నవరత్నాలతో పేదలకు సంక్షేమ ఫలాలు | Kangati Sridevi Comments On Navaratnalu Pattikonda | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో పేదలకు సంక్షేమ ఫలాలు

Published Fri, Jul 13 2018 7:00 AM | Last Updated on Sat, Oct 20 2018 4:52 PM

Kangati Sridevi Comments On Navaratnalu Pattikonda - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి

పత్తికొండ రూరల్‌: తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్‌ జగనన్న ప్రకటించిన నవరత్నాలతో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని దేవనబండ గ్రామంలో వైఎస్సార్‌సీపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కంగాటి శ్రీదేవికి గ్రామనాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడంలేదన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయన్నారు.

ఈ ప్రాంత రైతుల జ్యూస్‌ ఫ్యాక్టరీ కల కూడా సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ జూటూరు బజారప్ప, నాయకులు నరసింహయ్యాచారి, రహిమాన్, బనగాని శ్రీనివాసులు, గాంధీరెడ్డి,  లలితమ్మ, కాశన్న, నాగేంద్ర, ప్రకాష్‌రవి, నరసింహ, శాంతరెడ్డి, విజయ్, నాగప్ప, సులేమాన్, కేశవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రమేష్, భాస్కర్‌రెడ్డి, రాతన ఉమామహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.                         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement