియోజకవర్గంలో బాలికల విద్యకు పెద్ద పీట వేస్తాం. బీసీ బాలికలకు వసతి గృహం, పాలిటెక్నికల్ కళాశాల నెలకొల్పేలా చూస్తా. నా భర్త ఉన్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాం. పేదల ఇంట వివాహాలకు తాళి బొట్లు, కాలి మెట్టెలు, దుస్తులు అందజేశాం. వీటిని కొనసాగిస్తానని అన్నారు. -
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
సాక్షి, పత్తికొండ టౌన్: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడం దారుణమని..దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి పత్తికొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతి, అక్రమాలు, కుట్రలు, హత్యలే జరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షంలో ప్రజాభిమానం గల నాయకులను హత్య చేయించి భయభ్రాంతులకు గురిచేయాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నారు. అందులో భాగంగా వైఎస్ రాజారెడ్డిని, వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయించారనే అనుమానం ఉందన్నారు. వైఎస్సాఆర్ మరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి ప్రోద్భలంతోనే మంత్రి ఆదినారాయణరెడ్డి.. వైఎస్ వివేకాను హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దారుణం వెనుక జరిగిన కుట్రకోణం వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేయించినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. అధికార బలంతో కేసును పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, పత్తికొండ, మద్దికెర మండలాల కన్వీనర్లు జూటూరు బజారప్ప, మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, లలితా రామచంద్ర, దూదేకొండ రహిమాన్, కారం నాగరాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
కర్నూలు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 500 మంది పార్టీలో చేరారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్యతో పాటు తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది పత్తికొండకు చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి తేరుబజారు, నాలుగు స్తంభాలు, అంబేడ్కర్ సర్కిల్ మీదుగావైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరికిబీవై రామయ్య,కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి..సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు కాపీరాయుడు వైఎస్సార్సీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టడం సిగ్గు చేటని బీవై రామయ్య విమర్శించారు. పరీక్షల్లో కొపీ కొట్టే విద్యార్థులను డీబార్ చేసినట్టుగానే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు డీబార్ చేస్తారని హెచ్చరించారు. బ్యాంకర్లతో మీటింగులు పెట్టి రైతులకు రుణాలు ఇవ్వొద్దంటూ చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే చంద్రబాబు తప్ప మరెవరూ లేరన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 106 చెరువులకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పి మోసం చేశారన్నారు. జొన్నగిరిలో చంద్రబాబు గంగ పూజ చేసిన తరువాత చెరువులోని నీరు ఇంకిపోయి పూర్తిగా ఎండిపోయిందన్నారు. నీరు– చెట్టు పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించిన నరహంతకులను స్వాగతించే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కరువులకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఇంతవరకు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పత్తికొండలో పాలిటెక్నిక్ కళాశాల, జ్యూస్ ఫ్యాక్టరీ, పూర్తిస్థాయిలో ఆర్టీసీ డిపో, బాలికలకు వసతిగృహం ఏర్పాటు చేస్తామన్న డిప్యూటీ సీఎం మాట నిలబెట్టుకోలేదన్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలను డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నారని చంద్రబాబు అనడం నీచమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి, మండల కన్వీనర్లు జూటూరు బజారప్ప, నాగేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రహిమాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రహ్లాదరెడ్డి, జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, జయ భరత్‌రెడ్డి , హనుమంతు, బనిగాని శ్రీను, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాబు మోసకారి
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారి అని..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు సక్రమంగా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. సీఎం కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన బాబు.. అధికారం కోసం ఇప్పుడు ప్రజలను మాయమాటలతో మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రలోభాలకు తెరతీశారని..ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం, కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో ‘నిన్ను నమ్మం బాబూ’ కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ♦ పాణ్యం నియోజకవర్గం కల్లూరులోని 27వ వార్డులో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్ర రాజకీయాలు, నయవంచనకు మారు పేరే చంద్రబాబు నాయుడని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి పాలన సాగిస్తున్నారని.. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుని రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, రమణారెడ్డి, లక్ష్మికాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి, హనుమంతు గుండం గ్రామాల్లో నిర్వహించిన ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి పాల్గొన్నారు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూటకోమాటతో ముఖ్యమంత్రి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. వర్షాలు లేక రైతులు అవస్థలు పడుతుంటే టీడీపీ సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ♦ కోడుమూరు నియోజకవర్గం సి.బెళగళ్ మండలం పోలకల్లు గ్రామంలో పార్టీ ఇన్చార్జ్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. బాబు ఎన్ని నాటకాలాడిన ప్రజలు గమనించి ఓటుతో తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ సెక్రటరీ విక్రమ్‌కుమార్, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ♦ కర్నూలు నగరంలోని శ్రీరామ్‌నగర్‌లో ‘నిన్ను నమ్మంబాబు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ మైనార్టీల పట్ల టీడీపీ కపట ప్రేమ చూపుతోందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు బయటకు వచ్చినట్టు డ్రామాలాడుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పార్టీ నాయకులు తెర్నేకలు సురేంద్రరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కటారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ♦ పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో నిర్వహించిన ‘నిన్ను నమ్మంబాబు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూరగొనలేని టీడీపీ నాయకులు గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించి అశాంతి రేపుతున్నారన్నారు. మహిళలకు, మహిళాధికారులకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నందున మరిన్ని హామీలు గుప్పిస్తున్నారన్నారు. బూటకపు హామీలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ అంతం పత్తికొండతోనే ప్రారంభం
కర్నూలు, వెల్దుర్తి: టీడీపీ అంతం పత్తికొండలో వైఎస్సార్సీపీ గెలుపుతోనే ప్రారంభమవుతుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కేఈ కుటుంబంపై ప్రజా వ్యతిరేకత ఎప్పుడో ప్రారంభమైందన్నారు. వారి అవినీతి, అక్రమాలను చూసి టీడీపీ కార్యకర్తలే చీదరించుకుంటున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. తీవ్ర కరువుతో అల్లాడుతూ ప్రజలు వలసబాట పడుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. రాజన్య రాజ్యం త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖబడ్డార్..: ఇటీవల గోవర్ధనగిరి జన్మభూమిలో కేఈ కుటుంబీకులు, మండల నాయకుల విమర్శలపై కంగాటి శ్రీదేవి విరుచుకుపడ్డారు.తమ పార్టీ గురించి, తమ నాయకుడి గురించి, తమ కుటుం బం గురించి అవాకులు చవాకులు పేలితే కబడ్డార్ అంటూ హెచ్చరించారు. దౌర్జన్య పాలన ఎన్నాళ్లో సాగదని, ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నవరత్నాలను నకలీరత్నాలని చెప్పే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. పింఛన్ రత్నాన్ని దొంగలించిన సీఎం చంద్రబాబు ను ఏమంటారని ప్రశ్నించారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం
కృష్ణగిరి (కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం అసన్నమైందని రాయలసీయ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి చేపట్టిన సంఘీభావ పాదయాత్ర శుక్రవారం ముగిసింది. మూడో రోజు పాదయాత్ర కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామం నుంచి ప్రారంభమై ఎరుకలచెర్వు మీదుగా కృష్ణగిరి వరకు 12 కిలోమీటర్లు కొనసాగింది. కృష్ణగిరిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఆర్బీ వెంకటరాముడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు బీవై రామయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితోపాటు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారన్నారు. అక్షరం ముక్కరాని వారితో గ్రామాల్లో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి పథకంలో కమీషన్లు దండుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలోనే వైఎస్సార్సీపీ తొలి అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందిస్తామని, వాల్మీకులను ఎస్టీల్లో, వడ్లెరలను, బెస్తలను, నాయీబ్రహ్మలను ఎస్సీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారన్నారు. గ్రామాల్లో మినరల్ వాటర్ అందిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చాక క్వాటర్ బాటిళ్లను మాత్రం వీధి వీధినా అమ్ముతున్నారన్నారు. హపీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉన్నంత వరకు పత్తికొండ కరువు ప్రాంతంగానే ఉంటుందన్నారు. జగనన్న గెలిపిస్తే అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. హామీలు అమలు చేయండని అడిగిన వారిపై కేసు నమోదు చేయడం టీడీపీకి నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు, నియోజకవర్గంలో కేఈ కుటుంబం ఇద్దరూ ఇద్దరేనన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ హత్యలు చేయించడం తప్ప కేఈ కుటుంబం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమీలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్, రైతు సంఘం అధ్యక్షుడు భాస్కర్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, ఉప్పర్లపల్లి, కృష్ణగిరి సింగల్‌విండో అధ్యక్షులు ప్రహ్లాదరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, మండల కన్వీనర్లు రవిరెడ్డి, బజారప్ప, మురళీధర్‌రెడ్డి, జిట్టా నాగేష్, కృష్ణగిరి సర్పంచ్ జింకల చిన్నరాముడు, మండల యూత్ కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి నక్క నాగరాజు, చిన్నన్న, నారాయణ, తిరుపాల్ యా దవ్, జయరామిరెడ్డి, బాలమద్ది, వెంకటరాముడు, ప్రహ్లాద, రామాంజనేయులు, కృష్ణమూర్తి, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేఈ సోదరులు సిగ్గుపడాలి కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ..తన భర్త నారాయణరెడ్డి మరణం తరువాత పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. వారు చూపిస్తున్న ఆధారాభిమానాలు, అప్యాయత వెలకట్టలేనివన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కసితో పనిచేయాలన్నారు. కృష్ణగిరి తమ సొంత మండలమని చేప్పే కేఈ సోదరులు.. కనీసం మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, హాస్టల్ సౌకర్యం కల్పించలేకపోవడం సిగ్గుచేటన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే పత్తికొండ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. -
మోసకారి ప్రభుత్వాన్ని సాగనంపుదాం
పత్తికొండ రూరల్(కర్నూలు): అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కి, ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. సోమవారం మండల పరిధిలోని చందోలి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీదేవికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తికొండలో కొన్నేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ.. జగనన్న సీఎం కాగానే తప్పకుండా నెరవేరుతుందన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. బాబు సీఎం కుర్చీ దిగిపోతేనే నిరుద్యోగులకు జాబు వస్తుందన్నారు. చెరువులు నింపే హామీ మాటల్లోనే ఉందికానీ చేతల్లో ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం జగనన్న అలుపెరగని పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, నాయకులు జయభరత్‌రెడ్డి, మధుసూదన్, చందోలి కష్ణారెడ్డి, రామకష్ణారెడ్డి, రామన్న, చంద్రన్న, రామిరెడ్డి, గాడెప్పగారి సుంకన్న, రామాంజిని, సుభాష్, రవిశేఖర్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు . పూజల్లో పాల్గొన్న శ్రీదేవి.. మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామంలో సీతారామాంజనేయస్వామి విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్టలను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పూజల్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
పత్తికొండ (కర్నూలు): రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ పత్తికొండ నియోజకవర్గంలో విజయవంతమైంది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు మండల కన్వీనర్ బజారప్పతో పాటు నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా గేట్లను మూసేసి ఆందోళన చేశారు. అక్కడి నుంచి బైపాస్‌రోడ్డు వద్దకు చేరుకొని హోసూరు క్రాస్ రోడ్డులో ధర్నాకు దిగారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోకి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి హరిజన వాడ మీదగా చాక్రళ్ల రోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి తేరు బజారు వెంట ర్యాలీ సాగుతుండగా ఎస్.ఐ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లు కంగాటి శ్రీదేవిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ విక్రమ సింహ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని శ్రీదేవితో పాటు నాయకులు శ్రీరంగడు, ప్రహ్లాదరెడ్డి, మురళీధర్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లు తగదు ప్రత్యేక హోదా కోసం శాంతి యుతంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించడం సిగ్గుచేటని కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేడయం చంద్రబాబును మించిన నాయకుడు రాష్ట్రంలో లేరన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆగవని, మరింత ఉధృతమవుతాయని చెప్పారు. బంద్‌లో నాయకులు జూటూరు బజారప్ప, నాగేష్, మద్దికెర మురళీధర్‌రెడ్డి, నరసింహయ్య, బనావత్ లక్ష్మిదేవి, గణపతి, కారుమంచప్ప, బనగాని శ్రీనివాసులు, తిప్పయ్య, కృష్ణారెడ్డి, కారం నాగరాజు, రహిమాన్, మధుసూదన్‌నాయుడు, మధు, జయ చంద్రారెడ్డి, ఇమ్రాన్, హరీష్‌రెడ్డి, నజీర్, గాంధీరెడ్డి, దాసు, భాస్కర్ నాయక్, మధుసూదన్‌రెడ్డి, తిమ్మరాజు, దేవన్న పాల్గొన్నారు. -
నవరత్నాలతో పేదలకు సంక్షేమ ఫలాలు
పత్తికొండ రూరల్: తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ జగనన్న ప్రకటించిన నవరత్నాలతో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని దేవనబండ గ్రామంలో వైఎస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కంగాటి శ్రీదేవికి గ్రామనాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడంలేదన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయన్నారు. ఈ ప్రాంత రైతుల జ్యూస్ ఫ్యాక్టరీ కల కూడా సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, నాయకులు నరసింహయ్యాచారి, రహిమాన్, బనగాని శ్రీనివాసులు, గాంధీరెడ్డి, లలితమ్మ, కాశన్న, నాగేంద్ర, ప్రకాష్రవి, నరసింహ, శాంతరెడ్డి, విజయ్, నాగప్ప, సులేమాన్, కేశవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమేష్, భాస్కర్‌రెడ్డి, రాతన ఉమామహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఒత్తిళ్ల వల్లే ..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆయన ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గారు. అందువల్లే కేఈ శ్యామ్‌బాబును అరెస్టు చేయడం లేద’ని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. ఆమె మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మే 21న జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడి జంట హత్యల కేసులో డోన్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న కేఈ శ్యామ్‌బాబు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను రాజకీయ ప్రమేయంతో చార్జిషీటు నుంచి తొలగించడంతో హైకోర్టు సూచన మేరకు తాము డోన్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న డోన్ కోర్టు మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారన్నారు. నారాయణరెడ్డి హత్య కేసులో పోలీసులు తొలగించిన వారి ప్రమేయం ఉందంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ మార్చి ఒకటో తేదీలోపు అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారన్నారు. కోర్టు తీర్పు ఇచ్చి సుమారు 40 రోజులు గడిచినా.. నిందితులు ఎక్కడుండేదీ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్నారు. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా హంద్రీ నదిలో ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికి ఆనాడు హైకోర్టు నుంచి స్టే తేవడాన్ని సహించలేని వారు నారాయణరెడ్డి, సాంబశివుడులను హత్య చేశారని అన్నారు. హంద్రీ చుట్టపక్కల ఉన్న రైతుల బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోతుండడంతో ఇసుక మాఫియా ఆగడాలను నారాయణరెడ్డి అడ్డుకున్నారన్నారు. నేడు మళ్లీ నారాయణరెడ్డి హంతకులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు స్టే ఇచ్చినా యథేచ్ఛగా ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని అర్డీఓ, తహశీల్దార్, ఎస్ఐ, డీఎస్పీ, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇసుక మాఫియాతో తమ కుటుంబం, అనుచరులకు ప్రాణగండం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డువేయాలని, నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కేఈ శ్యామ్‌బాబు, బొజ్జమ్మలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్యామ్‌రెడ్డి, పోతురెడ్డి, శ్రీరామరెడ్డి, శ్రీనాథరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని..
సాక్షి, కర్నూలు: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులోని నిందితుడు శ్యామ్‌బాబు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నారాయణరెడ్డి, సాంబశివుడులను 2017 మే 21న అతికిరాతంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో కేఈ శ్యామ్‌బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌తో సహా 15 మందిని నిందితులుగా చేర్చారని, అయితే.. డిప్యూటీ సీఎం తన పలుకుబడిని ఉపయోగించి కేఈశ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్పై కేసును తొలగించారని తెలిపారు. దీనిపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా.. వారిని కేసులో ముద్దాయిలుగా చేర్చుతూ మార్చి ఒకటో తేదీలోపు అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. అయితే.. కేఈ శ్యామ్‌బాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్లు శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైందని, అది వాస్తవం కాదని తెలిపారు. హైకోర్టులో శ్యామ్‌బాబుకు ఎలాంటి స్టే రాలేదన్నారు. దీనిపై ఏ ఆధారాలతో వార్త ప్రచురించారో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును సైతం ఆంధ్రజ్యోతి అపహాస్యం చేస్తోందని, దీనికి టీడీపీ నాయకులు వంత పాడుతున్నారని విమర్శించారు. తమ కుటుంబం, అనుచరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిందితులకు హైకోర్టులో స్టే వచ్చినా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, వారిని అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌కు హైకోర్టులో స్టే వచ్చినట్లు చెబుతున్నారని, అయితే దీనిపై ఇంతవరకు తమకు సమాచారం లేదని చెప్పారు. దీనిపై కూడా మళ్లీ పిటిషన్ వేసినట్లు తెలిపారు. చెరుకులపాడులో నారాయణరెడ్డి హంతకులు విచ్ఛలవిడిగా ఇసుకా దందాకు పాల్పడుతున్నారన్నారు. వారిని ఏమైనా అంటే దాడులు చేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని తెలిపారు. డోన్ కోర్టు తీర్పు ప్రకారం శ్యామ్‌బాబు, బొజ్జమ్మ, నాగతులసీప్రసాద్లను అరెస్టు చేయడానికి మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసును విచారించి నిందితులను అరెస్టు చేయాలని బీవై రామయ్య కోరారు. గతంలో పోలీసులు సక్రమంగా విచారణ చేయకపోవడం వల్లే నిందితులను అరెస్టు చేయలేదన్నారు. తిరిగి అదేవిధంగా విచారణ కొనసాగితే వారి పనితనాన్ని తప్పు పట్టాల్సి వస్తుందన్నారు. మార్చి ఒకటో తేదీలోపు నిందితులను అరెస్టు చేస్తారన్న విశ్వాసంతో ఉన్నామన్నారు. -
పచ్చపార్టీ తప్పుడు ప్రచారం: కంగాటి శ్రీదేవి
కర్నూలు జిల్లా : వైఎస్సార్సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పచ్చ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని పత్తికొండ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. ఆమె శుక్రవారం పత్తికొండలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు హైకోర్టులో ఊరట అంటూ సొంత మీడియాలో తప్పుడు వార్తలు రాయించిందన్నారు. డోన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చినట్టు తప్పుడు వార్తలతో కోర్టులను కించపరిచే విధంగా కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు వార్తల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తా పత్రికలు బాధ్యతగా వ్యవహరిస్తే హుందాగా ఉంటుందని శ్రీదేవి వ్యాఖ్యానించారు.